
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరినప్పుడు, ఆమె ఆరోగ్య పరిస్థితిపై అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందని అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే అలా చేశామని చెన్నైలో మీడియాతో చెప్పారు. జయ∙ఆసుపత్రిలో చేరినప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకూడదనే ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు బులెటిన్ విడుదల చేశామని వివరించారు. తర్వాత ఆమె కోలుకున్నారని చెప్పారు. ఆమె మరణంపై ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున ఇంతకంటే వివరాలు చెప్పలేనన్నారు. జయలలిత ఆసుపత్రిలో ఇడ్లీ తినడం తాము చూశామని అబద్ధాలు చెప్పినట్లు మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment