Tamil Nadu Elections 2021: Drunk Man Attack On MNM Party President Kamal Hassan Car - Sakshi
Sakshi News home page

కమల్‌ కారుపై దాడి; చితక్కొట్టిన కార్యకర్తలు

Published Mon, Mar 15 2021 1:35 PM | Last Updated on Mon, Mar 15 2021 8:25 PM

Drunk Man Bangs On Kamal Haasan Car To Meet Star - Sakshi

చెన్నై : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో సినీ నటుడు, పార్టీ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కాంచీపురంలో పర్యటించి తిరిగి చైన్నైలోని హోటల్‌కు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి నటుడి వాహనంపై దాడికి ప్రయత్నించాడు. పీక‌ల‌దాకా తాగిన ఓ యువకుడు మద్యం మత్తులో తమిళ సూపర్‌స్టార్‌ను కలవాలంటూ ఆయన కారును అడ్డుకొని అద్దాన్ని ప‌గ‌ల‌గొట్టాడు. 

అయితే ఈ ఘ‌ట‌న‌లో క‌మ‌ల్‌కు ఎలాంటి  గాయాలు కాలేదు. కానీ కారు అద్దం మాత్రం ధ్వంసమైంది. వెంటనే అప్రమత్తమైన ఎంఎన్ఎం కార్యకర్తలు కారుపై దాడికి య‌త్నించిన వ్యక్తిని చితకొట్టారు. ఆ క్ర‌మంలో అతని ముక్కు, నోరు నుంచి ర‌క్తం కారింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మందుబాబుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అలాగే అతనిని అరెస్ట్ చేసి కేసు న‌మోదు చేశారు.

ఇదిలా ఉండగా ఉద్దేశ్యపూర్వకంగానే కమల్‌ హాసన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఎంఎన్‌ఎం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి చర్యలకు భయపడేది లేదని చెబుతున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేత, మాజీ ఐపీఎస్ ఏజీ మౌర్య ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాగా తమిళనాడు ఎన్నికల్లో కమల్ హాసన్ తొలిసారి బరిలోకి దిగుతున్నారు. కోయంబత్తూర్‌ సౌత్ నుంచి కమల్ పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులను కమల్‌ ఢీకొట్టబోతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement