సాక్షి, చెన్నై: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న విషయం తెలిసిందే. ఈ దృష్ట్యా చెన్నై నుంచి సీమాంధ్ర వైపుగా బస్సులు వెళ్లడం లేదు. రాత్రుల్లో మాత్రం అరాకొర బస్సుల్ని ఏపీఎస్‌ఆర్‌టీసీ నడుపుతూ వచ్చింది. చెన్నై, మదురై, తిరునల్వేలి, తిరుచ్చి, వేలూరు, తిరువణ్ణామలై తదితర ప్రాంతాల నుంచి తమిళనాడు ప్రభుత్వ సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి.
రంజాన్ పండుగ కోసం ఈ ఆందోళనలకు రెండు రోజులు విరామం ఇచ్చారు. దీంతో చెన్నై నుంచి ఆంధ్రా బస్సులు రోడ్డెక్కారుు. ఈ పరిస్థితుల్లో మంగళవారం నుంచి సీమాంధ్రలో ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు ఇలా అన్ని వర్గాలూ ఆందోళన బాట పట్టారుు. తిరుమలకు వెళ్లాల్సిన బస్సులు సైతం ఆగాయి. ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో చెన్నై నుంచి ఏపీఎస్‌ఆర్‌టీసీ సేవలు నిలిచిపోయూరుు. తిరుపతి, కర్నూలు, తాడిపత్రి, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సుల్ని నిలిపివేశారు. చెన్నై నుంచి అన్ని ఆర్టీసీ సేవలూ రద్దయ్యూరుు. అరుుతే విజయవాడ నుంచి ఒకటి, కనికిరి నుంచి మూడు, ఆత్మకూరు నుంచి ఒకటి, గిద్దలూరు నుంచి రెండు, అద్దంకి నుంచి ఒక బస్సు మంగళవారం ఉదయం చెన్నైకి వచ్చారుు. ఇవి సాయంత్రం తిరుగు పయనమయ్యూరుు. ఆందోళనల కారణంగా ఈ బస్సులు గమ్యస్థానాలకు చేరేనా అనే అనుమానం నెలకొంది.
రైళ్లు ఖాళీ : చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే సప్తగిరి, యూనిట్, గరుడా, పినాకిని, యూనిట్, గూడురు ప్యాసింజర్, చార్మినార్, కాచీగూడ తదితర రైళ్లు ఎప్పుడూ కిటకిటలాడుతుంటారుు. మంగళవారం మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ప్రయూణికులతో తిరుగు పయనమయ్యూరుు
ఆగిన ఆర్టీసీ సేవలు
Published Wed, Aug 14 2013 4:01 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
Advertisement