విభేదాలతో పాఠశాల పరువు తీయొద్దు!
► ఏపీ రెసిడెన్షియల్ జాయింట్ సెక్రటరీ పి.జగన్మోహనరెడ్డి
► గురుకుల బాలికల పాఠశాలను తనిఖీచేసిన ఉన్నతాధికారులు
► విద్యార్థుల సమస్యలుతెలుసుకున్న అధికారులు
కావూరు(చెరుకుపల్లి): పేద విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న ఫలితం మాత్రం శూన్యం పనిచేసినా, చేయకున్నా మా జీతాలు మాకు అందితే చాలులే అన్నట్లుగా గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు పనిచేయడం వలనే పాఠశాల భవనాల, పరిసరాల దుస్థితి శిధిలాస్థకు చేరిందని ఏపీ రెసిడెన్సియల్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ పి.జగన్మోహన రెడ్డి అన్నారు. మండలంలోని గురుకుల బాలికల పాఠశాలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి గత ఆరు నెలలకు ముందే రూ.11లక్షలను విడుదల చేసిన్నప్పటికి ప్రిన్సిపాల్ ఆ నిధులను వినియోగించకుండా పాఠశాల అభివృద్ధిని కుంటుపరిచారన్నారు.
సీమాంధ్రాలో 63 గురుకుల బాలికల పాఠశాలలు, కళాశాలలున్నాయన్నారు. రాష్ట్రంలోని 53 గురుకుల పాఠశాలు ఉంటే ఏ గురుకుల పాఠశాల ఈ పాఠశలలాగా లేదని ఆవేదన చెందారు. ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మధ్య విభేదాలు ఉండడం వలన పాఠశాల స్థితి ఈ విధంగా చేరిందన్నారు. ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి ఎన్నో నిధులను వెచ్చిస్తున్నాయన్నారు. ఇచ్చిన నిధులనే పాఠశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ రూపవతి వినియోగించలేక పోయిందన్నారు. విద్యార్థినీలకు సక్రమంగా పాఠ్యాంశాలను బోధించడంలో కూడా పాఠశాలలోని ఉపాధ్యాయులు చొరవ చూపటం లేదన్నారు. పాఠశాల ఆవరణంలోని అపరిశుభ్రతను చూసిన అధికారులు ఉపాద్యాయులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ విద్యారంగ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి. వెంకట రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల అభివృద్ధికి రూ.3.97కోట్లను గతంలోనే ప్రభుత్వాన్ని కోరటం జరిగిందన్నారు.
కావూరు గురుకుల పాఠశాల అభివృద్ధికి సుమారుగా రూ.6కోట్ల వ్యయం అవుతుందని అంచలనాలను తయారుచేసి ఉన్నతాధికారులకు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీ రీజనల్ డిప్యూటీ సెక్రటరీ నాగలక్ష్మీ, డీఈ. సత్యనారాయణ, అభివృద్ధి కమిటీ స భ్యులు తుమ్మల నరేంద్ర నాథ్, నాగళ్ళ గోపాల్, పా ఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.