appollo hospital
-
జయలలిత మరణం మిస్టరి.. అపోలో వైద్యులకు సమన్లు
సాక్షి, చెన్నై: ఆర్ముగస్వామి కమిషన్ ఎయిమ్స్ వైద్యుల సహకారంతో ఈనెల 7వ తేదీ నుంచి దర్యాప్తును వేగవంతం చేయనుంది. ఇందులో భాగంగా బుధవారం అపోలో వైద్యులకు సమన్లు జారీ అయ్యాయి. జయలలిత మరణం మిస్టరి నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను గత అన్నాడీఎంకే ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. వాయిదాల పర్వంతో ఏళ్ల తరబడి ఈ విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో తమను విచారణ పరిధిలోకి ఈ కమిషన్ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ అపోలో యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో రెండేళ్ల కాలం వృథా అయ్యింది. గత ఏడాది పగ్గాలు చేపట్టిన డీఎంకే సర్కారు సైతం ఈ కమిషన్ పదవీ కాలాన్ని పొడిగించి విచారణను త్వరితగతిన ముగించాలని ఆదేశించింది. అదే సమయంలో సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఆర్ముగ స్వామికి సహకారంగా ఎయిమ్స్ వైద్యులను సుప్రీంకోర్టు రంగంలోకి దించింది. గత నెల ఈ వైద్య బృందంతో కమిషన్ వర్గాలు సమావేశమయ్యాయి. వైద్యపరంగా తమకు ఉన్న అనుమానాల్ని నివృతి చేసుకున్నారు. ఇక, వీరి సహకారంతో విచారణను వేగవంతం చేసి ప్రభుత్వానికి మరికొన్ని నెలల్లో నివేదిక సమర్పించేందుకు కార్యచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అప్పట్లో జయలలితకు చికిత్స అందించిన అపోలో వైద్యులను ఈ కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది. -
టీడీపీ నేత శివప్రసాద్ కన్నుమూత
సాక్షి, చెన్నై : టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్ (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మరణించారు. ఈ నెల 12 న శివప్రసాద్‌ను ఆయన కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా, అప్పటి నుంచి డయాలసిస్ చేస్తున్నారు. శివప్రసాద్ మృతిపట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. చంద్రబాబు నిన్న సాయంత్రం శివప్రసాద్‌ను పరామర్శించిన విషయం తెలిసిందే. 1951జూలై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో ఆయన జన్మించారు. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు కూడా శివప్రసాద్ మృతి పట్ల సంతాపం తెలిపారు. వైద్యుడిగా సేవలు అందిస్తూ చిత్రరంగంలోకి ప్రవేశించారు. తొలుత చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన ఆ తర్వాత పలు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక 2006లో ‘డేంజర్’ చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. అనంతరం రాజకీయాలపై ఆసక్తితో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా, రెండుసార్లు చిత్తూరు ఎంపీగా పని చేశారు. శివప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు. అలాగే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆయన రోజుకో వేషం వేస్తూ వినూత్నంగా నిరసనలు చేశారు. పార్లమెంట్ ఆవరణలో విచిత్ర వేషధారణతో శివప్రసాద్ తన నిరసన తెలిపేవారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం శివప్రసాద్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
జయలలిత మృతికేసు విచారణకు సుప్రీం బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో విచారణపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. జయలలిత మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ... దానిపై విచారణ జరిపేందుకు తమిళనాడు ప్రభుత్వం మాజీ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే జయలలిత అపోలో ఆస్పత్రిలో పొందిన చికిత్స వివరాలపై ఆర్ముగం కమిటీ దర్యాప్తు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ అపోలో ఆస్పత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జయలలిత మరణానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందనీ, అయితే ఆస్పత్రిలో ఉండగా అందించిన చికిత్స సరైనదో కాదో నిర్ధారించే హక్కు ఆర్ముగం కమిషన్‌కు లేదని అపోలో యాజమాన్యం వాదించింది. కమిటీ నేతృత్వంలో వైద్యులు ఆస్పత్రి రికార్డులు పరిశీలించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఆర్ముగస్వామి కమిషన్ విచారణపై స్టే విధించింది. గతంలో అపోలో ఆస్పత్రి ఇదే విషయంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో అపోలో యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
జయ మృతి కేసులో ఊహించని మలుపు!
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మృతి అనేక అనుమానాలకు తావిస్తున్న సంగతి తెలిసిందే. అనారోగ్యానికి గురైన జయలితత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె అనారోగ్యం, చికిత్స తదితర విషయాలను గోప్యంగా ఉంచడం.. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్న సమయంలో తమను సైతం లోపలికి వెళ్లి జయను చూడనివ్వలేదని అన్నాడీఎంకే సీనియర్ నేతలు ఆరోపించడంతో ఆమె మృతి ఒక మిస్టరీగా మారింది. ఆమె మృతి వెనుక కారణాలపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ కమిషన్ దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జయలలిత మృతికి సంబంధించి మరో సంచలన అంశం వెలుగుచూసింది. జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సీసీటీవీ కెమెరాలు బంద్ (స్విచ్చాప్) చేశారని, ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నంతకాలం అవి పనిచేయలేదని తాజాగా వెలుగులోకి వచ్చింది. అంటే ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందినతీరు వీడియో రికార్డు కాలేదని తేలిపోయింది. దీంతో ఆస్పత్రిలో నిజానికి ఏం జరిగిందనే దానిపై మరిన్ని అనుమానాలు వచ్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ‘దురదృష్టవశాత్తు సీసీటీవీ కెమెరాలను స్విచ్ ఆఫ్ చేశారు. జయలలిత ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాక.. ఐసీయూను పూర్తిగా ఆమె కోసమే కేటాయించాం. అందువల్ల ప్రతి ఒక్కరూ సీసీటీవీ దృశ్యాలు కూడా చూడకూడదని, వాటిని తొలగించాం’ అని అపోలో చైర్మన్ సీ ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. -
జయ ఆరోగ్యంపై అబద్ధాలు చెప్పాం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరినప్పుడు, ఆమె ఆరోగ్య పరిస్థితిపై అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందని అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే అలా చేశామని చెన్నైలో మీడియాతో చెప్పారు. జయ∙ఆసుపత్రిలో చేరినప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకూడదనే ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు బులెటిన్ విడుదల చేశామని వివరించారు. తర్వాత ఆమె కోలుకున్నారని చెప్పారు. ఆమె మరణంపై ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున ఇంతకంటే వివరాలు చెప్పలేనన్నారు. జయలలిత ఆసుపత్రిలో ఇడ్లీ తినడం తాము చూశామని అబద్ధాలు చెప్పినట్లు మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అపోలోపై అమ్మ అభిమానుల దాడి
-
అపోలోపై అమ్మ అభిమానుల దాడి
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స అందిస్తున్న అపోలో ఆసుపత్రిపై ఆమె అభిమానులు దాడి చేశారు. పోలీసులతో వాగ్వదం పెట్టుకున్న అమ్మ అభిమానులు, కార్యకర్తలు బారికేడ్లను తొలగించి ఆసుపత్రిలోకి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. ఆసుపత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కుర్చీలు విసిరేశారు. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న పోలీసులు వారిని చెదరగొట్టి వెంటనే పరిస్ధితిని చక్కదిద్దుతున్నారు. అమ్మకు ఏమవుతుందేననే ఆందోళనతో ఆమె అభిమానులు పెద్దు ఎత్తున అపోలో వద్దుకు చేరుకుంటున్నారు. దీంతో వారందరినీ అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారుతోంది.