మిమ్మల్ని నమ్మి రాజకీయాల్లోకి వచ్చా! | Tamil Nadu Assembly Polls Stalin Promises Will Return Karunanidhi Regim‌e | Sakshi
Sakshi News home page

మిమ్మల్ని నమ్మి రాజకీయాల్లోకి వచ్చా!

Published Fri, Mar 19 2021 2:18 PM | Last Updated on Fri, Mar 19 2021 3:09 PM

Tamil Nadu Assembly Polls Stalin Promises Will Return Karunanidhi Regim‌e - Sakshi

తిరువళ్లూరు/చెన్నై: మిమ్మల్ని నమ్ముకునే రాజకీయాలోక్లి వచ్చానని రాష్ట్రాభివృద్ధి కోసం డీఎంకేను ఆదరించాలని డీఎంకే అధినేత స్టాలిన్‌ ప్రజలను కోరారు. గుమ్మిడిపూండిలో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజే గోవిందరాజన్, పొన్నేరి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దురైచంద్రశేఖర్‌లకు మద్దతుగా డీఎంకే అధినేత స్టాలిన్‌ గురువారం ప్రచారం నిర్వహించారు. స్టాలిన్‌ మాట్లాడుతూ కరుణానిధి పాలనను మళ్లీ తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

అదే విధంగా డీఎంకే అధికారంలోకి వస్తే వ్యవసాయం, చేనేతకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని హామీ ఇచ్చారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. వరికి క్వింటాల్‌కు రూ.2,500, టన్ను చెరుకుకు రూ.4వేల మద్దతు ధర ఇస్తామని తెలిపారు. డీఎంకే మేనిఫెస్టోను కాపీ చేసి అన్నాడీఎంకే మేనిఫెస్టోను రూపొందించారని ఆరోపించారు. నీట్‌ పరీక్షలను రాష్ట్రంలో అనుమతించొద్దని అన్నాడీఎంకేను కోరినా ఫలితం లేదని ఆరోపించారు. 

చదవండి: కోటీశ్వరుల్లో నంబర్‌–1 సుబ్బయ్య
20 సీట్లు.. 30 మంది స్టార్‌ క్యాంపెయినర్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement