మధురై : తమిళనాడులోని అవనియపురంలో సంప్రదాయ క్రీడ జల్లికట్టు ప్రారంభమైన కొద్ది గంటలకే 32 మందికి గాయాలయ్యాయి. వీరిలో తీవ్రంగా గాయపడిన నలుగురిని మధురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. ఎద్దులను యువకులు నిలువరించే క్రమంలో ఈ విషాదం చోటుచేసుకుందని సమాచారం. కాగా, తమిళనాడులో ఈనెల 31 వరకూ జరిగే జల్లికట్టులో 2000కి పైగా ఎద్దులు పాల్గొంటాయి. అవనియపురంలో ఏడు వందల ముప్పై ఎద్దులు, అలంగనల్లూరులో 700 ఎద్దులు, పలమెడులో 650 ఎద్దులు ఈ ఏడాది సాంప్రదాయ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment