jallikattu celebrations
-
రంగంపేటలో జల్లికట్టు సంబరాలు
-
చెన్నైలోని జల్లికట్టులో అపశృతి
-
చిత్తూరు, తిరుపతి జిల్లాలో జల్లికట్టు వేడుకలు
-
చిత్తూరు జిల్లాలో జోరుగా జల్లికట్టు సంబరాలు
రంగంపేట: చిత్తూరు జిల్లాలో జల్లికట్టు సంబరాలు జోరుగా సాగుతున్నాయి. జల్లికట్టుకు ప్రసిద్ధి గాంచిన జిల్లాలోని రంగంపేటలో వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. వేలాదిగా జనం తరలివచ్చారు. రంగంపేటతో పాటు సమీపంలోని పుల్లయ్య గారి పల్లి లో ఈరోజు జల్లికట్టు సంబరాలు జరుగుతున్నాయి. కోడిపందాలు కనుగుణంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని స్థానిక ప్రజా ప్రతినిధులు రంగంపేట ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డితో పాటు సర్పంచ్ ఎర్రయ్య స్పష్టం చేస్తున్నారు. -
తమిళనాడులో జల్లికట్టుకు నలుగురి బలి
సాక్షి ప్రతినిధి, చెన్నై/చంద్రగిరి: సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించిన జల్లికట్టు కార్యక్రమంలో గత మూడు రోజుల్లో నలుగురు మరణించారు. 15వ తేదీ పాలమేడులో జల్లికట్టు సందర్భంగా ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న యువకుడు ఎద్దు పొడవడంతో మృతిచెందాడు. తిరుచిరాపల్లి మనకోట్టైలో మంగళవారం జరిగిన జల్లికట్టులో ఎద్దు పొడవడంతో ఒక వ్యక్త చనిపోయాడు. శివగంగై జిల్లా శిరవయల్లో మంగళవారం మంజువిరాట్ పోటీల సందర్భంగా ఎద్దులను వదలగా అవి ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 50 మంది గాయపడ్డారు. కాగా,మదురై జిల్లా అలంగనల్లూరులో క్రీడా పోటీలను సీఎం పళనిస్వామి ప్రారంభించారు. విజేతలకు కారు, బంగారు నాణేలు తదితర రూ.కోటి విలువైన ఆకర్షణీయ బహుమతులు ప్రకటించారు. -
జల్లికట్టులో 4కు పెరిగిన మృతుల సంఖ్య
మధురై: సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో సంప్రదాయబద్ధంగా నిర్వహించే జల్లికట్టు వేడుకలో విషాదం చోటుచేసుకుంది. వివిధ ప్రాంతాల్లో మంగళవారం నిర్వహించిన జల్లికట్టు, మంజవిరట్టు వేడుకల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. శివగంగ జిల్లాకు పొరుగున ఉన్న సిరవాయల్లో జరుగుతున్న మంజవిరట్టు(జల్లికట్టుకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది) వేడుకను చూసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు చనిపోయారని పోలీసులు తెలిపారు. అలాగే తిరుచురాపల్లి జిల్లా ఆవారంగాడులో సోలై పాండియన్ అనే వ్యక్తి జల్లికట్టులో ఎద్దు పొడవడంతో మృతిచెందాడు. ఈ సంఘటనతో కలిపి ఈ సీజన్లో ఈ వేడుకల్లో మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది. సోమవారం పాలమేడులో జల్లికట్టు చూసేందుకు వచ్చిన 19ఏళ్ల యువకుడు మృతిచెందాడు. ఎంతో ప్రఖ్యాతి చెందిన అలగనల్లూరు జల్లికట్టులో మంగళవారం 25మంది గాయపడ్డారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రారంభించిన ఈ వేడుకలో 1100 ఎడ్లు, 1500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. -
రంగంపేటలో కోలాహలంగా జల్లికట్టు
సాక్షి, చంద్రగిరి: చిత్తూరు జిల్లా రంగంపేటలో కనుమ సందర్బంగా మంగళవారం ఉదయం పశువుల పోటీలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులో జల్లికట్టు మాదిరి రంగంపేటలో పోటీలు కోలాహలంగా జరుగుతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలోని గ్రామాల నుంచే కాక తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది ఈ పోటీలకు హాజరయ్యారు. రంగంపేట వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. మిద్దెలపై నుంచి ప్రజలు ఎద్దుల పోటీలను ఉత్సాహంగా తిలకిస్తున్నారు. రైతులు పెంచుకునే ఎద్దులు, ఆవులను ఒక్కో వీధిలో ఒక్కో మందగా వదులుతున్నారు. ఇందులో కొన్ని ఎద్దులకు రంగుల పలకలు కట్టారు. ఆ ఎద్దులకు కట్టిన పలకను చేజిక్కుంచుకుంటే... విజయం సాధించినట్లే. దీనికోసం యువకులు తీవ్రంగా పోటీపడుతున్నారు. -
సంప్రదాయానికి సహకరించండి: చెవిరెడ్డి
-
సంప్రదాయానికి సహకరించండి: చెవిరెడ్డి
తిరుపతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లెలో జల్లికట్టు సంబరాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ప్రారంభించారు. అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయానికి సహకరించాలని ఆయన ఈ సందర్భంగా పోలీసుల్ని కోరారు. ఆర్థిక లావాదేవీలు లేకుండా జరిగే సంబరాలు జల్లికట్టు అని అన్ని అన్నారు. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ సంబరాలు సజావుగా సాగేలా చూడాలని అన్నారు. -
అంగరంగ వైభవంగా జల్లికట్టు ఉత్సవాలు