madhurai
-
ఉమెన్స్ హాస్టల్లో అగ్నిప్రమాదం.. ఇద్దరు యువతుల మృతి
చెన్నై: తమిళనాడులోని మధురైలో ఘోరం జరిగింది. ఓ లేడీస్ హాస్టల్ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఇద్దరు యువతులు చనిపోయారు. పొగతో ఊపిరి ఆడక వీళ్లు మృతి చెందినట్లు నిర్ధారణ అయ్యింది మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కాట్రంపళయం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్లో తెల్లవారుజాము ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రిఫ్రిజిరేటర్ ఒక్కసారిగా పేలడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. దాని దగ్గర నిద్రిస్తున్న ఇద్దరు యువతులు చనిపోయారు. వీళ్లలో ఒక యువతి స్థానికంగా టీచర్‌గా పని చేస్తున్నారు మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. ఘటనా సమయంలో హాస్టల్లో 40 మందికి పైగా ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఫ్రిడ్జ్ పేలి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.மதுரை பெண்கள் விடுதியில் தீ விபத்து.. ஆசிரியை உள்பட 2 பெண்கள் உயிரிழப்பு.. https://t.co/zm7evboOMe #madurai— Top Tamil News (@toptamilnews) September 12, 2024ఇదీ చదవండి: వృద్ధురాలి గొంతు కొరికి, ఆపై.. -
న్యాయ వృత్తిలో మహిళలు పెరగాలి: సీజేఐ
మదురై: న్యాయ వృత్తిని చేపడుతున్న పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉందంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ మరోసారి తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ‘‘నైపుణ్యమున్న మహిళా లాయర్లకు మన దేశం కొదవేమీ లేదు. అయినా పురుషులతో పోలిస్తే వారి సంఖ్య ఎప్పుడూ చాలా తక్కువే. మహిళలు ఇంటిపని తదితరాల కారణంగా వృత్తికి న్యాయం చేయలేరేమోనని లా చాంబర్లు భావిస్తుండటం వంటివి ఇందుకు కారణాలు’’ అన్నారు. ‘‘పిల్లల్ని కనడం, వారి సంరక్షణ తదితరాల వల్ల మహిళలకు వృత్తిపరంగా శిక్ష పడకూడదు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి వారికి వ్యక్తిగతంగానే గాక వ్యవస్థాగతంగా కూడా చేయూతనివ్వాలి. కోర్టు సముదాయాల్లో క్రెష్ సదుపాయం దిశగా సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు తీసుకున్న చర్యల వంటివి దేశవ్యాప్తం కావాలి’’ అని అభిప్రాయపడ్డారు. శనివారం మదురైలో జిల్లా కోర్టుల సముదాయం తదితరాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయ వృత్తి మహిళలకు సమానావకాశాలు కల్పించడం లేదన్నారు. తమిళనాడులో న్యాయవాదులుగా నమోదు చేసుకుంటున్న పురుషుల సంఖ్య 50 వేల దాకా ఉంటే మహిళలు ఐదు వేలకు మించడం లేదంటూ ఉదాహరించారు. ‘‘ఇటీవల పరిస్థితి మారుతుండటం శుభసూచకం. జిల్లా స్థాయి న్యాయ నియామకాల్లో 50 శాతానికి పైగా మహిళలే చోటుచేసుకున్నారు. ఈ ధోరణి మరింత పెరగాలి’’ అని సీజేఐ ఆకాంక్షించారు. జూనియర్ లాయర్లకు నెలకు కేవలం రూ.5,000–12,000 వేతనం సరికాదన్నారు. ఘర్షణ లేదు: రిజిజు ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య ఉన్నది అభిప్రాయ భేదాలేనని తప్ప ఘర్షణ కాదని కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు చెప్పారు. ‘‘మా మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు గొడవలేమీ కాదు. అవి సంక్షోభం కాదు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సూచిక. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించేందుకు కేంద్రం ఎప్పుడూ సహకరిస్తుంది’’ అని చెప్పారు. చెన్నై, ముంబై, కోల్‌కతా నగరాల్లో సుప్రీంకోర్టు బెంచిలు ఏర్పాటు చేయాలని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ సీజేఐని కోరారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు హరి కన్నుమూత
నటుడు హరి వైరవన్ (38) శుక్రవారం అర్ధరాత్రి మదురైలో కన్నుమూశారు. సుశీంద్రన్ దర్శకత్వం వహించిన వెన్నెలా కబడ్డీ కుళు చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. అందులో విష్ణు విశాల్ మిత్రుల్లో ఒకరిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత వెన్నెలా కబడ్డీ కుళు–2, కుళ్లు నరి కూట్టం తదితరులు చిత్రాల్లో నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అనారోగ్యానికి గురి కావడంతో వైద్య పరీక్షలో కిడ్నీ పాడైపోయిందని తెలియడంతో మదురైలో వైద్య చికిత్స పొందుతూ వచ్చారు. అయితే వైద్యం ఫలించక తుదిశ్వాస విడిచారు. ఈయన మృతికి నటుడు విష్ణు విశాల్, బ్లాక్ పాండి, అంబానీ శంకర్, దర్శకుడు బాలాజీ తదితర సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. హరి వైరవన్‌కు భార్య కవిత, కూతురు రెండేళ్ల రోషిణీశ్రీ ఉన్నారు. ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు స్వగ్రామంలో జరిగాయి. కాగా నటుడు హరి వైరవన్ కుటుంబం ఇప్పటి వరకూ ఆయన సంపాదనతోనే గడుస్తూ వచ్చింది. హరి వైరవన్ మరణంతో ఆ కుటుంబం జీవనాధారం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో చిత్ర పరిశ్రమ ఆర్థికంగా ఆదుకోవాలని హరి వైరవన్ భార్య మీడియా ద్వారా వేడుకున్నారు. చదవండి: (లోకనాయకుడు, దర్శకధీరుడు కలిస్తే..?) -
ప్రముఖ నటుడు సూరి హోటల్లో రైడ్
తమిళసినిమా: మదురైలోని నటుడు సూరి హోటళ్లలో వాణిజ్యపన్నుల శాఖ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. హాస్యపాత్రలు చేసే స్థాయి నుంచి కథానాయకుడిగా ఎదిగిన నటుడు సరి. ఈయన మదురైలో పలు ప్రాంతాలలో సొంతంగా అమ్మన్ పేరుతో హోటళ్లు నిర్వహిస్తున్నారు. ఇతర హోటళ్ల కంటే వినియోగదారులకు సూరి తక్కువ ధరకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందిస్తున్నారనే పేరు ఉంది. ఇదే ఆయన అమ్మన్ హోటళ్లపై వాణిజ్య శాఖ అధికారుల తనిఖీలకు దారి తీసింది. ఆ ప్రాంతంలోని ఇతర హోటల్లో నిర్వాహకుల ఫిర్యాదుల కారణంగా మంగళవారం సాయంత్రం అధికారులు నటుడు సరి హోటళ్లలో సోదాలు నిర్వహించారు. ఆ హోటల్లో వినియోగిస్తున్న ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తున్న సరుకుల గురించిన వివరాలు సేకరించారు. హోటల్లో విక్రయిస్తున్న ధరల పట్టికలను తనిఖీ చేయగా అందులో జీఎస్టీ పన్ను చెల్లించడం లేదనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో హోటల్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. కాగా నటుడు సూరి హోటళ్లపై తనిఖీల ఘటన కోలీవుడ్‌లో చర్చకు దారితీసింది. -
వామ్మో.. మల్లె!.. బెంబేలెత్తుతున్న కస్టమర్లు
సాక్షి, చెన్నై: మదురై మార్కెట్లో మల్లె పువ్వుల ధర ఆకాశాన్ని తాకింది. మంగళవారం కిలో మల్లె పువ్వులు రూ. 3 వేలు ధర పలికాయి. అలాగే, ఇతర పువ్వుల ధర సైతం అమాంతం పెరిగింది. వర్షాల నేపథ్యంలో దిగుబడి తగ్గడంతో పువ్వుల ధరలకు రెక్కలొచ్చాయి. మదురై మల్లెకు తమిళునాడులో ప్రత్యేక స్థానం ఉంది. ఈ పువ్వు రెండు రోజుల వరకు మొగ్గగానే ఉంటుంది. ఆలస్యంగా ఈ పువ్వు వాడిపోతుంది. దీంతో మదురై ఫ్లవర్ మార్కెట్లో ఈ పువ్వులకు డిమాండ్ ఎక్కువే. నిన్న మొన్నటి వరకు ఈ మల్లె కిలో రూ. 1500 పలికింది. వినాయక చవితి తర్వాత ధర భారీగా పెరిగింది. మంగళవారం ఉదయాన్నే కిలో మల్లె రూ.3000 పలికింది. మదురై రకం మల్లె పువ్వుల ధర అమాంతంగా పెరగడంతో కొనుగోలు దారులకు షాక్ తప్పలేదు. అలాగే, కనకాంబరం కిలో రూ. వెయ్యికి పైగా పలికింది. రోజా, సంపంగి, చామంతి వంటి పువ్వుల ధరలు కూడా పెరిగాయి. వ్యాపారులు మాట్లాడుతూ వర్షాల కారణంగా పువ్వుల దిగుమతి భారీగా తగ్గిందని అందుకే ఈ పరిస్థితి నెలకొందన్నారు. చదవండి: (పళణి కోటలోకి శశికళ!) -
ఐదేళ్లుగా అమ్మాయి కోసం చూసి చూసి.. చివరికి ఇలా..!
గత ఐదేళ్లుగా సరైన జోడి కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నా. కానీ, దొరకట్లేదు. సంబంధాల కోసం ఎంతో డబ్బు ఖర్ఛు చేశాం.. ఫలితం లేదు. ఏం చేయను.. తప్పట్లేదు అంటూ ఆ యువకుడు చేసిన పని ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. తనకు నచ్చిన, తనను మెచ్చిన అమ్మాయిని వెతుక్కోవడం కోసం తమిళనాడులోని విల్లపురానికి చెందిన ఎమ్మెస్ జగన్ వినూత్న చర్యకు దిగాడు. ‘పేరు: ఎమ్మెస్ జగన్. వయస్సు: 27 ఏండ్లు. జీతం నెలకు నలభైవేలు. నాకు వధువు కావలెను’ అంటూ కులం, ఇతర వివరాలతో పాటు మధురై అంతటా రోడ్ల కూడళ్లలో బ్యానర్లు, వాల్ పోస్టర్లు వేశాడతను. ఓ కంపెనీలో మేనేజర్‌గా పని చేసే జగన్.. పార్ట్ టైంలో డిజైనర్‌గా కూడా పని చేస్తున్నాడు. నా పనిలో భాగంగా ఎంతో మంది కోసం.. ఎన్నో పోస్టర్లు డిజైన్ చేశా. నా కోసం ఎందుకు డిజైన్ చేసుకోకూడదు అనిపించింది. అందుకే ఇలా అంటున్నాడు ఆ యువకుడు. ఎంతో మంది అమ్మాయిని చూస్తామంటూ డబ్బులు కూడా తీసుకున్నారు. కానీ, ఎవరూ సరిపోయే జోడిని తేలేకపోయారు. అందుకే ఈ ప్రయత్నం అంటున్నాడు అతను. అయితే.. పోస్టర్లు పెట్టాక ఏమైనా సంబంధాలు వస్తున్నాయా? అంటే.. అబ్బే లేదంట. కేవలం.. మ్యారేజ్ బ్రోకర్లు మాత్రమే ఫోన్లు చేస్తున్నారట పాపం. నైంటీస్‌లో పుట్టిన తనకు ఇదొక టఫ్ టైం అంటున్నాడు ఎమ్మెఎస్ జగన్. ఇంటర్నెట్లో మీమ్స్‌తో పాటు కొంతమంది ఫోన్ కాల్స్ చేసి.. పాపం అతన్ని పెళ్లి చూపులంటూ ఏడ్పించారట కూడా. కానీ, ఎవరినీ పట్టించుకోకుండా ఈ ప్రయత్నం ఆపనంటున్నాడు అతను. ఒకవేళ.. త్వరలో మంచి సంబంధం గనుక కుదిరితే.. కృతజ్ఞతలతో మరొక పోస్టర్ తయారు చేస్తాడంట. -
వామ్మో ఇదేం ఫైటింగ్.. బస్టాండ్‌లో తన్నుకున్న విద్యార్థినులు
సాక్షి, చెన్నై: బస్టాండ్‌లో విద్యార్థినులు తన్నుకున్నారు. మగరాయుళ్లకు ఏమాత్రం తీసి పోమన్నట్టుగా సినీ స్టంట్లు చేశారు. విద్యార్థులు వ్యవహరిస్తున్న తీరుతో కౌన్సెలింగ్‌కు తగ్గ చర్యలపై విద్యా శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తీరు వివాదాలకు, చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. తిరునల్వేలిలో విద్యార్థుల గొడవలో ఓ విద్యార్ధి మరణాన్ని విద్యాశాఖ తీవ్రంగా పరిగణించింది. ఆ విద్యార్థి చదువుతున్న పాఠశాలలోని ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే, కడలూరులో శుక్రవారం గొడవ పడ్డ 14 మంది విద్యార్థుల పై కేసులు నమోదు అయ్యాయి. ఈ పరిస్థితుల్లో శనివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో విద్యార్థినులు తగ్గేదేలేదన్నట్టుగా గొడవ పడిన వీడియో రాత్రి సమయంలో వైరల్‌గా మారింది. స్టంట్లతో మదురై పెరియార్ టౌన్ బస్టాండ్‌లో పదుల సఖ్యలో రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు హఠాత్తుగా ముష్టియుద్ధానికి దిగారు. తన్నులు తాళ లేక కొందరు పారిపోతున్నా, వెంటాడి మరీ మరి కొందరు విద్యార్థినులు కొట్టడం గమనార్హం. ఈ దృశ్యాలన్నింటినీ అక్కడే ఉన్న విద్యార్థులు తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు. అక్కడి ప్రయాణికులు వారిస్తున్నా, పట్టించుకోకుండా విద్యార్థినులు సాగించిన ఫైట్ దిగ్భ్రాంతి కలిగించింది. అర్ధ గంట తర్వాత రంగంలోకి పోలీసులు దిగడంతో విద్యార్థినులు పత్తా లేకుండా పోయారు. అయితే, విద్యార్థులు చిత్రీకరించిన వీడియో రాత్రి సమయంలో వైరల్‌గా మారింది. విద్యార్థినుల ఫైట్‌ను ప్రోత్సహించే విధంగా మరి కొందరు విద్యార్థులు ఈల గోల చేయడం వంటి దృశ్యాలు వీడియోలో ప్రత్యక్షం అయ్యాయి. ఈ ఘటనను విద్యాశాఖ తీవ్రంగా పరిగణించింది. అక్కడ తన్నుకున్న విద్యారి్ధనులు అందరూ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. వీరికి కౌన్సెలింగ్‌కు ఇవ్వడానికి విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. என்ன நடக்குது தமிழ்நாட்டுல?? பள்ளிக்கூட மாணவிகள் மதுரை பேருந்து நிலையத்தில்,,,,! நடந்த அடிதடி! ரவுடிசம் பெருகும் சூழல்!!! pic.twitter.com/TQvSfZSiyk — மணவை S.செல்வராஜ் AHMA, BA,,, (@Selva_AIADMK) May 1, 202 ఇది కూడా చదవండి: చిన్నారి కన్నీళ్లు తుడిచేవారెవరు? -
మెడికల్ కాలేజీలో ‘చరక శపథం’ రగడ.. డీన్ సస్పెండ్
చెన్నై: తమిళనాడులోని మదురై ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన విద్యార్థులు ప్రాచీన ఆయుర్వేద వైద్యుడు చరకుడు పేరు మీద ప్రమాణం చేయడం వివాదానికి దారి తీసింది. మెడికల్ కాలేజీలో చేరేటప్పుడు విద్యార్థులు వైద్య శాస్త్ర పితామహునిగా చెప్పుకునే హిపోక్రేట్స్ పేరిట ప్రమాణం చేస్తారు. కానీ, మదురై మెడికల్ కాలేజీ డీన్ రత్నవేల్ కొత్త విద్యార్థులతో శనివారం ‘మహర్షి చరక శపథం’ చేయించడం కలకలం రేపింది. దాంతో ప్రభుత్వం ఆయనను బాధ్యతల నుంచి తొలగించింది. పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచింది. దీనిపై విచారణకు ఆదేశించింది. ఇలా నిబంధనలు అతిక్రమించడం సరికాదని ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ అన్నారు. నిబంధనల మేరకే విద్యార్థులతో ప్రమాణం చేయించాలని మెడికల్ కాలేజీలను ఆదేశించారు. ఈ ఘటనపై బీజేపీ నాయకుడు నారాయణన్ తిరుపతి స్పందిస్తూ, డీన్ తొలగింపు నిర్ణయం రాజకీయ ఎత్తుగడ అని పేర్కొన్నారు. -
త్వరలోనే ప్రధానమంత్రిగా ఎంఎస్ ధోనీ!
చెన్నై : తమిళ స్టార్ విజయ్ను ఇటీవలె టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కలిసిన సంగతి తెలిసిందే. ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్లో భాగంగా చెన్నై వెళ్లిన ధోనీ ..అదే లొకేషన్లో ఉన్న విజయ్ను కలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేములో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ అనందంతో కొందరు ఫ్యాన్స్ సృష్టించిన పోస్టర్లు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. భవిష్యత్తులోఎంఎస్ ధోనీని ప్రధానమంత్రిగానూ, విజయ్ను ముఖ్యమంత్రిగానూ చూడోబోతున్నాం అంటూ కొందరు అభిమానులు మధురైలో పోస్టర్లు అంటించారు. ప్రస్తుతం ఈ పోస్టర్లపై దుమారం రేగుతోంది. -
ప్రేమవివాహం.. భార్య గర్భవతి అని కూడా చూడకుండా..
చెన్నై: తమిళనాడులో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఎన్నో ఆశలతో తన మనస్సుకి నచ్చిన వ్యక్తితో యువతి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో భర్త, అత్తింటి వారు అదనపు కట్నం తేవాలని వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ యువతి .. ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మధురై జిల్లాలో 19 ఏళ్ల పండిశ్వరి అనే యువతి, తంగరాజ్ అనే వ్యక్తిని ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో...పండిశ్వరి గర్భం దాల్చింది. గత కొన్ని రోజులుగా భర్త , అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించసాగారు. ప్రతిరోజు ఆమెను మానసికంగా, చిత్రహింసలకు గురిచేశారు. భర్త వేధింపులకు తట్టుకోలేక పండిశ్వరి తన తండ్రి వెల్లైస్వామికి విషయాన్ని తెలిపింది. దీంతో యువతి తండ్రి భర్తకు సర్దుబాటు చెప్పడానికి ఆమె ఇంటికి చేరుకున్నాడు. కాగా, యువతి తీవ్రమైన మనస్తాపంతో గత శనివారం (ఆగస్టు7)న కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమెను వెంటనే స్థానిక రాజాజీ ఆసుపత్రికి తరలించారు. ఆమెను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. అయితే, ఆమె శరీరం వైద్యానికి స్పందించట్లేదని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆమె గత సోమవారం అర్దరాత్రి మృతి చెందింది. కాగా, బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అల్లుడు, అతని కుటుంబ సభ్యులపై కేసును నమోదుచేశారు. కాగా, నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు మధురై పోలీసులు తెలిపారు. -
చచ్చిన పామును తిన్న వ్యక్తి.. రూ. 7 వేలు ఫైన్
కరోనా నా? నాకెందుకొస్తదరి రా? ఈ పామును తింటా. ఇంక కరోనా కాదుకదా.. దానమ్మ కూడా నన్నేం చేయలేదు అంటూ ఓ వ్యక్తి చిందులేస్తూ చచ్చిన పామును కసాబిసా కొరికి తినేశాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అయితే ఆ న్యూస్ వైరల్ కావడంతో అధికారులు ఆగ్రహించారు. ఆ వ్యక్తిని ట్రేస్ చేసి అరెస్ట్ చేయడంతో పాటు జరిమానా విధించారు. చెన్నై : కరోనాకి విరుగుడంటూ ఓ వ్యక్తి చచ్చిన పామును తిన్నాడు. ఈ వీడియో తమిళనాడు వాట్సాప్ గ్రూపులలో వైరల్ అయ్యింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మధురై జిల్లా పెరుమపట్టికి చెందిన వడివేలు ఒక వ్యవసాయ కూలీ. యాభై ఏళ్ల వయసున్న వడివేలు ఈమధ్య ఒకరోజు చచ్చిన కట్లపామును ఒకదానిని చేతబట్టి డాన్సులేశాడు. పాము కరోనాకి విరుగుడేనంటూ.. ఇక తనకు కరోనా రాదంటూ వ్యాఖ్యలు చేస్తూ అందరూ చూస్తుండగానే దానిని నమిలి తినేశాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి వైరల్ తీశారు. జిల్లా ఫారెస్ట్ అధికారుల దాకా ఆ వీడియో చేరడంతో సైబర్ పోలీసులను ఆశ్రయించారు. చివరికి వడివేలుని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ టైంలో అతను ఫుల్‌గా తాగి ఉన్నాడని, అదృష్టవశాత్తూ అతను విష గ్రంథిని కొరకలేదని అధికారులు వెల్లడించారు. కట్లపాము విషంలో న్యూరోటాక్సిన్స్ ఉంటాయని, అవి పక్షవాతాన్ని కలగజేస్తుందని ఫారెస్ట్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నానని, కొందరు బలవంతం చేయించి ఆ పని చేయించారని వడివేలు వాపోతున్నాడు. వడివేలును అరెస్ట్ చేయడంతో పాటు 7,000 రూపాయల ఫైన్ విధించారు. చదవండి: రాత్రి పాలలో మత్తుమందు కలిపి -
నన్ను గెలిపిస్తే ప్రతి ఇంటికి రూ. కోటి...
తమిళనాడు: సాధారణంగా ఎన్నికలంటే ఓటుకు వెయ్యి నోటు ఇస్తారు గానీ ఏకంగా కోట్లిస్తానంటున్నాడు మధురైలోని ఓ మహానుభావుడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో, ఓ తమిళ తంబి హామీలను చూస్తే ఎవరికైనా షాక్‌తో దిమ్మతిరిగి బొమ్మ కనపడాల్సిందే. తనను గెలిపిస్తే ప్రజలను షికారుకి తీసుకెళ్తా అంటున్నాడు. షికారు అంటే పక్క రాష్ట్రమో, లేదా పొరుగు దేశమో కాదండి, ఏకంగా చంద్రుని పైకే ట్రిప్ అంట. తులమ్ శరవణన్ మధురై దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నఒక స్వతంత్ర అభ్యర్థి. ఇతని వెరైటీ వాగ్దానాల జాబితాలో మినీ-హెలికాప్టర్, ప్రతి ఇంటికి ఒక కోటి వార్షిక డిపాజిట్, వివాహాలకు బంగారు ఆభరణాలు, మూడు అంతస్థుల ఇల్లు, చంద్రుని పర్యటన ఉన్నాయి. తన మ్యానిఫెస్టోలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు నియోజకవర్గ ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఈ బాబు అంతటి ఆగలేదు గృహిణుల పనిభారాన్ని తగ్గించే రోబోట్, ప్రతి కుటుంబానికి ఒక పడవ, తన నియోజకవర్గ ప్రజలను చల్లగా ఉంచడానికి 300 అడుగుల ఎత్తైన కృత్రిమ మంచు పర్వతం ఏర్పాటు, అంతరిక్ష పరిశోధన కేంద్రం, రాకెట్ లాంచ్ ప్యాడ్ కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. ఇంకేముంది ఈ వార్త తమిళనాట వైరల్ అయ్యింది. కాగా తన హామీల వెనుక దాగున్న అంతర్యాన్ని మీడియాతో పంచుకున్నాడు. ఇంకైనా ప్రజలు తెలుసుకోవాలి మరీ వినడానికే విడ్డూరంగా ఉన్న ఈ హామీల గురించి అతను ఏమంటున్నాడంటే. ఎన్నికలంటే చాలు అభ్యర్థుల నోటి నుంచి హామీలు వర్షాకాలంలో వరదల్లా వస్తుంటాయ్ అవి ఆచరణకు సాధ్యమున్నా కాకపోయినా, అందుకే ప్రజలు మాటల అభ్యర్థులను కాకుండా చేతల అభ్యర్థులను ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నానని అందుకే ఈ వెరైటీ హామీలని శరవణన్ చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం రాజకీయ పార్టీలు పని చేయడం లేదు. రాజకీయ నాయకులు " పనితో కాకుండా వారి మనీతో ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు" నా ఈ హామీలను చూసైనా ప్రజల్లో మార్పు రావాలని అందుకే ఈ ప్రయత్నమంటూ చెప్పాడు. శరవణన్ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి అతని స్నేహితులు, బంధువులు సహాయం చేస్తున్నారు. అతను మాట్లాడుతూ "నా వాట్సాప్ మెసెజ్ వైరల్ అయ్యింది, ప్రజలు ప్రస్తుతం నా వెరైటీ వాగ్దానాలను, దాని వెనుక దాగున్న అంతర్యాన్ని ఆలోచిస్తున్నారు. నేను గెలవకపోయినా ఇదే నా విజయంగా భావిస్తానని తెలిపాడు. ( చదవండి : ఒక ఓటు.. రూ.2 లక్షలు ) -
TN Assembly Polls: చంద్రమండలంపైకి తీసుకువెళ్తా!
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఓటర్లను ఆకర్షించేందుకు స్వతంత్ర అభ్యర్థి శరవణన్ చిత్ర విచిత్ర హామీలు ఇస్తున్నారు. దక్షిణ మధురై నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన ఆయన, నియోజకవర్గంలో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేస్తామని, ప్రజల్ని చంద్రమండలం పైకి తీసుకెళ్తానని వ్యాఖ్యానించారు. అదే విధంగా, ఇళ్లలో ఆడవాళ్ల పనికి సాయంగా ఇంటింటికీ రోబో పంపిణీ చేస్తానన్నారు. అంతేగాకుండా, ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి కాల్వలు తవ్వించి ఇంటికో బోటు పంపిణీ చేస్తానంటూ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాగా అన్ని రాజకీయ పార్టీలు టిక్కెట్ నిరాకరించడంతో శరవణన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. శరవణన్ ఇచ్చిన మరిన్ని హామీలు ఎండ వేడి నుంచి కాపాడేందుకు 300 అడుగుల ఎత్తున కృత్రిమ మంచుకొండ నిర్మాణం ప్రజలు ఎంజాయ్ చేయడానికి కృత్రిమ సముద్రం నిర్మాణం నియోజకవర్గ ప్రజలందరికీ ఐఫోన్ చదవండి: తమిళనాడు పోల్స్: దుస్తులు ఉతికి, గిన్నెలు తోమి -
బిస్కెట్ కప్‌లో చాయ్: తాగి తినొచ్చు..!
చెన్నై: చాయ్ విత్ బిస్కెట్స్.. ఎవర్గ్రీన్ కాంబినేషన్. మనలో చాలా మంది ఉదయం చాయ్-బిస్కెట్‌తోనే ప్రారంభమవుతుంది అంటే అతిశయోక్తి కాదు. బయట టీ కోట్ల దగ్గర చాయ్ తాగేటప్పుడు కూడా బిస్కెట్ తినడం చాలా మందికి అలవాటు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓ మధురై టీ కొట్టు యాజమాని ఓ వెరైటీ కాంబినేషన్‌ని తీసుకొచ్చారు. సాధారణంగా టీని గాజు గ్లాస్, కాగితపు కప్పు, పింగాణి కప్పులో పోస్తారని తెలుసు. అయితే ఈ టీ కొట్టు యాజమాని మాత్రం వెరైటీగా బిస్కెట్ టీ కప్పులు తీసుకొచ్చాడు. అంటే బిస్కట్స్‌తో తయారు చేసిన కప్పులు అన్నమాట. మధురైలోని ఆర్ఎస్ పాతి నీలగిరి టీ స్టాల్ చాక్లెట్-రుచిగల బిస్కెట్‌తో తయారు చేసిన తినే కప్పుల్లో తక్కువ మొత్తంలో టీని అందిస్తోంది. అంటే మీరు మీ టీని తాగవచ్చు, ఆపై కప్పు తినవచ్చు. దీని వల్ల వ్యర్థాలు ఉండవు.. మనకు భిన్నమైన అనుభూతి. ది బెటర్ ఇండియా వీడియో రిపోర్ట్ ప్రకారం ఆర్ఎస్ పాతి నీలగిరి టీ స్టాల్ 1909 నుంచి ఉంది. అక్టోబర్ 2019 లో భారత ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నెమ్మదిగా తొలగించి 2022 నాటికి పూర్తిగా నిషేధించాలని భారత్ యోచిస్తోంది. వీటిలో ప్లాస్టిక్ సంచులు, కప్పులు, ప్లేట్లు, సీసాలు, స్ట్రాలు వంటి రోజువారీ వినియోగ వస్తువులు ఉన్నాయి. అందుకే దేశవ్యాప్తంగా అనేక మంది వ్యాపారులు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ పరిష్కారాల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో టీ స్టాల్ యజమాని వివేక్ సబాపతికి వినూత్న ఆలోచన వచ్చింది. పర్యావరణ అనుకూలమైన టీ కప్పులు కోసం శోధిస్తున్నప్పుడు బిస్కెట్ కప్పులపై సబపతి దృష్టి పడింది. అలా దాన్ని అమల్లోకి తెచ్చారు. (చదవండి: నోట్లో ‘కుకీసు’కుందాం) ఇక ఈ తినదగిన బిస్కెట్ టీ కప్పు ధర 20 రూపాయలు మాత్రమే. ఈ వినూత్న ప్రయోగం టీ ప్రియులకు కూడా బాగా నచ్చింది. జూలై నెలలో ప్రారంభించినప్పటి నుంచి జనాలు బిస్కెట్ కప్పులో అందించే టీని తాగడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ కప్‌లో సుమారు 60 మిల్లీలీటర్ల టీ పడుతుంది. అయితే ఈ బిస్కెట్ కప్పులో పోసిన టీని పది నిమిషాల్లోనే తాగాల్సి ఉంటుంది. ఆ తర్వాత కప్పు మెత్తగా అయ్యి చిరిగిపోతుంది. ఇక ఈ బిస్కెట్ కప్పులో మరిన్ని ఫ్లేవర్స్ తీసుకురావాలని భావిస్తున్నారు సభాపతి. ఒక్కసారి పరిస్థితులు చక్కబడితే దానిపై దృష్టి పెడతామని తెలిపారు. -
నాన్నా... నీ వద్దకే వస్తున్నాం!
సాక్షి, చెన్నై: ఇంటి పెద్ద మరణం ఓ కుటుంబాన్ని తీవ్ర మనోవేదనలోకి నెట్టింది. నీ వెంటనే మేమూ అంటూ ఆ కుటుంబంలోని ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన మదురైలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు..తిరుచ్చి సత్యమూర్తినగర్‌కు చెందిన అరుణ్‌పాండియన్(44) కాంట్రాక్టర్. ఆయనకు భార్య వలర్మతి(38), కుమార్తెలు అఖిల(19), ప్రీతి(17) ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలో అరుణ్‌పాండియన్ అనారోగ్యానికి గురయ్యారు. మదురైలో చికిత్స తీసుకోవాల్సి రావడంతో మలై స్వామిపురంలోని వలర్మతి సోదరి సరస్వతి ఇంటికి పైఅంతస్తులో కొద్ది నెలలుగా ఉంటున్నారు. జూలైలో అరుణ్ పాండియన్ మరణించాడు. అప్పటి నుంచి ఆ కుటుంబం తీవ్ర మనోవేదనతో ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ముగ్గురు ఒకేగదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తాము పెంచుకుంటున్న శునకాన్ని సైతం గొంతు నులిమి హతమార్చారు. ఉదయం ఎంత సేపైనా వలర్మతి, పిల్లలు బయటకు రాకపోవడంతో సరస్వతి భర్త గణేషన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపు బద్దలు కొట్టి చూడగా తల్లి, కుమార్తెలు ఉరికి వేలాడుతూ కనిపించారు. (కిరాతకం: కుటుంబం గొంతు కోశారు!) ఫ్యామిలీ ఫొటో వద్ద ఓ లేఖను పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలను అందులో వివరించారు. తమ ఆస్తులను తన తల్లి లక్ష్మికి అప్పగించాలని వలర్మతి అందులో పేర్కొంది. తమ అంత్యక్రియులను తల్లి లక్ష్మి చేతుల మీదుగా చేయించాలని..తమతో పాటుగా శునకాన్ని ఖననం చేయాలని కోరారు. అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి లేకపోవడం కష్టతరంగా ఉందని, అందుకే నాన్న వద్దకే వెళుతున్నామని ఇద్దరు కుమార్తెలు లేఖలో పేర్కొనడం అందరి హృదయాలను బరువెక్కించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదురై జీహెచ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అతడు కాస్తా.. 'ఆమె'గా
మధురై (తమిళనాడు): సమాజంలో హిజ్రాల పట్ల వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ కొన్ని సార్లు మానవత్వం ఏదో ఒక విధంగా సహాయం చేస్తుంది. ఎంత గౌరవమైన వృత్తిలో పనిచేస్తున్నా ట్రాన్స్‌జెండర్స్ బతుకులు బాగుపడటంలేదు. సరిగ్గా ఇక్కడ కూడా అలానే జరిగింది. పురఘడిగా ఉన్నంత వరకు సాఫీగా ఉన్న జీవితం లింగమార్పిడి చేసుకున్న తరువాత ఆమె జీవితం తలకిందులైంది. ఓ వ్యక్తి మధురైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఆ తరువాత ఓ ఆసుపత్రిలో ఒక సంవత్సరం పాటు వైద్యుడిగా సేవలందించాడు. కొన్ని రోజుల తరువాత మహిళగా మారాలని అనుకున్నాడు. కానీ అటు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఇటు సమాజం నుంచి వ్యతిరేకత ఎదురైంది. అయినా.. లింగమార్పిడి చేసుకున్నాడు. లింగమార్పిడి తరువాత అతడు కాస్త... ఆమెగా మారింది. అసలు కష్టం ఇక్కడే మొదలైంది. పనిచేస్తున్న ఆసుపత్రిలో ఆమె ఉద్యోగం పోయింది. కుటుంబ సభ్యుల దగ్గరకు వెలితే సరైన ఆదరణ దక్కలేదు. ఉద్యోగంలేక ఆదుకునేవారులేక ఇతర ట్రాన్స్‌జెండర్స్‌తో కలిసి యాచక యాచకవృత్తిని ఎంచుకుంది. అదే ప్రాంతంలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కవిత అనే పోలీసు అధికారి ఆమె కష్టాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన యంత్రాంగం ఆమె వివరాలు తెలుసుకున్నారు. నిజంగానే ఆమె డాక్టర్ అని తెలియడంతో క్లినిక్ ఏర్పాటు చేయడానికి ఆమెకు సాయం చేశారు. ఇన్స్పెక్టర్ కవితకు అటు అధికారులు, ఇటు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. (చదవండి : మొదటి ట్రాన్స్ ఉమన్ డాక్టర్‌గా త్రినేత్ర) -
మధురైలో నడిరోడ్డుపై దారుణం
చెన్నై: నడిరోడ్డుపై ఓ యువకుడిని దారుణంగా హతమార్చిందో గ్యాంగ్. అతడి తలను మొండెం నుంచి వేరుచేసి దూరంగా పడేసింది. ఈ పాశవిక ఘటన తమిళనాడులోని మధురైలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. ఊతంగడికి చెందిన మురుగానందం(22) తన స్నేహితుడితో కలిసి సెయింట్ మేరీస్ చర్చి గుండా వెళ్తున్నాడు. ఇంతలో కారులో వచ్చిన గుర్తుతెలియని దుండగులు వారిని అడ్డగించారు. మురుగానందం పారిపోయేందుకు ప్రయత్నించగా అతడిని వెంబడించి మరీ దారుణంగా హతమార్చారు. అనంతరం తల నరికి చర్చి ముందు పడేశారు. ఇక ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మురుగానందం స్నేహితుడు ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కాగా ఈ హత్యకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (చదవండి: హోటల్లో యువతిపై సామూహిక అత్యాచారం) కర్ణాటకలో వ్యాపారిపై దాడి గుర్తు తెలియని దుండగులు ఓ వ్యాపారిపై పాశవికంగా దాడి చేశారు. పని ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మాటు వేసిన దుండగులు పదునైన ఆయుధాలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలోతీవ్రగాయాలపాలైన ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. -
హెరిటేజ్‌పై ఐటీ దాడులు.. కీలక పత్రాలు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: హెరిటేజ్ హోటళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున నుంచి ఈ దాడులు కొనసాగుతన్నాయి. చెన్నై, మధురై సహా ఐదు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. హెరిటేజ్ హోటళ్లపై జరుగుతున్న దాడుల్లో ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: (నిన్ను చంపితేగాని చైర్మన్ పదవి రాదు: భూమా విఖ్యాత్‌రెడ్డి) (రాజశేఖర్ చాలా క్రిటికల్ స్టేజి వరకు వెళ్లారు: జీవిత) -
‘అమ్మా, అప్పా.. అలసిపోయా.. క్షమించండి’
చెన్నై: ‘‘నేను మెడికల్ సీటు సాధించకపోతే .. ఇన్నాళ్లు పడిన శ్రమంతా వృథా అయిపోతుంది. నన్ను క్షమించండి. నేను అలసిపోయాను. పరీక్ష కోసం బాగానే చదివాను. కానీ నాకు భయంగా ఉంది. నా కోసం ఎవరినీ నిందించవద్దు. సారీ అప్పా, అమ్మా’’ అంటూ ఓ విద్యార్థిని శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)లో ఉత్తీర్ణత సాధించలేననే భయంతో ప్రాణాలు తీసుకుంది. ఈ మేరకు నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాయడంతో పాటుగా.. చనిపోవడానికి ముందు ఓ వీడియోను రికార్డు చేసింది. పరీక్షకు ఒకరోజు ముందు కూతురు ఇలా బలవన్మరణానికి పాల్పడటంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. వివరాలు.. తమిళనాడుకు చెందిన మురుగసుందరం సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కుటుంబంతో కలిసి మధురైలో నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తె జ్యోతి శ్రీదుర్గ 2019లో క్లాస్ 12లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. గత కొన్ని రోజులుగా నీట్ పరీక్ష కోసం సన్నద్ధమవుతోంది. (చదవండి: ‘నా తమ్ముడి జీవితం నాశనం చేశారు’) ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన జ్యోతి శ్రీదుర్గ శనివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని, పాస్ అవుతానో లేదోనన్న భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా అరియలూర్ చెందిన విగ్నేష్ అనే విద్యార్థి సైతం నీట్ పరీక్షకు సిద్ధమవుతూ ఒత్తిడి భరించలేక బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. ఇక ఈ వరుస ఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి పళనిస్వామి దయచేసి విద్యార్థులెవరూ ఒత్తిడికి లోనుకావద్దని, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక మూడేళ్ల క్రితం అనిత అనే మెరిట్ విద్యార్థిని సైతం ఇదే తరహాలో ఆత్మహత్యకు పాల్పడటం తమిళనాట సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో నీట్ పరీక్ష నిర్వహణను వాయిదా వేయాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో.. మహమ్మారి కారణంగా విద్యార్థుల విలువైన విద్యా సంవత్సరం కోల్పోరాదన్న సుప్రీంకోర్టు.. నిబ్బందనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేసింది. దీంతో సెప్టెంబరు 13న నిర్వహించే నీట్ పరీక్షలకు మార్గం సుగమమైన విషయం తెలిసిందే. ఇక జేఈఈ మెయిన్ పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి కొనసాగున్న విషయం విదితమే. -
'పురాణ సుంతారీ.. మీ పట్టుదలకు హ్యాట్సాఫ్'
మధురై : తమిళనాడుకు చెందిన పురాణా సుంతారీ(25) చిన్నప్పుడే కంటిచూపు కోల్పోయింది. అయినప్పటికి బెదరకుండా సివిల్స్ సాధించాలన్న తన లక్ష్యం నెరవేర్చుకుంది. రెండు వారాల క్రితం విడుదలైన 2019 సివిల్స్ పరీక్ష తుది ఫలితాల్లో సుంతారీ 286వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌కు ఎంపికైంది. తన అద్భుత ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా పురాణా సుంతారీపై ప్రశంసలు కురిపించారు. ఆమె విజయాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. 'పురాణ సుంతారీ... మీ కృషి, పట్టుదలకు హ్యాట్సాఫ్. ఆడియో స్టడీ మెటీరియల్‌తో పరీక్షలు రాయడం చాలా కష్టం. ఈ విషయంలో ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు పుస్తకాలను ఆడియో ఫార్మాట్‌గా మార్చడానికి సహాయం చేశారు. ఎంతో పట్టుదలతో సివిల్స్‌లో మంచి ర్యాంక్‌ను సాధించి ఐఏఎస్‌కు ఎంపికైంది. మీ కలలను సాకారం చేసుకోవడం ఇక మీదట కూడా ఎప్పుడూ ఆపొద్దు. మీలాంటి మహిళలు ఈ దేశానికి ఎంతో అవసరం.' అంటూ కైఫ్ చెప్పుకొచ్చాడు. 25yr old visually impaired Purana Sunthari from TN beat the odds and cracked the UPSC exam. Since audio study material was hard to find, her parents and friends helped her in reading & converting books to audio so she could become an IAS officer. Never stop chasing your dreams. pic.twitter.com/3icQ6nPJPo — Mohammad Kaif (@MohammadKaif) August 12, 2020 మధురైకి చెందిన పురాణా సుంతారీ తన ఐదేళ్ల వయసులో కంటి చూపు మందగించింది. ఒకటో తరగతికి రాగానే పూర్తిగా కంటిచూపును కోల్పోయింది. అయినప్పటికీ చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతో కష్టపడి చదివింది. ఐఏఎస్ కావాలని లక్ష్యం పెట్టుకుంది. అందుకు తగ్గట్టు ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రిపరేషన్ కొనసాగించింది. మొదటి మూడుసార్లు సివిల్స్ లో విజయం సాధించలేకపోయింది. నాలుగోసారి 286 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచింది. -
ఈ ఫొటో చూసి మీ మాస్కు తినేయకండి
మధురై: ఫొటో చూడగానే కొంత ఆశ్చర్యం, మరికొంత సందేహం కలుగుతోందా?.. కానీ, మీరు అవునన్నా, కాదన్నా అది మాస్కే. కాకపోతే ముఖానికి ధరించే మాస్క్ మాత్రం కాదు. అచ్చంగా, స్వచ్ఛంగా పిండితో చేసిన నోరూరించే "పరోటా మాస్క్". తమిళనాడులోని మధురైలోని రెస్టారెంట్ నిర్వాహకులకు వచ్చిందీ అద్భుత ఆలోచన. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఈ ఆలోచన అమలు చేయడం ద్వారా అటు కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ఇటు బిజినెస్ కూడా బాగుంటోంది. మొదట్లో రెండు మాస్క్ పరోటాలు ఉండే ప్లేట్‌ను 40 రూపాయలుగా నిర్ధారించారు. కానీ దానికి విపరీతమైన డిమాండ్ రావడంతో ఆ ధరను 50 రూపాయలకు పెంచారు. (బడా బాబు మాస్క్ ఖరీదు రూ.2.89 లక్షలు) దీనిపై హోటల్ యజమాని కేఎల్ కుమార్ మాట్లాడుతూ.. "ఇంతకుముందు మా హోటల్‌కు మాస్కు లేకుండా వచ్చేవారు. కానీ ఇప్పుడు మాస్కు పరోటాలు కొనడానికే వస్తున్నారు" అని తెలిపాడు. ఇంతకీ ఈ పరోటా మాస్క్‌ను పరోటా స్పెషలిస్టు ఎస్ సతీష్ రెండు రోజుల ప్రయోగం ద్వారా తుదిరూపు తీసుకొచ్చాడు. మాస్కుల్లో రకాలున్నట్టే.. మాస్కుల పరోటాలోనూ రకాలున్నాయంటున్నాడు. వీటి తయారీ విధానాన్ని అక్కడున్న వంటవారికి నేర్పిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మాస్కుల పరోటాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. "ఈ ఫొటో చూసి మీ మాస్కు తినేయకండి" అంటూ కొందరు జోకులు పేల్చుతున్నారు. -
కొండచిలువకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కట్టుకట్టి ..
-
పాపం : కొండచిలువకు బొక్కలిరిగాయి!
మధురై : ఎముకలు విరగొట్టుకుని ఓ కొండచిలువ ఆసుపత్రి పాలైంది. దాని అదృష్టం బాగుండి సరైన సమయంలో వైద్యం అందటంతో ప్రాణాలు నిలుపుకోగలిగింది. ఈ సంఘటన తిరునల్వేలిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మధురై వీరమన్నలూర్కు చెందిన ఓ రైతు తన పోలంలో ఐదు అడుగులు ఉన్న ఓ కొండచిలువను చూశాడు. ఆ వెంటనే పాములను రక్షించే సిబ్బందికి సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న వారు అది కదలటానికి ఇబ్బంది పడుతుండటం గమనించారు. ఆ వెంటనే దాన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కొండచిలువను పరీక్షించిన ఆర్థోపెడిస్ట్ దాని వీపు దగ్గర రెండు చోట్ల ఎముకలు విరిగినట్లు గుర్తించాడు. మనుషులకు కట్టుకట్టే విధంగా దానికి కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కట్టుకట్టి చికిత్స చేశాడు. కొండచిలువకు చికిత్స చేస్తున్న డాక్టర్ ఈ సంఘటనపై వణ్యప్రాణి సంరక్షణా సిబ్బంది ఒకరు మాట్లాడుతూ.. సకాలంలో దానికి చిక్సిత చేసి ఉండకపోయినట్లయితే చచ్చిపోయేదని అన్నారు. పాము కోలుకునేంతవరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు తెలిపారు. దానికి నయం అయిన తర్వాతే అడవిలో వదిలిపెడతామని చెప్పారు. కాగా, కొండచిలువకు కట్టుకడుతున్న ఓ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
జల్లికట్టులో అపశ్రుతి : 32 మందికి గాయాలు
మధురై : తమిళనాడులోని అవనియపురంలో సంప్రదాయ క్రీడ జల్లికట్టు ప్రారంభమైన కొద్ది గంటలకే 32 మందికి గాయాలయ్యాయి. వీరిలో తీవ్రంగా గాయపడిన నలుగురిని మధురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. ఎద్దులను యువకులు నిలువరించే క్రమంలో ఈ విషాదం చోటుచేసుకుందని సమాచారం. కాగా, తమిళనాడులో ఈనెల 31 వరకూ జరిగే జల్లికట్టులో 2000కి పైగా ఎద్దులు పాల్గొంటాయి. అవనియపురంలో ఏడు వందల ముప్పై ఎద్దులు, అలంగనల్లూరులో 700 ఎద్దులు, పలమెడులో 650 ఎద్దులు ఈ ఏడాది సాంప్రదాయ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. -
ఒంటి నిండా బంగారంతో గుళ్లోకి వచ్చి..
చెన్నై(తమిళనాడు): మదురైలో అతడో పేరుమోసిన రౌడి. అతడిపై రౌడీషీటేకాదు ఏకంగా 14 కేసులు ఉన్నాయి. హత్య, బెదిరింపులు, హత్యాయత్నం, దందా సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడి పేరు వరిచియూర్ సెల్వం. మధురైలో అతడి పేరు చెబితే భయంతో జనం హడలిపోతారు. ఎంత పెద్ద రౌడి అయినప్పటికీ అతడికి రెండు బలహీనతలు ఉన్నాయి. ఒకటి బంగారం, రెండోది దైవం. కేజీలకు కేజీల బంగారు నగలు వేసుకోవటమంటే సెల్వంకు పిచ్చి. అదే సమయంలో దేవుడంటే మహా భక్తి భయం కూడా. ఒంటి నిండా బంగారంతో కాంచిపురంలోని అత్తివరదర్ ఆలయాన్ని దర్శించుకోవాలనే కోరిక అతడికి కలిగింది. అనుకున్నదే తడవుగా మదురై పోలీసు కమిషనర్ ద్వారా కాంచిపురం ఎస్పీకి సమాచారం పంపించి అత్తివరదర్ దర్శనానికి వచ్చాడు. అంతే మనోడికి పోలీసులు రాచమర్యాదలతో స్వామి వారి దర్శనం, ప్రత్యేక పూజలు చేయించి జాగ్రత్తగా పంపించివేశారు. ఒంటినిండా బంగారంతో ఓ రౌడి సకల మర్యాదలతో స్వామివారి దర్శనం చేసుకోవడంపై స్థానికులు వింతగా చర్చించుకుంటున్నారు. రౌడీనా మజాకా అంటూ కామెంట్ చేస్తున్నారు. -
కేక్ ఆర్డర్ చేస్తున్నారా..? అయితే జాగ్రత్త!
తమిళనాడు: పుట్టిన రోజు, న్యూఇయర్ వేడుకలను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం ఈరోజుల్లో చాలా కామన్. అయితే ఇదే అదనుగా కొంతమంది దందా రాయుళ్లు కల్తీ కేకులను తయారు చేయడం మొదలుపెట్టారు. కల్తీ కేకులు ఏంటి అనుకుంటున్నారా? అవును.. కుళ్లిపోయిన కోడిగుడ్లతో కేకులు తయారుచేస్తున్న ఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో బయటపడింది. కుళ్లిన కోడిగుడ్లతో కేకులు తయారుచేస్తున్నారని మధురై అధికారులకు ఇటీవల ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు కొన్ని బేకరీలు, గోదాముల్లో తనిఖీలు చేపట్టారు. తత్తనేరిలోని ఓ గోదాములో కుళ్లిన కోడి గుడ్లను పెద్ద ఎత్తున స్టోర్ చేయడం గుర్తించారు. ఒక్కో గుడ్డును కేవలం రూ.1కే విక్రయిస్తుండటంతో పలువురు బేకరీ షాపుల యజమానులు వాటిని తీసుకెళ్లి కేకు తయారీలో వాడుతున్నారు. ఈ దందాను తీవ్రంగా పరిగణించిన పోలీసులు బాధ్యులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి కేకులు తింటే అనారోగ్యాలు కొనితెచ్చుకున్నట్టేనని వైద్యులు సూచిస్తున్నారు. -
సీనియర్ల ర్యాగింగ్.. ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
సాక్షి, చెన్నై: ర్యాగింగ్ భూతం ఇద్దరు విద్యార్థులను బలి తీసుకుంది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఇద్దరు విద్యార్థులు కళాశాల ఆవరణలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మధురైలోని బలితెప్పకులంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం చోటుచేసుకుంది. సీనియర్ల ర్యాగింగ్‌ను తట్టుకోలేక భరత్, ముత్తుకుమార్ అనే డిగ్రీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తర్వాతి ప్రధాని ఎవరో చెప్పడం కష్టమే!
మదురై: ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే తర్వాతి ప్రధాన మంత్రి ఎవరనేది చెప్పడం కొంచెం కష్టమే అని యోగా గురు బాబా రామ్‌దేవ్ అన్నారు. రామేశ్వరంలో జరుగుతున్న భారత్ స్వాభిమాన్ జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన మంగళవారం మదురై ఎయిర్‌పోర్టులో విలేకరులతో మాట్లాడారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని ఎవరు అవుతారని చెప్పడం కష్టమన్నారు. ‘మాకు ఎలాంటి రాజకీయ లేదా మతతత్వ ఎజెండా లేదు. మేము ఆధ్యాత్మిక భారతాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కోరుకుంటున్నాం. భారతదేశాన్ని హిందూ దేశంగా లేదా మతతత్వ దేశంగా చూడాలనుకోవడం లేదు’ అని అన్నారు. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించకపోతే బీజేపీ పార్టీ తన విశ్వసనీయతను కోల్పోతుందని రామ్‌దేవ్ బాబా పేర్కొన్నారు. యూపీలోని బులంద్‌షహర్‌లో జరిగిన మూక దాడిపై మాట్లాడిన బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా వ్యాఖ్యలపై మాట్లాడుతూ, భారత్‌ను మతపరమైన అసహ న దేశంగా చిత్రీకరిస్తూ, దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని బాబా మండిపడ్డారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో పోలీసుల హత్యల కంటే గో హత్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నసీరుద్దీన్ వ్యాఖ్యానించడం తెలిసిందే. -
ఘోరం : 45 నెమళ్లు మృతి
-
ఘోరం : 43 నెమళ్లు మృతి
మధురై : తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. మదురై సమీపంలో గల మరుతకలం వద్ద విషాహారం తినడం వల్ల 43 నెమళ్లు మృతి చెందాయి. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరణించిన వాటిలో 34 ఆడ, 9 మగ నెమళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నెమళ్లు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రసాయనలు చల్లిన వరి గింజలను తినడం వల్లే నెమళ్లు మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. మరుతకలంలోకి తోటల వద్దకు నెమళ్లు ప్రతి రోజూ వస్తాయని, ఆహారం తీసుకుని సాయంత్రానికి వెళ్లిపోతుంటాయని స్థానికులు తెలిపారు. ఎవరైన ఉద్దేశపూర్వకంగా నెమళ్లకు విషాహారం ఇచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నిత్యానందకు ఊరట
మధురై: వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానందకు స్వల్ప ఊరట లభించింది. ‘మధురై ఆధీనం’లోకి ప్రవేశించేందుకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే పీఠాధిపతిగా కాకుండా కేవలం సాధారణ భక్తుడిగానే నిత్యానందకు మఠంలోకి ప్రవేశం కల్పిస్తున్నట్లు బెంచ్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుత పీఠాధిపతి నిత్యానందను మధురై ఆధీనంకు 293వ గురు మహా సన్నిధానంగా గతంలో నియమించారు. అయితే ఆ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు భక్తులు న్యాయస్థానంలో కేసు వేశారు. అది పెండింగ్‌లో ఉండగా.. తనను మఠంలోకి అనుమతించాలంటూ మద్రాస్ హైకోర్టును నిత్యానంద ఆశ్రయించారు. ఇప్పుడు పిటిషన్‌పై విచారణ పూర్తి కావటంతో మఠంలోకి అనుమతిస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే కింది కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున పిటిషనర్‌ను కేవలం సాధారణ పౌరుడిగా మాత్రమే అనుమతిస్తామని హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. మఠానికి వెళ్లే ముందు నిర్వాహకులకు, పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదని నిత్యానందకు కోర్టు సూచించింది. అదే సమయంలో నిత్యానందకు రక్షణ కల్పించాలని పోలీసులకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. (నా భార్యను బంధించారు.. విడిపించండి) -
నటుడు రాజ-తమన్నాల పెళ్లి
మధురై: ప్రముఖ తమిళనటుడు సౌందర రాజ ఓ ఇంటివాడయ్యాడు. గ్రీన్ యాపిల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సీఈవో తమన్నాతో రాజా పెళ్లి శుక్రవారం ఘనంగా జరిగింది. టెంపుల్ సిటీ మధురైలో జరిగిన వేడుకకు ఇరు కుటుంబాలు, స్నేహితులు హాజరయ్యారు. సౌందర రాజ.. ‘సుందరపాండియన్’, ‘జిగర్తాండా’, ‘ఎనక్కు వేరు ఎంగుమ్ కిలైగళ్ కడియాదు’ తదితర సినిమాల్లోని పాత్రలతో కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును సొంతంచేసుకున్నాడు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువులు ఈ కొత్త జంటను ఆశీర్వదిస్తూ ప్రకటనలు చేశారు. రాజ ప్రస్తుతం ‘కల్లాన్’, కాదయ్కుట్టి సింగమ్’’ లాంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. -
‘నాన్న పిలిస్తే పార్టీలోకి వస్తా’
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘నాన్న పిలిస్తే పార్టీలోకి వస్తా’ అని అళగిరి చెప్పారు. గురువారం మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ మాట చెప్పారు. గతంలో కూడా అనేకసార్లు ఇదే చెప్పానని గుర్తు చేశారు. డీఎంకేలో స్వయానా అన్నదమ్ములైన అళగిరి, స్టాలిన్ మధ్య ఎంతో కాలంగా ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది. మదురై కేంద్రంగా దక్షిణ తమిళనాడులో పార్టీపై పట్టుపెంచుకుని అళగిరి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసుకున్నారు. పెద్ద కుమారుని హోదాలో పార్టీ వారసుడిగా తననే ప్రకటించాలని అళగిరి పట్టుపట్టారు. అయితే వారసత్వానికి వయసు ఒక్కటే అర్హత కాదని, రాజకీయ పరిణితి, చతురతలకే ప్రాధాన్యత అనే కోణంలో కరుణానిధి తన చిన్న కుమారుడు స్టాలిన్‌కే పట్టం కట్టేందుకు ఉత్సాహం చూపారు. దీంతో అళగిరి అనేకసార్లు తండ్రిపై తిరుగుబాటు ప్రదర్శించారు. తల్లి చేత సిఫార్సు చేయించారు. అయితే తన నిర్ణయం నుంచి వెనక్కు తగ్గని కరుణానిధి రెండేళ్ల క్రితం ఒకానొక సందర్భంలో అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించేశారు. దీంతో అగ్గిమీద గుగ్గిలమైన అళగిరి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకి వ్యతిరేకంగా వ్యవహరించడమేగాక, అధికారంలోకి రాదంటూ బహిరంగంగా వ్యాఖ్యానాలు చేశారు. అళగిరిపై వేటుపడిన తరువాత స్టాలిన్‌ని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించారు. వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న దశలో అళగిరి తల్లిదండ్రుల పరామర్శల పేరుతో మరలా రాయబారం ప్రారంభించారు. గోపాలపురంలో అళగిరి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి వృద్ధాప్య అనారోగ్య కారణాలతో చెన్నై గోపాలపురంలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. సుమారు ఏడాదిన్నర కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా మెలుగుతున్నారు. వీవీఐపీలను మాత్రమే కలుస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించిన తరువాత రజనీకాంత్, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ తదితరులు ఇటీవల కాలంలో కరుణను కలుసుకున్నారు. నాలుగురోజుల క్రితం అర్ధరాత్రి వేళ డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయానికి సైతం కరుణ వచ్చారు. గతంలో పోల్చుకుంటే ఎంతో మెరుగైన రీతిలో కరుణ స్పందిస్తున్నారు. నెమ్మదిగా మాట్లాడుతున్నారు. ఈ దశలో కరుణానిధిని చూసేందుకు ఆయన పెద్ద కుమారుడు అళగిరి బుధవారం గోపాలపురానికి వచ్చారు. ఆయనతోపాటు సతీమణి కాంతి, కుమారుడు దురైదయానిధి కూడా వచ్చారు. తల్లి దయాళూఅమ్మల్ వద్ద సుమారు 15 నిమిషాలు మాట్లాడారు. ఆ తరువాత మిద్దెపైకి వెళ్లి తండ్రి కరుణానిధిని కుటుంబంతో సహ కలిసివచ్చారు. మొత్తం 30 నిమిషాలపాటు గోపాలపురంలో గడిపిన అళగిరి కుటుంబంతో సహా మదురైకి తిరిగి వెళ్లిపోయారు. మదురైలో నిన్న (గురువారం) మీడియాతో మాట్లాడుతూ, తండ్రి ఆరోగ్యంగా ఉన్నారని, గతంలో కంటే మెరుగైన తీరులో వ్యవహరిస్తున్నారని చెప్పారు. మీరు మరలా డీఎంకేలోకి వస్తారా అని ప్రశ్నించగా ‘నాన్న ఆహ్వానిస్తే వస్తా, అందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని బదులిచ్చారు. ఈ విషయాన్ని గతంలోనే అనేకసార్లు చెప్పానని గుర్తు చేశారు. -
జల్లికట్టులో 4కు పెరిగిన మృతుల సంఖ్య
మధురై: సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో సంప్రదాయబద్ధంగా నిర్వహించే జల్లికట్టు వేడుకలో విషాదం చోటుచేసుకుంది. వివిధ ప్రాంతాల్లో మంగళవారం నిర్వహించిన జల్లికట్టు, మంజవిరట్టు వేడుకల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. శివగంగ జిల్లాకు పొరుగున ఉన్న సిరవాయల్‌లో జరుగుతున్న మంజవిరట్టు(జల్లికట్టుకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది) వేడుకను చూసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు చనిపోయారని పోలీసులు తెలిపారు. అలాగే తిరుచురాపల్లి జిల్లా ఆవారంగాడులో సోలై పాండియన్ అనే వ్యక్తి జల్లికట్టులో ఎద్దు పొడవడంతో మృతిచెందాడు. ఈ సంఘటనతో కలిపి ఈ సీజన్లో ఈ వేడుకల్లో మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది. సోమవారం పాలమేడులో జల్లికట్టు చూసేందుకు వచ్చిన 19ఏళ్ల యువకుడు మృతిచెందాడు. ఎంతో ప్రఖ్యాతి చెందిన అలగనల్లూరు జల్లికట్టులో మంగళవారం 25మంది గాయపడ్డారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రారంభించిన ఈ వేడుకలో 1100 ఎడ్లు, 1500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. -
మధురై జిల్లాలో జల్లికట్టు పోటీలు ప్రారంభం
-
మధురైలో గోట్ఫైట్
-
మధురైలో బాంబుల కలకలం
తమిళనాడులోని మధురైలో బాంబులు కలకలం రేపాయి. ఓ చెత్త కుండీలో ఉన్న 11 బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబు పేలుళ్లతో మధురైలో విధ్వంసాలు సృష్టిస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అనుమానం వచ్చినచోటల్లా విస్తృతంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. దాంతో ఓ చెత్తకుండీలో దాచి ఉంచిన మొత్తం 11 బాంబులు బయటపడ్డాయి. వీటిని ఏ సామగ్రితో తయారుచేశారన్న విషయాన్ని బాంబు స్క్వాడ్ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు. -
ఆగిన ఆర్టీసీ సేవలు
సాక్షి, చెన్నై: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న విషయం తెలిసిందే. ఈ దృష్ట్యా చెన్నై నుంచి సీమాంధ్ర వైపుగా బస్సులు వెళ్లడం లేదు. రాత్రుల్లో మాత్రం అరాకొర బస్సుల్ని ఏపీఎస్ఆర్టీసీ నడుపుతూ వచ్చింది. చెన్నై, మదురై, తిరునల్వేలి, తిరుచ్చి, వేలూరు, తిరువణ్ణామలై తదితర ప్రాంతాల నుంచి తమిళనాడు ప్రభుత్వ సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. రంజాన్ పండుగ కోసం ఈ ఆందోళనలకు రెండు రోజులు విరామం ఇచ్చారు. దీంతో చెన్నై నుంచి ఆంధ్రా బస్సులు రోడ్డెక్కారుు. ఈ పరిస్థితుల్లో మంగళవారం నుంచి సీమాంధ్రలో ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు ఇలా అన్ని వర్గాలూ ఆందోళన బాట పట్టారుు. తిరుమలకు వెళ్లాల్సిన బస్సులు సైతం ఆగాయి. ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో చెన్నై నుంచి ఏపీఎస్ఆర్టీసీ సేవలు నిలిచిపోయూరుు. తిరుపతి, కర్నూలు, తాడిపత్రి, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సుల్ని నిలిపివేశారు. చెన్నై నుంచి అన్ని ఆర్టీసీ సేవలూ రద్దయ్యూరుు. అరుుతే విజయవాడ నుంచి ఒకటి, కనికిరి నుంచి మూడు, ఆత్మకూరు నుంచి ఒకటి, గిద్దలూరు నుంచి రెండు, అద్దంకి నుంచి ఒక బస్సు మంగళవారం ఉదయం చెన్నైకి వచ్చారుు. ఇవి సాయంత్రం తిరుగు పయనమయ్యూరుు. ఆందోళనల కారణంగా ఈ బస్సులు గమ్యస్థానాలకు చేరేనా అనే అనుమానం నెలకొంది. రైళ్లు ఖాళీ : చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే సప్తగిరి, యూనిట్, గరుడా, పినాకిని, యూనిట్, గూడురు ప్యాసింజర్, చార్మినార్, కాచీగూడ తదితర రైళ్లు ఎప్పుడూ కిటకిటలాడుతుంటారుు. మంగళవారం మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ప్రయూణికులతో తిరుగు పయనమయ్యూరుు