
ఈ లేఅవుట్‌లో భూములు కొన్న రియల్ ఎస్టేట్ సంస్థలు ఆకాశహార్మ్యాలను నిర్మిస్తుండగా, మరో వైపు 150, 120,100 అడుగుల విస్తీర్ణంలో రోడ్లు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నది హెచ్‌ఎండీఏ.

భూమికాదు బంగారం.. ఎకరం 100 కోట్లు, కోకాపేటలో ఏముందక్కడ? ఎందుకంత స్పెషల్ అక్కడ? (ఫోటోలు)

గతేడాది హెచ్‌ఎండీఏ నియోపోలిస్ లేఅవుట్‌ను 529 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించి.. ఆన్‌లైన్‌లో విక్రయించగా, అనూహ్య స్పందన వచ్చింది. ఎకరా ధర అత్యధికంగా రూ.60 కోట్ల దాకా పలికింది.

హెచ్‌ఎండీఏ ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న నియోపోలీస్ లేఅవుట్‌ను మినహాయిస్తే దాని చుట్టు పక్కల ఆనుకొని భూముల్లోనూ ఇప్పటికే భారీ సంఖ్యలో హైరైజ్ బిల్డింగ్‌లు 30 నుంచి 57 అంతస్థుల వ్యాపార, వాణిజ్య భవనాలతో పాటు గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులే అత్యధికంగా ఉన్నాయి.

ఐటీ పరంగా మాదాపూర్, గచ్చిబౌలి, రాయిదుర్గం, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు తగ్గిపోవడంతో ఇప్పుడంతా కోకాపేటపైనే ఐటీ కంపెనీలు దృష్టిసారించాయి. దానికి అనుగుణంగానే కోకాపేటలో మౌలిక వసతులను కల్పిస్తున్నామని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.

దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో మరే ఇతర మెట్రో నగరాల్లో ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పాటు చేయని విధంగా కోకాపేటలో భారీ లేఅవుట్‌ను నియోపోలీస్ (ఎస్‌ఈజెడ్-స్పెషల్ ఎకనామిక్ జోన్) పేరుతో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తున్నది.

ఐటీ కారిడార్‌ను, ఔటర్ రింగు రోడ్డును అనుకొని కోకాపేటలోని 500 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వం భూముల వినియోగంపై ప్రత్యేక కసరత్తు చేసి ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా కోకాపేట నియోపోలీస్ ప్రాజెక్టును ప్రకటించింది.

కోకాపేట నియోపోలీస్ లేఅవుట్‌కు అనుసంధానంగా లింకురోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. నగరంలోని మెహిదీపట్నం, నార్సింగి మీదుగా శంకర్‌పల్లి వైపు ఉన్న ప్రధాన రహదారిని కలుపుతూ రెండు లింకు రోడ్లను 100 అడుగుల విస్తీర్ణంతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికా విభాగంలో రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్‌ను రూపొందించింది.

గ్రేటర్ చుట్టూ 158 కి.మీ పొడవునా ఉన్న ఔటర్ రింగు రోడ్డు పెట్టుబడులకు ప్రత్యేకాకర్షణగా మారింది. అలాంటి ఔటర్ రింగు రోడ్డు మీదుగా కోకాపేట నియోపోలీస్ లేఅవుట్‌తో అనుసంధానిస్తూ ట్రంపెట్‌ను హెచ్‌ఎండీఏ నిర్మిస్తున్నది.