రంగంపేటలో కోలాహలంగా జల్లికట్టు | jallikattu celabrations in rangampeta | Sakshi
Sakshi News home page

రంగంపేటలో కోలాహలంగా జల్లికట్టు

Published Tue, Jan 16 2018 11:51 AM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM

jallikattu celabrations in rangampeta - Sakshi

సాక్షి, చంద్రగిరి: చిత్తూరు జిల్లా రంగంపేటలో కనుమ సందర్బంగా మంగళవారం ఉదయం పశువుల పోటీలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులో జల్లికట్టు మాదిరి రంగంపేటలో పోటీలు కోలాహలంగా జరుగుతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలోని గ్రామాల నుంచే కాక తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది ఈ పోటీలకు హాజరయ్యారు.

రంగంపేట వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. మిద్దెలపై నుంచి ప్రజలు ఎద్దుల పోటీలను ఉత్సాహంగా తిలకిస్తున్నారు. రైతులు పెంచుకునే ఎద్దులు, ఆవులను ఒక్కో వీధిలో ఒక్కో మందగా వదులుతున్నారు. ఇందులో కొన్ని ఎద్దులకు రంగుల పలకలు కట్టారు. ఆ ఎద్దులకు కట్టిన పలకను చేజిక్కుంచుకుంటే... విజయం సాధించినట్లే. దీనికోసం యువకులు తీవ్రంగా పోటీపడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement