
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో విచారణపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. జయలలిత మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ... దానిపై విచారణ జరిపేందుకు తమిళనాడు ప్రభుత్వం మాజీ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే జయలలిత అపోలో ఆస్పత్రిలో పొందిన చికిత్స వివరాలపై ఆర్ముగం కమిటీ దర్యాప్తు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ అపోలో ఆస్పత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
జయలలిత మరణానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందనీ, అయితే ఆస్పత్రిలో ఉండగా అందించిన చికిత్స సరైనదో కాదో నిర్ధారించే హక్కు ఆర్ముగం కమిషన్‌కు లేదని అపోలో యాజమాన్యం వాదించింది. కమిటీ నేతృత్వంలో వైద్యులు ఆస్పత్రి రికార్డులు పరిశీలించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఆర్ముగస్వామి కమిషన్ విచారణపై స్టే విధించింది. గతంలో అపోలో ఆస్పత్రి ఇదే విషయంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో అపోలో యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment