సాక్షి,హైదరాబాద్:నగరంలో నిషేధిత చైనా మాంజా తగిలి మరొకరికి గాయాలయ్యాయి. ఉప్పల్ డీఎస్‌ఎల్ కంపెనీ భవనంలోని బైక్‌పై వెళ్తుండగా ఘటన జరిగింది. మాంజా దారం తగిలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సాయివర్థన్‌రెడ్డి కింద పడిపోయారు. దీంతో అతడి మెడకు గాయమైంది. గాయాలపాలైన ఆయనను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సాయివర్ధన్‌రెడ్డి కుషాయిగూడకు చెందినవారు.
చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించినప్పటికీ గాలిపటాలు ఎగురవేసేందుకు ఇప్పటికీ దానిని వాడుతున్నారు. పులువురు వ్యాపారులు పండగ వేళ సొమ్ము చేసుకునేందుకు అక్రమంగా చైనా మాంజా విక్రయాలు సాగిస్తున్నారు. గాలిపటాలు ఎగురవేయడంలో పక్కవారి మీద పైచేయి సాధించేందుకు చైనా మాంజాను వాడుతున్నారు.
చైనా మాంజా వాడిన గాలిపటాలు దారంతో సహా తెగి పడి రోడ్లపై వేలాడుతున్న చోట వాహనదారులు చూసుకోకుండా వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో వారు తీవ్ర గాయాలపాలవుతున్నారు. హైదరాబాద్‌లో పోలీసులు మంగళవారం జరిపిన దాడుల్లో చైనా మాంజా భారీగా పట్టుబడడం గమనార్హం.
ఇదీ చదవండి: మీకు తెలియకుండా మీ ఫొటోలు ఇన్‌స్టాలో
Comments
Please login to add a commentAdd a comment