
సాక్షి, చెన్నై: తన కుమారుడు రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ఎంపీ కనిమొళి స్పష్టం చేశారు. డీఎంకేలో వారసత్వ రాజకీయాలు ఎక్కువే అన్న విష యం తెలిసిందే. కరుణానిధి వారసుడిగా స్టాలిన్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వారసుడు ఉదయనిధి స్టాలిన్ సైతం రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే కాదు, చేపాక్కం– ట్రిప్లికేన్ నుంచి ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాడు. కరుణ గారాల పట్టి కని మొళి సైతం డీఎంకేలో కీలకంగానే ఉన్నారు. భవిష్యత్తులో ఈమె కుమారుడు సైతం రాజకీయాల్లోకి రావచ్చన్న చర్చ తెరపైకి వచ్చింది. అయితే ఓ మీడియా ఇంటర్వ్యూలో తన కుమారుడు రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. అన్న, చెల్లెల అనుబంధమేగానీ, తమ మధ్య గొడవలు ఇప్పటివరకు లేదని, ఎన్నటికీ రావని స్పష్టం చేశారు.
చదవండి:
డీఎంకే అభ్యర్థులుగా తెలుగు ప్రముఖులు
215వ సారి నామినేషన్; భార్య నగలు కుదువపెట్టైనా సరే
Comments
Please login to add a commentAdd a comment