అపోలోపై అమ్మ అభిమానుల దాడి
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స అందిస్తున్న అపోలో ఆసుపత్రిపై ఆమె అభిమానులు దాడి చేశారు. పోలీసులతో వాగ్వదం పెట్టుకున్న అమ్మ అభిమానులు, కార్యకర్తలు బారికేడ్లను తొలగించి ఆసుపత్రిలోకి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. ఆసుపత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కుర్చీలు విసిరేశారు.
దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న పోలీసులు వారిని చెదరగొట్టి వెంటనే పరిస్ధితిని చక్కదిద్దుతున్నారు. అమ్మకు ఏమవుతుందేననే ఆందోళనతో ఆమె అభిమానులు పెద్దు ఎత్తున అపోలో వద్దుకు చేరుకుంటున్నారు. దీంతో వారందరినీ అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారుతోంది.