ఢిల్లీ: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాన్నికేంద్రం వేగవంతం చేసిన తరుణంలో సమైక్య వాదుల నిరసన కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సమైక్యా వాదులు కదం తొక్కుతున్నారు. తొలుత ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. అనంతరం కేంద్ర మంత్రి కమల్ నాథ్ ఇంటి ఎదుటు కూడా విద్యార్థి జేఏసీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ను విడదీయటానికి అధికారం ఎవరిచ్చారంటూ ధర్నా చేశారు.
సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే తీవ్ర పరిణామాలుంటాయని వారు హెచ్చరించారు. అక్కడి పరిస్థితి శృతిమించడంతో పోలీసులు భారీగా మోహరించారు.