Unknown Persons Attacked With Stones On Hero Vishal House At Chennai - Sakshi
Sakshi News home page

Hero Vishal: హీరో విశాల్‌ ఇంటిపై దాడి కలకలం, ధ్వంసమైన కిటికి అద్దాలు

Published Wed, Sep 28 2022 11:44 AM | Last Updated on Wed, Sep 28 2022 1:18 PM

Unknown Attacks Hero Vishal House At Chennai - Sakshi

స్టార్‌ హీరో విశాల్‌ ఇంటిపై దుండగులు దాడి చేశారు. ఆయన ఇంటిపైకి రాళ్లు రువ్వడంతో కిటికి అందాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటన తమినాడు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. చెన్నైలోని అన్నానగర్‌లో తల్లిదండ్రులతో కలిసి కొంతకాలంగా విశాల్‌ నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఎరుపు రంగు కారులో వచ్చి విశాల్‌ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. అనంతరం కారులో పరారయ్యారు. ఈ ఘటన సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనలో విశాల్‌ ఇంటి కిటికి అద్దాలు ధ్వంసం కాగా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.

చదవండి: Indira Devi: మహేశ్‌ బాబు తల్లి మృతి.. చిరంజీవి సంతాపం

ఈ దాడి జరుగుతున్న​ సమయంలో విశాల్‌ ఇంట్లో లేడని సమాచారం. షూటింగ్‌ నిమిత్తం ఆయన బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ దాడిపై విశాల్‌ మేనేజర్‌ అన్నానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విశాల్‌ మేనేజర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సినీ పరిశ్రమలో విశాల్‌ అంటే గిట్టని వారే ఈ దాడికి పాల్పడ్డారా.. లేక మరే ఇతర కారణాలు ఉన్నాయనే అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే విశాల్‌ తమిళ చిత్ర పరిశ్రమ నడిగర్‌ సంఘం జనరల్‌ సెక్రటరీగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే... విశాల్‌ ప్రస్తుతం లాఠీ. తుపరివాలన్-2, మార్క్ ఆంటోని వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.

చదవండి: Srihari Wife Shanthi: ‘డబ్బులు ఇవ్వకుండా ఎంతోమంది ఆయనను మోసం చేశారు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement