Tamil Nadu Assembly Election 2021
-
తమిళనాడు సీఎంగా స్టాలిన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను భారీ విజయం దిశగా నడిపిన ముత్తువేల్ కరుణానిధి(ఎంకే) స్టాలిన్(68) ఆ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. స్టాలిన్‌తోపాటు 33 మంది మంత్రులతో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణస్వీకారం చేయించారు. కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించి 500 మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కొత్త కేబినెట్ గ్రూప్ ఫొటో ఉదయం 9.10 గంటలకు ‘ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ అనే నేను..’అంటూ స్టాలిన్ తన ప్రమాణ స్వీకారాన్ని ప్రారంభించారు. అనంతరం, డీఎంకే సీనియర్ నేత, పార్టీ జనరల్ సెక్రటరీ దురై మురుగన్ ప్రమాణం చేశారు. ఆయనకు జల వనరుల శాఖ, నీటిపారుదల ప్రాజెక్టులు, గనులు, ఖనిజాల శాఖలను అప్పగించారు. మంత్రులంతా డీఎంకే అనుసరిస్తున్న సంప్రదాయం ప్రకారం తమిళంలోనే ప్రమాణం చేశారు. స్టాలిన్ క్యాబినెట్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనారిటీలకు చోటు దక్కింది. హోం, సాధారణ ప్రజా వ్యవహారాల నిర్వహణ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తదితర విభాగాలను స్టాలిన్ తన వద్దే ఉంచుకున్నారు. అయితే, మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు క్యాబినెట్లో చోటివ్వలేదు. కార్యక్రమం అనంతరం స్టాలిన్ రాజ్‌భవన్ నుంచి గోపాలపురంలో తండ్రి కరుణానిధి నివసించిన ఇంటికి వెళ్లి తండ్రి చిత్రపటానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి చెన్నై మెరీనా బీచ్‌లోని అన్నాదురై, కరుణాని«ధి సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు సచివాలయానికి చేరుకుని సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం సాయంత్రం మంత్రులు, జిల్లా కలెక్టర్లతో సమావేశమై కరోనా పరిస్థితులను సమీక్షించారు. మొదటి విడత కోవిడ్ సాయం విడుదల సీఎంగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ ప్రధాన ఎన్నికల హామీల అమల్లో భాగంగా పలు చర్యలను ప్రకటించారు. కోవిడ్ సాయం కింద బియ్యం కార్డు దారులకు రూ.4 వేలకు గాను మొదటి విడతగా రూ.2 వేలను ఈ నెలలోనే అందజేసేందుకు ఉద్దేశించిన ఫైలుపై సంతకం చేశారు. దీంతో, రాష్ట్రంలోని 2,07,67,000 రేషన్ కార్డు దారులకు రూ.4,153.69 త్వరలో అందుతాయి. అదేవిధంగా, ప్రత్యేక బీమా పథకం కింద కోవిడ్ బాధితులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించేందుకు వీలు కల్పిస్తూ ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసే ఆవిన్ పాల ధరను లీటరుపై రూ.3 తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చారు. శనివారం నుంచి రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన ఆర్డినరీ సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇందుకోసం రూ.1,200 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్న హామీ అమలుకు ‘మీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి’పథకం అమలు కోసం ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
కమల్ హాసన్ పార్టీకి బీటలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు కమల్‌హాసన్ అధ్యక్షుడుగా ఉన్న మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చవిచూసిన ఘోర పరాజయం ఆ పార్టీ బీటలు వారేలా చేసింది. ఉపాధ్యక్షుడు సహా మొత్తం కార్యవర్గం రాజీనామా చేసింది. తాజా ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గాను 154 స్థానాల్లో పోటీచేసిన ఎంఎన్ఎం మిగిలి న స్థానాలను కూటమి పార్టీలకు కేటాయించింది. ఇండియ జననాయక కట్చి కూటమికి సారథ్యం వహిస్తూ ముఖ్యమంత్రి అభ్యర్దిగా కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్‌హాసన్ బీజేపీ అభ్యర్ది చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతోపాటు ఆ పార్టీ అభ్యర్దులెవరూ గెలవలేదు. ఈ ఓటమిపై కమల్ వైఖరి ఎలా ఉన్నా పార్టీ శ్రేణు లు మాత్రం జీర్ణించుకోలేక పోయాయి. పార్టీ అధ్యక్షుడైన కమల్ సైతం ఓటమిపాలు కావడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. అనేక నియోజకవర్గాల్లో మక్కల్ నీది మయ్యం నాలుగో స్థానంలో నిలిచింది. ఓటమికి దారితీసిన కారణాలను విశ్లేషించుకునేందుకు కమల్ పార్టీ కార్యవర్గంతో ఈనెల 6వ తేదీ న సమావేశంకాగా, కార్యనిర్వాహక వర్గంలోని డాక్టర్ ఆర్ మహేంద్రన్ (ఉపాధ్యక్షుడు) సహా 10 మంది రాజీనామా లేఖలను కమల్‌కు సమర్పించా రు. పార్టీలో ప్రజాస్వామ్యం లేకపోవడాన్ని నిరసి స్తూ ఉపాధ్యక్ష పదవితోపాటూ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు మహేంద్రన్ మీడియాకు చెప్పారు. ఈ నేపథ్యంలో కమల్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మహేంద్రన్ ఒక ద్రోహి అని దుయ్యబట్టారు. ‘ఓటమికి భయపడి పారిపోయే పిరికిపందలను పెద్దగా పట్టించుకోను. నా లక్ష్యంలో మార్పు లేదు, మాతృభూమి, ప్రజల కోసం ముందుకు సాగుతాం’అని స్పష్టం చేశారు. పరాజయ భారాన్ని మోయలేక రాజకీయా ల నుం చి కమల్ నిష్క్రమిస్తారని మక్కల్ నీది మయ్యం నేతలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
తమిళ రాజకీయాల్లో ఇక సినీ క్రేజ్ తగ్గినట్టేనా..?
చెన్నె: తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ ప్రజలు సరికొత్త తీర్పు ఇచ్చారు. పదేళ్ల తర్వాత డీఎంకే అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నో అంచనాలతో దూకుడుతో వచ్చిన సినీ నటీనటులకు మాత్రం ఈ ఎన్నికలు చుక్కలు చూపించాయి. ఒక్క ఉదయనిధి స్టాలిన్ తప్ప అందరూ పరాజయం మూటగట్టుకున్నారు. వారి చరిష్మా వెండితెర వరకే అని ఈ ఎన్నికల తీర్పు చెబుతోంది. తమిళ రాజకీయాలకు సినీ పరిశ్రమకు విడదీయరాని బంధం. కొన్ని దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను సినీ ప్రముఖులు ఏలారు. దాదాపు నలభై ఏళ్లకు పైగా సినీ రంగానికి చెందినవారే రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అప్పుడు వేరు.. ఇప్పుడు వేరనట్టు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన సినీతారలంతా పరాజయం పాలయ్యారు. గతంలో రాష్ట్రాన్ని శాసించిన సినీనటులు ఇప్పుడు గెలవడమే కష్టంగా మారింది. ఎంజీఆర్ మొదలుకుని జయలలిత, కరుణానిధి వరకు సినీ పరిశ్రమకు చెందిన వారే. రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలించారు. ప్రస్తుతం రాజకీయాలకు సినీ పరిశ్రమ దూరం కానుందేమో. ముఖ్యంగా మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ స్థాపించి బరిలోకి దిగిన కమల్‌హాసన్‌కు ఈ ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. పార్టీ అధినేత, స్టార్ నటుడిగా ఉన్న కమల్ హాసనే గెలవలేకపోయారు. దీంతోపాటు ఆయన పార్టీ అభ్యర్థులంతా కూడా ఓడిపోయారు. ఎంఎన్ఎం పార్టీ సత్తా చాటలేకపోయింది. ఇక ఖుష్బూను కూడా తమిళ ప్రజలు ఓడించారు. సినీనటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ తన సతీమణి ప్రేమలతను విరుదాచలం నుంచి పోటీ చేయించగా ఆమె పరాజయం పొందారు. సినీ నటుడు, దర్శకుడు, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ఈ ఎన్నికల్లో తిరువొత్తియూరు నుంచి ఓడిపోయారు. నటి కుష్బు చెన్నై థౌజండ్ లైట్స్ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. చెపాక్ నుంచి పోటీచేసిన ఉదయనిధి స్టాలిన్ గెలుపొందాడు. ఈ విధంగా తమిళ ఓటర్లు సినీ పరిశ్రమకు చెందినవారిని విశ్వసించలేదు. ఇక రాజకీయాల్లోకి వస్తానని.. తర్వాత అనారోగ్యంతో దూరమైపోయిన రజనీకాంత్‌కు ఇదే పరిస్థితి ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ -
TN Assembly: ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా కోటీశ్వరులే!
సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెల్లడవడంతో నూతన శాసనసభ కొలువుదీరనుంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేల స్థితిగతులపై ‘జననాయక సీరమైప్పు కళగం’ ఓ సర్వే నిర్వహించింది. తాజా ప్రజాప్రతినిధుల విద్యార్హత, ఆదాయం, నేర చరిత్ర తదితర అంశాలపై ఆసక్తికర సమాచారం వెల్లడించింది. ప్రస్తుత శాసనసభ్యుల్లో కోట్లకు పడగలెత్తిన వారు అధిక సంఖ్యలో ఉన్నారని పేర్కొంది. బడి మెట్టు దాటని వారూ భారీగానే ఉన్నట్లు తెలిపింది. క్రిమినల్ కేసులు నమోదైన వారు ఎక్కువగానే ఉన్నారని వివరించింది. ఈ క్రమంలోనే కొందరు నిరాడంబరులూ ఉన్నట్లు తెలియజేసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై : సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్తగా ఎన్నికైన మొత్తం 234 మంది ఎమ్మెల్యేల సమగ్ర వివరాలను ‘జననాయక సీరమైప్పు కళగం’ సర్వే వెలుగులోకి తీసుకువచ్చింది. తాజా ఎమ్మెల్యేల్లో తిరునల్వేలి జిల్లా అంపసముద్రం నియోజకవర్గం నుంచి గెలుపొందిన సుబ్బయ్య నెంబర్‌వన్ కోటీశ్వరుడని సర్వే తేల్చింది. సుమారు రూ.246కోట్ల ఆస్తులతో సుబ్బయ్య ప్రథమస్థానంలో నిలిచారు. అలాగే తిరుత్తురైపూండి నుంచి సీపీఐ తరఫున ఎన్నికైన మారిముత్త కేవలం రూ.3లక్షల ఆస్తితో చివరిస్థానం దక్కించుకున్నారు. నిరాడంబరమైన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. 2016 ఎన్నికల్లో మొత్తం 76మంది కోటీశ్వరులు ఎమ్మెల్యేలుగా గెలవగా, ప్రస్తుతం ఆ సంఖ్య 86కు పెరగడం విశేషం. అలాగే 2016లో 34శాతం మంది నేర చరిత్ర ఉన్నవాళ్లు అసెంబ్లీకి ఎన్నికైతే ఇప్పుడు అది 60శాతానికి చేరడం గమనార్హం. పార్టీ పేరు కోటీశ్వరులైన ఎమ్మెల్యేల శాతం డీఎంకే 89 అన్నాడీఎంకే 88 కాంగ్రెస్ 58 పీఎంకే 60 బీజేపీ 75 పార్టీ పేరు క్రిమినల్ కేసులు నమోదైనవారి సంఖ్య డీఎంకే - 36 అన్నాడీఎంకే - 15 (వీరిలో ఐదుగురిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి) కాంగ్రెస్ - 12 పీఎంకే - 04 వీసీకే - 03 బీజేపీ - 04 సీపీఐ - 02 ఎమ్మెల్యేల వయసు వివరాలు 31–40 ఏళ్ల మధ్య వయస్కులు - 14 మంది 41–50 ఏళ్లు ఉన్నవారు - 60 మంది 51– 70 ఏళ్లు వయసువారు - 135 మంది 71–80 ఏళ్ల మధ్య వయస్కులు- 14 మంది 80 ఏళ్లు దాటినవారు - ఒకరు ఎమ్మెల్యేల విద్యార్హత పాఠశాల విద్యకే పరిమితమైనవారు- 77 మంది డిగ్రీ అంత కంటే ఎక్కువ చదివినవారు- 136 మంది వైద్యవిద్య అభ్యసించినవారు- ఆరుగురు చదవండి: MK Stalin Cabinet: తమిళనాడు కొత్త మంత్రులు వీరే! -
AIADMK: ఏ పదవికి రాజీనామా చేయాలి!?
సాక్షి, చెన్నై: ఇద్దరు అన్నాడీఎంకే ఎంపీలు ఎమ్మెల్యేలయ్యారు. జోడు పదవులను తమ చేతిలో పెట్టుకున్న ఈ ఇద్దరు ఏ పదవికి రాజీనామా చేయాలో అన్న డైలమాలో ఉన్నారు. ఇక అన్నాడీఎంకే శాసన సభాపక్షం ఈనెల 7వ తేదీ సమావేశం కానుంది. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ జాయింట్ కన్వీనర్లుగా వైద్యలింగం, కేపీ మునుస్వామి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2016 ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ మంత్రి వైద్యలింగానికి రాజ్యసభ సీటు దక్కింది. ఈయన పదవీ కాలం మరో ఏడాది ఉంది. గత ఎన్నికల్లో ఓడిన మరో మాజీ మంత్రి కేపీ మునుస్వామిని గత ఏడాది రాజ్యసభకు పంపారు. ఈ ఇద్దరు నేతలు రాజ్య సభకు వెళ్లినా ఢిల్లీలో కన్నా, రాష్ట్రంలోనే అధికంగా ఉంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు హ్యాట్రిక్ ఖాయం అన్న ధీమాతో మంత్రి పదవుల ఆశతో ఈ ఇద్దరు నేతలు తాజా ఎన్నికల్లో పోటీ చేశారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీలో నిర్ణయం తాజా ఎన్నికల్లో ఒరత్తనాడు నుంచి పోటీ చేసిన వైద్యలింగం, వేపనహళ్లి నుంచి పోటీ చేసిన కేపీ మునుస్వామి గెలుపొందారు. అయితే డీఎంకే అధికారంలోకి రానుండడంతో ఈ ఇద్దరు నేతలు డైలమాలో పడ్డారు. రాజ్యసభకు రాజీనామా చేయాలా..? ఎమ్మెల్యే పదవికా..? అన్న సందిగ్ధంలో ఉన్నారు. వీరు ఏ పదవికి రాజీనామా చేసినా డీఎంకేకు లాభమే. వైద్యలింగానికి ఏడాది మాత్రమే రాజ్యసభ పదవీకాలం ఉండడంతో ఆయన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఐదేళ్లు పదవీ కాలం ఉన్న కేపీ మునుస్వామి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఈ ఇద్దరు నేతలు రాజ్యసభ పదవులకు రాజీనామా చేసిన పక్షంలో డీఎంకేకు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం మేరకు ఆ రెండు పదువులు చేజిక్కించుకోవడం ఖాయం. రాజీనామా చేస్తే ఉప ఎన్నిక అనివార్యం ఈ దృష్ట్యా రాజ్యసభలో అన్నాడీఎంకే బలం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు అనివార్యం. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు ఏ పదవికి రాజీనామా చేస్తారో..? అన్నది అన్నాడీఎంకే సమన్వయ కమిటీ తీసుకునే నిర్ణయం మేరకు ఆధారపడి ఉంది. ఈ వ్యవహారాన్ని తేల్చడంతో పాటు శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఈనెల 7న సమావేశం కానుంది. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. పళనిస్వామిని అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా, పన్నీరు సెల్వంను ఉప నేతగా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం పళనిస్వామి సేలం జిల్లా ఎడపాడిలోని నివాసానికే పరిమితమయ్యారు. దీంతో ఆయన్ను కలిసేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. మిత్ర పక్షం పీఎంకే ఎమ్మెల్యేలు సైతం పళనిని కలిసిన వారిలో ఉన్నారు. చదవండి: MK Stalin: స్టాలిన్ వరాల జల్లు.. వారికి గుడ్‌న్యూస్ -
Tamil Nadu: ఓడినా సత్తాచాటిన సీమాన్
సాక్షి, చెన్నై: నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ఎన్నికల్లో ఓడినా సత్తా చాటుకున్నారు. ఆ పార్టీ అభ్యర్థులు 183 నియోజకవర్గాల్లో 3వ స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. ఇక 39 చోట్ల అన్నాడీఎంకే అభ్యర్థుల విజయ అవకాశాలకు గండికొట్టారు. ఒంటరిగా బరిలోకి.. రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకే, కాంగ్రెస్, బీజేపీ, పీఎంకే, మక్కల్ నీదిమయ్యం, ఎస్ఎంకే, ఐజేకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం తదితర పార్టీలు కూటములతో ఎన్నికలను ఎదుర్కొన్నాయి. అయితే సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగింది. 234 స్థానాల్లో 117 చోట్ల మహిళా అభ్యర్థులను నిలబెట్టారు. పుంజుకుంటున్న సీమాన్ తాజా ఎన్నికల్లో డీఎంకే పార్టీ 37.7 శాతం ఓట్లు సాధించి అధికారం దక్కించుకుంది. ఇక అన్నాడీఎంకే పార్టీ 33.29 శాతం ఓట్లు సాధించి ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. ఇక నామ్ తమిళర్ కట్చి 5 శాతానికి పైగా ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. 2011 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన సీమాన్ పార్టీ 1.7 శాతం ఓట్లను దక్కించుకుంది. 2016లో 2.15 శాతం సాధించింది. కమల్ కూటమి, దినకరన్–విజయకాంత్ కూటమి నాలుగు స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక్కరూ గెలవలేదు కానీ.. తాజా ఎన్నికల్లో సీమాన్‌తో పాటు ఆ పార్టీ అభ్యర్థులెవరూ గెలవలేదు. అయితే ఇతరుల విజయావకాశాలను మాత్రం దెబ్బతీశారు. తిరువొత్తియూరులో పోటీ చేసిన సీమాన్ ఓటమి పాలైనా 48,597 ఓట్లు పొందారు. తూత్తుకుడిలో ఆ పార్టీ అభ్యర్థి వేల్రాజ్ 30,741 ఓట్లు రాబట్టుకోవడం విశేషం. ఈ ఎన్నికల్లో 183 చోట్ల నామ్ తమిళర్ కట్చి అభ్యర్థులు 3వ స్థానంలో నిలవడం గమనార్హం. మొత్తంగా 5 శాతానికి పైగా ఓట్లు సాధించారు. 39 నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే ఓట్లకు చీల్చి వారి విజయావకాశాలను దెబ్బ తీశారు. అలాగే 10 చోట్ల డీఎంకే, 5 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల ఓట్లకు గండికొట్టారు. మరోవైపు దినకరన్ పార్టీ 20 చోట్ల అన్నాడీఎంకే ఓట్లను చీల్చి వారి విజయావకాశాలను దెబ్బ తీసింది. పదిహేనేళ్ల తర్వాత అసెంబ్లీకి ప్రాతినిధ్యం డీఎంకే కూటమితో ఎన్నికలను ఎదుర్కొన్న వీసీకే, ఎండీఎంకే పార్టీలు చెరో నాలుగు స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలకు 2006 తర్వాత అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయాయి. తాజా గెలుపుతో ఆ పార్టీల అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. ఇక పీఎంకే, సీపీఎం, సీపీఐ సభ్యులు ఐదేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. ఇక మేట్టూరులో పోటీచేసిన ఎన్నికల వీరుడు పద్మరాజన్‌కు ఈసారి 36 ఓట్లు రావడం విశేషం. అలాగే సినీ నటుడు మన్సూర్ అలీఖాన్ (తొండముత్తూరు), మైల్ స్వామి (విరుగ్గంబాక్కం)లలో పోటీ చేయగా నోటా కన్నా తక్కువ ఓట్లు పడ్డాయి. చదవండి: Kamal Haasan: ఒంటరిగా పోటీ చేసుంటే బాగుండేది! -
కమల్ ఓటమిపై శృతి హాసన్ ఎమోషనల్ రియాక్షన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, ప్రముఖ హీరో కమల్ హాసన్ ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినా, చివరకు ఆయనకు ఓటమి తప్పలేదు. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్..సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్(బీజేపీ)పై 1,300 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయారు. కమల్‌మాసన్ పార్టీ మరికొన్ని పార్టీలతో కలిసి మూడో కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్ హాసన్ ప్రకటించుకున్నారు. అయితే చివరకు ఆయనే ఓడిపోవడం ఆయన అభిమానులకు షాకింగ్‌కు గురి చేసింది. అంతేకాకుండా ఆయనతో పాటు ఆయన పార్టీకి చెందిన వారు 142 స్థానాల్లో పోటీ చేయగా వారందరూ పరాజయం పొందారు. కమల్ తొలి ఎన్నికలోనే ఓటమిపాలవడంపై ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై కమల్ కూతురు, హీరోయిన్ శృతిహాసన్ స్పందించారు.‘మిమ్మల్ని చూస్తుంటే ఎప్పటికీ గర్వంగానే ఉంటుంది నాన్న (అప్పా)’ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన తండ్రి ఫొటోను షేర్ చేసింది. అంతేకాకుండా తన తండ్రిని పైటర్ అంటూ అభివర్ణిస్తూ ద ఫైటర్ అనే హ్యాష్ ట్యాగ్‌ను పోస్ట్ చేశారు. తండ్రిపై శృతిహాసన్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. 'గెలుపోటములు సహాజం..ప్రతి కూతురికి తన తండ్రి ఎప్పటికీ హీరోనే' అంటూ పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. చదవండి : ఐదు రాష్ట్రాల ఫలితాలు : గెలిచిన, ఓడిన నటులు వీరే అయినా ఇప్పుడు ట్రిప్పులు ఏంటి : శృతి హాసన్ -
డీఎంకే ఘన విజయం.. ‘కేబినెట్’ రేస్ మొదలు
సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించింది. ముఖ్యంగా తిరువళ్లూరు జిల్లాలో క్లీన్‌స్వీప్ చేసింది. అందులో సీనియర్లు ఎక్కువమంది గెలుపొందడంతో మంత్రి పదవులపై ఆశావహుల సంఖ్య అధికమైంది. త్వరలోనే కొలువుదీరనున్న స్టాలిన్ కేబినెట్లో బెర్త్ కోసం రేస్ మొదలైంది. సాక్షి, చెన్నై: జిల్లాలో విజయం సాధించిన నలుగురు సీనియర్ నేతలు మంత్రి పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డీఎంకే పార్టీ ముఖ్యులు, స్టాలిన్ కుటుంబ సభ్యులను కలిసి అమాత్యులుగా అవకాశమివ్వాలని కోరుతున్న ప్రచారం జోరుగా సాగుతోంది. స్టాలిన్ కేబినెట్లో జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎవరికి పీఠం దక్కుతుందో అనే చర్చ సర్వత్రా సాగుతోంది. పూందమల్లి ఎమ్మెల్యే కృష్ణస్వామి డీఎంకేలో మోస్ట్ సీనీయర్. బలమైన దళిత నేత. రెండు సార్లు శ్రీపెరంబదూరు ఎంపీగా, పార్లమెంట్ విప్‌గా పని చేశారు. గత ఉప ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి 60 వేలు, ప్రస్తుతం 93వేల మెజారిటీతో గెలుపొందారు. స్టాలిన్ వద్ద కూడా కృష్ణస్వామికి మంచి పేరుంది. పార్టీ సీనియర్ టీఆర్ బాలుతో పాటు పలువురి ఆశీస్సులు ఉన్నాయి. ఈసారి ఆయనకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం సాగుతోంది. అలాగే మైనారిటీ నేత నాసర్ కూడా మంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు. ఆయనకు విశ్వాసపాత్రుడిగా పేరుంది. స్టాలిన్‌ను తీవ్రంగా విమర్శించే మంత్రి పాండ్యరాజన్‌పై భారీ మెజారిటీతో గెలుపొందడంతో ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తిరువళ్లూరు నుంచి రెండోసారి విజయం సాధించిన వీజీ రాజేంద్రన్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఆయనకు స్టాలిన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్, వీజీ రాజేంద్రన్ భార్య ఇందిర క్లాస్మేట్స్. స్టాలిన్ అల్లుడు శబరీశన్, సీనియర్లు దురైమురుగన్, ఎంపీ జగద్రక్షగన్ ఆశీస్సులు ఉన్నాయి. అలాగే వీజీ రాజేంద్రన్ అల్లుడు పాలిమర్ టీవీ అధినేత. వీరందరితోపాటు ఆంధ్రకు చెందిన పెద్ద నాయకుడి ద్వారా మంత్రి పదవికి సిఫారసు చేయించుకుంటున్నట్లు తెలిసింది. అలాగే మాధవరం ఎమ్మెల్యే సుదర్శనం పేరు కూడా ప్రచారంలో వుంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా, పార్టీ జిల్లా కన్వీనర్‌గా పని చేసిన సుదర్శనానికి స్టాలిన్ కుటుంబ సభ్యులతో మంచి సంబందాలు వున్నాయి. ఈ క్రమంలో అదృష్టం ఎవరిని వరిస్తుందో శుక్రవారం వరకు వేచి చూడాల్సిందే. చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర -
తమిళనాడు: అప్పుడు 32 మంది, కానీ ఇప్పుడు 12 మంది
సాక్షి, చెన్నై: అసెంబ్లీకి మహిళల ప్రాతినిథ్యం క్రమంగా తగ్గుతోంది. ఈ దఫా ఎన్నికల్లో 12 మంది మహిళలు మాత్రమే గెలుపొందారు. ఇందులో డీఎంకే పార్టీ నుంచి 6, అన్నాడీఎంకే నుంచి 3, బీజేపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఒకరు ఉన్నారు. తమిళనాడు అసెంబ్లీకి 1957 నుంచి మహిళల ప్రాతినిథ్యం ఉంటూ వస్తోంది. పది మందికి తగ్గుకుండా గెలుపొందేవారు. 1991లో అత్యధికంగా 32 మంది మహిళలు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2001లో 25 మంది, 2006లో 22 మంది అసెంబ్లీ మెట్లు ఎక్కారు. 2011లో 17 మంది, 2016లో 21 మంది గెలిచారు. అయితే తాజాగా ఆ సంఖ్య సగానికి సగం పడిపోయింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే సహా అన్ని పార్టీల నుంచి మొత్తం 411 మంది మహిళలు బరిలోకి దిగారు. వీరిలో కేవలం 12 మంది మాత్రమే గెలుపొందారు. 12 మంది మహిళలు ఈ ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికైన వారిలో డీఎంకే నుంచి వరలక్ష్మి మదుసూదన్ (చెంగల్పట్టు), అమ్ములు (గుడియాత్తం), గీతా జీవన్(తూత్తుకుడి), కయల్వెలి సెల్వరాజ్( తారాపురం), శివగామ సుందరి(కృష్ణరాయపురం), తమిళరసి (మానామదురై)లు ఉన్నారు. ఇక అన్నాడీఎంకే నుంచి మరగదం కుమరవేల్ ( మదురాంతకం), చిత్ర ( ఏర్కాడు), తేన్మొళి (నీలకోటై) గెలిచారు. బీజేపీ నుంచి సరస్వతి (మోడకురిచ్చి), వానతీ శ్రీనివాసన్ (కోవై దక్షిణం), కాంగ్రెస్ నుంచి విజయథారణి (విలవన్ కోడ్) నుంచి గెలుపొందారు. డీఎంకే నుంచి విజయం సాధించిన గీతా జీవన్‌కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. చదవండి: ఎన్నికలు ఫలితాలు.. రణరంగాన్ని తలపిస్తున్న వెస్ట్ బెంగాల్ -
MK Stalin: 7న స్టాలిన్ ప్రమాణం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) శాసన సభాపక్ష సమావేశం మంగళవారం జరుగనుంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం 6 గంటలకు సమావేశమై, తమ శాసనసభాపక్ష నేతగా ఎం.కె.స్టాలిన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శాసనసభా పక్ష భేటీ అనంతరం స్టాలిన్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు ఆ తీర్మానం ప్రతిని అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా కోరనున్నారు. గవర్నర్ సూచన మేరకు ఈ నెల 7న రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్టాలిన్‌తోపాటు మరో 29 మంది మంత్రులుగా పదవీ ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. స్టాలిన్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత చెన్నై మెరీనా బీచ్‌లోని కరుణానిధి సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తానని చెప్పారు. నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న డీఎంకే దళపతి స్టాలిన్‌కు తమిళనాడు సీఎం, ఏఐఏడీఎంకే సీనియర్ నేత పళనిస్వామి అభినందనలు తెలియజేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఏఐఏడీఎంకే శాసనసభాపక్ష సమావేశం ఈ నెల 7న జరుగనుంది. పళనిస్వామి రాజీనామా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఆమోదించినట్లు రాజ్‌భవన్ వర్గాలు సోమవారం తెలిపాయి. మధ్యాహ్నం నుంచే ఇవి అమల్లోకి వచ్చాయని పేర్కొన్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరేదాకా పదవిలో కొనసాగాలని సీఎం పళనిస్వామిని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కోరారు. తమిళనాడు 15వ శాసనసభను గవర్నర్ రద్దు చేశారు. పుదుచ్చేరిలో 7న ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు పుదుచ్చేరీ ముఖ్యమంత్రిగా ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ రంగస్వామి ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ కూటమి విజేతలు ఎన్ఆర్ రంగస్వామిని శాసనసభాపక్ష నేతగా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
స్టాలిన్ వీరాభిమాని: నాలుక కోసుకుని అమ్మవారికి నైవేద్యం
చెన్నె: సినీ, రాజకీయ ప్రముఖుల కోసం తమిళనాడు ప్రజలు చచ్చిపోయేంత అభిమానం చూపిస్తారు. తమిళుల అభిమానం మామూలుగా ఉండదు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించి పదేళ్ల తర్వాత అధికారంలోకి వస్తుండడంతో ఓ మహిళా అభిమాని చేసిన పని చూస్తే ఇదేం పిచ్చిరా అనక మానరు. డీఎంకే పార్టీ గెలిచిందని ఓ మహిళ తన నాలుకను కోసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించింది. అలా చేస్తానని ఎన్నికల ముందు మొక్కు తీసుకుందంట. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓట్ల లెక్కింపు పూర్తయి డీఎంకే 133 సీట్లు సంపాదించి ఇంకా తన మిత్రపక్షాలతో కలిసి మొత్తం 159 స్థానాలతో అధికారంలోకి వస్తోంది. దీంతో 32 ఏళ్ల వనిత తెగ సంబరపడిపోయింది. డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుండడంతో సోమవారం ఉదయం వెంటనే ముత్తలమ్మాన్ అమ్మవారి ఆలయానికి వెళ్లింది. అయితే కరోనా నేపథ్యంలో ఆలయం మూసివేసి ఉండడంతో గేటు బయట నిల్చుని తన నాలుక కోసుకుంది. తెగిన నాలుకను అమ్మవారికి నైవేద్యంగా గేటు బయట పెట్టేసి వెళ్లిపోయింది. ఆమె నాలుక కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. డీఎంకే గెలవాలని.. గెలిస్తే తన నాలుక కోసుకుంటానని ముత్తలమ్మాన్ అమ్మవారికి మొక్కుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: థియేటర్లో కాదు.. శ్మశానాల్లో ‘హౌస్ ఫుల్’ చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వనిత -
డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర
చెన్నె: తాత మాజీ ముఖ్యమంత్రి.. తండ్రి పార్టీ అధినేత.. కుమారుడు సినీ రంగంలో ప్రవేశించి ఇప్పుడు రాజకీయాల్లో ఎంటరయ్యాడు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి తాతకు తగ్గ మనుమడు అని తాజా ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ నిరూపించుకున్నాడు. అయితే ఉదయనిధి చేసిన ప్రచారం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మధురై ప్రచారంలో ఉదయనిధి వ్యంగ్యంగా చేసిన విమర్శలు.. చర్యలను ఓటర్లను అమితంగా ఆకట్టుకున్నాయి. డీఎంకే గెలుపులో కీలక పాత్ర పోషించింది ఏమిటంటే ఒక ‘ఇటుక’. ప్రచారంలో ఉదయనిధి వాడిన ఇటుక వైరల్‌గా మారింది. ఆ పార్టీ విజయంలో ఇటుక పాత్ర ఎంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం మధురైకు ఎయిమ్స్ (ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)ను మంజూరు చేసింది. మంజూరు చేసి మూడేళ్లు దాటినా ఇంతవరకు పనులు పూర్తికాలేదు. శంకుస్థాపనకే పరిమితమైంది. దీన్ని అస్త్రంగా చేసుకుని ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ దూసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీరును ‘ఇటుక’ చూయిస్తూ ఇదిగోండి ఎయిమ్స్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ ప్రచారం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఎయిమ్స్ అని రాసి ఉన్న ఇటుకను పార్టీ అధినేత, తన తండ్రి ఎంకే స్టాలిన్‌కు ఉదయనిధి ఆదివారం అప్పగించాడు. దానర్థం నాన్న మీరైనా ఎయిమ్స్‌ను పూర్తి చేయండి పరోక్షంగా చెప్పాడు. ఈ విధంగా తమిళనాడు ఎన్నికల్లో ఇటుక కీలక పాత్ర పోషించింది. ఇంతకీ ఉదయనిధి స్టాలిన్ తొలిసారి చెపాక్కం- ట్రిప్లికేన్ నుంచి విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఏకంగా 68,880 ఓట్ల మెజార్టీ సాధించి తాత, తండ్రికి వారసుడిగా దూసుకొచ్చాడు. చదవండి: ఊహించని షాక్: 3 రాష్ట్రాల్లో బీజేపీకి ఘోర పరాభవం చదవండి: కాంగ్రెస్‌కు చావుదెబ్బ: హస్త'గతమేనా..?' తన తండ్రి స్టాలిన్‌కు ఎయిమ్స్ ఇటుక ఇస్తున్న ఉదయనిధి స్టాలిన్ #DMKwinsTN #AIIMS #TNwithDMK pic.twitter.com/da6aF5k6qW — Udhay (@Udhaystalin) May 2, 2021 -
ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా ఎన్నికల ఫలితాలు
-
సీఎంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం ఆ రోజే..
సాక్షి, చెన్నై: మే2న విడుదలైన తమిళనాడు అసెంబ్లీ ఫలితాల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) పార్టీ ఆ రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలను చేపట్టబోతుంది. జయలలిత మరణించిన తర్వాత తొలిసారి జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీ సత్తా చాటింది. మొత్తం 234 నియోజకవర్గాలున్న అసెంబ్లీలో 156 స్థానాలను డీఎంకే కూటమి కైవసం చేసుకుంది. పదేళ్ల నిరీక్షణ అనంతరం మళ్లీ డీఎంకేకు అధికారం వరించింది. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఈ నెల 7న ప్రమాణం చేయనున్నారు. ప్రస్తుతం నెలకొన్న కొవిడ్ సెకండ్ వేవ్ సంక్షోభం కారణంగా నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టబోనున్నట్లు ఇప్పటికే స్టాలిన్ స్పష్టం చేశారు. ఆదివారం విజయం తర్వాత తన తండ్రి కరుణానిధి సమాధి దగ్గర నివాళులర్పించిన స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ కొలత్తూరు నుంచి ఆయన తనయుడు ఉధయనిధి స్టాలిన్ చెపాక్ నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: 156 స్థానాల్లో డీఎంకే కూటమి ఘనవిజయం తమిళనాడు: ఇరవై ఏళ్లకు.. వికసించిన కమలం -
సీఎంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం ఆ రోజే..
-
ప్రధాన పోటీ ఆ రెండింటి మధ్యే; ఆ ముగ్గురు ఫెయిల్!
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలోనే తమిళనాడు ఎన్నికలు ప్రత్యేకం. బరిలో ఎన్నిపార్టీలున్నా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యనే ప్రధాన పోటీ. అధికారంలోకి వచ్చేది ఆ రెండింటిలో ఒకటి అనేది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఎటొచ్చి ఎప్పటికప్పుడు మారేది ఏ పార్టీది మూడో స్థానం అనే. అయితే ఈసారి కూడా ఎప్పటి లాగానే ప్రత్యామ్నాయ ప్రయోగం మరోసారి విఫలమైంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే అగ్రనేత కరుణానిధి మరణం తర్వాత వచ్చిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పూర్వస్థితే కొనసాగడం, మూడో కూటమి నాల్గోసారి మునిగిపోవడం గమనార్హం. తమిళనాడులో కాంగ్రెస్ పతనమైన తర్వాత ద్రవిడ పార్టీలే ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. డీఎంకే లేదా అదే పార్టీ నుంచి పుట్టుకొచ్చిన అన్నాడీఎంకే మధ్యనే ప్రధాన పోటీ పరిపాటిగా మారింది. ఆ రెండు కూటములంటే గిట్టని బలమైన ఓటు బ్యాంకు ఒకటుందని విశ్వసిస్తూ గతంలో మూడుసార్లు మూడో కూటమి యత్నాలు జరిగాయి. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్ మరణం తరువాత 1988లో అప్పటి తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షులు జీకే మూప్పనార్ నేతృత్వంలో ఏర్పడిన మూడో కూటమి 26 సీట్లు, 20 శాతం ఓట్లు సాధించింది. 1996లో డీఎంకే నుంచి బయటకు వచ్చిన వైగో.. ఎండీఎంకేను స్థాపించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా వామపక్ష పార్టీలతో కలిపి మూడో కూటమి ఏర్పాటు చేశారు. యథాప్రకారం ఇదీ విఫలమైంది. 2006 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నటుడు విజయకాంత్ డీఎండీకేను స్థాపించి అన్ని స్థానాల్లో పోటీచేసినా తానొక్కడే గెలిచాడు. 2011 ఎన్నికల్లో డీఎంకే 23 స్థానాలకే పరిమితం కాగా, అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్న డీఎండీకే 29 స్థానాల్లో గెలిచి మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఆ తరువాత జయలలితతో విబేధించిన విజయకాంత్ విపక్షాలతో చేతులు కలిపాడు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో వైగో (ఎండీఎంకే) డీఎండీకే, వామపక్ష పార్టీలు, వీసీకే, తమకా పార్టీలతో కలిసి మరోసారి ‘ప్రజా సంక్షేమ కూటమి’పేరున ఏర్పడిన మూడో కూటమి కనీసం ఒక్క సీటూ గెలవలేక చేదు అనుభవాన్నే చవిచూసింది. మూడో కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్దిగా బరిలోకి దిగిన విజయకాంత్ సహా దాదాపుగా అందరూ జయలలిత ధాటికి డిపాజిట్లు కోల్పోయారు. మూడో కూటమి యత్నం ముచ్చటగా మూడుసార్లు విఫలమైనా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరో ప్రయత్నం జరుగింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 80–90 శాతం స్థానాలను తమకు ఉంచుకుని మిగిలినవి మిత్రపక్షాలకు కేటాయించడాన్ని అన్నాడీఎంకే, డీఎంకే అనుసరిస్తున్నాయి. దీంతో కొన్ని పార్టీలు గత్యంతరం లేక సర్దుకుపోతుండగా, మరికొన్ని మూడో కూటమివైపు వచ్చేయడం జరుగుతోంది. సర్దుబాటు పరిస్థితి చిన్నపార్టీలకే కాదు, కాంగ్రెస్, బీజేపీ వంటి పెద్దపార్టీలకూ తప్పడం లేదు. ఇక తాజా విషయానికి వస్తే డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ 25, అన్నాడీఎంకే కూటమి నుంచి బీజేపీ 20 సీట్లు పొందాయి. ఈ రెండు జాతీయ పార్టీలకూ తమిళనాడులో పెద్ద బలం, బలగం లేదు. ఆశించిన స్థాయిలో సీట్లు దక్కినా దక్కకున్నా ఆయా కూటముల్లో కొనసాగక తప్పలేదు. అన్నాడీఎంకే కూటమిలోని సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షులు, నటుడు శరత్‌కుమార్ పార్టీ గుర్తు, పరిమిత సీట్ల కేటాయింపును నచ్చకే మూడో కూటమి ఐజేకేలో చేరారు. మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు కమల్‌హాసన్ ఐజేకే కూటమిలో చేరి సీఎం అభ్యర్దిగా బరిలో నిలిచారు. అన్నాడీఎంకే కూటమిలో ఉండిన డీఎండీకే టీటీవీ దినకరన్ పంచన చేరింది. రాజకీయ సమీకరణలు మారినా అన్నాడీఎంకే, డీఎంకే ప్రత్యామ్నాయ ప్రయోగం నాల్గోసారి నగుబాటుగా మిగిలిపోయింది. పంచముఖ పోటీ తమిళనాట తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పంచముఖ పోటీ నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకేతోపాటు మక్కల్ నీది మయ్యం (కమల్‌హాసన్), అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (టీటీవీ దినకరన్), నామ్ తమిళర్ కట్చి (సీమాన్) ఐదు కూటములకు సారథ్యం వహించాయి. అన్ని కూటముల సారథులు ముఖ్యమంత్రి అభ్యర్థులుగానే బరిలోకి దిగారు. పార్టీ పెట్టిన తరువాత కమల్‌హాసన్, టీటీవీ దినకరన్‌లు ఎదుర్కొన్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. అధికారంలోకి వచ్చేది డీఎంకే లేదా అన్నాడీఎంకే అనేది ఎన్నికలకు ముందే స్పష్టమై పోవడంతో మూడోస్థానం ఎవరిది అనేది చర్చనీయాంశమైంది. 2016లో పార్టీ స్థాపించిన సీమాన్ అప్పటి ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఒంటరి పోటీకి దిగి ఒక్కస్థానం కూడా గెలవకున్నా 1.07 శాతం ఓట్లు సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో కమల్ తన సినీ ఆకర్షణను జోడించి మూడో ప్రత్యామ్నాయంగానే ప్రచారం చేసుకున్నాడు. అన్నాడీఎంకే అసంతృప్తవాదులను టీటీవీ దినకరన్ నమ్ముకున్నారు. శ్రీలంక ఈలం తమిళం, మాతృ (తమిళ) భాషాభిమానిగా సీమాన్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. సీమాన్‌కు యువత ఆదరణ ఒకింత ఉంది. అయితే ఓటమి పాలైన ముగ్గురు ముఖ్యమంత్రులు తమ కూటమి అభ్యర్థులను గెలిపించుకోలేక పోయినా, ఎంతవరకు ఓట్ల శాతం సాధించిపెట్టారనేది పూర్తి గణాంకాలు వచ్చాక తేలనుంది. చదవండి: తమిళనాడు: కమలనాథుల జేబులో కీలక సీటు -
తమిళనాడు: ఇరవై ఏళ్లకు.. వికసించిన కమలం
సాక్షి, చెన్నై: అసెంబ్లీలో కాలుమోపాలని ఎన్నాళ్లుగానో కలలుగంటున్న కమలనాథులు తమ కలను సాకారం చేసుకున్నారు. సుమారు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తరువాత తమిళనాడు శాసనసభలో బీజేపీ ఖాతా తెరిచింది. ఉత్తరాదిలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న బీజేపీ దక్షిణాదిపై దృష్టి సారించింది. ‘అమ్మ’ను కోల్పోయి అనాథగా మారిన అన్నాడీఎంకేను చేరదీయడం ద్వారా తమిళనాడులో బలపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఎవరు అంగీకరించినా అంగీకరించకున్నా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే మెలిగారు. నాలుగేళ్లపాటూ ఎడపాడి ప్రభుత్వాన్ని కాపుగాసిన కమలనాథులు అన్నాడీఎంకే కూటమిలో కొనసాగుతూ అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లు కోరారు. తీవ్రస్థాయిలో తర్జన భర్జనల తరువాత 20 సీట్లకు అంగీకారం కుదిరింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా.. కనీసం ఒక్కసీటైనా గెలిచి తీరుతాం, అసెంబ్లీలో అడుగుపెడతామని బీజేపీ నేతలంతా సవాల్ విసిరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. మురుగన్, మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్, సినీనటి కుష్బు, అగ్రనేత హెచ్. రాజా తదితర హేమా హేమీలను పోటీపెట్టారు. ప్రధాని మోదీ, అమిత్‌షా ఇతర కేంద్రమంత్రులు ప్రచారం చేశారు. తెలుగువారైన పార్టీ కోర్‌కమిటీ సభ్యులు పొంగులేటి సుధాకరరెడ్డి అభ్యర్థుల వెంట సుడిగాలిలా తిరిగి తెలుగు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పెద్దసంఖ్యలో బీజేపీ అభ్యర్థులు గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఫలితాలు వెలువడిన తరువాత ఈ రెండింటిలో ఒకటి పూర్తిగా నెరవేరకున్నా, అసెంబ్లీలో బీజేపీ ప్రవేశాన్ని మాత్రం ఖరారు చేసుకున్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపు డు వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని బీజేపీ రెండుసీట్లు గెలుచుకుంది. ఇన్నాళ్లకు మళ్లీ అదే అన్నాడీఎంకే కూటమి నుంచి బరిలోకి దిగి నాలుగు సీట్లను సొంతం చేసుకుంది. కమలనాథుల జేబులో కీలకసీటు.. పోటీచేసిన మొత్తం 20 స్థానాల్లో నాలుగింటిలో మాత్రమే గెలుపొందగా, వీటిల్లో కీలకస్థానమైన కోయంబత్తూరు దక్షిణంను సొంతం చేసుకోవడం విశేషం. బీజేపీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్, మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు కమల్‌హాసన్‌పై గెలుపొందడం విశేషం. అనుకున్న లక్ష్యం సాధించాం: పొంగులేటి నాలుగుసీట్లను గెలుచుకోవడం ద్వారా తమిళనాడు అసెంబ్లీలో కాలుమోపాలని పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించామని బీజేపీ కోర్ కమిటీ సభ్యులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. చదవండి: 156 స్థానాల్లో డీఎంకే కూటమి ఘనవిజయం -
కమల్, దినకరన్, సీమాన్, కుష్బుకు తప్పని ఓటమి
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు మంత్రులు, సినీ తారలు చతికిలబడ్డారు. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినా, చివరకు ఓటమి తప్పలేదు. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్ని కల్గిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే , అన్నాడీఎంకే కూటముల మధ్య ప్రధాన సమరం నెలకొంది. ఇరు కూటముల్లో ముఖ్య నేతలు, సినీతారలు సైతం పలువురు ఎన్నికల్లో పోటీ చేశారు. అన్నాడీఎంకే తరపున పోటీ చేసిన వారిలో మంత్రులు 12 మంది ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి. పాండియరాజన్, ఎంసీ సంపత్, సీవీ షణ్ముగం, జయకుమార్, కేటి రాజేంద్ర బాలాజీ, బెంజమిన్, ఎంఆర్ విజయభాస్కర్, కామరాజ్, ఓఎస్ మణియన్, రాజలక్ష్మి, వెల్లమండి నటరాజన్, వి.సరోజలు పరాజయం చవిచూశారు. ఈ కూటమి తరపున బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసిన పలువురు ముఖ్య నేతలకు కూడా ఓటమి తప్పలేదు. కర్ణాటకలో ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి స్వస్థలం కరూర్ జిల్లా అరవకురిచ్చి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అన్నామలై ఓడిపోయారు. దినకరన్, కమల్, సీమాన్‌లకు తప్పని ఓటమి అమ్మమక్కల్ మున్నేట్ర కళగం పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు ఓటమి తప్పలేదు. కోవిల్ పట్టి నుంచి ఆయన ఓటమి పాలయ్యారు. మూడో కూటమితో ఎన్నికల్ని ఎదుర్కొన్న డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్ విరుదాచలం నుంచి పరాజయం పాలయ్యారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొన్న నామ్ తమిళర్ కట్చి నేత, సినీ నటుడు, దర్శకుడు సీమాన్ తిరువొత్తియూరు నుంచి ఓటమి పాలయ్యారు. కోయంబత్తూరు దక్షిణం నుంచి పోటీ చేసిన మక్కల్ నీది మయ్యం నేత, విశ్వనటుడు కమలహాసన్ సాయంత్రం వరకు కాస్త మెజారిటీతో ముందుకు సాగారు. ఆ తదుపరి రౌండ్లలో మెజారిటీ తగ్గడంతో ఆయనకు పరాజయం తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నటి కుష్బు చెన్నై థౌజండ్ లైట్స్ నుంచి పోటీ చేశారు. గతంలో డీఎంకే, కాంగ్రెస్‌లలో ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని దృష్ట్యా, ఈసారి బీజేపీలో చేరిన ఆమె అతికష్టం మీద సీటు దక్కించుకున్నారు. గెలుపు లక్ష్యంగా థౌజండ్ లైట్స్‌లో శ్రమించినా ఫలితం దక్కలేదు. -
Udhayanidhi Stalin: మరో వారసుడు రెడీ
సాక్షి, చెన్నై: కరుణానిధి వారసుడు స్టాలిన్ సీఎం పగ్గాలు చేపట్టేందుకు రెడీ అయ్యారు. అదే సమయంలో తన వారసుడిని స్టాలిన్ ముందే రంగంలోకి దించారు. స్టాలిన్‌కు భార్య దుర్గా స్టాలిన్, కుమారుడు ఉదయనిధి స్టాలిన్, కుమార్తె సెంతామరై ఉన్నారు. సినీ నిర్మాతగా, నటుడిగా తన కంటూ ప్రత్కేక గుర్తింపు కలిగిన ఉదయనిధిని తాను స్థాపించిన డీఎంకే యువజన విభాగానికి ప్రధాన కార్యదర్శిగా స్టాలిన్ గతంలోనే నియమించారు. అలాగే, చేపాక్కం –ట్రిప్లికేన్ నుంచి విజయకేతనంతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ఉదయనిధి రెడీ అయ్యారు. ఈ నెల 6న సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేసే చాన్స్ ఉన్నట్లు భావిస్తున్నారు. -
షాకింగ్: ఓటమిపాలైన కమల్ హాసన్
చెన్నె: అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఓడిపోయాడు. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్ (బీజేపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. 1,300 ఓట్ల తేడాతో ఎమ్‌ఎన్‌ఎం చీఫ్ కమల్‌హాసన్ ఓడిపోయారని ఎన్నికల సంఘం ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి వసతి శ్రీనివాసన్‌పై కమల్‌హాసన్ పరాజయం పొందాడు. కాగా కమల్‌మాసన్ పార్టీ మరికొన్ని పార్టీలతో కలిసి మూడో కూటమిగా ఏర్పడింది. మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్ హాసన్ ప్రకటించుకున్నారు. అయితే చివరకు ఆయన ఓడిపోవడం షాకింగ్‌కు గురి చేసే అంశం. ఆయనతో పాటు ఆయన పార్టీకి చెందిన వారు 142 స్థానాల్లో పోటీ చేయగా వారందరూ పరాజయం పొందారు. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారం సొంతం చేసుకుంటోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ కన్నా అధిక స్థానాలు డీఎంకే సొంతం చేసుకోవడంతో ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి కానున్నారు. చదవండి: ఫ్యాన్ స్పీడ్‌కు కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ చదవండి: సీఎం కేసీఆర్ సంచలనం.. మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్ -
ఐదు రాష్ట్రాల ఫలితాలు : గెలిచిన, ఓడిన నటులు వీరే
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, నటుడు సురేశ్ గోపీ ఓడిపోయాడు. త్రిస్సూర్ నియోజకవర్గంలో మొదట్లో ఆధిక్యంలో ఉన్న సురేశ్ గోపీ చివరికి మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించారు. డీఎంకే పార్టీకి కంచుకోట అయిన చెపాక్ నియోజకవర్గంనుంచి దాదాపు 60 వేల మెజార్టీతో గెలుపొందారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నటి ఖుష్బూ ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఖుష్బూ చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే, ఆమె తన సమీప ప్రత్యర్థి డీఎంకే నేత ఎళిలన్ చేతిలో ఓటమి పాలయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, ప్రముఖ హీరో కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్(బీజేపీ)పై స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయారు. -
తాతకు తగ్గ మనవడు.. డెబ్యూ అదరగొట్టాడు
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి మనవడు.. డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించారు. డీఎంకే పార్టీకి కంచుకోట అయిన చెపాక్ నియోజకవర్గంనుంచి గెలుపొందారు. హీరోగా పలు చిత్రాల్లో నటించిన ఉదయనిధి.. స్టార్డమ్ సంపాదించుకోలేకపోయారు. ఒకరకంగా ఆయనకు సినిమాలు అచ్చిరాలేదని చెప్పాలి. హిట్లకంటే ఎక్కువ ప్లాపులే మూటకట్టుకున్నారు. ప్రస్తుతం డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీగా ఉన్న ఆయన మొదటి సారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగారు. కుటుంబానికి అచ్చువచ్చిన స్థానం నుంచి పోటీ చేశారు. డెబ్యూనే అదరగొట్టారు. దాదాపు 60 వేల ఓట్ల ఆధిక్యాన్ని సాధించాడు. ఇదే నియోజకవర్గం నుంచి తాత కరుణానిధి మూడుసార్లు గెలిచారు. వరుసగా 1996, 2001, 2006లలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కరుణా నిధి కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తారో లేదో చూడాలి మరి. -
MK Stalin: విజయధ్వానాల మోత మోగుతోంది!
చెన్నై: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీలోని 234 స్థానాలకు గానూ 153 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు.. అధికార అన్నాడీఎంకే 80 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఎన్నిక ఖరారైంది. దీంతో, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నేతలు అభినందనలు తెలుపుతున్నారు. విజయధ్వానాల మోత మోగుతోంది: కేజ్రీవాల్ ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ విజయధ్వని మారుమోగిపోతోంది. తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, పదవీకాలాన్ని పూర్తి చేయాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. సీఎం జగన్ అభినందనలు తమిళనాడు సీఎంగా పదవి చేపట్టబోతున్న స్టాలిన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఫోన్లో ఆయనతో మాట్లాడి విషెస్ తెలియజేశారు. స్టాలిన్‌కు శుభాకాంక్షలు: రాజ్‌నాథ్ సింగ్ ‘‘తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించిన డీఎంకే చీఫ్ స్టాలిన్‌కు, ఆయన పార్టీకి శుభాకాంక్షలు. బెస్ట్ విషెస్’’ అని కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్లో పేర్కొన్నారు. అద్భుత విజయం ఇది: వి. నారాయణస్వామి ‘‘తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్లో ఘన విజయం సాధించి, యూపీఏ కూటమికి గెలుపునందించిన ఎంకే స్టాలిన్‌కు హృదయ పూర్వక అభినందనలు. మీ హయాంలో తమిళనాడు అభివృద్ధి పథంలో నడుస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది’’ అని పుదుచ్చేరి మాజీ సీఎం వి.నారాయణస్వామి ట్విటర్ వేదికగా స్టాలిన్‌ను అభినందించారు. వీరితో పాటు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంథీ, పార్టీ నేత శశిథరూర్ సహా ఇతరులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు మార్పును కోరుకున్నారు: రాహుల్ గాంధీ తమిళనాడు ప్రజలు మార్పును కోరుకున్నారు. అందుకు అనుగుణంగా ఓటువేశారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. మీ నాయకత్వంలో మరింత ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తాం. స్టాలిన్‌కు బెస్ట్ విషెస్. Many congratulations to @mkstalin on a resounding victory in the Tamil Nadu assembly polls. I wish him a successful tenure and the very best in fulfilling the aspirations of people of Tamil Nadu. — Arvind Kejriwal (@ArvindKejriwal) May 2, 2021 Congratulations to Shri MK Stalin for the victory. People of Tamil Nadu have voted for change and we will, under your leadership, prove to be a confident step in that direction. Best wishes. — Rahul Gandhi (@RahulGandhi) May 2, 2021 చదవండి: తిరుగులేని స్టాలిన్.. వార్ వన్‌సైడ్!? -
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు: దారుణంగా కమల్ పార్టీ పరిస్థితి
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ సునామి సృష్టిస్తోంది. అధికార అన్నాడీఎంకే రెండంకెలకే పరిమితమైంది. డీఎంకే 125 స్థానాల్లో.. అన్నాడీఎంకే 77 స్థానాల్లో.. కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మిగిలిన పార్టీలేవీ కాంగ్రెస్ దరిదాపుల్లో కూడా లేవు. ఇక, లోకనాయకుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పార్టీ కేవలం ఒకస్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. అది కూడా కమల్ హాసన్ పోటీ చేస్తున్న కోయంబత్తూర్ సౌత్‌లోనే. అక్కడ కూడా పోటాపోటీగా ఉంది. కమల్ 15 వేల పైచిలుకు ఓట్లను గెలుచుకోగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ జయకుమార్ 12 వేల పైచిలుకు ఓట్లు.. మూడో స్థానంలో బీజేపీకి చెందిన వాసంతి శ్రీనివాసన్ 11 వేల పైచిలుకు ఓట్లను సొంతం చేసుకున్నారు. దాదాపు రెండు వేలపై చిలుకు ఓట్ల మెజార్టీలో కమల్ ఉన్నారు. అయితే ఈ మెజార్టీ అలానే కొనసాగుతుందా లేక, తారుమారు అవుతుందా అన్నది మరికొద్ది సేపట్లో తెలుస్తుంది. కాగా, గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు సౌత్‌లో ఏఐడీఏంకే తరఫున అమ్మన్ కే అర్జున్ విజయం సాధించారు. పొత్తుల్లో భాగంగా ఏఐడీఎంకే పార్టీ ఈ స్థానాన్ని మిత్ర పక్షం బీజేపీకి కేటాయించింది. ఇక 2019 జనరల్ ఎలక్షన్లో ఎంఎన్ఎం కోయంబత్తూరు నియోజకవర్గంలో 11 శాతం ఓట్లు సాధించగలిగింది. ఇక్కడ పార్టీకి మద్దతురాలు ఎక్కువ ఉండటం.. ప్రస్తుత ఎన్నికల్లో ఏఐడీఎంకే కాకుండా బీజేపీ కోయంబత్తూరులో బరిలో నిలవడం వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే కమల్ ఇక్కడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. -
స్టాలిన్‌కు అభినందనలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: తమినాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్(117 స్థానాలు) దాటేసి భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే ఈ సారి తమిళనాడులో పదవి చేపట్టబోతుంది. డీఎంకే తరఫున ఆ పార్టీ ప్రతినిధి స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛనమే. కలత్తూరులో బరిలో దిగిన స్టాలిన్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, స్టాలిన్‌కు అభినందనలు తెలిపారు. ఫోన్ చేసి ఆయనను అభినందించారు. ఇక తమిళనాడులో డీఎంకే ప్రస్తుతం 137 స్థానాల్లో స్పష్టమైన అధిక్యం కనబరుస్తుంది. కలత్తూరులో బరిలో దిగిన స్టాలిన్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే స్టాలిన్ నివాసం వద్ద సందడి నెలకొంది. చదవండి: ఎన్నికల్లో విజయం తథ్యం.. కానీ: స్టాలిన్ -
ఎన్నికల్లో విజయం తథ్యం.. కానీ: స్టాలిన్
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తథ్యమని అయితే ప్రాణాలు పణంగా పెట్టి విజయోత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం లేదని డీఎంకే అధినేత స్టాలిన్ అన్నారు. మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో కార్యకర్తలంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడు శాసన సభకు ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల్లో 141 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ డీఎంకే అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతోంది. దీంతో, కార్యకర్తలు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరి సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను, పోలింగ్ బూత్ ఏజెంట్లను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు.. ‘‘పోల్ బూత్ వద్ద ఉన్న కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. విజయం ఖాయమని తెలుసు. అయితే, సంబరాలు చేసుకోవడం తగదు. మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. డీఎంకే సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది. ముందు మనల్ని మనం కాపాడుకుంటేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలం కదా. అందుకే ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించండి’’ అని పిలుపునిచ్చారు. ఇక డీఎంకే నేత, ఎంపీ టీకేఎస్ ఎలంగోవన్ మాట్లాడుతూ... ‘‘డీఎంకే శ్రేణులు విజయోత్సాహంలో మునిగిపోయాయి. అయితే, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త తమ ఇంట్లోనే సంబరాలు చేసుకోవాలి. డీఎంకే కుటుంబంలోని సభ్యులుగా మన అధినేత సూచనలు పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా ఎన్నికల విజయోత్సవాలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో నిబంధనలు ఉల్లంఘిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అయిదు రాష్ట్రాల సీఎస్‌లకు ఆదేశాలు జారీ చేసింది. #WATCH | DMK supporters continue to celebrate outside party headquarters in Chennai as official trends show the party leading on 118 seats so far. Election Commission of India has banned any victory procession amid the #COVID19 situation in the country.#TamilNaduElections2021 pic.twitter.com/z6Fp5YRnKP — ANI (@ANI) May 2, 2021 చదవండి: తిరుగులేని స్టాలిన్.. వార్ వన్‌సైడ్!? -
తిరుగులేని స్టాలిన్.. వార్ వన్‌సైడ్!?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వేల అంచనాలు నిజం చేస్తూ ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన 117 స్థానాలు దాటేసిన డీఎంకే ప్రస్తుతం 137 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఆ పార్టీ అధినేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ సైతం కలత్తూరులో విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఇక పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేకు షాకిస్తూ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా స్టాలిన్ కొలువుదీరడం ఖాయమైన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద సందడి నెలకొంది. స్టాలిన్ సోదరి కనిమొళి సహా పార్టీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. కాగా దివంగత ముఖ్యమంత్రులు, తమిళనాడు ముఖచిత్రంగా మారి పాలనపై తమదైన ముద్ర వేసిన కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాలు లేకుండానే జరిగిన అసెంబ్లీ పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా తండ్రి మరణం తర్వాత పూర్తిస్థాయిలో డీఎంకే పగ్గాలు చేపట్టిన స్టాలిన్ అధికార అన్నాడీఎంకే- బీజేపీ కూటమిని ఎలా ఢీకొడతారన్న అంశం ప్రజల్లో ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా సోదరుడు అళగిరితో విభేదాల నేపథ్యంలో ఆయన ఎలాంటి వ్యూహాలు రచిస్తారు, ఒకవేళ సోదరుడు సొంతపార్టీ పెడితే దానిని ఎలా ఢీకొంటారన్న విషయాలపై విస్తృత చర్చ జరిగింది. అయితే, ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయిన స్టాలిన్, తండ్రిని గుర్తుచేస్తూనే తమకు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తామన్న అంశాలపై ప్రసంగాలు చేశారు. విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం కల్పిస్తూ మేనిఫెస్టో విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకున్నారు. అదే విధంగా, నూతన వ్యవసాయ చట్టాలు, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ, నీట్ వివాదం, కరోనా వ్యాప్తి వంటి అంశాలను లేవనెత్తుతూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అదే సమయంలో బీజేపీతో కూటమిగా ఏర్పడిన అన్నాడీఎంకే విధానాలను తూర్పారబడుతూ ముందుకు సాగిపోయారు. మిమ్మల్ని నమ్ముకునే రాజకీయాల్లోకి వచ్చానంటూ ప్రజలకు మరింత చేరువయ్యారు. మరోవైపు.. అన్నాడీఎంకే సైతం మేనిఫెస్టోలో వరాల జల్లు కురిపించింది. ఉచిత హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉంటే... పోటీ చేసేది 20 సీట్లలోనేనైనా బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తమిళనాడు ఆడపడుచు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, స్థానిక బీజేపీ నేత, నటి గౌతమి తదితర 30 మంది స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించి ఆర్భాటంగా ప్రచారం నిర్వహించింది. కానీ, ఓటర్లు మాత్రం వార్ వన్‌సైడ్ చేశారు. ఇంట గెలిచిన స్టాలిన్‌ను రచ్చ గెలిపిస్తూ స్పష్టమైన తీర్పునిచ్చారు. దీంతో డీఎంకేలో కరుణానిధి తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టబోయే మొదటి వ్యక్తిగా ఆయన తమిళ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సుస్థిరం చేసుకోనున్నారు. #WATCH | DMK supporters continue to celebrate outside party headquarters in Chennai as official trends show the party leading on 118 seats so far. Election Commission of India has banned any victory procession amid the #COVID19 situation in the country.#TamilNaduElections2021 pic.twitter.com/z6Fp5YRnKP — ANI (@ANI) May 2, 2021 చదవండి: తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు: సంబరాల్లో డీఎంకే కార్యకర్తలు -
తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు: ఉదయనిధి స్టాలిన్ విజయం
Live Updates: ►ఎడప్పాడిలో సీఎం పళనిస్వామి గెలుపొందారు. ►చెపాక్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన డీఎంకే అధినేత స్టాలిన్ కుమార్, సినీ హీరో ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించారు. ►తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో డీఎంకే దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన స్థానాలు దాటేసి, స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ విజయం చేజిక్కుంచుకునే దిశగా సాగుతోంది. దీంతో డీఎంకే శ్రేణులు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నాయి. తమిళనాడు కాబోయే సీఎం తమ అధినేత స్టాలిన్ అంటూ కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, సర్వేల అంచనాలు నిజం చేస్తూ డీఎంకే గెలుపు దిశగా పయనిస్తున్న వేళ స్టాలిన్ సోదరి కనిమొళి ఆయన నివాసానికి చేరుకున్నారు. #WATCH | DMK workers and supporters celebrate outside Anna Arivalayam, the party headquarters in Chennai, as official trends show the party leading.#TamilNaduElections2021 pic.twitter.com/61tbcETHYk — ANI (@ANI) May 2, 2021 Time 11:30 AM ఆధిక్యం: డీఎంకే- 138, అన్నాడీఎంకే- 95, ఇతరులు-1 Time 11:00 AM ఆధిక్యం: డీఎంకే- 133, అన్నాడీఎంకే- 100, ఇతరులు-1 Time 10:50 AM బోడినాయక్కనూరులో పన్నీర్ సెల్వం వెనుకంజలో ఉన్నారు. Time 10:40 AM ► తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్(117)కు కావాల్సిన స్థానాలను దాటేసి ముందంజలో నిలిచింది. ఇక తమిళనాడులో డీఎంకేదే అధికారం అంటూ సర్వేలన్నీ ఆ పార్టీకి పట్టం కట్టిన సంగతి తెలిసిందే. ఆ అంచనాలన్నీ నిజమయ్యేలా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం కనబరుస్తుండటంతో పార్టీ శ్రేణులు సంతోషంలో మునిగిపోయాయి. ► ఆధిక్యం: డీఎంకే- 145, అన్నాడీఎంకే- 74, ఇతరులు-2 Time 10:30 AM ► ఆధిక్యం: డీఎంకే-128, అన్నాడీఎంకే- 61, ఇతరులు-2 Time 10:15 AM ►విరుదాచలంలో విజయ్‌కాంత్ భార్య ప్రేమలత వెనుకంజలో ఉన్నారు. కొలత్తూర్‌లో స్టాలిన్ ముందంజలో ఉన్నారు. ►ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో చెపాక్ అసెంబ్లీ స్థానంలో పోటీచేసిన డీఎంకే అభ్యర్థి ఉదయనిధి స్టాలిన్ క్వీన్స్ మేరీ కాలేజీకి వచ్చారు. పార్టీ శ్రేణులతో కలిసి కౌంటింగ్ సరళిని పరిశీలించారు. ప్రస్తుతం ఆయన ముందంజలో కొనసాగుతున్నారు. TIME 9: 55 AM ►ఆధిక్యం: డీఎంకే- 125, అన్నాడీఎంకే- 90 TIME 9: 40 AM ►ముందజంలో డీఎంకే- 112, అన్నాడీఎంకే- 82 ►థౌజండ్‌లైట్స్‌లో ఖుష్బూ వెనుకంజ ►కొలత్తూర్ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన డీఎంకే అధినేత స్టాలిన్ ముందంజలో ఉన్నారు. ►కోయంబత్తూర్ దక్షిణ నుంచి పోటీ చేసిన కమల్‌హాసన్ ఆధిక్యం కనబరుస్తున్నారు. ►ఎడప్పాడి నుంచి పోటీ చేసిన సీఎం పళనిస్వామి, బోడినాయక్కనూర్ నుంచి బరిలో దిగిన డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ముందంజలో ఉన్నారు. ►కోవిల్పట్టిలో వెనుకంజలో దినకరన్ ►డీఎంకే అభ్యర్థులు పలుచోట్ల ముందంజలో ఉన్నారు. ►డీఎంకే ఆధిక్యం-107, అన్నాడీఎంకే- 70 ►డీఎంకే ఆధిక్యం-93. అన్నాడీఎంకే-63 ►65 స్థానాల్లో డీఎంకే ముందంజ.. 42 చోట్ల అన్నాడీఎంకే ఆధిక్యం ►డీఎంకే 19 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. అధికార అన్నాడీఎంకే 8 చోట్ల ఆధిక్యంలో ఉంది. ►శాసన సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. 234 స్థానాలకు గానూ డీఎంకే 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. ►అసెంబ్లీ స్థానాలు - 234 ►పోటీలో ఉన్న అభ్యర్థులు - 3,998 ►మొత్తం ఓటర్లు - 6.28 కోట్లు ►పోలింగ్ శాతం - 72.81 శాతం ►లెక్కింపు కేంద్రాలు - 75 ►కౌంటింగ్ సిబ్బంది - 16 వేలు ►బందోబస్తు ఉన్న పోలీసులు - లక్ష ప్రముఖులు పోటీ చేసిన నియోజకవర్గాలు: ♦ఎడప్పాడి నుంచి బరిలో నిలిచిన సీఎం పళనిస్వామి ♦బోడినాయక్కనూర్‌లో పోటీ చేసిన పన్నీర్ సెల్వం ♦కొలత్తూర్ నుంచి రంగంలోకి దిగిన డీఎంకే అధినేత స్టాలిన్ ♦చెపాక్‌లో పోటీ చేసిన ఉదయనిధి స్టాలిన్(డీఎంకే) ♦కోవిల్పట్టి బరిలో శశికళ అల్లుడు టీటీవీ దినకరన్ ♦కోయంబత్తూర్ దక్షిణ నుంచి పోటీ చేసిన కమల్‌హాసన్ ♦థౌజండ్ లైట్స్ నుంచి రంగంలోకి దిగిన నటి ఖుష్బూ ►2016లో 136 సీట్లతో అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే ►2016లో 89 సీట్లు మాత్రమే దక్కించుకున్న డీఎంకే సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం ఆదివారం తేలనుంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తమిళనాడు అసెంబ్లీ పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగియనుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం ఏప్రిల్ 6న రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. అన్నాడీఎంకే–డీఎంకే మధ్యే ప్రధాన పోటీ ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, ఎండీఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు పోటీ చేశాయి. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, తమాక తదితర పార్టీలున్నాయి. వీటితోపాటు మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ కూటమిలో ఐజేకే, సమక చేరాయి. అయితే శరత్‌కుమార్ అధ్యక్షుడిగా ఉన్న సమక నుంచి ఎవ్వరూ పోటీచేయలేదు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సారథ్యంలోని కూటమి నుంచి విజయకాంత్ అధ్యక్షుడిగా ఉన్న డీఎండీకే పోటీకి దిగింది. నామ్ తమిళర్ కట్చి అధినేత సీమాన్ నేతృత్వంలో మరో కూటమి బరిలోకి దిగింది. రాష్ట్రంలో పంచముఖ పోటీ నెలకొన్నా అధికార పీఠం మాత్రం అన్నాడీఎంకే, డీఎంకేలో ఏదో ఒక పార్టీకి దక్కే అవకాశం ఉంది. హోరాహోరీ ప్రచారాల అనంతరం ఏప్రిల్ 6న 72.81 శాతంతో పోలింగ్ ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ల లెక్కింపునకు 25 రోజులు వేచి ఉండక తప్పలేదు. వరుసగా మూడోసారి గెలుపొంది అన్నాడీఎంకే చరిత్ర సృష్టించనుందని ఆ పార్టీ అగ్రనేతలు సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఒక ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కోయంబత్తూరు దక్షిణం నుంచి పోటీచేసిన కమల్‌హాసన్ ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రత్యేక విమానంలో కోవైకు రానున్నారు. ఆంక్షలు, బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కరోనా ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో సుమారు 16 వేల మందిని ఎంపిక చేసి కరోనా పరీక్షలు కూడా పూర్తి చేశారు. కేంద్రాల వద్ద థర్మల్‌స్క్రీనింగ్ చేసే లోనికి అనుమతించనున్నారు. ముందుగా తపాలా ఓట్ల లెక్కింపు చేస్తారు. అనంతరం 75 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 3,372 టేబుళ్ల ద్వారా ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద లక్ష మంది పోలీసులతో బందోబస్తు పెట్టినట్లు డీజీపీ త్రిపాఠి తెలిపారు. వీరిలో 50 వేల మంది పారామిలిటరీ దళాలు, సాయుధ పోలీసులు ఉంటారని చెప్పారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఓట్ల లెక్కింపును నిర్వహిస్తున్నామని తెలిపారు. ముమ్మర తనిఖీలు తిరువళ్లూరు: జిల్లాలోని 10 నియోజకవర్గాలకు ఆదివరం కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి సుమారు ఐదు కి.మీ పరిధిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాలకు వచ్చే అన్నీ మార్గాలను పోలీసులు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. పోలీసుల కోసం ప్రత్యేకంగా మినీ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. కౌటింగ్‌ను పూర్తిగా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై నిఘా ఉంచుతామని కలెక్టర్ తెలిపారు. తిరువళ్లూరులో 23 రౌండ్లు, తిరుత్తణి 29, గుమ్మిడిపూండీ 29, మాధవరం 31, పొన్నేరి 27 , తిరువొత్తియూర్ 31, పూందమల్లి 36, అంబత్తూరు 39, ఆవడి 31, మాధవరం 31 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏర్పాట్లు పూర్తి వేలూరు: జిల్లాలోని ఐదు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేలూరు, అనకట్టు నియోజక వర్గాలకు వేలూరు తందై పెరియార్ కళాశాలలో, కాట్పాడి నియోజకవర్గం కాట్పాడి న్యాయ కళాశాలలో, గుడియాత్తం, కేవీ కుప్పం నియోజకవర్గాలకు గుడియాత్తం రాజగోపాల్ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ జరగనుంది. -
నేడే ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు
న్యూఢిల్లీ/కోల్‌కతా/చెన్నై/తిరువనంతపురం: ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 822 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 2016లో ఆయా రాష్ట్రాలన్నింటిలో కలిపి 1,002 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేయగా, ఈసారి 2,364 హాళ్లు సిద్ధం చేశారు. అంటే హాళ్ల సంఖ్యను ఏకంగా 200 శాతం పెంచారు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 1,113, కేరళలో 633, అస్సాంలో 331, తమిళనాడులో 256, పుదుచ్చేరిలో 31 హాళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలను కనీసం 15 సార్లు శానిటైజేషన్ చేయనున్నట్లు అధికారులు చెప్పారు. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడానికి వీల్లేదన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 1,100 మంది పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్ రిపోర్టు లేదా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని తేల్చిచెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కరోనా ప్రోటోకాల్స్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. కీలకమైన పశ్చిమ బెంగాల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 దాకా 8 దశల్లో 294 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 108 కేంద్రాల్లో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. 256 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఓట్ల లెక్కింపునకు ముందే ఈవీఎంలు, వీవీప్యాట్లను శానిటైజ్ చేయనున్నారు. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 6 దాకా మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. కేరళలో 140 శాసనసభ స్థానాలున్నాయి. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 957 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తమిళనాడు, పుదుచ్చేరిలో ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. తమిళనాడులో 234 స్థానాలుండగా, దాదాపు 4 వేల మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలతోపాటు కన్యాకుమారి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ సీట్లున్నాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగాల్ ఎవరిదో? దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్రీకృతమయ్యింది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మళ్లీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. ప్రతిపక్ష బీజేపీ సైతం గట్టి పోటీ ఇచ్చింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్–బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. అస్సాంలో అధికార బీజేపీ కూటమి ముందంజలో ఉన్నట్లు తేలింది. కేరళలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని అంటున్నారు. ఇక్కడ బీజేపీ–ఏఐఏడీఎంకే–ఏఐఎన్ఆర్సీ కూటమి విజయం సాధిస్తుందని చెబుతున్నారు. తమిళనాడులో అధికార ఏఐఏడీఎంకే–బీజేపీ కూటమికి భంగపాటు ఎదురవుతుందని, ప్రతిపక్ష డీఎంకే–కాంగ్రెస్ కూటమి గద్దెనెక్కబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. -
సర్వేల ముక్తకంఠం
ఆఖరి దశ పోలింగ్ పూర్తయ్యాక యధావిధిగా వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గురువారం వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో ఎనిమిదో దశ పోలింగ్‌తో అక్కడి సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ముగియ డంతో చానెళ్లన్నీ సర్వే ఫలితాలను హోరెత్తించాయి. కరోనా మహమ్మారి దేశమంతా స్వైరవిహారం చేస్తూ, పౌరుల ప్రాణాలు తోడేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మునుపటిలా వీటిపై జనంలో ఉత్కంఠ వుంటుందా అన్నది ప్రశ్నార్థకమే. అయినా మీడియా తన పని తాను చేసుకుపోయింది. ఎప్పటిలాగే సర్వేలు చేయడంలో నైపుణ్యం వున్న సంస్థలను రంగంలోకి దించి జనం నాడి తెలుసుకునే ప్రయత్నం చేసింది. మొదటినుంచీ అందరూ అనుకుంటున్నదే దాదాపుగా ఈ సర్వేలు కూడా చెప్పాయి. పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ పోరుంటుందని, తమిళనాట డీఎంకే, అస్సాంలో బీజేపీ, కేరళలో వరసగా రెండోసారి వామపక్ష ప్రజాతంత్ర కూటమి(ఎల్డీఎఫ్) విజయం సాధించవచ్చని జోస్యం చెప్పాయి. పుదుచ్చేరిలో తొలిసారి ఎన్డీఏకు అధికారం దక్కబోతున్నదని అంచనా వేశాయి. అంకెల్లోనే కాస్త వ్యత్యాసాలున్నాయి. బెంగాల్ విషయంలో ఒక్క రిపబ్లిక్ టీవీ–సీఎన్ఎక్స్ సర్వే మాత్రమే బీజేపీకి అధిక స్థానాలిచ్చింది. ఎన్నికల ప్రచారం ప్రారంభదశలో బెంగాల్‌ను అందరూ తృణమూల్ కాంగ్రెస్ ఖాతాలోనే వేసినా, ఆ తర్వాత సంశయంలో పడ్డారు. అది బీజేపీ సృష్టించిన ప్రచారహోరు పర్యవసానమా లేక తృణమూల్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వర్గాల్లో వచ్చినట్టు కనబడుతున్న మార్పా అన్నది ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోయారు. అయితే చివరి రెండు దశల పోలింగ్‌నాటికి దేశం నలుమూలలా కరోనా పర్యవసానంగా నెలకొన్న విషాదకర పరిస్థితులు బెంగాల్‌ను ఏమేరకు ప్రభావితం చేసివుంటాయన్నది వేచిచూడాలి. నెలన్నరపాటు దఫదఫాలుగా జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలపై జనంలో గతంతో పోలిస్తే ఆసక్తి తగ్గింది. బెంగాల్లో ఈసారి ఎలాగైనా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను గద్దె దించాలన్న కృతనిశ్చయంతో వున్న బీజేపీ అందుకు తగినట్టు భారీ స్థాయిలో ప్రచార యుద్ధం సాగించింది. ఆ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి హేమాహేమీలు సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. అన్నిచోట్లా భారీయెత్తున జనం హాజరయ్యారు. కరోనా వైరస్ విజృంభణను పట్టించుకోకుండా, దాన్ని నియంత్రించడానికి అవసరమైన వ్యూహాలు రూపొందించకుండా బెంగాల్‌పైనే మోదీ దృష్టి సారించారన్న విమర్శలు కూడా వచ్చాయి. మమత సైతం బీజేపీకి దీటుగా ముందుకురికారు. ఇంత సుదీర్ఘమైన పోలింగ్ షెడ్యూల్ ప్రకటించినందుకు ఎన్నికల సంఘాన్ని కూడా అనేకులు తప్పుబట్టారు. చివరి మూడు దశలనూ ఒకే దశగా మార్చి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ వచ్చినా సంఘం పెద్దగా స్పందించలేదు. తమిళనాడులో నేతలు పాల్గొన్న సభల్లో భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడంవంటివి లేకున్నా అది పట్టించుకోలేదని, ఫలితంగా కరోనా కేసులు పెరిగాయని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై మాత్రం సంఘం నొచ్చుకుంది. ఈసీ అధికారులపై హత్య కేసు ఎందుకు పెట్టరాదంటూ న్యాయమూర్తులు కటువుగా వ్యాఖ్యానించారు. ఇందుకు ఎన్నికల సంఘం బాధపడటంలో అనౌచిత్యమేమీ లేదు. కానీ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వగైరాల్లో నాయ కులు తన లక్ష్మణ రేఖను దాటుతున్నప్పుడు కూడా అదిలాగే స్పందిస్తే... పార్టీలతో నిమిత్తం లేకుండా, నేతలు అధిరోహించిన పదవులతో సంబంధం లేకుండా తగిన చర్యలకు ఉపక్రమిస్తే మరింత బాగుండేది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి ఉప ఎన్నిక బహిరంగసభను కరోనా విజృంభణ కారణంగా రద్దు చేసుకున్నప్పుడే ఈసీ కూడా ఆ దిశగా ఆలో చించి ప్రచారపర్వాన్ని ఇక కట్టిపెట్టాలని పార్టీలకు ఆదేశాలివ్వాల్సింది. ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయతపై ఆదినుంచీ సంశయాలున్నాయి. మన దేశంలో మాత్రమే కాదు... విదేశాల్లోనూ అదే పరిస్థితి. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ నెగ్గుతారని ఏ సర్వే కూడా చెప్పలేకపోయింది. దాదాపు అందరూ హిల్లరీ క్లింటన్‌వైపే మొగ్గారు. తీరా బ్యాలెట్ బాక్సులు తెరిచేసరికి ట్రంప్ ప్రత్యక్షమయ్యారు. మన దేశంలో 2004లో యూపీఏ నెగ్గుతుందనిగానీ, 2009లో అది వరసగా రెండోసారి కూడా విజయం సాధిస్తుందనిగానీ మెజారిటీ సర్వేలు చెప్పలేకపోయాయి. జనం నాడి తెలుసుకోవడం అంత సులభం కాదు. ప్రజలెప్పుడూ కూడబలుక్కున్నట్టు ఒకే మాదిరి ఓటేస్తారు. కానీ వ్యక్తులుగా ఎవరికి వారు విజేతల గురించి అయోమయంలో వుంటారు. ఫలితాలు వెలువడినప్పుడు ఆశ్చర్యపోతారు. పోలింగ్ రోజున సర్వే చేసేవారిని ముప్పుతిప్పలు పెడతారు. ఓటేసింది ఒకరికైతే మరొకరి పేరు చెబుతారు. వారిని మాటల్లోపెట్టి ఎటువైపు మొగ్గుందో తెలుసు కోవడం అంత సులభమేమీ కాదు. ఎన్నో అనుభవాలు నేర్పిన గుణపాఠాలతో తగిన ప్రమాణాలు రూపొందించుకుని, జనం నాడి పట్టేందుకు నిజాయితీగా ప్రయత్నించే సంస్థలు కూడా లేకపోలేదు. వాస్తవ ఫలితాలు వెలువడినప్పుడు తమకు విశ్వసనీయత ఏర్పడాలని ఆశించే ఇలాంటి సంస్థలు న్నట్టే... చవకబారు రాజకీయ ప్రయోజనాలు ఆశించో, బెట్టింగులద్వారా కోట్లు గడించాలన్న వెంప ర్లాటతోనో దొంగ జోస్యాలు చెప్పేవారూ తయారయ్యారు. తినబోతూ రుచెందుకన్నట్టు ఆదివారం ఎటూ వాస్తవ ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ప్రతిష్టను పెంచుతాయా, తగ్గిస్తాయా అన్నది తేలాల్సివుంది. -
ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
చెన్నై: భారత ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా మహమ్మారి రెండో దశ భారత్‌లో ప్రమాదకర స్థితిలో ఉందని వ్యాఖ్యానించింది. నిత్యం మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్యం చేసింది. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు, కుంభ మేళా, ప్రజల నిర్లక్ష్యం కారణంగా కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయని తెలిపింది. కరోనా విపత్తు ముంచుకొస్తున్న సమయంలో రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది. ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరు వేరే గ్రహంలో ఉన్నారా’? అని ఈసీఐ కౌన్సిల్‌ను ఉద్దేశించి చీఫ్ జస్టిస్ సంజిబ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇక తమిళనాడులో కరోనా సెకండ్ వేవ్‌కు ఎలక్షన్ కమిషన్‌యే ఏకైక కారణమని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ అధికారులపై మర్డర్ కేసులు పెట్టాలని పేర్కొంది. కరోనా కట్టడికి సరైన ప్రణాళిక లేకుంటే మే 2న విడుదలయ్యే ఫలితాలను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఏప్రిల్ 30న కోర్టు మరోసారి కౌంటింగ్ డేకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌పై సమీక్ష జరుపుతుందని తెలిపింది. కాగా తమిళనాడులో గడిచిన 24 గంటల్లో 15,659 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,81,988కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 4206 ఒక్క చెన్నై నగరంలోనే వెలుగు చూశాయి. కరోనా మరణాలు కూడా తమిళనాడులో కలకలం రేపుతున్నాయి. ఆదివారం రోజు కరోనా సోకి 82 మంది మరణించారు. చదవండి: మా ఆక్సిజన్‌ను ఏపీ, తెలంగాణలకు పంపిణీ చేయొద్దు -
ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
నేతల ఆట విడుపు.. కొడైకెనాల్లో తిష్ట
సాక్షి, చెన్నై: తెల్ల పంచె, తెల్లచొక్క అంటూ రాజకీయ వ్యవహారాల్లో బిజీబిజీగా గడిపిన నేతలకు కాస్త విరామం లభించింది. కొడైకెనాల్లో పలువురు నేతలు ఆటవిడుపుగా తిష్ట వేశారు. కొందరు అయితే, కుటుంబాలతో కలిసి పర్యాటక కేంద్రాల్లో చక్కర్లు కొడుతున్నారు. వీరు తమ నాయకులేనా అని గుర్తు పట్టలేని రీతిలో వేషాల్ని మార్చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందుగా సిట్టింగ్ సీట్లు మళ్లీ దక్కేనా అన్న ఆందోళన అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు పడ్డ విషయం తెలిసిందే. చివరకు సీట్లు దక్కించుకున్న వాళ్లు, ఎన్నికల ప్రచారంలో రేయింబవళ్లు ఓటర్లను ఆకర్షించేందుకు కుస్తీలు పట్టారు. పార్టీల ముఖ్య నేతలు, మంత్రులు అంటూ నెలన్నర రోజులు తీవ్రంగానే శ్రమించారు. ఈనెల ఆరవ తేదీతో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో ఫలితాల వెల్లడికి మే 2వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం విరామ సమయం నేతలకు దొరికింది. తమ కుటుంబాలతో గడిపేందుకు మరింతగా సమయం దొరికింది. సీఎం పళనిస్వామి అయితే, స్వగ్రామం ఎడపాడికి వెళ్లి కుటుంబం, బంధువులతో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయించడం జరుగుతోంది. డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం సొంతూరు బోడినాయకనూర్‌కు పరిమితమయ్యారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అయితే, కుటుంబంతో కలిసి కొడైకెనాల్ వెళ్లారు. వేషాల్ని మార్చేసి.. తమిళ నేతలు సాధారణంగా తెల్లపంచె, తెల్ల చొక్కాలతో దర్శనం ఇవ్వడం నిత్యం చూస్తూ వచ్చాం. అయితే, ఇప్పుడు విరామ సమయంలో తమ వేషాల్నే మార్చేశారు. భార్య దుర్గ, కుమారుడు ఉదయ నిధి, కోడలు, మనుమళ్లు, మనుమరాళ్లతో స్టాలిన్ కొడైకెనాల్లో రెండు రోజులుగా బస చేశారు. గోల్ఫ్ ఆడుతూ ఎక్కువ సమయం గడుపుతున్నారు. సాయంత్రం సతీమణితో కలిసి అలా పర్యాటక అందాల్ని తిలకించేందుకు కారులో చక్కర్లు కొట్టే పనిలో పడ్డారు. ట్రాక్, టీషర్టుతో కనిపించిన స్టాలిన్‌తో సెల్ఫీలకు పలువురు ఎగబడడం విశేషం. ఈ పరిస్థితుల్లో కొడైకెనాల్లో స్టాలినే కాదు, అన్నాడీఎంకే ముఖ్య నేతలు, మంత్రులు పలువురు సైతం కుటుంబాలతో కలిసి తిష్ట వేసి ఉండడం వెలుగు చూసింది. అయితే, వీళ్లేనా తమ నేతలు, తమ మంత్రులు అని గుర్తు పట్టలేని పరిస్థితుల్లో వేషాల్ని మార్చేశారు. థర్మాకోల్ మంత్రిగా ముద్ర పడ్డ సహకార మంత్రి సెల్లూరురాజు ఆదివారం ఉదయం కుటుంబంతో వాకింగ్ చేస్తూ కెమెరాకు చిక్కారు. ఆయన్ను తొలుత ఎవ్వరూ గుర్తు పట్టనప్పటికీ, చివరకు దగ్గరకు వెళ్లి పలకరించగా, ఆయనే సెల్లూరు రాజు అని తేలింది. దీంతో ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పలువురు యువకులు ఆసక్తి చూపించారు. తానే కాదు, మరెందరో నేతలు కొడైకెనాల్లో విశ్రాంతిలో ఉన్నట్టుగా సెల్లూరు సంకేతం ఇవ్వడం గమనార్హం. పంచెకట్టు, తెల్ల చొక్కాల్ని పక్కన పెట్టి, టీషర్టులు, జీన్స్‌లు, ట్రాక్‌లతో వేషాల్ని మార్చిన మనోల్ని గుర్తు పట్టడం కాస్త కష్టమే అన్నట్టుగా పరిస్థితి నెలకొని ఉండడం గమనార్హం. గతంలో ముఖ్య నేతలు ఎన్నికల అనంతరం విదేశాలకు చెక్కేసేవారు. తాజాగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో దిండుగల్ జిల్లా కొడైకెనాల్‌కు పరిమితమైనట్టుంది. చదవండి: రాత్రి కర్ఫ్యూ.. ఆదివారం ఫుల్ లాక్డౌన్ -
అమ్మ ఆత్మ క్షమించదు: ఎమ్మెల్యే శాపనార్థాలు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే నుంచి తమను సాగనంపడంలో కీలకపాత్ర పోషించారని పరిశ్రమలశాఖ మంత్రి సంపత్‌పై మహిళా ఎమ్మెల్యే సత్య విరుచుకుపడ్డారు. శాపనార్థాలు పెడుతూ, అమ్మ జయలలిత ఆత్మ సంపత్‌ను క్షమించదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సిట్టింగ్‌లకు మళ్లీ సీటు దక్కలేదన్న విషయం తెలిసిందే. ఇందులో కొందరు అయితే, అన్నాడీఎంకే అధిష్టానాన్ని ఢీకొట్టే రీతిలో రెబల్స్‌గా పోటీ చేయగా, మరి కొందరు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం తరఫున తమ సిట్టింగ్ స్థానాల్లో పోటీ చేశారు. ఇంకొందరు అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి పార్టీ అభ్యర్థుల కోసం శ్రమించారు. రెబల్స్‌గా పోటీచేసిన వారిని, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం తరఫున పోటీ చేసిన వారిని ఇప్పటికే పార్టీ నుంచి అన్నాడీఎంకే తొలగించింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల అనంతరం జిల్లాలు, నియోజకవర్గాల వారీగా గెలుపు అవకాశాలపై అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో కన్వీనర్ పళని స్వామి సుదీర్ఘంగా సమీక్షల్లో ఉన్నారు. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసిన నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు ఈ సమీక్షల్లో హోరెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పరిశ్రమల మంత్రి ఎంసీ సంపత్ ఇచ్చిన ఫిర్యాదుతో శనివారం రాత్రి కడలూరు జిల్లా బన్రూట్టి ఎమ్మెల్యే సత్య, ఆమె భర్త, పార్టీ నేత పన్నీరుసెల్వంతో పాటు ఆరుగుర్ని అన్నాడీఎంకే నుంచి శాశ్వతంగా సాగనంపుతూ ప్రకటన వెలువడింది. అలాగే, మరికొన్ని జిల్లాల నేతలకు నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో ఈరోడ్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కూడా ఉండడం గమనార్హం. ఈరోడ్ జిల్లాల్లో ఇదివరకు సెంగోట్టయన్, కరుప్పన్నన్, తోపు వెంకటాచలం కీలక నేతలుగా ఉండే వారు. వీరి ఆధిపత్యంతో ఈ సారి వెంకటాచలంకు సీటు ఇవ్వలేదు. దీంతో రెబల్‌గా రంగంలోకి దిగిన ఆయన గెలుపు ధీమాతో ఉన్నారు. ఆ జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లో తోపు వెంకటాచలం రాజకీయం సాగడంతో అన్నాడీఎంకే అభ్యర్థులు తీవ్ర కలవరంలో ఉన్నారు. దీంతో ఆ జిల్లాలో పరిస్థితిపై మంత్రులు సెంగోట్టయన్, కరుప్పన్నన్‌లకు అధిష్టానం నోటీసులు ఇవ్వడం గమనార్హం. సంపత్‌కు శాపనార్థాలు.. అకారణంగా తమను పార్టీ నుంచి తొలగించడంలో కీలక పాత్ర పోషించారంటూ మంత్రి సంపత్‌కు ఎమెల్యే సత్య, ఆమె భర్త పన్నీరు సెల్వం శాపనర్థాలు పెట్టే పనిలో పడ్డారు. ఆదివారం మీడియాతో ఎమ్మెల్యే సత్య మాట్లాడుతూ తనకు సీటు నిరాకరించడంతో రాజకీయ, ప్రజాసేవ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించడం జరిగిందన్నారు. ఆ తర్వాత తాను నియోజకవర్గంలోనే లేదని, మనశ్శాంతి కోసం ఆలయ దర్శనాలు, ఆధ్యాత్మిక పర్యటనల్లో నిమగ్నమయ్యానని వివరించారు. భర్త, తాను, మద్దతు నేతలు నియోజకవర్గంలోనే లేనప్పుడు, ఎలా పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా, ప్రత్యర్థులకు మద్దతుగా ఎన్నికల్లో పనిచేసి ఉంటామని ప్రశ్నించారు. తమను ఎలాగైనా అన్నాడీఎంకే నుంచి సాగనంపాలన్న లక్ష్యంతో సంపత్ కుట్ర చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను అమ్మ జయలలిత ఆత్మకూడా క్షమించదంటూ శాపనార్థలు పెట్టే పనిలో పడ్డారు. హోం శాఖను, ఇంటెలిజెన్స్‌ను తన గుప్పెట్లో పెట్టుకున్న సీఎం పళనిస్వామి, వారి ద్వారా విచారించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుంటుందని, తనకు జరిగినట్టుగా అన్యాయం మరెందరికో జరిగిన పక్షంలో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చదవండి: ఫలితాలకు ముందే ఆగిన శ్వాస తమిళనాడు ఎన్నికలు: గెలుపెవరిదో తేల్చేది వాళ్లే! -
ఫలితాలకు ముందే ఆగిన శ్వాస
సాక్షి, చెన్నై: ప్రజా మద్దతుతో అసెంబ్లీలో అడుగుపెడతారనుకున్న కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు మృత్యుఓడిలోకి చేరారు. ఫలితాలకు ముందే కరోనా కబళించింది. రెండు సార్లు నెగటివ్ వచ్చినా, ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన మృతిచెందినట్టు ఆదివారం వైద్యులు ప్రకటించారు. విరుదునగర్ జిల్లా శ్రీవిళ్లిపుత్తూరు అసెంబ్లీ స్థానం కోసం కాంగ్రెస్‌లో పలువురు నేతలు తీవ్రంగానే పట్టుబట్టారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌కే ఆ సీటు దక్కింది. అయితే, అభ్యర్థి ఎంపికలో సాగిన వివాదా ల తర్వాత ఎట్టకేలకు మాధవరావు అలియాస్ సెల్వదురై తన బలాన్ని చాటుకున్నారు. విరుదునగర్ జిల్లా వత్త్రాయిరుప్పులో పుట్టి, న్యాయవాదిగా చెన్నైలో స్థిరపడి, పలు వ్యాపారాల్లో రాణిస్తూ వచ్చిన మాధవరావుకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చింది. దీంతో మార్చి 17న నామినేషన్ వేసిన మూడురోజులకే అనారోగ్యం బా రినపడ్డారు. కరోనా లక్షణాలు ఆయనలో కనిపించడంతో మదురైలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అభ్యర్థి ఆస్పత్రిలో ఉండడంతో కాంగ్రెస్ నేతలు శ్రీవిళ్లిపుత్తూరుకు కదిలారు. చెన్నైలోని మాధవరావు కుమార్తె దివ్య తన చంటిబిడ్డను భుజాన వేసుకుని తండ్రి కోసం ప్రచారంలో పరుగులు తీశారు. ఇన్ఫెక్షన్తో.. ఎన్నికల్లో మాధవరావుపై సానుభూతి చూపిన ఓట ర్లు ఎక్కువే. ఆయన కుమార్తె చంటిబిడ్డను వేసుకుని ఇంటింటా తిరగడంతో తామున్నామని భరోసా ఇచ్చిన గ్రామీణ ఓటర్లు ఎక్కువే. ఆమేరకు ఈనెల ఆరో తేదీన ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆదివారం ఉదయం 7.50 గంటలకు మాధవరావు మరణించినట్టుగా మదురై ప్రైవేటు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయనకు రెండుసార్లు కరోనా నిర్ధారణ పరిశోధన జరిగినట్టు, నెగటివ్ అని వచ్చినా, ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్ కారణంగా గుండెపోటు వచ్చినట్టు ప్రకటించారు. కరోనా లక్షణాలు ఆయనలో కనిపించడంతోనే అందుకు చికిత్స అందించినా, ఫలితం లేకుండా పోయినట్టు వైద్యులు వివరించారు. ఈ సమాచారంతో మాధవరావు కుటుంబం, మద్దతుదారులు కన్నీటిసంద్రంలో మునిగారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. కరోనా నెగటివ్ వచ్చినా, లక్షణాలు కనిపించినట్టుగా వైద్యులు ప్రకటించడంతో భౌతిక కాయాన్ని అందుకు తగ్గ నిబంధనలకు అనుగుణంగా ప్యాకింగ్ చేశారు. సాయంత్రం మదు రై తత్తనేరి శ్మశాన వాటికలో ఆయన భౌతికకాయా న్ని దహనం చేశారు. మాధవరావు సతీమణి సీతై ప్రభుత్వ వైద్యురాలు. ఆమె 2017లో మరణించారు. కుమార్తె దివ్య తండ్రికి తోడుగా ఉంటూ వచ్చారు. నివాళులు.. మాధవరావు మరణ సమాచారంతో సీఎం పళనిస్వా మి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం తమ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకుశాంతి కల్గాలని ప్రార్థించారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సంతాపం తెలుపుతూ విజయకేతనంతో అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిన మాధవరావును ఇలా మృతువు కబళించడం తీవ్ర వేదనకు గురి చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి పేర్కొంటూ ఆ సీటు కోసం పోరాడి, పట్టుబడి సా ధించుకున్న మాధవరావు ఫలితాలకు ముందే దూ రం కావడం ఆవేదన కల్గిస్తున్నదన్నారు. ఇక, ఎన్నికల ప్రధాన అధికారి సత్యబ్రత సాహు పేర్కొంటూ ఆ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదన్నారు. మాధవరావు గెలిచిన పక్షంలో, ఆ నియోజకవర్గం ఖాళీగా ప్రకటించి ఉప ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఆస్పత్రుల్లో అభ్యర్థులు.. ఎన్నికల ప్రచారంలో పరుగులు తీసిన అభ్యర్థులు పలువుర్ని కరోనా తాకిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఆస్పత్రిలో చికిత్సతో కోలుకుని ఇళ్లల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తిరుప్పూర్ ఉత్తరం సిపిఐ అభ్యర్థి రవి అలియాస్ సుబ్రమణ్యం, అరవకురిచ్చి బీజేపీ అభ్యర్థి అన్నామలై తాజాగా కరోనా బారిన పడ్డారు. వీరు ఆస్పత్రిలో ఉన్నారు. థౌజండ్ లైట్స్ బీజేపీ అభ్యర్థి, నటి కుష్బూ భర్త , దర్శకుడు సుందర్ సి కరోనా బారినపడ్డారు. ఆయన ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుష్బూ కోసం తీవ్రంగానే ఎన్నికల విధుల్లో సుందర్ సి నిమగ్నమైన విషయం తెలిసిందే. అయితే, తాను, తన పిల్లలు నాలుగు రోజుల క్రితం పరీక్ష చేసుకోగా నెగటివ్ వచ్చినట్టు కుష్బూ పేర్కొన్నారు. మళ్లీ పరీక్ష చేసుకుంటామని తెలిపారు. చదవండి: తమిళనాడు ఎన్నికలు: గెలుపెవరిదో తేల్చేది వాళ్లే! -
తమిళనాడు ఎన్నికలు: గెలుపెవరిదో తేల్చేది వాళ్లే!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 27 జిల్లాల్లో మహిళా ఓటరే న్యాయ నిర్ణేతలయ్యారు. పది జిల్లాల్లో పురుషాధిక్యం కొనసాగింది. ఒక కోటి 70 లక్షల మంది ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోకుండా తమ బాధ్యతను విస్మరించారు. రాష్ట్రంలోని 37 జిల్లాల్లో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ స్థానాలకు ఆరో తేదీన ఎన్నికలు జరిగాయి. గతంతో పోల్చితే ఈ సారి ఓటింగ్ శాతం కాస్త తగ్గింది. దీంతో గెలుపు ధీమా అభ్యర్థుల్లో ఉన్నా తెలియని టెన్షన్ తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గాలు, జిల్లాల వారీగా ఓట్ల వివరాలు, ఎవరెవరు ఏ మేరకు ఓటు హక్కు వినియోగించుకున్నారో అన్న సమగ్ర వివరాలను ఎన్నికల యంత్రాంగం శనివారం వెబ్సైట్లో పొందుపరిచింది. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ శాతం, జిల్లాల వారీగా శాతాలకు తగ్గ వివరాలను ఇప్పటికే ప్రకటించినా, తాజాగా నియోజకవర్గాల వారిగా పురుషులు, స్త్రీలు, ఇతరులు ఏ మేరకు తమ హక్కును వినియోగించుకున్నారు, ఏ మేరకు విస్మరించారో అన్న విషయాన్ని వివరించారు. మహిళలే అధికం.. రాష్ట్రంలో ఆరు కోట్ల 28 లక్షల 69 వేల 955 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3 కోట్ల 9 లక్షల 23 వే 651 మంది, స్త్రీలు 3 కోట్ల 19 లక్షల 39 వేల 112 మంది ఉన్నారు. మిగిలిన వారు ఇతరులు. ఇందులో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న వారు 4 కోట్ల 57 లక్షల 76 వేల 311 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 2 కోట్ల 26 లక్షల 3 వేల 156, స్త్రీలు 2 కోట్ల 31 లక్షల 71 వేల 736 మంది ఉన్నారు. పురుషుల కంటే స్త్రీలు 5 లక్షల 68 వేల 550 మంది అధికంగా ఓట్లు వేశారు. సాధారణంగా పురుషులే అధికంగా ఓటు హక్కు ఇది వరకు వినియోగించుకునే వారి జాబితాలో ముందుండే వారు. అయితే, ఈ సారి పురుషుల్ని మించి మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని వేలూరు, తిరువణ్ణామలై, నామక్కల్, ఈరోడ్, నీలగిరి, కోయంబత్తూరు, దిండుగల్ వంటి పశ్చిమ పర్వత శ్రేణుల కూడిన జిల్లాల్లోని నియోజకవర్గాలనూ అధికంగా మహిళలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం విశేషం. కుగ్రామాలతో నిండిన పోలింగ్ కేంద్రాల్లోనూ అధికంగా మహిళలు ఓట్లు వేసి ఉండడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాల్లో మహిళలు అత్యధికంగా ఓటు వేశారు. పది జిల్లాల్లో మాత్రం పురుషులు ముందంజలో ఉన్నారు. ఇందులో చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, కృష్ణగిరి, ధర్మపురి, విల్లుపురం వంటి ఉత్తర తమిళనాడు జిల్లాలు ఉన్నాయి. ఇక, ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోకుండా ఎన్నికలకు దూరంగా ఉన్న వాళ్లు కోటి 70 లక్షల 93 వేల 644 మంది ఉన్నారు. తాజా ఎన్నికల్లో మహిళలు అధికంగానే నియోజకవర్గాల్లో ఓటు వేసిన దృష్ట్యా, వారి నిర్ణయమే అభ్యర్థుల తలరాతగా మారనున్నాయి. ఫలితాల రోజున మహిళ ఓటర్లే న్యాయనిర్ణేతలు కాబోతున్నారు. చదవండి: మరో వివాదంలో కమల్ -
మరో వివాదంలో కమల్: వైరల్ పిక్
సాక్షి, చెన్నై: ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్, కమల్ హాసన్‌ను మరో వివాదంలో ఇరుక్కున్నారు. పోలింగ్ రోజు (మంగళవారం) కమల్‌హాసన్ ఒక రిపోర్టర్‌పై దాడి చేశారంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి. రిపోర్టర్‌ను కొట్టానికి ప్రయత్నించారంటూ కోయంబత్తూర్ ప్రెస్ క్లబ్ ఈ ఘటనను ఖండించింది. సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్ పోస్ట్‌లో కమల్‌పై ఆరోపణలు గుప్పించింది. ఈ సందర్భంగా రిపోర్టర్‌ను కొట్టడానికి కమల్ తన వాకింగ్ స్టిక్ పైకి లేపిన చిత్రం వైరల్ అవుతోంది. దీంతో వివాదం రగిలింది. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కమల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రెస్ క్లబ్ డిమాండ్ చేస్తోంది. వీడియోను చిత్రీకరించవద్దని డిమాండ్ చేస్తూ కమల్ అడ్డుకున్నాడని రిపోర్టర్‌ను తన వాకింగ్ స్టిక్ తో కొట్టడానికి ప్రయత్నించాడని క్లబ్ ఆరోపించింది. అదృష్టవశాత్తూ అతడు గాయపడకపోయినా, కర్ర అంచు అనుకోకుండా జర్నలిస్టు మెడకు తగిలి ఉంటేపరిస్థితి దారుణంగా ఉండేదని ఆరోపించింది. ఈ ఘటన తమను, తమ పాత్రికేయ బృందాన్ని షాక్‌కు గురి చేసిందని తెలిపింది. అంతేకాదు దీనికి చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని కూడా హెచ్చరించడం గమనార్హం. అటు న్యూస్ జర్నలిస్ట్ దాడి ఘటనను ఖండించిన కాంగ్రెస్ అభ్యర్థి మయూరా జయకుమార్, బీజేపీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వనాతి శ్రీనివాసన్ కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై అటు కమల్ గానీ, ఎంఎన్ఎం గానీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. இன்று கோவையில் #SunTV செய்தியாளர் மோகனை, மக்கள் நீதி மைய தலைவர் #கமலஹாசன் தாக்கியதாக தகவல் அறிந்தேன் சம்பவத்தை கண்டிக்கின்றேன் உடனடியாக கமலஹாசன் நடந்த சம்பவத்திற்கு மன்னிப்பு கோர வேண்டும் pic.twitter.com/gRgvr5tOWu — Mayura Jayakumar (@MayuraSJ) April 7, 2021 இன்று காலை கோவை ஜிசிடி கல்லூரி வளாகத்தில் திரு கமலஹாசன் அவர்கள் சன் நியூஸ் பத்திரிக்கையாளர் திரு மோகன் அவர்களை தனது கைத்தடியால் தாக்கியதாக கேள்விப்பட்டேன். இது மிகவும் வருத்தத்தை அளிக்கின்றது. — Vanathi Srinivasan (@VanathiBJP) April 7, 2021 -
పోలింగ్ కేంద్రంలో తల్లి.. పసిబిడ్డను ఆడించిన ఏపీ కానిస్టేబుల్
సాక్షి, అనంతపూరం: ఖాకీలు అనగానే.. కటువు మాటలు, కరడు గట్టిన హృదయం, కర్కోటకులు అనే భావన ఏళ్లుగా సమాజంలో స్థిరపడిపోయింది. అయితే పోలీసుల్లో అందరు ఇలానే ఉండరు. వారిలో కూడా మంచి, మానవత్వం ఉంటాయి. ఇందుకు ఉదాహరణగా నిలిచే సంఘటనలను ఎన్నింటినో చూశాం. తాజాగా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మంగళవారం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెల రోజుల పసిబిడ్డను తీసుకుని ఓ తల్లి ఓటు వేయడం కోసం పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఎర్రటి ఎండ.. క్యూలైన్లో నిల్చోవడంతో చిన్నారికి ఉక్కపోత పోసి.. ఏడవడం ప్రారంభించింది. అక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఇది గమనించి.. బిడ్డను తనతో పాటు తీసుకుని టెంట్ కిందకు వచ్చాడు. ఏడవకూడదంటూ ఊరడించాడు. చిన్నారి తల్లి ఓటు వేసి వచ్చేవరకు బిడ్డను ఎత్తుకుని ఆడించాడు. బిడ్డను ఎత్తుకున్న కానిస్టేబుల్ ఫోటోని ఏపీ పోలీస్ శాఖ తన ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతుంది. తమిళనాడులో చోటు చేసుకున్న సంఘటనను, అక్కడి పోలీసు కానిస్టేబుల్ని ఏపీ పోలీసులు ఎందుకు ప్రశంసిస్తున్నారంటే.. సదరు కానిస్టేబుల్‌ది అనంతపురం కాబట్టి. తమిళనాడు ఎన్నికల్లో భాగంగా ఈ కానిస్టేబుల్ అక్కడ విధులు నిర్వహిస్తునాడు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీస్ శాఖ తన ట్విట్టర్లో ‘‘తమిళనాడు ఎన్నికల్లో మానవత్వం చాటుకున్న ఏపీ పోలీసు కానిస్టేబుల్. ఈ అనంతపురం పోలీసు కానిస్టేబుల్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్కడ విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో ఓ తల్లి తన నెల రోజుల పసికందును తీసుకుని ఓటు వేయడం కోసం పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఇక ఆ మహిళ ఓటు వేసి వచ్చేవరకు ఆ చిన్నారిని ఎత్తుకుని ఆడించాడు. ఈ కానిస్టేబుల్ చేసిన పనిని అక్కడున్న వారందరు ప్రశంసించారు’’ అంటూ ట్వీట్ చేసింది. #APPolice's humane face at #TamilNaduElections: @AnantapurPolice constable deployed to #TamilNadu for #TamilNaduElections2021 carried & lulled a 1-month-old crying baby until the mother's return from the voting booth, winning the hearts of many.#AndhraPradesh#Elections2021 pic.twitter.com/vk0DO2doJN — Andhra Pradesh Police (@APPOLICE100) April 6, 2021 ఏపీ పోలీసు శాఖ సదురు కానిస్టేబుల్ పేరును వెల్లడించలేదు. ఈ ఫోటోని చూసిన వారంతా తెగ ప్రశంసిస్తున్నారు. గుడ్ జాబ్.. హ్యాట్సాఫ్ అంటూ పొగుడుతున్నారు. ఇక తమిళనాడు 38 జిల్లాలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3998 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఈ నెల 6న ఎన్నికలు జరిగాయి. 62.86 శాతం ఓటింగ్ నమోదయ్యింది. మే 2న వీరి భవితవ్యం తేలనుంది. చదవండి: తమిళ ఎన్నికల్లో ‘అనంత’ పోలీసుల సేవలు -
ఇది ప్రభుత్వంపై స్టార్ హీరోల నిరసన గళమా?
చెన్నె: ఎంతో ఉత్కంఠ రేపిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మంగళవారం ముగిశాయి. ఓటేసేందుకు అగ్ర తారలు తరలివచ్చినప్పటికీ సాధారణ ఓటర్లు అంతగా ఆసక్తి కనబర్చలేదని పోలింగ్ శాతం చూస్తే అర్ధమవుతోంది. అయితే పోలింగ్ రోజు పలు ఆసక్తికర సంఘటనలు తమిళనాడులో చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సినీ నటులు వినూత్నంగా ఓటేయడానికి ముందుకువచ్చారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూపర్‌స్టార్ రజనీకాంత్ ఓటేయడానికి వచ్చారు. తదనంతరం నటీనటులు, సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఓటేసేందుకు తరలివచ్చారు. ఈ క్రమంలో అగ్రనటులు అజిత్, విజయ్, విక్రమ్, శింబు తదితరులు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జయం రవి ముఖ్యంగా వారు వేసుకున్న మాస్క్‌లతో పరోక్షంగా డీఎంకే పార్టీకి మద్దతు తెలిపినట్లు సమాచారం. అజిత్, విజయ్, విక్రమ్, శింబు తదితరులు నలుపు రంగు మాస్క్ ధరించి ఓటేసేందుకు వచ్చారు. డీఎంకే పార్టీ జెండాలో నలుపు ఉంటుంది. అందుకే ఆ పార్టీకి ఓటేయాలని పరోక్షంగా పిలుపునిచ్చినట్లుగా తమిళనాడులో చర్చ నడుస్తోంది. దీంతోపాటు విజయ్ సైకిల్ మీద రావడం తమిళనాడే కాక తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చ సాగింది. అయితే విజయ్ పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండడానికి నిరసనగా సైకిల్‌పై వచ్చినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజున అభిమానులు, ఓటర్లకు ఆ విషయం గుర్తు చేసేందుకు విజయ్ సైకిల్ ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక నటుడు విక్రమ్ కూడా పోలింగ్ కేంద్రానికి నడుచుకుంటూ వచ్చాడు. ఆయన కూడా ఇదే విషయం ప్రస్తావించేందుకు నడుచుకుంటూ వచ్చాడని సమాచారం. శింబు ఈ చర్యలతో పరోక్షంగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లు అందరూ భావిస్తున్నారు. దీనిపై తమిళనాడులో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ పరిణామం అధికార పార్టీకి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇక అగ్రనటుడు రజనీకాంత్, సూర్య, కార్తీ తెల్లటి మాస్క్ ధరించి వచ్చారు. ఓటేసే సమయంలో నటుడు అజిత్ ఓ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటేయడానికి వచ్చే సమయంలో ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా అతడి ఫోన్‌ను లాగేసుకున్నాడు. మరికొద్దిసేపటి తర్వాత వార్నింగ్ ఇచ్చేసి ఫోన్ తిరిగిచ్చేశాడు. చదవండి: బెంగాల్ మినహా పూర్తయిన ఎన్నికలు.. పోలింగ్ శాతం ఇలా.. -
తమిళనాడు ఎన్నికలు: ఓటు వేసిన ప్రముఖుల ఫోటోలు
-
5 రాష్ట్రాల ఎన్నికలు: నేడే కీలక పోలింగ్
సాక్షి, చెన్నై/కోల్‌కతా/తిరువనంతపురం: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమయ్యింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో మంగళవారం ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాంలో మూడో విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. చివరి గంటలో ఓటు వేసేందుకు కరోనా బాధితులను అనుమతిస్తారు. వీరి కోసం ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పశ్చిమ బెంగాల్లో మూడో దశలో 31 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. 78.5 లక్షల మంది ఓటు వేయనున్నారు. 31 స్థానాల్లో 205 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ జరుగనుండడంతో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2.74 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. 957 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1980వ దశకం నుంచి కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వస్తున్నాయి. ఈసారి ఎల్డీఎఫ్ మళ్లీ గెలిస్తే అది కొత్త చరిత్ర సృష్టించినట్లే అవుతుంది. అస్సాంలో మూడో దశలో(చివరి దశ) 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 337 మంది అభ్యర్థుల జాతకాన్ని ఓటర్లు నిర్దేశించబోతున్నారు. చివరి దశ ఎన్నికల్లో 25 మంది మహిళా అభ్యర్థులు సైతం పోటీ పడుతున్నారు. 11,401 పోలింగ్ కేంద్రాల్లో 79.19 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తమిళనాడులో సర్వం సిద్ధం తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 88,936 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో డీఎంకే–కాంగ్రెస్ కూటమి, అన్నాడీఎంకే– బీజేపీ, మక్కల్ నీదిమయ్యం–ఐజేకే, ఎస్ఎంకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం–డీఎండీకే, ఎస్డీపీఐ పార్టీలు కూటమిగా ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. ఇక నామ్ తమిళర్ కట్చి ఒంటరిగా పోటీ చేస్తోంది. 3,998 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1.58 లక్షల మంది పోలీసులు, పారా మిలటరీ సిబ్బందితో భద్రత కల్పించారు. ఐదు చోట్ల ఎన్నికల రద్దుకు పట్టు డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ పోటీ చేస్తున్న కొళత్తూరు, ఆయన తనయుడు బరిలోకి దిగిన చేపాక్కం–ట్రిప్లికేన్, పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ పోటీ చేస్తున్న కాట్పాడి, డీఎంకే పార్టీ సీనియర్ నేతలు ఏవీ వేలు(తిరువణ్ణామలై), కేఎన్ నెహ్రు (తిరుచ్చి పశ్చిమం) నియోజకవర్గాల్లో నగదు పంపిణీ జరిగిందని అధికార అన్నాడీఎంకే ఆరోపించింది. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అన్నాడీఎంకే నేత, మంత్రి జయకుమార్ నేతృత్వంలోని బృందం ఎన్నికల కమిషనర్ సత్యప్రద సాహును కలిసి ఫిర్యాదు చేసింది. చిన్నమ్మ ఓటు గల్లంతు దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళకు ఓటు హక్కు లేకుండా పోయింది. 2017లో ఆమె అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. జయలలితతో పాటు శశికళ, ఆమె వదిన ఇలవరసిలతో సహా 12 మంది పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలోనే ఉండేవారు. ప్రసుత్తం అందరి పేర్లు ఓటర్ల జాబితాలో గల్లంతయ్యాయి. ఈ నిలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్మారక మందిరంగా మార్చేయడంతోనే ఆ చిరునామాలో ఉన్న పేర్లన్నింటినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. శశికళకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ ఆమె తరఫు న్యాయవాది రాజచెందూర్ పాండియన్ ఈసీకి విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం. -
పాపం శశికళ: ఓటర్ జాబితాలోనూ తొలగింపు?
చెన్నె: జైలు నుంచి విడుదలై రాజకీయాల్లో సంచలనం రేపుతారని అందరూ భావించే సమయంలో అకస్మాత్తుగా ‘రాజకీయాలకు స్వస్తి’ పలికిన వీకే శశికళకు మరో షాక్ తగిలింది. ఆమెను రాజకీయాల నుంచి తప్పించినట్టు.. ఓటేసే అవకాశం కూడా ఇవ్వలేదని తమిళనాడులో చర్చ నడుస్తోంది. శశికళ పేరు ఓటర్ జాబితాలో లేదు. దీంతో తమిళనాడులో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘రాజకీయాల్లోకి రానివ్వరు.. కనీసం ఓటు కూడా వేయనివ్వరా? అని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఆమె మేనల్లుడు, ఏఎంఎంకే అధినేత టీవీవీ దినకరన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటరు జాబితాలో శశికళ పేరు కనిపించకపోవడం ముఖ్యమంత్రి పళనిస్వామినే బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు. శశికళ ఓటేయకుండా అన్నాడీఎంకే చేసిందని మండిపడ్డాడు. 234 స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. చదవండి: మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా చదవండి: ముఖ్యమంత్రికి భారీ ఊరట -
రేపే పోలింగ్ : భారీ నగదు, నగలు పట్టివేత
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున నగలు నగదు పట్టుబడింది. అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని గంటల్లో పప్రారంభం కానున్న నేపథ్యంలో మొత్తం 428 కోట్ల రూపాయల విలువైన నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న వాటిలో 225.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా, బంగారంతో సహా విలువైన లోహాలు 176.11 కోట్లు ఉన్నట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మద్యం కూడా పట్టుబడింది. గత 24 గంటలలో కరూర్, కోయంబత్తూర్, తిరుప్పూర్ , చెన్నైలు భారీ దాడులు నిర్వహించినట్టు ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గత కొన్ని వారాలుగా ఈ దాడులు జరిగాయన్నారు. ఇందులో కరూర్ అగ్రస్థానంలో ఉండగా, కోయంబత్తూర్, తిరుప్పూర్, చెన్నై తరువాతి స్థానాల్లో నిలిచాయి. తాజాగా రాణిపేట జిల్లాలో రూ. 91.56 లక్షలు, చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో 1.23 కోట్ల రూపాయలు, సేలం వీరపాండి వద్ద 1.15 కోట్ల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా గత నెలలో, ఆదాయపు పన్ను శాఖ 16 కోట్లకు పైగా అక్రమ నగదును స్వాధీనం చేసుకుంది.అలాగే ఎన్నికల నిఘాలో భాగంగా రాష్ట్రంలో పలు సంస్థలపై దాడుల తరువాత సుమారు రూ. 80 కోట్ల బ్లాక్ మనీని గుర్తించింది. కాగా 234 నియోజకవర్గాల్లో మంగళవారం పోలింగ్ షురూ కానుంది. తమిళనాట సింగిల్-ఫేజ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే ప్రచార పర్వం ముగిసి నసంగతి తెలిసిందే. -
ఎన్నికల ప్రచారం: కమల్ హాసన్‌పై కేసు
పరస్పర దూషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రెండు నెలలపాటు హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమాప్తమైంది. చివరి రోజు ఆదివారం అన్నిపార్టీలూ సుడిగాలి ప్రచారం సాగించాయి. నేతల ఉపన్యాసాలతో హోరెత్తిన మైకులు, లౌడ్స్పీకర్లు రాత్రి 7 గంటల తరువాత ఒక్కసారిగా మూగబోయాయి. సాక్షి, చెన్నై: హిందువులు ఆరాధించే దేవుళ్లను ప్రచారంలో వాడుకున్న అభియోగంపై ఎంఎన్ఎం అధ్యక్షుడు కమల్ హాసన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కోయంబత్తూరు దక్షిణం నుంచి పోటీచేస్తున్న కమల్ ప్రచార వాహనంలో శ్రీరాముడు, అమ్మవారి వేషాలతో ఉన్న వ్యక్తులు కమల్ పార్టీ పతాకాన్ని పట్టుకుని ప్రయా ణించారు. వీరిద్దరూ మన దేవుళ్లే, అయితే వీరిని అడ్డుపెట్టుకుని కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దీనిపై కొందరు ఫిర్యాదు చేయడంతో కమల్ సహా ముగ్గురిపై కాట్టూరు పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు పెట్టారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో అన్నాడీఎంకే–బీజేపీ, డీఎంకే–కాంగ్రెస్ కూటములు సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం సాగించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ అగ్రనేతలు తమిళనాడుకు తరలివచ్చారు. అధికార కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రులు స్మృతీఇరానీ, నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే ప్రతిపక్ష కూటమిని బలపరుస్తూ ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ, కర్ణాటక సీనియర్ నేత వీరప్పమెయిలీ ప్రచారం చేశారు. తమిళనాడులో ఈనెల 3వ తేదీన తొలిసారి ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక పర్యటన రద్దయింది. ఇక స్థానికంగా అన్నాడీఎంకే రథ సారథులైన సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం తమ నియోజకవర్గాలతోపాటు ఒకరి నియోజకవర్గంలో ఒకరు ప్రచారం చేశారు. చదవండి: అలా అయితే సినిమాలు మానేస్తా: కమల్ హాసన్ కూటమి అభ్యర్థులకు మద్ధతుగా అనేక నియోజకవర్గాల్లో పర్యటించారు. డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ సైతం తీవ్రస్థాయిలో ప్రచారం సాగించారు. ఎన్నికల షెడ్యూలు విడుదల కాకముందే ప్రజలను ఆకట్టుకునేందుకు ‘మీ నియోజకవర్గంలో స్టాలిన్’ పేరున సభలు నిర్వహించారు. ఐజేకే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ అదే కూటమికి చెందిన సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్, ఆయన సతీమణి రాధికతో కలిసి ప్రచారం సాగించారు. కమల్ కుమార్తె అక్షర, అన్న కుమార్తె నటి సుహాసిని సైతం నడిరోడ్డుపై నృత్యంతో ప్రచారాన్ని రక్తికట్టించారు. ఇక అన్నాడీఎంకే అసంతృప్త ఓట్లపైనే ఆధారపడి బరిలోకి దిగిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పెద్ద ఎత్తున ప్రచారం సాగించారు. అన్నాడీఎంకే శ్రేయస్సును కోరి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు జయలలిత నెచ్చెలి శశికళ ప్రకటించినా ఆమె అన్న కుమారుడు దినకరన్ పోటీకి దిగడం గమనార్హం. చదవండి: కమల్ హాసన్ కూతురితో నటి తీన్మార్ స్టెప్పులు! నేతల తుది పిలుపు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరిరోజు ఆదివారం ప్రధాన పార్టీ నేతలు ఓటర్లకు తుది పిలుపునిచ్చారు. ఎండలు మండిపోతున్నా చిరునవ్వు చిందిస్తూ ఓపెన్‌టాప్ వాహనంలో ప్రయాణించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కన్యాకుమారి, తిరునల్వేలి, చెన్నై జిల్లాల్లో పర్యటించారు. అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించాలని సేలంలో సీఎం ఎడపాడి అన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు ఎడపాడిని కలిసి మద్దతు ప్రకటించారు. రేపటి ఎన్నికల పోలింగ్‌లో ప్రజలు అన్నాడీఎంకే ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఓటు వేస్తారని పేర్కొంటూ చెన్నైలో స్టాలిన్ ప్రచారం చేశారు. జేపీ నడ్డా ప్రచారంలో కమల్ పాట బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కన్యాకుమారి లో ఆదివారం ప్రచారం చేశారు. ఈ సమయంలో స్థానిక అన్నాడీఎంకే కార్యకర్తలు హిందీ పాటలను మైకుల ద్వారా ప్రసారం చేశారు. అయితే అకస్మాత్తు గా కమల్‌హాసన్ హీరోగా నటించిన పున్నగైమన్నన్ చిత్రంలోని ‘ఎన్న సత్తం ఇంద నేరం’ (ఇలాంటి సమయంలో ఏమిటీ శబ్దం) అనే పాట ప్రసారం కావడంతో అందరూ బిత్తరపోగా, బీజేపీ కార్యకర్తలు తేరుకుని వెంటనే ఆపాట ఆపండి అంటూ కేకలు వేయడంతో ఆగిపోయింది. ప్రచారం చేస్తే రెండేళ్ల జైలు: ఈసీ ప్రచార పర్వం ముగిసి ఈనెల 6వ తేదీన పోలింగ్ జరగనున్న దృష్ట్యా పార్టీ పనుల నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతో స్వస్థలాలకు వెళ్లిపోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. లాడ్జీలు, అతిథిగృహాలు, కల్యాణమండపాల్లో బసచేసిన ఉన్న వారు ఖాళీ చేయాలని కోరింది. గడువు ముగిసిన తరవాత ప్రచారం చేసిన వారికి రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తామని ఈసీ హెచ్చరించింది. -
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ప్రచార పర్వానికి తెర
చెన్నై/తిరువనంతపురం/గువాహటి/కోల్‌కతా: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రం 7 గంటలకు తెరపడింది. పశ్చిమ బెంగాల్, అస్సాంలో మూడో దశ ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. ఇన్నాళ్లూ అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజకీయ పార్టీల నేతలు ఇక ఓట్ల లెక్కల్లో మునిగిపోయారు. ఈ నెల 6న(మంగళవారం) జరిగే ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. కీలకమైన తమిళనాడుపై అందరి దృష్టి నెలకొంది. తమిళనాట 3,998 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ముఖ్యమంత్రి కె.పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, డీఎంకే నేత ఎం.కె.స్టాలిన్, సినీ నటుడు కమల్ హాసన్ తదితర ప్రముఖులు ఎన్నికల బరిలోకి దిగారు. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా, 6.28 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కేరళలో చివరి రోజు ప్రచారాన్ని నేతలు హోరెత్తించారు. భారీ రోడ్డు షోలు, ర్యాలీలు నిర్వహించారు. ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో జన సమూహాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ ఎవరూ పెద్దగా లెక్కచేయలేదు. రాష్ట్రంలోని 140 నియోజకవర్గాల్లో ఆదివారం భారీ సభలు జరిగాయి. కాంగ్రెస్ నేత రాహుల్ ఉత్తర కోజికోడ్, తిరువనంతపురం జిల్లాల్లో, సీఎం విజయన్ కన్నూరులో రోడ్డు షోల్లో పాల్గొన్నారు. ఆఖరి రోజు కనిపించని హడావుడి పుదుచ్చేరిలో పలు నియోజకవర్గాల్లో ఆఖరి రోజు ఎన్నికల ప్రచారంలో హడావుడి కనిపించలేదు. రాష్ట్రంలో 30 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని సెక్యులర్ డెమొక్రటిక్ అలయెన్స్, ఎన్డీయే నేతృత్వంలోని ఏఐఎన్ఆర్సీ మధ్యే ప్రధానమైన పోటీ సాగుతోంది. అస్సాంలో మూడో దశ ఎన్నికలు మంగళవారం జరుగనున్నాయి. రాష్ట్రంలో ఇవే చివరి దశ ఎన్నికలు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమికి, అధికార బీజేపీ నేతృత్వంలోని కూటమికి మధ్య హోరాహోరి పోరు సాగుతోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా, నెగ్గాలని కాంగ్రెస్ కూటమి ఆరాట పడుతోంది. పశ్చిమ బెంగాల్లో మూడో దశ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యింది. దక్షిణ 24 పరగణాల జిల్లా, హుగ్లీ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 31 స్థానాల్లో ప్రచారం ముగిసింది. మూడో దశలో 205 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ జరుగనుండడంతో అధికారులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. -
తమిళులకు డీఎంకే–కాంగ్రెస్ ద్రోహం చేశాయి: నడ్డా
సాక్షి ప్రతినిధి, చెన్నై: పదేళ్ల యూపీఏ పాలనలో తమిళనాడు ప్రజలకు డీఎంకే–కాంగ్రెస్ కూటమి మేలు చేయకపోగా తీరని ద్రోహం చేసిందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి లోక్‌సభ ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల కూటమి అభ్యర్థుల కోసం ఆయన ఆదివారం ప్రచారం చేశారు. తిరునల్వేలిలోనూ పర్యటించారు. ‘కుటుంబరాజకీయం, అవినీతిమయ పాలనలో ఆరితేరిన డీఎంకే, కాంగ్రెస్‌లతో దేశానికి అరిష్టం. తమిళనాడులో జల్లికట్టు క్రీడపై నిషే«ధానికి కాంగ్రెస్ హయాంలో పర్యావరణశాఖ మంత్రిగా ఉన్న జైరాం రమేష్ కారణం. ఆనాడు యూపీఏలో భాగస్వామి అయిన డీఎంకే ఈ నిషేధంపై నోరుమెదపలేదు. 2జీ కుంభకోణమే డీఎంకే మౌనానికి కారణం. మోదీ ప్రధాని అయిన తరువాతనే తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై నిషేధం తొలగింది’అని అన్నారు. పశ్చిమబెంగాల్లో రెండో విడత పోలింగ్‌లో బీజేపీ గాలి వీచిందని అన్నారు. కేరళలో స్వల్ప మెజార్టీతోనైనా అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉందని చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
అలా అయితే సినిమాలు మానేస్తా: కమల్ హాసన్
సాక్షి, కోయంబత్తూరు: ఒకవేళ తన రాజకీయ జీవితానికి సినిమాలు అడ్డంకి అయితే, వాటిని వదిలేస్తానని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ చెప్పారు. ఆయన ఆదివారం కోయంబత్తూరులో మాట్లాడారు. ప్రజలకు సేవ చేయాలన్నదే తన ఆశయమన్నారు. తాను రాజకీయాల్లో ప్రవేశించడం చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. దివంగత ఎంజీఆర్ ఎన్నో సినిమాల్లో ఎమ్మెల్యేగా నటించారని, రాజకీయాల్లో సీఎం పదవి చేపట్టి, ప్రజలకు సేవ చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక తాను రాజకీయాల నుంచి తప్పుకొని, మళ్లీ సినిమాలు చేసుకుంటానని చాలామంది అంచనా వేస్తున్నారని గుర్తుచేశారు. రాజకీయాల నుంచి ఎవరు తప్పుకుంటారో చూద్దామని, అది ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడించారు. ఎన్నికల ప్రచార ఖర్చులను తాను నిజాయతీగా ఎన్నికల సంఘానికి తెలియజేశానని అన్నారు. అందుకు ఎన్నికల సంఘం అధికారులు తనను అభినందించారని చెప్పారు. -
కమల్ హాసన్ కూతురితో నటి తీన్మార్ స్టెప్పులు!
సాక్షి, చెన్నై: విశ్వనటుడు కమల్ హాసన్ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజాకర్షణ లక్ష్యంగా ఆగమేఘాలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. కమల్‌కు మద్దతుగా ఆ నియోజకవర్గంలో సినీ నటి, ఆయన అన్న చారుహాసన్ కుమార్తె సుహాసిని కూడా సుడిగాలి ప్రచారంలో భాగమయ్యారు. వీరికి తోడుగా కమల్ కూతురు అక్షర హాసన్ కూడా క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె తరచూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కమల్‌కు ఓటేయడంటూ అక్షర, సుహాసిని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో వీళ్లిద్దరూ డప్పు చప్పుళ్లకు తీన్మార్ డ్యాన్స్‌లు చేసి జనాలను ఆకట్టుకున్నారు. బ్యాండ్ సౌండ్‌కు ఎంతో ఎనర్జిటిక్‌గా స్టెప్పులేసిన వీరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: కమల్ పార్టీ అభ్యర్థి ఇంట్లో రూ.10 కోట్ల నగదు స్వాధీనం ఒకే వేదికపై మామ అల్లుడు (రజనీకాంత్, ధనుష్)కు అవార్డులు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1691347313.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మహిళలను అవమానిస్తారా?
సాక్షి ప్రతినిధి, చెన్నై/మదురై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆయా పార్టీల నేతలు మహిళలను దారుణంగా అవమానిస్తున్నారని ఆరోపించారు. ఆయన శుక్రవారం మదురై, కన్యాకుమారిలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ సమగ్రాభివృద్ధి, సౌభాగ్యవంతమైన సమాజం కోసం కలలుగన్నారని, ఆయన దార్శనికత తమకు స్ఫూర్తినిస్తోందని చెప్పారు. డీఎంకే, కాంగ్రెస్ కూటమికి ఒక అజెండా అంటూ లేదని ఎద్దేవా చేశారు. ఆ కూటమి అధికారంలోకి వస్తే శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిస్తాయని, ప్రజల రక్షణ, గౌరవానికి గ్యారంటీ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు మూర్ఖులు కాదని, అబద్ధాలు చెప్పడం మానుకోవాలని డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు హితవు పలికారు. కాంగ్రెస్, డీఎంకేలు సిగ్గుపడాలి ‘‘నారీశక్తి, మహిళల సాధికారతతో మదురై ప్రాంతం ముడిపడి ఉంది. మహిళల ప్రగతిని కాంక్షిస్తూ ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్ వంటి పథకాలను అమలు చేస్తున్నాం. డీఎంకే, కాంగ్రెస్ నేతలు మహిళలను పదేపదే అవమానిస్తున్నారు. శాంతిభద్రతలకు మారుపేరైన మదురైని మాఫియా రాజ్యంగా మార్చేందుకు గతంలో డీఎంకే ప్రయత్నించింది. 2011లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం జల్లికట్టు క్రీడలను నిషేధించింది. అప్పుడే డీఎంకే నేతలు కేంద్రంలో మంత్రులుగా ఉన్నప్పటికీ నోరు మెదపలేదు. జల్లికట్టును కాంగ్రెస్ నేత ఒకరు క్రూరమైన క్రీడగా అభివర్ణించారు. అందుకు కాంగ్రెస్, డీఎంకేలు సిగ్గుపడాలి. తమిళ ప్రజల మనోభావాలు మాకు తెలుసు. జల్లికట్టును కొనసాగిస్తూ ఏఐఏడీఎంకే ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను మేము(కేంద్రం) ఆమోదించాం. ప్రజల కోసం పని చేసేవారిపై అబద్ధాలను ప్రచారం చేసే విద్యలో కాంగ్రెస్, డీఎంకే ఆరితేరాయి. ఆ పార్టీలు చాలా ఏళ్లు అధికారంలో ఉన్నాయి. మదురైకి ఎయిమ్స్‌ను తీసుకురావాలన్న ఆలోచన చేయలేకపోయాయి. మా ప్రభుత్వం మదురైకి ఎయిమ్స్‌ను మంజూరు చేసింది. తమిళనాడుతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 130 కోట్ల భారతీయులకు నిజాయతీగల మార్పును అందించింది. ప్రతి భారతీయుడి స్వేదంతోనే జాతి నిర్మాణం ప్రజలకు సేవ చేసే విషయంలో వారి కులం, నమ్మకాలను మేము చూడం. మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడుతాం. ప్రస్తుతం తమిళ జాలర్లు ఎవరూ శ్రీలంక అదుపులో లేరు. కాంగ్రెస్, డీఎంకే పెద్దలు వారి కుమారులు, కుమార్తెలు, మనవళ్లను పదవుల్లో కూర్చోబెట్టాలని ఆరాటపడుతున్నారు. ప్రజల కుమారులు, కుమార్తెల గురించి వారు పట్టించుకోవడం లేదు. ప్రతి భారతీయుడి స్వేదంతోనే జాతి నిర్మాణం జరిగింది. కేవలం ఒకటి రెండు కుటుంబాలకు చెందిన నాలుగు తరాలతో కాదు. కుటుంబ, వారసత్వ రాజకీయాలను దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారు’’ అని ప్రధాని మోదీ వివరించారు. -
‘ఐటీ దాడులా...ఎంకే స్టాలిన్ ఇక్కడ’!
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ఎన్నికల వేడి మరింత రాజుకుంది. ముఖ్యంగా డీఎంకే నేతల ఇళ్లపై ఐటీ దాడులు ప్రకంపనలు రేపుతున్నాయి. ఆదాయపన్ను శాఖ సోదాలపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. తన కుమార్తె, అల్లుడు ఇంటిపై శుక్రవారం నాటి ఐటీ దాడులపై ఘాటుగా స్పందించారు. అలాగే తమిళనాడులోని కల్లకూరిచిలో డీఎంకె వ్యవస్థాపకుడు అన్నాదురై విగ్రహానికి నిప్పంటించిన ఘటననుకూడా స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. (ఎన్నికల వేళ, డీఎంకేకు ఐటీ వరుస షాక్స్) పెరంబలూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఎన్ని ఐటీ దాడులు చేసిన తమ పార్టీకి భయపడేది లేదని తెగేసి చెప్పారు. అంతేకాదు తాము ఏఐఎడిఎంకె నాయకులు కాదని ప్రధాని మోదీ తెలుసుకోవాలన్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏఐఎడిఎంకె ప్రభుత్వాన్ని మోదీ సర్కార్ కాపాడుతోంది. కానీ తాను కలైంగర్ (దివంగత డీఎంకె నేత ఎం కరుణానిధి) కొడుకుననే విషయాన్ని మర్చిపోవద్దని ప్రధానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను మిసాను, ఎమర్జెన్సీని చూశాను..ఇలాంటి వాటికి భయపడను.. బీజేపీ తప్పుడు విధానాలకు ప్రజలు ఏప్రిల్ 6 న స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని స్టాలిన్ స్పష్టం చేశారు. అలాగే డీఎంకే వ్యవస్తాపకుడు అన్నాదురై విగ్రహాలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఐటీ దాడులపై డీఎంకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాగా డీఎంకేనేతలు, సంబంధిత వ్యక్తుల నివాసాలపై వరుస ఐటీ దాడులు తమిళనాట కాక పుట్టించాయి. స్టాలిన్ అల్లుడు శబరీశన్ నివాసంలో ఆదాయ పన్ను శాఖ శుక్రవారం దాడులు చేపట్టింది. చెన్నై నగరానికి సమీపంలోని నీలాంగరాయ్‌లోని శబరీశన్ నివాసం, ఆయనకు చెందిన మరో నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో డీఎంకే నేత సెంథిల్ బాలాజీ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ దాడి నిర్వహించింది. -
‘మా అమ్మ మృతిని అపవిత్రం చేశారు’
చెన్నె: బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రుల మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టార్చర్ కారణమని సినీ నటుడు, డీఎంకే యువ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి ఒత్తిడి తట్టుకోలేకనే సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ మృతి చెందారని ఆరోపించారు. అయితే ఈ విమర్శలపై తాజాగా వారి వారసులు స్పందించారు. ఎన్నికల వేళ రాజకీయాల కోసం తమ తల్లి, తండ్రి పేర్ల ప్రస్తావన సరికాదని ఉదయనిధికి విజ్ఞప్తి చేశారు. ‘మీరు చేసిన వ్యాఖ్యలతో మా కుటుంబం తీవ్రంగా బాధపడింది. మా అమ్మ మృతిని అపవిత్రం చేశారు. రాజకీయాల కోసం డీఎంకే ఇంత దిగజారింది’ అని సుష్మ స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ట్వీట్లో పేర్కొంది. ఉదయనిధి వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ కుమార్తె సోనాలి జైట్లీ భక్షి కూడా స్పందించింది. ‘ఉదయనిధి గారు మీరు ఎన్నికల ఒత్తిడిలో ఉన్నారని నాకు తెలుసు. మీరు అబద్ధం చెప్పారు. మా నాన్నను అగౌరవపరుస్తున్నారు. అరుణ్‌జైట్లీ, నరేంద్ర మోదీ మధ్యం రాజకీయంగా కాకుండా గొప్ప బంధం ఉంది. ఆ స్నేహాన్ని తప్పుపట్టవద్దని కోరుతున్నా’ అని సోనాలీ ట్వీట్ చేసింది. సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ బీజేపీలో అగ్ర నాయకులు. వాజ్‌పేయి హయాంలో వీరిద్దరు కేంద్ర మంత్రులుగా పని చేయగా అనంతరం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కూడా ఉన్నారు. సుష్మ, జైట్లీ 2019 ఆగస్టులో అనారోగ్యంతో మృతి చెందారు. ఇప్పుడు వారి మరణం తమిళనాడు ఎన్నికల్లో ప్రస్తావనకు రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించకుండా వారి వారసులు స్పందించడం గమనార్హం. ఉదయనిధి స్టాలిన్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. ఇటీవల ఎయిమ్స్ ఇటుక అంటూ ఇటుక చూయించి హాట్ టాపిక్‌గా మారాడు. అతడి ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా ఉండేలా కనిపిస్తోంది. @udhaystalin ji please do not use my Mother's memory for your poll propaganda! Your statements are false! PM @Narendramodi ji bestowed utmost respect and honour on my Mother. In our darkest hour PM and Party stood by us rock solid! Your statement has hurt us @mkstalin @BJP4India — Bansuri Swaraj (@BansuriSwaraj) April 1, 2021 .@Udhaystalin ji, I know there is election pressure - but I won't stay silent when you lie & disrespect my father's memory. Dad @arunjaitley & Shri @narendramodi ji shared a special bond that was beyond politics. I pray you are lucky enough to know such friendship...@BJP4India — Sonali Jaitley Bakhshi (@sonalijaitley) April 1, 2021 -
అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళునాట ఐటి దాడుల కలకలం
-
ఎన్నికల వేళ, డీఎంకేకు ఐటీ వరుస షాక్స్
సాక్షి చెన్నై: తమిళనాడులోరానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే నాయకులపై వరుస ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అల్లుడి నివాసం ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. స్టాలిన్ అల్లుడి శబరీశన్‌కు చెందిన నాలుగు ప్రదేశాల్లో శుక్రవారనం ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. నీలంగరైలో ఉన్న ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. స్టాలిన్ కూతురు సెంతమారై తన భర్త శబరీశన్‌తో పాటు అక్కడే నివసిస్తున్నారు. కాగా ఏప్రిల్ 6 న జరిగనున్న ఎన్నికలకు ముందు డీఎంకే నేతలు, పార్టీతో సంబంధం ఉన్న వారిపై జరిపిన దాడుల్లో ఇది రెండోసారి. ఇళ్లపై ఐటీ దాడులు జరగడం ఇది రెండవసారి.గత నెలలో డీఎంకే నేత ఈ వేలూ నివాసంతోపాటు 10 కి పైగా చోట్ల ఐటీశాఖ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలను బెదిరించేందుకు బీజేపీతో జతకలిసిన కూటమి పన్నిన పన్నాగమని, ఇది రాజకీయ కుట్ర అంటూ డీఎంకే నేతలు ఖండించారు. -
డీఎంకే, కాంగ్రెస్‌లకు కుటుంబమే ముఖ్యం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే, బీజేపీ ప్రజా సంక్షేమానికి అంకితమైన పాలనను అందిస్తుంటే, డీఎంకే, కాంగ్రెస్‌లు తమ హయాంలో కుటుంబ ప్రయోజనాలకు పాటుపడ్డాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దుయ్యబట్టారు. తమిళనాడు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను బలపరుస్తూ గురువారం ప్రచారం చేశారు. పుదుచ్చేరీలో ఉదయం రోడ్‌షో ముగించుకుని మధ్యాహ్నం తమిళనాడు రాష్ట్రం విళుపురం జిల్లా తిరుక్కోయిలూరులో జరిగిన బహిరంగ సభలో అమిత్‌షా ప్రసంగించారు. మహిళలను, మాతృమూర్తులను కించపరుస్తూ అసభ్య పదజాలం ప్రయోగించే డీఎంకే–కాంగ్రెస్ కూటమికి ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. ‘ఎన్డీఏకూ అవినీతితో కూడిన డీఎంకే–కాంగ్రెస్ కూటమికి మధ్య పోటీ జరుగుతోంది. తమిళనాడును పాలించిన ఎంజీఆర్ నిజమైన ప్రజా సేవకునిగా వెలుగొందారు. దేశంలో పేద ప్రజల కోసం పాటుపడిన వ్యక్తులు ఎవరని సగర్వంగా గుర్తించాల్సి వస్తే ముందు ఎంజీఆర్, ఆ తర్వాత జయలలిత పేర్లను ప్రకటించాలి’అని ఆయన కోరారు. ప్రజా పరిపాలనలో జయలలిత అందరికీ ముఖ్యంగా మహిళలకు ఆదర్శంగా నిలిచారని శ్లాఘించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ మార్గదర్శకంలో పళనిస్వామి, పన్నీర్‌సెల్వం అభివృద్ధి దిశగా జనరంజక పాలన అందిస్తున్నారన్నారు. డీఎంకే, కాంగ్రెస్‌లకు లంచాలు, రౌడీయిజం, భూ కబ్జా, కుటుంబ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం అని విమర్శించారు. ఎంజీఆర్ సేవలకు గుర్తింపుగా చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌కు ఆయన పేరునే పెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కిందని చెప్పారు. ఇటీవలే కన్నుమూసిన ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి తల్లిని ఉద్దేశించి ఇటీవల డీఎంకే నేత రాజా చేసిన కించపరిచే వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా చేశాయని చెప్పారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని డీఎంకే నేతలు అసభ్య పదజాలాన్ని ప్రయోగిస్తున్నారన్నారు. గతంలో జయలలితను సైతం డీఎంకే దూషించిన సంగతిని ప్రజలు మరువజాలరని చెప్పారు. జల్లికట్టుపై నిషేధానికి కారణం రాహుల్‌గాంధీ, అయితే నేడు అదే జల్లికట్టు గురించి డీఎంకే, కాంగ్రెస్ నేతలు అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. నేడు మధురైలో ప్రధాని మోదీ ప్రచారం ప్రధాని నరేంద్రమోదీ గురువారం రాత్రి మధురైకి చేరుకున్నారు. 2వ తేదీన మధురై, కన్యాకుమారిల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం తదితరులు ఆయనతోపాటు ప్రచారంలో పాల్గొంటారు. -
‘సీఎం అక్రమ సంతానం’: రెండు రోజులు నిషేధం
చెన్నె: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు పళని స్వామిపై ‘అక్రమ సంతానం’ అని చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసిన డీఎంకే నాయకుడు, మాజీ ఎంపీ ఎ.రాజాపై మండిపడింది. ఈ సందర్భంగా ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఎన్నికల సంఘం రెండు రోజుల పాటు ప్రచారం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎ.రాజ రెండు రోజుల పాటు ఎక్కడ కూడా ప్రచారం చేయొద్దు. డీఎంకే అధినేత స్టాలిన్ గొప్పతనం చేస్తూ సీఎం పళనిస్వామిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్రమ సంబంధ జంటకు పళనిస్వామి జన్మించారని చెపాక్‌లో జరిగిన ప్రచారంలో రాజా ఆరోపించారు. ప్రీమెచ్చుర్‌గా పళని పుట్టాడని, ఢిల్లీకి చెందిన డాక్టర్ నరేంద్ర మోదీ హెల్త్ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర దుమారం రేపాయి. అన్నాడీఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేయగా ఈ వ్యాఖ్యలపై సీఎం పళనిస్వామి స్పందించారు. తన తల్లిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై భావోద్వేగానికి గురయ్యారు. దేవుడు వారిని శిక్షిస్తారని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే నాయకులు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం స్పందించి అతడి వివరణ గురువారం తీసుకుంది. ఆ వివరణతో సంతృప్తి చెందని ఎన్నికల సంఘం డీఎంకే స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న రాజాను తొలగించడంతోపాటు రెండు రోజుల పాటు ప్రచారం చేయొద్దని నిషేధం విధించింది. రాజా వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని, మహిళలను కించపరిచేలా ఉండడంతో పాటు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు కిందకు వస్తుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు రాజాకు ఆ శిక్ష విధించింది. -
ఓట్లు అమ్ముకుంటే మంచి నాయకులు ఎలా వస్తారు?
సాక్షి, చెన్నై: ఓటును నోటు, బిర్యానీకి, బాటిల్‌కు అమ్ముకుంటే..ఎలా మంచి నాయకుల్ని ఎదురు చూడగలమని మదురై ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ఉచితా పథకాలతో సోమరితనం పెరిగినట్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషన్ ముందు 20 ప్రశ్నల్ని ఉంచి, సమాధానాలు ఇవ్వాల్సిందేనని న్యాయమూర్తి హుకుం జారీ చేశారు. మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో కడయనల్లూరుకు చెందిన చంద్రమోహన్ వాసుదేవనల్లూరు నియోజకవర్గాన్ని జనరల్ కేటగిరి పరిధిలోకి తీసుకొచ్చే రీతిలో ఈసీని ఆదేశించాలని కోరుతూ గతంలో ఓ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయమూర్తులు కృపాకరణ్, పుహలేంది బెంచ్ ముందుకు వచ్చింది. ఈసందర్భంగా ఇటు ప్రజ లకు, అటు రాజకీయపక్షాలకు, ఎన్నికల యంత్రాంగానికి చురకలు అంటించే రీతిలో, అక్షింతలు వేస్తూ న్యాయమూర్తులు తీవ్రంగా స్పందించారు. అమ్మేసుకుంటే ఎలా.. నోటుకు, కానుకలకు, బిర్యానీ, మందు బాటిళ్లకు ఓట్లను అమ్మేసుకుంటే, ఎలా మంచి నాయకులు సేవల్ని అందించేందుకు వస్తారని ప్రజల్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సామాజిక సంక్షేమం, పేదరిక నిర్మూలన అంటూ ప్రకటించే ఉచిత పథకాలు ప్రజల్ని సోమరి పోతులుగా మార్చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత పథకాల వాగ్ధానాలు ఇచ్చే పార్టీలను నిషేధించ వచ్చుగా అని ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో అనేక పార్టీలు ఇస్తున్న వాగ్దానాలు చూస్తుంటే, కళ్లు బైర్లు కమ్మేసుకున్నట్టుందని పేర్కొన్నారు. గృహిణిలకు నెలకు ఒకరు రూ. వెయ్యి ఇస్తామంటే, తాము రూ.1500 ఇస్తామంటూ పోటా పోటీగా హామీలను రాజకీయ పక్షాలు ఇచ్చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసే వాళ్లకే తమ ఓటు అంటూ తమను తాము అవినీతి పరులుగా ప్రజలు చూపించుకుంటుండడం విచారకరంగా పేర్కొన్నారు. ఈసీకి 20 ప్రశ్నలు.. అనేక పార్టీలు ఇస్తున్న వాగ్దానాలు, చేస్తున్న ప్రకటనలు ఆచరణలో అమలు చేయలేని రీతిలో ఉన్నా యని న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు స్థానిక సమస్యలు, స్థానిక ప్రగతి, అభివృద్ధి, విద్య, వైద్య, మౌలిక సదుపాయలపై దృష్టి పెడితే చాలు అని హితవు పలికారు. ఇటీవల తమిళనాడులో చిన్న చిన్న దుకాణాల్లోనూ ఉత్తరాది వాసులే అధికంగా పనుల్లో కనిపిస్తున్నారని పేర్కొంటూ, మున్ముందు వలసలు వచ్చిన వాళ్లు యజమానులుగా, ఇక్కడి వారు కూలీలుగా మారే పరిస్థితులు తప్పవేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా ఉచితాలకే ప్రధాన్యత ఉంటూ వస్తున్నదని పేర్కొంటూ, ఎన్నికల కమిషన్ ముందు 20 ప్రశ్నల్ని న్యాయమూర్తులు ఉంచారు. 2013లో సుబ్రమణ్య బాలాజీ కేసులో ఇచ్చిన తీర్పు మేరకు ఉచిత వాగ్దానాలు, ఆచరణలో అమలు చేయలేని వాగ్దానాల క్రమబద్ధీకరణకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుందో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ఈ తీర్పును ఎన్నికల్లో ఏ మేరకు అమలు చేశారో, వాగ్దానాలు ఎన్నింటిని తిరస్కరించారా, పార్టీలు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాయో, అందులో ఏ మేరకు అమలయ్యేయో అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఉచితాల పేరిట ప్రజల్ని సోమరిపోతులుగా మార్చేస్తున్న పార్టీలకు నిషేధం విధించవచ్చుగా, గెలిచిన అభ్యర్థి అధికారంలోకి వచ్చాక, ఎన్ని వాగ్దానాల్ని సక్రమంగా నెరవేర్చాడో అనే ప్రశ్నల్ని అడుగుతూ వీటన్నింటికి వివరణ ఇవ్వాలని ఈసీని ఆదేశించారు. తర్వాత విచారణను ఏప్రిల్ 26వ తేదీకి వాయిదా వేశారు. -
చిదంబరం కోడలి వీడియోతో బీజేపీ ప్రచారం
సాక్షి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కోడలు, ఎంపీ కార్తీ చిదంబరం సతీమణి శ్రీనిధి భరత నాట్యం బీజేపీ ఎన్నికల ప్రచార అస్త్రంగా మారింది. బీజేపీ ప్రచార ట్విట్లో తన వీడియో కనిపించడంతో శ్రీనిధి తీవ్రంగా ఖండించారు. తమిళనాట ఎన్నికల ప్రచారం వేడెక్కి ఉన్న విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం సాగుతోంది. ఆ దిశగా బీజేపీ విడుదల చేసిన ప్రచార వీడియోలో ఓ మహిళ భరత నాట్యం చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. అయితే, ఆ నాట్యం చేస్తున్న మహిళ కాంగ్రెస్ సీనియర్, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కోడలు శ్రీనిధి కావడంతో వివాదానికి దారి తీసింది. తన వీడియోను ఉపయోగించి బీజేపీ ప్రచారం చేయడాన్ని పరిశీలించిన ఆమె ఇది ఖండించ దగ్గ విషయంగా పేర్కొన్నారు. ఎన్ని ప్రయత్నాలు, కుస్తీలు పట్టినా, కమలంకు తమిళనాట చోటు లేదని, పాదం మోపడం కష్టతరమేని అదే ప్రచార ట్వీట్లో శ్రీనిధి కామెంట్లు పెట్టారు. అయితే, కొన్నేళ్ల క్రితం డీఎంకే అధికారంలో ఉన్న సమయయంలో జరిగిన సెమ్మోళి మహానాడులో చిత్రీకరించిన వీడియోగా ఆ నాట్య ప్రదర్శనను గుర్తించారు. దీనిని పరిశీలించకుండానే బీజేపీ వర్గాలు తమ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవడం గమనార్హం. చదవండి: 66 ఏళ్ల ఆంటీ.. నోరు అదుపులో పెట్టుకో! -
నా మాటల్ని వక్రీకరించారు: రాజా
సాక్షి, చెన్నై: తన వ్యాఖ్యలను వక్రీకరించి బయటకు విడుదల చేశారని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు డీఎంకే ఎంపీ రాజా వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై సమగ్ర, న్యాయబద్ధంగా విచారణ జరగాలని కోరారు. పెరంబలూరు ఎన్నికల ప్రచారంలో డీఎంకే ఎంపీ రాజా చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. సీఎం పళనిస్వామి, ఆయన తల్లిని కించపరిచే రీతిలో రాజా వ్యాఖ్యలు చేశారంటూ అన్నాడీఎంకే వర్గాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఆయనపై చర్యకు పట్టుబడుతూ అన్నాడీఎంకే నేతృత్వంలో నిరసనలు సైతం సాగాయి. సీఎం పళనిస్వామి సైతం ఆయన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఎన్నికల ప్రచారంలో ఉద్వేగానికి లోనయ్యారు. సీఎం ఉద్వేగానికి గురికావడంతో మనసు నొప్పించి ఉంటే మన్నించండి అంటూ రాజా క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని తీవ్రంగానే పరిగణించిన ఎన్నికల కమిషన్ వివరణ కోరుతూ రాజాకు నోటీసులు జారీ చేసింది. న్యాయవాదితో వివరణ రాజా స్వయంగా వచ్చి ఈసీ సాహుకు వివరణ ఇస్తారన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే తన న్యాయవాది పచ్చయప్పన్ ద్వారా రాజా వివరణ లేఖను కేంద్ర, రాష్ట్ర కమిషన్లకు పంపించారు. అందులో తాను ఎన్నికల ఆదాయం కోసం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించ లేదని వివరించారు. తానేదో వ్యాఖ్యలు చేసినట్టుగా అన్నాడీఎంకే, బీజేపీలు తీవ్రంగా దుమారం రేపుతున్నాయని, వాస్తవానికి తన వ్యాఖ్యల్ని కత్తిరించి, వక్రీకరించి బయటకు వీడియోల రూపంలో విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర, న్యాయబద్ధంగా విచారణ జరిగితే, తాను ఏ తప్పు చేయలేదన్నది, వ్యాఖ్యలు చేయలేదనేది స్పష్టం అవుతోందన్నారు. సీఎం ఉద్వేగానికి గురయ్యారన్న సమాచారంతో ఒక వేళ తానేమైనా తప్పు చేశానా.. అని భావించి మనసు నొప్పించి ఉంటే మన్నించాలని క్షమాపణ కూడా కోరినట్టు గుర్తు చేశారు. అన్నాడీఎంకే వర్గాలు తనపై మోపిన ఆరోపణలకు సంబంధించిన ఫిర్యాదు నకలు అందించాలని, ఆ మేరకు పూర్తి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. -
వైరల్: ఆగ్రహంతో ‘టార్చ్‌లైట్’ విసిరిన కమల్ హాసన్
చెన్నె: రాజకీయాలు అంటే ఆషామాషీ కాదు. ఎంతో ఓపిక.. సహనం ఎంతో ఉండాలి. క్షణికావేశాలకు గురయితే పతనమే. ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ అసహనానికి గురయ్యారు. ఎప్పుడూ లేనిది కోపం ప్రదర్శించారు. ఈ సందర్భంగా తన పార్టీ గుర్తుగా ఉన్న ‘టార్చ్‌లైట్’ను విసిరేశారు. కాన్వాయ్‌లో ఉండగా ఏదో విషయమై అసంతృప్తికి గురయి టార్చ్‌లైట్ విసిరివేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దక్షిణ కోయంబత్తూరు నుంచి అసెంబ్లీకి కమల్ హాసన్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్ హాసన్ ఆ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నారు. కాన్వాయ్‌లో వెళ్తూ అభివాదం చేస్తున్నాడు. ఈ క్రమంలో మాట్లాడుతుండగా కమల్ మైక్రోఫోన్ పని చేయలేదు. ప్రజలకు ఆయన మాటలు వినకపోవడం గమనించి వాహనంలో ఉన్న వారిని అడిగారు. ‘ఏమైంది?’ అని.. ఎంతకీ మైక్రోఫోన్ సరిగా పని చేయకపోవడంతో కమల్ హాసన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వెంటనే ఎడమ చేతిలో ఉన్న తన పార్టీ గుర్తు ‘టార్చ్‌లైట్’ను వాహసంలోపలికి విసిరేశారు. వాహనంలో ఉన్న వ్యక్తిపై పడేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు ట్రోల్ చేస్తూ కమల్ అంత కోపం వద్దు.. అంటూ హితవు పలుకుతున్నారు. -
కొత్త ఈవీఎంలే ఉపయోగిస్తాం: హైకోర్టుకు స్పష్టం చేసిన ఈసీ
సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ఈవీఎంలనే ఉపయోగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈమేరకు మంగళవారం మద్రాసు హైకోర్టుకు వివరణ ఇచ్చింది. 2017 తర్వాత తయారైన ఈవీఎంలనే వినియోగించనున్నట్లు వెల్లడించింది. అలాగే శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను రాజకీయ పార్టీలకు ఇవ్వలేమని తెలిపింది. సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించనున్న ఈవీఎంలపై పలువురు అనుమానం వ్యక్తం చేశారు. సుమారు 15ఏళ్ల నాటి ఈవీఎంలనే ప్రస్తుతం వాడబోతున్నారని ఆరోపించారు. దీనిపై డీఎంకే నేత ఆర్ఎస్ భారతి మద్రాసు హైకోర్టులో పిటీషన్ వేశారు. పాత ఈవీఎంలను వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని సమస్యాత్మక కేంద్రాల జాబితాను ప్రకటించాలని పేర్కొన్నారు. ఈ పిటీషన్‌ను మంగళవారం ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ తరఫున న్యాయవాదులు మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 11వేలసమస్మాత్మక కేంద్రాలను గుర్తించామన్నారు. ఈ విషయమై ఈ నెల 26వ తేదీన అన్ని పార్టీలతో చర్చించినట్లు తెలిపారు. అదే విధంగా, శాంతిభద్రతల దృష్ట్యా జాబితాను ప్రకటించలేమని స్పష్టం చేశారు. పారదర్శకంగా పోలింగ్ నిర్వహించేందుకు 44వేల కేంద్రాల్లో వెబ్ కెమెరాలను అమర్చనున్నట్లు వివరించారు. ప్రస్తుత ఎన్నికల్లో 2017 తర్వాత తయారై ఈవీఎంలనే వినియోగిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలను సైతం పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కోర్టుకు విన్నవించారు. ఈసీ వాదనతో కోర్టు ఏకీభవించింది. విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికలను శాంతియుత వాతావరణంలో జరిపించాలని సూచించింది. శరవేగంగా ఏర్పాట్లు ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. పోలింగ్‌కు సమయం సమీపిస్తుండడంతో ఎన్నికల కమిషనర్ సాహు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఈ మేరకు మంగళవారం ఈసీ సాహు మాట్లాడుతూ ఏప్రిల్ 5వ తేదీ నాటికి పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసుకోవాలని ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లా కేంద్రాల నుంచి పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లను తెప్పించుకోవాలని సూచించారు. ముమ్మరంగా తనిఖీలు.. కేసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. పొల్లాచ్చిలో డీఎంకే, అన్నాడీఎంకే వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. దీంతో మంగళవారం ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే ఈరోడ్ సత్యమంగళంలో డీఎంకే కార్యకర్తలు ఓ హోటల్‌ను ధ్వంసం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పుదుకోట్టైలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు రూ.2వేల నోట్లతో సిద్ధం చేసిన కవర్లను ఫ్లైయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. చెన్నై అన్నానగర్‌లో అధికారులు నిర్వహించిన తనిఖీలో రూ.48 లక్షలు పట్టుబడింది. మధురై తిరుమంగళంలో ఓటుకు నోటు పంచుతూ అన్నాడీఎంకే కార్యకర్తలు కెమెరాకు చిక్కడంతో ఎన్నికల అధికారులు విచారణ చేపట్టారు. రాయపురంలో 250 గ్యాస్ స్టౌలు, తిరునల్వేలిలో రూ.13 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, కాంచీపురంలో 3.5 కేజీల నగలు పట్టుబడ్డాయి. ఈ క్రమంలోనే తిరువణ్ణామలైలో డీఎంకే అభ్యర్థి ఏవీ వేలు ఇంట్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించి రూ. 25 కోట్ల మేర లెక్కల్లో లేని ఆదాయమున్నట్లు తేల్చారు. తపాలా ఓటు హల్చల్! సామాజిక మాధ్యమాల్లో తపాలా ఓటు ప్రత్యక్షం కావడంపై ఎన్నికల కమిషన్ విచారించి ముగ్గురిపై కేసు నమోదు చేసింది. తెన్కాశిలోని కృష్ణవేణి అనే ఉపాధ్యాయిని తన తపాలా ఓటును ఫొటో తీసి భర్త గణేశ్ పాండ్యన్‌కు పంపించారు. ఆయన తన సమీప బంధువు సెంథిల్ పాండ్యన్‌కు ఫార్వర్డ్ చేశారు. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించింది. విచారించిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. చదవండి: కమల్ హాసన్‌పై గౌతమి ఫైర్ సీఎం ‘అక్రమ సంతానం’ వ్యాఖ్యలపై రాజా క్షమాపణ -
కమల్ హాసన్‌పై గౌతమి ఫైర్
తమిళ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ప్రధాన పార్టీలు పరస్పర విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఆకాశమే హద్దుగా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నాయి. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ సవాళ్లు.. ప్రతి సవాళ్లకు దిగుతున్నాయి. ముఖ్యంగా సీఎం ఎడపాడి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మధ్య మాటల తూటాలను పేలుతున్నాయి. మహిళలను అవమానించిన డీఎంకే నేతలకు బుద్ధి చెప్పాలని ఎడపాడి పిలుపునిస్తే.. అవినీతి అన్నాడీఎంకేను ఓడించాలని స్టాలిన్ కోరుతున్నారు. అమ్మ పాలన కొనసాగాలంటే రెండాకులకే ఓటెయ్యాలని పళనిస్వామి విన్నవిస్తుంటే.. ఉదయ సూర్యుడిని గెలిపిస్తే ప్రజా హక్కులను కాపాడుతామని హామీ ఇస్తున్నారు. మరోవైపు మక్కల్ నీది మయ్యం తరఫున కమల్‌హాసన్ ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తుండడంతో నేతలు తీవ్రస్థాయిలో వాగ్బాణాలు సంధిస్తున్నారు. సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈక్రమంలో అన్నాడీఎంకే, డీఎంకే మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పరస్పరం ఘాటు విమర్శలతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. మహిళా ద్రోహి డీఎంకేకు బుద్ధి చెప్పండి : ఎడపాడి మహిళలను కించపరుస్తూ దుర్భాషలాడిన డీఎంకే నేతలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ముఖ్య మంత్రి ఎడపాడి పళనిస్వామి పిలుపునిచ్చారు. సోమవారం చెన్నై మైలాపూర్, అశోక్‌నగర్, టీ నగర్ నియోజకవర్గాల్లో ఆయన ముమ్మరంగా ప్రచారం చేశారు. చెన్నై మేయర్‌గా, మంత్రిగా ఏళ్ల తరబడి పనిచేసిన స్టాలిన్ ప్రజల కోసం ఏమీ చేయలేదని విమర్శించారు. కుటుంబ ప్రయోజనాలే లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. మహిళలను చులకనగా చూసే డీఎంకేను ఓడించాలని కోరారు. రెండాకులకు ఓటేసి గెలిపిస్తే ఇంటి వద్దకే రేషన్ సరుకులు చేరుస్తామని హామీ ఇచ్చారు. అమ్మ జయలలిత ఆశయాలను నెరవేర్చేలా పాలన సాగిస్తామన్నారు. ఆరు నెలల వంట గ్యాస్ ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. మనీ కోసమే ‘మణి’ల ఆరాటం : స్టాలిన్ అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ముగ్గురు ‘మణి’లు మనీ కోసం ప్రజలను యథేచ్ఛగా దోచుకున్నారని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆరోపించారు. తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేటలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. ఎడపాడి పళనిస్వామి కేబినెట్లోని మంత్రులు వేలుమణి, తంగమణి, కేసీ వీరమణి ప్రజాధనం లూటీ చేశారని మండిపడ్డారు. కేసీ వీరమణి, అతని బినామీల ఇళ్లపై నాలుగేళ్ల క్రితం ఐటీ దాడులు జరిగినా ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. ఉదయ సూర్యుడికి ఓటేసి డీఎంకేను గెలిపిస్తే ప్రజా హక్కులను కాపాడుతామని హామీ ఇచ్చారు. డీఎంకే నేత, ఎంపీ కనిమోళి తిరుచెందూరులో ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అన్నాడీఎంకేకు తగిన గుణపాఠం నేర్పా లని పిలుపునిచ్చారు. అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కమల్ మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గ ప్రజలతో ఆన్లైన్లో ముచ్చటించారు. రమ్య అనే అభిమాని మిమ్మల్ని నేరుగా చూడాలని ఉందన్నారు. ఆదివారం రాత్రి కామరాజపురంలో ప్రచారానికి వచ్చిన కమల్ ప్రసంగం మధ్యలో ఆమె పేరును పేర్కొంటూ ఆహ్వానించారు. ప్రచార వాహనం వద్దకు వచ్చిన నిండు గర్భిణి అయిన రమ్యకు డైరీలో ఆటోగ్రాఫ్ ఇచ్చి ఆనందపరిచారు. కమల్‌పై గౌతమి ఫైర్ కమల్‌కు హీరోయిన్గా అనేక సినిమాల్లో నటించిన గౌతమి.. కొన్నేళ్లపాటు ఆయనకు సన్నిహితరాలిగా మెలిగారు. ఆ తర్వాత ఇద్దరూ మనస్పర్థలతో విడిపోయారు. ఈ క్రమంలో కమల్‌పై గౌతమి పలు విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో మార్పు తీసుకొస్తానని కమల్ చెబుతున్నారని, అయితే ఆ మార్పును ప్రజలు కోరుకుంటున్నారో.. లేదో మే 2న తెలిసిపోతుందని చెప్పారు. మార్కెటింగ్ మాయాజాలంలో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. -
సీఎం ‘అక్రమ సంతానం’ వ్యాఖ్యలపై రాజా క్షమాపణ
చెన్నె: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో వ్యక్తిగత దూషణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ, డీఎంకే నాయకుడు ఎ.రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం పళనిస్వామి, డీఎంకే అధినేత స్టాలిన్‌పై అక్రమ సంబంధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఆ వ్యాఖ్యలపై రాజా మళ్లీ స్పందించారు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు కోరారు. తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం పడుతున్నట్లు రాజా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చెపాక్‌లో ఇటీవల జరిగిన ప్రచార కార్యక్రమంలో రాజా మాట్లాడుతూ సీఎం పళని స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్రమ సంబంధ జంటకు పళనిస్వామి జన్మించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రీమెచ్చుర్‌గా పళని పుట్టాడని, ఢిల్లీకి చెందిన డాక్టర్ నరేంద్ర మోదీ హెల్త్ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అన్నాడీఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేయగా ఈ వ్యాఖ్యలపై సీఎం పళని ఆదివారం స్పందించారు. తన తల్లిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై భావోద్వేగానికి గురయ్యారు. దేవుడు వారిని శిక్షిస్తారని ప్రచార సభలో పేర్కొన్నారు. అనంతరం సోమవారం ఏ.రాజ ఆ వ్యాఖ్యలపై స్పందించారు. ‘నా వ్యాఖ్యల ఉద్దేశం వ్యక్తిగతం కాదు. రాజకీయంగా మాత్రమే విమర్శలు చేశా’ అని రాజా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా క్షమాపణలు ప్రకటించారు. అయితే ఆ వ్యాఖ్యలు చేసినందుకు అన్నాడీఎంకే నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు కూడా నమోదైంది. దీంతోపాటు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సీఎంని స్టాలిన్ చెప్పుతో పోల్చిన నాయకుడు -
నా కుమారుడి ప్రసంగాలు చూసి నేనే ఆశ్చర్యపోయా!
సాక్షి, చెన్నై: తన కుమారుడు ఉదయనిధి ఏ రంగంలోనైనా రాణించగలడని దుర్గా స్టాలిన్ వ్యాఖ్యానించారు. చేపాక్కం – ట్రిప్లికేన్ నియోజకవర్గంలో ఉదయనిధి పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా తల్లి దుర్గా స్టాలిన్ ప్రచారానికి సిద్ధం అయ్యారు. స్టాలిన్ పోటీ చేస్తున్న కొళత్తూరులో ఆమె పర్యటిస్తున్నారు. కొందరు మహిళతో కలిసి ఇంటింటా వెళ్లి కరపత్రాలు అందిస్తూ స్టాలిన్‌ను ఆదరించాలని, గెలిపించాలని విన్నవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆమెను మీడియా చుట్టుముట్టి ప్రశ్నల్ని అడగ్గా, సమాధానాలు ఇచ్చారు. అది పార్టీ నిర్ణయం.. ఉదయ నిధి రాజకీయాల్లోకి రావడమే కాదు, చేస్తున్న ప్రసంగాలను చూసి తానే ఆశ్చర్యానికి లోనయ్యానని పేర్కొన్నారు. తన కుమారుడికి సీటు ఇవ్వాలని స్టాలిన్‌ను తాను కోరలేదని, అది పార్టీ తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. తన బిడ్డ రాజకీయాల్లో రాణిస్తాడని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అధికారంలోకి వస్తే ఉదయనిధికి మంత్రి పదవి గ్యారంటీ అన్నట్టుందే అని ప్రశ్నించగా, అది పార్టీ తీసుకునే నిర్ణయం మేరకు ఉంటుందన్నారు. స్టాలిన్ గెలుపు కోసమే కాదు, డీఎంకే కూటమిలోని అందరు అభ్యర్థుల గెలుపు కోసం తాను పూజలు చేస్తున్నానని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. చదవండి: ‘ఇటుక’ చుట్టూ తమిళ రాజకీయం.. ఉదయనిధిపై ఫిర్యాదు -
‘ఇటుక’ చుట్టూ తమిళ రాజకీయం
చెన్నె: కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని తమిళ యువ నాయకుడు, డీఎంకే అధినేత స్టాలిన్ తనయుడు ఉదయనిధి వ్యంగ్యంగా విమర్శలు చేశాడు. అయితే ఆ విమర్శలు విన్న ప్రజలంతా నవ్వుకుంటుండగా బీజేపీకి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆ యువ నేత ‘ఇటుక’ దొంగతనం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విచిత్ర సంఘటన తమిళనాడులో జరిగింది. ఈ పరిణామంతో ఇటుక చుట్టూ తమిళ రాజకీయంగా తిరుగుతోంది. గత మంగళవారం ఉదయనిధి స్టాలిన్ సత్తూరులో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఇచ్చిన ప్రధాన హామీని ప్రస్తావించి ఇరుకున పెట్టాడు. వాస్తవంగా మధురైకి ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి మధురైలోని తొప్పూర్లో 250 ఎకరాలు కేటాయించారు కూడా. ఆ పనులకు 2019 జనవరి 27వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆ పనులేవీ సాగలేదు. దీనిని విమర్శిస్తూ ‘ఇదిగో మధురై ఎయిమ్స్ తీసుకొచ్చా’ అని ప్రచార ర్యాలీలో ఉదయనిధి ఓ ఇటుకను చూయించాడు. దానిపై నిమ్స్ అని రాసి ఉంది. ఇది చూసిన ప్రజలంతా ఫక్కున నవ్వారు. ఇది బీజేపీ తీరు అంటూ ఎయిమ్స్ ఇంకా నిర్మించలేదని ఎద్దేవా చేస్తూ ఇటుకను చూయించాడు. ఈ ఇటుకనే ఎయిమ్స్ అని ఉదయనిధి చెప్పాడు. మూడేళ్లల్లో అన్నాడీఎంకే, బీజేపీ ఏమీ చేసిందని ప్రశ్నించారు. అయితే ఇక్కడితో వివాదం సమసిపోలేదు. ఆ ఇటుకను ఉదయనిధి దొంగతనం చేశాడని ఓ బీజేపీ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం మరో వింత. ఎయిమ్స్‌లోని ఓ ఇటుకను ఉదయనిధి దొంగతనం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ నిర్మాణాన్ని కాపాడాలని ఆ బీజేపీ నాయకుడు పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ఆ ఇటుకను తిరిగి తీసుకోవాలని కోరాడు. ఈ ఫిర్యాదును చూసి పోలీసులు అవాక్కయ్యారు. -
అసెంబ్లీ ఎన్నికలు: చరిత్ర పునరావృతమే!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం. అది అసాధ్యమని తేలితే కనీసం ప్రత్యర్థి గెలుపు అవకాశాలు దెబ్బతీయాలని అభ్యర్థులు ఆశించడం రాజకీయాల్లో సహజం. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే కూటముల విజయావకాశాలను దెబ్బతీయడం కోసమే అన్నట్లుగా కొన్ని పార్టీలు రంగంలో ఉన్నాయి. ఈ పార్టీలు ఏ కూటమికి కంటకంగా మారాయి, ఏ అభ్యర్థి గెలుపును ఎంత వరకు దెబ్బతీస్తాయని విశ్లేషించుకోక తప్పదు. అప్పుడు కాంగ్రెస్ హవా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం (తమిళనాడు)లో 1952, 1957, 1962 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించినా ఆ దూకుడుకు డీఎంకే అడ్డుకట్టవేసింది. 1967లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్‌ను ఓడించి డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఇక ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగా తల ఎత్తుకు తిరిగే పరిస్థితినే కోల్పోయేలా చేసిన ఘనత డీఎంకేకు మాత్రమే దక్కుతుంది. 1967 నాటి డీఎంకే చారిత్రాత్మక గెలుపుతో అన్నాదురై ముఖ్యమంత్రి అయ్యారు. కరుణానిధి- ఎంజీ రామచంద్రన్ మధ్య విభేదాలు అన్నాదురై మరణం తరువాత 1971లో వచ్చిన ఎన్నికల్లో సైతం డీఎంకే ఘనవిజయం సాధించగా ఆపార్టీ అధ్యక్షులు కరుణానిధి సీఎం పీఠం అధిరోహించారు. కరుణానిధితో అభిప్రాయబేధాలు వచ్చి పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎంజీ రామచంద్రన్ 1972 అక్టోబర్ 17న అన్నాడీఎంకేను స్థాపించారు. 1977లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఎంజీఆర్ విజయపరంపర 1980, 1984 ఎన్నికల్లో సైతం కొనసాగింది. తన 70 ఏళ్ల వయసులో 1987 డిసెంబర్ 24వ తేదీన ఎంజీఆర్ కన్నుమూసిన తరువాత పార్టీ చీలిపోగా, 1989 ఎన్నికల్లో డీఎంకే మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఎంజీఆర్ కన్నుమూసిన తరువాత జయలలిత పార్టీ పగ్గాలు చేపట్టి కరుణానిధిని గట్టిగా ఢీకొట్టడం ప్రారంభించారు. 1991- 2016 వరకు వారిద్దరే 1991లో జయలలిత, 1996లో కరుణానిధి, 2001లో జయలలిత, 2006లో కరుణానిధి, 2011లో జయలలిత ఒకరు సీఎం అవుతూ వచ్చారు. అయితే 2016లో వచ్చిన ఎన్నికల్లో జయలలిత వరుసగా రెండోసారి గెలుపొంది అనాధిగా వస్తున్న ఆనవాయితీకి అడ్డుకట్ట వేశారు. ఎంజీఆర్ జీవించి ఉన్నత వరకు అధికారానికి దూరంగా ఉండక తప్పనిపరిస్థితిని ఎదుర్కొన్న డీఎంకే ఆ తర్వాత మాత్రమే గెలుపు బాటలోకి ప్రయాణించడం ప్రారంభించింది. ఎంజీఆర్‌తో సమానంగా జయలలిత కూడా కరుణకు పోటీగా నిలిచారు. ఇక రాజకీయాల్లో బలశాలులైన జయ, కరుణ ఇద్దరూ కన్నుమూసిన తర్వాత ఆ రెండు పార్టీలు తొలి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. తమిళనాడులో 1952 నుంచి ఇప్పటి వరకు 15 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలన్నీ అనేక ప్రత్యేక ప్రాతిపధికలతో పోటీకి దిగి విజయం సాధించాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మూడో పార్టీకి అవకాశం లేకుండా పోయింది. ఎంజీఆర్ మరణం తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే జయలలిత వర్గం, జానకి వర్గంగా విడిపోయింది. ఈ సమయంలో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉండిన జీకే మూపనార్ మూడో కూటమిని ఏర్పాటు చేశారు. అయినా, ఆనాటి ఎన్నికల్లో డీఎంకేనే విజయం సాధించింది. 1996లో డీఎంకే నుంచి విడిపోయిన వైగో ఎండీఎంకేను స్థాపించి మూడో అతిపెద్ద పార్టీగా మార్చే ప్రయత్నం చేశారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విడిపోయిన జీకే మూపనార్ తమిళ మానిల కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి డీఎంకేతో కూటమిగా ఏర్పడ్డారు. రజనీకాంత్ పరోక్ష మద్దతుతో ఈ కూటమి అప్పటి ఎన్నికల్లో విజయం సాధించింది. మూడో అతిపెద్ద పార్టీగా ఏర్పడాలనే లక్ష్యంతో అన్నాడీఎంకే, డీఎంకే తరువాత మూడో అతిపెద్ద పార్టీగా ఏర్పడాలనే లక్ష్యంతో నటుడు విజయకాంత్ డీఎండీకేను స్థాపించి తొలి ఎన్నికల్లో తాను మాత్రమే గెలుపొందారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకున్నారు. అయితే ఆ తరువాత అమ్మతో విభేదించగా, 2016 ఎన్నికల్లో విజయ్‌కాంత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టి వైగో నాయకత్వంలో ఏర్పడిన ప్రజాసంక్షేమ కూటమి ఘోర ఓటమి చవిచూసింది. ఇలా రాష్ట్ర రాజకీయల చరిత్రలో అన్నాడీఎంకే, డీఎంకే ఢీకొనే ఏ కూటమి మనుగడ సాగించలేదు. అధికారంలో ఆ రెండింటిలో ఒకటే.. ఇదిలా ఉండగా, 1967 నుంచి 2016 వరకు వచ్చిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే మధ్యనే ప్రధాన పోటీ ఉంటోంది. తాజా ఎన్నికలోల్ సైతం అదే పరిస్థితి కొనసాగుతోంది. అన్నాడీఎంకే, డీఎంకే రెండు కూటములకు పోటీగా మరో మూడు కూటములు ఏర్పడ్డాయి. ఐజేకే నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్ హాసన్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సైతం ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇక నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు సీమాన్ మరో కూటమి ఏర్పాటు చేసుకున్నారు. కాగా, కమల్ కూటమి ఒంటరిగా ఎదుర్కొంటున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. సీమాన్‌కు రెండో అనుభవం. ఈ మూడు కూటములు అన్నాడీఎంకే, డీఎంకే కూటముల ఓట్లను చీల్చడం ద్వారానే గెలుపు బాటలో ప్రయాణిస్తామని విశ్వసిస్తున్నాయి. అన్నాడీఎంకే ఓటు బ్యాంకుపై దినకరన్ గురిపెట్టారు. అన్నాడీఎంకే, డీఎంకేకు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూసే ఓటర్లను కమల్, సీమాన్ నమ్ముకున్నారు. కొత్తగా బరిలో ఉన్న కూటముల అభ్యర్థుల గెలుపు సంగతి అటుంచితే ప్రత్యర్థుల ఓట్లను చీల్చి మెజార్టీ లేదా గెలుపు అవకాశాలకు గండికొట్టడం ఖాయమని భావించవచ్చు. చదవండి: సీఎంని స్టాలిన్ చెప్పుతో పోల్చిన నాయకుడు -
ఆడాళ్లు డ్రమ్ముల్లా మారుతున్నారు: డీఎంకే నేత
సాక్షి, చెన్నై: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు కొంతమంది ప్రబుద్ధులు. సామాన్యుల సంగతి పక్కన పెడితే.. ప్రజాప్రతినిధులు సైతం ఇందుకు అతీతులు కారు. సభల్లో, పార్లమెంట్, అసెంబ్లీ వేదికగా స్త్రీల వస్త్రధారణ గురించి ఇష్టారీతిన మాట్లాడి వివాదానికి కారణమైన వారు చాలా మందే ఉన్నారు. తాజాగా వీరి జాబితాలోకి డీఎంకే నాయకుడు ఒకరు చేరారు. విదేశీ ఆవు పాలు తాగుతూ మన ఆడవాళ్లు డ్రమ్ముల్లా మారుతున్నారంటూ మహిళల శరీరాకృతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై ఇతర పార్టీల నాయకులు, మహిళా సంఘాల నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఆ వివరాలు.. డీఎంకే పార్టీ నాయకుడు దిండిగుల్ లియోని అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం లియోని, కార్తికేయ శివసేనాపతి అనే అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తూ.. మహిళల శరీరాకృతి గురించి అసభ్యకరంగా మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందులో.. ‘‘ప్రస్తుతం చాలా రకాలు ఆవులున్నాయి. ఫామ్‌లలో మీరు విదేశీ ఆవులను చూసే ఉంటారు. వీటి పాలను పితకడానికి మెషిన్లను వాడతారు. ఒక్కసారి స్విచ్ వేస్తే.. మెషిన్ గంటలో 40 లీటర్ల పాలు పితుకుంది. ఈ రోజుల్లో మహిళలు ఎక్కువగా ఈ విదేశీ ఆవుల పాలు తాగుతున్నారు. అందుకే వారి శరీరాకృతి మారి.. డ్రమ్ముల్లా తయారవుతున్నారు. గతంలో మహిళలు ‘8’ ఆకారంలో ఉండేవారు. పిల్లల్ని అలవోకగా ఎత్తుకునే వారు. కానీ ఇప్పుడు ఎవరూ అలా కనిపించడం లేదు. లావుగా అయ్యి పిల్లలను ఎత్తుకోలేకపోతున్నారు. దానికి కారణం విదేశీ ఆవు పాలు తాగడమే’’ అంటూ ఇష్టారీతిన ప్రసంగిస్తూ పోయాడు. What a shame.. what milk does he drink? Does he know what happens to women’s body post pregnancy or during hormonal changes? @KanimozhiDMK what do you like to say to this kind of male chauvinist? Is this the respect your party people have on women. https://t.co/7yMf5esqX0 — Gayathri Raguramm (@BJP_Gayathri_R) March 24, 2021 లియోని పక్కనే ఉన్నవారు అతడిని ఆపేందుకు ప్రయత్నించారు. విషయాన్ని పక్కదోవ పట్టించడం కోసం రేషన్ సరఫరాపై మాట్లాడాల్సిందిగా లియోనికి సూచించారు. అతడు కాసేపు దాని మీద ప్రసంగించి మళ్లీ టాపిక్‌ను ఆడవారి వద్దకే తెచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు సైతం తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. కాగా గతంలోనూ లియోని అనేక సార్లు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
సీఎంని స్టాలిన్ చెప్పుతో పోల్చిన నాయకుడు
చెన్నై: మరో రెండు వారాల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలన్ని ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా, ముఖ్యమంత్రి పళనిస్వామిపై కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం పళనిస్వామి.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కాలికి వేసుకున్న చెప్పు పాటి విలువ కూడా చేయరు’ అంటూ రాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ‘ఒకప్పుడు బెల్లం మార్కెట్లో కూలీగా పనిచేసి పళనిస్వామికి స్టాలిన్‌తో పోటీయా.. పళని కంటే స్టాలిన్ వేసుకునే చెప్పుకు విలువ ఎక్కువ.. అలాంటిది తనకు స్టాలిన్నే సవాల్ చేసే ధైర్యం ఉందా. నెహ్రూ, ఇందిరా గాంధీ, మోదీ సైతం చేయలేని సాహసం పళనిస్వామి చేస్తున్నాడంటే అందుకు కారణం డబ్బు. రాష్ట్రాన్ని లూటీ చేసిన తనను పార్టీని రక్షిస్తుందని భావిస్తున్నాడు. అటువంటి వ్యక్తి స్టాలిన్‌ను అడ్డుకుంటాను అంటున్నాడు. అదే జరిగితే సీఎం వాహనం తన నివాసం నుంచి కార్యాలయానికి వెళ్లదని నేను సవినయంగా మనవిజేస్తున్నాను’ అన్నాడు రాజా. డీఎంకే నేత రాజా చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు పళనిస్వామి. తాను ఒక రైతునని, పేద కుటుంబం నుంచి వచ్చానని, అందువల్ల వినయంగా ఉంటానంటూ ప్రజల్లో తన మీద సానుభూతి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో 2జీ స్పెక్ట్రం కుంభకోణాన్ని ప్రస్తావించిన సీఎం.. కంటికి కనిపించని గాలితో కూడా కుంభకోణాలు చేసిన ఏకైక పార్టీ డీఎంకే అని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో మదురై జిల్లా మెలూర్‌లోని ఎన్నికల ప్రచారంలో పళనిస్వామి మాట్లాడుతూ..‘నేను కష్టపడి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాను. కానీ స్టాలిన్ తండ్రి సీఎంగా ఉన్నందున ఆయన సిల్వర్ స్పూన్‌తో పుట్టారు. రాజా మాట్లాడిన భాష ఎలా ఉందో చూడండి.. నా విలువ స్టాలిన్ ధరించే చెప్పు కన్నా తక్కువని.. పొగరుగా మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిని చెప్పుతో పోల్చి వారు ఎంతటి సంస్కారహీనులో నిరూపించుకున్నారు. నేను ఒక రైతును, మా పేదలు అలానే ఉంటారు.. మేము కష్టపడి పనిచేస్తాం.. మేం కొనుక్కోగలిగింది మాత్రమే కొనుగోలు చేస్తాం... కానీ వారు రూ. 1.76 లక్షల కోట్ల అవినీతి కుంభకోణం వెనుక ఉన్నారు. కాబట్టి కోరుకున్నది కొనుక్కుంటారు’ అంటూ పళనిస్వామి రాజాకు కౌంటర్ ఇచ్చారు. చదవండి: కింది స్థాయి నుంచి వచ్చా..: సీఎం -
కాంగ్రెస్‌లోకి నటి షకీలా
టీ.నగర్: ప్రముఖ గ్లామర్ తార నటి షకీలా గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మలయాళ చిత్రాల్లో నటించి పేరొందిన షకీలా రాష్ట్ర కాంగ్రెస్ మానవ హక్కుల విభాగం అధ్యక్షుడు మహాత్మా శ్రీనివాసన్ సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు రాష్ట్ర కాంగ్రెస్ మానవ హక్కుల విభాగం ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. షకీలా శుక్రవారం చెన్నైలోని సత్యమూర్తి భవన్‌కు వచ్చి పార్టీ అధ్యక్షుడు, ఇతర ముఖ్య నిర్వాహకులను కలిసి సభ్యత్వ కార్డును అందుకున్నారు. ఈమె శనివారం నుంచి ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం. -
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షకీలా..
చెన్నె: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాలు రసకందాయంగా మారాయి. పార్టీల విస్తృత ప్రచారంతో రాజకీయ వాతావరణం హాట్‌హాట్‌గా మారింది. తాజాగా ఓ హాట్ బ్యూటీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆలస్యంగానైనా ఓ పార్టీలో చేరారు. ఆమెనే అప్పటి తరాన్ని కవ్వించి సెగలు రేపిన నటి షకీలా. 200కు పైగా సినిమాల్లో నటించి.. శృంగార తారగా పేరుపొందిన షకీలా ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేస్తారో వేచి చూడాలి. దక్షిణాది భాషల్లో వందల సినిమాల్లో షకీలా నటించారు. కామెడీ పాత్రలతో పాటు హాట్ సీన్స్‌లోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఆమె శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తమిళనాడుకు చెందిన మానవ హక్కుల విభాగం బాధ్యతల్లో షకీలా పని చేయనున్నట్లు సమాచారం. షకీలా సినీ ప్రవేశం 18 ఏళ్ల వయసులో జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 200కు పైగా సినిమాలు చేశారు. ఆమె జీవితం ఆధారంగా గతేడాది ‘షకీలా’ సినిమా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. చదవండి: ‘లేడీ సింగమ్’ ఆత్మహత్య.. మహారాష్ట్రలో ప్రకంపనలు చదవండి: 10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి.. -
గెలుపుపై అనుమానం.. చిన్నమ్మకు ఆహ్వానం
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయంగా అస్త్రసన్యాసం చేసిన చిన్నమ్మ శశికళను అన్నాడీఎంకేలోకి రావమ్మా అని పార్టీ సమన్వయకర్త, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఆహ్వానించడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. మాటమాత్రమైనా తనతో చెప్పకుండా పన్నీర్ చేసిన ప్రకటనపై సహ సమన్వయ కర్త, సీఎం ఎడపాడి పళనిస్వామి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష ముగించుకుని జైలు నుంచి విడుదలైన శశికళ తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తారని అందరూ అనుకున్నారు. బెంగళూరు నుంచి చెన్నైలోని ఇంటికి చేరుకున్న తరువాత కొన్నాళ్లు అదే తరహాలో వ్యవహరించినా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించారు. అంతేగాక ప్రస్తుతం ఆలయాల చుట్టూ తిరుగుతూ ఆధ్యాత్మిక పర్యటనలతో గడుపుతున్నారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేలో చేర్చుకునేందుకు సిద్దమని ఆ పార్టీ సమన్వయకర్త, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఇటీవల సంచలన ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అధ్యక్ష విధానం ఎంజీఆర్‌తో, ప్రధాన కార్యదర్శి హోదా జయలలితతో ముగిసింది. సమన్వయకర్త, సహ సమన్వయకర్త హోదాల్లో పన్నీర్, ఎడపాడి పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. ఇదే తరహా కొనసాగేందుకు శశికళ సమ్మతిస్తే పార్టీలోకి ఆహ్వానిస్తామని ఒకసారి, పరిశీలిస్తామని మరోసారి పన్నీర్ అన్నారు. శశికళతో తనకు విబేధాలు, మనస్తాపాలు లేవు, అమ్మ మరణించినపుడు కొన్ని సందేహాలు ఉండేవని పన్నీర్ చెప్పారు. పన్నీర్ చేసిన ప్రకటన అన్నాడీఎంకేలో తీవ్ర చర్చనీయాంశమైంది. పన్నీర్ చేసిన వ్యాఖ్యలకు ఓటర్లు ఏ విధంగా ప్రభావితం అవుతారోనని ఎడపాడికి బెంగపట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎడపాడికి గెలుపు కోసం ఈనెల 24వ తేదీ నుంచి పన్నీర్‌సెల్వం ప్రచారం చేస్తున్నారు. అంతకు ముందు వీరిద్దరూ శశికళ అంశంపై రహస్యంగా మంతనాలు చేసినట్లు సమాచారం. అన్నాడీఎంకే గెలుపు అవకాశాలు, టీటీవీ దినకరన్ పార్టీ అభ్యర్థుల వల్ల ఓట్ల చీలిక, ఉత్తర, దక్షిణ తమిళనాడులో అన్నాడీఎంకే పరపతి, కొంగుమండలంలోని అన్నా డీఎంకే ఓట్ బ్యాంకు అంశాలపై కూడా ఇరువురు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. శశికళను అన్నాడీఎంకేలో ఆహ్వానించడంపై ఎడపాడి, పన్నీర్ మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయనే ప్రచారం కూడా జరిగింది. అదేమీ లేదని ప్రజలకు, పార్టీ నేతలకు సంకేతాలు ఇవ్వడమే ఎడపాడి, పన్నీర్ ఏకాంత చర్చల వెనుక అసలు ఉద్దేశమని వాదిస్తున్నారు. చదవండి: తమిళనాడులో హీట్ పెంచిన ట్వీట్ -
‘‘బీపీ, షుగర్ ఉన్నాయి.. ప్లీజ్ నన్ను గెలిపించండి’’
సాక్షి, చెన్నై: ఆరోగ్యశాఖను తన భుజస్కంధాలపై మోస్తున్న మంత్రే తనకు ఉన్న బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలను గుర్తు చేస్తూ ప్రచారంలో పడడం సర్వత్రా విస్మయంలోకి నెట్టింది. పుదుకోట్టై జిల్లా నుంచి విరాళిమలై నుంచి విజయభాస్కర్ ఇప్పటికే రెండు సార్లు గెలిచారు. ఆరోగ్య మంత్రిగా అత్యధిక సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి విజయభాస్కర్. కరోనా కాలంలో ఆయన సేవలు ప్రశంస నీయం. తాజాగా అదే విరాళిమలై నుంచి మళ్లీ పోటీలో విజయభాస్కర్ ఉన్నారు. అయితే, సెంటిమెంట్‌తో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఆయన తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు చర్చకు విస్మయానికి దారి తీసింది. తనకు బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్నాయని, తనను ఆదరించాలన్నట్టు ఆయన ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్లడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై వ్యంగ్యాస్త్రాలు, సెటైర్లు వేసే వాళ్లు పెరిగారు. దీంతో గురువారం విజయభాస్కర్ ఓ మీడియాతో మాట్లాడుతూ, వివరణ ఇచ్చుకున్నారు. తానేమీ సెంటిమెంట్‌తో ఓట్ల కోసం పాకులాడడం లేదన్నారు. వాస్తవిక జీవితంలో తనకు ఉన్న సమస్యలను గుర్తు చేయడంలో తప్పులేదన్నారు. ఈ నియోజకవర్గంలో తాను అడగాల్సిన అవసరం లేదని, తన ముఖం కనిపిస్తే చాలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్లు ఎక్కువేనని పేర్కొన్నారు. తాను ఏ మేరకు సేవల్ని అందించానో వివరిస్తూ ఓ చోట చేసిన ప్రసంగాన్ని వక్రీకరించినట్టు పేర్కొన్నారు. వాస్తవిక జీవితంలో వి శ్రాంతి లేకుండా సేవల్ని అందించానని, అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ చోట బీపీ, షుగర్ గురించి మాట్లాడనే గానీ, ఇందులో తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. ఈ ప్రచారం పుణ్యమా అని ఆరోగ్యమంత్రి అనారోగ్య మంత్రయ్యాడంటూ వ్యంగ్యాస్త్రాలు హోరెత్తడం గమనార్హం. చదవండి: ఓటుకు నోటు ఇవ్వలేను.. మీరే నాకివ్వండి -
ఓటుకు నోటు ఇవ్వలేను.. మీరే నాకివ్వండి
సాక్షి, చెన్నై: ఎన్నికల్లో ఓటుకు నోటు ఇస్తున్న అభ్యర్థులకు భిన్నంగా ఓ మహిళా అభ్యర్థి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఓటుతో పాటు ఎన్నికల ఖర్చు కోసం నోటు ఇవ్వడంటూ అభ్యర్థించే పనిలో పడ్డారు. నాగపట్నం జిల్లా తిరుత్తురై పూండి అసెంబ్లీ నియోజకవర్గంలో నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా ఆర్తీ పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆమె వినూత్న బాటను ఎంచుకున్నారు. ఓటుకు నోటు ఇచ్చే స్థితిలో తాను లేనని, అయితే, గెలిపిస్తే అందరికీ మంచి చేస్తానని ప్రసంగాలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కొన్ని లక్షలు ఖర్చుపెట్టుకోవచ్చని సూచించిందని, ఆ మొత్తం కూడా తన వద్ద లేదని వాపోతున్నారు. అంతేకాదు, ఓటుతో పాటు ఎన్నికల ఖర్చు నిమిత్తం తనకు విరాళంగా ఎంతో కొంత ఇవ్వాలని ప్రజల్ని అభ్యర్థిస్తూ ముందుకు సాగే పనిలో పడ్డారు. గురువారం ఇదే తరహాలో ఆమె తిరుత్తురై పూండి మార్కెట్ పరిసరాల్లో ప్రచారంలో ముందుకు సాగారు. దీంతో ఆమె ప్రసంగం, ఆమె అభ్యర్థనకు స్పందించిన అక్కడి వర్తకులు తమకు తోచినట్టుగా రూ. వంద, రూ. ఐదు వందలు అంటూ ఎన్నికల ఖర్చునిమిత్తం ఆర్తీకి విరాళం అందించడం విశేషం. అమ్మ వరమిచ్చింది... సహకార శాఖ మంత్రిగానే కాదు థర్మాకోల్ మంత్రిగా ముద్రపడ్డ సెల్లూరు రాజు తాను పోటీ చేస్తున్న మదురై ఉత్తరం నియోజకవర్గం పరిధిలో ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. గురువారం ఆయన పలంగానత్తం పరిసరాల్లో ప్రచారం చేశారు. ఆయనకు హారతి పట్టేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు పూనకం వచ్చినట్టుగా ఊగిపోయింది. సెల్లూరు రాజు వైపు దూసుకొచ్చి అమ్మ వరమిచ్చేసింది..గెలుపు నీదే అంటూ పెద్ద పెద్దగా కేకలు పెట్టింది. దీంతో ఆమెను ఓ శాలువతో సెల్లూరు సత్కరించారు. ఆయన సత్కరించి అటు వెళ్లగానే, ఆ శాలువతో ఆ వృద్ధురాలు పరుగులు తీయడం గమనార్హం. అన్నాడీఎంకే పరమకుడి అభ్యర్థి సదన్ ప్రభాకర్ ఓటర్లను ఆకర్షించేందుకు గురువారం ఓ మాంసం దుకాణంలో పనిచేశారు. మాంసాన్ని ముక్కలుగా కత్తిరించి విక్రయించే పనిలోపడ్డారు. అలాగే పక్కనున్న హోటల్లో పరోటా మాస్టర్ అవతారమెత్తారు. చదవండి: తమిళనాడు ఎన్నికలు : మీ జీవితంలో ఇలాంటి హామీలు వినుండరు ‘సాగర్’.. సస్పెన్స్: పోటీదారులెవరో..? -
మామకు నేను ఇచ్చే టీ ఎంతో నచ్చుతుంది: కుష్బూ
టీ.నగర్: నటి కుష్బూ పట్ల అభిమానం పెంచుకున్న ప్రజలు ఆమెకు ఏకంగా ఆలయం నిర్మించిన విషయం తెలిసిందే. ఆమె పేరుతో విక్రయానికి వచ్చిన ఇడ్లీలు ప్రాచుర్యం పొందాయి. ఇంతటి కీర్తి సాధించిన కుష్బూ తన ఇంట్లో సామాన్య మహిళలా వంటలు చేస్తారా అనే సందేహం ఉంటుంది. దీన్ని నివృత్తి చేస్తూ ఎన్నికల ప్రచారంలో స్వయంగా ఆమె టీ చేసి చూపించారామె. చెన్నై గులాం అబ్బాస్ ఆలీఖాన్ వీధుల్లో ముస్లిం మహిళల మధ్య ఓట్లు అభ్యర్థించారు. ఆ సమయంలో మహిళలు ఆమెకు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఆటోడ్రైవర్ అయిన ముస్తాఫా ఇంట్లో ఉన్న మహిళలు కుష్బూను చూడగానే అక్కా, మా ఇంట్లో ఏమైనా తాగుతారా? అని ప్రశ్నించారు. అందుకు కుష్బూ ‘‘ఏం ఎందుకు తాగను.. ఇవ్వండి’’ అని బదులిచ్చారు. అంతేకాకుండా తానే టీ తయారు చేసి ఇస్తాను రండంటూ వంటగదికి దారితీసింది. అది చిన్న వంటగది కావడంతో మహిళ కాస్త ఇబ్బందిపడింది. అయినా కుష్బూ ఏమాత్రం సంకోచించకుండా వంటగదిలోకి వెళ్లి టీ తయారు చేసింది. వేడివేడిగా టీ తయారు చేసి ఆమె వెంట వెళ్లిన పార్టీ కార్యకర్తలు, విలేకరులు పది మందికి అందించింది. అంతేకాకుండా అక్కడున్న మహిళలు అక్కా టీ సూపర్ అంటూ ప్రశంసించారు. ఇంట్లో ప్రతిరోజు మామ (భర్త)కు తానే టీ తయారుచేసి ఇస్తానని, ఆయనకు ఎంతో నచ్చుతుందని కుష్బూ తెలిపారు. చదవండి: బాధతోనే అలా అన్నా.. క్షమించండి -
ప్రేమలతకు కరోనా.. రంగంలోకి దిగిన కెప్టెన్
సాక్షి, చెన్నై : డీఎండీకే నేత విజయకాంత్ ఎట్టకేలకు ప్రజల్లోకి వచ్చారు. బుధవారం గుమ్మిడి పూండిలో రోడ్ షోతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇక ప్రచారంలో ఉన్న ప్రేమలత విజయకాంత్‌కు అధికారులు షాక్ ఇచ్చారు. అమ్మ మక్కల్ కూటమితో కలిసి డీఎండీకే ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసింది. డీఎండీకే అభ్యర్థులు 60 స్థానాల్లో పోటీచేస్తున్నారు. అయితే, ఈ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళ్లే డీఎండీకే నేతలు కరువయ్యారు. విజయకాంత్ సతీమణి ప్రేమలత విరుదాచలంలో పోటీచేస్తుండటంతో, ఆమె ఆ నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఇతర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించలేని పరిస్థితి ఉంది. ఇక, విజయకాంత్ బావ మరిది, పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సుదీష్ కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో డీఎండీకే అభ్యర్థులకు మద్దతుగా కదిలే నేతలు ఆ పార్టీలో కరువయ్యారు. ఈ పరిస్థితుల్లో అనారోగ్యంతో ఇంటికీ, లేదా కార్యాలయానికి పరిమితమైన విజయకాంత్, తన అభ్యర్థుల కోసం అడుగుబయట పెట్టకతప్పలేదు. బు«ధవారం సాయంత్రం హఠాత్తుగా ఆయన ప్రచార పర్వంలోకి అడుగు పెట్టారు. ఐదు రోజుల పర్యటన... విజయకాంత్ ఎన్నికల ప్రచారంలో విరుదాచలంతోపాటుగా మరో నియోజకవర్గంలో ఓటర్లను కలిసేందుకు తొలుత నిర్ణయించారు. అయితే, తమకు మద్దతుగా ప్రచారం చేసే వాళ్లు లేరంటూ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు పెడుతున్న కేకల్ని విన్న విజయకాంత్ తానొస్తున్నానని అడుగు తీసి ముందుకు వేశారు. ఐదు రోజుల పాటుగా ఆయన ప్రచారం సాగనుంది. బుధవారం సాయంత్రం గుమ్మిడి పూండిలో సుడిగాలి పర్యటనతో ముందుకు సాగారు. అయితే, ఎక్కడా ప్రసంగాలకు తావివ్వలేదు. కేవలం పార్టీ వర్గాలను వాహనం నుంచి పలకరిస్తూ విజయకాంత్ ప్రచారం చేశారు. గురువారం తిరుత్తణిలో, శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు చెన్నైలో తమ అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారానికి ఆయన నిర్ణయించారు. పరీక్ష చేసుకోవాల్సిందే తన సోదరుడు సుదీష్, ఆయన భార్య పూర్ణిమ ఇద్దరు కరోనా బారిన పడటంతో ప్రేమలత విజయకాంత్‌కు సంకటం తప్పలేదు. ఆమె విరుదాచలంలో సుడిగాలి పర్యటనతో ఓట్ల వేటలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఆమెకు అధికారులు షాక్ ఇచ్చారు. తప్పనిసరిగా కరోనా పరీక్ష చేసుకోవాల్సిందేనని, తదుపరే ప్రచారంలోకి వెళ్లాలని ఆరోగ్య శాఖ వర్గాలు హెచ్చరించాయి. దీంతో కరోనా టెస్ట్ చేసుకోక తప్పలేదు. ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. -
ఇక ఇప్పుడు జాతీయ నేతల వంతు..!
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి జాతీయ నేతలు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఈనెల 27వ తేదీ నుంచి ఒకరి తర్వాత మరొకరు పర్యటించనున్నారు. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసింది. ఆయా అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఉరకలు తీస్తున్నారు. అలాగే కన్యాకుమారి లోక్‌సభ ఉప ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పోటీలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ తర్వాత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెన్నై హార్బర్ నియోజకవర్గంలో పోటీలో ఉన్న యువజన నేత వినోజ్ బి సెల్వంకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అలాగే కేంద్రమంత్రి స్మృతి ఇరాని ధౌజండ్ లైట్స్ అభ్యర్థి కుష్భుకు మద్దతుగా ప్రచారానికి సిద్ధం అయ్యారు. 28న ఒకే వేదిక మీదకు... ఇప్పటికే పలుమార్లు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈనెల 28న మలి విడత ప్రచారానికి సిద్ధం అయ్యారు. చెన్నై వేళచ్చేరిలో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి హసన్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు సేలంలో భారీ ర్యాలీతో ఓటర్ల వద్దకు వెళ్లనున్నారు. అదే రోజు సాయంత్రం సేలం సీలనాయకన్ పట్టిలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఇంత వరకు డీఎంకే కూటమి నేతలు ఒకే వేదిక మీదకు రాలేదు. ఈ బహిరంగ సభ వేదికగా రాహుల్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, మైనారీటీ పార్టీల నేతలు ఖాదర్ మొహిద్దీన్, జవహరుల్లా, తమీమున్ అన్సారీ, వామపక్ష నేతలు బాలకృష్ణన్, ముత్తరసన్లతో పాటుగా డీఎంకే మిత్రపక్షాల నేతలు అందరూ ఒకే చోట కలవనున్నారు. ఉచిత పథకాలతో పేదరికం పోదు: కమల్ వ్యాఖ్య సాక్షి, చెన్నై: ఉచిత పథకాలు అమలు చేసినంతమాత్రాన పేదరికం తొలగే ప్రసక్తి లేదని మక్కల్ నీదిమయ్యం అధినేత కమల్‌హాసన్ అన్నారు. బుధవారం కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి కమల్ మాట్లాడుతూ.. ఉచితాలు ఇచ్చేస్తున్నారు కదా..? అని ఓట్లు వేస్తే మరో ఐదేళ్లు తీవ్రసంకటం ఎదుర్కోవడం తథ్యమని హెచ్చరించారు. ఉచిత పథకాల రూపంలో ప్రతి ఒక్కరి నేత్తిన అప్పులభారం పెరగబోతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి నెత్తిన రూ. 65 వేల అప్పు ఉందన్నారు. భవిష్యత్తులో రూ. 2లక్షలకు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఓటు వేసే ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. తిరుచ్చిలో సాగిన ప్రచారంలో కమల్‌పై ఓ మహిళ భారతీయార్చిత్ర పటాన్ని విసరడం కలకలం రేపింది. ఇక కమల్‌కు మద్దతుగా గురువారం కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో ఎస్ఎంకే నేత శరత్‌కుమార్ ప్రచారం చేయనున్నారు. -
ఎన్నికల చిహ్నంపై స్టే కుదరదు: హైకోర్టు
సాక్షి ప్రతినిధి, చెన్నై: గుర్తింపు పొందిన పార్టీల చిహ్నాలను కూటమి పార్టీల అభ్యర్థులకు కేటాయింపుపై నిషేధం విధించేందుకు వీలులేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఎన్నికలు ముగిసిన తరువాత ఈసీ బదులివ్వాలని బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి నుంచి 14 మంది మిత్రపక్ష పార్టీల అభ్యర్థులు ఉదయసూర్యుని గుర్తుపై పోటీచేస్తున్నారు. అలాగే అన్నాడీఎంకే కూటమిలోని 12 మంది మిత్రపక్ష అభ్యర్థులు రెండాకుల చిహ్నంపై బరిలోకి దిగుతున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఆయా పార్టీల సభ్యులు మాత్రమే ఆ చిహ్నంపై పోటీచేయాలని, ఇతరులు పోటీ చేసేందుకు వీలులేకున్నా ఎన్నికల అధికారులు వారి నామినేషన్లను అంగీకరించారని ఆరోపిస్తూ ప్రజా ప్రయోజనవాజ్యం దాఖలైంది. గుర్తింపు పొందిన పార్టీలు మిత్రపక్షపార్టీలకు తమ పార్టీ చిహ్నం కేటాయించకుండా ఎన్నికల కమిషన్‌కు నిషేధ ఉత్తర్వులు జారీచేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ బెనర్జీ, న్యాయమూర్తి సెంథిల్‌కుమార్ రామమూర్తిలతో కూడిన డివిజన్ బెంచ్‌కు బుధవారం విచారణకు వచ్చింది. ఎన్నికల చిహ్నం కేటాయింపులు పూర్తయినందున పిటిషనర్ వాదనపై ప్రస్తుత ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని న్యాయమూర్తులు అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పిటిషన్‌పై బదులి పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా ఈసీని కోర్టు ఆదేశిస్తూ విచారణను జూన్ 3వ వారానికి వాయిదావేసింది. జిల్లా కలెక్టర్, ఎస్పీలపై వేటు అధికార అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ రాజామణి, పోలీస్ కమిషనర్ సుమిత్ శరణ్‌లను ఎన్నికల విధుల నుంచి ఈసీ తప్పించింది. చెన్నై వేలాచ్చేరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఘర్షణకు దిగిన అన్నాడీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులపై తిరువాన్మియూరు పోలీసులు మూడు సెక్షన్లపై కేసులు పెట్టారు. ఐజేకే కూటమి సారధి, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ పోటీచేస్తున్న కోయంబత్తూరు దక్షిణంలో మిత్రపక్ష సమక అధ్యక్షులు శరత్‌కుమార్ గురువారం ప్రచారం చేయనున్నారు. చెన్నైలో 7,300 మంది వృద్ధుల నుంచి పోస్టల్ ఓట్ల కోసం ఈసీ 70 బృందాలను నియమించింది. ఇంటింటికీ వెళ్లి పోస్టల్ ఓట్ల సేకరణకు శిక్షణ బుధవారం ప్రారంభమైంది. సొంతూళ్లకు వెళ్లి ఓటు వేసేందుకు వీలుగా 14,215 ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. ఏప్రిల్ 1 నుంచి 5వ తేదీ వరకు నడిపే ఈ ప్రత్యేక బస్సుల కోసం బుధవారం రిజర్వేషన్ ప్రారంభమైంది. పోలింగ్ నేపథ్యంలో ఈనెల 4,5,6 తేదీల్లో టాస్మాక్ దుకాణాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. -
తమిళ ఎన్నికలు: సర్వేలన్ని ఆ పార్టీకే అనుకూలం
డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండడంతో అన్నాడీఎంకే పార్టీ అంతర్మధనంలో పడింది. తమ ఎన్నికల వ్యూహాన్ని మార్చేందుకు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, పన్నీరుసెల్వం సిద్ధమయ్యారు. బుధవారం సేలంలోని ఓ ప్రైవేట్ హోటల్లో అర్ధగంట పాటు భేటీ అయ్యారు. సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని అన్నాడీఎంకే పార్టీ ఉవ్విల్లూరుతోంది. ఈ మేరకు ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టింది. ఉచిత పథకాలతో ప్రజాకర్షక మేనిఫెస్టోను ప్రకటించింది. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో–కన్వీనర్, సీఎం పళనిస్వామి కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళుతున్నారు. ప్రచార సభలకు అనూహ్య స్పందన వస్తున్నా, ఉచిత పథకాల హామీలు ప్రజల్లో ఆసక్తిని కలిగించినా సర్వేలు మాత్రం భిన్నంగా వస్తుండడం ఆ పార్టీని కలవరంలో పడేసింది. వ్యూహాలకు పదును.. ఇప్పటి వరకు వెలువడిన నాలుగైదు సర్వేలు డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశాయి. దీంతో ఆ పార్టీ పెద్దలు వ్యూహాలకు పదునుపెట్టారు. పార్టీ నాయకులు గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. మేనిఫెస్టోను విస్తృతంగా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో–కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి బుధవరం సేలంలో భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికలపై అరగంట పాటు చర్చించారు. కూటమి పార్టీలను కలుపుకుని సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని జిల్లా, నియోజకవర్గ నాయకులకు దిశానిద్దేశం చేశారు. నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అధికారానికి దూరం అవుతామని హెచ్చరికలు పంపారు. అలాగే ప్రచారంలో డీఎంకే హయాంలో చోటుచేసుకున్న అవినీతి, కుటుంబ పాలన, తమిళులకు చేసిన ద్రోహాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దివంగత సీఎం జయలలిత విజన్‌ను ప్రజలకు వివరించే విధంగా ప్రచార కార్యక్రమాలకు సిద్ధమయ్యారని ఓ నేత పేర్కొన్నారు. పన్నీరు ప్రచారం సీఎం పళనిస్వామి సేలం జిల్లా ఎడపాడిలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు మద్దతుగా పన్నీరుసెల్వం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. పళనికి మద్దతు పలకాలని, అమ్మ పాలన కొనసాగాలంటే అన్నాడీఎంకే పార్టీకి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. కరూర్‌లో పళని కరూర్‌లో పోటీ చేస్తున్న ఎంఆర్ విజయ భాస్కర్, అరవకురిచ్చి నుంచి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి అన్నామలైలకు మద్దతుగా పళనిస్వామి ప్రచారం చేశారు. ఓపెన్ టాప్ వాహనంలో విస్తృతంగా పర్యటించారు. డీఎంకే హయాంలో సాగిన కబ్జాలను ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే ఆ స్థలాలను స్వాధీనం చేసుకుని లబ్ధిదారులు, బాధితులకు అందిస్తామని హామీ ఇచ్చారు. కరూర్ డీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ అన్నాడీఎంకే ద్రోహి అని విమర్శించారు. అమ్మ ప్రభుత్వాన్ని కూల్చేందు విశ్వప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండడం వల్లే రాష్ట్రానికి రూ. లక్ష కోట్ల మేరకు నిధులు వచ్చినట్లు వివరించారు. చదవండి: నోరు జారిన పన్నీర్‌సెల్వం.. అందరూ నవ్వడంతో.. -
కరెన్సీ కట్టలు: రోడ్డుపై రూ.కోటి.. రూ.264 కోట్లు స్వాధీనం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నికలు ఏవైనా ధనవర్షం కురవాల్సిందే. ప్రచారం కోసం నోట్లు కుమ్మరించందే ఓట్లు రాలవనే భావన అన్ని పార్టీల్లో పెరిగిపోయింది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల కమిషన్ అభ్యర్థుల కదలికలపై నిఘా పెడుతుంటుంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ధర ప్రవాహం పారుతోంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బుధవారం వరకు రూ.264 కోట్ల నగదు పట్టుబడింది. కమల్ సన్నిహితుడి ఇంట్లో సోదాలు మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌కు సన్నిహితుడు, తిరుచ్చిరాపల్లి తూర్పు నియోజకవర్గం అభ్యర్థి లేరోన్ మొరాయ్సి (45) ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్నుశాఖ (ఐటీ) అధికారులు దాడులు చేశారు. ఈ నెల 22, 23 తేదీల్లో జరిపిన తనిఖీల్లో రూ.10 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కమల్ పార్టీ ప్రముఖుల నుంచి రూ.22.5 కోట్లను స్వాధీనం చేసుకుని, రూ.80 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడిన విషయాన్ని ఇటీవల ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. పేరు చెప్పేందుకు ఇష్టపడని ఐటీ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే లేరోన్ మెరాయ్సి భారీ ఎత్తున పన్ను ఎగవేసినట్లు అందిన సమాచారంతో ఐటీ దాడుల చేపట్టామని తెలిపారు. ఎంఎన్ఎం కోశాధికారి చంద్రశేఖర్ ఇళ్లు, పరిశ్రమలపై ఈనెల 17,18 తేదీల్లో దాడులు నిర్వహించి రూ.11.50 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.80 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించారు. ఇదిలా ఉండగా చెన్నై పల్లవరం వద్ద వాహనాల తనిఖీలు చేసున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు ఒక కారులో తరలిస్తున్న రూ.4 కోట్ల విలువైన బంగారు, వెండి నగలు పట్టుబడ్డాయి. అలాగే ఈరోడ్‌లో జరిపిన తనిఖీలో రూ. 4.5 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అన్నాడీఎంకే నేత కారులో రూ.కోటి తిరుచ్చిరాపల్లి జిల్లాలో రోడ్డుపక్కన పడి ఉన్న రూ. కోటి కరెన్సీ కలకలం రేపింది. తిరుచ్చిరాపల్లి–కరూర్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి రెండు కార్లు, వాటికి సమీపంలో కొందరు వ్యక్తులు వాదులాటలో ఉండగా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వచ్చారు. అధికారులను చూడగానే ఒక కారులోని వ్యక్తులు పారిపోగా రెండో కారును, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇంతలో కారుకు సమీపంలో రోడ్డు పక్కన పడి ఉన్న బియ్యం బస్తాలను పరిశీలించగా రూ.500 నోట్లతో రూ. కోటి విలుౖవైన కరెన్సీని గుర్తించారు. అన్నాడీఎంకే పతాకంతో కూడిన కారును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నగదు, నగలు పట్టుబడడంతో ఎన్నికల కమిషన్ 936 ఫ్లయింగ్ స్క్వాడ్లతో 24 గంటల నిఘాను తీవ్రతరం చేసింది. ఈసీకి జ్యువెలర్స్ సంఘం విజ్ఞప్తి ఎన్నికల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలతో బంగారు నగల వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సానుకూలంగా స్పందించాలని కోరుతూ చెన్నై జ్యువెలర్స్ అసోసియేషన్ బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యబ్రత సాహూను కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈసీని కలిసిన వారిలో సంఘం అధ్యక్షుడు ఉమ్మిడి ఉదయకుమార్, ఉపాధ్యక్షుడు ఉమ్మిడి రాజేష్, కార్యదర్శి నారాయణన్ సురేష్, కార్యవర్గ సభ్యుడు అళగు చిదంబరం ఉన్నారు. చదవండి: TN Assembly Polls: చంద్రమండలంపైకి తీసుకువెళ్తా! -
ఐదు రాష్ట్రాల్లో అధికారం ఆ పార్టీలదే..
న్యూఢిల్లీ: బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పశ్చిమబెంగాల్లో ఆ పార్టీకి విజయం దక్కకపోవచ్చని ‘టైమ్స్ నౌ – సీ ఓటర్’ సర్వే పేర్కొంది. సీట్ల సంఖ్యను, ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకున్నా మెజారిటీ స్థానాలను గెల్చుకోలేదని తేల్చింది. 2016లో సాధించిన సీట్ల కన్నా తక్కువే గెల్చుకున్నప్పటికీ మెజారిటీకి అవసరమైన సీట్లను టీఎంసీ గెల్చుకుంటుందని పేర్కొంది. తమిళనాడులో డీఎంకే, పుదుచ్చేరిలో ఎన్డీఏ గెలుస్తా్తయని వెల్లడించింది. అస్సాంలో ఎన్డీఏ, కేరళలో ఎల్డీఎఫ్ అధికారాన్ని నిలబెట్టుకుంటాయని వివరించింది. పశ్చిమబెంగాల్: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని టైమ్స్ నౌ– సీ ఓటర్ సర్వే తేల్చింది. అయితే, చివరకు విజయం మాత్రం మమత బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌కే దక్కుతుందని, రాష్ట్రంలో రాజకీయంగా బీజేపీ భారీగా బలపడుతుందని పేర్కొంది. మొత్తం 294 సీట్లకు గానూ టీఎంసీ 152 నుంచి 168 స్థానాలను, బీజేపీ 104 నుంచి 120 స్థానాలను గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. లెఫ్ట్, కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ కూటమికి 18 – 26 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. స్వతంత్రులు రెండు స్థానాలు గెల్చుకోవచ్చని పేర్కొంది. 2016 ఎన్నికల్లో టీఎంసీ 211 సీట్లను గెల్చుకుని ఘనవిజయం సాధించగా, ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది 3 సీట్లలోనే కావడం గమనార్హం. ఓట్ల శాతంలో బీజేపీ, టీఎంసీల మధ్య తేడా పెద్దగా ఉండకపోవచ్చని సర్వే అభిప్రాయపడింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ 42.1%, బీజేపీ 37.4% ఓట్లు గెల్చుకుంటాయని తేల్చింది. కాంగ్రెస్, లెఫ్ట్, ఐఎస్ఎఫ్ కూటమికి 13% ఓట్లు వస్తాయని తెలిపింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఈ ఎన్నికల్లో టీఎంసీ గెలుస్తుందని 44.6%, బీజేపీ గెలుస్తుందని 36.9% అభిప్రాయపడ్డారు. తదుపరి సీఎంగా మమత బెనర్జీనే సరైన వ్యక్తి అని 55% మంది, రాష్ట్ర బీజేపీ చీఫ్ గౌతమ్ ఘోష్ సీఎంగా సరైన వ్యక్తి అని 32.3% అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చ్ 3వ వారంలో 17850 మంది నుంచి ‘టైమ్స్ నౌ – సీ ఓటరు’ అభిప్రాయాలు సేకరించింది. తమిళనాడు: తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, పలు ఇతర ప్రాంతీయ పార్టీల కూటమి యూపీఏ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ – సీ ఓటరు సర్వే తేల్చింది. మొత్తం 234 స్థానాలకు గానూ.. ఆ కూటమికి 173 నుంచి 181 సీట్లు వస్తాయని, అన్నాడీఎంకే, బీజేపీల ఎన్డీఏ 45 నుంచి 53 సీట్లు మాత్రమే గెల్చుకుంటుందని పేర్కొంది. ఎంఎన్ఎం, ఏఎంఎంకే 3 చొప్పున సీట్లు గెల్చుకుంటాయని, ఇతరులు రెండు సీట్లలో విజయం సాధిస్తారని పేర్కొంది. మార్చ్ 17 – 22 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 8709 మందిపై ఈ సర్వే జరిపారు. యూపీఏకు 46%, ఎన్డీఏకు 34.6% ఓట్లు వస్తాయని తేల్చింది. గత ఎన్నికల్లో ఎన్డీయేకు 136 సీట్లు, యూపీఏకు 98 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ఓట్లను టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే గణనీయంగా చీలుస్తుందని 39% అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా డీఎంకే నేత స్టాలిన్‌కు 43.1% మంది మద్దతు పలకగా, పళనిసామి(అన్నాడీఎంకే)కు 29.7% మంది, శశికళకు 8.4% మంది ఓటేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 50% ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. అస్సాం: అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం నిలబెట్టుకుంటుందని సర్వే తేల్చింది. ఎన్డీయేకు 69 సీట్లు, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏకు 56 సీట్లు వస్తాయని, ఇతరులు నాలుగు స్థానాల్లో గెలుస్తారని వెల్లడించింది. అస్సాంలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 126. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 45%, యూపీఏకు 41.1% ఓట్లు వస్తాయని సర్వే పేర్కొంది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ప్రస్తుత సీఎం శర్బానంద సొనోవాల్కు 46.2% మంది, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయి 25.2% మంది మద్దతు పలికారు. కేరళ: ఈ ఎన్నికల్లో వామపక్ష ఎల్డీఎఫ్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని టైమ్స్ నౌ, సీ ఓటరు సర్వే వెల్లడించింది. మొత్తం 140 స్థానాలకు గానూ, మెజారిటీ కన్నా స్వల్పంగా అధికంగా 77 సీట్లను ఎల్డీఎఫ్ గెల్చుకుంటుందని పేర్కొంది. 2016లో గెల్చుకున్న సీట్ల కన్నా ఇది 14 సీట్లు తక్కువ. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ 62 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. బీజేపీ ఒక స్థానంలో విజయం సాధిస్తుందని తేల్చింది. గత ఎన్నికల్లో యూడీఎఫ్ 47 స్థానాల్లో గెలుపొందింది. 42.4% ఓట్లను ఎల్డీఎఫ్, 38.6% ఓట్లను యూడీఎఫ్ గెల్చుకుంటాయని పేర్కొంది. సీఎం క్యాండిడేట్‌గా ముఖ్యమంత్రి విజయన్‌కు 39.3% ఓటేయగా, కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీకి 26.5% మద్దతిచ్చారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పనితీరుకు సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 60% మంది సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. పుదుచ్చేరి: ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుస్తుందని టైమ్స్ నౌ – సీ ఓటరు తేల్చింది. బీజేపీ, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, అన్నాడీఎంకేల ఎన్డీఏ మొత్తం 30 స్థానాలకు గానూ 21 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. డీఎంకే కాంగ్రెస్‌ల యూపీఏకు 9 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఎన్డీఏకు 47.2% , యూపీఏకు 39.5% ఓట్లు వస్తాయని పేర్కొంది. ముఖ్యమంత్రిగా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగసామికి 49.2% మంది మద్దతు పలికారు. -
TN Assembly Polls: చంద్రమండలంపైకి తీసుకువెళ్తా!
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఓటర్లను ఆకర్షించేందుకు స్వతంత్ర అభ్యర్థి శరవణన్ చిత్ర విచిత్ర హామీలు ఇస్తున్నారు. దక్షిణ మధురై నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన ఆయన, నియోజకవర్గంలో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేస్తామని, ప్రజల్ని చంద్రమండలం పైకి తీసుకెళ్తానని వ్యాఖ్యానించారు. అదే విధంగా, ఇళ్లలో ఆడవాళ్ల పనికి సాయంగా ఇంటింటికీ రోబో పంపిణీ చేస్తానన్నారు. అంతేగాకుండా, ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి కాల్వలు తవ్వించి ఇంటికో బోటు పంపిణీ చేస్తానంటూ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాగా అన్ని రాజకీయ పార్టీలు టిక్కెట్ నిరాకరించడంతో శరవణన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. శరవణన్ ఇచ్చిన మరిన్ని హామీలు ఎండ వేడి నుంచి కాపాడేందుకు 300 అడుగుల ఎత్తున కృత్రిమ మంచుకొండ నిర్మాణం ప్రజలు ఎంజాయ్ చేయడానికి కృత్రిమ సముద్రం నిర్మాణం నియోజకవర్గ ప్రజలందరికీ ఐఫోన్ చదవండి: తమిళనాడు పోల్స్: దుస్తులు ఉతికి, గిన్నెలు తోమి -
నాగర్‌కోవిల్‌లో ముగ్గురు గాంధీలు..
సాక్షి ప్రతినిధి, చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో ఎలాగైనా కాలుమోపాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో ప్రజా బలం, ఓటర్ల బలగాన్ని పెంచుకునే పనిలో పడింది. గెలుపు గుర్రం ఎక్కేందుకు ఏ చిన్న అవకాశాన్ని చేజార్చుకోకూడదని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రధాని మోదీ సహా అగ్రనేతలు తమిళనాడుకు తరలివస్తున్నారు. బీజేపీ–అన్నాడీఎంకే కూటమి అభ్యర్థుల గెలుపుకోసం ఈనెల 26న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ఒక విడత ప్రచారం ముగించిన ప్రధాని మోదీ రెండో విడతలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ మురుగన్ పోటీచేస్తున్న తిరుప్పూరు జిల్లా తారాపురంలో 30వ తేదీన ప్రసంగించనున్నారు. ప్రధాని వచ్చి వెళ్లిన తరువాత కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలాసీతారామన్ ప్రచారం చేయనున్నారు. మూడో విడతగా ఏప్రిల్ 2న కన్యాకుమారి, మదురైలలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేయనుండగా సీఎం ఎడపాడి కూడా పాల్గొంటున్నారు. అన్బుమణి రాందాస్‌కు పీటీ వారెంట్ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారనే ఆరోపణలపై పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు అన్బుమణి రాందాస్‌కు విల్లుపురం న్యాయస్థానం పీటీ వారెంట్ జారీకి ఆదేశించింది. విల్లుపురం జిల్లా బ్రహ్మదేశం పోలీస్‌స్టేషన్ సమీపంలో 2013లో జరిగిన ఒక కార్యక్రమంలో అన్బుమణి హింసను ప్రేరేపించే విధంగా ప్రసంగించారనే అభియోగంపై అప్పటి సీఐ సుధాకర్ కేసు నమోదు చేశారు. ఆనాటి నుంచి ఈ కేసు కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈనెల 22న మరోసారి విచారణకు రాగా న్యాయమూర్తి పీటీ వారెంట్ జారీ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. నాగర్‌కోవిల్‌లో ముగ్గురు గాందీలు.. నాగర్‌కోవిల్ నియోజకవర్గంలో ముగ్గురు గాందీలు పోటీ చేయడం విశేషంగా మారింది. బీజేపీ అభ్యర్థి ఎంఆర్ గాందీపై స్వతంత్ర అభ్యర్థులుగా ఎల్ గాంధీ, గాంధీ కనకరాజ్ పోటీకి దిగారు. రేపటి నుంచి విజయకాంత్ ప్రచారం.. డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ ఈనెల 25నుంచి ప్రచాచం చేయనున్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం కూటమిలో ఉన్న డీఎండీకే పలువురు అభ్యర్థులను పోటీకి దించింది. అనారోగ్యకారణాలతో పోటీ చేయని విజయకాంత్ కూటమి అభ్యర్థులకు మద్దతుగా తిరుత్తణి నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. 12 గంటల పోలింగ్: ఈసీ ఏప్రిల్ 6న ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యబ్రత సాహూ తెలిపారు. జనవరి 20న విడుదల చేసిన జాబితా ప్రకారం రాష్ట్రంలో 6 కోట్ల 26 లక్షలా74 వేలా 446 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఆ తరువాత వచ్చిన వినతులను పరిశీలించి చేర్పులతో ఓటర్ల సంఖ్య 6 కోట్ల 29 లక్షలా 43 వేలా 512 మందికి పెరిగింది. అంటే గత రెండు నెలల్లో 2,69,66 మంది కొత్తగా ఓటర్ల జాబితాలో చేరారు. ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో పోలింగ్ వేళలను ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్ణయించామన్నారు. ఎన్నికల బందోబస్తు నిమిత్తం 235 పారామిలటరీ దళాలు వస్తున్నాయి. బీజేపీ అభ్యరి్థపై చార్జిషీటు.. 2019 నాటి ఉప ఎన్నికల్లో ప్రమాణ పత్రంలో ఆస్తికి సంబంధించి వాస్తవాలను దాచిపెట్టిన అభియోగంపై పుదుచ్చేరి కామరాజర్ నియోజకవర్గ అభ్యర్థి జాన్‌కుమార్‌పై చార్జిïÙటు దాఖలైంది. పుదువై పోరాళిగల్ సంఘం ప్రధాన కార్యదర్శి సెల్వముత్తురామన్ దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తి ఈ మేరకు పోలీసులకు ఆదేశాలిచ్చారు. చదవండి: Tamil Nadu Assembly Election 2021: అధికారం ఎవరిదో? -
Tamil Nadu Assembly Election 2021: అధికారం ఎవరిదో?
సాక్షి, చెన్నై: ఎన్నికలంటేనే అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి మధ్య అధికారం దక్కించుకునేది ఎవరనే పోటీ ఉంటుంది. అయితే కొన్ని సమయాల్లో ఎదో ఒక పార్టీకి అనుకూల పవనాలు బలంగా వీచడం, ఆ పార్టీకి మహత్తర విజయాన్ని కల్పించడం సాధారణ విషయం. 1952 నుంచి శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. 1952 కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కమ్యూనిస్టు ఆధ్వర్యంలోని ప్రతిపక్ష పార్టీలు ఒకే కూటమిగా ఎన్నికలను ఎదుర్కొన్నాయి. అప్పట్లో తమిళనాట తీవ్ర ఆహార కొరత ఏర్పడడంతో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీచాయి. దీంతో కాంగ్రెస్ వెనుకంజ వేయకతప్పలేదు. 1967లోను అప్పటి అనుకూల పవనాలు డీఎంకేను గెలుపొందేలా చేశాయి. ఆ తర్వాత ఎంజీఆర్ డీఎంకే నుంచి వైదొలగి అన్నాడీఎంకే పార్టీని ఏర్పరిచారు. దీంతో 1972లో ఆ పార్టీ ఆవిర్భవించింది. అప్పట్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే భారీ విజయం సాధించింది. కాంగ్రెస్‌కు మళ్లీ ఘోర పరాభవం తప్పలేదు. 1984 ఎన్నికలలో ఎంజీఆర్ అనారోగ్యానికి గురై అమెరికా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. ఆ సమయంలో ఎన్నికలు జరగడంతో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని ఎన్నికలను ఎదుర్కొన్నారు. అయితే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. దీంతో ఏర్పడిన సానుభూతి పవనాల కారణంగా అన్నాడీఎంకే, కాంగ్రెస్ కూటమి భారీ విజయం సాధించింది. 1989లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాటి ప్రధాని రాజీవ్గాందీపై బోఫోర్స్ అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇది కాంగ్రెస్‌కు వ్యతిరేకత తీసుకొచ్చింది. అప్పట్లో ఎంజీఆర్ మృతితో అన్నాడీఎంకే జయలలిత వర్గం, జానకి వర్గంగా విడిపోయి ఎన్నికలను ఎదుర్కొన్నాయి. ఈ కారణంగా డీఎంకే విజయం సాధించి అధికారం చేపట్టింది. 1991లో అన్నాడీఎంకే, కాంగ్రెస్ కూటమి పోటీ చేశాయి. ఆ సమయంలో శ్రీపెరంబుదూరు ప్రచారానికి వచ్చిన రాజీవ్‌గాంధీ హత్యకు గురికావడంతో సానుభూతి పవనాలు అన్నాడీఎంకే, కాంగ్రెస్ కూటమిని గెలిపించాయి. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితపై అవినీతి ఆరోపణలు రావడంతో వ్యతిరేకత ఏర్పడింది. దీంతో డీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్ కూటమి గెలుపొందింది. 2001లో అన్నాడీఎంకే, 2006లో డీఎంకే అధికారంలోకి వచ్చాయి. 2011 ఎన్నికలు 2జీ స్పెక్ట్రం అవినీతి కారణంగా డీఎంకే పరాజయంపాలై అన్నాడీఎంకే అధికారం చేజిక్కించుకుంది. 2016లో ఎటువంటి పవనాలు వీచలేదు. ఇరుపార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా అన్నాడీఎంకే అధికారం చేపట్టింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లోను ఎటువంటి పవనాలు వీచడం లేదు. ఇరు పార్టీలకు ఉన్న పలుకుబడిని బట్టే గెలుపు, ఓటములు ఉంటాయి. -
కమల్ పార్టీ అభ్యర్థి ఇంట్లో రూ.10 కోట్ల నగదు స్వాధీనం
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకున్న సమయంలో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షులు, నటుడు కమల్ హాసన్‌కు సన్నిహితుడు, ఆ పార్టీ అభ్యర్థి, పారిశ్రామికవేత్త ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలుచేశారు. రూ.10 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చిరాపల్లి కేకే నగర్లో నివసించే లేరోన్ మొరాయ్సి(45).. సెక్కో ప్రాపర్టీస్ పేరున భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచ్చిరాపల్లి తూర్పు నియోజకవర్గం నుంచి ఎంఎన్ఎం అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. సోమవారం ఐటీ అధికారుల బృందం తిరుచ్చిలోని అతని ఇళ్లు, కార్యాలయాలపై దాడులు ప్రారంభించారు. మంగళవారం రోజూ సోదాలు కొనసాగాయి. ఈ తనిఖీల్లో రూ.10 కోట్ల నగదు, రూ.కోట్ల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చెన్నై పల్లవరం వద్ద వాహన తనిఖీలు చేసున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు ఒక కారులో తరలిస్తున్న రూ.4 కోట్ల విలువైన బంగారం, వెండినగలు పట్టుబడ్డాయి. ఈరోడ్‌లో జరిపిన తనిఖీల ద్వారా 4.5 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. -
తమిళనాడు పోల్స్: దుస్తులు ఉతికి, గిన్నెలు తోమి
సాక్షి,చెన్నై: తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు పలు వాగ్దానాలు గుప్పించడం, చిత్ర విచిత్ర శైలిలో ప్రచారం చేయడం సర్వ సాధారణం. తమిళనాట హోరాహోరీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సరికొత్త పంథాను ఫాలో అయిపోతున్నారు. తాజాగా నాగపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఏఐఏడిఎంకె అభ్యర్థి తంగా కతిరావన్ వార్తల్లో నిలిచారు. బహిరంగంగా బట్టలు ఉతికి సంచలనం సృష్టించారు. ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే తన నియోజక వర్గంలో ‘అమ్మప్రభుత్వం’ ప్రతీ ఇంటికి ఒక వాషింగ్ మెషీన్‌ను ఇస్తుందని హామీ ఇచ్చారు. చురుకైన స్థానిక నేతగా పేరొందిన కతివారన్ తొలిసారి మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచారు. సోమవారం ప్రచార సమయంలో నాగపట్టణంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ప్రచారాని వెళ్లిన సమయంలో ఒక మహిళ బట్టలు ఉతుకుతూ కనిపించింది. అంతే రంగంలోకి దిగిన కతిరావన్ బట్టలు తాను ఉతుకుతానని ఆమెను కోరారు.మొదటలో మొహమాటంతో కాస్త సంశయించిన ఆ మహిళ చివరికి ఆయన చేతికి దుస్తులు ఇవ్వక తప్పలేదు. దీంతో కాసేపు బట్టలు వాష్ చేసిన ఆయన, పనిలో పనిగా పక్కనే ఉన్న గిన్నెలను కూడా తోమేశారు. ఈ పరిణామంతో ఔరా అంటూ ఆశ్చర్యపోవడం అక్కడున్నవారి వంతైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి అభ్యర్థులు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. కొందరు రోబోతో ప్రచారం చేస్తున్నారు, మరికొందరు పార్టీ ఎన్నికల చిహ్నాన్ని తమ తలపై వేసుకుంటున్నారు. కాగా ఇంటింటికి వాషింగ్ మెషీన్లు, సోలార్ స్టవ్‌లు, కేబుల్ టీవీ కనెక్షన్లను ఫ్రీగా ఇస్తామని అన్నా డీఎంకే తాజా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. Tamil Nadu: AIADMK candidate Thanga Kathiravan from Nagapattinam washed clothes and promised to give washing machine after winning elections during campaigning yesterday. pic.twitter.com/orDGoRFUhn — ANI (@ANI) March 23, 2021 — ANI (@ANI) March 23, 2021 -
కింది స్థాయి నుంచి వచ్చా..: సీఎం
సాక్షి, చెన్నై : తండ్రి వారసత్వంతో స్టాలిన్‌లా రాజకీయాల్లోకి రాలేదని, ఒక్కో మెట్టు ఎక్కి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నానని సీఎం పళనిస్వామి స్పష్టం చేశారు. సోమవారం ధర్మపురి జిల్లాలో పళనిస్వామి విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. హోసూరులో అన్నాడీఎంకే అభ్యర్థి జ్యోతి బాలకృష్ణారెడ్డికి మద్దతు నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ అమ్మ పథకాలు అమలవ్వాలంటే రెండాకులను గెలిపించుకోవాలని కోరారు. స్టాలిన్ సమర్థుడు కాదనే విషయం కరుణానిధికి కూడా తెలుసని, అందుకే ఆయన చేతికి అధికారం ఇవ్వకుండా చివరి క్షణం వరకు తన వద్దే ఉంచుకున్నారన్నారు. స్టాలిన్‌ను తండ్రే నమ్మనప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. అనంతరం పాలక్కోడులో మంత్రి అన్బళగన్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. అలాగే బీజేపీ అభ్యర్థి రాకేష్‌కుమార్ తరఫున ప్రచారం నిర్వహించారు. ఏపీఎస్ తప్పని సెగ తిరువణ్ణామలై పర్యటన ముగించుకుని ధర్మపురి వెళుతున్న ముఖ్యమంత్రి పళనిస్వామికి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చెన్నై – సేలం గ్రీన్ వే వ్యవహారంలో పళని స్వామి వైఖరికి నిరసనగా రైతులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. చదవండి: చెత్తకుప్ప పక్కన ప్రముఖ విలన్.. చివరికి! అడ్డదారిలో సీఎం కాలేదు.. -
అర కోటి ఉద్యోగాలు.. ఫ్రీగా ట్యాబ్లెట్లు.. లైసెన్స్
చెన్నె: ఓటర్లను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడంలో తమిళనాడు రాజకీయ నాయకులకు అలవాటే. ఇప్పటికే అక్కడి ప్రధాన పార్టీలు అన్నాడీఎంకే, డీఎంకే మేనిఫెస్టోలు విడుదల చేశాయి. దాదాపు 500కు పైగా హామీలు ప్రజలకు ఇచ్చాయి. ఇప్పుడు తాజాగా బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. పెద్ద ఎత్తున హామీలు కురిపిస్తూ మేనిఫెస్టోను ప్రకటించింది. చెన్నైలో సోమవారం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, వీకే సింగ్ మేనిఫెస్టోను విడుదల చేశారు. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామని, ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ తీసుకొస్తామని బీజేపీ ప్రకటించింది. 50 లక్షల ఉద్యోగాల కల్పన, మత్య్సకారులకు రూ.6 వేల ఆర్థిక సహాయం, 8, 9 తరగతి విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్లు, ఇంటింటికీ రేషన్ సరుకుల సరఫరా తదితర హామీలు ఇచ్చింది. అమ్మాయిలకు (18-23 ఏళ్ల వయసు) ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్, ప్రతి జిల్లాకు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, ప్రజలందరికీ ఉచిత తాగునీరు, చెన్నె కార్పొరేషన్ విస్తరణ, దళితులకు 12 లక్షల ఎకరాల భూమి పంపిణీ తదితర హామీలు బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 20 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీకి ఒకే దశలో ఏప్రిల్ 6వ తేదీన జరగనున్నాయి. మే 2వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. చదవండి: టపాసులతో హత్యాయత్నం.. ఏడ్చేసిన మంత్రి ప్రధాని ‘ఇంటి ప్రకటన’పై రాజకీయ దుమారం -
టపాసులతో హత్యాయత్నం.. ఏడ్చేసిన మంత్రి
చెన్నె: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ ప్రచార సమయంలో తమ ప్రత్యర్థులు తనను చంపేసేందుకు కుట్ర పన్నారని ఓ మంత్రి ఏడ్చేశారు. తనను ఒంటిరిని చేసి పటాకులు పేల్చి చంపేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటన తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఐటీ శాఖ మంత్రి కదంపూర్ రాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవిల్పట్టిలో ఆదివారం పర్యటించారు. ప్రచారం చేస్తుండగా ప్రత్యర్థి పార్టీ వారు కూడా ప్రచారానికి వచ్చారు. ఈ సమయంలో వివాదం ఎందుకు అని చడీచప్పుడు లేకుండా వెళ్తుంటే పటాకులు పెద్ద ఎత్తున పేల్చి వాటిని తన కాన్వాయ్‌పై వదిలారని మంత్రి రాజు ఆరోపించారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగమ్ (ఏఎంఎంకే) పార్టీ నాయకులు తమ కార్లతో అడ్డగించి అనంతరం 5 వేల పటాకుల లడీ పేల్చారని చెప్పారు. మంటలు తనకు సమీపంలో వచ్చాయని వాపోయారు. కొద్దిలో నా ప్రాణం పోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అన్నాడీఎంకే జాతీయ కార్యదర్శి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. అయితే కోవైల్పట్టి నియోజకవర్గంలో శశికళ మేనల్లుడు, ఏఎంఎంకే పార్టీ అధినేత టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్నారు. అందుకే ఇక్కడ ఏఎంఎంకే పార్టీ నాయకులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రిపై దాడి చేశారని ప్రచారం సాగుతోంది. ఈ ఘటనపై అన్నాడీఎంకే, ఏఎంఎంకే పార్టీల మధ్య వివాదం ఏర్పడింది. 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీకి ఒకేదశలో ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు మే 2వ తేదీన వెలువడనున్నాయి. -
అడ్డదారిలో సీఎం కాలేదు..
సాక్షి, చెన్నై: ప్రచారంలో ప్రధాన కూటముల సీఎం అభ్యర్థులు పళనిస్వామి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆదివారం సాగిన ప్రచారంలో పరస్పరం వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. మూడో కూటమి సీఎం అభ్యర్థి కమల్ కాలి గాయం వేధిస్తున్నా ప్రచారబాటలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు రెండు వారాలే సమయం ఉండడంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో జనం ఇళ్ల వద్దకే పరిమితం కావడాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటింటి ప్రచారం హోరెత్తింది. తమ నేతృత్వంలో గతంలో సాగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. డీఎంకే, అన్నాఎంకే పార్టీలు రూపొందించి మేనిఫెస్టో అంశాలతో కూడిన కరపత్రాల్లో పథకాలకు ప్రత్యేక ఆకర్షణ పేరిట ఒకే మహిళ ఫొటోను పొందు పరిచి ఉండడం అనేక చోట్ల గందరగోళం తప్పలేదు. అగ్రనేతలు ప్రచారంలో మాటల జోరు పెంచారు. అనేకచోట్ల అధికార అభ్యర్థులకు ప్రజల నుంచి వ్యతిరేకత రాగా, మరికొన్ని చోట్ల పుష్పాలతో ఆహ్వానాలు పలికిన ఓటర్లూ ఉన్నారు. అనేక జిల్లాల్లో భానుడు భగభగ మని ప్రతాపం చూపించినా, ఉక్క పోత నడుమ ప్రచారంలో అభ్యర్థులకు ముచ్చెమటలు తప్పలేదు. ద్రోహం పెను విషం.. కాంచీపురం జిల్లా పరిధిలోని ఉత్తర మేరు పరిసరాల్లో స్టాలిన్ ప్రచారం సాగింది. ఆయన మాట్లాడుతూ ప్రకృతి విలయాలు, కరోనా విపత్తుల సమయంలో కేటాయించాల్సిన నిధుల్ని సరిగ్గా ఇవ్వలేదని ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్న వ్యక్తి, ఎందుకు బీజేపీతో తాజాగా పొత్తు పెట్టుకున్నారో అని ప్రశ్నించారు. పదవి ఇచ్చిన శశికళ గుండెల్లోనే తన్నిన వ్యక్తి పళని స్వామి అని పేర్కొన్నారు. పదే పదే తానేదో రైతు అని పళని జబ్బలు చరస్తున్నాడని, నిజంగా రైతే అయితే, ఎందుకు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇచ్చారో అని ప్రశ్నించారు. అడ్డదారిలో సీఎం కాలేదు.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి, వందవాసిల్లో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో-కన్వీనర్ పళనిస్వామి సుడిగాలి పర్యటనతో ఓటర్ల వద్దకు వెళ్లారు. ప్రచార సభల్లో ఆయన ప్రసంగిస్తూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను, కరుణానిధిని టార్గెట్ చేశారు. అన్నా మరణం తర్వాత నావలన్ నెడుం జెలియన్ సీఎం కావాల్సి ఉండగా, అడ్డదారిలో కరుణానిధి ఆ కుర్చీని కైవసం చేసుకున్నారని ధ్వజమెత్తారు. ఆయనలా తానేమి అడ్డదారిలో సీఎం కాలేదని, అన్నాడీఎంకే శాసన సభా పక్షం మద్దతుగా ఆ పదవిలో కూర్చున్నట్టు పేర్కొన్నారు. తాను రైతునని, అందుకే రైతు సంక్షేమం కోసం శ్రమిస్తున్నానని తెలిపారు. అయితే, తననే కాదు, రైతుల్ని కూడా కించ పరిచే విధంగా హేళన చేస్తూ స్టాలిన్ వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి చరిత్రను ఆయన చూసుకుంటే మంచిదని, లేని పక్షంలో గట్టిగానే స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేస్తే, ప్రతి దాడికి తానూ రెడీ అని సవాల్ చేశారు. అన్నాడీఎంకేకు ప్రజలే వారసులని, అవినీతి పుట్ట డీఎంకేకు ఈ ఎన్నికల్లో మళ్లీ గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాలి నొప్పితోనూ.. మక్కల్ నీది మయ్యం నేత, కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి కమలహాసన్ గతంలో కాలికి శస్త్ర చికిత్స చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రచారంలో ఆయనకు ఇబ్బందిగా మారినట్టుంది. కాలి గాయం బాధిస్తున్నట్టుంది. అయినా, లెక్కచేయకుండా ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు. ఆదివారం నియోజక వర్గం పరిధిలో ఉక్కడం పరిసరాల్లోని మైనారిటీలు అధికంగా ఉండే చోట్ల నడుచుకుంటూ కాసేపు, ఓపెన్ టాప్ వాహనంలో మరికాసేపు ప్రచారంలో ముందుకు సాగారు. డీఎంకేతో, బీజేపీతోగానీ తనకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీయంగా తనను ఎదుర్కొనలేక ఈ విమర్శలు చేస్తున్నారని మైనారిటీల దృష్టికి కమల్ తీసుకెళ్లారు. తనకు కాషాయం రంగు పూయవద్దు అని విజ్ఞప్తి చేశారు. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం నేత దినకరన్ ప్రచార సభలతో దూసుకెళుతున్నారు. చదవండి: చెత్తకుప్ప పక్కన ప్రముఖ విలన్.. చివరికి! -
చెత్తకుప్ప పక్కన ప్రముఖ విలన్.. చివరికి!
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓట్లను చీల్చాలనే ఉద్దేశంతోనే ఆయన ఎన్నికల బరిలో దిగారంటూ విమర్శలు రావడంతో మనస్తాపం చెంది, పోటీ నుంచి విరమించుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా కోయంబత్తూరులోని తొండముత్తూరు నియోజకవర్గం నుంచి మన్సూర్ అలీఖాన్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో.. మన్సూర్ అలీఖాన్, చెత్తకుప్ప వద్ద పెన్ను పేపర్ పట్టుకుని, పక్కన కుక్కను పెట్టుకుని వినూత్న రీతిలో ప్రచారానికి తెరతీశారు. రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని, ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని బాటసారులకు విజ్ఞప్తి చేశారు. తాను ఎమ్మెల్యేను అయిన తర్వాత వీటిని అధిగమించేందుకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. అదే విధంగా, తొండముత్తూరులోని గాంధీ పార్కు ఏరియాలో వాలీబాల్ ఆడుతూ సరదాగా గడిపారు. జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ కలివిడిగా మెదిలారు. ఆ తర్వాత పెరూర్ పట్టేశ్వరర్ ఆలయం వద్ద దుకాణాదారులతో ముచ్చటించారు. ఈ మేరకు శుక్ర, శనివారాల్లో మన్సూర్ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో, కొంతమంది ఓటర్లు ఆయనపై విమర్శలు సంధించినట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న, ఆడియో క్లిప్‌లో ఉన్న వివరాల ప్రకారం.. మైనార్టీ ఓట్లను చీల్చేందుకు ఓ రాజకీయ పార్టీ దగ్గర తాను డబ్బు తీసుకున్నాననే ఆరోపణలు వస్తున్నాయని, ఈ విషయం తనను తీవ్రంగా బాధించిందని మన్సూర్ పేర్కొన్నారు. నిజాయితీగా సేవ చేద్దామనుకున్నా, ప్రజలు తనను శంకిస్తున్నారని, అందుకే పోటీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. అయితే, క్లిప్ వాస్తవమా కాదా అన్న అంశంపై స్పష్టత లేదు. మన్సూర్ అలీఖాన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారోనన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కాగా కెప్టెన్ ప్రభాకరన్ సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన మన్సూర్ అలీఖాన్, విలన్‌గా మెప్పించారు. దక్షిణాది భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయన, తెలుగులో ముఠామేస్త్రి, సాంబ, నాయుడమ్మ వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. చదవండి: ఆస్పత్రిలో సీనియర్ నటుడు -
ఆస్పత్రిలో సీనియర్ నటుడు
సాక్షి, చెన్నై: మనిద ఉరిమై కట్చి (మానవ హక్కుల పార్టీ) వ్యవస్థాపకుడు, సీనియర్ నటుడు కార్తీక్ అస్వస్థతకు లోనయ్యారు. ఆయనకు చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా నటుడు కార్తీక్ సుపరిచితుడే. ఈయన వారసుడు సైతం ప్రస్తుతం సినిమాల్లోకి వచ్చారు. తాజాగా అప్పుడప్పుడు తెరపై కనిపించే కార్తీక్, ప్రస్తుతం రాజకీయ ప్రచారానికి సిద్ధమయ్యారు. మనిద ఉరిమై కట్చి వ్యవస్థాపకుడిగా ఉన్న కార్తీక్ తన మద్దతును అన్నాడీఎంకే–బీజేపీ కూటమికి ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ప్రచారం ముగించుకుని శనివారం రాత్రి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. శ్వాస సమస్య తలెత్తడంతో కుటుంబీకులు చెన్నై అడయార్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్ అని తేలింది. అయితే, ఆయనకు శ్వాససంబంధిత సమస్యలు ఉండడంతో పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. సుధీష్‌కు పాజిటివ్.. డీఎండీకే నేత విజయకాంత్ బావ మరిది, ఆ పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సుధీష్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. శనివారం రాత్రి ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షలో కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆయనతో సంప్రదింపుల్లో ఉన్న వారందరూ పరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదవండి: హీటెక్కిస్తున్న‘సీటీమార్’ పెప్సీ ఆంటీ సాంగ్ ఆలియా.. అచ్చం సాగర కన్య! -
నగ్నంగా నామినేషన్ వేసేందుకు వచ్చి..
వేలూరు(తిరువణ్ణామలై): తిరువణ్ణామలై అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసేందుకు సౌత్ ఇండియా నదుల అనుసంధానం రైతుల సంఘం ఆధ్వర్యంలో వందవాసికి చెందిన చక్రపాణి, కలశపాక్కం తాలుకా మేల్ సామ్‌కుప్పం గ్రామానికి చెందిన రాజేంద్రన్ ఇద్దరూ తిరువణ్ణామలై వచ్చారు. అనంతరం తిరువణ్ణామలై తాలుకా కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు పెరియార్ విగ్రహం నుంచి కాలి నడకన నగ్నంగా నడిచి వచ్చారు. గమనించిన బందోబస్తులో ఉన్న పోలీసులు వెంటనే దుస్తులు కప్పి నామినేషన్ దాఖలు చేయకుండా నిలిపి వేశారు. దీంతో ఇద్దరు రైతులు నడి రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న అయ్యాకన్నుతో పాటు 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యాకన్ను మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర మంత్రి అమిత్‌షా రైతుల సంఘాలను ఢిల్లీకి పిలిపించి రూ.6 వేలు పింఛన్ రైతులందరికీ అందజేస్తామని, రైతులు పండించే పంటలకు రెండింతలు ఇస్తామని, గోదావరి–కావేరి నదులను అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఆయన తమ డిమాండ్లను ఏమీ పరిష్కరించలేదన్నారు. వీటిని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసు కొచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలని తిరువణ్ణామలైలో బీజేపీ పోటీ చేసే నియోజక వర్గంలో పోటీచేయాలని నిర్ణయించుకున్నామన్నారు. దీంతోనే నగ్నంగా నామినేషన్ వేసేందుకు వచ్చినట్లు తెలిపారు. నగ్నంగా వచ్చిన ఇద్దరు రైతు నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చదవండి: ఘోరం: అందరూ చూస్తుండగానే... భర్త చేష్టలతో విసుగుచెంది... -
నోరు జారిన పన్నీర్‌సెల్వం.. అందరూ నవ్వడంతో..
తిరువళ్లూరు: కలైంజర్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం నోరు జారిన సంఘటన కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయపార్టీలు ప్రచార దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పొన్నేరి అన్నాడీఎంకే అభ్యర్థి బలరామన్, తిరువళ్లూరు అభ్యర్థి బీవీ రమణ, తిరుత్తణి అభ్యర్థి తిరుత్తణి హరికి మద్దతుగా డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం గురువారం రాత్రి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నేరిలో పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కలైంజర్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో రెండు దశబ్దాలు గడిచినా కలైంజర్ ముఖ్యమంత్రి కాలేరు’’ అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా గట్టిగా నవ్వేసారు. తప్పు దొర్లినట్టు గుర్తించిన పన్నీర్‌సెల్వం, స్టాలిన్ ఎన్నడూ ముఖ్యమంత్రి కాలేరని పేర్కొన్నారు. కాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధికి కలైంజర్ అన్న బిరుదు ఉన్న విషయం విదితమే. ఆయన వారసుడిగా డీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన స్టాలిన్, సీఎం కావాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటివరకు వెలువడిన సర్వేలన్నీ డీఎంకే అధికారం చేపట్టడం ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకేకు పట్టం కట్టేందుకు తమిళ ప్రజలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంటున్నాయి. ఇక కూటమి సీట్ల కేటాయింపులో భాగంగా, ఆ పార్టీ అభ్యర్థులు 170కు పైగా స్థానాల్లో పోటీచేస్తున్నారు. డీఎంకే మిత్రపక్షాలు సైతం, డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంపై పోటీ చేస్తుండటం గమనార్హం. చదవండి: స్టాలిన్‌ది ఒబామా స్టైల్! కమల్‌కు షాక్: రూ.11 కోట్లు సీజ్ -
స్టాలిన్‌ది ఒబామా స్టైల్!
సాక్షి, చెన్నై : డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌పై ఎండీఎంకే నేత వైగో ప్రశంసలు కురిపించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పోలుస్తూ కొనియాడారు. శుక్రవారం ఆయన స్టాలిన్ నియోజకవర్గమైన కొళత్తూరులో పర్యటించారు. వైగో మాట్లాడుతూ ఒబామా సెనేటర్‌గా ఉన్న సమయంలో తరచూ తాను ప్రాతినిథ్యం వహించే సెనేట్‌లో పర్యటించి ప్రజాసమస్యలు పరిష్కరించేవారన్నారు. అదే తరహాలో స్టాలిన్ సైతం ఎక్కడున్నా కొళత్తూరు ప్రజలతో మమేకమవుతుంటారని గుర్తుచేశారు. దీన్నిబట్టి ప్రజా సంక్షేమంపై వీరిద్దరి చిత్తశుద్ధి అర్థమవుతుందని వెల్లడించారు. అందుకే ఒబామా అమెరికా అధ్యక్షుడు అయ్యారని, ఇదే బాటలో స్టాలిన్ కూడా ముఖ్యమంత్రి కావడం తథ్యమని స్పష్టం చేశారు. చదవండి: సర్వేలన్నీ ఆ పార్టీ వైపే : 161 నుంచి 169 స్థానాలు! కమల్‌కు షాక్: రూ.11 కోట్లు సీజ్ -
234 స్థానాలకు 6,222 నామినేషన్లు దాఖలు
సాక్షి, చెన్నై: తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో పంచముఖ సమరం నెలకొంది. ఇందులో ప్రధాన కూటములుగా డీఎంకే – కాంగ్రెస్, అన్నాడీఎంకే – బీజేపీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 234 స్థానాల కుగాను 6,222 నామినేషన్లు దాఖలయ్యాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే – 173, కాంగ్రెస్ –25, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఎండీఎంకే లు తలా ఆరు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈ కూటమిలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్–3, మనిద నేయ మక్కల్ కట్చి 2, కొంగునాడు మక్కల్ కట్చి–3, తమిళగ వాల్వురిమై కట్చి, ఫార్వర్డ్‌బ్లాక్, ఆది తమిళర్ పేరవై, మక్కల్ విడు దలై కట్చిలు తలా ఓ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇందులో ఎండీఎంకే, మనిదనేయమక్కల్ కట్చి, కొంగునాడు మక్కల్ కట్చిలతో పాటు చిన్న పార్టీలు డీఎంకే ఉదయసూర్యుడి చిహ్నంపై పోటీ చేస్తున్నాయి. ఈ దృష్ట్యా, ఆపార్టీ చిహ్నంపై 188 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అన్నాడీఎంకే కూటమిలో ఆ పార్టీ –179, పీఎంఏకే –23, బీజేపీ–20, తమిళ మానిల కాంగ్రెస్–6, పెరుం తలైవర్ మక్కల్ కట్చి, తమిళగ మక్కల్ మున్నేట్ర కళగంతో పాటు మరికొన్ని చిన్న పార్టీలు తలా ఓ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. చిన్న పార్టీలన్నీ అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంపై పోటీ చేయనున్నాయి. కూటములు.. నటులు.. అన్నాడీఎంకేలో చీలికతో ఆవిర్భవించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం కూటమిలో డీఎండీకే, ఎస్‌డీపీఐలు ఉన్నాయి. ఇందులో డీఎండీకే 60, ఎస్డీపీఐ ఆరు స్థానాల్లో పోటీ చేస్తుండగా, మిగిలి న చోట్ల దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విశ్వనటుడు కమలహాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం, మరో నటుడు శరత్‌కుమార్ నేతృత్వంలోని ఎస్ఎంకే, రవిపచ్చముత్తు నేతృత్వం లోని ఐజేకేలు ఓ కూటమిగా, సినీ నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొంటున్నాయి. ఐదు కూటములుగా పంచముఖ సమరం సాగుతున్నా, ప్రధాన పోటీ డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య సాగనున్నాయి. ఈ రెండు పార్టీలు ఇప్పటికే ప్రజల్ని ఆకర్షించే దిశగా ఉచిత పథకాలతో, ప్రగతి నినాదంతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించాయి. అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ సమన్వయ కమిటీ కో కన్వీనర్ పళని స్వామి, డీఎంకే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎంకే స్టాలిన్ సుడిగాలి ప్రచార పర్యటనలో ఉన్నారు. ఈ ఇద్దరు పరస్పరం వ్యక్తిగత విమర్శలతో సైతం ప్రచారం ఎక్కుబెట్టే పనిలో పడ్డారు. అన్నాడీఎంకే కూటమికి మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ, ఎనిమిది మంది కేంద్ర మంత్రుల ప్రచార సభలు ఈ నెల 23 తర్వాత సాగనున్నాయి. 6,222 నామినేషన్ల దాఖలు.. ఈ నెల 12వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం సాగుతూ వచ్చింది. శుక్రవారం సాయంత్రంతో నామినేషన్లు ముగిశాయి. శుక్రవారం రాత్రి ఏడున్నర గంటలకు అందిన సమాచారం మేరకు 234 స్థానాల్లో పోటీ నిమిత్తం 6,222 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో పురుషులు 5,274, మహిళలు 945 మంది కాగా, ముగ్గురు ఇతరులు ఉన్నారు. ఈ నెల 22న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తుదిజాబితా అదే రోజున వెలువడనుంది. అన్నాడీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యేలు తోపు వెంకటాచలం, చంద్రశేఖర్ ఆ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పెరుంతురై, సెంతామంగళం నియోజకవర్గాల్లో రెబల్స్‌గా పోటీలో ఉన్నారు. -
వీరప్పన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌కు షాకిచ్చిన డిపార్ట్మెంట్
సాక్షి, చెన్నై: ఎన్నికల్లో భార్య పోటీ చేస్తుండడం ఓ పోలీసు అధికారిని ఇరకాటంలో పడేసింది. ఆయన్ను బదిలీ చేస్తూ, ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ పోలీసు బాసుల నిర్ణయం తీసుకున్నారు. తిరునల్వేలి జిల్లా అంబాసముద్రం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థిగా రాణిరంజితం పోటీ చేస్తున్నారు. ఆమె నామినేషన్ దాఖలు, ప్రచారంలో బిజీ అయ్యారు. ఈ పరిస్థితుల్లో అదే జిల్లాలో నగర అదనపు కమిషనర్‌గా ఆమె భర్త వెల్లదురై పనిచేస్తుండడంతో రచ్చకెక్కింది. చందనపు దొంగ వీరప్పన్ ఎన్కౌంటర్ టీంలో కీలక పాత్ర పోషించడమే కాదు, అనేక ఎన్కౌంటర్లతో ఎన్కౌంటర్ వెల్లదురైగా పేరు గడించిన ఈ అధికారికి భార్య రూపంలో విధి నిర్వహణలో చిక్కులు తప్పలేదు. దీంతో తిరునల్వేలి కమిషనర్ అన్బు ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, అధికార అన్నాడీఎంకే నుంచి చీలిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంలో ఈ అధికారి సతీమణి పోటీ చేస్తుండడం కాబోలు, ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా చెన్నై డీజీపీ కార్యాలయంలో ఎన్నికల విధులకు దూరంగా ఓ మూలన కూర్చోబెట్టడం గమనార్హం. శ్రీరంగంలో చిన్నమ్మ పూజలు సాక్షి, చెన్నై: తిరుచ్చి శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో శుక్రవారం చిన్నమ్మ శశికళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, సమయపురం మారియమ్మన్ ఆలయాన్ని కూడా సందర్శించారు. పరప్పన అగ్రహార చెర నుంచి చెన్నైకు వచ్చిన 41 రోజుల తర్వాత ఇంటి నుంచి శశికళ అడుగు బయటపెట్టారు. గురువారం తంజావూరులోని కులదైవం ఆలయంలో పూజలు నిర్వహించారు. శుక్రవారం తిరుచ్చి శ్రీరంగం చేరుకుని రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ పూజల అనంతరం మధ్యాహ్నం తిరుచ్చిలోని బంధువు కళియ పెరుమాల్ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం సమయపురం మారియమ్మన్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. శనివారం చిన్నమ్మ భర్త నటరాజన్ మూడో వర్ధంతి. ఈసందర్భంన్ని పురస్కరించుకుని తంజావూరు ముల్లైవాయికాల్ స్తూపం ఎదురుగా ఉన్న నటరాజన్ సమాధి వద్ద చిన్నమ్మ నివాళులర్పించే అవకాశాలు ఉన్నాయి. చిన్నమ్మ తిరుచ్చి ఆలయ సందర్శన సమయంలో ఆమె వెన్నంటి అన్న కుమారుడు వెంకటేషన్ మాత్రమే ఉన్నారు. ఒకప్పుడు వీవీఐపీగా ఆలయ సందర్శనకు వచ్చిన శశికళ ఇప్పుడు సాదాసీదా వ్యక్తిగా వెళ్లి దర్శించుకుని వచ్చారు. -
కమల్‌కు షాక్: రూ.11 కోట్లు సీజ్
సాక్షి, చెన్నై: అవినీతికి వ్యతిరేక పోరాటం పేరుతో ముందుకు సాగుతున్న కమల్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ఇరకాటంలో పడింది. ఆ పార్టీ కార్యదర్శి చంద్రశేఖర్‌పై పలు అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా కాలంలో ప్రభుత్వం మాస్క్‌లు, పీపీఈ కిట్లను చంద్రశేఖర్‌కు చెందిన అనితా టెక్స్కార్ట్ ఇండియా నుంచి సుమారు రూ.450 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సంస్థపై ఐటీ దాడులు చేయడంతో విషయం బట్టబయలైంది. అలాగే ఈ సంస్థలో రూ.11కోట్ల లెక్కలో లేని నగదు పట్టుబడడమే కాకుండా సుమారు రూ.80కోట్ల పన్నును ఎగవేసినట్లు వెల్లడైంది. చదవండి: ఐటీ దాడులపై స్పందించిన తాప్సీ -
కమల్ మేనిఫెస్టో: నిరుద్యోగులు, గృహిణిలపై వరాల జల్లులు
సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా పదేళ్ల ప్రణాళికతో మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం ప్రకటించారు. అధికారంలోకి వస్తే, నీట్ పరీక్షకు బదులుగా రాష్ట్ర స్థాయిలో స్టేట్ సిల బస్తో సీట్ నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రామ ప్రగతికి స్మార్ట్ విలేజ్ పథకం, ఆర్మీ తరహాలో ప్రజా క్యాంటీన్ల ద్వారా అన్ని రకాల వస్తువుల్ని చౌక ధరకే అందించనున్నామని ప్రకటించారు. మక్కల్ నీది మయ్యం, ఎస్ఎంకే, ఐజేకేలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్ని కూటమిగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నేతల కమల్ పోటీలో ఉన్నారు. ఈ దృష్ట్యా, కోయంబత్తూరు వేదికగా శుక్రవారం ఎన్నికల మేనిఫెస్టోను సైతం కమల్ విడుదల చేశారు. ఇందులో తమిళనాడు సమగ్రాభివృద్ధి, అప్పు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల మెరుగు, విద్య, వైద్య పథకాలతో ప్రజాకర్షణ అంశాలను పొందుపరిచారు. పార్టీ ఉపాధ్యక్షులు మహేంద్రన్, పొన్రాజ్లతో కలిసి మేనిఫెస్టోను కమల్ ఆవిష్కరించారు. ప్రజల్ని బానిసలుగా, పేదలుగా మార్చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన పార్టీలకు విశ్రాంతి ఇద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. మేనిఫెస్టోలో కొన్ని.. ∙రాష్ట్ర ప్రగతిని కాంక్షిస్తూ పదేళ్ల ప్రణాళిక ∙రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ∙అన్ని రంగాల్లోనూ తమిళనాడు అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యం. రాష్ట్ర ఆర్థిక ప్రగతి రానున్న పదేళ్లలో పది నుంచి 20 శాతం మేరకు వృద్ధి లక్ష్యంగా కార్యాచరణ ∙వ్యక్తి ఆదాయం సంవత్సరానికి 7 నుంచి పది లక్షల వరకు పెంపు ∙నదీ జలాల అనుసంధానం, జల అభివృద్ధి, వాటర్ మెనేజ్మెంట్బోర్డు, అందరికీ స్వచ్ఛమైన శుద్ధీకరించిన నీళ్లు ∙వ్యవసాయ రంగంలో హరిత విప్లవం లక్ష్యం. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర, రైతుల హక్కుల పరిరక్షణ ∙జాలర్లకు జీవనాధారం, భద్రత లక్ష్యంగా చర్యలు ∙ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగు. నీట్‌కు బదులు రాష్ట్ర స్థాయిలో స్టేట్ సిలబస్‌తో సిట్ పరీక్ష. అందరికీ వైద్యం, విద్య, ఉన్నత విద్యకు చర్యలు ∙గ్రామాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ స్మార్ట్ విలేజ్ పథకం ∙ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయం, అర్హులకు ఉద్యోగాలు, పారిశ్రామిక ప్రగతి, వృద్ధులకు భద్రత, అనాథలకు ఆపన్న హస్తం, రాజకీయ న్యాయం, సమష్టి నాయకత్వంఅభివృద్ధి చెందిన చిన్న దేశాలకు దీటుగా తమిళనాడును తీర్చిదిద్దడం లక్ష్యంగా పథకాలు అమలు. ∙గృహిణులకు జీతాలు (ఇది ఉచితం కాదు –వారికి వృత్తిపరంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం) ∙విద్యుత్, రవాణా సంస్థల బలోపేతం. ఈ సంస్థల్లో ఉద్యోగులకు వాటా. ∙ప్రజలు చౌక ధరకే అన్ని వస్తువుల్ని కొనుగొలు చేసుకునే రీతిలో ఆర్మీ క్యాంటీన్ల తరహాలో మక్కల్ క్యాంటీన్ల ఏర్పాటును మేనిఫెస్టోలో పొందుపరిచారు. సీపీఎం, టీఎంసీలు కూడా.. డీఎంకే కూటమిలోని సీపీఎం, అన్నాడీఎంకే కూటమిలోని తమాకా కూడా మేనిఫెస్టోలను శుక్రవారం ప్రకటించారు. సీపీఎం రాష్ట్రకార్యదర్శి బాలకృష్ణన్, సీనియర్ నేత టీకే రంగరాజన్ ఆవిష్కరించిన మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యనిషేధం, ఖాళీగా ఉన్న 4.5 లక్షల ఉద్యోగాల భర్తీ, శరణార్థులుగా ఉన్న శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం అంశాలను ఇందులో పొందుపరిచారు. టీఎంసీ నేత జీకే వాసన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రభుత్వ పాఠశాలల ప్రగతి, ఫీజుల తగ్గింపు, వైద్య, వ్యవసాయ రంగాల బలోపేతం, ఆలయాలన్నీ భక్తులకు అప్పగింత, -
మిమ్మల్ని నమ్మి రాజకీయాల్లోకి వచ్చా!
తిరువళ్లూరు/చెన్నై: మిమ్మల్ని నమ్ముకునే రాజకీయాలోక్లి వచ్చానని రాష్ట్రాభివృద్ధి కోసం డీఎంకేను ఆదరించాలని డీఎంకే అధినేత స్టాలిన్ ప్రజలను కోరారు. గుమ్మిడిపూండిలో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజే గోవిందరాజన్, పొన్నేరి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దురైచంద్రశేఖర్లకు మద్దతుగా డీఎంకే అధినేత స్టాలిన్ గురువారం ప్రచారం నిర్వహించారు. స్టాలిన్ మాట్లాడుతూ కరుణానిధి పాలనను మళ్లీ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా డీఎంకే అధికారంలోకి వస్తే వ్యవసాయం, చేనేతకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని హామీ ఇచ్చారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. వరికి క్వింటాల్‌కు రూ.2,500, టన్ను చెరుకుకు రూ.4వేల మద్దతు ధర ఇస్తామని తెలిపారు. డీఎంకే మేనిఫెస్టోను కాపీ చేసి అన్నాడీఎంకే మేనిఫెస్టోను రూపొందించారని ఆరోపించారు. నీట్ పరీక్షలను రాష్ట్రంలో అనుమతించొద్దని అన్నాడీఎంకేను కోరినా ఫలితం లేదని ఆరోపించారు. చదవండి: కోటీశ్వరుల్లో నంబర్–1 సుబ్బయ్య 20 సీట్లు.. 30 మంది స్టార్ క్యాంపెయినర్లు! -
సొంత డబ్బుతో తిరుగుతున్నా.. అనుమతి ఎందుకివ్వరు!
సాక్షి, చెన్నై: సొంత డబ్బు ఖర్చు పెట్టి హెలికాప్టర్లో తిరుగుతున్నానని, ఇందుకు అనుమతి ఇవ్వకపోవడం ఎమిటో అని అధికారుల తీరుపై విశ్వనటుడు కమలహాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో గురువారం ఎన్నికల ప్రచారం రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి కమల్‌కు ఏర్పడింది. మక్కల్ నీది మయ్యం అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా కమల్ ఉన్నారు. కోవై దక్షిణం నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్న దృష్ట్యా, అక్కడి నుంచే సమీప జిల్లాల్లో ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రైవేటు హెలికాప్టర్ సిద్ధం చేసుకున్నారు. బుధవారం కోవై నుంచి ఈరోడ్‌కు హెలికాప్టర్లో వచ్చి మళ్లీ ప్రచారం చేసి వెళ్లారు. గురువారం కోయంబత్తూరు నుంచి నీలగిరి జిల్లా ఊటి, కున్నురూ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి కమల్ నిర్ణయించారు. ఉదయం కోయంబత్తూరు నుంచి బయలుదేరి కున్నూరు లేదా, దిట్టకల్ వద్ద హెలికాప్టర్ నుంచి దిగి, రోడ్డు మార్గంలో ప్రచారానికి నిర్ణయించారు. అయితే, ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎన్నికల ప్రచారం ఆయన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కష్టపడ్డ సొమ్ముతో.. ప్రచారం రద్దు కావడంతో కోయంత్తూరు ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి తంగవేల్ నామినేషన్ దాఖలు కార్యాక్రమానికి కమల్ హాజరయ్యారు. మీడియాతో కమల్ మాట్లాడుతూ అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రజల్ని కలుసుకునేందుకు, సమయం వృథా కాకుండా వినియోగించు కునేందుకు హెలికాప్టర్ పర్యటనను ఎంపిక చేసుకున్నట్టు తెలిపారు. కష్టపడ్డ సొమ్ముతో తిరుగుతున్నానని కమల్ పేర్కొన్నారు. 234 నియోజకవర్గాల్లోనూ ప్రజల్ని కలుస్తానని, లభిస్తున్న ఆదరణ చూసి అడ్డుకుంటున్నట్టుందని మండిపడ్డారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే! -
కోటీశ్వరుల్లో నంబర్–1 సుబ్బయ్య
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరిలో అత్యంత ధనవంతుడిగా అన్నాడీఎంకే అభ్యర్థి ఇసక్కి సుబ్బయ్య నిలిచారు. ఆయన ఆస్తి రూ. 246 కోట్లుగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ల సమర్పణలో నిమగ్నమయ్యారు. ఇందులో మంత్రులు, మాజీలు, సిట్టింగ్‌లు అనేక మంది ఉన్నారు. వీరందరి ఆస్తులు కోట్లలోనే ఉన్నాయి. అయితే, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమలహాసన్, ఉపాధ్యక్షుడు మహేంద్రన్ ఆస్తులు మూడు డిజిట్ కోట్లలో ఉన్నాయి. కమలహాసన్ ఆస్తి రూ.177 కోట్లుగా, మహేంద్రన్ ఆస్తి 160 కోట్లుగా ఉన్నాయి. వీరందర్నీ తలదన్నే రీతిలో కోటీశ్వరుల జాబితాలో అన్నాడీఎంకే మాజీ మంత్రి ఇసక్కి సుబ్బయ్య నంబర్‌వన్‌గా నిలిచారు. 2011లో ఆయన ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఆస్తి విలువ రూ.60 కోట్లు. ఆ తర్వాత న్యాయశాఖమంత్రిగా పనిచేసినా 2016 ఎన్నికల్లో సీటు దక్కలేదు. తాజాగా ఆయనకు తిరునల్వేలి జిల్లా అంబాసముద్రం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. దీంతో బుధవారం ఆ నియోజకవర్గంలో ఇసక్కి సుబ్బయ్య నామినేషన్ వేశారు. ఈ అఫిడవిట్లో తన ఆస్తి విలువ రూ. 246 కోట్లుగా ప్రకటించారు. తనతో పాటు భార్య మీనాక్షి పేరిట చర ఆస్తులు రూ. 6.86 కోట్లు అని, స్థిర ఆస్తులు రూ. 239 కోట్లు అని లెక్కచూపించారు. అప్పులు రూ. 5 కోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో ఇసక్కి సుబ్బయ్య ఆస్తి నాలుగు రెట్లు పెరగడం గమనార్హం. చెన్నై అన్నానగర్‌లో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి ఎంకే మోహన్ రెండో స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తి విలువ రూ.211 కోట్లుగా ప్రకటించారు. చదవండి: స్టాలిన్ మొత్తం ఆస్తుల విలువ ఇంతేనా పది చదవని హీరో కమల్‌హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా..? -
20 సీట్లు.. 30 మంది స్టార్ క్యాంపెయినర్లు!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను బీజేపీ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తమిళనాడు ఆడపడుచు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితర ముఖ్య నేతలు ప్రచారం నిర్వహించనున్నారు. ఇక వీరితో పాటు స్థానిక బీజేపీ నేత, నటి గౌతమిని కూడా స్టార్ క్యాంపెయినర్‌గా అధిష్టానం ప్రకటించింది. కాగా అన్నాడీఎంకే- బీజేపీ కూటమిలో సీట్ల కేటాయింపులో భాగంగా కాషాయ పార్టీకి 20 సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో రాజపాళయం సీటు కమలనాథుల చేజారడంతో, ఆ స్థానం నుంచి పోటీపడదామనుకున్న గౌతమికి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో స్టార్ క్యాంపెయినర్‌గా ఆమె సేవలు వినియోగించుకోవాలని అధిష్టానం నిర్ణయించడం గమనార్హం. కాగా ఏప్రిల్ 6న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, మే 2 న ఫలితాలు వెలువడనున్నాయి. కమల్ వర్సెస్ గౌతమి! మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్, తమ పార్టీ 154 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతూ దూకుడు పెంచారు. కాగా కమల్ హాసన్- గౌతమి పదమూడేళ్ల పాటు సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. విభేదాలు తలెత్తిన కారణంగా 2016లో వీరు విడిపోయారు. ఇక గౌతమిని స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించడంతో, ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. కాగా ఐజేకే కూటమి సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కమల్‌కు శరత్ కుమార్, రాధిక వంటి ప్రముఖుల మద్దతు ఉంది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే 1. నరేంద్ర మోదీ 2. జేపీ నడ్డా 3. రాజ్‌నాథ్ సింగ్ 4. అమిత్ షా 5. నితిన్ గడ్కరీ 6.నిర్మలా సీతారామన్ 7. స్మృతి ఇరానీ 8. ఎస్ జైశంకర్ 9. కిషన్‌రెడ్డి 10. జనరల్ వీకే సింగ్(రిటైర్డు) 11. యోగి ఆదిత్యనాథ్ 12. శివరాజ్ సింగ్ చౌహాన్ 13. సీటీ రవి 14. పురందేశ్వరి 15. పి సుధాకర్ రెడ్డి 16. తేజస్వి సూర్య 17. ఎల్ గణేషన్ 18. వీపీ దురైస్వామి 19.కేటీ రాఘవన్ 20. శశికళ పుష్ప 21. గౌతమి తాడిమల్ల 22. రాధారవి 23. కేపీ రామలింగం 24. గాయత్రీ దేవి 25. రాజ్‌కుమార్ గణేషన్ 26. విజయశాంతి 27. సెంథిల్ 28. వెల్లూర్ ఇబ్రహీం 29. ప్రొఫెసర్ రామ శ్రీనివాసన్ 30. ప్రొఫెసర్ కనగ సబాపతి చదవండి: కమల్ సీఎం కావడం ఖాయం.. -
డీఎంకే కూటమి: వైగో ప్రత్యేక మేనిఫెస్టో!
సాక్షి, చెన్నై: ఎండీఎంకే నేత వైగో 55 హామీలతో ప్రత్యేక మేనిఫెస్టోను బుధవారం ప్రకటించారు. డీఎంకే కూటమిలో ఎండీఎంకే ఆరు స్థానాల్లో పోటీచేస్తున్న విషయం తెలిసిందే. డీఎంకే చిహ్నం ఉదయ సూర్యుడిపై ఈ పార్టీ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో డీఎంకే అధికారంలోకి రాగానే, తమ పార్టీ తరఫున అమలు చేయిస్తామని 55 హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో ప్రకటించారు. హామీల్లో కొన్ని.. హిందీ, సంస్కృతాన్ని రాష్ట్రంలోకి అనుమతించం అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం లక్ష్యంగా ముందుకు వ్యవసాయాన్ని రక్షించుకుంటాం.ఈ రంగాన్ని నాశనం చేసే రీతిలో తీసుకొచ్చే పథకాలను అడ్డుకుంటాం నదుల అనుసంధానానికి చర్యలు, నది జలాల పంపిణీలో చిక్కులు, వివాదాల పరిష్కారానికి సహకారం. పరిశ్రమల అభివృద్ధి, పబ్లిక్ రంగ సంస్థల పరిరక్షణ, విద్యుత్ వినియోగం క్రమబద్ధీకరణ, కారి్మక సంక్షేమం, అధికారంలోకి డీఎంకే రాగానే, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, రవాణా ఉద్యోగ కార్మికుల డిమాండ్లపై దృష్టి అవినీతినిరూపు మాపడం లక్ష్యం, స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారాలు, సంపూర్ణ మద్యనిషేధానికి చర్యలు ప్రజా జీవితాల్లో వెలుగు లక్ష్యంగా పథకాల అమలుకు పట్టు, వెనుకబడిన సామాజిక వర్గాలు, మైనారిటీ సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగుతామన్న హామీలు గుప్పించారు. చదవండి: చిన్నమ్మ మద్దతు మాకే! సర్వేలన్నీ ఆ పార్టీ వైపే : 161 నుంచి 169 స్థానాలు! -
చిన్నమ్మ మద్దతు మాకే!
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ మానసిక ఆదరణ, మద్దతు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకే అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దినకరన్ ధీమా వ్యక్తం చేశారు. దుష్టశక్తి డీఎంకేను, ద్రోహశక్తి అన్నాడీఎంకే పాలకుల్ని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకుంటామన్నారు. దినకరన్ అమ్మమక్కల్ మున్నేట్ర కళగం, విజయకాంత్ డీఎండీకేతో పాటు ఎస్‌డీపీఐలు కూటమిగా ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కూటమి ఒప్పందాలు జరిగిన రోజున దినకరన్ చెన్నైలో లేరు. కోవిల్పట్టిలో నామినేషన్ దాఖలు చేసి చెన్నైకు వచ్చిన ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారం శ్రీకారం చుట్టారు. ఈ పరిస్థితుల్లో బుధవారం కోయంబేడులోని డీఎండీకే కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆ పార్టీ నేత విజయకాంత్‌తో భేటీ అయ్యారు. అనంతరం దినకరన్ మీడియాతో మాట్లాడుతూ తమది విజయకూటమి అని ప్రకటించారు. దుష్టశక్తుల్ని రానివ్వం.. ఈ ఎన్నికల్లో డీఎండీకే 60, ఎస్డీపీఐ ఆరుచోట్ల పోటీ చేస్తున్నాయని దినకరన్ తెలిపారు. డీఎండీకే కూటమిలోకి రాగానే, ముందుగా తాను ప్రకటించిన 42 మంది పార్టీ అభ్యర్థులు స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారని వివరించారు. ఆ మేరకు ఆర్మీ కట్టుబాట్లతో తమ కేడర్ ఉన్నారని పేర్కొన్నారు. విజయకాంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని పేర్కొంటూ, తమ ఇద్దరి సిద్ధాంతం లక్ష్యం ఒక్కటే అన్నారు. డీఎంకే, అన్నాడీఎంకే అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవడమేనని స్పష్టం చేశారు. చదవండి: ఎన్నికలకు దూరంగా రజనీకాంత్ స్నేహితుడు కమల్ సీఎం కావడం ఖాయం.. -
ఎన్నికలకు దూరంగా రజనీకాంత్ స్నేహితుడు
సాక్షి, చెన్నై: పార్టీ ప్రకటించినా, మేనిఫెస్టో విడుదల చేసినా, 234 స్థానాల్లో ఒంటరి సమరం అన్న నిర్ణయం తీసుకున్నా, చివరి క్షణంలో ఎన్నికల నుంచి వైదొలుగుతున్నట్టు తలైవా రజనీకాంత్ సన్నిహితుడు అర్జునమూర్తి బుధవారం చెన్నైలో ప్రకటించారు. తాను ప్రకటించనున్న పార్టీకి సమన్వయకర్తగా అర్జునమూర్తిని రజనీకాంత్ నియమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిణామాలతో అనారోగ్య కారణాలతో పార్టీ పెట్టడం లేదని, రాజకీయాలకు ఇక దూరమని రజనీకాంత్ ప్రకటించారు. దీంతో గత నెల అర్జునమూర్తి సొంత పార్టీగా ఇండియా మక్కల్ మున్నేట్ర కట్చిని ప్రకటించుకున్నారు. ఈ పార్టీకి ఎన్నికల కమిషన్ రోబో చిహ్నం కేటాయించింది. దీంతో గతవారం ఎన్నికల మేనిఫెస్టోను సైతం అర్జున మూర్తి విడుదల చేశారు. 234 స్థానాల్లోనూ తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. వివిధ పార్టీల్లోకి వెళ్తున్న రజనీకాంత్ అభిమానులు తన వైపు రావాలని పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారంతో నామినేషన్ల గడవు ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటిస్తారనుకున్న అర్జునమూర్తి బుధవారం ఓ ప్రకటన చేశారు. అందులో తాను ఎన్నికల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. తన పార్టీకి ప్రచారంగా సిద్ధం చేస్తున్న రోబో ఇక్కడకు రావడానికి మరింత సమయం పడుతుందని వివరణ ఇచ్చారు. కరోనా వ్యాప్తి పెరుగు తుండడంతో మద్దతుదారుల ఆరోగ్య క్షేమాన్ని కాంక్షించి పోటీ చేయడం లేదని ప్రకటించారు. రజనీ పార్టీ ప్రకటన ముందే యూటర్న్ తీసుకుంటే, ఆయన సన్నిహితుడు పార్టీ ప్రకటించి, మేనిఫెస్టో విడుదల చేసి, ఎన్నికల కమిషన్ కేటాయించిన రోబో చిహ్నాన్ని భుజానకెత్తుకుని నామినేషన్ల చివరి క్షణంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికల బరిలో విజయకాంత్ సతీమణి -
కమల్ సీఎం కావడం ఖాయం: రాధిక
సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు సర్వేలో స్పష్టమైంది, సుపరిపాలనే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఐజేకే కూటమి గెలుపు తథ్యం, కమల్‌హాసన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని సమత్తువ మక్కల్ కట్చి (ఎస్ఎంకే) అగ్రనేత, నటి రాధిక ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సారి కొత్త కూటమి. విద్య, వైద్యరంగంలో ప్రసిద్ధులైన ఇండియా జన నాయక కట్చి అధ్యక్షులు రవి పచ్చముత్తు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు కమల్‌హసన్, నా భర్త, సమత్తువ మక్కల్ కట్చి అధినేత శరత్‌కుమార్‌లతో కూటమిగా ఏర్పడ్డాం. ఎప్పుడూ లీడింగ్ పార్టీలకే ఓటు వేసిన ప్రజలు ఒక మార్పు రావాలని ఆశిస్తున్నారు. ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం. మాది ఒక బలమైన కూటమి. ప్రజలు ఒక మార్పు రావాలని కోరుకునే క్రమంలో విద్యావంతులు, మేధావులు ఉంటారు. వారంతా ఏకగ్రీవంగా మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఇది చాలా అరుదైన ప్రగతిశీల ఆలోచన. గుడ్ గవర్నెస్ కోసం మాకు ఓటు వేయాలి. పరిపాలనలో ఒక మార్పు తీసుకొస్తామని ప్రజలకు ప్రమాణం చేస్తున్నాం. ఎస్ఎంకే మేనిఫెస్టో, ఎంఎన్ఎం మేనిఫెస్టోలు తరచి చూస్తే సుపపరిపాలనకు, వాస్తవికతకు దగ్గరగా అద్దం పడుతున్నాయి. భావితరాల కోసం కమల్‌హాసన్ మంచి చేస్తారనే నమ్మకం ప్రజలందరికీ ఉంది. అందుకే కమల్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని విశ్వసిస్తున్నట్లు రాధిక తెలిపారు. -
పోటీకి దూరంగా విజయకాంత్.. బరిలో సతీమణి
సాక్షి, చెన్నై: డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్ విరుదాచలం నుంచి పోటీ చేయనున్నారు. భర్త, పార్టీ అధినేత విజయకాంత్ ప్రప్రథమంగా గెలిచిన నియోజకవర్గం ఇదే కావడం గమనార్హం. ఈ సారి ఎన్నికల్లో విజయకాంత్ పోటీ చేయడం లేదు. అన్నాడీఎంకేతో జతకట్టేందుకు ప్రయత్నించి చివరకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో సర్దుకోవాల్సిన పరిస్థితి విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు ఎదురైన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో నీవే సీఎం అభ్యర్థి అంటూ, ప్రజాకూటమికి సారథ్యం వహించాలని అనేక పార్టీలు విజయకాంత్ చుట్టూ తిరిగాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారడంతో ఈ సారి పొత్తుకోసం డీఎండీకే కుస్తీలు పట్టక తప్పలేదు. ఎట్టకేలకు అమ్మముక ఇచ్చిన 60 సీట్లలో పోటీకి డీఎండీకే సిద్ధమైంది. 2006 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయకాంత్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అనారోగ్య సమస్యల దృష్ట్యా, ఆయన పోటీ చేయనప్పటికీ, చివరి క్షణంలో ప్రచారంలోకి రాబోతున్నారు. ఆయన తరఫున ప్రేమలత విజయకాంత్ ప్రప్రథమంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. 2005లో డీఎండీకే ఆవిర్భావంతో ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి విజయకాంత్ ఒక్కడే విరుదాచలం నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కారు. ప్రస్తుతం ఇదే విరుదాచలంను ప్రేమలత ఎంపిక చేసుకున్నారు. విరుదాచలం ప్రగతికి విజయకాంత్ గతంలో చేసిన సేవలు, అక్కడ ఆయనకు ఉన్న అభిమానాన్ని పరిగణించి ప్రేమలత ఓట్ల వేటకు సిద్ధమయ్యారు. ఈనెల 19న చివరి రోజు నామినేషన్ దాఖలుకు నిర్ణయించారు. మంగళవారం ప్రేమలత మాట్లాడుతూ విరుదాచలం నుంచి తాను పోటీ చేయనున్నానని, తమ కూటమి విజయకేతనం ఎగురవేయడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. విజయకాంత్ చివరి క్షణంలో ఎన్నికల ప్రచారంలోకి వస్తారని, ఆ వివరాలను మరి కొద్దిరోజుల్లో ప్రకటిస్తామన్నారు. చదవండి: సర్వేలన్నీ ఆ పార్టీ వైపే : 161 నుంచి 169 స్థానాలు! -
అధికారంలోకి వస్తే ‘అమ్మ మృతి’ మిస్టరీ చేధిస్తాం
చెన్నె: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాలు వాడివేడీగా కొనసాగుతున్నాయి. తొలిసారి జయలలిత, కరుణానిధి లేని అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలపై వారి ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఈ నేపథ్యంలోనే డీఎంకే అధినేత స్టాలిన్ సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో అధికార పార్టీ అన్నాడీఎంకేను ఇరుకున పడేసేలా చేసింది. తాము అధికారంలోకి వస్తే అమ్మ (జయలలిత) మృతి వెనుక ఉన్న రహాస్యాలను చేధిస్తామని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రోయపురంలో నిర్వహించిన కార్యక్రమంలో స్టాలిన్ ఈ మేరకు ప్రకటన చేశారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం జయలలిత మృతి విషయంలో వాస్తవాలు చెప్పడం లేదని ఆరోపించారు. అమ్మ మృతి వెనుక ఉన్న మిస్టరీని చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పళని, పన్నీర్ ఆసక్తి కనబర్చడం లేదని ఆరోపించారు. తమ ఎన్నికల మ్యానిఫెస్టోను అన్నాడీఎంకే కాపీ కొట్టిందని విమర్శించారు. 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనుంది. నామినేషన్ దాఖలుకు ఆఖరు తేదీ మార్చి 19, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 22 వరకు అవకాశం ఉంది. అనంతరం ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగనుంది. చదవండి: తాజా మాజీ ముఖ్యమంత్రికి అధిష్టానం షాక్ -
సర్వేలన్నీ ఆ పార్టీ వైపే : 161 నుంచి 169 స్థానాలు!
సాక్షి, చెన్నై: సర్వేలన్నీ డీఎంకే అధికారం తథ్యమని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఏబీపీ సర్వే కూడా డీఎంకేకు పట్టం కట్టేందుకు తమిళ ఓటర్లు సిద్ధమయ్యారని ప్రకటించింది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే, ఈ సారి అధికారం చేజిక్కించుకోవడం లక్ష్యంగా పరుగులు తీస్తోంది. ఆపార్టీ అభ్యర్థులు 170కు పైగా స్థానాల్లో పోటీచేస్తున్నారు. మిత్రపక్షాలు కొన్ని డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంపై పోటీ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే వెలువడ్డ రెండు సర్వేలు రాష్ట్రంలో డీఎంకే అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని ప్రకటించాయి. తాజాగా ఏబీపీ సీ ఓటర్స్ సర్వే సాగింది. మంగళవారం వెలువడ్డ ఈ సర్వే ఫలితాల మేరకు రాష్ట్రంలో డీఎంకే 161 నుంచి 169 స్థానాలు చేజిక్కించుకోవడం ఖాయం అని తేల్చింది. అన్నాడీఎంకేకు 53 నుంచి 61 స్థానాలు దక్కనున్నాయి. కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం ఖాతా తెరవబోతున్నది. రెండు నుంచి ఆరు మధ్య సీట్లను ఈ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దినకరన్ పార్టీకి 1 నుంచి 5 వరకు సీట్లు దక్కవచ్చని సర్వేలో తేలింది. సుడిగాలి ప్రచారంలో.. ‘ముఖ్య’ నేతలు పళనిస్వామి, స్టాలిన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మంగళవారం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సేలం ఉత్తరం నియోజకవర్గం పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలతో మమేకం అయ్యే రీతిలో రోడ్లపై నడుచుకుంటూ తమను ఆదరించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సాయంత్రం జరిగిన ప్రచార సభలో అన్నాడీఎంకే అవినీతిని ఎండగట్టే రీతిలో ప్రసంగాన్ని సాగించారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో కన్వీనర్, సీఎం పళని స్వామి పుదుకోట్టై జిల్లా విలాతికులంలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 18 నుంచి 22వ తేదీ వరకు 46 నియోజకవర్గాల్ని కలుపుతూ పళని ప్రచార పర్యటన సాగబోతోంది. మక్కల్ నీది మయ్యం నేత కమల్ తాను పోటీ చేస్తున్న కోవై దక్షిణం నియోజకవర్గంలో ఓటర్లను ఆకర్షించేలా ప్రచారం సాగించారు. రోడ్‌షోను తలపించే రీతిలో కాసేపు, మరికాసేపు నడుచుకుంటూ, ప్రజలతో ముచ్చటిస్తూ తనను ఆదరించడమే కాదు, మార్పు నినాదంతో మక్కల్ నీది మయ్యం అభ్యర్థులందర్ని గెలిపించాలని కోరారు. రాజకీయాలు తనకు వృత్తి కాదని, బాధ్యత అని నినదిస్తూ ప్రచారం చేశారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ తిరువొత్తియూరులో మంగళవారం సాయంత్రం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తొలిరోజు పొన్నేరి, మాధవరం, అంబత్తూరు, ఆవడి, పూందమల్లి, మధురవాయిల్ నియోజకవర్గాల్ని కలుపుతూ ఆయన పర్యటన సాగింది. -
తమిళ అగ్ర నటుడు కమల్ హాసన్ తొలిసారి ప్రజల ముందుకు ఓటు కోసం వస్తున్నారు..
-
ఎన్నికల వేళ బీజేపీకి షాకిచ్చిన తమిళనాడు సీఎం
చెన్నె: రహాస్య బంధాన్ని అసెంబ్లీ ఎన్నికల వేళ బహిరంగపరిచారు. అన్నాడీఎంకే, బీజేపీలు కలిసి ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళ్లగా ఆదిలోనే అన్నాడీఎంకే బీజేపీకి షాకిచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సీఏఏ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగిన ఓ సమావేశంలో పళనిస్వామి సీసీఏ రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వమే మైనార్టీలకు భద్రత కల్పిస్తుందని ప్రకటించారు. మైనార్టీలు తమను విజ్ఞప్తి చేశారని.. ఆ విజ్ఞప్తి మేరకు తాము సీఏఏ ఉపసంహరించుకోవడంపై కేంద్రాన్ని కోరుతామని పళనిస్వామి తెలిపారు. ఈ విషయమై తాము హామీ ఇస్తున్నట్లు చెప్పారు. సీఏఏ విషయమై తమ పార్టీ మానిఫెస్టోలో కూడా ప్రస్తావించినట్లు గుర్తుచేశారు. ఈ ప్రకటన బీజేపీకి షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ చట్టం తప్పనిసరిగా అమలుచేయాలని భావిస్తోంది. ఈ సమయంలో అన్నాడీఎంకే తీసుకున్న ఈ నిర్ణయం బీజేపీకి నష్టం చేకూరుస్తుందని తెలుస్తోంది. డిసెంబర్ 22, 2019లో తీసుకువచ్చిన సీఏఏ చట్టం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చట్టానికి దక్షిణాది రాష్ట్రాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నాడీఎంకే ఈ చట్టం ప్రస్తావన తీసుకురావడం బీజేపీకి మింగుడు పడని విషయంగా భావించవచ్చు. అయితే ఈ ప్రకటన రావడానికి కారణం మొన్న స్టాలిన్ సీఏఏ చట్టాన్ని చెత్తకాగితంగా అభివర్ణించిన విషయం తెలిసిందే. శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇస్తామని హామీ ప్రకటించడంతో అన్నాడీఎంకే సీఏఏపై ఈ ప్రకటన చేసి ఉండవచ్చు. తమిళనాడులో ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతన ఎన్నికలు జరగనున్నాయి. చదవండి: కమల్‌హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా..? చదవండి: కోటి రూపాయల్లేని ముఖ్యమంత్రి.. ఎవరాయన? -
పది చదవని హీరో కమల్‌హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా..?
చెన్నె: సినిమాలతో అశేష జనాన్ని అలరించి లక్షలాది అభిమానం సొంతం చేసుకున్న తమిళ అగ్ర నటుడు కమల్ హాసన్ తొలిసారి ప్రజల ముందుకు ఓటు కోసం వస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ మరికొన్ని పార్టీలతో కలిసి ఈసారి పోటీ చేయనుంది. ఈ సందర్భంగా కమల్ కోయంబత్తూర్ దక్షిణం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ వేసిన అనంతరం ఆయన హాట్ టాపిక్ అయ్యారు. నామినేషన్ పత్రాల్లో సమర్పించిన ఆస్తుల వివరాలు చర్చకు దారి తీశాయి. మొత్తం ఆస్తులు రూ.176.93 కోట్లు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో కమల్ ప్రకటించారు. వాటిలో స్థిరాస్తులు రూ.131.84 కోట్లుగా, చరాస్థులు రూ.45.09 కోట్లుగా తెలిపారు. దీంతోపాటు లండన్‌లో రూ.2.50 వేల డాలర్లు విలువ చేసే ఇల్లు, రూ.2.7 కోట్ల లగ్జరీ కారు, రూ.కోటి విలువైన బీఎండబ్ల్యూ కారు ఉందని అఫిడవిట్లో పొందుపర్చారు. ఆస్తులతో పాటు అప్పులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రూ.49.5 కోట్లు అప్పు ఉందని తెలిపారు. అయితే కమల్ మాత్రం పదో తరగతి కూడా చదవలేదు. తాను 8వ తరగతి వరకు చదువుకున్నట్టు తెలిపారు. రూ.17.79 కోట్ల విలువైన వ్యవసాయ భూములు (37.59 ఎకరాలు), చెన్నెలో రూ.92.05 కోట్ల విలువైన భవనాలు ఉన్నాయి. చెన్నెలో ఉన్న రెండు నివాసాలు విలువ రూ.19.5 కోట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల్లో కమల్‌హాసన్ మూడో కూటమిని ఏర్పాటు చేశారు. మూడో కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్ హాసన్ ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో కమల్‌హాసన్ ఎలాంటి ప్రభావం చూపిస్తారోనని దక్షిణ భారతదేశంలో తీవ్ర చర్చ జరుగుతోంది. చదవండి: ఎన్నికల వేళ బీజేపీ షాకిచ్చిన తమిళనాడు సీఎం -
కమల్ కారుపై దాడి; చితక్కొట్టిన కార్యకర్తలు
చెన్నై : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో సినీ నటుడు, పార్టీ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కాంచీపురంలో పర్యటించి తిరిగి చైన్నైలోని హోటల్‌కు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి నటుడి వాహనంపై దాడికి ప్రయత్నించాడు. పీకలదాకా తాగిన ఓ యువకుడు మద్యం మత్తులో తమిళ సూపర్‌స్టార్‌ను కలవాలంటూ ఆయన కారును అడ్డుకొని అద్దాన్ని పగలగొట్టాడు. అయితే ఈ ఘటనలో కమల్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ కారు అద్దం మాత్రం ధ్వంసమైంది. వెంటనే అప్రమత్తమైన ఎంఎన్ఎం కార్యకర్తలు కారుపై దాడికి యత్నించిన వ్యక్తిని చితకొట్టారు. ఆ క్రమంలో అతని ముక్కు, నోరు నుంచి రక్తం కారింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మందుబాబుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అలాగే అతనిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. Man gets beaten brutally after allegedly banging on @ikamalhaasan's car window at Kancheepuram. He was reportedly beaten badly as word spread that Kamal's car window was broken! Vehicle is fine, says Kamal's team. pic.twitter.com/fiZdBZ6LCi — Pramod Madhav♠️ (@PramodMadhav6) March 14, 2021 ఇదిలా ఉండగా ఉద్దేశ్యపూర్వకంగానే కమల్ హాసన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఎంఎన్ఎం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి చర్యలకు భయపడేది లేదని చెబుతున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేత, మాజీ ఐపీఎస్ ఏజీ మౌర్య ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాగా తమిళనాడు ఎన్నికల్లో కమల్ హాసన్ తొలిసారి బరిలోకి దిగుతున్నారు. కోయంబత్తూర్ సౌత్ నుంచి కమల్ పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను కమల్ ఢీకొట్టబోతున్నారు. காஞ்சிபுரத்தில் எங்கள் தலைவரின் கார் கண்ணாடியை உடைத்து தாக்க முயன்றவர் காவல்துறையிடம் ஒப்படைக்கப்பட்டுள்ளார். நேர்மையின் பயணத்தை குள்ளநரித்தனத்தால் எதிர்கொள்பவர்களைக் கண்டு அஞ்சமாட்டோம். தலைவரின் இடிமுழக்கம் நாளை கோவையில். விரைவில் கோட்டையில்.#KamalHaasan @maiamofficial pic.twitter.com/XJfYlCcZ6A — A.G. Mourya IPS (Rtd) 🔦 (@MouryaMNM) March 14, 2021 -
శుభముహూర్తం కలిసొచ్చింది..!
సాక్షి, చెన్నై: శుభముహూర్తం కావడంతో సోమవారం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కానున్నాయి. సీఎం పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, మక్కల్ నీది మయ్యం నేత కమల్‌హాసన్, అమ్మ మక్కల్ మున్నేట్రకళగం నేత దినకరన్, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు శుక్రవారం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. శని, ఆదివారాలు సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. ఇక సోమవారం ముహూర్తం బాగుండడంతో నేతలందరూ నామినేషన్ల దాఖలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో కొన్ని సీట్లు మినహా మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఎడపాడిలో పళనిస్వామి, కొళత్తూరులో స్టాలిన్, కోయంబత్తూరు దక్షిణంలో కమలహాసన్, కోవిల్ పట్టిలో దినకరన్, తిరువొత్తియూరులో సీమాన్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అనంతరం ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. మంత్రులు, ముఖ్య నేతలంతా ఇదే రోజు నామినేషన్లు దాఖలు చేయనుండడంతో ఆయా కార్యాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో అభ్యరి్థతో పాటుగా మరొకరిని మాత్రమే రిటరి్నంగ్ అధికారుల వద్దకు అనుమతించనున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు రూ. 100 కోట్లు స్వాధీనం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి జరుగుతున్న తనిఖీల్లో శనివారం నాటికి రూ. 100 కోట్ల నగదు, నగలు, వస్తువులు పట్టుబడినట్లు ఎన్నికల యంత్రాంగం ప్రకటించింది. శని, ఆదివారాల్లోనూ పెద్దఎత్తున పట్టుబడిన నగదు, వస్తువుల వివరాలను సోమవారం ప్రకటించనున్నారు. ఆదివారం ఆవడిలో పాత సామాన్ల వ్యాపారి శరవణన్ ఇంట్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో రూ. 17 లక్షలు పట్టుబడింది. అలాగే తిరుప్పూర్‌లో మంత్రి ఉడములై రాధాకృష్ణన్ ముఖ చిత్రంతో వాచీలు, చీరలు, దోవతీలను స్వాధీనం చేసుకున్నారు. ఇక కోవిల్ పట్టిలో తనిఖీని అడ్డుకున్న మంత్రి కడంబూరు రాజుపై కేసు నమోదుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మరక్కాణం, చెంగల్పట్టు, వేలూరులో సాగిన సోదాల్లో రూ. 1.97 కోట్ల విలువ చేసే నగదు, నగలు, మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. మన్నార్‌కుడిలో 64 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. తిరుపతి నుంచి పట్టుచీరలు కొనేందుకు వచ్చిన ఓ బృందం వద్ద రూ. 2.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోవిల్లో ఓ హెలికాఫ్టర్ దిగడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అందులో తనిఖీలు జరిపారు. అయితే ఆ హెలికాఫ్టర్‌లో కేరళకు చెందిన ప్రముఖ బంగారు వ్యాపారి కల్యాణ రామన్ తన కుటుంబంతో అంకాల పరమేశ్వరి ఆలయ దర్శనానికి వచ్చినట్టు విచారణలో తేలింది. చదవండి: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..: అన్నాడీఎంకే వరాల జల్లు! -
ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..: అన్నాడీఎంకే వరాల జల్లు!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 163 హామీలతో కూడిన మేనిఫెస్టోను ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఆదివారం ప్రకటించారు. రేషన్ కార్డుదారులకు అమ్మ వాషింగ్ మెషన్లు, ఇళ్లు లేని వారికి పక్కా గృహాలు, ఇంటి వద్దకే రేషన్, మహిళల కోసం ఇంటి దీపం పథకం, ఇంటింటా సౌరశక్తి గ్యాస్ స్టౌవ్‌లు, ఏడాదికి ఆరు సిలిండర్లు తదితర వాగ్ధానాలతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. డీఎంకేకు పోటీగా.. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో శనివారం వెలువడ్డ విషయం తెలిసిందే. తమిళనాడు ప్రజలు ఉచితాలకు అలవాటు పడిన నేపథ్యంలో అందుకు భిన్నంగా ఈ మేనిఫెస్టో విడుదల చేశారు. 500 అంశాలతో కూడిన ఈ మేనిఫెస్టోలో ఆదివారం మరికొన్ని అంశాలు చేర్చారు. చెన్నై కాట్టుపల్లిలో అదాని హార్బర్ నిర్మాణం నిలుపుదల, ఈలం తమిళులకు భారత పౌరసత్వం, పౌర చట్టానికి వ్యతిరేకత, చెన్నై – సేలం గ్రీన్ వే పనుల నిలుపుదల వంటి అంశాలను అందులో చేర్చారు. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే మేనిఫెస్టో ఎలా ఉండబోతుందో అన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఉచిత పథకాలకు పెద్దపీట వేస్తూ 163 అంశాలతో కూడిన మేనిఫెస్టోను ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయంలో విడుదల చేశారు. మేనిఫెస్టోలోని పలు హామీలు అందరికీ ఇళ్లు, మహిళల కోసం అమ్మ ఇంటి దీపం పథకం, మహిళలకు ప్రయాణ చార్జీల్లో రాయితీ, ఉచిత వాషింగ్ మెషన్, సౌర శక్తి స్టౌవ్‌లు, ఇంటి వద్దకే రేషన్ సరుకులు, 2023– అమ్మ విజన్ అమలు, ఏడాదికి ఆరు ఉచిత సిలిండర్లు, కేబుల్ ప్రసారాలు, అమ్మ వివాహ కానుక పెంపుతో పాటు నవ దంపతులకు అన్ని రకాల వస్తువులతో ప్రత్యేక సారె. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ సేవలతో అమ్మ క్లినిక్‌ల విస్తరణ, క్యాన్సర్ చికిత్సకు ప్రాధాన్యత. ప్రసూతి సెలవులను 12 నెలలకు పొడిగింపు, మహిళా శివు సంరక్షణ నిధి పెంపు, మహిళ భద్రతకు అన్ని నగారాల్లోనూ గస్తీ వాహనం, పోలీసు యాప్, మహిళా స్వయం సహాయక బృందాలకు రుణాలు, అమ్మ బ్యాంకింగ్ కార్డుల పంపిణీ, ఇంటింటా దోమ తెరలు. రుణాలు రద్దు, 2జీబీ ఉచిత డేటా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణా కేంద్రాల ఏర్పాటు. ఇంటికో ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తమిళులకు ప్రత్యేక ప్రా«ధాన్యతకు చర్యలు. పట్టణాలు, నగరాల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల ఏర్పాటు. వృద్ధాప్య ఫించన్లు రూ. 1000 నుంచి రూ. 2 వేలకు పెంపు. ప్రత్యేక ప్రతిభావంతులకు రూ. 1,500 నుంచి రూ. 2500 పెంపు. జాతీయ అధికార భాషగా తమిళం. మద్రాసు హైకోర్టును తమిళనాడు హైకోర్టుగా మార్చడం, తమిళంలోనే వాదనలకు అనుమతి. తమిళాభివృద్ధికి ప్రత్యేక నిధులు, ప్రవాస తమిళుల కోసం ప్రత్యేక విభాగం, ఈలం తమిళుల సంక్షేమం, జంట పౌరసత్వం, రాజీవ్ హంతుకుల విడుదల. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర, కొనుగోలు, విక్రయ కేంద్రాలు, అరటి నారతో వస్త్రాల తయారీకి పెద్ద పీట, కొబ్బరి మొక్కల పంపిణీ, గిడ్డంగుల విస్తరణ, సౌర శక్తి మోటారు పంపు సెట్ల రాయితీ కొనసాగింపు. వ్యవసాయ కమిషన్ ఏర్పాటు, నమ్మల్వార్ పేరిట వ్యవసాయ పరిశోధన కేంద్రం, సీఎం – రైతు బంధు పథకం, దక్షిణ తమిళనాడులో అంతర్జాతీయ ప్రమాణాలతో బఫెల్లో పార్క్. పెట్రోల్ర, డీజిల్ ధర తగ్గింపునకు చర్యలు. 150 రోజులకు ఉపాధి పథకం పొడిగింపు. అమ్మగ్రీన్ హౌస్ నిర్మాణ సాయం రూ. 3.40 లక్షలకు పెంపు, సంక్రాంతి కానుక కొనసాగింపు. నెలసరి విద్యుత్‌చార్జీల వసూళ్లు, 9,10,11,12 తరగతి విద్యార్థులకు పౌష్టికాహార పథకం. అంగన్వాడీ పిల్లలకు పాలు, ఆటో డ్రైవర్లకు ఎంజీఆర్ గ్రీన్ ఆటో పథకం పేరిట రూ. 25 వేలు సాయం. దశల వారిగా మద్యం దుకాణాల మూత, సహకార రుణాలకు వడ్డీ రద్దు. ఆధ్యాతి్మక పర్యటనలకు ప్రభుత్వ సాయం పెంపు. శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణ. చదవండి: ‘థౌజండ్ లైట్స్’ నుంచి ఖుష్బూ లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.4 తగ్గిస్తాం -
వారసులకు టిక్కెట్లు ఇప్పించుకుంటున్న నేతలు!
సాక్షి, చెన్నై: తమిళనాడు కాంగ్రెస్‌లోకి వారసులొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ వారసులను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దించారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌కు 25 సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను తమిళనాడు కాంగ్రెస్ నేతలు సిద్ధం చేసి శుక్రవారం ఢిల్లీకి పంపించారు. గ్రూపు రాజకీయాలతో నిండిన తమిళనాడు కాంగ్రెస్‌లో ఈ జాబితా చిచ్చు పెట్టింది. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద రెండు రోజులుగా పలు గ్రూపులు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో శనివారం అర్ధరాత్రి 21 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. గ్రూపుల వివాదాలతో మిగిలిన నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. సీట్ల కేటాయింపు 21 మంది జాబితాలో పలువురు కాంగ్రెస్ నేతలు తమ వారసులకు సీట్లు ఇప్పించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఈవీకేఎస్ ఇళంగోవన్ తన కుమారుడు తిరుమగన్ ఈవేరాకు ఈరోడ్(ఈస్ట్) సీటు, మరో సీనియర్ ఎంపీ తిరునావుక్కరస్ తన వారసుడు రామచంద్రన్‌కు అరంతాంగి సీటు ఇప్పించుకున్నారు. అలాగే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కేఆర్ రామస్వామి తన కుమారుడు ఆర్ఎం కరుమాణిక్యంకు తిరువాడనై సీటును ఇప్పించుకోగా, రంగరాజ కుమారమంగళం వారసుడు ఆర్ మోహన్కుమార మంగళంకు ఓమలూరు సీటును కేటాయించారు. ఇక విరుదునగర్ ఎంపీ మాణిక్ ఠాకూర్ తన మామ రవిచంద్రన్‌కు మేలూరు సీటు దక్కేలా చేసుకున్నారు. కాగా, హెచ్. వసంతకుమార్ మరణంతో ఖాళీగా ఉన్న కన్యాకుమారి లోక్ సభ సీటును ఆయన కుమారుడు విజయ్ కుమార్ అలియాస్ విజయ్ వసంత్‌కు కేటాయించారు. చదవండి: నా కొడుకు రాజకీయాల్లోకి రాడు: కనిమొళి -
ఎట్టకేలకు ఖుష్బూకు ఛాన్స్: థౌజండ్ లైట్స్ నుంచి..
సాక్షి, చెన్నై: గతంలో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డ సినీ నటి ఖుష్బూకు ఈసారి బీజేపీ అవకాశం ఇచ్చింది. ఇటీవల బీజేపీలోకి చేరిన ఆమె చేపాక్కం–ట్రిప్లికేన్ నుంచి పోటీ చేయాలని భావించినా పొత్తులో భాగంగా ఆ స్థానం అన్నాడీఎంకేకు వెళ్లింది. దీంతో ఆ నియోజకవర్గానికి పక్కనే ఉన్న థౌజండ్ లైట్స్ సీటును బీజేపీ ఖుష్బూకు ఖరారు చేసింది. అలాగే ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు ఎల్మురుగన్ తారాపురంలో, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ సినీ నటుడు కమల్ హాసన్ బరిలో ఉన్న కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక డీఎంకే నుంచి సీటు ఆశించి భంగపడ్డ మదురై జిల్లా తిరుప్పరగుండ్రం డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే శరవణన్ ఆదివారం బీజేపీలో చేరారు. ఆయనకు మదురై ఉత్తరం సీటును బీజేపీ కేటాయించింది. డీఎంకే నుంచి బీజేపీలో చేరిన రెండో ఎమ్మెల్యేగా శరవణన్ నిలిచారు. మిత్రపక్షం బీజేపీకి అన్నాడీఎంకే కన్యాకుమారి లోక్‌సభ స్థానంతో పాటు 20 అసెంబ్లీ స్థానాలను కేటాయించింది. చదవండి: నా కొడుకు రాజకీయాల్లోకి రాడు: కనిమొళి -
'నా కొడుకు రాజకీయాల్లోకి రాడు'
సాక్షి, చెన్నై: తన కుమారుడు రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ఎంపీ కనిమొళి స్పష్టం చేశారు. డీఎంకేలో వారసత్వ రాజకీయాలు ఎక్కువే అన్న విష యం తెలిసిందే. కరుణానిధి వారసుడిగా స్టాలిన్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వారసుడు ఉదయనిధి స్టాలిన్ సైతం రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే కాదు, చేపాక్కం– ట్రిప్లికేన్ నుంచి ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాడు. కరుణ గారాల పట్టి కని మొళి సైతం డీఎంకేలో కీలకంగానే ఉన్నారు. భవిష్యత్తులో ఈమె కుమారుడు సైతం రాజకీయాల్లోకి రావచ్చన్న చర్చ తెరపైకి వచ్చింది. అయితే ఓ మీడియా ఇంటర్వ్యూలో తన కుమారుడు రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. అన్న, చెల్లెల అనుబంధమేగానీ, తమ మధ్య గొడవలు ఇప్పటివరకు లేదని, ఎన్నటికీ రావని స్పష్టం చేశారు. చదవండి: డీఎంకే అభ్యర్థులుగా తెలుగు ప్రముఖులు 215వ సారి నామినేషన్; భార్య నగలు కుదువపెట్టైనా సరే -
కంటైనర్‌లో రూ.36 కోట్ల బంగారం..
సాక్షి, చెన్నై: ఎన్నికల తనిఖీలు విస్తృతంగా సాగుతున్నాయి. సేలం సమీపంలో ఓ కంటైనర్‌లో రూ.36 కోట్ల విలువగల బంగారు ఆభరణాలను అధికారులు సీజ్ చేశారు. ఎన్నికల్లో నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా విస్తృత తనిఖీలు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శుక్రవారం అర్ధరాత్రి సేలం వైపుగా వచ్చిన ఓ మినీ కంటైనర్‌ను అధికారులు తనిఖీ చేశారు. అందులో రూ.36.5 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. సరైన రసీదులు లేని దృష్ట్యా, ఆ మినీ కంటైనర్‌ను భద్రత నడుమ గంగవళ్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉంచారు. గిండి నుంచి సేలంలోని నగల షోరూమ్‌కు ఆభరణాలు తరలిస్తున్నట్టు విచారణలో తేలింది. ఎవరి సొమ్మో.. తంజావూరులోని నగరాభివృద్ధి శాఖకు చెందిన ఓ అధికారి లాకర్లో రూ.3.39 కోట్ల నగదు, రూ. 174 సవర్ల నగలు ఉన్నట్టు ఏసీబీకి సమాచారం అందింది. దీంతో శుక్రవారం రాత్రి ఏసీబీ వర్గాలు ఆ లాకర్‌ను తెరిచి చూడగా, నగదు, నగలు బయటపడ్డాయి. చెన్నై తిరుప్పోరూర్– కేలంబాక్కం మార్గంలో ఓ వాహనంలో రూ. 24 లక్షలు అధికారులు పట్టుకున్నారు. అది ఏటీఎంకు తరలిస్తున్న నగదుగా వివరణ ఇచ్చుకున్నా ఫలితం శూన్యం. కోవిల్ పట్టిలో మంత్రి కడంబూరురాజు వాహనాన్ని సైతం ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. స్వతంత్ర అభ్యర్థులా మజాకా.. చెన్నై తిరువొత్తియూరు నుంచి హైకోర్టు న్యాయవాది జాకీర్‌హుస్సేన్ (47) స్వతంత్ర అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నగల డిపాజిట్‌కు సంబంధించి ధర్నా చేసి ఎన్నికల అధికారి దేవేంద్రన్‌కు ఆయన ముచ్చెమటలు పట్టించారు. విల్లివాక్కంలో స్వతంత్ర అభ్యర్థి కంద స్వామి రూ. పది వేల నగదుకుగాను 18 కేజీల చిల్లరను అధికారులకు సమర్పించి ముచ్చెమటలు పట్టించడం గమనార్హం. -
215వ సారి నామినేషన్; భార్య నగలు కుదువపెట్టైనా సరే
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజున ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా పలువురు స్వత్రంత అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో పద్మరాజన్(62) కూడా ఉన్నారు. ప్రత్యేకంగా ఈయన పేరే ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే.. రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లో నామినేషన్ వేయడం ద్వారా ఆయన ‘తేర్దల్ మన్నన్ ’(ఎన్నికల రాజు)గా పేరుగాంచారు. ఇక ఏప్రిల్ 6న శాసన సభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో మేట్టూరు నియోజకవర్గం నుంచి స్వతంత్రపద అభ్యర్దిగా నామినేషన్ వేశారు. కాగా 8వ తరగతి మాత్రమే చదువుకున్న పద్మరాజన్ సహకార సంఘాల ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు నామినేషన్లు వేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. తన ఇంటికి టెలిఫోన్ సౌకర్యం కోసం 1988లో తొలిసారిగా మేట్టూరు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. గిన్నీస్‌బుక్‌లో స్థానం కోసం ఆ తరువాత నుంచి అన్ని ఎన్నికల్లో నామినేషన్లు వేయడం కొనసాగించారు. ప్రధాని, ముఖ్యమంత్రి, అగ్రనేతలు పోటీచేసే స్థానాల్లో నామినేషన్లు వేయడం ద్వారా గుర్తింపు పొందారు. డిపాజిట్టుకు సొమ్ములేని పక్షంలో భార్య నగలు కుదువపెట్టి మరీ నామినేషన్లు వేస్తుంటారు. చదవండి: TN Assembly Polls: డీఎంకే మేనిఫెస్టో విడుదల -
లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.4 తగ్గిస్తాం
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) శనివారం తమ మేనిఫెస్టో విడుదల చేసింది. సుమారు ఐదు వందలకు పైగా హామీలతో ప్రజల ముందుకు వచ్చింది. విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇచ్చినట్లు డీఎంకే అధినేత స్టాలిన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే, సామాన్యుడి నెత్తిన గుదిబండలా మారిన ఇంధన, వంటగ్యాస్ ధరలు తగ్గిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా కార్మికులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని వాగ్దానం చేశారు. డీఎంకే మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు హిందూ ఆలయాల పునరుద్ధరణకు వెయ్యి కోట్లు మసీదులు, చర్చిల పునరుద్ధరణకు రూ.200 కోట్లు అన్నాడీఎంకే మంత్రుల అవినీతిపై విచారణకు ప్రత్యేక కోర్టు అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.4, పాలపై రూ.3 తగ్గిస్తాం పెంచిన ఆస్తిపన్నును రద్దు చేస్తాం వంటగ్యాస్‌పై సిలిండర్‌కు రూ.100 సబ్సిడీ జర్నలిస్టుల కోసం ప్రత్యేక కమిషన్ తమిళనాడులో నీట్ పరీక్షను రద్దు చేస్తాం కోయంబత్తూరు సహాఇతర ప్రధాన పట్టణాల్లో మెట్రోరైలు ప్రాజెక్టులకు శ్రీకారం ప్రముఖ యాత్రా స్థలాలకు వెళ్లాలనుకునే లక్ష మందికి రూ. 25 వేలు శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇచ్చే దిశగా ప్రయత్నాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో 40శాతం మహిళలకు అవకాశం ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాది పాటు మెటర్నటీ లీవులు తమిళనాడు వ్యాప్తంగా కలైంజ్ఙర్ క్యాంటీన్లు ఏర్పాటు కరోనాతో నష్టపోయిన బియ్యం కార్డుదారులకు రూ.4వేల సాయం చదవండి: TN Assembly polls : స్టార్ హీరో అరంగేట్రం -
డీఎంకేలో మూడో సూరీడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే అగ్రనేత దివంగత కరుణానిధి కుటుంబంలో మూడో వారసత్వం ఉదయించింది. కరుణానిధి మనవడు, స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. కూటమి చర్చలు, నియోజకవర్గాల కేటాయింపు ముగియడంతో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ 173 మందితో కూడిన పార్టీ అభ్యర్థుల జాబితాను శుక్రవారం ప్రకటించారు. మూడొంతుల మెజార్టీకి తగిన సంఖ్యలో సొంత అభ్యర్థులను పోటీకి దించారు. తొలిసారిగా ఉదయనిధి స్టాలిన్.. కరుణానిధి వంశంలో మూడో తరం తొలిసారిగా ఎన్నికల రంగంలోకి దిగింది. కరుణానిధి మనుమడు, స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ చెన్నై ట్రిప్లికేన్ నుంచి పోటీ చేస్తున్నారు. తమిళ సినీ రంగంలో తనదైన స్థానం సంపాదించుకున్న ఉదయనిధికి రెండేళ్ల క్రితమే డీఎంకే యువజన విభాగం కార్యదర్శి బాధ్యతలను స్టాలిన్ అప్పగించారు. తన తాత కరుణానిధికి కంచుకోటైన ట్రిప్లికేన్ నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగనున్నారు. యథాప్రకారం కొళత్తూరు నుంచి మూడోసారి స్టాలిన్ పోటీకి దిగుతున్నారు. ఇక పార్టీలోని ప్రముఖులందరికీ సీట్లు దక్కాయి. కూటమిలోని కొన్నిపార్టీలు డీఎంకే ఉదయసూర్యుని చిహ్నంపై పోటీ చేస్తున్నాయి. దీంతో ప్రత్యక్ష, పరోక్ష అభ్యర్థులను కలుపుకుంటే డీఎంకే 187 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లయింది. 178 చోట్ల అన్నాడీఎంకే.. అధికార అన్నాడీఎంకే 178 స్థానాల్లో సొంత పార్టీ అభ్యర్థులను బరిలోకి దించగా రెండాకుల చిహ్నంపై పోటీచేసే అభ్యర్థులను కలుపుకుంటే మొత్తం 191 స్థానాల్లో అన్నాడీఎంకే తలపడుతోంది. 2 జాతీయ పార్టీలతో కమల్ ఢీ మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన రెండు జాతీయ పార్టీల అభ్యర్థులను ఢీకొట్టబోతున్నారు. కోయంబత్తూరు సౌత్ స్థానాన్ని పొత్తులో భాగంగా అధికార ఏఐఏడీఎంకే తన మిత్రంపక్షం బీజేపీకి, ప్రతిపక్ష డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్‌కు కేటాయించాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
కోయంబత్తూర్ సౌత్ నుంచి కమల్..
-
కోయంబత్తూర్ సౌత్ నుంచి కమల్.. ప్రధాన కారణం అదేనట
చెన్నై: తమిళనాట రాజకీయ వాతావరణం క్రమంగా హీటెక్కుతోంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తన పార్టీ రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా కమల్ ఈ విషయాన్ని ప్రకటించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తాను కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. తొలుత కమల్ చెన్నై, అలందూర్ నుంచి పోటీ చేయాలని భావించినప్పటికి చివరకు కోయంబత్తూరు నుంచి బరిలో దిగేందకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. ‘‘మా నాన్న నన్ను ఐఏఎస్ అధికారిగా చూడాలనుకున్నారు. ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆశపడ్డారు. కాకపోతే నేను ఆయన కలను నిజం చేయలేకపోయాను. అందుకే మా పార్టీలోకి ఎక్కువ మంది ఐఏఎస్ అధికారులను ఆహ్వానించాను. వారికే సీట్లు కేటాయించాను. ఇది నాకు ఎంతో గర్వకారణం’’ అన్నారు. ఇక కమల్ నేడు ప్రకటించిన రెండో జాబితాలో డాక్టర్ సుభా చార్లేస్ ‘కన్యాకుమారి), డాక్టర్ ఆర్ మహేంద్రన్ (సింగనల్లూర్), డాక్టర్ సంతోష్ బాబు (వెలాచేరి), మరియు పాజా కరుపయ్య (టి నగర్) నుంచి పోటీ చేయనున్నారు. అలందూర్ స్థానాన్ని శరద్ బాబుకు కేటాయించారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు సౌత్‌లో ఏఐడీఏంకే తరఫున అమ్మన్ కే అర్జున్ విజయం సాధించారు. తాజాగా పొత్తుల్లో భాగంగా ఏఐడీఎంకే పార్టీ ఈ స్థానాన్ని మిత్ర పక్షం బీజేపీకి కేటాయించింది. అయితే దీనిపై ఏఐడీఏంకే కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇక 2019 జనరల్ ఎలక్షన్లో ఎంఎన్ఎం కోయంబత్తూరు నియోజకవర్గంలో 11 శాతం ఓట్లు సాధించగలిగింది. ఇక్కడ పార్టీకి మద్దతురాలు ఎక్కువ ఉండటం.. ప్రస్తుత ఎన్నికల్లో ఏఐడీఎంకే కాకుండా బీజేపీ కోయంబత్తూరులో బరిలో నిలవడం వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే కమల్ ఇక్కడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. చదవండి: మూడో కూటమి సీఎం అభ్యర్థిగా కమల్ ఖరారు -
TN Assembly polls : స్టార్ హీరో అరంగేట్రం
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష ద్రావిడ మున్నేట కజగం(డీఎంకే) తన రేసుగుర్రాలను ప్రకటించింది. ఏప్రిల్ 6న జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికలు- 2021 కు మొత్తం 173 మంది అభ్యర్థుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలోని వివరాల ప్రకారం.. పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ కోలాథూర్ నియోజకవర్గం నుంచి మళ్లీ బరిలో నిలవనున్నారు. అదే విధంగా స్టాలిన్ తనయుడు, నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ చెపాక్ స్థానంనుంచి అరంగేట్రం చేయనున్నారు. అంతేకాదు మాజీ మంత్రులు, సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించడం విశేషం. డిప్యూటీ సీఎం ఓ పన్నీర్‌సెల్వంపై తంగ తమిళసెల్వన్ పోటీ చేస్తారని, సీఎం ఇ పళనిస్వామితో టీ సంపత్‌కుమార్ తలపడ నున్నారని డీఏంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దురై మురుగన్, కె ఎన్ నెహ్రూ, కె పొన్ముడి, ఎంఆర్‌కె పన్నీర్ సెల్వం లాంటి సీనియర్లతోపాటు మాజీ మంత్రులు అలాడి అరుణ, సురేష్ రాజన్, కన్నప్పన్, మాజీ స్పీకర్ అవుడియ్యప్పన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అలాగే డీఎంకే ఐటీ వింగ్ చీఫ్ పీటీఆర్ తియాగరాజన్, టీఆర్ బాలు కుమార్ టీఆర్బీ రాజా పేర్లు సైతం జాబితాలో ఉన్నాయి. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని స్టాలిన్ ఈ సందర్భంగా కార్యకర్తలను కోరారు. కాగా 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 61 సీట్లను ఇప్పటికే కూటమి కేటాయించగా, మిగిలిన 173 స్థానాల్లో డీఎంకే అభ్యర్థులను ప్రకటించింది. హీరోగా, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌తో చిత్ర నిర్మాతగా ఉదయనిధి స్టాలిన్ కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖంగా ఉన్న సంగతి తెలిసిందే. -
అన్నాడీఎంకేకు షాక్: దినకరన్ వైపు ఆ ఎమ్మెల్యేల చూపు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికలంటే అన్నిపార్టీ ల్లోని శ్రేణులకు ఆసక్తే. ఎన్నికల్లో పోటీచేయడం ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తహతహ పడడం, అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తికి లోనుకావడం సహజమే. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అ న్నిపార్టీల కంటే అన్నాడీఎంకేలో అసంతృప్తి, అసమ్మ తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. జయలలిత, కరుణానిధి కన్నుమూసిన తరువాత వచ్చిన తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో రెండుపార్టీలూ ప్రతిష్టాత్మకంగా పోరాడుతున్నాయి. ముఖ్యమంత్రి కావాలన్న జీవి త లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ అహర్నిశలూ పోరాడుతున్నారు. ఇక అన్నాడీఎంకే సైతం మూడోసారి గెలుపొందడం ద్వారా హ్యా ట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉంది. అదే జోరులో బుధవారం అభ్యర్థులను ప్రకటించిన వెంటనే ఆశావహులు అసంతృప్తితో రగలిపోవడం ప్రారంభమైంది. అలాగే సీట్లు ఖరారైన వారు కూడా అగ్రహంతో ఉన్నారు. తమను సంప్రదించకుండా మిత్రపక్ష పీఎంకేకు నియోజకవర్గాలను కూడా ఖరారు చేయడాన్ని అంగీకరించడం లేదు. ఇలా అనేక నియోజకవర్గాల్లో అసంతృప్తులు ఆగ్రహంతో ఊగిపోతూ గురువారం ఆందోళనకు దిగారు. కేటాయించిన నియోజకవర్గాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ పదిమంది అభ్యర్థుల అనుచరులు పలుప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. ముగ్గురు మంత్రులు సహా 41 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి అవకాశం దక్కలేదు. సాత్తూరు నియోజకవర్గ అన్నాడీఎంకే ఎమ్మెల్యే రాజవర్మన్ మరో అడుగు ముందుకు వేసి ఎంఎంఎంకే ఆఫీసుకు వెళ్లి దినకరన్‌ను కలుసుకున్నారు. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం దినకరన్ వైపునకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సీటు దక్కని మంత్రి వలర్మతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 60 మంది కొత్తవారికి అవకాశం ఇవ్వగా వీరిలో కనీసం 53 మంది పాఠశాల విద్యను దాటనివారు కావడం గమనార్హం. ఎంఎంఎంకే, డీఎండీకే చర్చలు.. అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగిన డీఎండీకే, ఎంఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌తో పొత్తు చర్చలు జరుపుతోంది. 50 నియోజకవర్గాలను కోరుతూ రహస్య చర్చలు కొనసాగిస్తోంది. తిరుచ్చిరాపల్లి జిల్లా జయంకొండం నుంచి సీటు దక్కకపోవడంతో వన్నియర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి వైద్యలింగం పార్టీని వీడారు. ఆరు సీట్లతో సర్దుకున్న టీఎంసీ.. కూటమి నుంచి చివరిక్షణంలో బైటికి వచ్చేపరిస్థితులు కల్పించడంతో అన్నాడీంకేపై అసంతృప్తితో ఉన్న తమాకా అధ్యక్షులు జీకే వాసన్ టీఎంసీ ముఖ్య నిర్వాహకులతో గురువారం సమాలోచనలు జరిపారు. తాము కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు అన్నాడీఎంకే ముందుకు రావాలని గురవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా వాసన్ కోరారు. గురువారం సాయంత్రానికి ఇరుపార్టీల మధ్య సామరస్యం కుదరడంతో ఆరు సీట్లతో టీఎంసీ సర్దుకుంది. డీఎంకేలో సైతం అసహనం.. డీఎంకేలో సైతం అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పొన్నేరి, పల్లడం, అవినాశి మిత్రపక్షాలకు కేటాయించడంతో రాస్తారోకో చేసాయిు. ఈరోడ్ జిల్లాలో సెంగుంద ముదలియార్ సామాజిక వర్గానికి ఏపార్టీలోనూ సీటు దక్కక పోవడంతో 500 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. -
68 మందికి నేర చరిత్ర.. 157 మంది కోటీశ్వరులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అన్నట్లు రాజకీయనాయకుల్లో ఎమ్మెల్యేలు వేరు. ఈ ఎమ్మెల్యేల్లో సచ్చీలురులతోపాటు 68 మంది నేరగాళ్లు కూడా ఉన్నారనే సత్యాన్ని ఒక సర్వే బయటపెట్టింది. తమిళనాడు అసెంబ్లీలో 234 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జన నాయక సీర్తిరుత్త సంఘం, తమిళనాడు ఎన్నికల నిఘా సంయుక్తంగా చేపట్టిన సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూసాయి. అన్నికంటే ముఖ్యంగా రాష్ట్రంలోని 68 మంది ఎమ్మెల్యేలకు నేరచరిత్ర ఉన్నట్లు తేలింది. 2016–21 మధ్య కాలం నాటి ఎమ్మెల్యేల నేర నేపథ్యం, విద్యార్హత, ఆస్తి, అంతస్తులపై సర్వే చేశారు. నాలుగు స్థానాలు ఖాళీ, 26 మంది ఎమ్మెల్యేల నామినేషన్ పత్రాలు గల్లంతు కావడంతో 204 ఎమ్మెల్యేల గురించి సర్వే నిర్వహించారు. వీరిలో 68 మంది నేరపూరిత కేసులను ఎదుర్కొంటునట్లు తేలింది. 8 మందిపై హత్య, హత్యాయత్నం, ఇద్దరిపై మహిళలకు వ్యతిరేకంగా వ్యవహరించిన నేరం కేసులున్నాయి. ఇక పార్టీ పరంగా పరిశీలిస్తే డీఎంకేలో 40, అన్నాడీఎంకేలో 23, కాంగ్రెస్‌లో 4, ఒక స్వతంత్య్ర ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయి. 22 మంది డీఎంకే ఎమ్మెల్యేలు, 13 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక స్వతంత్య్ర ఎమ్మెల్యే తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. మిస్టర్ ‘కోటీశ్వర్’.. ఇక 204 ఎమ్మెల్యేల్లో కోటీశ్వరుల జాబితాను పరిశీలిస్తే 157 మంది మిస్టర్ ‘కోటీశ్వర్’గా ముద్రపడ్డారు. అన్నాడీఎంకేలో 76, డీఎంకేలో 74, కాంగ్రెస్‌లో 5, ఇండియన్ ముస్లింలీగ్ ఒకరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే కోటీశ్వరుల జాబితాలో ఉన్నారు. 89 మందికి పాఠశాల విద్యార్హత.. 89 మంది ఎమ్మెల్యేలు 5–12 తరగతులు చదివారు. 110 మంది పట్ట భద్రులు, ముగ్గురు డిప్లొమా చదివిన వారున్నారు. చదవడం, రాయడం మాత్రమే తెలిసిన ఒక ఎమ్మెల్యే విద్యార్హతను ప్రకటించలేదు. 25–50 మధ్య వయస్కులు 78 మంది, 51–70 మధ్య వయస్కులు 125 మంది ఉన్నారు. వీరుగాక 77 ఏళ్ల వయస్సుగల ఎమ్మెల్యే ఒక్కరున్నారు. -
కాషాయ దళానికి 20 సీట్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అనేక తర్జనభర్జనల తరువాత ఎట్టకేలకు అన్నాడీఎంకే, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. బీజేపీకి 20 సీట్లు ఖరారయ్యాయి. 171 మందితో అన్నాడీఎంకే అభ్యర్థుల తుది జాబితా బుధవారం విడుదలైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పరంగా తొలిఘట్టమైన సీట్ల సర్దుబాటు, నియోజకవర్గాల కేటాయింపు బుధవారం ఒక కొలిక్కివచ్చింది. అన్నాడీఎంకే సారథులు పళనిస్వామి, పన్నీర్‌సెల్వం 171 స్థానాల్లో అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించారు. ఇప్పటికే పళనిస్వామి, పన్నీర్ సెల్వంలతో కూడిన ఆరు పేర్లతో తొలి జాబితా విడుదలైంది. తుది జాబితాను కలుపుకుని అన్నాడీఎంకే నుంచి 177 మంది పోటీ చేస్తున్నారు. బీజేపీకి 20 సీట్లు బుధవారం ఖరారు కాగా నియోజకవర్గాల కేటాయింపు కూడా జరిగింది. కూటమి నుంచి డీఎండీకే వైదొలగడంతో తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ) సీట్ల సంఖ్యను పెంచాలని పట్టుబడుతోంది. చిన్నపార్టీలకు సైతం సీట్లు కేటాయించాల్సి ఉన్నందున ఆ పార్టీకి 3, 4 సీట్లు మాత్రమే ఇస్తామని అన్నాడీఎంకే అంటోంది. 23 సీట్లు ఖరారు చేసుకున్న పీఎంకే నమూనా జాబితా సిద్ధం చేసుకుని నియోజకవర్గాల కేటాయింపు కోసం ఎదురుచూస్తోంది. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము 4.30 గంటల వరకు బీజేపీ, పీఎంకేలతో పన్నీర్‌సెల్వం, పళనిస్వామి భేటీ అయ్యారు. ఇంకా..టీఎంసీ, పుదియనీది కట్చి, ఇండియా కుడియరసు కట్చి సహా పలు చిన్న పార్టీలకు సీట్ల పంపకాలు చేయాల్సి ఉంది. డీఎంకే జాబితాలో జాప్యం.. ఇక అన్నాడీఎంకే ప్రధాన ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థుల జాబితా విడుదలలో జాప్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాంగ్రెస్ సహా కూటమిలోని అన్ని మిత్రపక్షాలకు సీట్ల సర్దుబాటు ఖరారు కాగా 174 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను పోటీకి దించేందుకు స్టాలిన్ సిద్ధమయ్యారు. ఉదయసూర్యుడి చిహ్నంపై పోటీచేసే మిత్రపక్షాలను కలుపుకుంటే మొత్తం 187 స్థానాలవుతున్నాయి. 10న జాబితా విడుదల చేస్తామని స్టాలిన్ గతంలో ప్రకటించగా తుది జాబితా సిద్ధం చేసేందుకు మరికొంత సమయం పట్టొచ్చని తెలుస్తోంది. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్ 70 మంది అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించారు. డీఎండీకే ఒంటరిపోరు.. అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకుని 234 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం బు«ధవారం సమావేశమయ్యారు. ఇప్పటికే 140 మంది అభ్యర్థుల జాబితా ఖరారైంది. డీఎండీకేను తమ వైపునకు తిప్పుకోవాలని దినకరన్, కమల్ ప్రయత్నిస్తున్నారు. డీఎంకే అధికారంలోకి వస్తే ఆనందమేనని విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకరన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది పరోక్షంగా డీఎంకేకు మద్దతివ్వడమేనని అంటున్నారు. -
శశికళ ఆధ్యాత్మిక పర్యటన
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల నుంచి అస్త్రసన్యాసం చేసిన శశికళ ఆధ్యాత్మిక జీవనం వైపు మొగ్గుచూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్యటన చేయాల్సిన ఆమె ఆధ్యాత్మిక పర్యటనకు సిద్ధమయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లు శిక్ష ముగించుకుని జనవరి 27న జైలు నుంచి విడుదలైన శశికళ గతంలో నిర్ణయించుకున్న ప్రకారం క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సి ఉంది. చేజారిపోయిన అన్నాడీఎంకేను తన చేతుల్లోకి తీసుకోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి అధికారంలోకి రావడం ఆమె లక్ష్యాలుగా ఉండేవి. అయితే అన్నాడీఎంకే–బీజేపీ మధ్య జరిగిన సీట్ల సర్దుబాటు చర్చల్లో శశికళ ప్రస్తావన బెడిసికొట్టడంతో పరిస్థితి మారిపోయింది. బీజేపీలోని ఒక కీలకవ్యక్తి, కుటుంబసభ్యుని సూచనల మేరకు రాజకీయాల నుంచి ఆమె తాత్కాలికంగా వైదొలిగారు. ఈనెల 11వ తేదీ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చెన్నై టీనగర్‌లోని అగస్తీశ్వరాలయంలో పూజలు జరపనున్నారు. 15వ తేదీ నుంచి తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనకు దిగుతారు. -
234 స్థానాల్లో పోటీకి సిద్ధమైనా, 40 చాలు!
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం 40 స్థానాలపై గురి పెట్టింది. ఇందులో 30 స్థానాల్ని కైవసం చేసుకోవడం లక్ష్యంగా ఆపార్టీ నేత దినకరన్ వ్యూహాలకు పదును పెట్టారు. శశికళ రాజకీయాల నుంచి అస్త్ర సన్యాసం తీసుకోవడంతో ఆమె ప్రతినిధి దినకరన్ తన మార్క్ రాజకీయ వ్యూహాలకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో 234 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమైనా, ప్రధానంగా 40 స్థానాలు చాలు అన్నట్టుగా నిర్ణయించినట్టు సమాచారం. ఇందులోనూ 30 సీట్లపై గురిపెట్టి చాపకింద నీరులా పనుల వేగాన్ని పెంచారు. ఏ,బీ,సీ అంటూ ఈ నియోజకవర్గాల్ని విభజించి లెక్కకు తగ్గ వ్యూహాన్ని ఆయన రచించి ఉండడం గమనార్హం. ఇందులో 10 మంది అనర్హత వేటు రూపంలో ఎమ్మెల్యే పదవి కోల్పోయిన నేతలు కావడంతో, ఈ స్థానాల్లో అవసరం అయితే, ఎంతైనా ఖర్చయినా పెట్టి, వారిని మళ్లీ అసెంబ్లీలోకి పంపించే రీతిలో వ్యూహాలు సాగిస్తున్నట్టు ఆపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక తమిళనాడులో పాగా వేసేందుకు సిద్ధమైన మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి పనిచేసేందుకు దినకరన్ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. కాగా ఏప్రిల్ 6న రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలకు నిర్వహణకై కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ క్రమంలో డీఎంకే కూటమిలో భాగంగా 234 స్థానాల్లో డీఎంకే –174, కాంగ్రెస్–25, సీపీఎం –6, సీపీఐ–6, వీసీకే –6, ఎండీఎంకే –6, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్‌కు –3, మనిదనేయ మక్క ల్ కట్చికి –2, కొంగు మక్కల్ దేశీయ కట్చికి –3 తమిళర్ వాల్వురిమై కట్చికి ఒకటి చొప్పున సీట్లు కేటాయించారు. అయితే అధికార అన్నాడీఎంకేలో మాత్రం ఇంకా సీట్ల పంచాయతి తేలలేదు. చదవండి: కాంగ్రెస్‌కు 25.. మరి బీజేపీకి ఎన్ని సీట్లు!? -
కాంగ్రెస్‌కు 25.. మరి బీజేపీకి ఎన్ని సీట్లు!?
సాక్షి, చెన్నై: సీట్ల సర్దుబాట ప్రక్రియను డీఎంకే ముగించింది. 174 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేయనుంది. అన్నాడీఎంకేలో సీట్ల సర్దుబాటు కసరత్తులు కొనసాగుతూనే ఉన్నాయి. లెక్కతేలినా, ఎవరైనా వస్తారన్న ఎదురుచూపుల్లో మూడో కూటమి ఉంది. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు మరో రోజు మాత్రమే సమయం ఉంది. ఈనెల 12 నుంచి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో రాజకీయపక్షాలు పొత్తులు, సీట్ల సర్దుబాటు కసరత్తులు వేగవంతం చేశాయి. ఇందులో డీఎంకే ముందడుగు వేసింది. సీట్ల సర్దుబాటు ప్రక్రియను మంగళవారంతో ముగించింది. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలోని 234 స్థానాల్లో డీఎంకే –174, కాంగ్రెస్–25, సీపీఎం –6, సీపీఐ–6, వీసీకే –6, ఎండీఎంకే –6, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్‌కు –3, మనిదనేయ మక్క ల్ కట్చికి –2, కొంగు మక్కల్ దేశీయ కట్చికి –3 తమిళర్ వాల్వురిమై కట్చికి ఒకటి చొప్పున సీట్లు కేటాయించారు. మరో రెండు చిన్న పార్టీలకు తలా ఓ సీటు ఇచ్చారు. దీంతో కూటమిలోని ఆయా పార్టీ లు తమకు కావాల్సిన నియోజకవర్గాలు, అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ఇక చెన్నైలో డీఎంకే 14 స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం వెలువడింది. ఎండీఎంకేతో పాటు చిన్న పార్టీల అభ్యర్థులు డీఎంకే చిహ్నంతో ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఇక ఎవరైనా కలిసి వ చ్చినా వారు డీఎంకే చిహ్నంపై పోటీ చేయాల్సిందే. అన్నాడీఎంకేలో తేలని లెక్క.. అన్నాడీఎంకే కూటమిలో సీట్ల పంచాయితీ లెక్క తేలడం లేదు. పీఎంకేకు మాత్రం 23 సీట్లు కేటాయించారు. బీజేపీకి 20 ఇచ్చినా, అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆ కూటమిలోని డీఎండీకే, తమిళ మానిల కాంగ్రెస్‌తో సీట్ల పందేరం కొలిక్కి రాలేదు. తమతో అన్నాడీఎంకే వ్యవహరిస్తున్న తీరుతో విసిగి వేసారిన విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే కూటమి నుంచి వైదొలగుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. అయితే నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని విజయకాంత్‌కు అన్నాడీఎంకే, బీజేపీలు సూచించే పనిలోపడ్డాయి. అన్నాడీఎంకే కూటమికి మరికొన్ని చిన్న పార్టీలు మద్దతు ఇచ్చినా లెక్క తేలడానికి మరి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. విజయకాంత్ తరహాలో తమిళ మానిల కాంగ్రెస్ కూడా నిర్ణయం తీసుకోవచ్చన్న ప్రచారం నేపథ్యంలో ఈ కూటమి నామినేషన్లకు ముందే చెల్లా చెదురయ్యేనా అన్న చర్చ జోరందుకుంది. ఎదురుచూపుల్లో మూడో ఫ్రంట్.. నటుడు, మక్కల్ నీది మయ్యం నేత కమల్ నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కూటమిలో ఐజేకే, ఎస్‌ఎంకేలు ఉన్నాయి. ఈ మూడు పార్టీలు సీట్ల పంపకాల్ని ముగించాయి. మక్కల్ నీది మయ్యం–154, ఐజేకే, ఎస్‌ఎంకేలు తలా 40 స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయించాయి. ఈ సమయంలో అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన డీఎండీకేకు మూడో కూటమి ఆహ్వానం పలికే పనిలో పడింది. అలాగే, తమతో మరెవరైనా కలిసి అడుగులు వేయవచ్చన్న ఎదురుచూపుల్లో మూడో ఫ్రంట్ వర్గాలు ఉన్నాయి. ఆ మేరకు కూటమికి ఓ మంచి పేరు పెట్టడమే కాకుండా, సీట్ల లెక్కల వివరాల్ని అధికారికంగా ప్రకటించేందుకు కమల్ నిర్ణయించారు. చదవండి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో అర్జున్ భేటీ -
మూడో కూటమి సీఎం అభ్యర్థిగా కమల్ ఖరారు
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు సంభవించాయి. మూడు పార్టీలతో ఏర్పడిన మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ‘మక్కల్ నీది మయ్యం’(ఎంఎన్ఎం) అధ్యక్షుడు, నటుడు కమల్‌హాసన్ పేరు ఖరారు కాగా, సీట్ల పంపకం కుదరక ఏఐఏడీఎంకే కూటమితో తెగదెంపులు చేసుకుంటున్నట్లు డీఎండీకే ప్రకటించింది. దీంతో డీఎండీకేని మూడో కూటమిలో చేర్చుకునేందుకు కమల్ ప్రయత్నాలు ప్రారంభించారు. అన్నాడీఎంకే కూటమిలో కొనసాగిన ‘ఇండియా జన నాయక కట్చి’(ఐజేకే) గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో చేరింది. ఐజేకే వ్యవస్థాపక అధ్యక్షుడు పారివేందర్ పెరంబలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నుంచి 1, 2 స్థానాలు మాత్రమే దక్కే పరిస్థితి ఎదురవడంతో కూటమి నుంచి వైదొలిగారు. తన కుమారుడు రవి పచ్చముత్తును పార్టీ అధ్యక్షునిగా చేసి మూడో కూటమి సన్నాహాలు మొదలుపెట్టారు. సీట్ల సర్దుబాటుపై పిలుపు రాకపోవడంతో అలిగిన ‘సమత్తువ మక్కల్ కట్చి’ అధ్యక్షుడు శరత్‌కుమార్ అన్నాడీఎంకే కూటమిని వీడి ఐజేకే కూటమిలో చేరారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ మినహా మరే కూటమిలోనైనా చేరేందుకు ఎదురుచూస్తున్న కమల్ ఈ కూటమిలో చేరారు. ఐజేకే కూటమి సీఎం అభ్యర్థిగా కమల్ బరిలోకి దిగుతున్నట్లు శరత్‌కుమార్ ప్రకటించారు. వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఎంఎన్ఎం 154, ఎస్ఎంకే, ఐజేకే చెరో 40 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ప్రజలకు విరోధులుగా వ్యవహరించే ప్రతి ఒక్కరినీ తాము లక్ష్యంగా చేసుకుంటామని కమల్ ప్రకటించారు. అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన డీఎండీకేని కూడా కమల్ తమ కూటమిలోకి ఆహ్వానించారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కూటమిలో సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. 234 స్థానాలకు గాను డీఎంకే 186 చోట్ల పోటీ చేయనుంది. కూటమిలోని కాంగ్రెస్‌కు 25, సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే, వీసీకేలకు ఆరు చొప్పున, ఐయూఎంఎల్, ఎంఎంకేలకు కలిపి 5 సీట్లు కేటాయించింది. -
తమిళనాట కొలిక్కివస్తున్న పొత్తులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి కూటములైన అన్నాడీఎంకే, డీఎంకేల్లో సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కివచ్చింది. 178 స్థానాల్లో పోటీ చేయాలని డీఎంకే నిర్ణయించుకుంది. మూడో కూటమి కోసం నటుడు కమల్‌హాసన్ కసరత్తు చేస్తున్నారు. బీజేపీకి అన్నాడీఎంకే కూటమి 25 సీట్లు కేటాయించినట్లు తెలుస్తున్నా అధికారికంగా ప్రకటించలేదు. డీఎండీకే మినహా అన్ని పార్టీల్లో సీట్ల సర్దుబాటు పూర్తయింది. కూటమిలోని ప్రధాన పార్టీల్లో ఒకటైన డీఎండీకే 20–25 సీట్లు కోరుతుండగా 15 స్థానాలకు పరిమితం కావాలని అన్నాడీఎంకే సూచిస్తున్న దశలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం మరోసారి అన్నాడీఎంకే, డీఎండీకే మధ్య మళ్లీ చర్చలు జరగ్గా 18 సీట్లు ఖరారైనట్లు సమాచారం. డీఎంకే సీట్ల పంపకాలు డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు దాదాపు పూర్తయింది. మొత్తం 234 స్థానాల్లో మిత్రపక్షాలకు కేటాయించినవి పోను మిగిలిన 178 నియోజకవర్గాల్లో డీఎంకే పోటీ చేయనుంది. డీఎంకే కూటమిలో ఇండియన్ ముస్లీం లీగ్, మనిదనేయ మక్కల్ కట్చికి 2, సీపీఐకి 6, ఎండీంకేకు 6, వీసీకేకు 6 సీట్ల కేటాయింపు జరిగింది. కాంగ్రెస్‌కు 25 సీట్లను కేటాయించారు. కన్యాకుమారి లోక్‌సభ ఉపఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. సీపీఐ నేతలతో స్టాలిన్ సోమవారం చర్చలు జరిపి 6 సీట్లను, తమిళగ వాళ్వురిమై కట్చికి ఒక సీటు ఖరారు చేశారు. సోమవారం వరకు జరిపిన కేటాయింపుల తరువాత 180 స్థానాలు మిగిలి ఉండగా వీటిల్లో 178 డీఎంకే నియోజకవర్గాల్లో డీఎంకే బరిలోకి దిగనుంది. ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం అమ్మముక కూటమిగా చేరి కృష్ణగిరి, శంకరాపురం, వానియంబాడి నుంచి పోటీ చేస్తోంది. చందనం స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి తమిళగ వాళ్వురిమై కట్చి(టీవీకే)పార్టీలో ఉన్నారు. వీర్పప్పన్ కుమార్తె విద్యారాణి బీజేపీలో ఉన్నారు. అన్నాడీఎంకే కూటమిలోని బీజేపీ, డీఎంకే కూటమిలోని టీవీకే ద్వారా వేర్వేరు స్థానాల్లో వీరువూరు పరస్పర ప్రత్యర్ది పార్టీల నుంచి తలపడేందుకు సిద్దం అవుతున్నారు. -
తమిళనాట ఎన్డీయేదే గెలుపు
సాక్షి, చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే–బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో ఆయన రోడ్ షోతో ఓటర్లను ఆకర్షించే యత్నం చేశారు. కన్యాకుమారి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి పొన్ రాధాకృష్ణన్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న కూటమి అభ్యర్థులకు మద్దతుగా విజయ సంకల్ప యాత్ర నిమిత్తం ఆదివారం నాగర్ కోయిల్‌లో అమిత్ షా పర్యటన సాగింది. ఉదయం తిరువనంతపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నాగర్‌కోయిల్ చేరుకున్న ఆయన అక్కడి సుశీంద్రం ధనుమలై పెరుమాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. నాగర్‌కోయిల్ భగవతి అమ్మన్ ఆలయంలో పూజల అనంతరం, రోడ్‌షోతో ముందుకు సాగారు. ఓపెన్ టాప్ వాహనంలో అమిత్ షా పర్యటన సాగింది. పొన్ రాధాకృష్ణన్‌ను గెలిపించాలని ఓటర్లకు విన్నవించారు. రోడ్ షో తర్వాత ఓ హోటల్లో బీజేపీ వర్గాలతో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో అమిత్ షా మాట్లాడుతూ కన్యాకుమారి పార్లమెంట్, తమిళనాడు అసెంబ్లీని అన్నాడీఎంకే–బీజేపీ కూటమి గెలుచుకోవడం ఖాయ మన్నారు. రోడ్‌షోలో వేపముడు కూడలిలో ఉన్న దివంగత కాంగ్రెస్ సీఎం కామరాజర్ విగ్రహానికి అమిత్ షా పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం నాగర్ కోయిల్ పర్యటన ముగించుకుని మళ్లీ తిరువనంతపురానికి వెళ్లారు. -
డీఎంకే–కాంగ్రెస్ కూటమికి బీటలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకేతో వియ్యమందుకున్న కాంగ్రెస్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కయ్యానికి దిగింది. యూపీఏ కూటమిలో పదేళ్లకు పైగా కొనసాగిన డీఎంకేతో తెగదెంపులు చేసుకునేందుకు తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమైంది. తుది నిర్ణయం బాధ్యతను ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్‌గాంధీపై మోపింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో సయోధ్య కుదరక పోవడమే ఇందుకు కారణం. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ సీట్ల కేటాయింపుపై ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వలెనే ఈసారి కూడా 41 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే 41లో కేవలం 8 సీట్లు గెలుపొందడం వల్లనే 2016 ఎన్నికల్లో అధికారం దక్కలేదని డీఎంకే గుర్రుగా ఉంది. ఈసారి 18 స్థానాలకు మించి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఆరంభంలో అలానే ఉంటుంది, రానురానూ డీఎంకే తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ అంచనా వేసింది. ప్రజాబలం, పెద్దగా ఓటు బ్యాంకు లేని కాంగ్రెస్‌కు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో సీట్లను కేటాయిస్తే మరోమారు నష్టపోతామని డీఎంకే పట్టుదలతో ఉంది. ఐ–ప్యాక్ అనే సంస్థతో సర్వే చేయించిన సర్వేలో కూడా కాంగ్రెస్ బలహీనం బయటపడడంతో డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ మెట్టుదిగనందున చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. మరీ తక్కువ సీట్లలో పోటీచేస్తే కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బతింటుందని అగ్రనేతలు భావించారు. దీంతో నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను స్వీకరించాలని నిర్ణయించి అత్యవసరంగా సమావేశమయ్యారు. డీఎంకే చర్చల్లో తనకు ఎదురైన అనుభవాలను టీఎన్‌సీసీ అ«ధ్యక్షులు కేఎస్ అళగిరి పార్టీ శ్రేణులతో పంచుకుంటూ కన్నీరుపెట్టుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో పార్టీ నేతలు తల్లడిల్లిపోయారు. కూటమిలో కొనసాగడమా, వద్దా అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగినపుడు ‘30 సీట్లిస్తే సరే లేకుంటే ఒంటరి పోటీకి దిగుదాం’అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు కమల్‌హాసన్ నేతృత్వంలోని ‘మక్కల్ నీది మయ్యం’తో కలిసి కూటమి ఏర్పాటు చేద్దామని సలహా ఇచ్చారు. దీంతో అగ్రనేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ‘కరుణానిధి కాలం నుంచి డీఎంకే కూటమిలో కొనసాగుతున్నాం, చర్చలకు వచ్చినపుడు కాంగ్రెస్ నేతలకు కరుణానిధి ఎంతో మర్యాద ఇచ్చేవారు. అయితే ఈసారి కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు ఉమన్‌చాందీ వస్తే కనీస స్థాయిలో ఎవ్వరూ పట్టించుకోలేదు. అంతేగాక చర్చల్లో తీవ్ర అవమానాలకు గురయ్యామ’ని కాంగ్రెస్ నేతలు బాధపడ్డారు. పైగా మలివిడత చర్చలకు రమ్మని డీఎంకే నుంచి ఆహ్వానం రాలేదని వాపోయారు. ఈ పరిస్థితులను రాహుల్‌గాంధీకి వివరించేందుకు కర్ణాటకు చెందిన కాంగ్రెస్ అగ్రనేత వీరప్పమెయిలీ శనివారం ఢిల్లీ పయనమయ్యారు. డీఎంకే కూటమిలో కొనసాగడం ఇష్టం లేదు, అయితే రాహుల్ ఆదేశాలను అనుసరించి నడుచుకుంటామని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ సీట్లు కేటాయిస్తే ఒప్పుకోవద్దని తమిళనాడులో ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలో రాహుల్‌గాంధీ చెప్పినట్లు సమాచారం. డీఎంకేతో వికటిస్తే కాంగ్రెస్‌ను కలుపుకుని పోయేందుకు కమల్‌హాసన్ సిద్ధంగా ఉన్నారు. తన పార్టీ నేతలను ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతల వద్దకు రాయబారం పంపారు. బీజేపీతో డీఎంకే రహస్య ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రాల వారీగా కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేస్తోందని, ఇందుకు ఇటీవల పుదుచ్చేరీలో కాంగ్రెస్ పతనం, తరువాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలే నిదర్శనమని కమల్ శనివారం నాటి ప్రచారంలో కొత్త కోణాన్ని అందుకున్నారు. -
ఆ ఇద్దరి సూచన మేరకే తప్పుకున్న చిన్నమ్మ
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల నుంచి శశికళ అకస్మాత్తుగా తప్పుకోవడంలో ఇద్దరు వ్యక్తులు ప్రధాన పాత్ర పోషించిన విషయం శుక్రవారం వెలుగుచూసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి రావాలని శశికళ భావించారు. కుదిరితే అన్నాడీఎంకేను చెప్పుచేతుల్లోకి తెచ్చుకోవడం లేదా టీటీవీ దినకరన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’(ఏఎంఎంకే) ద్వారా ప్రజల్లోకి దూసుకెళ్లాలని ఆశించారు. ఇదే విషయాన్ని గత నెల 24న జయలలిత జయంతి రోజున బహిరంగంగా ప్రకటించారు. అయితే అన్నాడీఎంకే స్వాధీనంలోకి వచ్చే పరిస్థితులు కనపడలేదు. దినకరన్ వైఖరి వల్ల అతడిని దూరం పెట్టారు. ఏం చేయాలి చెప్మా అని ఆమె ఆలోచనలోపడ్డారు. ఇదే సమయంలో తమ కూటమి గెలుపు అవకాశాలను దెబ్బతీయాలని పట్టుదలతో ఉన్న శశికళను బుజ్జగించేందుకు బీజేపీకి చెందిన ఒక దూత ఆమెను స్వయంగా కలుసుకున్నారు. మనం మనం కీచులాడుకుంటే ఓట్లు చీలిపోయి అధికార పీఠాన్ని డీఎంకే తన్నుకు పోగలదు, రాజకీయాల నుంచి తాత్కాలికంగా తప్పుకోవాలని సూచించారు. ఇదే సమయంలో సమీప బంధువొకరు శశికళను కలిసి మరో కోణంలో మాట కలిపారు. ఒంటరిగా బరిలోకి దిగితే అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు అవుతుంది, ఆన్నాడీఎంకే ఓటమి పాలైతే ఆ చెడ్డపేరు నీకు చుట్టుకుంటుందని హితవు పలికారు. వీరిద్దరి సలహాతోనే రాజకీయాల నుంచి శశికళ తప్పుకున్నారనే సమాచారం శుక్రవారం బహిర్గతమైంది. శశికళ వెనుక వెన్నుపోటుదారులు.. టీటీవీ దినకరన్, మరికొందరు వెన్నుపోటుదారుల వల్లనే రాజకీయాల నుంచి శశికళ తప్పుకోవాల్సి వచ్చిందని స్వయానా ఆమె తమ్ముడు,‘అన్నా ద్రావిడర్ కళగం’ప్రధాన కార్యదర్శి దివాకరన్ వ్యాఖ్యానించారు. తనకు తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించుకోవడం, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంను కూటమిగా మలుస్తూ అన్నాడీఎంకేను ఆహ్వానించడం వంటి పిల్లచేష్టలకు పాల్పడిన దినకరన్‌తో ఆమె విరక్తి చెందారని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: శశికళ నిష్క్రమణ వెనుక.. రాజకీయాలకు చిన్నమ్మ గుడ్‌బై.. కారణాలు ఇవే -
రాజకీయాలకు చిన్నమ్మ గుడ్‌బై.. కారణాలు ఇవే
-
రాజకీయాలకు చిన్నమ్మ గుడ్‌బై..రాజీకి షా ప్రయత్నాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో మరి కొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు దివంగత అన్నాడీఎంకే నేత జయలలితకు సన్నిహితురాలైన శశికళ బుధవారం సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో పార్టీ అధినేత్రి జయలలిత బంగారు పాలన కొనసాగాలని దేవుడిని ప్రార్థిస్తానన్నారు. అమ్మ అభిమానులంతా సహోదరుల్లా ఐకమత్యంతో పనిచేసి జయలలిత బంగారు పాలన కొనసాగేలా చూడాలని అభ్యర్థించారు.‘రాజకీయాలకు దూరంగా ఉంటాను. నా సోదరి, నేను దైవంగా పరిగణించే పురచ్చితలైవి (జయలలిత) బంగారు పాలన కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తాను’ అని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ 6న జరగనున్న ఎన్నికల్లో ఉమ్మడి శత్రువైన డీఎంకేను ఓడించాలని, డీఎంకే మళ్లీ అధికారంలోకి రాకుండా చూడాలని అభిమానులకు పిలుపునిచ్చారు. అధినేత్రికి సన్నిహితురాలిగా.. జయలలిత నెచ్చెలిగా నీడలా వెన్నంటి ఉండి పార్టీ రాజకీయాల్లో శశికళ తనదైన ముద్రవేశారు. పార్టీపై పెత్తనం జయలలితదైనా శశికళకు చెప్పకుండా ఆమె ఏ నిర్ణయం తీసుకునేవారు కాదని ఆపార్టీ నేతలే చెబుతుంటారు. అందుకే అమ్మ మరణం తరువాత శశికళ చిన్నమ్మగా మారారు. ప్రధాన కార్యదర్శిగా మారి పార్టీని తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నారు. నాటి సీఎం పన్నీర్‌సెల్వం చేత రాజీనామా చేయించి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తీర్పు తెరపైకి రావడంతో పళనిస్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి నాలుగేళ్ల శిక్ష అనుభవించి రెండు నెలల క్రితమే విడుదలయ్యారు. రాజీకి అమిత్ షా ప్రయత్నాలు అన్నాడీఎంకేలో కీచులాటలు డీఎంకేకు లాభదాయకమనే కారణంతో ఇరువర్గాలకు రాజీచేసేందుకు అమిత్‌షా ప్రయత్నాలు ప్రారంభించారు. తమకు 60 సీట్లు కేటాయిస్తే అందులో 50 శాతం శశికళ వర్గానికి ఇస్తామని బీజేపీ బేరం పెట్టింది. అదే జరిగితే పార్టీ పగ్గాలు మెల్లమెల్లగా ఆమె చేతుల్లోకి వెళ్లడం ఖాయమని భావించిన అన్నాడీఎంకే అందుకు ససేమిరా అంది. అదే సమయంలో బీజేపీ ద్వారా పొందే సీట్లలో కమలం గుర్తుపై పోటీచేయాలన్న అమిత్‌షా షరతును దినకరన్ తోసిపుచ్చారు. అన్నాడీఎంకే అంత అయిష్టతను కనబరుస్తున్నపుడు ఆ కూటమి నుంచి పోటీకై బీజేపీ వద్ద సాగిలపడాల్సిన అవసరం లేదని దినకరన్‌ను శశికళ గట్టిగా మందలించారు. ఎడపాడి, శశికళ తీరుతో అన్నాడీఎంకే–బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటులో ప్రతిష్టంభన నెలకొంది. డీఎంకే లాభపడకుండా.. శశికళ చేత బీజేపీనే రాజకీయ అస్త్రసన్యాసం చేయించినట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అన్నాడీఎంకేలో కుమ్ములాటలు డీఎంకేకు లాభించి అధికారంలోకి వస్తే తమకు నష్టమని బీజేపీ భావించింది. రాజకీయ క్రీడ నుంచి శశికళను డ్రాప్ చేయించడం ద్వారా అన్నాడీఎంకే ఓటు బ్యాంకు చీలకుండా కాపాడుకోవచ్చని, డీఎంకే దూకుడుకు కళ్లెం వేయవచ్చని వ్యూహం పన్నింది. శశికళ నిర్ణయం తనకే ఆశ్చర్యం కలిగించిందని టీటీవీ దినకరన్ అన్నారు. రాజకీయాల నుంచి వైదొలగినంత మాత్రాన ఆమె వెనకడుగు వేసినట్లు భావించరాదని వ్యాఖ్యానించారు. -
ఎమర్జెన్సీ విధించడం తప్పే: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: 1975లో దేశంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర స్థితి (ఎమర్జెన్సీ)ని విధించడం పొరపాటేనని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తన నానమ్మ(ఇందిరాగాంధీ)కు ఆ విషయం తరువాత అర్థం అయిందన్నారు. ‘అప్పుడు జరిగింది పొరపాటే. కచ్చితంగా అది తప్పే. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితితో పోలిస్తే అప్పుడున్న పరిస్థితి మౌలికంగా వేరైనది. కాంగ్రెస్ ఏ సమయంలోనూ దేశ మౌలిక వ్యవస్థలను ఆక్రమించే ప్రయత్నం చేయలేదు’ అన్నారు. కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, భారత మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు కౌశిక్ బసుతో సంభాషణ సందర్భంగా మంగళవారం రాహుల్ పై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని తాను కోరుకుంటున్నానని, అందువల్లనే యూత్ కాంగ్రెస్‌లో, విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐలో ఎన్నికలకు పట్టుబట్టానని రాహుల్ వివరించారు. కాంగ్రెస్ స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ అని, సమానత్వం కోసం నిలిచిన పార్టీ అని గుర్తు చేశారు. ‘దేశ వ్యవస్థీకృత విధి విధానాలను మార్చే ప్రయత్నం, వ్యవస్థలను ఆక్రమించే ప్రయత్నం కాంగ్రెస్ ఎప్పుడూ చేయలేదు. నిజం చెప్పాలంటే ఆ శక్తి కూడా కాంగ్రెస్‌కు లేదు. మా పార్టీ రూపుదిద్దుకున్న విధానం కూడా అందుకు అంగీకరించదు. అందువల్ల మేం చేయాలనుకున్నా.. ఆ పని చేయలేం’ అని విశ్లేషించారు. అందుకు వ్యతిరేకంగా, ప్రాథమికంగానే వేరైన విధానాలను అధికార బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) అవలంబిస్తోందన్నారు. చదవండి: (చిన్నమ్మ కొత్త వ్యూహం.. మూడో కూటమిలోకి నో ఎంట్రీ) (నరేంద్ర మోదీని నాగపూర్‌కు తరిమేద్దాం: రాహుల్ గాంధీ) -
ఈ రాష్ట్రాన్ని తమిళులు తప్ప ఎవరూ పాలించలేరు: రాహుల్
సాక్షి, చెన్నై: తమిళనాడులో రాహుల్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కన్యాకుమారిలోని ఓ కళాశాలలో విద్యార్థినులతో కలిసి డ్యాన్స్ చేశారు. బస్కీలు తీశారు. నాగర్‌కోయిల్ జిల్లాలో రాహుల్ మాట్లాడుతూ తమిళ ప్రజలు తప్ప తమిళనాడుని ఎవ్వరూ పాలించలేరన్నారు. నిజంగా తమిళ ప్రజలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో వారిదే విజయమని, వారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని రాహుల్ స్పష్టం చేశారు. మోదీ దగ్గర తలవంచిన తమిళ సీఎం పళని రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహించలేరన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా, తమ రాష్ట్ర ప్రజలకు వినమ్రతను ప్రదర్శించాలని చెప్పారు. ఆర్ఎస్ఎస్, మోదీ తమిళ భాషను, తమిళ సంస్కృతిని అవమానించారని, ఈ రాష్ట్రంలో వారిని అడుగుపెట్టనివ్వొద్దని రాహుల్ తమిళ ప్రజలను కోరారు. మోడీ ఒకే సంస్కృతి, ఒకే చరిత్ర, ఒకే జాతి, ఒకే నాయకుడి గురించి మాట్లాడుతున్నారని అన్నారు. మరి తమిళం దేశ భాష కాదా? బెంగాలీ భాష దేశ భాషకాదా? తమిళ సంస్కృతి, బెంగాల్ సంస్కృతి ఈ దేశ సంస్కృతి కాదా? అని రాహుల్ సూటిగా ప్రశ్నించారు. భారత దేశంలోని అన్ని భాషలను, తమిళ భాషను, సంస్కృతినీ, చరిత్రను కాపాడటం తన కర్తవ్యం అని రాహుల్ చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లాగే రాష్ట్రంలో పళని స్వామి ప్రభుత్వం తమిళ ప్రజల భాషని గౌరవించడం లేదన్నారు. విభిన్న భాషా, సంస్కృతికి విరుద్ధంగా ‘‘ఒకే సంస్కృతి, ఒకే జాతి, ఒకే చరిత్ర’’అనే సిద్ధాంతాన్ని ముందుకు తెస్తోన్న వారిని దూరంగా ఉంచడంలో తమిళనాడు దేశానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. కన్యాకుమారిలోని ములగుమూడులో స్కూల్ విద్యార్థులతో మాట్లాడిన రాహుల్ గాంధీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పరీక్షను తమిళనాడు రాజకీయ పార్టీలు అడ్డుకున్నాయని, నీట్ పరీక్ష విద్యార్థులకు ఉపయోపడేది కాదని రాహుల్ అన్నారు. స్కూల్‌కి రావడానికి ముందు కొందరు విద్యార్థులతో కలిసి టీ తాగిన రాహుల్, వారిలోని ఒక విద్యార్థి వ్యోమగామి కావాలనుకోవడం చాలా మంచి విషయమని అన్నారు. అతడిని స్పేస్ స్టేషన్లోకి అనుమతించాల్సిందిగా కోరతూ ఇస్రో చైర్మన్‌కి లేఖ రాస్తానన్నారు. రాహుల్‌తో మాట్లాడిన విద్యార్థులు రాహుల్‌ని అన్నా అని సంబోధిస్తూ, మీరు మీ ఆరోగ్యం కోసం ఏమైనా ప్రత్యేక డైట్ తీసుకుంటారా అని ప్రశ్నించారు. దానికి రాహుల్నేను రన్నింగ్ చేస్తాను, స్విమ్మింగ్, సైక్లింగ్ కూడా చేస్తానని సమాధానమిచ్చారు. నేను అకిడో మార్షల్ ఆర్ట్ కూడా నేర్చుకున్నానని రాహుల్ చెప్పారు. అలాగే, జపాన్ అకిడో మార్షల్ ఆర్ట్‌లో వారికి ఓ టెక్నిక్‌ని ప్రదర్శించి చూపించారు. -
గాంధీ కుటుంబానికి ‘కట్ మనీ’
కారైక్కల్/సాక్షి, చెన్నై: పుదుచ్చేరి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.15,000 కోట్ల నిధుల నుంచి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి ఢిల్లీలోని గాంధీ కుటుంబానికి కట్ మనీ పంపించారని కేంద్ర హోంశాఖ అమిత్ షా ఆరోపించారు. వారసత్వ, కుటుంబ రాజకీయాల వల్లే పుదుచ్చేరితోపాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పతనమయ్యిందని తేల్చిచెప్పారు ఆదివారం పుదుచ్చేరిలోని కారైక్కల్‌లో ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు. కాంగ్రెస్‌లో ప్రతిభావంతులకు చోటు లేదని విమర్శించారు. 2016లో పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ను గెలిపించిన నమశ్శివాయంను కాదని, నారాయణస్వామిని ముఖ్యమంత్రిని చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పెద్దలకు నారాయణస్వామి కట్టుబానిస అని ఆక్షేపించారు. కమల వికాసాన్ని అడ్డుకోలేరు పుదుచ్చేరిలో ఈసారి బీజేపీని గెలిపించాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వస్తే పుదుచ్చేరిలో భారతదేశ ఆభరణంగా మారుస్తామని హామీ ఇచ్చారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నారాయణస్వామి గాంధీ కుటుంబ సేవలో తరించడం తప్ప ప్రజలకు చేసేందేమీ లేదని తప్పుపట్టారు. పుదుచ్చేరి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను గాంధీ కుటుంబానికి చేరవేశారని, ఆఖరికి ఎస్టీ, ఎస్టీల నిధులను కూడా వదల్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుదుచ్చేరిలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. గొప్ప భాష అయిన తమిళంలో మాట్లాడలేకపోతున్నందుకు అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. స్పీకర్ శివకొళుందు రాజీనామా పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ శివకొళుందు ఆదివారం పదవికి రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసైకి రాజీనామా లేఖను అందజేశారు. -
తమిళనాడు: 21 సీట్లిస్తాం.. వాటితోనే సర్దుకోండి
సాక్షి, చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే కూటమిలో అసెంబ్లీ సీట్ల పంపకం ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. తమకు 60 స్థానాలు కేటాయించాలని బీజేపీ పట్టుబడుతుండగా, 21 సీట్లే ఇస్తామని, వాటితోనే సర్దుకోవాలని అన్నాడీఎంకే చెబుతోంది. బీజేపీ మెట్టు దిగడం లేదు. దీంతో సీట్ల పంచాయితీ ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు వెళ్లింది. తమకు కేవలం 10 సీట్లే కేటాయిస్తామని అన్నాడీఎంకే చెప్పడంతో విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే సందిగ్ధంలో పడింది. అన్నాడీఎంకే, బీజేపీ, రాందాసు నేతృత్వంలో పీఎంకే, విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే, జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్ పార్టీలు తమిళనాడులో గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక కూటమిగా కలిసి ప్రయాణించాయి. ఇదే కూటమి తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగనుంది. అయితే, సీట్ల పందేరం కూటమిలో వివాదాలు సృష్టిస్తోంది. మిత్రపక్షాలు అధిక సీట్లు డిమాండ్ చేస్తుండడంతో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో–కన్వీనర్ పళనిస్వామి డైలమాలో పడ్డారు. ఇప్పటికే పీఎంకేకు 23 సీట్లు కేటాయించారు. తమిళ మానిల కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్ ఖరారు చేశారు. సీట్ల కోసం పార్టీల పట్టు రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, కనీసం 170 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించాలని స్టాలిన్ నేతృత్వంలో ప్రతిపక్ష డీఎంకే నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు తగ్గట్టుగానే తమ అభ్యర్థులను సైతం బరిలోకి దించాలని అధికార అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కసరత్తు చేస్తోంది. కానీ, కూటమిలో సీట్ల సర్దుబాటే ఎటూ తేలడం లేదు. ప్రధానంగా బీజేపీ 60 సీట్లను ఆశిస్తుండడంతో సమన్వయ కమిటీ ఇరకాటంలో పడింది. ఆ పార్టీకి 21 సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, బీజేపీ రాష్ట్ర నేతలు ఒప్పుకోవడం లేదు. పుదుచ్చేరి, విల్లుపురంలో ఎన్నికల ప్రచారం కోసం చెన్నైకు వచ్చిన అమిత్ షాతో ఆదివారం బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు మురుగన్ బృందం గంటన్నరకు పైగా భేటీ కావడం గమనార్హం. ఎంపిక చేసిన 60 స్థానాలకు సంబంధించిన సమగ్ర వివరాలను వారు అమిత్ షా ముందు ఉంచినట్టు తెలిసింది. ఇందులో సగానికి పైగా సీట్లను అన్నాడీఎంకే నుంచి రాబట్టుకునే దిశగా ఆ పార్టీ సమన్వయ కమిటీతో అమిత్ షా మాట్లాడినట్టు సమాచారం. సీట్ల పంపకం లెక్కలు సోమవారం లేదా మంగళవారం నాటికి తేలవచ్చని కమలనాథులు పేర్కొంటున్నారు. మరోవైపు తమకు కేవలం 10 సీట్లు ఇస్తామనడం డీఎండీకేకు రుచించడం లేదు. తాము ఒంటరిగా పోటీ చేసినా పది శాతానికి పైగా ఓట్లను చీల్చగలమని డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్ చెబుతున్నారు. దీంతో కూటమిలో ఆ పార్టీ కొనసాగేనా అన్న చర్చ మొదలైంది. చదవండి: (తమిళనాట మూడో కూటమి.. సూత్రధారి చిన్నమ్మ..!) (నరేంద్ర మోదీని నాగపూర్‌కు తరిమేద్దాం) -
నరేంద్ర మోదీని నాగపూర్‌కు తరిమేద్దాం: రాహుల్ గాంధీ
సాక్షి, చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆర్ఎస్ఎస్ ప్రధాన కేంద్రం నాగపూర్‌కు అహింసా మార్గంలో తరిమేద్దామని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం తమిళనాడులోని తిరునల్వేలి, తెన్కాశి జిల్లాల్లో పర్యటించారు. ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. చర్చా కార్యక్రమాలు, రోడ్ షోలలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానంతో చాలా ఇబ్బందులు ఉన్నాయని వివరించారు. ఎవరినీ సంపద్రించకుండా, సలహాలు తీసుకోకుండా ఈ విధానాన్ని తీసుకొచ్చి కేంద్రం పెద్ద తప్పు చేసిందని ధ్వజమెత్తారు. విద్యా రంగానికి, విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే రీతిలో విధానాలు ఉండాలన్నారు. దేశ స్వాతంత్య్ర కోసం 70 ఏళ్ల క్రితం అహింసా మార్గంలో ఆంగ్లేయుల్ని వారి దేశానికి పంపించేశామని గుర్తు చేశారు. అదే మార్గంలో మోదీని నాగపూర్‌కు తరిమేద్దామన్నారు. చర్చ కార్యక్రమంలో ఓ ప్రొఫెసర్ మాట్లాడుతుండగా మైక్ పలుమార్లు మొరాయించింది. ఇదే పరిస్థితి పార్లమెంట్లో తనకు ఎన్నోసార్లు ఎదురయ్యిందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. -
ప్రజాస్వామం చచ్చిపోయింది.. చైనాకు తాకట్టు
తూత్తుకూడి: దేశ ప్రయోజనాలను చైనాకు తాకట్టు పెట్టడంతో దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనాకు సాగిలపడ్డాడని ఆరోపించారు. భారతదేశాన్ని చైనాకు అప్పగించారని మండిపడ్డారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తూత్తుకూడిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. సుదీర్ఘ రాజ్యాంగం ఉన్న భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికిలేదు.. ఆరేళ్లుగా ఒక ప్రణాళికపరంగా ప్రభుత్వ సంస్థలన్నింటిని ప్రభుత్వం వదిలేసుకుంటుందని రాహుల్ చెప్పారు. దేశంలో పార్లమెంట్, న్యాయ వ్యవస్థ, జర్నలిజం బలహీన పడుతుండడంతో దేశంలో ప్రజాస్వామ్యం ఇంకెక్కడిది అని ప్రశ్నించారు. విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యవస్థలను సమానంగా ఆరెస్సెస్ వాదులు నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థల నిర్వీర్యంతో రాష్ట్రాల పాత్రను కూడా తగ్గించేస్తున్నారని.. అదే మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్నామని రాహుల్ తెలిపారు. డబ్బు, అంగబలం ఎమ్మెల్యేలను నడిపిస్తోందని.. వాటితో ఎమ్మెల్యేలను బీజేపీ వేటాడుతోందని రాహుల్ పుదుచ్చేరి పరిణామాలను పరోక్షంగా ప్రస్తావించారు. -
కాంగ్రెస్‌కు అధిక సీట్లిస్తే అంతే సంగతులు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తాజా ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకుని ఎలాగైనా అధికార పీఠం ఎక్కాలని పట్టుదలతో ఉన్న డీఎంకేకి మిత్రపక్షాల సీట్ల సర్దుబాటు సమస్యగా మారింది. అయితే రాజీలేని ధోరణితో ముందుకు సాగడమే శ్రేయస్కరమని తీర్మానించుకుంది. 40 సీట్లు కోరుతున్న కాంగెస్‌కు 20 సీట్లతో కళ్లెం వేయడమే మేలు, గత ఎన్నికల్లోలా మళ్లీ అధికారం చేజార్చుకోలేమని డీఎంకే స్పష్టీకరణతో తొలివిడత సీట్ల సర్దుబాటు చర్చలు ఒక కొలిక్కి రాకుండానే వాయిదా పడ్డాయి. తమిళనాడులో 2011, 2016 ఎన్నికల్లో వరుసగా అన్నాడీఎంకేనే అధికారంలో రావడంతో దశాబ్దకాలంగా డీఎంకే ప్రతిపక్షంగా సర్దుకుపోక తప్పలేదు. ప్రజాకర్షణ కలిగిన నేత కరుణానిధి కన్నుమూసిన తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన స్టాలిన్ తొలిసారిగా ఎదుర్కొంటున్న అసెంబ్లీ ఎన్నికలు ఇవి. సీఎం కావాలనే తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు స్టాలిన్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ‘మీ నియోజకవర్గంలో స్టాలిన్’ పేరున రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో కోటి కుటుంబాల సమస్యలు పరిష్కరిస్తా నంటూ గతంలో ఎన్నడూ ఎరుగని హామీలు గుప్పిస్తున్నారు. అన్నాడీఎంకే, బీజేపీలను ప్రధాన ప్రత్యర్థులుగా భావిస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ తమిళభాష, సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకమని, ఇలాంటి కేంద్రప్రభుత్వానికి అన్నాడీఎంకే ప్రభుత్వం దాసోహమై పోయిందని ప్రచారం చేస్తూ సెంటిమెంట్‌తో దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రుల అవినీతి చిట్టాను గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌కు సమర్పించడం ద్వారా అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసే ప్రయత్నం కూడా చేశారు. ఇదిలాఉండగా, స్టాలిన్‌కు స్వయానా సోదరుడైన అళగిరి దక్షిణ తమిళనాడులో ఓటర్లను ప్రభావితం చేయగల నేతగా ఉన్నారు. తండ్రి కరుణానిధికి కల్లబొల్లి మాటలు చెప్పి పార్టీ నుంచి వెళ్లగొట్టించాడని స్టాలిన్‌పై అగ్రహంతో ఉన్న అళగిరి డీఎంకే ఓటమిని కోరుకుంటున్నారు. తమ ప్రధాన ప్రత్యర్థి అన్నాడీఎంకే గెలుపు అవకాశాలను శశికళ నీరు గార్చగలరని స్టాలిన్ ఆశిస్తున్నా, ఇప్పటి వరకు శశికళ జోరు అంతగా లేదు. అన్న అళగిరి సర్దుకుపోవడం, రాజకీయంగా శశికళ రెచ్చిపోవడం అంటూ జరిగితే డీఎంకే గెలుపు నల్లేరుపై నడకగా మారగలదని స్టాలిన్ విశ్వసిస్తున్నారు. డీఎంకే 190.. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుండగా 190 స్థానాల్లో డీఎంకే పోటీచేయాలని, మిగిలిన 44 స్థానాలను కూటమిలోని కాంగ్రెస్, వైగో నాయకత్వంలోని ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం, వీసీకే, కొంగునాడు దేశీయ మక్కల్ కట్చి, మనిదనేయ మక్కల్ కట్చి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వంటి మిత్రపక్ష పార్టీలకు సర్దాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాజా ఎన్నికల్లో 190 స్థానాల్లో పోటీ చేసి కనీసం 117 గెలుచుకోవడం ద్వారా అధికారం చేపట్టాలని డీఎంకే పట్టుదలగా ఉంది. 2011 ఎన్నికల్లో 119 సీట్లలో పోటీ చేసిన డీఎంకే కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుని అధికారాన్ని కోల్పోయింది. 2016 ఎన్నికల్లో 178 స్థానాల్లో పోటీ చేసి 89 చోట్ల గెలిచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికసీట్ల కేటాయింపుతో డీఎంకేకు అధికారం దూరమయింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 41 సీట్లలో పోటీచేసి 8 చోట్ల మాత్రమే గెలిచింది. డీఎంకే 89 సీట్లు సాధించింది. 117 సీట్లలో గెలుపొందడం ద్వారా అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. స్వల్పతేడాతో అధికారం చేజారడానికి కాంగ్రెస్సే కారణమని డీఎంకే ఆనాటి నుంచి ఆ పార్టీపై గుర్రుగా ఉంది. తాజా ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో ఆచితూచి అడుగేయాలని డీఎంకే నిర్ణయించుకుంది. డీఎంకే–కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటుపై తొలి విడత చర్చలు ఈనెల 25న ప్రారంభమయ్యాయి. ఈసారి ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ 41 వరకు సీట్లు కోరడంతో డీఎంకే సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. ప్రజల మద్దతు లేని కాంగ్రెస్‌కు అధికసీట్లు కేటాయించడం ద్వారా మరోసారి అధికారాన్ని చేజార్చుకునేందుకు సిద్ధంగా లేమని డీఎంకే స్పష్టం చేసింది. 15 సీట్లు కేటాయించాలని భావించాం, తుది నిర్ణయంగా 18 సీట్లకు మించి ఇచ్చేది లేదని డీఎంకే తేల్చిచెప్పడంతో కాంగ్రెస్ నిరాకరించింది. సుమారు గంటపాటు సాగిన చర్చలు ఎంతకూ కొలిక్కి రాకపోవడంతో మరోసారి బేటీ కావాలని ఇరువర్గాలు నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్‌కు గరిష్టంగా 20 సీట్లు, మిగిలిన మిత్రపక్షాలకు తలా రెండు సీట్లు కేటాయించాలని డీఎంకే తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇంతకంటే అదనంగా సీట్ల కోసం ఆయా పార్టీలు పట్టుబట్టే అవకాశం ఉంది. చదవండి: వెనక్కి తగ్గని శశికళ: ఆమె ఇంటికి సినీ ప్రముఖుల క్యూ రజనీ.. రండి కలిసి పనిచేద్దాం: కమల్ -
వెనక్కి తగ్గని శశికళ: ఆమె ఇంటికి సినీ ప్రముఖుల క్యూ
చెన్నె: జైలు శిక్ష అనుభవించి వచ్చిన శశికళ అన్నాడీఎంకే పార్టీ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఆ పార్టీ తనదేనని.. పార్టీ గుర్తుపై ఇప్పటికే కేసు వేసిన విషయం తెలిసిందే. జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి అన్నాడీఎంకే గుర్తు రెండాకులు వినియోగిస్తోంది. తాజాగా బుధవారం జయలలిత జయంతి సందర్భంగా శశికళ తనను తాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ప్రకటించుకుంది. ఈ మేరకు అదే హోదాతో ప్రకటన విడుదల కావడం విశేషం. కాగా తమిళనాడులో బుధవారం జయలలిత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలందరి అమ్మగా పేరుపొందిన జయలలితను అన్ని పార్టీల నాయకులు స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా జయలలితకు ఘన నివాళులర్పించారు. అయితే పోయెస్ గార్డెన్లో శశికళ తన స్నేహితురాలు జయలలితకు ఘన నివాళులర్పించింది. టీటీవీ దినకరన్‌తో పాటు తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే పార్టీ తనదేనని శశికళ మరోసారి పునరుద్ఘాటించారు. అమ్మ అభిమానులంతా ఏకం కావాలని శశికళ పిలుపునిచ్చారు. త్వరలోనే అందరినీ కలుసుకుంటానని ప్రకటించారు. తమకు ప్రధాన శత్రువు డీఎంకే అని తెలిపారు. ఈ క్రమంలోనే శశికళ నివాసానికి సినీ ప్రముఖులు వరుస కట్టారు. దర్శకుడు భారతీరాజా, నటులు రాధికా శరత్‌కుమార్ వచ్చారు. ఈ సందర్భంగా శశికళను కలిసి కొద్దిసేపు మాట్లాడారు. వారు శశికళను కలవడం తమిళనాడులో ఆసక్తికరంగా మారింది. అయితే సమావేశంలో రాజకీయంగా మాట్లాడినట్టు వార్తలు వస్తున్నా.. దీనిపై వారు స్పష్టత ఇచ్చారు. శశికళ అనారోగ్యానికి గురవడం.. జైలు నుంచి రావడంతో ఆమెను పరామర్శించేందుకే వచ్చామని రాధికా శరత్‌కుమార్ తెలిపారు. ఆమె యోగక్షేమాలు తెలుసుకునేందుకే వచ్చినట్లు వివరణ ఇచ్చారు. అయితే రాధికా శరత్ కుమార్ సమత్తువ మక్కల్ కట్చి (ఎస్ఎంకే) పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే.