చెన్నై: తమిళనాడులోని మధురైలో ఘోరం జరిగింది. ఓ లేడీస్ హాస్టల్ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఇద్దరు యువతులు చనిపోయారు. పొగతో ఊపిరి ఆడక వీళ్లు మృతి చెందినట్లు నిర్ధారణ అయ్యింది మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
కాట్రంపళయం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్‌లో తెల్లవారుజాము ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రిఫ్రిజిరేటర్ ఒక్కసారిగా పేలడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. దాని దగ్గర నిద్రిస్తున్న ఇద్దరు యువతులు చనిపోయారు. వీళ్లలో ఒక యువతి స్థానికంగా టీచర్‌గా పని చేస్తున్నారు
మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. ఘటనా సమయంలో హాస్టల్‌లో 40 మందికి పైగా ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఫ్రిడ్జ్ పేలి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
மதுரை பெண்கள் விடுதியில் தீ விபத்து.. ஆசிரியை உள்பட 2 பெண்கள் உயிரிழப்பு.. https://t.co/zm7evboOMe #madurai
— Top Tamil News (@toptamilnews) September 12, 2024
ఇదీ చదవండి: వృద్ధురాలి గొంతు కొరికి, ఆపై..
Comments
Please login to add a commentAdd a comment