మధురై: సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో సంప్రదాయబద్ధంగా నిర్వహించే జల్లికట్టు వేడుకలో విషాదం చోటుచేసుకుంది. వివిధ ప్రాంతాల్లో మంగళవారం నిర్వహించిన జల్లికట్టు, మంజవిరట్టు వేడుకల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. శివగంగ జిల్లాకు పొరుగున ఉన్న సిరవాయల్‌లో జరుగుతున్న మంజవిరట్టు(జల్లికట్టుకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది) వేడుకను చూసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు చనిపోయారని పోలీసులు తెలిపారు. అలాగే తిరుచురాపల్లి జిల్లా ఆవారంగాడులో సోలై పాండియన్ అనే వ్యక్తి జల్లికట్టులో ఎద్దు పొడవడంతో మృతిచెందాడు. ఈ సంఘటనతో కలిపి ఈ సీజన్‌లో ఈ వేడుకల్లో మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది. సోమవారం పాలమేడులో జల్లికట్టు చూసేందుకు వచ్చిన 19ఏళ్ల యువకుడు మృతిచెందాడు. ఎంతో ప్రఖ్యాతి చెందిన అలగనల్లూరు జల్లికట్టులో మంగళవారం 25మంది గాయపడ్డారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రారంభించిన ఈ వేడుకలో 1100 ఎడ్లు, 1500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment