kokapet
-
‘నా భార్యను చంపేశాను’
మణికొండ: ‘నా భార్యను చంపేశాను.. పీడ విరగడైంది’.. అంటూ ఓ సైకో భర్త వీధిలో వీరంగం సృష్టించి పైశాచిక ఆనందం పొందాడు. శుక్రవారం నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోకాపేటలో ఈ ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు, మృతురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలం శాయినిపేటకు చెందిన సునీత, ఇదే గ్రామం పక్కన ఉన్న దౌరుడిపల్లికి చెందిన ముత్యాలు దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు. కోకాపేటలో హోటల్ నడుపుతూ జీవిస్తున్నారు. ముత్యాలు తరచూ భార్యను కొడుతుండేవాడు. డబ్బులు కావాలని వేధించేవాడు. ఈ క్రమంలో పలుమార్లు ఇరు కుంటుంబాల మధ్య పంచాయితీలు నడిచాయి. ‘ఎప్పటికైనా నిన్ను చంపుతా’ అని భార్య సునీతను ముత్యాలు బెదిరించేవాడు. గతంలో సునీత ఆరు నెలల పాటు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందింది. రెండు రోజుల క్రితం మృతురాలి బంధువు ఆంజనేయ స్వామి మాల వేయటంతో పూజకు వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత వీరు శుక్రవారం ఇంట్లో గొడవ పడ్డారు. కోపోద్రిక్తుడైన ముత్యాలు భార్య గొంతు నులిమి, మర్మాయవాల్లో కర్రతో గుచ్చి రాక్షసంగా హత్య చేశాడు. కాగా.. ముత్యాలు మొదటి భార్య అతని సైకో చేష్టలు భరించలేక వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత సునీతను రెండో వివాహం చేసుకుని ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హత్య చేసి.. ఇంటికి తలుపు వేసి వీధిలోకి వచ్చాడు. ‘నా భార్యను చంపాను’ అంటూ అరుస్తూ నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. రహదారిపై రక్తచరిత్ర -
రంగారెడ్డి జిల్లా కోకాపేట్ లో బ్లాస్టింగ్స్ కలకలం
-
కోకాపేటలో 55 అంతస్తుల అబ్బురం!
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి ధరల పెరుగుదలలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన కోకాపేటలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ పౌలోమి గ్రూప్ విలాసవంతమైన ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తోంది. గోల్డెన్ మైల్ లేఔట్లో, ఔటర్ రింగ్ రోడ్ ఎదురుగా 55 అంతస్తుల్లో పలాజో స్కై స్క్రాపర్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.ప్రస్తుతం ఐదవ అంతస్తు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, దీపావళి సందర్భంగా ఆరో ఫ్లోర్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని కంపెనీ డైరెక్టర్ ప్రశాంత్ రావు తెలిపారు. పలాజో ప్రాజెక్ట్‌కు ఆసియా పసిఫిక్ ప్రాపర్టీ నుంచి దేశంలోనే బెస్ట్ రెసిడెన్షియల్ హైరైజ్ ఆర్కిటెక్చర్ అవార్డును సొంతం చేసుకుందని పేర్కొన్నారు. 2.3 ఎకరాల్లోని ఈ ప్రాజెక్ట్‌లో 141 అపార్ట్మెంట్లు ఉంటాయని, 6,225 చ.అ. నుంచి 8,100 చ.అ. మధ్య ఉంటాయని చెప్పారు.ఇదీ చదవండి: పెర్రీ చనిపోయిన ఇల్లు.. రూ.71 కోట్లకు కొన్న భారతీయ మహిళ2026 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నివాసితులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రతికూల మార్కెట్ పరిస్థితులు ఉన్నప్పటికీ పలాజో ప్రాజెక్ట్‌కు కొనుగోలుదారుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని వివరించారు. ప్రముఖ సంస్థల సీఎక్స్ఓలు, వ్యాపారవేత్తలు, వైద్యులు, ఎంటర్ప్రెన్యూర్లు కస్టమర్లుగా ఉన్నారని తెలిపారు.52వ ఫ్లోర్లో ఇన్ఫినిటీ పూల్.. 70 అడుగుల ఎత్తు గల గ్రాండ్ ఎంట్రన్స్ లాబీ, డబుల్ హైట్ బాల్కనీ, 52వ అంతస్తులో ఇన్ఫినిటీ పూల్.. ఇవీ పలాజో ప్రాజెక్ట్ వసతుల్లో ప్రత్యేకమైనవి. దీంతో నివాసితులకు సెవెన్ స్టార్ హోటల్ అనుభూతి కలుగుతుంది. ఆకాశమంత ఎత్తులో పూల్ ఉండటంతో కనుచూపు మేర వరకూ సిటీ వ్యూను ఎంజాయ్ చేస్తూ స్విమ్ చేయడం అద్భుతమైన అనుభూతిని పొందొచ్చు. 75 వేల చ.అ.ల్లోని క్లబ్‌హౌస్‌లో స్పా, ప్రైవేట్ డైనింగ్ రూమ్, ఫిట్నెస్ సెంటర్, ఫ్యామిలీ ఈవెంట్స్ కోసం బాంక్వెట్ హాల్, బాస్కెట్‌బాల్, స్క్వాష్, బ్యాడ్మింటన్ కోర్టులు వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. -
హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: కోకాపేట్లో విషాదం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏడు అంతస్తుల భవనంపై నుంచి దూకి బలవన్మరణం చెందారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగ ప్రభాకర్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. కోకాపేట్లో హాస్టల్ గదికి వచ్చి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. నాగ ప్రభాకర్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.మూడో అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి మూడవ అంతస్తు నుంచి పడి ఓ మృతి చెందిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్, గోరఖాపూర్ ప్రాంతానికి చెందిన గణేష్(19) సొంత గ్రామానికి అఖిలేష్, అజిద్, మజ్ను కలిసి నగరానికి వచ్చి ఎల్బీనగర్ చింతల్‌కుంట ఎల్పీటీ మార్కెట్ వెనుక వైపు సిల్క్ టవర్ బిల్డింగ్ పని చేస్తూ అదే భవనంలోని మూడవ అంతస్తులో ఉంటున్నారు.ఈ నెల 22 రాత్రి అందరూ కలిసి మద్యం తాగారు. కూరగాయలు తీసుకు రావాలని గణేష్‌కు డబ్బులిచ్చి పంపారు. కానీ.. గణేష్ మళ్లీ మద్యం తాగి వచ్చాడు. అందరూ భోజనం చేసి పడుకున్నారు. మద్యం మత్తులో ఉన్న గణేషఅర్ధరాత్రి మూడవ అంతస్తు నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్నేహితులు నాగోలులోని ఓ హాస్పిటల్‌కు తరలించగా పరీక్షించిప వైద్యులు అప్పటికే గణేష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. -
ప్రాపర్టీ ధరల పెరుగుదలలో కోకాపేట అదుర్స్
సాక్షి, హైదరాబాద్: కోకాపేట బంగారం కంటే ఖరీదైపోయింది. ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మించడం, నివాసం ఉండటం డెవలపర్లకు, కొనుగోలుదారులకు ఇద్దరికీ స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. గత ఐదేళ్లలో ప్రాపర్టీ ధరల పెరుగుదలలో దేశంలోనే కోకాపేట రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ 89 శాతం మేర పెరుగుదల నమోదు కాగా.. బాచుపల్లిలో 57 శాతం, తెల్లాపూర్‌లో 53 శాతం ధరలు పెరిగాయని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. 2019లో ఈ ప్రాంతంలో ధర చదరపు అడుగుకు రూ.4,750గా ఉండగా.. 2024 నాటికి రూ.9 వేలకు పెరిగింది. ఈ ప్రాంతంలో భూముల ధరలు ఖరీదు కావడంతో విల్లాల కంటే ఎక్కువగా హైరైజ్ భవనాలనే ఎక్కువగా నిర్మిస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకూ కోకాపేట బడ్జెట్ హోమ్స్ దొరికేవి కానీ, ఇప్పుడు 40 అంతస్తుల స్కై స్క్రాపర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనిష్టంగా 8 వేల చదరపు అడుగు నుంచి గరిష్టంగా 16 వేల చదరపు అడుగు విస్తీర్ణం ఉన్న అపార్ట్మెంట్లు సైతం నిర్మిస్తున్నారు.ధర రూ.2.5 కోట్లకు పైమాటే.. గత ఐదేళ్లలో కోకాపేటలో దాదాపు 12,920 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. ఇందులో అల్ట్రా లగ్జరీ గృహాలే ఎక్కువగా ఉన్నాయి. రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన యూనిట్ల వాటా 52 శాతంగా ఉందంటే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. 30 శాతం మధ్య, ప్రీమియం విభాగం యూనిట్లు, రూ.1.5–2.5 కోట్ల మధ్య ఉన్న లగ్జరీ గృహాల వాటా 19 శాతంగా ఉంది.బాచుపల్లిలో బూమ్.. బాచుపల్లిలో కూడా రియల్టీ మార్కెట్ బూమ్‌లో ఉంది. ఇక్కడ గత ఐదేళ్లలో ధరలు 57 శాతం పెరిగాయి. 2019లో ఇక్కడ సగటు ధర చదరపు అడుగుకు రూ.3,690 ఉండగా.. 2024 నాటికి రూ.5,800లకు పెరిగాయి. మిడ్, ప్రీమియం విభాగానికి బాచుపల్లి కేంద్రంగా మారింది. 2019లో తెల్లాపూర్‌లో ధర చదరపు అడుగుకు రూ.4,819గా ఉండగా.. 2024 నాటికి 53 శాతం వృద్ధి రేటుతో రూ.7,350కు పెరిగాయి. తెల్లాపూర్‌లో గత ఐదేళ్లలో 18,960 యూనిట్లు లాంచింగ్ కాగా.. ఇందులో 66 శాతం ప్రీమియం, 34 శాతం లగ్జరీ విభాగం గృహాలే.చదవండి: మాట మార్చిన నిఖిల్ కామత్!.. అప్పుడు అద్దె ఇల్లే బెస్ట్ అని.. సంపన్న వర్గాల ఆసక్తి.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలలో రద్దీ పెరగడంతో ఇక్కడి వారు కోకాపేటకు మారుతున్నారు. ఈ ప్రాంతం హై ప్రొఫైల్, ప్రీమియం ప్రాజెక్ట్‌లకు డెస్టినేషన్‌గా మారింది. – ప్రశాంత్ రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్మౌలిక వసతులే మెయిన్ ఐటీ కారిడార్లకు చేరువగా ఉండటమే బాచుపల్లి హైలైట్. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్, మాల్స్‌తో ఈ ప్రాంతానికి డిమాండ్ పెరిగింది. ప్రవాసులు, ఉన్నత హోదా ఉద్యోగులు ఇక్కడ నివాసం ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. – నరేంద్ర కుమార్, డైరెక్టర్, ప్రణీత్ గ్రూప్ -
కోకాపేటపై హైడ్రా ఫోకస్.. కూల్చివేతలు షురూ
సాక్షి, కోకాపేట: హైదరాబాద్ నగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలుచోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా.. తాజాగా కోకాపేటపై ఫోకస్ పెట్టింది. అక్కడ అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది.కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దృష్టిసారించింది. సర్వే నంబర్ 147లో ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దీంతో, ప్రభుత్వ నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు శనివారం తెల్లవారుజామునే అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. కోకాపేటలో పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతోంది.ఇదిలా ఉండగా.. హైడ్రాకు పూర్తిస్థాయి స్వేచ్ఛ కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, రెవెన్యూ, నీటిపారుదల తదితర శాఖలకు ఉన్న విశేష అధికారాలను హైడ్రాకు ఇవ్వాలని నిర్ణయించింది. సంస్థకు చట్టబద్ధత కూడా కల్పించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు మూడు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే.. హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన -
Kokapet: రూ.100 కోట్ల స్థలానికి ఎసరు!
సాక్షి, హైదరాబాద్: కోకాపేట్లో సుమారు రూ.100 కోట్ల విలువైన స్థలంలో పాగా వేసేందుకు కబ్జారాయుళ్లు పన్నిన పథకా న్ని హెచ్ఎండీఏ అధికారులు అడ్డుకున్నారు. కోకాపేట్‌లోని సర్వే నంబర్ 117లో ఉన్న 2.5 ఎకరాల హెచ్ఎండీఏ స్థలంలో కొందరు వ్యక్తులు అక్రమంగా కంటైనర్లు, డబ్బాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్, ఎస్టేట్ అధికారులు వాటిని గుర్తించి తొలగించారు. హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ జానకీరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడు ల్లో ఎస్టేట్ విభాగం ఉద్యోగులు, ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు పాల్గొన్నారు. ఇటీవల మియాపూర్‌లో హెచ్ఎండీఏ స్థలాల్లో నిరి్మంచిన అక్రమ కట్టడాలపైన ఉక్కు పాదాన్ని మోపిన సంగతి తెలిసిందే. అక్కడ పెద్ద ఎత్తున రక్షణ చర్యలు చేపట్టారు. ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు అన్ని ప్రాంతాల్లో హెచ్ఎండీఏ భూములను జియోఫెన్సింగ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
పరిశ్రమల భూములు తాకట్టు!
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీతో పాటు ఇతర పథకాల అమలుకు నిధుల వేటలో ఉన్న ప్రభుత్వం పరిశ్రమల భూము లను తాకట్టు పెట్టేందుకు సిద్ధమైంది. మూలధన వ్యయం, ఇతర అవసరాలకు రుణమార్కెట్ నుంచి కనీసం రూ.10 వేల కోట్లు అప్పుగా తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో కనీసం రూ.5 వేల కోట్లు వెంటనే సేకరించేందుకు అవసరమైన ప్రక్రియ ను ఆర్థిక, పరిశ్రమల శాఖలు సంయుక్తంగా ప్రారంభించాయి.దీనికోసం హైదరా బాద్‌లో అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలనుకుంటోంది. కోకా పేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.20వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకున్న అనుభవం ప్రభుత్వ శాఖలకు లేదు. దీంతో అప్పు ఇప్పించడంలో అనుభవం గల ‘మర్చంట్ బ్యాంకర్’కు రుణసేకరణ బాధ్యత అప్పగించాలని నిర్ణ యించారు.ఈ మర్చంట్ బ్యాంకర్ ప్రభు త్వం తరపున బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలతో సంప్రదింపులు జరిపి, వాటికి ప్రభుత్వ భూము లను తనఖా పెట్టి రుణం ఇప్పిస్తుంది. అందుకు ప్రతిఫలంగా మర్చంట్ బ్యాంకర్‌కు కనీసం 1% కమీషన్ చొప్పున లెక్క వేసినా రూ.100 కోట్లు కమీ షన్ చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.మర్చంట్ బ్యాంకర్ కోసం మళ్లీ టెండర్ బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలతో సంప్రదింపులు జరిపి అప్పులు ఇప్పించడంలో అనువజ్ఞులైన ‘మర్చంట్ బ్యాంకర్’ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్వేషణ సాగిస్తోంది. అందులో భాగంగా గత నెల 23న తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీజీఐఐసీ) ప్రతిపాదనలు కోరుతూ టెండర్ ప్రకటన విడుదల చేసింది. అయితే టెండర్ ప్రకటనలో విధించిన పలు అంశాలపై మర్చంట్ బ్యాంకర్ల నుంచి కొన్ని విన్నపాలు అందాయి.వాటిని పరిగణనలోకి తీసుకుంటూ తిరిగి గత నెల 28న టెండర్ నిబంధనలు సవరిస్తూ మరో ప్రకటన విడుదల చేయడంతోపాటు బిడ్ల దాఖలుకు ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుగా పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు బిడ్లను తెరుస్తామని టీజీఐఐసీ ప్రకటించింది. అయితే టెండర్ డాక్యుమెంట్లో కొన్ని లోపాలు ఉన్నట్టు గమనించిన టీజీఐఐసీ గత నెల 23న ఇచ్చిన టెండర్‌ను ఈనెల 2న రద్దు చేసింది. ఆ లోపాలను సరిదిద్ది తిరిగి ఒకటి రెండు రోజుల్లో తాజా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహలు చేస్తోంది. బ్యాంకర్ల ఎంపిక బాధ్యత టీజీఐఐసీకిఒకరి కంటే ఎక్కువ మర్చంట్ బ్యాంకర్లను నియమించే అధికారం టీజీఐఐసీ నేతత్వంలోని కమిటీకి అప్పగించినా, ఆర్థికశాఖనే కీలక పాత్ర పోషించనుంది. ఒకరి కంటే ఎక్కువ మర్చంట్ బ్యాంకర్లను నియమించే పక్షంలో సమపాళ్లలో బాధ్యతలు తీసుకొని నిర్దేశిత రుణం సేకరించాలి. పాత టెండర్ నోటిఫికేషన్ ప్రకారం బిడ్‌లో పాల్గొనే మర్చంట్ బ్యాంకర్లు రూ.50 లక్షలు ధరావత్తుగా చెల్లించాల్సి ఉంటుంది. భూములు తనఖా పెట్టడం సహా ఇతర సాంకేతిక, చట్టపరమైన అంశాలన్నీ మర్చంట్ బ్యాంకర్ ప్రభుత్వంతో సంప్రదిస్తూ పూర్తి చేయాల్సి ఉంటుంది. ముంబయికి చెందిన అరడజను మంది మర్చంట్ బ్యాంకర్లు ఈ ప్రతిపాదనకు ఆసక్తి చూపుతూ ఇప్పటికే బిడ్లు దాఖలు చేసినట్టు సమాచారం. అయితే టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయడంతో బిడ్ల దాఖలు ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది.రూ.10వేల కోట్లు సేకరణ లక్ష్యం...హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ కార్యకలాపాలు మందగించడంతో భూముల వేలం సాధ్యం కాదని, ఆశించిన మొత్తంలో నిధులు సమకూరే అవకాశం లేదని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. దీంతో టీజీఐఐసీ ఆధీనంలో ఉన్న భూములను తాకట్టు పెట్టడం ద్వారా కనీసం రూ.10వేల కోట్లు అప్పుగా తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే బిడ్‌లో దాఖలు చేసిన మర్చంట్ బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థలు కూడా వేర్వేరుగా తాకట్టు కోసం ఎంపిక చేసిన భూముల విలువ (వాల్యూయేష¯Œన్) లెక్కగట్టినట్టు సమాచారం. ఒక్కో ఎకరానికి గరిష్టంగా రూ.50 కోట్లు చొప్పున 400 ఎకరాల విలువను రూ.20వేల కోట్లుగా నిర్ణయించినట్టు తెలిసింది.ఈ భూముల తాకట్టు ద్వారా లెక్కించిన విలువలో సగం మొత్తం అంటే.. రూ.10వేలు కోట్లు రుణ మార్కెట్ నుంచి అప్పు తేవడం సాధ్యమవుతుందని మర్చంట్ బ్యాంకర్లు భావిస్తున్నట్టు తెలిసింది. 400 ఎకరాలను తాకట్టు పెట్టినా రూ.10వేల కోట్లు అప్పు పుట్టకుంటే.. అదనంగా మరింత భూమిని కూడా తాకట్టు పెట్టి అయినా రుణం తెచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా రెండు నెలల్లో రూ.10వేలు కోట్లు సేకరించి ఇవ్వాలని ప్రభుత్వం కోరుతుండగా, కనీసం ఆరు నెలలు గడువు కావాలని మర్చంట్ బ్యాంకర్లు చెబుతున్నట్టు సమాచారం. ఆర్బీఐ అడ్డుకుంటుందనే అనుమానాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఏ తరహా రుణాలైనా ఎఫ్ఆర్బీఎం గరిష్ట రుణ పరిమితికి లోబడే ఉండాలని రిజర్వు బ్యాంకు ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. అయితే భూముల తాకట్టు ద్వారా తెచ్చే అప్పులకు ఈ నిబంధన వర్తిస్తుందా లేదా అనే అంశంపై ఆర్థికశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రుణమార్కెట్ నుంచి తెచ్చే అప్పులకు సంబంధించిన సమాచారం ఆర్బీఐకి కూడా ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భూములను కుదువపెట్టి తెచ్చే అప్పులకు ఆర్బీఐ అభ్యంతరాలు చెబితే ఏం చేయాలనే దానిపై ఆర్థిక, పరిశ్రమల శాఖల అధికారులు అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది. -
కోకాపేట్‌లోని బఫెలో వైల్డ్ వింగ్స్.. ఆటిజంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం..(ఫొటోలు)
-
హైదరాబాద్ నగరంలో ఆకర్షణగా కళాత్మక చిత్రాలు
-
హిట్ అండ్ రన్.. బ్రెయిన్ డెడ్ విద్యార్థి అవయవదానం
హైదరాబాద్: కోకాపేటలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. వేగంగా వచ్చిన ఆటో ఓ బైకును ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో బైక్ పై ఉన్న విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. అయితే పుట్టెడు శోకంలోనూ.. బ్రెయిన్ డెడ్ అయిన ఆ విద్యార్థి అవయవదానానికి అతని తల్లిదండ్రులు ముందుకొచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే బిస్వాల్ ప్రభాస్ అనే విద్యార్థి హైదరాబాద్ కోకాపేట ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ వద్ద బైక్ పై వస్తున్నాడు. ఈ సమయంలో వేగంగా వచ్చిన ఆటో ప్రభాస్ ను ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే విద్యార్థిని సమీప ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగారు. బిస్వాల్ ప్రభాస్ అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నారు. లివర్, కిడ్నీలు దానం చేస్తున్నట్టు తెలిపారు. అవయవ దానం చేసిన బిస్వాల్ ప్రభాస్ కు సెల్యూట్ చేస్తూ ఆస్పత్రి సిబ్బంది శ్రద్ధాంజలి ఘటించారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కోకాపేట్ లో సందడి చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైత్యన (ఫొటోలు)
-
కోకాపేట భూముల్ని కారుచవకగా కొల్లగొట్టిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ రాయించుకున్న కోకాపేట భూములను వెంటనే ప్రభుత్వపరం చేయాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎకరం రూ.100 కోట్ల లెక్కన రూ.1100 కోట్లను చెల్లించాలని గురువారం ట్విట్టర్ వేదికగా కోరారు. జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యాల యాల పేరిట రూ.వెయ్యి కోట్ల విలువైన 33.72 ఎక రాల భూములను రూ.3 కోట్లకే అప్పనంగా కొట్టేశా రని ఆరోపించారు. ఎకరం రూ.100 కోట్లు పలికే కోకాపేటలో బీఆర్ఎస్ భవనం కోసంరూ.3.41 కోట్లకే 11 ఎకరాలు దోచేశారని పేర్కొన్నారు. -
కోకాపేటలో భూముల రేట్లు పెరగడానికి కారణాలు..!
-
Rs 100 Crore Per Acre In Kokapet: కోకాపేటలో ఎకరం 100 కోట్లు.. ఏముందక్కడ? ఎందుకంత స్పెషల్? (ఫోటోలు)
-
ఆల్ టైమ్ రికార్డు ధర పలికిన కోకాపేట భూములు
-
కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లు.. కేసీఆర్ ఏమన్నారంటే...
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో భూముల ధర ఎకరాకు రూ.100 కోట్లకుపైగా పలకడం తెలంగాణ పరపతికి నిదర్శమని, రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి అద్దం పడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు పోటీపడి, ఇంత ధర చెల్లించి మరీ తెలంగాణ భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధించిన ప్రగతి కోణంలో విశ్లేషించాలని ప్రకటించారు. ‘‘ఇంతింతై వటుడింతై అన్నట్టుగా హైదరాబాద్ నగర అభివృద్ధి అందనంత ఎత్తుకు దూసుకుపోతోంది. తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగమవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని భయభ్రాంతులకు గురి చేసి.. హైదరాబాద్ ఆత్మ గౌరవాన్ని కించపర్చిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా ఈ భూముల ధరల వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరెంత నష్టం చేయాలని చూసినా దృఢ చిత్తంతో పల్లెలను, పట్టణాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు, కృషికి దక్కిన ఫలితమిది..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్, హెచ్ఎండీఏ, మున్సిపల్ ఉన్నతాధికారులను అభినందించారు. (చదవండి: కోకాపేట ‘కనకమే’.. ఎకరం రూ.100 కోట్లు) -
కోకాపేట్.. హాట్ కేక్! బంగారం కంటే ఎంతో విలువైన భూమి
హైదరాబాద్: కోకాపేట్ ఇప్పుడు ఒక హాట్‌కేక్. అక్కడ భూమి బంగారం కంటే ఎంతో విలువైంది. మహా నగరానికి పడమటి వైపున ఆకాశ హర్మ్యాలతో అలరారే కోకాపేట్ అంతర్జాతీయ హంగులతో దేశ విదేశాలకు చెందిన వ్యాపార దిగ్గజ సంస్థలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒకవైపు ఔటర్‌రింగ్‌రోడ్డు, మరోవైపు రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిర్మించతలపెట్టిన ఎయిర్‌పోర్టు మెట్రోకు అందుబాటులో ఉ న్న కోకాపేట్లో హెచ్ఎండీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన నియోపోలిస్ లేఅవుట్లో రెండో దశ ప్లాట్ల అమ్మకాలకు సన్నాహాలు చేపట్టింది. విశాలమైన రహదారులు.. అత్యాధునిక సదుపాయాలు సుమారు వంద ఎకరాలకుపైగా విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ లేఅవుట్లో మొదటి దశలో ఎకరం రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల చొప్పున 64 ఎకరాలను విక్రయించారు. తాజాగా మరో 7 ప్లాట్లలో విస్తరించిన ఉన్న 45.33 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టింది. ఈసారి ఎకరా కనీస ధర రూ.35 కోట్లుగా నిర్ణయించినప్పటికీ ఆన్లైన్ వేలం ద్వారా రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు కూడా అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా. విశాలమైన రహదారులతో, అత్యాధునిక సదుపాయాలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ సొసైటీకి చేరువలో ఉన్న నియోపోలిస్ లే అవుట్ చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలోనే అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఫార్ట్చూన్ 500 కంపెనీలు ఉండడంతో ఈ భూమికి భారీ డిమాండ్ నెలకొంది.పైగా బహుళ వినియోగ అనుమతులు ఉండడంతో అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలు, బడా రియల్టర్లు, డెవలపర్లు నియోపోలిస్ కోసం పెద్ద ఎత్తున పోటీపడనున్నారు. మొదటి దశలో ఒకటి నుంచి 5 ప్లాట్ వరకు విక్రయించగా ప్రస్తుతం 6 నుంచి 14 వరకు ఉన్న ప్లాట్లలో భూమిని అమ్మకానికి పెట్టారు. ప్లాట్ల సైజు మేరకు కనిష్టంగా 3.60 ఎకరాల నుంచి గరిష్టంగా 9.71 ఎకరాల భూమి ఉంది.ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ నెల 31వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఆగస్టు ఒకటో తేదీ వరకు డిపాజిట్ చెల్లించేందుకు గడువు విధించారు. ఆగస్టు 3న ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహించనున్నారు. ప్రత్యేకతలెన్నో.. సముద్ర మట్టానికి 588 మీటర్ల ఎత్తులో ఉన్న నియోపోలిస్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ రూ.300 కోట్లు ఖర్చు చేసింది. సుమారు 40 ఎకరాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లు తదితర సదుపాయాలతో 45 మీటర్ల, 36 మీటర్ల వెడల్పుతో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేశారు. భూగర్భ డ్రైనేజీ, విద్యుత్తు, తదితర అన్ని సదుపాయాలు ఉన్నాయి. కమర్షియల్, రెసిడెన్షియల్, ఎంటర్టైన్మెంట్ తదితర అన్ని రకాల భవనాలకు అనుమతులు ఇచ్చారు. నియోపోలిస్‌లో ఎన్ని అంతస్తుల వరౖకైనా హైరైజ్ బిల్డింగ్‌లను నిర్మించవచ్చు. ఔటర్ రింగ్‌రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు 5 నిమిషాలు, ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాలు, హైటెక్ సిటీకి 20 నిమిషాల వ్యవధిలో చేరుకొనే విధంగా రోడ్డు నెట్వర్క్ అందుబాటులో ఉంది. ఈ నెల 20న ప్రీబిడ్ మీటింగ్.. నియోపోలిస్ రెండో దశ భూముల వేలంపై ఈ నెల 20న ప్రీబిడ్ సమావేశం నిర్వహించనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ సమావేశంలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. భూముల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు తదితర కార్యక్రమాల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా సింగిల్‌విండో పద్ధతిలో పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. -
కోకాపేటలో సీఎం కేసీఆర్ పర్యటన
-
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయాన్ని దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడంతో పాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్న బీఆర్ఎస్.. తాజాగా హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక హంగులతో మరో భారీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కోకాపేటలో నిర్మించినున్న భారత్ భవన్‌కు సీఎం కేసీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ భవన్‌కు సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ అండ్ హెచ్ఆర్డీగా పేరు పెట్టారు. కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో, మొత్తం 15 అంతస్థుల్లో భారత్ భవన్ నిర్మాణం జరగనుంది. ఈ కార్యాలయంలో అతి పెద్ద డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో కార్యకర్తలకు అవగాహణ కార్యక్రమాలు, శిక్షణా తరగతులు నిర్వహించేలా భవన నిర్మాణం జరగనుంది. చదవండి: నాన్న లే.. బుజ్జగించ నాన్న లేడు.. లాలించగ అమ్మ రాదు -
బీఆర్ఎస్కు కోకాపేటలో 11 ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని కోకాపేట గ్రామంలో 11 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్ భేటీలో భూపరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించినట్టు తెలిసింది. ఈ భూమిలో ప్రజా నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలకు శిక్షణ ఇచ్చేందుకు ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్’ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పేరిట చేసిన ప్రతిపాదన సముచితమేనని భూపరిపాలన శాఖ (రెవెన్యూ) పెట్టిన నోట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ భూమిని హెచ్ఎండీఏ నుంచి స్వాధీనం చేసుకుని బీఆర్ఎస్కు కేటాయిస్తామని ఆ శాఖ పేర్కొంది. దీంతో సుమారు రూ.500 కోట్ల విలువైన భూమిని బీఆర్ఎస్ పేరిట బదలాయించడం లాంఛనమే కానుంది. అయితే, కేబినెట్ నిర్ణయాల ను వెల్లడించేందుకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ అంశాన్ని గోప్యంగా ఉంచడం, తమకు భూమిని కేటాయించాలని బీఆర్ఎస్ ప్రతిపాదించిన వారంరోజుల్లోనే రెవెన్యూశాఖ అంగీకారం తెలిపి మంత్రివర్గ సమావేశం ముందు నోట్ పెట్టడం, కేబినెట్ ఇందుకు ఆమోదం తెలిపిన విషయాన్ని రహస్యంగా ఉంచడం చర్చనీయాంశమవుతోంది. బీఆర్ఎస్ చేసిన ప్రతిపాదన ఇదే కేబినెట్ ముందు భూపరిపాలన శాఖ పెట్టిన నోట్ ప్రకారం ఈనెల 12న బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పేరిట భూకేటాయింపు కోసం ప్రతిపాదన వచ్చింది. ఈ భూమిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ను ఏర్పాటు చేసి నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలకు వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇస్తామని అందులో పేర్కొన్నారు. ఈ కేంద్రంలో కాన్ఫరెన్స్ హాళ్లు, లైబ్రరీ, శిక్షణ తీసుకునే వారికి వసతి, సెమినార్ రూమ్‌లు, విద్యావేత్తలకు పని ప్రదేశాలను ఏర్పాటు చేస్తామన్నారు. సామాజిక కార్యకర్తలు, ప్రజా నాయకుల అవసరాలను తీర్చేందుకు ఇదో ప్రతిష్టాత్మక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఇందుకు కోకాపేటలోని 239, 240 సర్వే నంబర్లలో గల 11 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్టుగానే.. బీఆర్ఎస్ ప్రతిపాదనను పరిశీలించిన భూపరిపాలన శాఖ కేబినెట్ ముందు సవివరంగా నోట్ పెట్టింది. హైదరాబాద్ జిల్లా తిరుమలగిరి మండలంలోని బోయిన్పల్లి గ్రామంలో ఉన్న 502, 503, 502/పీ2 సర్వే నంబర్లలోని 10 ఎకరాల 15 గుంటల భూమిని ఎకరం రూ.2 లక్షల చొప్పున అప్పట్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ)కి కేటాయించినట్టు ఈ నోట్లో పేర్కొంది. జాతీయస్థాయిలో మానవ వనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసేందుకు ఈ భూమిని కేటాయించినట్టు తెలిపింది. దీనిపై హైకోర్టు ఉత్తర్వుల మేరకు గత ఏప్రిల్ 28న ఆ భూమిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి పునర్కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఏపీసీసీకి బోయిన్‌పల్లిలో భూమి ఇచ్చినట్టుగానే కోకాపేటలో బీఆర్ఎస్కు భూమి ఇవ్వడం సముచితమేనని భూపరిపాలన శాఖ ఆ నోట్లో స్పష్టం చేసింది. రూ.40 కోట్లకు...? ఈ భూమిని కేబినెట్ నిర్ణయించిన ధరకు బీఆర్ఎస్కు కేటాయిస్తామని భూపరిపాలన శాఖ నోట్లో పేర్కొంది. దీనిప్రకారం ఈ భూమి తమ పేరిట బదలాయించేందుకు బీఆర్ఎస్ పార్టీ మొత్తం రూ.40 కోట్లు చెల్లించేలా కేబినెట్ ఆమోదించినట్టు సమాచారం. దాదాపు రూ.500 కోట్ల విలువైన ఈ భూమిని రూ.40 కోట్లకు బీఆర్ఎస్కు బదలాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్న విషయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం గజానికి రూ.100 చొప్పున మాత్రమే తీసుకుని విలువైన భూములను బీఆర్ఎస్ పేరిట బదలాయించుకున్నారని, హైదరాబాద్ జిల్లా కార్యాలయం కోసం బంజారాహిల్స్‌లో 4,935 చదరపు గజాల భూమిని నామమాత్రపు ధరకు సొంతం చేసుకున్నారని, ఇది బీఆర్ఎస్ భూదాహానికి నిదర్శనమనే విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి. -
Hyderabad: భూం ధాం!.. రూ. 12 వేల కోట్ల నుంచి 15 వేల కోట్లు లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ సమీకరణపై దృష్టి సారించింది. ఇప్పటికే కోకాపేట, ఖానామెట్ ప్రాంతాల్లో భూములను విక్రయించి, రూ.కోట్లు సేకరించిన ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి శివారు జిల్లాలను ఎంచుకుంది. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 25.01 ఎకరాల భూములను విక్రయించాలని నిర్ణయించింది. మొత్తం 1,21,060 చదరపు గజాల వేలంతో సుమారు రూ.15 వేల కోట్లు సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అత్యధికంగా రంగారెడ్డిలో 11.3 ఎకరాలలో 54,692 గజాలను వేలం వేయనుంది. వీటిలో కోకాపేట, గండిపేట, పుప్పాలగూడ, నల్లగండ్ల వంటి హాట్ లొకేషన్సే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈసారి కొత్తగా వరంగల్ జాతీయ రహదారిలోనూ ప్రభుత్వ స్థలాలను వేలంలో పెట్టింది.. ఘట్కేసర్లోని కొర్రెములలో 2662 చదరపు గజాలను వేలం వేయనుంది. కుత్బుల్లాపూర్ మండలంలోని సూరారం, బౌరంపేట ప్రాంతాల్లోనూ స్థలాలను అమ్మనుంది. ఈసారి భూముల వేలం జాబితాలో వాలంతరీ, వీడీఓ, టూరిజం భూములు కూడా ఉండడం విశేషం, గతంలో ఈ భూములను ఐటీ హబ్‌కు కేటాయించాలని నిర్ణయించిన సర్కారు..తాజాగా వేలంలో పెట్టడం గమనార్హం. వేలంలో అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో బౌరంపేటలో 302 గజాలు, అత్యధికంగా పుప్పాలగూడలో 9,680 గజాల స్థలాన్ని వేలం వేయనున్నారు. తాజా వేలంలో 2 వేల గజాల కంటే ఎక్కువ ఉన్న ప్లాట్లే ఎక్కువగా ఉన్నాయి. జనవరి 16న రిజి్రస్టేషన్‌కు ఆఖరు గడు వు, 18న వేలం ఉంటుందని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రకటించింది. చదవండి: తగ్గిన స్థిరాస్తి లావాదేవీలు..!.. పెరిగిన ధరలు...రిజిస్ట్రేషన్ చార్జీలు మార్కెట్ రేటు రెండింతలు.. వేలంలో ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే మార్కెట్ రేటు రెట్టింపుగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అంచనా వేసిన రూ.15 వేల కోట్ల ఆదాయ సమీకరణ సులువు అవుతుందని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు. పైగా కోకాపేట, మంచిరేవుల, గండిపేట, నల్లగండ్ల వంటి ఐటీ, సంపన్నులుండే ప్రాంతంలో స్థలాల వేలం ఉండటంతో స్థానిక డెవలపర్లతో పాటు ఇతర రాష్ట్ర కంపెనీలు కూడా వేలంలో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పుప్పాలగూడ, మంచిరేవుల ప్రాంతంలో గజానికి రూ.60 వేలుగా ప్రభుత్వం నిర్ధారించగా.. ప్రస్తుతం మార్కెట్ విలువ అక్కడ సుమారు రూ.లక్షపైనే పలుకుతుందని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో కోకాపేట, ఖానామెట్‌లో భూములను వేలం వేసినప్పుడు గజం రూ.1.50 లక్షలు పలకడంతో.. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ప్రారంభ ధరే రూ.1.50 లక్షలుగా నిర్ధారించారని ఓ డెవలపర్ తెలిపారు. కోకాపేట కంటే నల్లగండ్లలో నిర్ధారించిన ధర ఎక్కువగా ఉందంటే ఆయా ప్రాంతం వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఉండటమే కారణమని అభిప్రాయపడ్డారు. ఘట్కేసర్ ప్రాంతంలో గజానికి రూ.20 వేలు కనీస ధరగా నిర్దేశించగా.. ఆయా ప్రాంతంలో అభివృద్ధి నేపథ్యంలో ఈ ధర ఎంతవరకు పలుకుతుందనేది ఆసక్తిగా మారింది. -
కోకాపేటలోని ఓ అపార్ట్ మెంట్ స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి
-
కోకాపేటలో బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి.. ఆ టైమ్‌లో బాయ్‌ఫ్రెండ్
సాక్షి, రంగారెడ్డి: స్పాలో పనిచేస్తున్న అస్సాంకు చెందిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మిజోరం రాష్ట్రానికి చెందిన రోసీ (23) తన స్నేహితురాలు లాల్వెన్‌తో కలిసి నెల రోజుల క్రితం కోకాపేటలోని ఐఎస్ఏ స్పాలో థెరపిస్టుగా చేరారు. స్పా యజమాని ఆనందరావు కోకాపేటలో వారికి ఓ గది ఇప్పించారు. అయితే రోసీ ఆదివారం గదికి రాలేదు. దీంతో స్నేహితురాలు సోమవారం స్పాకు వెళ్లి రాత్రికి వచ్చింది. రోసీ మంగళవారం ఉదయం పార్సిల్లో ఏదో తెప్పించుకొని తిన్నది. ఆ సమయంలో గదిలో ఆమెతో పాటు నాగాలాండ్‌కు చెందిన ప్రియుడు లన్సో ఉన్నాడు. పార్సిల్లో వచ్చింది తిని బాత్రూంకు వెళ్లిన రోసీ ఎంత సేపటికీ బయటకు రాకపోవటంతో లన్సో డోర్ తొలగించి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉంది. అంతేకాకుండా బాత్రూంలో ఇంజెక్షన్ సిరంజి, మాత్రలు కనిపించాయి. దీంతో లన్సో వెంటనే 108 ద్వారా సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధృ వీకరించారు. మృతురాలి బంధువు బినిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చదవండి: అమ్మమ్మ పాలకూర కావలంటూ.. పుస్తెలతాడుతో.. -
కోకాపేట భూముల వేలం ఆపాలా?
సాక్షి, హైదరాబాద్: చెరువు క్యాచ్మెంట్ ఏరియా వెలుపల ఉన్న వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లను జీవో 111 నుంచి తొలగించడానికి ప్రభుత్వం విముఖత చూపడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వట్టినాగులపల్లిలోని భూములను జీవో 111 నుంచి మినహాయిస్తే అక్కడ నిర్మాణమయ్యే బహుళ అంతస్తుల భవనాల నుంచి వచ్చే నీటితో కోకాపేట చెరువు కలుషితమవుతుందన్న ప్రభుత్వ వాదనను తప్పుబట్టింది. ఒకవైపు కోకాపేటలోని ప్ర భుత్వ భూములు వేలం వేస్తూ, మరోవైపు క్యాచ్మెంట్ ఏరియా వెలుపల ఉన్న రైతుల భూములు మాత్రం జీవో 111 పరిధిలో ఉండాలంటూ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను పాటించడం ఏంటని ప్రశ్నించింది. జీవో 111 పరిధికి దగ్గర్లోని కోకాపేటలో ప్రభుత్వం 49.8 ఎకరాలను ఇటీవల వేలం వేసి రూ.2 వేల కోట్లు సమకూర్చుకుందని, ప్రభుత్వం వేలం వేసిన కోకాపేట భూముల్లో బహుళ అంతస్తుల నిర్మాణాల నుంచి మురికినీరు వచ్చి కోకాపేట చెరువులో కలిసే అవకాశం లేదా అని నిలదీసింది. ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే కోకాపేట భూముల వేలం తుది కేటాయింపులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. కోకాపేట భూముల వేలాన్ని నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు గతంలో నిరాకరించామని, ఇప్పుడు ఈ పిటిషన్‌తో కలిపి ఆ పిల్లను విచారించి ఉత్తర్వులు జారీచేస్తామని స్పష్టం చేసింది. జీవో 111 పరిధి నిర్ణయానికి సంబంధించి ఏర్పాటు చేసిన హైపర్ కమిటీ సమావేశాల మినిట్స్, నోటింగ్ ఫైల్స్‌ను బుధవారంలోగా తమకు సమర్పించాలని ప్రభుతాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఢిల్లీకి చెందిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్‌త్గీ వాదనలు వినిపించారు. కోకాపేట చెరువు కలుషితం కావొచ్చేమో! జీవో 111 పరిధి నుంచి గ్రామంలోని కొన్ని సర్వే నంబర్లను తొలగించాలంటూ వట్టినాగులపల్లికి చెందిన కొందరు రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్లను జీవో 111 నుంచి తొలగిస్తే బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జరిగి అక్కడి నుంచి మురికినీరు వచ్చి కోకాపేట చెరువు కలుషితం అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీకి చెందిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్‌త్గీ వాదనలు వినిపించారు. విరుద్ధంగా వాదనలు వినిపిస్తామంటే ఎలా? ‘‘వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్లను తొలగించాలని 2006లోనే ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ణయించింది. ఈ నివేదిక మేరకే 2010లో ప్రభుత్వం అనుమతి కోరుతూ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వాదనలు వినిపిస్తామంటే ఎలా? జీవో 111 పరిధి నిర్ణయించేందుకు హైపవర్ కమిటీని 2016లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపుగా 55 నెలలుగా కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. 2018లో ఓ కేసు విచారణ సందర్భంగా 45 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఎన్జీటీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా ఇప్పటికీ ఈ కమిటీ నిరుపయోగంగా ఉంది. పనిచేయని ఇటువంటి కమిటీలను తక్షణం రద్దు చేయాలి’’అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నా వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లను తొలగించాలన్న రైతుల పిటిçషన్ను విచారించి ఉత్తర్వులు జారీచేస్తామని ధర్మాసనం పేర్కొంది.