
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఓటర్లను ఆకర్షించేందుకు స్వతంత్ర అభ్యర్థి శరవణన్ చిత్ర విచిత్ర హామీలు ఇస్తున్నారు. దక్షిణ మధురై నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన ఆయన, నియోజకవర్గంలో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేస్తామని, ప్రజల్ని చంద్రమండలం పైకి తీసుకెళ్తానని వ్యాఖ్యానించారు. అదే విధంగా, ఇళ్లలో ఆడవాళ్ల పనికి సాయంగా ఇంటింటికీ రోబో పంపిణీ చేస్తానన్నారు. అంతేగాకుండా, ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి కాల్వలు తవ్వించి ఇంటికో బోటు పంపిణీ చేస్తానంటూ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాగా అన్ని రాజకీయ పార్టీలు టిక్కెట్ నిరాకరించడంతో శరవణన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు.
శరవణన్ ఇచ్చిన మరిన్ని హామీలు
- ఎండ వేడి నుంచి కాపాడేందుకు 300 అడుగుల ఎత్తున కృత్రిమ మంచుకొండ నిర్మాణం
- ప్రజలు ఎంజాయ్ చేయడానికి కృత్రిమ సముద్రం నిర్మాణం
- నియోజకవర్గ ప్రజలందరికీ ఐఫోన్
చదవండి: తమిళనాడు పోల్స్: దుస్తులు ఉతికి, గిన్నెలు తోమి