సాక్షి, హైదరాబాద్: కోకాపేట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏడు అంతస్తుల భవనంపై నుంచి దూకి బలవన్మరణం చెందారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగ ప్రభాకర్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. కోకాపేట్‌లో హాస్టల్ గదికి వచ్చి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. నాగ ప్రభాకర్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
మూడో అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి
మూడవ అంతస్తు నుంచి పడి ఓ మృతి చెందిన ఘటన ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్, గోరఖాపూర్ ప్రాంతానికి చెందిన గణేష్(19) సొంత గ్రామానికి అఖిలేష్, అజిద్, మజ్ను కలిసి నగరానికి వచ్చి ఎల్‌బీనగర్ చింతల్‌కుంట ఎల్‌పీటీ మార్కెట్ వెనుక వైపు సిల్క్ టవర్ బిల్డింగ్ పని చేస్తూ అదే భవనంలోని మూడవ అంతస్తులో ఉంటున్నారు.
ఈ నెల 22 రాత్రి అందరూ కలిసి మద్యం తాగారు. కూరగాయలు తీసుకు రావాలని గణేష్‌కు డబ్బులిచ్చి పంపారు. కానీ.. గణేష్ మళ్లీ మద్యం తాగి వచ్చాడు. అందరూ భోజనం చేసి పడుకున్నారు. మద్యం మత్తులో ఉన్న గణేషఅర్ధరాత్రి మూడవ అంతస్తు నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్నేహితులు నాగోలులోని ఓ హాస్పిటల్‌కు తరలించగా పరీక్షించిప వైద్యులు అప్పటికే గణేష్ మృతి చెందినట్లు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment