ring road
-
Live: చంద్రబాబు కేసు అప్డేట్స్.. Click & Refresh
Updates.. 08:52PM, సెప్టెంబర్ 19, 2023 సీఐడీ కౌంటర్ దాఖలు ► విజయవాడ: చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సీఐడీ కౌంటర్ ► బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా 06:50PM, సెప్టెంబర్ 19, 2023 చంద్రబాబు @ A25 ► విజయవాడ : ACB కోర్టులో మెమో దాఖలు చేసిన CID ► ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబు పేరు చేరుస్తూ మెమో ►ఫైబర్ నెట్‌పై వేసిన పిటి వారెంట్‌కు అనుబంధంగా మెమో దాఖలు 06:00PM, సెప్టెంబర్ 19, 2023 ఫైబర్ గ్రిడ్ కుంభకోణం జరిగిందిలా.. ► గతంలో ఏపీ సివిల్ సప్లైస్‌కు సర్వీసులు అందించిన టెర్రాసాఫ్ట్ కంపెనీ ► నాసిరకం ఈ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్‌ను నాడు బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం ► అయినా టెర్రాసాఫ్ట్‌పై అంతులేని ప్రేమ కురిపించిన చంద్రబాబు సర్కారు ► టెర్రాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు నాడు చంద్రబాబు సర్కారు అవకతవకలు ► బ్లాక్‌లిస్ట్‌లో టెర్రాసాఫ్ట్‌ను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే తప్పించిన వైనం ► బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే టెర్రాసాఫ్ట్‌ను లిస్ట్ నుంచి తొలగించిన అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు ► హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో జట్టు కట్టి ప్రాజెక్టు దక్కించుకున్న టెర్రాసాఫ్ట్ ► టెండర్లు దక్కించుకున్న తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపిన టెర్రాసాఫ్ట్ ► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన CID ► తమని మోసం చేసినట్టు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ VP అనీల్ జైన్ ► నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసిన టెర్రా సాఫ్ట్ ► చంద్రబాబు సూచనల మేరకే టెర్రాసాఫ్ట్ వ్యవహరం మలుపులు తిరిగిందని తేల్చిన CID 05:40PM, సెప్టెంబర్ 19, 2023 ACB కోర్టులో చంద్రబాబుపై మరో కేసులో PT వారంట్ ► చంద్రబాబుపై మరో పిటి వారెంట్ దాఖలు, ఫైల్ నంబర్ 2916/2023 ► ఫైబర్‌నెట్ కుంభకోణంలో చంద్రబాబు ప్రదాన ముద్దాయిగా పిటి వారెంట్ ► రూ.115 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని దర్యాప్తులో తేల్చిన సిట్ ► 2021 లోనే ఫైబర్ నెట్ కుంభకోణంలో 19 మందిపై సిఐడి కేసు నమోదు ► నాటి FIRలో A1గా వేమూరి హరిప్రసాద్, A2గా మాజీ MD సాంబశివరావు ► చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు వేమూరి హరిప్రసాద్ 05:12PM, సెప్టెంబర్ 19, 2023 ACB కేసులో విచారణ రేపటికి వాయిదా ► CID కస్టడీ పిటిషన్‌పై సమయం అడిగిన చంద్రబాబు లాయర్లు ► హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్న దృష్ట్యా కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలన్న చంద్రబాబు లాయర్లు ► రేపటి వరకు సమయం అడిగిన చంద్రబాబు లాయర్లు, సరేనన్న ACB కోర్టు ► CID వేసిన చంద్రబాబు కస్టడీ పిటీషన్ పై విచారణ రేపటికి వాయిదా 05:00PM, సెప్టెంబర్ 19, 2023 వాదనలు ముగిసాయి, 2 రోజుల్లో తీర్పు : హైకోర్టు ► ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి ► ఇప్పుడు కోర్టు నిర్ణయం తీసుకోనివ్వండి ► రెండు రోజుల్లో ఈ పిటిషన్‌పై తీర్పు ఇస్తాం 04:50PM, సెప్టెంబర్ 19, 2023 చివరిగా మరోసారి మా విజ్ఞప్తి వినండి : బాబు లాయర్ లూథ్రా ► చంద్రబాబును ఈ కేసులో A1 అంటున్నారు ► నిధులు విడుదల చేసిన వ్యక్తే అసెంబ్లీలో ప్రకటన చేశారు ► నిజంగా తప్పు చేసి ఉంటే, లేదా కుంభకోణం కుట్ర ఉంటే సభలో ఎందుకు ప్రకటన చేస్తారు? ► సెక్షన్ 17A సవరణ ఈ కేసుకు వర్తిస్తుంది. గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారు ► ఈ కేసును రఫెల్ కేసుతో పోల్చవచ్చు. ఆ కేసులో జస్టిస్ జోసెఫ్ ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేసుకోవాలి ► మా వాదన అంతా 17A చుట్టే ఉంది. CID వాదనల్లో 90%, 10% అన్న దగ్గర కన్ఫ్యూజన్ ఉంది ► సీమెన్స్ కంపెనీ నుంచి వచ్చిన ఈ మెయిల్‌కు రిమాండ్ రిపోర్ట్‌కు తేడా ఉంది 04:45PM, సెప్టెంబర్ 19, 2023 ఈ కేసును ఇవ్వాళే ముగిస్తాం : హైకోర్టు ► ఈ కేసులో ఇంకేదైనా చెప్పుకోవాలంటే ఇప్పుడే అవకాశం ఇస్తున్నాం ► ఉదయం నుంచి ఇప్పటిదాకా ఇదే కేసులో వాదనలు విన్నాం ► ఈ కేసులో స్పష్టత వచ్చింది. చివరి అవకాశం ఇస్తున్నాం 04:35PM, సెప్టెంబర్ 19, 2023 బాబు లాయర్లు ఇచ్చినవి సరైన రిఫరెన్స్‌లు కావు.! : CID లాయర్లు ► ఈ కేసులో బాబు లాయర్లు అర్నబ్ గోస్వామి కేసును ఉదహరించారు ► అర్నబ్ గోస్వామిది వాక్ స్వాతంత్ర హక్కుకు సంబంధించినది ► ఆ కేసుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు ► ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి పథకం ప్రకారం జరిగింది ► సెక్షన్482 పిటిషన్లపై నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది ► అరెస్టు చేయకూడదంటూ హైకోర్టులు ప్రతీసారి జోక్యం చేసుకోవద్దంటూ నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసులో సుప్రీం తీర్పునిచ్చింది ► పోలీసులకు పూర్తి విచారణ చేసుకునే వెసులుబాటు కల్పించాలి ► ఈ కేసులో విచారణ ఇప్పుడే ప్రారంభమైంది… ఈడీ, ఇన్‌కంటాక్స్ కూడా విచారిస్తున్నాయి. దీనిని కోర్టు పరిగణలోకి తీసుకోవాలి 04:32PM, సెప్టెంబర్ 19, 2023 CID వాదనలు అభ్యంతరకరంగా ఉన్నాయి : బాబు లాయర్ సాల్వే ► ఈ ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లు పూర్తయ్యాయి ► ఈ ప్రభుత్వం ఇప్పుడు పైల్స్ కనిపించడం లేదని, అవి చంద్రబాబు మాయం చేశారని ఆరోపిస్తున్నారు ► 2018లోనే ఫిర్యాదు వచ్చిందన్న వాదనను మేం ఒప్పుకోం ► 2021లో నమోదయిన ఫిర్యాదునే కోర్టు పరిగణించాలి 04:32PM, సెప్టెంబర్ 19, 2023 సెక్షన్ 17A సవరణ ఈ కేసులో వర్తించదు : CID లాయర్ ► ఈ కేసులో ప్రాథమిక విచారణ జూన్ 5, 2018న జరిగింది : పొన్నవోలు సుధాకర్ రెడ్డి ► అంటే 2018లో సెక్షన్ 17A సవరణకు ముందే ఇది పూర్తయింది ► 2015 నుంచే స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై ఆరోపణలున్నాయి ► ఒక సెక్షన్‌కు సంబంధించిన సవరణ కోసం దర్యాప్తు ఆగదు ► ఈ కేసులో శుక్రవారం కౌంటర్ ఫైల్ చేయగలం 04:25PM, సెప్టెంబర్ 19, 2023 సెక్షన్ 17A గురించి చర్చిద్దాం : బాబు లాయర్ హరీష్ సాల్వే ► CID లాయర్ వాదిస్తుండగా.. జోక్యం చేసుకున్న సాల్వే ► కేసు పెట్టింది 2020లో కాబట్టి 2018లో చేసిన సవరణ వర్తిస్తుంది ► సీమెన్స్ గుజరాత్లో కూడా ప్రాజెక్టు చేపట్టింది ► గుజరాత్లో ఎలా జరిగిందో.. ఏపీలో కూడా చంద్రబాబు అలాగే నిర్వహించారు ► ప్రభుత్వం కోరినట్టు ప్రాజెక్టు పూర్తయింది ► ఇక్కడ తప్పు ఎక్కడ జరిగి ఉండొచ్చంటే.. పన్ను ఎగ్గొట్టడానికి డిజైన్ టెక్ చేసిన ప్రయత్నంలో చంద్రబాబును ఇరికించారు ► 2024లో ఏపీ శాసనసభకు, లోక్‌సభకు ఎన్నికలున్నాయి ► చంద్రబాబును లోపల పెట్టడమన్నది రాజకీయ కక్ష కాకుంటే మరొకటని భావించలేం ► ఒక వేళ చంద్రబాబు విదేశాలకు పారిపోయి ఉంటే.. దాన్ని ఈ ప్రభుత్వం సంతోషంగా అనుమతించేది 04:20PM, సెప్టెంబర్ 19, 2023 క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టేయాలంటే... : CID లాయర్ ► NCT ఢిల్లీ X ప్రీతీ సరఫ్ కేసును ప్రస్తావించిన CID లాయర్ ► సాంకేతిక కారణాలు చూపించి క్వాష్ కొట్టేయడం సరికాదని సుప్రీంకోర్టు చెప్పింది ► సెక్షన్ CrPC 482 ప్రకారం దర్యాప్తు అధికారులను విచారణ పూర్తి చేసుకోనివ్వాలి 04:10PM, సెప్టెంబర్ 19, 2023 స్కిల్ డెవలప్ స్కాంలో ఎప్పుడు ఏం జరిగిందంటే.. కోర్టుకు వివరించిన CID లాయర్ రంజిత్ ►నిందితులకు ఆదాయపుపన్నుశాఖ నోటీసులు జారీచేసింది ► స్కిల్ స్కాంపై ఆదాయంపన్ను శాఖ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించింది ► వాళ్ల మోడస్ ఆపరండీని మొత్తం ఇన్‌కంటాక్స్ పసిగట్టింది ► రూ.200 కోట్ల మేర నిధులను మళ్లించినట్టుగా IT తన ఫోరెన్సిక్ ఆడిట్లో గుర్తించింది ► స్కిల్ డెవలప్మెంట్ కోసం నాటి చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్లో ఎలాంటి తేదీ కూడా లేదు ► ఒప్పందం చేసుకున్న వెంటనే డిజైన్ టెక్ స్కిల్లర్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది ► ఎలాంటి ముందస్తు ఒప్పందం లేకుండానే ఈ కంపెనీని ఇన్కార్పొరేట్ చేశారు ► స్కిలర్ నుంచి రూ.178 కోట్లు కొనుగోలు చేసినట్టుగా డిజైన్‌టెక్ చూపింది ► ఒప్పదంలోకాని, ప్రతిపాదనలోకాని ఎలాంటి తేదీ కూడా లేదు ► డాక్యుమెంట్లలో ఎలాంటి తేదీలు కూడా లేవు, ఇది ఉద్దేశపూర్వకంగా విస్మరించారు ► ప్రభుత్వం ఉత్తర్వుల్లో కానీ, MOUల్లో ఎలాంటి స్థిరత్వం లేదు ► సంతకాలకు ముందే ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా 164 స్టేట్మెంట్లో నిందితులు అంగీకరించారు 04:00PM, సెప్టెంబర్ 19, 2023 ఇది పక్కా కుంభకోణమే, చంద్రబాబే సూత్రధారి, పాత్రధారి : CID లాయర్లు ► నేరం జరిగినప్పుడు తాను ముఖ్యమంత్రిని కాబట్టి ఇది రాజకీయ కక్ష్య అని చంద్రబాబు అంటున్నారు. ► విచారణ పూర్తై అధికారులు నివేదిక సమర్పించిన తరువాతే కోర్టు జోక్యం చేసుకోవాలి. ► FIRలో తన పేరులేదు కాబట్టి అరెస్టు చేయకూడదని చెప్పడం తప్పు ► FIR సర్వస్వం కాదు కోర్టులో కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో కూడా పేరు చేర్చవచ్చు. ► ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరించింది… అందుకే 2021లో చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదు ► ప్రైవేటు కంపెనీలు ఒక్క రూపాయి ఇవ్వకుండానే ప్రభుత్వానికి చెందిన 300కోట్లు రిలీజ్ చేశారు ► ముందుగానే ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయడం అనేది ఎక్కడా ఉండదు. ► చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరిగింది.. షెల్ కంపెనీలకు సైతం చంద్రబాబే సూత్రధారి, పాత్రధారి 03:48PM, సెప్టెంబర్ 19, 2023 కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగానే అరెస్ట్ జరగలేదు: CID లాయర్లు ► దర్యాప్తు బృందంపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. కానీ, వీళ్లంతా శిక్షణ పొందిన అధికారులు. ఆరోపించేవాళ్లు ముందు ఈ విషయం గుర్తించాలి. ► సీమెన్స్ కంపెనీతో జరిపిన మెయిల్ సంభాషణలు మా దగ్గర ఉన్నాయి. ► చంద్రబాబు సెక్రటరీకి ఈడీ, ఐటీ నోటీసులు ఇచ్చాయి. ఆయన దేశం విడిచి అమెరికాకు పారిపోయారు. ► సీమెన్స్‌కు నిందితుడు సుబ్బారావు, గంటా ఈమెయిల్స్ పంపారు.. అప్పటి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ కూడా ఇందులో బాగం అయ్యారు. ► కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగానే చంద్రబాబు అరెస్ట్ జరగలేదు. 03:23PM, సెప్టెంబర్ 19, 2023 పోలీసులపై నిందలు మోపుతారా? : CID లాయర్లు ►ఈ కేసు ప్రారంభ దశలోనే ఉంది. బెయిల్ దరఖాస్తు చేసుకున్న దరిమిలా.. 10 రోజుల్లో దర్యాప్తు పూర్తి కాదు. ►ప్రభుత్వం ప్రతీకారమే తీర్చుకోవాలనుకుంటే.. ఈ పెద్దమనిషి (చంద్రబాబు నాయుడు) ఏనాడో అరెస్టు అయ్యేవారు కదా. ►సెక్షన్ 17A ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్న అమాయక సేవకులను (innocent servants) రక్షించడం కోసం మాత్రమే. ►శంభూ నాథ్ మిశ్రా కేసును ఉదహరిస్తూ.. ‘‘రికార్డులను రూపొందించడం, నిధుల్ని దుర్వినియోగం చేయడం అధికారిక విధి కాదు." ►కేసు దర్యాప్తు దశలోనే ఉంది. ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈడీ దర్యాప్తు చేస్తోంది. ►నేను సీఎంను(మాజీ) కాబట్టే.. అనే అంశం ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఇది రాజకీయమైంది ►ఎంవోయూలో సబ్ కాంట్రాక్ట్ ప్రస్తావనే లేదు. ఎలాంటి సేవలు అందించకుండానే షెల్ కంపెనీలకు నిధులు వెళ్లాయి. ► రూ. 3 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది ► షెల్ కంపెనీల జాడ తీస్తున్నాం ► నిబంధనలకు వ్యతిరేకంగా ఎంవోయూ నుంచి సబ్ కాంట్రాక్టుకు ఎలా వెళ్లింది? ► అన్ని బోగస్ కంపెనీలు కలిపి ప్రజాధనాన్ని లూటీ చేశాయి. ► ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది ► ఈ డీల్‌కు కేబినెట్ ఆమోదం లేదు ► చంద్రబాబు పథకం ప్రకారమే తన అనుచరులతో కలిసి బోగస్ కంపెనీల పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనం దోచుకున్నారు. ►మార్గదర్శకాలను కూడా కోర్టు అనుసరించాలి. విచారణ పూర్తయ్యే దాకా ఆగాలి. దర్యాప్తు సంస్థను నివేదిక సమర్పించేదాకా వేచి చూడాలి. మెరిట్స్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ. 02:55PM, సెప్టెంబర్ 19, 2023 చంద్రబాబు క్వాష్పిటిషన్కు అనర్హుడు : CID తరపు లాయర్లు ► చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు అనర్హుడు ► ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయలేదు. ► రెండేళ్లు అన్ని సాక్ష్యాలు సేకరించాకే అరెస్ట్ చేశారు. ► పోలీసులకు పూర్తి స్వేచ్చను ఇచ్చి.. క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలి ► సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లు అయినా వేయొచ్చు.. ఎంత మంది సాక్ష్యులను అయినా చేర్చొచ్చు. 02:38PM, సెప్టెంబర్ 19, 2023 సీఐడీ తరపున వాదనలు ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ► గణపతి వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు తో పాటు శంభునాథ్ మిశ్రా కేసు లో తీర్పుల్ని వివరిస్తున్న ముకుల్ రోహత్గీ ► చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు అనర్హుడంటూ వాదనలు ► ఈ దశలో నిందితుడికి అనుకూలంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని హైకోర్టుకు విజ్ఞప్తి 02:25PM, సెప్టెంబర్ 19, 2023 లంచ్ విరామం తర్వాత మొదలైన కోర్టు ►లంచ్ తర్వాత మొదలైన హైకోర్టు ► క్వాష్ పిటిషన్‌పై వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు 1:58 PM, సెప్టెంబర్ 19, 2023 హైకోర్టుకు లంచ్ బ్రేక్.. ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ లంచ్ తర్వాతకు వాయిదా ►లంచ్ తర్వాత వాదనలు వినిపించనున్న చంద్రబాబు లాయర్లు 1:40 PM, సెప్టెంబర్ 19, 2023 స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో బాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు ► చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరుపై అభ్యంతరాలున్నాయి ► ఒక వేళ ఈ FIR 2018 సవరణ కంటే ముందు నమోదై ఉంటే అడిగేవాళ్లం కాదు ► కానీ FIR 2020లో నమోదయింది కాబట్టి చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి ► 2020లో అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసినప్పుడు ఇలాగే జరిగింది ► కర్ణాటక కేసును ఉదహరించిన లూథ్రా, 17Aలో ముందస్తు అనుమతి అవసరమని వాదన 1:30 PM, సెప్టెంబర్ 19, 2023 ► చంద్రబాబును అరెస్ట్‌పై కాంగ్రెస్ ప్రకటన ► చంద్రబాబును అరెస్ట్‌పై మాట్లాడిన మధుయాష్కీ ► చంద్రబాబును జైలుకు పంపడం వెనుక మోదీ, కేసీఆర్ ఉన్నారు ► కేసీఆర్ పాత్ర పై మాకు పూర్తిస్థాయి సమాచారం ఉంది ► ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పనిచేసినందుకే చంద్రబాబుపై కక్షసాధింపు చర్యలు ► చంద్రబాబు అరెస్టు పై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించలేదు? : మధుయాష్కి 12:30 PM, సెప్టెంబర్ 19, 2023 ► స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో బాబు తరపున హరీష్ సాల్వే వాదనలు ► చంద్రబాబు అరెస్టులో సరైన నియామవళి పాటించలేదు ► చంద్రబాబు అరెస్టులో గవర్నర్ అనుమతి తీసుకోలేదు ► ప్రీవెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17A ప్రకారం అరెస్ట్ చూపించారు ► దీని ప్రకారం పోలీసులు గవర్నర్ అనుమతి తర్వాతే అరెస్ట్ చేయాలి ► ఈ కేసులో 2020లో FIR నమోదయింది, అప్పుడు బాబు పేరు లేదు ► అరెస్ట్ చేసే సమయానికి బాబు పేరు FIRలో లేదు ► FIRలో పేరు ఉంటేనే అరెస్ట్ చేయాలి కాబట్టి ప్రోసీజర్ సరిగా ఫాలో కాలేదు ► ఎన్నికలు వచ్చాయి కాబట్టి రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు ► సీమెన్స్ కంపెనీ రాసిన మెయిల్ ఆధారంగా APSSDC ఛైర్మన్ ఫిర్యాదు చేశారు ► స్కిల్ డెవలప్మెంట్లో సేవలందించింది సీమెన్స్‌కు చెందిన ఉప కంపెనీనే ► ప్రభుత్వం బాధ్యత నిధులు విడుదల చేయడం, సేవలు పొందడం ► CID ఆరోపించినట్టు ఎక్కడా సాక్ష్యాలను తారుమారు చేయలేదు ► ఈ కేసులో చంద్రబాబు సహకరిస్తున్నా.. అరెస్ట్‌కు తొందరపడ్డారు ► ముగిసిన హరీష్ సాల్వే వాదనలు 12:20 PM, సెప్టెంబర్ 19, 2023 ► స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసును విచారిస్తోన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ► కేసు నుంచి చంద్రబాబు పేరును తొలగించాలని క్వాష్ పిటిషన్ ► చంద్రబాబు తరపున వర్చువల్‌లో (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) హరీష్ సాల్వే వాదనలు ► చంద్రబాబు తరపున రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్థార్థ లూథ్రా, హరీష్ సాల్వే, సిద్దార్థ్ అగర్వాల్ ► CID తరపున సుప్రీం న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు 12:09PM, సెప్టెంబర్ 19, 2023 ► హైకోర్టు ముందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాం ► ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు లాయర్ల పిటిషన్ ► ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాం కేసును ఎల్లుండికి (ఈ నెల 21కి) వాయిదా వేసిన హైకోర్టు 11:30 AM, సెప్టెంబర్ 19, 2023 హైకోర్టులో మధ్యాహ్నం 12 తర్వాత రింగ్‌రోడ్డు కేసు విచారణ ► చంద్రబాబు రిమాండ్ పిటిషన్‌పై మధ్యాహ్నం 12 గంటలకు వాదనలు జరిగే అవకాశం ► సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే హాజరవుతారు, సమయం కావాలన్న బాబు లాయర్లు ► చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యర్ధనను అంగీకరించిన హైకోర్టు ► హరీష్ సాల్వే వల్ల జరిగిన ఆలస్యంపై CIDని అడిగిన హైకోర్టు ► తమకు అభ్యంతరం లేదని చెప్పిన ప్రభుత్వ న్యాయవాదులు 11:20 AM, సెప్టెంబర్ 19, 2023 పచ్చ మీడియా చెప్పని/చెప్పలేని అసలు నిజాలు ► అరెస్ట్ అక్రమమంటూ గొంతు చించుకుంటోన్న పచ్చమీడియా ► కేంద్ర సంస్థల నుంచి బాబుకు ఇప్పటివరకు వచ్చిన నోటీసులు ► కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి వచ్చిన ఏ ఒక్క నోటీసునూ బయటపెట్టని పచ్చ మీడియా Case - 1 ► ఆగష్టు 4న ఇన్‌కమ్‌టాక్స్ నుంచి చంద్రబాబుకు అందిన నోటీసు ► అమరావతి కాంట్రాక్టర్ల నుంచి 600 కోట్ల కాంట్రాక్టులో (సచివాలయం బిల్డింగ్) 119 కోట్లు (20 శాతం ) ముడుపులు ► బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరికి ఇచ్చానని చెప్పిన షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ ► ఆ నోటీసు గురించి ఇప్పటివరకు నోరు మెదపని బాబు, ఎల్లో మీడియా Case - 2 ► స్కిల్ డెవలప్మెంట్తో మాకు సంబంధం లేదని లిఖితపూర్వకంగా పంపిన సీమెన్స్ ► అయినా సీమెన్స్ కంపెనీ, చాలా గొప్ప పని బాబు చేశారంటూ ఎల్లోమీడియా ప్రచారం ► టెండర్ లేకుండా తరలిపోయిన 371 కోట్ల గురించి అధికారులను అడగాలని తిరకాసు ► ఈ కేసులో నలుగురిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసిన విషయం రహస్యం.! ► బాబు పర్సనల్ సెక్రటరీ మరియు మనోజ్ విదేశాలకు పారిపోయిన విషయం అత్యంత గోప్యం Case - 3 ► ఫిబ్రవరి 17,2020న ప్రెస్ నోట్ విడుదల చేసిన ఆదాయంపన్ను శాఖ ► స్వయంగా విడుదల చేసిన ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ► బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఫిబ్రవరి 13 ,2020న తనిఖీలు ► ఐటీ అధికారులు సోదాల్లో 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు ► దీనికి సంబంధించి చంద్రబాబుకు ఇన్‌కంటాక్స్ నోటీసులు ► ఇప్పటివరకు నోటీసుల గురించి ఎక్కడా కోట్ చేయని పచ్చమీడియా 11:15 AM, సెప్టెంబర్ 19, 2023 అల్లర్లను నమ్ముకున్న తెలుగుదేశం టీం ► గుంటూరు, విశాఖ, విజయవాడలో రోడ్లపైకి టిడిపి నేతలు ► ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీ చేస్తామంటూ ఏర్పాట్లు ► జన జీవనానికి ఇబ్బందులు వస్తాయని వద్దని చెప్పిన పోలీసులు ► పలు చోట్ల పోలీసులతో వాగ్వాదం, అల్లర్లు చేసేందుకు ప్రయత్నాలు ► గుంటూరులో తెలుగుదేశం ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ► నక్కా ఆనంద్ బాబు, డేగల ప్రభాకర్, నన్నపనేని రాజకుమారిని నిలువరించిన పోలీసులు ► పూజలు చేస్తామంటూ వేర్వేరు దారుల్లో గుళ్లకు వస్తోన్న టిడిపి నేతలు ► దుర్గగుడికి ఆటోలో వచ్చిన దేవినేని ఉమ, వినాయకుడి గుడి వద్ద ఉమను గమనించి నిలువరించిన పోలీసులు 11:00 AM, సెప్టెంబర్ 19, 2023 హైబ్రీడ్ మోడ్‌లో చంద్రబాబు కేసు విచారణ.! ► నేరుగా వాదిస్తాం, వర్చువల్‌గా వాదిస్తాం... ► హైకోర్టుకు చంద్రబాబు తరపున లాయర్ల విజ్ఞప్తి ► ఒక సీనియర్ లాయర్, మరో సీనియర్ లాయర్ వర్చువల్‌గా ► ఆన్లైన్లో వాదనలు వినాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి ► మధ్యాహ్నం తర్వాత కేసు విచారణ చేపట్టనున్న హైకోర్టు 10:30 AM, సెప్టెంబర్ 19, 2023 కస్టడీ ఇస్తారా? రిమాండ్ పొడిగిస్తారా? ► హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లపై నేడు విచారణ ► నేటితో ముగియనున్న నేటితో ముగియనున్న రిమాండ్ ► సాధారణ ప్రక్రియలో భాగంగా రిమాండ్ పొడిగించే అవకాశం ► హైకోర్టుకు చేరుకున్న అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ► మధ్యాహ్నం 12 గంటల తర్వాత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం 10:30 AM, సెప్టెంబర్ 19, 2023 ఏ కేసులో ఏ లాయర్ ? గంటకు ఫీజు ఎంత? ► చంద్రబాబు పిటిషన్లపై హేమాహేమీలను దించిన టిడిపి లీగల్ సెల్ ► చంద్రబాబు కోసం రంగంలోకి దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు ► క్వాష్ పిటిషన్‌పై వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లోథ్రా ► రిమాండ్ ఉత్తర్వుల సస్పెన్షన్, కస్టడీ ఇవ్వొందంటూ వాదించనున్న ముఖుల్ రోహత్గీ ► ఏపీ హైకోర్టులోనే మరో బెంచ్‌లో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ ► ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే వర్చువల్ వాదనలు ► గంటకు కోటి అయినా ఇచ్చేందుకు టిడిపి లీగల్ సెల్ సిద్ధమని ఢిల్లీలో చర్చలు 10:10 AM, సెప్టెంబర్ 19, 2023 ఏపీ హైకోర్టుకు చేరుకున్న లూథ్రా ► ఏపీ హైకోర్టుకు చేరుకున్న సీనియర్ లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా ► చంద్రబాబుపై నమోదయిన స్కిల్ కేసును కొట్టేయాలని లూథ్రా పిటిషన్ ► లూథ్రా వేసిన క్వాష్ పిటిషన్ ఇవ్వాళ హైకోర్టులో విచారణ ► గత పది రోజులుగా కేసుపై వీపరీతంగా ప్రిపేర్ అయిన లూథ్రా ► చంద్రబాబును విడిపించే బలమైన లాజిక్ దొరక్క లూథ్రా నిర్వేదం ► నిర్వేదంలో గురు గోవింద్ సింగ్, స్వామి వివేకానంద కొటేషన్లతో ట్వీట్లు Swami Vivekananda says in Karma Yoga - "A man must go about his duties without taking notice of the sneers and the ridicule of the world." And definitely not by those who have neither read nor understood the words of the venerable 1Oth guru who stood for justice and piety!! — Sidharth Luthra (@Luthra_Sidharth) September 14, 2023 10:00 AM, సెప్టెంబర్ 19, 2023 చంద్రబాబు కోసం దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు ► చంద్రబాబు తరపున దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు ► ముగ్గురు టాప్ మోస్ట్ లాయర్లతో టిడిపి లీగల్ సెల్ మంతనాలు ► ఇవ్వాళ హైకోర్టులో వాదనలు వినిపించనున్న ముగ్గురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ► సిద్ధార్ధ లూథ్రాతో పాటు హారీశ్ సాల్వే, సిద్ధార్ధ్ అగర్వాల్ ► ఇతర పనుల నిమిత్తం ఫ్రాన్స్‌లో ఉన్న హారీశ్ సాల్వే ► ఎక్కడ ఉన్నా.. ఇక్కడ వాదనలు వినిపించాలని హారీశ్ సాల్వేకు టిడిప లీగల్ సెల్ విజ్ఞప్తి ► ఫ్రాన్స్ నుంచి వర్చువల్ గా వాదనలు వినిపించనున్న హరీశ్ సాల్వే 9:00 AM, సెప్టెంబర్ 19, 2023 యనమలపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు.. ►చంద్రబాబు జైల్లో కూర్చుని విజన్ 2047 గురించి ఆలోచిస్తున్నారు. ►జాతీయ నేతలకు ధన్యవాదాలు చెప్పమన్నారని స్వయంప్రకటిత మేధావి యనమల రామకృష్ణుడు సెలవిస్తున్నారు. ►బెయిల్ కోసం ఆయన బెంబేలెత్తిపోతుంటే మీ బిల్డప్స్ ఏంటి రామా కృష్ణా!. చంద్రబాబు గారు జైల్లో కూర్చుని విజన్ 2047 గురించి ఆలోచిస్తున్నారని, జాతీయ నేతలకు ధన్యవాదాలు చెప్పమన్నారని స్వయంప్రకటిత మేధావి యనమల రామకృష్ణుడు సెలవిస్తున్నారు. బెయిల్ కోసం ఆయన బెంబేలెత్తిపోతుంటే మీ బిల్డప్స్ ఏంటి రామా కృష్ణా! — Vijayasai Reddy V (@VSReddy_MP) September 19, 2023 08:12AM, సెప్టెంబర్ 19, 2023 ►గుంటూరులో టీడీపీ నేతల పూజా కార్యక్రమాలు ►చంద్రబాబు బెయిల్ కోసం ప్రత్యేక పూజలు ►వినాయక మండపాల వద్ద టీడీపీ నేతల పూజలు ►ఆధ్యాత్మిక ప్రాంతాల్లో రాజకీయాలు చేయడం ఏంటని భక్తుల ఆగ్రహం 7:59 AM ఢిల్లీలో లోకేష్ వెంటే రఘురామ కృష్ణంరాజు ►రాజ్‌ఘాట్‌కు నారా లోకేష్, టీడీపీ మంత్రులు, ఎంపీలు ►అదే టీంలో రఘురామ కృష్ణంరాజు ►ఢిల్లీ వెళ్లినప్పటి నుంచి రఘురామ లాబీయింగ్‌పై ఆధారపడ్డ లోకేష్ ►బీజేపీ పెద్దల అపాయింట్మెంట్లు ఇప్పించాలని విజ్ఞప్తి ►పార్లమెంటు సమావేశాలతో కేంద్ర పెద్దలు బిజీ బిజీ ►ఎలాగైనా వారి దృష్టిలో పడేందుకు టీడీపీ బృందం విశ్వప్రయత్నాలు 07:30 AM, సెప్టెంబర్ 19, 2023 లోకేష్‌లో గుబులు ► ఇంకా ఢిల్లీలోనే చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ► ఎల్లో మీడియాలో లోకేష్ పై విపరీతంగా ప్రచారం ► రాజమండ్రి రాగానే లోకేష్ ను అరెస్ట్ చేస్తారంటున్న ఎల్లో మీడియా ► రాజమండ్రికి రావాలా? వద్దా? ఇంకొన్నాళ్లు ఢిల్లీలోనే ఉండాలా? ► ఎల్లో మీడియా చెప్పినట్టు అరెస్ట్ చేస్తే రాజమండ్రి కంటే ఢిల్లీ బెటరా? ► ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లతో లోకేష్ మంతనాలు ► తనకు వ్యతిరేకంగా ఏయే ఆధారాలున్నాయన్నదానిపై చర్చ ► ఇవ్వాళ ఢిల్లీలో ఎంపీలతో కలిసి ధర్నాలో పాల్గొనున్న లోకేష్ ► ఢిల్లీలో ఉదయం రాజ్ ఘాట్ సందర్శించనున్న లోకేష్ ► ఎక్కడికి వెళ్లినా వెంట టిడిపి ఎంపీలు ఉండాలని సూచించిన లోకేష్ 07:20 AM, సెప్టెంబర్ 19, 2023 పీక్స్‌కు చేరిన ఎల్లో మీడియా సానుభూతి ఆరాటం ► లోకేష్ ను అరెస్ట్ చేస్తారని ఎల్లో మీడియాలో భారీ ప్రచారం ► బాబును అరెస్ట్ కు లోకేష్ ను జత చేయాలని ఎల్లో మీడియా ఆరాటం ► ప్రజల్లో సానుభూతి తెచ్చుకొనేందుకు ప్రయాసలు ► ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేశ్‌ను అరెస్ట్ చేస్తారంటున్న ఎల్లో మీడియా ► ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే కొందరి అరెస్ట్ ► రెండేళ్ల నుంచి ఫైబర్ గ్రిడ్ కేసులో దర్యాప్తు ► ఈ రోజు రాత్రి లోకేశ్ రాజమండ్రి చేరుకునే అవకాశం ► రాజమండ్రికి లోకేష్ రాగానే CID అరెస్ట్ చేస్తుందంటూ పచ్చ ప్రచారం 07:00 AM, సెప్టెంబర్ 19, 2023 అసలు మన లాయర్లు ఏం చేస్తున్నారు? : చంద్రబాబు రుసరుస ► తన కేసు వాదిస్తోన్న లాయర్లతో కలుస్తానని నిన్న యనమలకు చెప్పిన చంద్రబాబు ► నేడు చంద్రబాబుతో సుప్రీంకోర్టు లాయర్ తో పాటు టీడీపీ లీగల్ సెల్ లాయర్లు కలిసే అవకాశం ► కేసులో సాంకేతిక లోపాలు ఏమున్నాయన్న దానిపై టిడిపి లీగల్ సెల్ రంధ్రాన్వేషణ ► ఏసీబీ కోర్టులో ఏం వాదించాలి? హైకోర్టులో క్వాష్ పిటిషన్ సందర్భంగా ఏం చెప్పాలి? ► బాబు కోసం భారీ కసరత్తు చేస్తోన్న సుప్రీంకోర్టు లాయర్లు 6:50 AM, సెప్టెంబర్ 19, 2023 టీడీపీవి బూటకపు వాదనలు.. ► స్కిల్ స్కామ్ కేసులో మనోజ్ వాసుదేవ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాసరావు దేశం విడిచి పారిపోయారు. ► వీరికి చంద్రబాబుతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ► ఈ కేసు విషయంలో టీడీపీ చేస్తున్నవన్నీ బూటకపు వాదనలు. ► స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.371 కోట్ల అవినీతి జరిగినట్టు ఐటీ, ఈడీ నిర్ధారించాయి. ► చంద్రబాబు షెల్ కంపెనీలకు నిధులు మళ్లించి, తర్వాత వాటిని స్వాహా చేశాడు. ► ఇన్నేళ్ళ తర్వాత ఈ కేసులో చట్టం చంద్రబాబును పట్టుకుంది. “స్కిల్ స్కామ్ కేసులో మనోజ్ వాసుదేవ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాసరావు దేశం విడిచి పారిపోయారు” - వీరికి చంద్రబాబుతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. - ఈ కేసు విషయంలో టీడీపీ చేస్తున్నవన్నీ బూటకపు వాదనలు. - స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.371 కోట్ల అవినీతి జరిగినట్టు ఐటీ, ఈడీ… pic.twitter.com/LScpdrWDGE — YSR Congress Party (@YSRCParty) September 18, 2023 06:30 AM, సెప్టెంబర్ 19, 2023 ఏసీ లేని గదిలో ఎవరయినా ఉంటారా? : బాబుకు కోపమొచ్చింది..! ► రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్ లో చంద్రబాబు ► పదో రోజుకు చేరుకున్న చంద్రబాబు రిమాండ్ ► నిన్న కుటుంబ సభ్యులను ములాఖత్ లో కలిసిన చంద్రబాబు ► కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేత యనమలతో బాబు చర్చలు ► తనకు గదిలో ఏసీ లేదని, ఇబ్బందిగా ఉందని బాబు తనతో చెప్పాడన్న యనమల ► కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్న జైలు అధికారులు ► చంద్రబాబు కాలక్షేపం కోసం అయిదు న్యూస్ పేపర్లు, టీవీ ► స్నేహా బ్లాక్ లో ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న చంద్రబాబు ► ఇంటి నుంచి అన్ని పూటల భోజనం, స్నానానికి వేడి నీళ్ల సదుపాయం 06:20 AM, సెప్టెంబర్ 19, 2023 హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ► స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నేడు హైకోర్టులో విచారణ ► చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ► జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరిన చంద్రబాబు ► చట్టవిరుద్ధంగా చంద్రబాబుని అరెస్ట్ చేశారని వాదించారన్న లాయర్ సిద్దార్థ లూథ్రా ► ఇవ్వాళ కౌంటర్ దాఖలు చేయనున్న CID ► అనంతరం ఇరు పక్షాల వాదనలు విననున్న హైకోర్టు 06:15 AM, సెప్టెంబర్ 19, 2023 హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నేడు హైకోర్టులో విచారణ ► బెయిల్ కోరుతూ పిటిషన్ వేసిన చంద్రబాబు ► చంద్రబాబు వేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం 06:10 AM, సెప్టెంబర్ 19, 2023 బాబును కస్టడీకి ఇవ్వండి : CID విజ్ఞప్తి ► ఏసీబీ కోర్టులో CID కస్టడీ పిటిషన్ ► స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్ ► కస్టడీకి ఇస్తే స్కాంకు సంబంధించి కీలక వివరాలు రాబడతామన్న సీఐడీ 6:00 AM, సెప్టెంబర్ 19, 2023 బెయిల్, మధ్యంతర బెయిల్.. ACB కోర్టులో నేడు విచారణలు ► ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ ► చంద్రబాబు తరపున మరో పిటిషన్, మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ ► బెయిల్ తో పాటు మధ్యంతర పిటిషన్ పై నేడు విచారణ. -
గెజిట్‌లో భూములు గల్లంతు!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం సర్వే చేశారు.. అలైన్మెంట్ ఖరారు అయింది. భూమి వివరాల ఆధారంగా మూడు గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వాటిపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం తంతూ పూర్తయింది.. ఇక పరిహారం పంపిణీకి రంగం సిద్ధమైంది. కానీ తాజాగా హెక్టార్ల కొద్దీ భూమి వివరాలు రికార్డుల్లోకి రాలేదని గుర్తించారు. ఇప్పటివరకు జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లలో వాటి వివరాలు లేకపోవడంతో హడావుడిగా ఆ భూములకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్లు జారీ ప్రక్రియ ప్రారంభించారు. వీటికి తొలుత 3ఏ (క్యాపిటల్), ఆ తర్వాత 3డీ నోటిఫికేషన్లు ఇస్తూ, వాటిపై అభ్యంతరాలు స్వీకరించి గ్రామ సభల్లో సమాధానాలు చెప్పాలి. ఆ తర్వాతే పరిహారం ప్రక్రియ మొదలుపెట్టాల్సి ఉంది. ఏడాదిన్నర తర్వాత గుర్తింపు! రీజినల్ రింగురోడ్డులో సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు నిర్మించే ఉత్తర భాగానికి సంబంధించిన ప్రక్రియ 2021లోనే మొదలైన విషయం తెలిసిందే. సర్వే ప్రక్రియ పూర్తి చేసి అలైన్‌మెంటు ఖరారయ్యాక గతేడాది మార్చిలో తొలి గెజిట్ నోటిఫికేషన్ 3ఏ (స్మాల్ ఏ) జారీ అయింది. అందులో ఎక్కడ ఎన్ని కి.మీ. రోడ్డు నిర్మాణం కానుందో వెల్లడించారు. ప్రభావితమయ్యే భూముల వివరాలు కూడా సేకరించారు. అనంతరం ఏప్రిల్‌లో 3ఏ (క్యాపిటల్ ఏ) నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో సేకరించే భూమి వివరాలను సర్వే నంబర్లు, విస్తీర్ణం వారీగా ప్రచురించారు. ఆ తర్వాత పట్టాదారు పేర్లతో 3డీ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. అయితే మధ్యలో చాలా భూముల వివరాలు గల్లంతైన విషయాన్ని మాత్రం గుర్తించలేదు. ఇప్పుడు పరిహారం పంపిణీకి వివరాలు సిద్ధం చేస్తున్న క్రమంలో లెక్కల్లో తేడాలొచ్చాయి. 162 కి.మీ. ఉత్తర భాగం రింగురోడ్డుకు సంబంధించి 2 వేల హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. కానీ పరిహారం లెక్కించే తరుణంలో భూమి తక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో మొదటి నుంచి చూస్తూ రాగా, దాదాపు 450 ఎకరాల భూమి వివరాలు గల్లంతైనట్టు గుర్తించారు. సర్వే నెంబర్ల వారీగా వాటి వివరాలు తీసి ఇప్పుడు నోటిఫికేషన్లు జారీ చేయటం ప్రారంభించారు. ఇందులో భాగంగా తాజాగా యాదాద్రి, ఆందోల్–జోగిపేట భూసేకరణ అథారిటీ (కాలా)ల పరిధిలోని భూములకు సంబంధించి 3ఏ (క్యాపిటల్ ఏ) నోటిఫికేషన్‌ను ఎన్హెచ్ఏఐ జారీ చేసింది. యాదాద్రి కాలాకు సంబంధించి గతేడాది ఏప్రిల్‌లో 185 హెక్టార్ల భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వగా, ఇప్పుడు గల్లంతైన మరో 19.20 హెక్టార్ల భూమికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అందోల్–జోగిపేట కాలా పరిధికి సంబంధించి గతేడాది 94.38 హెక్టార్ల భూమికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వగా, గల్లంతైన 15.05 హెక్టార్లకు సంబంధించి తాజాగా జారీ చేశారు. వీటిపై అభ్యంతరాలు వెల్లడించేందుకు సంబం«దీకులకు గడువు ఇచ్చారు. పొరపాటు కాదు.. ఇది పొరపాటుగా జరిగింది కాదని అధికారులు చెబుతున్నారు. ‘రీజినల్ రింగురోడ్డు అలైన్‌మెంటును ప్రాథమికంగా గూగుల్ మ్యాపు ఆధారంగా చేశారు. ఈ ప్రక్రియలో కొన్ని వివరాలు గల్లంతయ్యే పరిస్థితి ఉంటుంది. నిజాం కాలం నాటి లెక్కల్లో కొన్ని వివరాలు సరిగా లేకపోవటం కూడా దీనికి కారణం..’అని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. -
Rs 100 Crore Per Acre In Kokapet: కోకాపేటలో ఎకరం 100 కోట్లు.. ఏముందక్కడ? ఎందుకంత స్పెషల్? (ఫోటోలు)
-
హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మరో భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగేసింది. ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టు తుది సర్వేకు పచ్చజెండా ఊపింది. ఇందు కోసం రూ.14 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. ఓవైపు రీజనల్ రింగ్ రోడ్డు, మరో వైపు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు.. ఈ రెండు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల మూలంగా హైదరాబాద్ నగరంతో పాటు, నగరం చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో స్పష్టమైన సానుకూల మార్పులు రావడం ఖాయమన్నారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. హైదరాబాద్ నలువైపుల ఉన్నటువంటి రైల్వే లైన్లను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందన్నారు. ప్రజారవాణాతో పాటుగా వస్తువుల రవాణా కూడా పెరిగి, వ్యాపారపరంగా గణనీయమైన అభివృద్ధికి బాటలు పడతాయని ఆయన అన్నారు. ఇదివరకూ రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కొత్తగా రైల్వే సదుపాయం లభిస్తుందని, ఆయా ప్రాంతాల నుండి హైదరాబాద్ నగరానికి తొందరగా, ఈజీగా చేరుకోవచ్చని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు చుట్టుక్కల వచ్చే పరిశ్రమలు, మాల్స్, వినోద కేంద్రాలు, శాటిలైట్ టౌన్స్ మొదలైన వాటి ద్వారా లక్షలాది కొత్త ఉద్యోగాలు వస్తాయని, దీని ద్వారా విద్య, వ్యాపారం, ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున పెరగటంతో పాటు, మెడికల్ సౌకర్యాలు కూడా సమయానికి అందుబాటులో ఉంటాయని కిషన్ రెడ్డి అన్నారు. ఈ సమయంలో ఈ సరికొత్త రైల్వే ప్రాజెక్టు ద్వారా సౌలభ్యం చాలా పెరుగుతుందన్నారు. ఓవరాల్‌గా హైదరాబాద్‌తోపాటుగా తెలంగాణ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు చాలా కీలకంగా మారనుందని ఆయన అన్నారు. దీంతో పాటుగా కరీంనగర్-హసన్‌పర్తి మధ్య 61 కిలోమీటర్ల రైల్వే లైన్ సర్వే కోసం కోటిన్నర రూపాయలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ పనులను సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో రూ.330 కోట్లతో చేపట్టనున్నట్లు వెల్లడించారు. ముందుగా నిర్ణయించుకున్న దాని ప్రకారం మూడింట రెండొంతుల ఖర్చును (2/3) రాష్ట్రం భరించాల్సిన ఉన్నా.. వారు ముందుకు రాకపోవడంతో మొత్తం ఖర్చును కేంద్రమే భరించేందుకు ముందుకొచ్చిందన్నారు. రాష్ట్రాల్లో జరిగే అభివృద్ధి పనులకు.. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మూలధన వ్యయాలకు సమయానుగుణంగా మరింత సహకారాన్ని అందించేందుకు 2020-21లో కేంద్రం ప్రారంభించిన ‘రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి ప్రత్యేక సహాయ పథకం’లో భాగంగా.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2,102 కోట్లను కేంద్రం మంజూరుచేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా కారణంగా రాష్ట్రాలకు జరిగిన నష్టం నుంచి కొంతమేరకు ఉపశమనం కల్గించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలకు 50 సంవత్సరాలకు గానూ వడ్డీ లేని రుణంగా.. ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2020-21 నుంచి 2023-24 వరకు తెలంగాణ రాష్ట్రానికి రూ.5,221.92 కోట్లు మంజూరు చేసింది. చదవండి: ఈటలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన వివిధ పథకాలను, కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయటానికి, అభివృద్ధి చెందుతున్న వ్యాధుల నిర్ధారణకు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహకారాన్ని అందించటానికి వీలుగా అత్యాధునిక వ్యాధి నిర్ధారణ సౌకర్యాలతో కూడిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయటానికి గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కిషన్ రెడ్డి తెలిపారు. అయితే జినోమ్ వ్యాలీలో ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భూమిని రాష్ట్రం ఇంతవరకు బదలాయించలేదని కిషన్ రెడ్డి తెలిపారు. ఇది రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టని.. ఇలాంటి వాటిని ఎంత త్వరగా పూర్తిచేసుకుంటే రాష్ట్ర ప్రజలకు అంత ఎక్కువ మేలు జరుగుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవలే గోవాలో ముగిసిన జీ20 పర్యాటక మంత్రుల స్థాయి సమావేశాలు చాలా ఫల ప్రదంగా జరిగాయని, గోవా రోడ్ మ్యాప్ ద్వారా ప్రపంచ పర్యాటక రంగాభివృద్ధితోపాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారత పర్యాటకాన్నిసరికొత్త పుంతలు తొక్కించేందుకు.. సెప్టెంబర్‌లో ఢిల్లీలో గ్లోబల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం మార్పుపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని, ఈ విషయంలో వస్తున్న వార్తలన్నీ పూర్తి అవాస్తవాలని ఆయన అన్నారు. -
4 డిజైన్లలో ఇంటర్ ఛేంజర్లు
సాక్షి, హైదరాబాద్ : రీజినల్ రింగురోడ్డులో నాలుగు రకాల డిజైన్లలో ఇంటర్ ఛేంజ్ స్ట్రక్చర్లు రాబోతున్నాయి. జాతీయ రహదారులు, ప్రధాన రాష్ట్ర రహదారులను రింగురోడ్డు క్రాస్ చేసే చోట్ల భారీ ఇంటర్ ఛేంజ్‌లను నిర్మించనున్న విషయం తెలిసిందే. రింగురోడ్డు ఉత్తర భాగంలో 11 ప్రాంతాల్లో ఇలాంటి కూడళ్లు ఉండనున్నాయి. రింగురోడ్డు మీదుగా వెళ్లే వాహనాలు, ఇతర రోడ్ల మీదుగా వెళ్లే వాహనాలు పరస్పరం అడ్డు రాకుండా వేటికవే రోడ్లు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా క్రాస్ అవుతాయి. ఒక రోడ్డు నుంచి మరో రోడ్డులోకి వాహనాలు మారేందుకు వీలుగా ఇంటర్‌ఛేంజ్ లూప్స్‌ను నిర్మిస్తారు. ఇప్పుడు ఈ స్ట్రక్చర్లకు సంబంధించి అధికారులు రూపొందించిన డిజైన్లు ఆసక్తి రేపుతున్నాయి. ఆయా క్రాసింగ్స్‌లో ఉండే ట్రాఫిక్ ఒత్తిడి, అనుసంధానమయ్యే రోడ్ల సంఖ్య ఆధారంగా లూప్స్ వైశాల్యం, సంఖ్య ఆధారపడి ఉంటాయి. ఇందుకోసం నాలుగు డిజైన్లను ఖరారు చేసి, ఆ ప్రాంతంలో ఉండే పరిస్థితికి తగ్గట్టుగా వాటిని ఎంపిక చేయబోతున్నారు. ట్రంపెట్ ఆకృతిలో లూప్ నిర్మాణం సాధారణంగా ప్రధాన రోడ్లను ఇతర రోడ్ల మీదుగా వచ్చే వాహనాలను అనుసంధానించేందుకు ట్రంపెట్ (సంగీత పరికరం) ఆకృతిలో లూప్ నిర్మిస్తారు. రోడ్ల సంఖ్య ఎక్కువగా ఉంటే రెండు ట్రంపెట్ల ఆకృతిలో నిర్మిస్తారు. క్లవర్ లీఫ్ (నాలుగు ఆకులతో కూడిన మొక్క భాగం) ఆకృతిలో కూడా విరివిగా నిర్మిస్తారు. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డులో ఈ రెండు ఆకృతుల్లో ఇంటర్‌ఛేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు వీటితోపాటు డంబెల్ (వ్యాయామ ఉపకరణ) ఆకృతితోపాటు రౌండ్ ఎ»ౌట్ (పూర్తి వృత్తం)లో కూడా నిర్మించాలని నిర్ణయించారు. గిర్మాపూర్, చౌటుప్పల్ వద్ద డంబెల్ ఆకృతిలో నిర్మాణాలు నాగ్‌పూర్ జాతీయ రహదారి, రాజీవ్ రహదారుల మీద రెండు ప్రాంతాల్లో క్లవర్ లీఫ్ నమూనాను ఎంపిక చేశారు. శివంపేట, రాయగిరిల వద్ద డబుల్ ట్రంపెట్ డిజైన్‌ను ఎంపిక చేశారు. రీజినల్రింగ్రోడ్డు ప్రారంభ ప్రాంతమైన గిర్మాపూర్, ముగింపు ప్రాంతమైన చౌటుప్పల్‌తోపాటు జాతీయ రహదారి 161ఏ మీద డంబెల్ ఆకృతిలో నిర్మించాలని భావిస్తున్నారు. మరో మూడు చోట్ల రౌండ్ ఎ»ౌట్లను ఎంపిక చేశారు. మిగతావి పరిశీలనలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్ ఛేంజ్ స్ట్రక్చర్లకు భారీగా స్థలాన్ని సేకరించే విషయంలో స్థానికులతో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో డిజైన్లలో కొన్ని మార్పుచేర్పులు జరిగే అవకాశం ఉంది. రీజినల్ రింగురోడ్డుకు సంబంధించి భూసేకరణలో భాగంగా కీలక 3డీ గెజిట్ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ ఆందోల్–జోగిపేట, యాదాద్రి భువనగిరి, చౌటుప్పల్.. ఈ మూడు కాలా అథారిటీలో పూర్తయిన విషయం తెలిసిందే. వీటి పరిధిలో త్వరలో టెండర్ల ప్రక్రియ కూడా మొదలుకానున్నందున ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్లపై త్వరలో నిర్ణయంతీసుకోనున్నారు. మిగతా కాలా అథారిటీల పరిధిలో 3డీ గెజిట్ నోటిఫికేషన్ జారీకి కొంత సమయం ఉన్నందున, మరో నెల రోజుల్లో ఆయా ప్రాంతాల్లోని స్ట్రక్చర్లను ఖరారు చేయనున్నారు. 120 ఎకరాల విస్తీర్ణంలో.. రీజినల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగంలో వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతాల్లో నిర్మించే ఇంటర్ ఛేంజ్ నిర్మాణాలు ఒక్కోటి దాదాపు 120 ఎకరాల విస్తీర్ణంలో ఉండనున్నట్టు తెలిసింది. వాహనాలు ఇంటర్‌ఛేంజ్ లూప్స్ మీదుగా, వాటికి నిర్మించే ర్యాంప్స్ మీదుగా కూడా గంటకు 50 కి.మీ. మించిన వేగంతో వెళ్లేందుకు వీలుగా వీటిని విశాలంగా నిర్మించాలని నిర్ణయించారు. తొలుత 70 ఎకరాల విస్తీర్ణంలోనే నిర్మించాలని అనుకున్నా.. వాహనాల వేగం గంటకు 30 కి.మీ.లోపే నియంత్రించాల్సిన పరిస్థితి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
Hyderabad: ఓఆర్ఆర్.. రింగ్‌మెయిన్.. మెట్రో..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ అభివృద్ధి ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ చక్కర్లు కొడుతోంది. పలు కీలక ప్రాజెక్టులు, ప్రతిపాదనలు.. సర్కారు ప్రణాళికలు ఈ రహదారి కేంద్రంగానే సాగుతున్నాయి. మహా నగరానికి మణిహారంలా 158 కిలోమీటర్ల మేర విస్తరించిన ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ నగరం నలుమూలలకు కృష్ణా, గోదావరి జలాలను కొరత లేకుండా సరఫరా చేసేందుకు భారీ తాగునీటి పైపులైన్ ఏర్పాటుకు గతంలో ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. తాజాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎక్స్‌ప్రెస్ మెట్రో మార్గం ఏర్పాటుకు పునాది రాయి వేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఔటర్ చుట్టూ మెట్రో ప్రతిపాదన చేయడంతో ఈ అంశం సైతం సర్వత్రా చర్చనీయాంశమైంది. పైపులైన్ ఏర్పాటు ఇలా.. గ్రేటర్‌కు మణిహారంలా ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ జలహారం ఏర్పాటు పనుల్లో ఇప్పటికే సుమారు 48 కి.మీ మేర పనులు పూర్తయ్యాయి. మరో 110 కి.మీ మార్గంలో పనులు చేపట్టాల్సి ఉంది. పనుల పూర్తికి రూ.4,725 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసింది. ప్రస్తుతం నగరానికి ఎల్లంపల్లి (గోదావరి), కృష్ణా జలాలను సరఫరా చేస్తున్నారు. ఈ జలాలను నగరం చుట్టూ మణిహారంలా ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ 3,000 ఎంఎం డయా వ్యాసార్థం గల భారీ పైప్‌లైన్ ఏర్పాటు చేసి వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేయాలి. దీంతో నగరం నలుమూలలకు కొరత లేకుండా తాగునీటిని సరఫరా చేయవచ్చు. గతంలో పూర్తిచేసిన 48 కి.మీటర్లకు అదనంగా మరో 110 కి.మీ మార్గంలో పనులు చేపట్టాల్సి ఉంది. జలాల నిల్వకు వీలుగా రెండు భారీ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను సైతం నిర్మించాల్సి ఉంటుంది. వీటిలో కృష్ణా, గోదావరి జలాలను నిల్వ చేయాలి. ఔటర్‌కు మెట్రో హారం.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ మెట్రో మార్గం దాదాపు 20 కిలోమీటర్ల మేర ఔటర్‌కు ఆనుకొనే వెళ్లనుంది. ఇక ఓఆర్ఆర్ లోపల కీలక ప్రాంతాలను అనుసంధానిస్తూ ఔటర్ చుట్టూ మెట్రో మార్గం ఏర్పాటు చేసిన పక్షంలో ఓఆర్ఆర్ లోపలున్న 190 గ్రామాలు, 30కి పైగా నగరపాలక సంస్థలకు కనెక్టివిటీ పెరగడంతో పాటు ఐటీ, బీపీఓ, కేపీఓ, ఫారా>్మ, బయోటెక్,తయారీ రంగం, లాజిస్టిక్స్, హార్డ్‌వేర్, ఏవియేషన్ తదితర రంగాల సత్వర, సమగ్ర అభివృద్ధికి బాటలు పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. అభివృద్ధిలో మహానగరం జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుండడంతో ఔటర్ రింగ్‌రోడ్డు వరకు పలు అభివృద్ధి ప్రాజెక్టులు, రియలీ్ట, నిర్మాణ రంగ ప్రాజెక్టులు విస్తరించిన నేపథ్యంలో మెట్రో కనెక్టివిటీ ఆయా ప్రాంతాలకు అత్యావశ్యకమని విశ్లేషిస్తున్నారు. చదవండి: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ కుంభకోణం? -
హైదరాబాద్ ఆర్ఆర్ఆర్.. 320 కి.మీ.
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద రింగ్‌రోడ్డుకు మార్గం సుగమమైంది. భాగ్యనగరం చుట్టూ దాదాపు 320 కి.మీ. చుట్టూ నిర్మించతలపెట్టిన హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)లో ఉత్తర భాగానికి ఈ సంవత్సరమే మార్గం సుగమమైంది. 158.46 కి.మీ. పొడవైన ఈ భాగానికి తుది అలైన్‌మెంటు సిద్ధమైంది. మరో నెలరోజుల్లో భూసమీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. నాగ్‌పూర్‌కు చెందిన కే అండ్ జే కన్స్ట్రక్షన్స్ కన్సెల్టెన్సీ ఆధ్వర్యంలో నాలుగు అలైన్‌మెంటు ఆప్షన్లు రూపొందగా.. అందులో జాతీయ రహదారుల అధీకృత సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆప్షన్–ఏను ఎంపిక చేసింది. గతంలో అలైన్‌మెంటు రూపొందినప్పుడు కాళేశ్వరం నీటితో నింపే రిజర్వాయర్లకు ప్రణాళికలు లేవు. ఈ నేపథ్యంలో అలాంటి కాలువలు, చానళ్లు, జలాశయాలకు ఇబ్బందిలేకుండా ఆయా ప్రాంతాల్లో అలైన్‌మెంటును మళ్లిస్తూ కొత్త అలైన్‌మెంటును రూపొందించారు. దీనికే ఎన్హెచ్ఏఐ మొగ్గు చూపింది. నాలుగు వరసల ఈ రోడ్డు నిర్మాణానికి రూ.7,512 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సంగారెడ్డి–తూప్రాన్–గజ్వేల్–జగదేవ్‌పూర్–యాదాద్రి–భువనగిరి–చౌటుప్పల్ పట్టణాలను అనుసంధానిస్తూ ఈ రోడ్డు నిర్మాణం కానుంది. దక్షిణ భాగం కోసం కసరత్తు దాదాపు 180 కి.మీ. పొడవుతో రూపుదిద్దుకోవాల్సిన దక్షిణ భాగం రింగ్‌రోడ్డుకు సంబంధించిన అంశం కేంద్రప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఉత్తర భాగంతో పోలిస్తే దక్షిణ భాగం మార్గంలో ప్రస్తుతం వాహనాల సంచారం తక్కువగా ఉందని ఇటీవల జాతీయ రహదారుల విభాగం అధ్యయనంలో తేలింది. ప్రత్యేకంగా ఓ ప్రైవేటు సంస్థకు బాధ్యత అప్పగించి సర్వే చేయించగా, దీని నివేదిక కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. వాహనాలు తక్కువగా ఉన్నప్పుడు నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్ వే తరహా రోడ్డు నిర్మాణం ఎంతవరకు ఉపయోగం అన్న విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. అయితే, ఒకసారి రింగ్ అలైన్మెంట్ సిద్ధమైతే.. ఆ రోడ్డు మీదుగా తిరిగే వాహనాల సంఖ్య ఉత్తర భాగం తరహాలోనే ఉంటుందని, పూర్తి రింగుగా ఈ రోడ్డు నిర్మితమైతేనే ఉపయోగం ఉంటుందని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తెచ్చింది. దీనికి సానుకూలంగానే కేంద్రం పరిశీలిస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. -
యాదాద్రి రింగ్‌రోడ్డు.. అందాలు మెండు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక భావంతోపాటు ఆహ్లాద వాతావరణం కలిగేలా వైటీడీఏ ఏర్పాట్లు చేస్తోంది. యాదాద్రి కొండ చుట్టూ ఏర్పాటు చేస్తున్న రింగ్‌రోడ్డుకు ఇరువైపులా పూల మొక్కలు నాటుతోంది. ప్రెసిడెన్షియల్ సూట్‌కు సమీపంలో నిర్మించిన సర్కిల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దింది. 60 మీటర్లతో ఏర్పాటు చేసిన ఈ సర్కిల్లో చెన్నై నుంచి తెచ్చిన ఫీనిక్స్ ఫాం జాతి మొక్కలతోపాటు సీజనల్ పూల మొక్కలను నాటారు. దీంతో ఇప్పుడు ఆ సర్కిల్ రంగుల వలయంలా మారి ఆకట్టుకుంటోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్ యాదాద్రి భువనగిరి యూరియా.. రైతుల బాధ ఇదయా! కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు ఉదయం 3 గంటల నుంచే క్యూలైన్లో నిలబడ్డారు. ఉదయం 10 గంటల వరకు కూడా అధికారులు రాకపోవడంతో వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వచ్చింది వచ్చినట్లుగానే లారీల్లో నుంచి యూరియా ఖాళీ అయిపోయింది. అయితే చాలామంది మొక్కజొన్న రైతులకు యూరియా అందలేదు. ఇప్పటి వరకు 538 టన్నుల యూరి యా పంపిణీ చేశామని, మరో 150 టన్నులు వస్తే ఈ సీజన్‌కు యూరియా సరిపోతుందని వ్యవసాయాధికారి ప్రజాపతి తెలిపారు. యూరి యా కోసం రైతులు ఆందోళన చెందనవసరం లేదన్నారు. –సదాశివనగర్ (ఎల్లారెడ్డి) జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో ధరూరు/దోమలపెంట(అచ్చంపేట): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ప్రాజెక్టుకు 1,00,900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఇన్‌ఫ్లో తగ్గడంతో ఉదయం ప్రాజెక్టు 15క్రస్టు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం 10 క్రస్టు గేట్లను ఎత్తి 67,710 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి, ఎత్తిపోతల పథకాలకు కలిపి మొత్తం 1,00,948 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వైపు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.914 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా, శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేసుల నుంచి 1,45,169 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. రెండు క్రస్టు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 55,692 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 64,487క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. -
యాదాద్రి రింగ్‌రోడ్డు మ్యాప్ సమర్పించండి
సాక్షి, హైదరాబాద్ : యాదాద్రి చుట్టూ నిర్మిస్తున్న రింగ్ రోడ్డు మ్యాపును, దీనికి సంబంధించి రోడ్లు భవనాల శాఖ (ఆర్అండ్బీ) ఈఈ రాసిన లేఖనూ సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం, భారీ మర్రి చెట్టును తొలగిస్తున్నారని, దీన్ని ఆపేలా ఆదేశించాలంటూ తెలంగాణ వానరసేన సంస్థ అధ్యక్షుడు ఎన్.రామిరెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిల ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఈ ఆలయాలను తొలగించాల్సి వస్తోందని, ఈ మేరకు ఆర్అండ్బీ శాఖ ఈఈ లేఖ రాశారని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఈఈ లేఖను తమకు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించింది. రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగానే ఈ ఆలయాన్ని తొలగించాల్సిన అవసరం ఏర్పడిందని నిరూపించేందుకు రింగ్ రోడ్ నిర్మాణ మ్యాప్ సమర్పించారా అంటూ నిలదీసింది. అరకొర సమాచారంతో ప్రభుత్వం నివేదిక సమర్పించిందని, వాస్తవాలను దాచిపెట్టి వాదనలు వినిపిస్తోందంటూ అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల సమర్పణకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో అనుమతిస్తూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఆలయం, మర్రిచెట్టును తొలగించరాదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పొడిగించింది. -
యాక్షన్ ప్లాన్ ఏమైనట్టూ ?
సాక్షి, గజ్వేల్: గజ్వేల్‌లో రూ. 220 కోట్ల వ్యయంతో చేపట్టిన ‘రింగు’ రోడ్డు పనులను పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం ప్రకటించిన ‘యాక్షన్ ప్లాన్’ అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా కొసరు పనుల్లో ఏడాదిగా స్తబ్ధత నెలకొన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌ను రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలబెట్టడానికి తాపత్రయపడుతుండగా... అధికార యంత్రాంగం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నది. రింగు రోడ్డు నిర్మాణం 22 కిలోమీటర్ల మేర జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు 16 కిలోమీటర్ల పైన పనులు పూర్తికాగా.. కొసరు పనుల్లో అంతులేని నిర్లక్ష్యం అలుముకుంది. ఈ రోడ్డుకు అనుబంధంగా ఉన్న రేడియల్ రోడ్ల నిర్మాణంలోనూ జాప్యం కొనసాగుతోంది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ నుంచి ఇందిరాపార్క్, అక్కడి నుంచి ఎంపీడీఓ కార్యాలయం, పిడిచెడ్ రోడ్డు, ముట్రాజ్‌పల్లి రోడ్డు, తూప్రాన్ రోడ్డు, సంగాపూర్ రోడ్డు వరకు విపరీతమైన ట్రాఫిక్ సమస్య నెలకొనడంతో ప్రజలకు తీవ్రమైన ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి ఇక్కడ సంత జరిగే బుధవారం ప్రధాన రహదారిపై కొంతభాగంలో వాహనాల మాటేమో గానీ, అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఇదే మార్గం గుండా భారీ వాహనాలు వెళ్లాల్సి రావడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతున్నది. ఈ క్రమంలోనే ఎన్నో ప్రమాదాలు జరుగుతుండగా ప్రాణనష్టం సంభవిస్తున్నది. 2014 ఏప్రిల్ 9న గజ్వేల్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంలో, 18న ‘మెతుకుసీమ గర్జన’ పేరిట నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు వచ్చిన సందర్భంలో ట్రాఫిక్ సమస్యను కేసీఆర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ మెతుకుసీమ గర్జన సభలో కేసీఆర్ ట్రాఫిక్ సమస్యను ప్రధానంగా ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గజ్వేల్‌కు రింగ్ రోడ్డు నిర్మించి ట్రాఫిక్ బాధలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే గజ్వేల్‌లో నిర్వహించిన మొదటి సభలోనే పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం తొలుత రూ.90కోట్ల నిధులు మంజూరు చేశారు. ‘రింగ్’ రోడ్డును పట్టణంలోని 133/33 కేవీ సబ్‌స్టేషన్ నుంచి ధర్మారెడ్డిపల్లి గ్రామ శివారు, జాలిగామ శివారు, బయ్యారం చౌరస్తా, క్యాసారం, ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్టాండ్ సమీప ప్రాంతం, శ్రీగిరిపల్లి, హషీమ్ కళాశాల సమీప ప్రాంతం, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ పాలిటెక్నిక్‌ల మీదుగా తిరిగి సబ్‌స్టేషన్ వరకు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ రోడ్డు పూర్తిచేస్తే ఈ రహదారి వెంటే భారీ వాహనాలు వెళ్లే అవకాశముండగా ట్రాఫిక్ సమస్యలు తొలగిపోనున్నాయి. 207 ఎకరాల సేకరణ పూర్తి ముందుగా గజ్వేల్ చుట్టూ 19కిలోమీటర్ల రింగ్‌గా 30 మీటర్ల వెడల్పుతో నిర్మించాలనుకున్నారు...ఇందుకోసం 140 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత డిజైన్ మళ్లీ మార్చారు.. ఈ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించాలని చివరకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం 22 కిలోమీటర్ల పొడవున రింగురోడ్డు నిర్మాణం జరుగనుంది. 209 ఎకరాలకు పైగా భూసేకరణ చేపట్టాలని తుది నిర్ణయానికి వచ్చిన సంగతి విధితమే. కొత్త డిజైన్ ప్రకారం రింగురోడ్డు అంచనా విలువను రూ. 220 కోట్లకు పెంచిన సంగతి కూడా తెలిసిందే. కొత్త డిజైన్‌లో పిడిచెడ్, సంగాపూర్, ధర్మారెడ్డిపల్లి రేడియల్ రోడ్లు కూడా ఉన్నాయి. 209 ఎకరాల భూసేకరణ లక్ష్యానికిగానూ ఇప్పటి వరకు 207 ఎకరాలను సేకరించగలిగారు. ప్రస్తుతం ప్రజ్ఞాపూర్, ముట్రాజ్‌పల్లి, గజ్వేల్‌లలో పాక్షికంగా భూసేకరణ ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. ఈ పరిస్థితి వల్ల ఆయా ప్రదేశాల్లో పనులు ముందుకు సాగడం లేదు. మరోవైపు రేడియల్ రోడ్ల నిర్మాణాల్లోనూ జాప్యం అలుముకుంది. గజ్వేల్ పట్టణానికి ప్రధాన మార్గాల్లో ఒక్కటైన సంగాపూర్ రోడ్డు కమాన్ వద్ద పనులు అర్ధంతరంగా నిలిచిపోవడం వల్ల నిత్యం కిక్కిరిసి ఉండే ఆ రహదారిపై జనం నానా ఇక్కట్లు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక సంత రోజు పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. రైల్వే పనుల కారణంగానే.. మొత్తంగా రింగురోడ్డు 22 కిలోమీటర్ల మేర పనులు జరగాల్సి ఉండగా... 16కిలోమీటర్లు మాత్రమే జరిగాయి. మిగిలిన 6కిలో మీటర్లలో 2కిలోమీటర్ల మేర రైల్వే బ్రిడ్జీలు, రైల్వే పనుల కారణంగా రింగురోడ్డు పనులు నిలిచిపోయినట్లు చెబుతున్నారు. మిగతా 4 కిలోమీటర్లలో భూసేకరణ పెండింగ్, ఇతర కారణాలను పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రింగు రోడ్డుకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చారు. వీలైనంత తొందరగా ఈ రోడ్డును అందుబాటులోకి తెచ్చి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని ఆదేశించారు. కానీ... యంత్రాంగం సీఎం ఆశయాలకనుగుణంగా పనిచేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పనులను పూర్తి చేయడానికి ప్రత్యేకమైన యాక్షన్‌ప్లాన్‌తో ముందుకు సాగుతామని గత కొన్ని నెలల క్రితం అధికారయంత్రాంగం ప్రకటించింది. కానీ.. ఈ వ్యవహారంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో ఏడాదిగా పనుల్లో స్తబ్ధత నెలకొంది. రింగురోడ్డు పూర్తయితే గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తాలో జంక్షన్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. జాప్యం వల్ల ఈ పనులు ముందుకు సాగడం లేదు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ వద్ద ‘రింగ్’ రోడ్డును తాకే రాజీవ్ రహదారి కొద్ది నెలల్లో జాతీయ హోదాను పొందుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడబోతుంది. సుమారు 7 కిమీ పొడవునా ‘రింగ్’ రోడ్డు రాజీవ్ రహదారిలో అంతర్భాగం కాబోతుంది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ నుంచి కుడివైపున ఉండే ‘రింగ్’ రోడ్డు 7కిమీ పొడవు అంటే ప్రజ్ఞాపూర్, శ్రీగిరిపల్లి, జగదేవ్‌పూర్‌రోడ్డు, రిమ్మనగూడ గ్రామాల మీదుగా వెళ్లే రోడ్డు రాజీవ్ రహదారిలో కలవనుంది. ఈ నేపథ్యంలోనే ఈ 7కిమీ పొడవును భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే 6 లేన్లుగా విస్తరించడానికి నిర్ణయించారు. ఈ లెక్కన ‘రింగ్’రోడ్డు ఆ 7కిమీ పరిధిలో 150 ఫీట్ల వెడల్పుతో నిర్మాణం జరుగనున్నది. మిగతా చోట 100 ఫీట్లతో నిర్మించనున్నారు. ప్రస్తుతం రిమ్మనగూడ జంక్షన్ వద్ద పనులు ఆగిపోయాయి. పిడిచెడ్ రోడ్డు నల్లవాగు గడ్డవద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. త్వరలోనే పూర్తి చేస్తాం రింగురోడ్డు పనులు నెమ్మదించిన మాట వాస్తవమే. భూసేకరణ పెండింగ్‌లో ఉన్న చోట పనులు ఆగిపోయాయి. మిగతా చోట్ల ఏ కారణాలతో ఆగిపోయాయో ఇటీవల సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాను. త్వరలోనే పనులు పూర్తి చేయడానికి అవసరమైన కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. సీఎం ఆశయాలకనుగుణంగా రింగురోడ్డును తీర్చిదిద్దుతాం. –ముత్యంరెడ్డి, ‘గడా’(గజ్వేల్ ఏరియాడెవలప్మెంట్ అథారిటీ) ప్రత్యేకాధికారి -
‘రీజినల్’ భూసేకరణలో సగం ఖర్చు రాష్ట్రానిదే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టుకు అవసరమయ్యే భూసేకరణ వ్యయంలో తెలంగాణ సగభాగం భరించనుంది. ఈ ప్రాజెక్టు పనులకు ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపామని, భూసేకరణలో సగం ఖర్చు తెలంగాణ ప్రభుత్వం భరించేందుకు అంగీకరించిందని కేంద్ర మంత్రి ఎం.ఎల్. మాండవీయ సోమవారం పార్లమెంటులో వెల్లడించారు. మొత్తం 334 కి.మీ.ల మార్గాన్ని రెండు దశల్లో నిర్మించనున్నామని, ఈ రెండు రహదారులను ఇప్పటికే జాతీయ రహదారులుగా గుర్తించామని ప్రకటించారు. భవిష్యత్తులో ట్రాఫిక్ కష్టాలకు చెక్... రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణంలో భూసేకరణ అత్యంత కీలకమైన ప్రక్రియ. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 12,000 కోట్లుకాగా అందులో భూసేకరణకు దాదాపు రూ. 2,500–రూ. 3,000 కోట్లు వ్యయమవనుంది. ఈ ప్రాజెక్టు కోసం నిర్మించేది అత్యంత అధునాతనమైన ఎక్స్‌ప్రెస్ హైవే కాబట్టి రహదారికి ఎక్కడా వంపులు, మలుపులు లేకుండా జాగ్రత్త తీసుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న రోడ్డును కాకుండా మొత్తం గ్రీన్‌ఫీల్డ్ భూములను తీసుకోవాలని నిర్ణయించారు. హైదరాబాద్‌కు 50 కి.మీ.ల దూరంలో, ఔటర్ రింగ్‌రోడ్డుకు 30 కి.మీ.ల దూరంలో నిర్మించనున్న ఈ రహదారి అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో ఎదురయ్యే రాజధాని ట్రాఫిక్ కష్టాలు తీరతాయి. సేకరించి అప్పగించే బాధ్యత తెలంగాణదే.. ఆరు వరుసల్లో నిర్మించే రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి 4,500 హెక్టార్లు.. అంటే 11,000 ఎకరాలు అవసరమవుతాయి. దీని భూసేకరణ, అందుకు అవసరమైన మొత్తం రూ. 3,000 కోట్లలో సగం అంటే రూ. 1,500 కోట్ల భారాన్ని తెలంగాణ భరించనుంది. ఇప్పటికే డీపీఆర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. భూసేకరణలో న్యాయ, సాంకేతిక చిక్కులు ఎదురవకుండా ప్రాజెక్టు సాఫీగా సాగిపోయేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు ఉన్న రహదారి (154 కి.మీ.)ని ఎన్హెచ్ఏఐ నోటిపై చేసి 166 ఏఏ నంబర్ ఇచ్చింది. ఇక భువనగిరి–షాద్‌నగర్ (180 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా గుర్తించినప్పటికీ ఇంకా దీనికి నంబర్ ఇవ్వాల్సి ఉంది. ఎన్.హెచ్. 563 నేర్పిన పాఠాలెన్నో ఇటీవల జగిత్యాల–ఖమ్మం వరకు ఉన్న రోడ్డును విస్తరించి జాతీయ రహదారిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఎన్హెచ్ఏఐ కూడా ఆమోదించి నోటిఫై చేసి 563 నంబర్ ఇచ్చింది. ఇందుకోసం పలుచోట్ల భూసేకరణ పనులు కూడా మొదలయ్యాయి. పలుచోట్ల మిషన్ భగీరథ పైపులు అడ్డుతగలడం, మరికొన్ని చోట్ల ఒకవైపే భూమిని సేకరిస్తున్నారంటూ బాధితులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో విషయం కోర్టుకు వెళ్లింది. భూసేకరణ క్లిష్టంగా మారడంతో అవాంతరాల మధ్య ఈ ప్రాజెక్టు ఇటీవల నిలిచిపోయింది. ఎన్‌హెచ్ 563 ప్రాజెక్టు అర్ధంతరంగా నిలిచిపోయిన నేపథ్యంలో అధికారులు రీజినల్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు భూసేకరణ విషయంలో సమస్యలు రాకుండా డీపీఆర్ దశలోనే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. -
లంగర్‌హౌస్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్ : లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగల్ కా నల్లా పిల్లర్ నెంబర్ 101 సమీపంలోని రింగ్‌రోడ్డు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, యాక్టివా బైక్‌ని ఢీకొట్టిన ఘటనలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. -
కారులో వెళ్లి ఆటోలో వచ్చాం!
ఎట్టకేలకు కారు కొనేశాను. థర్డ్ హ్యాండు. మొదట... డాక్టర్‌గారు ఇంటికీ, క్లినిక్కీ అయిదేళ్లు తిరిగి రాజుగారికి అమ్మేశారు. ఆ రాజుగారు ఇంటికి తోటకి రెండేళ్లు తిరిగి కొత్త మోజు పెరగడంతో కారు బేరం పెట్టారు.నా ఫ్రెండ్ కుమార్ దృష్టి దాని మీద పడితే అది నా వరకు చేరింది. అవకాశం వచ్చేసిందని కొనేశాను. ముద్దుగా, బొద్దుగా, నీటుగా ఉంది మారుతి 800.1988 మోడల్. వయసెక్కువేగాని మా పిల్లలు దాన్ని పాపా అని పిలిచేవారు.తొలిరోజుల్లో ఎవరు నా కారు ఎక్కుతారా అని ఎదురు చూసేవాడిని. అడిగిందే తడవు కారు ఎక్కించి ఊరంతా తిప్పేద్దామన్న ఆత్రుత నాది. మా ఆవిడ, పిల్లలు మాత్రం నా కారెక్కేవారు కాదు. వారికి నా డ్రైవింగ్ మీద నమ్మకం లేదు. అందుకని నన్ను కారు ఎక్కనిచ్చేవారు కాదు. వారు ఎక్కేవారు కూడా కాదు.ఆరోజు మా చిన్నాన్న కూతురు గృహప్రవేశం. సత్యనారాయణవ్రతం, వెంకటేశ్వర దీపారాధన కార్యక్రమాలున్నాయి. ముందురోజే మా మరదలు వచ్చింది. ఆమె కూడా ఫంక్షన్‌కు బయలుదేరింది. బయలుదేరుతున్నామనగా మా బావమరిది భార్య వచ్చింది. నేనూ వస్తానంది. మరింకేం? మా ఆవిడ, మరదలు, బావమరిది భార్య ముగ్గురూ పవర్‌ఫుల్లే. వారిని నా కారులో, నేను డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లాలనే తపన నాది. మా ఆవిడకు ఇష్టం లేదుగానీ మరదలూ, బావమరిది భార్య తెగ ముచ్చట పడ్డారు నా కారులో రావడానికి. బాబామెట్ట నుంచి జమ్మునారాయణపురం వెళ్లడానికి పది నిమిషాలు లేదా పావుగంట పడుతుంది. అందుకని పదిగంటలకు బయలుదేరాం. కారు తీసాను.బాబామెట్ట, రైతుబజారు, రింగురోడ్డు, దాసన్నపేట మీదుగా జమ్మునారాయణపురం మామూలు రూటు. బాబామెట్ట రెండు లైన్లు దాటాం. కారు 30 కి.మీ వేగంతో తోలుతున్నాను.‘‘అదంతా చుట్టూ తిరగడమెందుకు? ఇలా అడ్డంగా తోలండి’’ అంది బావమరిది భార్య.కారు దారి మళ్లింది.అడ్డదారి గతుకుల రోడ్డు. మధ్యమధ్యలో కొళాయి పైపుల కోసం రోడ్డు తవ్వేసి కప్పకుండా వదిలేసిన గోతులు. రెండు,మూడు రోజుల క్రితం వర్షం పడడం వల్ల అక్కడక్కడ నీటిగుంతలు, మధ్యలో బురద, రాళ్లు తేలిపోయి అస్తవ్యస్తంగా ఉంది. కారు ఇటు కోస్తే అటు ఊగిపోతోంది.మధ్యలో కూర్చున్న మరదలు ఇటు మా ఆవిడ మీద అటు బావమరిది భార్య మీద పడిపోతోంది.చివర ఉన్న ఇద్దరూ మరదలి మీద పడిపోతున్నారు. నాకు ఒకవైపు నవ్వు, మరొకవైపు ఏ గోతిలో దిగిపోతానోనన్న భయం. ఉయ్యాలూగుతున్నట్లుగా కారు ఊగుతోంది.‘‘ఇదేమిటి ఇలా పడిపోతున్నాం ఒకరి మీద ఒకరం’’ అంటుంది మరదలు.‘‘నువ్వే చేశావు, తిన్నగా వెళ్లేవారిని అడ్డంగా వెళ్లమన్నావ్’’ అంది ఆవిడ.‘‘నేనేం చేశాను? ఇలా అయితే వేగిరం వెళ్లొచ్చని చెప్పాను. రోడ్డు ఇలా ఉంటుందని నాకేం తెలుసు?’’ అంది బావమరిది భార్య.ఇలా ఒకరినొకరు దెప్పిపొడుచుకుంటుండగా కారు దాసన్నపేట రింగ్‌రోడ్డు దాటి శ్రీకాకుళం రూట్లోకెళ్లింది. తారురోడ్డు మీద బాగానే వెళ్తుంది. వెనుక సీట్లో వారు స్థిమితపడ్డారు. కారు జమ్మునారాయణపురం కోళ్లఫారం దగ్గరకు వెళ్లింది. అక్కడ భరింపరాని కంపు. ఆ రోడ్డున నడిచివెళ్లడమే ఇబ్బందిగా ఉంటుంది. కారు వేగానికి గాలి రై రై మంటుంటే కంపు మరీ భరింపరానిదిగా ఉంది.‘‘కంపు కంపు’’ అంటూ మరదలు ఒకటే సణుగుడు.కోళ్లఫారానికి కుడివైపున అయిదు సమాంతర వీధులున్నాయి. ఎటు వెళ్లాలో తెలియలేదు. మొదటి వీధిలోకి కారు తిప్పాను. పదిగజాలు వెళ్లిందో లేదో కారు ఆగిపోయింది. ఎందుకో తెలీదు. స్టార్ట్ చేశాను. స్టార్ట్ అయిందిగానీ ముందుకు కదలడం లేదు. గేరు పడడం లేదు.మళ్లీ ప్రయత్నించాను. కారు కదిలింది. ఆపితే మళ్లీ కదులుతుందో లేదో అనే భయంతో ముందుకి వేగంగా పరుగెత్తించాను.ఒక్క వుదుటున వీధి చివరికి వెళ్లిపోయింది. మరి ముందుకి మార్గం లేదు. కటింగ్ వీలేకాదు. ఇంతదూరం రివర్స్ చేయలేము. దిక్కుతోచక ముందుకీ, వెనక్కీ, రైట్ కి, లెఫ్ట్ కి ఊగిసలాటలో మళ్లీ కారాగిపోయింది.ముగ్గురినీ దిగమన్నాను.‘‘కొంచెం సాయం చెయ్యండి’’‘‘ఏం సాయం?’’‘‘కారు కొంచెం తొయ్యండి’’‘‘సరదా తీరిపోయింది’’ అనుకుంటూ ముగ్గురు దిగి తోశారు.కారు కదిలింది. మరి ఆపకుండా అక్కడున్నవారిని అడిగి మూడో వీధిలో చివర సాయిబాబా గుడి దగ్గర ఇంటి ముందు దించి ఇక లోనికి పదండని వారిని పంపి, నేను మెకానిక్‌కి ఫోన్ చేసి, కారుని షెడ్డుకి పంపించేసి వారిని కలుసుకున్నాను. ఫంక్షన్ అయిపోయింది. విందుభోజనాలయ్యాయి.బయటికొచ్చాం. నేను ముందు వారు వెనక నడుసున్నారు.‘‘కారేది?’’ మరదలి ప్రశ్న.‘‘అక్కడెక్కడో పెట్టుంటారు’’ మా ఆవిడ జవాబు.ముందుకు నడుస్తున్నాం. కారు కనపడదు? మరదలికి ఓపిక నశించింది.‘‘కారు కనబడదు. ఇలా నడిచివెళితే నవ్వుకుంటారు’’ అంది. కారు షెడ్డుకెళ్లిందని వారికి తెలియదు.‘‘ఏమనుకుంటారు లెద్దూ’’ అంది ఆవిడ.మరదలు చిరాకు పడింది. అందరూ నడుస్తున్నారు. ఎందుకో ఎక్కడికో తెలీదు. ఇంతలో మెయిన్‌రోడ్డు చేరుకున్నాం. రోడ్డు పక్కన నిల్చున్నాం. నేను వచ్చే ఆటోలను ఆపుతున్నాను. అవి ఆగకుండా వెళ్లిపోతున్నాయి. ఇది గమనించిన మరదలు ‘‘ఆటోలెందుకు ఆపుతున్నారు?’’ అంది.‘‘కారు షెడ్కెళ్లింది.మెకానిక్ తీసుకెళ్లాడు’’ఇంతలో ఆటో ఆగింది. బాబామెట్ట అని చెప్పి ఆటో ఎక్కాం. ఆటోలో జోకులే జోకులు. ఆటోవాలా నాలానే అడ్డదారినే పోతున్నాడు. మళ్లీ అవేగోతులు. మళ్లీ అవే గుంతలు.ఒకరిపై ఒకరు జోగడాలు. నేను బేబీ సీట్లో కూర్చున్నా. తేలిక మనిషిని కాబట్టి మాటిమాటికి జారిపోయి మా ఆవిడ మీద పడుతున్నాను. కుదుపులకి అందరి ఒళ్లు హూనమైపోయింది. ఇంకా ఎన్నని చెప్పమంటారు ఆనాటి ఆటో కష్టాలు! – విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
ఉప్పల్.. తిప్పల్!
ఉప్పల్: ముందుచూపు లేకుండా ప్రభుత్వ యంత్రాంగాలు తీసుకుంటున్న చర్యలు వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. ఉప్పల్ రింగు రోడ్డు నుంచి నల్ల చెరువు వరకు రహదారి విస్తరణ ప్రతిపాదనలు ఆచరణలోకి రాలేదు. దీనికితోడు గడిచిన నాలుగు రోజులుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మట్టి సాంద్రత పరీక్షల కోసం ఉన్న అరకొర రహదారినీ ‘ఆక్రమించేశారు’. బోడుప్పల్ సిగ్నల్, ఉప్పల్ నల్ల చెరువు కట్ట, ఆదిత్య ఆస్పత్రి ఎదుట రోడ్డుపై పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి ఈ పనులు ప్రారంభించారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయకుండానే పనులు చేపట్టడంతో ట్రాఫిక్ ఇబ్బందులు మరింత పెరిగాయి. దీంతో వాహనదారులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్–నారపల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ (దాదాపు 6.25 కి.మీ) రోడ్డు ఏర్పాటు చేయడానికి రూ.658 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఉప్పల్ రహదారి వెడల్పు పనులకు శ్రీకారం చుట్టి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కొన్ని భవనాలు మాత్రమే కూల్చివేశారు. ఇప్పటికీ గ్రామకంఠం పరిధిలోనున్న నిర్మాణాలకు, స్థలాలకు ధరను నిర్ణయించలేకపోయారు. పట్టాదారులతో సరిసమానంగా నష్టపరిహారం చెల్లించాలని నిర్వాసితులు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఉప్పల్ రోడ్డును అభివృద్ధి చేసే దిశలో అధికారులు రెండేళ్ల క్రితమే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినా కొలిక్కి రాలేదు. అంబర్పేట్ కమేళా నుంచి రామంతాపూర్ వరకు, ఉప్పల్ చౌరస్తా నుంచి నారపల్లి వరకు రోడ్డు వెడల్పు పనులకు సన్నాహాలు చేసిన వెంటనే అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. అలీకేఫ్ నుంచి ఉప్పల్ మెట్రోస్టేషన్ వరకు, అక్కడి నుంచి నల్ల చెరువు వరకు 150 ఫీట్ల సమాంతర రోడ్డును అభివృద్ధి చేయాలని నిర్ణయించినా పనులు ప్రారంభించలేదు. ఉప్పల్–నల్ల చెరువు రోడ్డు వెడల్పు జరుగుతున్న సమయంలో హబ్సిగూడ నుంచి వచ్చే వారికోసం సర్వే ఆఫ్ ఇండియా, చిలుకానగర్ మీదుగా బోడుప్పల్ కమాన్ వరకు రోడ్డును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు ప్రధాన రహదారులు, బైపాస్ రోడ్లపై దృష్టి సారించినప్పటికీ... ఏ ఒక్కటీ ఆచరణకు నోచుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘ప్రత్యామ్నాయ మార్గాలపై వారం రోజులుగా సర్వే జరుగుతోంది. మరో 10 రోజుల్లో పూర్తవుతుంద’ని ఉప్పల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ మెహ్రా వివరణ ఇచ్చారు. -
మహానేత విజన్‌తో.. గ్రేటర్‌కు మణిహారం..
సాక్షి, హైదరాబాద్ : మహానేత.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టి, దార్శనికతతో హైదరాబాద్ మహానగరానికి మణిహారం లాంటి ఔటర్ రింగ్ రోడ్డు కల సాకారమైంది. సుమారు పుష్కర(12 ఏళ్లు) కాలం పాటు సాగిన ఈ మహా నిర్మాణానికి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీజం పడింది. ఆయన హయాంలోనే ఔటర్ పనులకు శ్రీకారం చుట్టారు. తాజాగా కండ్లకోయ జంక్షన్ పూర్తితో 158 కిలోమీటర్ల మార్గంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. భవిష్యత్‌ను దృష్టిలోఉంచుకుని.. విశ్వనగరం బాటలో దూసుకెళుతోన్న హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోందన్న అంశాన్ని వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడే గుర్తించారు. భవిష్యత్ అవసరాలను, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నగరంపై పడుతున్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించాలన్న ఉద్దేశంతో ఔటర్ పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సుమారు 6,043 ఎకరాల మేర పట్టా, ప్రభుత్వ, ఫారెస్ట్ భూముల సేకరణ ప్రక్రియను రికార్డు సమయంలో పూర్తి చేసి బాధితులకు సకాలంలో రూ.873 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేయడం విశేషం. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం పంపిణీతోపాటు హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన ప్రణాళికాబద్ధ లేఔట్లలో ప్లాట్లు(ఇళ్ల స్థలాలు) కేటాయించారు. ఆ తర్వాత అలైన్మెంట్ ఖరారు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి.. భూసేకరణకు కొందరు రైతులు సహకరించకపోవడంతో కండ్లకోయ జంక్షన్ వద్ద కొన్నేళ్లుగా నిలిచిపోయిన 1.10 కిలోమీటర్ల పనులు పూర్తవడంతో మంగళవారం నుంచి ఓఆర్ఆర్ పూర్తిస్థాయిలో అంటే 158 కిలోమీటర్ల మార్గంలో అందుబాటులోకి వచ్చింది. ఓఆర్ఆర్ రోడ్డుకు కలుపుతూ కండ్లకోయ వద్ద ఇంటర్ చేంజ్ రోడ్డు ఎనిమిది లైన్లతో 2 ఎంట్రీ(ప్రవేశ), 2 ఎగ్జిట్(బయటకు) ర్యాంపులు నిర్మించారు. మంగళవారం పురపాలక మంత్రి కేటీఆర్ ఓఆర్ఆర్ కండ్లకోయ జంక్షన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. 158 కిలోమీటర్ల మేర పూర్తిస్థాయిలో ఓఆర్ఆర్ అందుబాటులోకి రావడంతో గిన్నిస్ రికార్డుకు దరఖాస్తు చేసేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తుండటం విశేషం. కండ్లకోయ జంక్షన్ ఆలస్యానికి కారణమిదే. కండ్లకోయ జంక్షన్‌కు సంబంధించి కొందరు రైతులు భూసేకరణలో నష్టపరిహారం తగిన విధంగా లేదని సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈ పనులు కొన్నేళ్లపాటు ఆగాయి. రెండేళ్ల క్రితం కండ్లకోయ జంక్షన్ పనులు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో మళ్లీ పనులు మొదలెట్టారు. రూ.125 కోట్ల వ్యయం కాగల ఈ పనులను ఆరు నెలల నుంచి వేగాన్ని పెంచి పూర్తి చేశారు. దీంతో నేషనల్ హైవే, స్టేట్ హైవే నెట్‌వర్క్‌తో పాటు సిటీ రోడ్లను అనుసంధానించే మొత్తం 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ అందుబాటులోకి వచ్చింది. నార్సింగ్, కోకాపేట, పటాన్చెరు, మేడ్చల్, శామీర్‌పేట, ఘట్కేసర్, పెద్దఅంబర్‌పేట, శంషాబాద్, టీఎప్పీఏ, నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలి ప్రాంతాల మీదుగా ఓఆర్ఆర్ వాహనదారులకు సేవలను అందిస్తోంది. నిత్యం 85 వేల వాహనాల రాకపోకలు.. ఓఆర్ఆర్ మార్గంలో నిత్యం 85 వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. శివారు ప్రాంతాల ప్రజలతో పాటు విజయవాడ, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లావాసులు నగరంలోకి వచ్చేందుకు ఓఆర్ఆర్ను వినియోగిస్తున్నారు. ఎనిమిది లేన్లు కలిగిన ఓఆర్ఆర్లో 19 యాక్సెస్ పాయింట్లు ఉన్నాయి. రెండు లేన్లతో సర్వీసు రోడ్లను కూడా అభివృద్ధి చేశారు. రింగ్ రోడ్డును అనుసంధానించేందుకు నగరం నలుమూలల నుంచి 35 రేడియల్ రోడ్లకు వైఎస్సార్ హయాంలోనే బీజం పడింది. ఇందులో 19 రోడ్లు వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయి. 5 రేడియల్ రోడ్ల నిర్మాణం తుదిదశలో ఉంది. మరో 11 రేడియల్ రోడ్లకు ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేశారు. వైఎస్సార్ దూరదృష్టితో ఈ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఔటర్ ప్రస్థానం మొదలైందిలా 19–10–2004న జీవో నం.442 ద్వారా వైఎస్సార్ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు పనులకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. 2005లో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి 6,043 ఎకరాల పట్టా, ప్రభుత్వ, అటవీ భూములను సేకరించారు. బాధితులకు రూ.873 కోట్ల నష్టపరిహారాన్ని సకాలంలో చెల్లించారు. 2006 మే 29న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్సార్‌తో కలసి నాటి దేశ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఓఆర్ఆర్ పనులకు శంకుస్థాపన చేశారు. 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ నిర్మాణానికి మూడు దశల్లో రూ.6,696 కోట్లు వ్యయం చేశారు. 22 కిలోమీటర్ల గచ్చిబౌలి–నార్సింగ్–శంషాబాద్ మార్గాన్ని 2008 నవంబర్ 14న పూర్తి చేశారు. 38 కిలోమీటర్ల శంషాబాద్–పెద్ద అంబర్‌పేట మార్గాన్ని 2010 జూలై 7న ప్రారంభించారు. 23.7 కిలోమీటర్ల నార్సింగి–పటాన్చెరు మార్గాన్ని 2011 ఆగస్టు 14న ప్రారంభించారు. 38 కిలోమీటర్ల పటాన్చెరు–గౌడవెల్లి, కండ్లకోయ–శామీర్‌పేట మార్గాన్ని 2012 డిసెంబర్ 3న ప్రారంభించారు. 14 కిలోమీటర్ల పెద్ద అంబర్‌పేట–ఘట్కేసర్ మార్గాన్ని 2015 మార్చి 4న ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. 23 కిలోమీటర్ల ఘట్కేసర్–శామీర్‌పేట మార్గాన్ని 2016 జూలై 15న అందుబాటులోకి తెచ్చారు. ఘట్కేసర్–గచ్చిబౌలి మార్గంలోని 1.1 కిలోమీటర్ల కండ్లకోయ జంక్షన్ పనులు కొందరు రైతులు భూసేకరణకు అంగీకరించకపోవడంతో ఆలస్యమయ్యాయి. -
మరో ‘రింగు’
సాక్షి ప్రతినిధి, వరంగల్ : రానున్న 150 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని వరంగల్ నగర మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నారు. రీజనల్ రింగు రోడ్డు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎకోటూరిజం, శాటిలైట్ టౌన్‌షిప్పులు నిర్మించనున్నారు. వరంగల్ మహా నగర మాస్టర్‌ప్లాన్ ముసాయిదా రూపకల్పనపై కాకతీయ అర్బన్ డెవలప్మెంట్అథారిటీ (కుడా) కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. ఈ సమావేశంలో ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మేయర్ నన్నపునేని నరేందర్, రాజ్యసభç సÜభ్యుడు బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, తాటికొండ రాజయ్య, అరూరి రమేష్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ అరవింద్‌కుమార్, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లు అమ్రపాలి, హరితతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లీ కన్సల్టెన్సీ రూపొందించిన డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ వివరాలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గౌతమ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌పై సుదీర్ఘంగా చర్చించారు. చివరగా రాష్ట్ర పురపాలక కార్యదర్శి అరవింద్‌కుమార్ మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారుల అభిప్రాయాలు, సలహాలను తీసుకుని డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు తుది రూపం ఇస్తామన్నారు. అనంతరం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసి 90 రోజుల పాటు ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తామని చెప్పారు. వాటిని పరిశీలించి తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వివరించారు. కొత్తగా రీజనల్ రింగురోడ్డు మాస్టర్‌ప్లాన్‌లో కొత్తగా రీజనల్ రింగురోడ్డును ప్రతిపాదించారు. ఇప్పటికే ఇన్నర్‌రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డులు ఉన్నాయి. రానున్న 150 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రీజనల్ రింగురోడ్డుకు పచ్చజెండా ఊపారు. ప్రస్తుతం ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్డుకు చుట్టూ స్టేషన్‌ఘన్‌పూర్– వర్ధన్నపేట–సంగెం–గీసుకొండ–ఆత్మకూరు–ఎల్కతుర్తి –వేలేరు, చెల్పూరు–స్టేషన్‌ఘన్‌పూర్ వరకు రీజనల్ రింగురోడ్డు ఉంటుంది. ఈ రోడ్డును 132 కిలోమీటర్ల నిడివితో రానున్న పదేళ్లలో నిర్మించాలని మాస్టర్‌ప్లాన్ ముసాయిదాలో చేర్చారు. మొత్తం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది. ఔటర్ రింగురోడ్డు , రీజనల్ రింగ్ రోడ్డుల మధ్య ఉన్న ప్రదేశాల్లో పరిశ్రమలు, ఐటీ పార్కులు, విద్యాసంస్థలు నెలకొల్పేలా రూపకల్పన చేశారు. ఈ రెండు రోడ్ల మధ్యలో ఐదు వందల నుంచి రెండు వేల ఎకరాల వరకు స్థలాన్ని సేకరించి శాటిలైట్ టౌన్‌షిప్‌లను ‘కుడా’ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్నారు. ఆరు ఆదర్శ రహదారులు నగరానికి లైఫ్‌లైన్‌గా ఉన్న 163 జాతీయ రహదారిలో పెద్ద పెండ్యాల నుంచి ధర్మారం వరకు మొత్తం 36 కిలోమీరట్ల రోడ్డును మోడల్ రహదారిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు ఫాతిమానగర్ – కేయూసీ, ములుగురోడ్డు–పెద్దమ్మగడ్డ– కేయూసీ, డీఈఓ కార్యాలయం నుంచి హంటర్ రోడ్డు – నాయుడు పెట్రోల్ పంప్ వరకు, నాయుడు పెట్రోల్ పంపు నుంచి వయా ఖిలావరంగల్ – బస్టాండ్ – వెంకట్రామ థియేటర్, పోచమ్మమైదాన్ – సీకేఎం కళాశాల – ఆరేపల్లి వరకు, లేబర్‌కాలనీ నుంచి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ వరకు గల ప్రధాన రహదారులను మోడల్ రోడ్లుగా అభివృద్ధి చేస్తారు. ఇందులో భాగంగా ఇరువైపులా డ్రెయినేజీ, ఫుట్‌పాత్, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, గ్రీనరీని పెంచుతారు. దీంతో పాటు కనీసం పది ట్రాఫిక్ జంక్షన్లను విస్తరించి అభివృద్ధి చేయాలని ముసాయిదాలో పొందుపరిచారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్.. ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి గ్రామం వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించాలని ముసాయిదాలో ప్రతిపాదించారు. ఇక్కడ సుమారు 200కు పైగా ఎకరాలను గుర్తించారు. ఇప్పటికే ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. సైనిక పాఠశాలకు ఇక్కడ స్థలాన్ని కేటాయించారు. ఈ రెండు విద్యాసంస్థలకు కేటాయించిన స్థలాన్ని మినహాయిస్తే ఇంకా 120 ఎకరాల స్థలం అందుబాటులో ఉంటుంది. ఇందులో సకల సౌకర్యాలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో స్పోర్ట్స్ హాస్టల్, ఇండోర్ స్టేడియం, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంటాయి. జాతీయ రహదారికి పక్కన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం పలురకాలుగా ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేవనూర్, ముప్పారం గ్రామాల మధ్య థీం పార్కు ఏర్పాటు చేయలాలని నిర్ణయించారు. దేవనూర్ ఇనుపరాతి గుట్టల్లో గ్రీనరీ మరింతగా పెంచి ఎకో టూరిజానికి అనువుగా మార్చాలని ప్రతిపాదించారు. దీని పక్కనే ఉన్న ధర్మసాగర్ చెరువును అనుసంధానం చేసుకుని రిక్రియేషన్ జోన్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు. నగరంలోని చెరువుల సంరక్షణకు ఎఫ్టీఎల్ నిర్ధారించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. భæద్రకాళి, వడ్డేపల్లి, చిన్నవడ్డేపల్లి, ఉర్సు చెరువులను సమగ్రంగా అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రణాళికలో రూపొందించారు. -
అంతర్ జిల్లాల నేరస్తులు అరెస్ట్
విజయవాడ : విభిన్న తరహా దొంగతనాలకు పాల్పడే ఇద్దరు అంతర్ జిల్లాల నేరస్తులను సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 10 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద మోటారు బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితులిద్దరు నగరంలో పలు నేరాలకు పాల్పడినట్లు తేలింది. నిందితులు విజయవాడ వించిపేటకు చెందిన షేక్ ఇమ్రాన్ అలియాస్ ఇమ్రాన్, షేక్ నిజాముద్దీన్లుగా గుర్తించారు. వీరు జైలు నుంచి బయటకు వచ్చాక విజయవాడ నగరంలోని గవర్నర్‌పేట, పటమట, భవానీపురం, కృష్ణలంక, లబ్బీపేట ఏరియాలలో పలు నేరాల కు పాల్పడ్డారు. వారిని అరెస్టు చేసి రూ. 10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, టీవీ, రెండు బైక్‌లు, ఓ కెమేరాను స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. నిందితులు గతంలో విశాఖ, రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడెం, ఏలూరు, గుంటూరులో పలు నేరాలకు పాల్పడ్డారు. నిందితులపై చోరీలు, లైంగికదాడి కేసు కూడా ఉంది. -
యాదాద్రి చుట్టూ రింగ్ రోడ్డు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన యాదాద్రి, వేములవాడ అభివృద్ధి పనుల పురోగతిని ప్రగతి భవన్లో ఆదివారం సీఎం కేసీఆర్ సమీక్షించారు. యాదాద్రి దేవాలయ క్యూ కాంప్లెక్స్ నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి, తగు సూచనలు చేశారు. గతంలో అనుకున్న విధంగా బస్టాండు, క్యూ కాంప్లెక్స్‌లు గుట్టపైన కాకుండా, కింద నిర్మించాలని సీఎం సూచించారు. గుట్ట చుట్టూ రింగు రోడ్డు నిర్మాణం, ప్రత్యేక అతిథి గృహాల నిర్మాణ పురోగతిని సమీక్షించారు. గుట్టపై నిర్మాణంలో ఉన్న వివిధ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరగాల న్నారు. ఆలయశిల్పుల సహకారంతో డిజైన్లు రూపొందించి, అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని ప్రత్యేక అధికారి పురుషోత్తంరెడ్డిని ఆదేశించారు. ఈ సంద ర్భంగా శృంగేరి మఠం నుంచి తెచ్చిన ప్రసాదాన్ని వేములవాడ ఆలయ అధికారులు సీఎంకు అందజేశారు. -
కదలని రింగ్ రోడ్డు!
కార్యరూపం దాల్చని ఎంపీ ప్రతిపాదనలు తీరని ట్రాఫిక్ సమస్య జగిత్యాల: జిల్లా కేంద్రంలో రింగ్‌రోడ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అధికారులు ప్రతిపాదనలు రూపొందించాలని ఎంపీ కల్వకుంట్ల కవిత 2016 డిసెంబర్ 28న కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆదేశించారు. అయినా అధికారుల నుంచి స్పందన కరువైంది. ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదనలు రూపొందించడంలేదు. జగిత్యాలలో రింగ్‌రోడ్డు పూర్తయితే జిల్లా కేంద్రం రూపురేఖలు మారుతాయి. చిన్నరోడ్లతో ఇప్పటికే జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. 1983లో అమలులోని మాస్టర్‌ప్లాన్‌లోని రోడ్లే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారి అయిన యావర్‌రోడ్‌లో ఎన్‌హెచ్–63 విస్తరించి ఉంది. కానీ.. ఈ రోడ్లు కనీసం 100 ఫీట్లు కూడా లేవు. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో పాటు ప్రధాన ప్రాంతమైన టవర్‌సర్కిల్, గంజ్‌రోడ్డు, న్యూబస్టాండ్, ధర్మపురి రోడ్లంతా చిన్నవిగా ఉన్నాయి. వెడల్పు కార్యక్రమానికి గతంలో ప్రతి అధికారి ప్రతిపాదనలు తయారుచేశారే తప్ప మోక్షం దాల్చలేదు. ట్రాఫిక్‌ను తగ్గించాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాల క్రితం జగిత్యాల పక్క నుంచి బైపాస్‌రోడ్డు సైతం నిర్మించారు. ప్రస్తుతం ఈ బైపాస్ సిటీలోనే కలిసిపోయి ట్రాఫిక్ సమస్యగా ఏర్పడింది. ప్రస్తుతం బైపాస్రోడ్లోసైతం జనాలు ఎక్కువగా ఉండటంతో పెద్దపెద్ద వాహనాలు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు పార్కింగ్ సమస్యతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రింగ్‌రోడ్డుతో కళ జగిత్యాల జిల్లా కేంద్రంలో రింగ్‌రోడ్ నిర్మిస్తే జగిత్యాల రూపురేఖలే మారనున్నాయి. ఇప్పటి కే ధరూర్ నుంచి గొల్లపల్లి రోడ్లోఉన్న డం పింగ్రోడ్ వరకు ఒక బైపాస్‌రోడ్డు నిర్మించారు. అలాగే ధరూర్ నుంచి కాకతీయ కెనాల్ పక్కనుంచి చల్గల్ వరకు సైతం బైపాస్‌రోడ్ నిర్మిం చారు.వీటితో పాటు మరో రింగ్‌రోడ్‌ను ఏర్పా టు చేస్తే ప్రజలకు కూడా ఎంతో వినియోగకరంగా ఉంటుంది. ట్రాఫిక్ నియంత్రణలో ఉం టుంది. జగిత్యాల జిల్లా జనాభా ప్రతిపాదికనఅతి పెద్ద జిల్లాగా విస్తరించింది. చుట్టు జిల్లా కేంద్రంలోని 18 మండలాలతోపాటు మూడు మున్సిపాలిటీలతో చుట్టూ జిల్లాలైనా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ నుంచి సైతం జగిత్యాలకు వస్తుంటారు. ప్రస్తుతం రింగ్‌రోడ్డు అయితే ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. -
ఉత్తరప్రదేశ్ కూలీ దుర్మరణం
కర్నూలు: కర్నూలు శివారులోని డోన్ రహదారిలో రింగు రోడ్డు నిర్మాణ పనుల్లో క్రేన్ తగిలి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉస్మాన్‌పూర్‌కు చెందిన కూలీ అమర్నాథ్ (23) అక్కడికక్కడే మృతిచెందాడు. శనివారం ఉదయం లారీలో నుంచి హైడ్రో క్రేన్ ద్వారా సిమెంటు దిమ్మెలు దింపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సిమెంటు దిమ్మెకు నాలుగు వైపులా గొలుసు తగిలించి క్రేన్ ద్వారా దిమ్మెలను కిందికి దించాల్సి ఉంది. అయితే ఓ వైపు గొలుసు తగిలించకముందే క్రేన్ డ్రైవర్ జితేంద్ర కుమార్ చూసుకోకుండా నిర్లక్ష్యంగా క్రేన్‌ను ముందుకు నడపడంతో అమర్నాథ్కు సిమెంటు దిమ్మె తగిలి మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే తాలూకా పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం సొంత గ్రామం ఉస్మాన్‌పూర్‌కు తరలించారు. -
రింగ్ పడుతోంది..
అనంతపురం సిటీ: జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ అనంతపురం నగర శివారులో రింగ్ రోడ్డు నిర్మాణానికి ఎట్టకేలకు అనుమతులు లభించాయి. ఇందుకు గాను రూ. 600 కోట్ల అంచనా వ్యయంతో అధికారులు పంపిన నివేదికకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇందులో భాగంగా తొలి విడతలో రూ. 129 కోట్ల విడుదలకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. మొత్తం నిధులను నాలుగు విడతలుగా అందజేసేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పీపీపీ విధానంలో పనులు అనంతపురం నగర శివారు ప్రాంతం నుంచి జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేయనున్న రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో టెండర్ల ద్వారా పనులు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. నగరానికి ఐదు నుంచి 11 కిలోమీటర్ల చుట్టూ కొలతల్లో 27 కి.మీ వలయాకారంలో రోడ్డును నిర్మించదలిచినట్లు సమాచారం. ఇప్పటికే ఈ పనులకు సంబంధించి సర్వే బాధ్యతలను ఎల్అండ్టీ సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది. గత సర్వేపై సందిగ్ధత రింగ్ రోడ్డు ఏర్పాటుకు సంబంధించి గతంలో చేసిన సర్వే లోపభూయిష్టంగా ఉన్నట్లు సమాచారం. దీనిలోని లోపాలను సరిదిద్దుకోవడమా? లేక అదే ప్రణాళికతో ముందుకు సాగడమా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. అయితే లోపాలను సరిదిద్దుకునేందుకే ఎల్అండ్టీకి సర్వే పనులు అప్పగించినట్లు సమాచారం. సర్వే పూర్తి అయిన తర్వాత ఏ గ్రామాల మీదుగా రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి అవుతుందో స్పష్టంగా తెలియనుంది. కాగా, అధికారుల సూచన మేరకు నగరానికి చుట్టూ సరిసమానంగా కిలోమీటర్ల దూరాన్ని గుర్తించే చర్యలు చేపట్టినట్లు సమాచారం. రియల్ వ్యాపారుల హల్చల్ జిల్లా కేంద్రం శివారులో ఏర్పాటు కానున్న రింగ్ రోడ్డు రియల్ వ్యాపారుల పాలిట వరంగా మారుతోంది. నిర్ధిష్టమైన రూట్ మ్యాప్ సిద్ధం కాకనే అనంతపురం శివారు గ్రామాల్లో రియల్టర్లు హల్చల్ చేస్తున్నారు. అయా గ్రామాల మీదుగా రింగ్ రోడ్డు ఏర్పాటు కానుందంటూ చాలా మందిని నమ్మిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరి మాటల మాయాజాలంలో పడ్డ చాలా మంది అమాయకులు ఏ మాత్రం ధర లేని భూములను రూ. లక్షలు పోసి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. -
అనంతకు రింగు రోడ్డు : ప్రభాకర్ చౌదరి
అనంతపురం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం నగరానికి రింగు రోడ్డు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలిపారు. బుధవారం నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రింగు రోడ్డు కోసం తొలి విడతగా రూ.129 కోట్లు విడుదల చేశారని తెలిపారు. ఇప్పటికే రూ.150 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థపై దష్టి పెట్టామని, త్వరలో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. -
రూ.182 కోట్లతో ఔటర్‌రింగ్‌రోడ్
కొత్తగా డబుల్‌లైన్ రోడ్ల ప్రతిపాదన ఖమ్మం అర్బన్:జిల్లా కేంద్రం ఖమ్మం చుట్టూ రూ.182 కోట్లతో ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మిస్తామని, సర్వే సాగుతోందని, సీఎం ఆమోదం తర్వాత పనులు చేపడతామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం రఘునాథపాలెం మండలంలోని వీవీపాలెంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, తాగునీటి ఓవర్‌హెడ్ ట్యాంక్ ను ప్రారంభించి సభలో మాట్లాడారు. ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్లతో అభివద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. వీవీపాలెం నుంచి వేపకుంట్ల వరకు, రఘునాథపాలేనికి డబుల్‌లైన్ రోడ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. వీవీపాలెం–మంచుకొండ వరకు రూ.7కోట్లతో బీటీరోడ్డు నిర్మించామని, స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు పంచాయతీరాజ్ నుంచి రోడ్లు, భవనాలశాఖకు మార్చామని, వీవీపాలేనికి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీనిచ్చారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ..మంత్రి సహకారంతో నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అనంతరం మంత్రి స్థానిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ నూరపాక నగేష్, ఆర్డీఓ వినయ్కష్ణారెడ్డి, జెడ్పీటీసీ అజ్మీరా వీరునాయక్, ఎంపీపీ మాలోత్ శాంత, డీఈఓ రాజేష్, సర్పంచ్ ఆవుల హేమలత, ఎంపీటీసీ యరగర్ల పద్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షుడు రావెళ్ల శ్రీనివాసరావు, ఆత్మ చైర్మన్ మెంటం రామారావు, తహసీల్దార్ వెంకారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
వెంకన్న సన్నిధిని వదలని చిరుతలు
- వేకువజాము 4.30 గంటలకు చొరబడిన చిరుత - అదే సమయంలోనూ కాలిబాటలో మరో చిరుత సాక్షి,తిరుమల చిరుతలు తిరుమల శివారు ప్రాంతాలను వదలటం లేదు. గురువారం వేకువజాము రెండు చిరుతలు కనిపించాయి. 4.30 గంటల ప్రాంతంలో బాలాజీనగర్ 8వ లైనులోని 755 ఇంటి ఎదురుగా వచ్చింది. జనావాసాల్లో చిరుత సంచార తీవ్రతను ఎత్తిచూపేందుకు సాక్షి బృందం అక్కడే వాహనంలో బుధవారం రాత్రంతా కాపుకాసింది. వేకువజాము సరిగ్గా 4.30 గంటల సమయంలో చిరుత అటవీమార్గం నుండి చిరుత రావటాన్ని సాక్షి బృందం గుర్తించింది. అది ఓ కుప్పతొట్టి వెనుకవైపు నక్కింది. తలను పెకైత్తి చూసింది. ఆ దృశ్యాలను సాక్షి బృందం క్షణాల్లో కెమెరాతో చిరుత ఫొటోలు చిత్రీకరించింది. అయినా ఆ చిరుత బెదరకుండా కుప్పతొట్టిపైకి ఎక్కింది. వాహనం తన సమీపానికి రావటాన్ని గుర్తించిన ఆ చిరుత దాడి చేసేందుకు సన్నద్ధమైంది. ఒకేసారి నాలుగు పాదాలను కుప్పతొట్టిపై బిగుంచుకుని తన శరీరాన్నంతా కూడగట్టుకుంది. ఇంతలో కెమెరా ఫ్లాష్‌తోపాటు ఫోకస్లైట్ల వెలుతురు పడటంతో అది క్షణాల్లో చెట్ల పొదల్లోకి వెళ్లింది. ఇక తిరుపతికి వెళ్లే మొదటి రోడ్డుమార్గంలోని జీఎన్సీకి సమీపంలో తొలి మలుపు వద్ద చిరుత కాలిబాట నుండి రోడ్డు మార్గాన్ని దాటింది. ఆ సమయంలో కాలిబాటలో భక్తులు లేకపోడంతో ప్రమాదం తప్పింది. అదే చిరుత రోడ్డుపైకి రావటంతో తిరుపతికి వెళ్లే ప్రైవేట్ వాహనదారులు గుర్తించారు. తిరుమల శివారు ప్రాంతాల్లో నాలుగు, కాలిబాటల్లో రెండు చిరుతల సంచరిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 26న ఓ చిరుత లైవ్ ఫొటోలు ఇవ్వగా, గురువారం మరోసారి సాక్షి బృందం సాహసోపేతంగా మరో చిరుత చిత్రాలు అందించి సమస్యను పరిష్కరించాలని జనం పక్షాన సంబంధిత విభాగాలకు విజ్ఞప్తి చేస్తోంది. ప్రస్తుతం చిరుతల బంధీ కోసం రెండు బోన్లు నామమాత్రంగానే ఏర్పాటు చేశారు. వాటిలో ఎలాంటి ఎర వేయకుండానే మూసిఉంచటం వల్ల ఉండటం వల్ల చిరుతలు బోన్లు వద్దకు వెల్లటం లేదు. ఉన్నతాధికారులు ఆదేశాలు లేకుండా బోన్లు నిర్వహించలేమని సంబంధిత ఫారెస్ట్ అధికారులు చెబుతుండటంతో చూస్తే.. ఆ విభాగాలకు చిరుతల బంధీ చేయాల్సిన ఆలోచనే లేదని తెలుస్తోంది. -
తిరుమలలో చిరుత కలకలం
తిరుమలలో చిరుత కలకలం రేపుతోంది. గురువారం రాత్రి రింగ్‌రోడ్డుపై చిరుత సంచరిస్తుండటంతో స్థానికులు భయబ్రాంతుకు గురయ్యారు. మనుషులు తిరుగుతున్న ప్రాంతంలో చిరుతలు సంచరిస్తుండటంతో.. భయంతో జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. ఓ పక్క నివాసాలు, మరోపక్క పాఠశాల ఉండటంతో చిరుతలు రాకుండా అరిక ట్టాలని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. -
గజ్వేల్ రింగ్ రోడ్డుపై స్పష్టత
♦ రూ.200 కోట్లతో ఫోర్‌లేన్ రహదారి ♦ నాలుగు రేడియల్ రోడ్లతో అనుసంధానం ♦ ఆర్అండ్బీ ఈఎన్సీ రవీందర్రావు గజ్వేల్ : గజ్వేల్ రింగ్ రోడ్డు విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఈ రోడ్డును నాలుగు లేన్లుగా మార్చి, పట్టణానికి అనుబంధంగా ఉన్న నాలుగు రేడియల్ రోడ్లతో అనుసంధానం చేస్తారు. డబుల్ లేన్ అనుకున్న దానిని నాలుగు లేన్లుగా మారుస్తారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ మంజూరు చేసిన రూ.90కోట్లకు మరో రూ.110కోట్లు వెచ్చించి మొత్తం రూ.200కోట్లతో పనులు చేపట్టాలని భావిస్తున్నట్టు ఆర్అండ్బీ ఈఎన్సీ రవీందర్రావు సోమవారం గజ్వేల్‌లో తెలిపారు. నగర పంచాయతీ పరిధిలో దశాబ్దాలుగా ట్రాఫిక్ సమస్య నెలకొని ఉంది. ట్రాఫిక్ సమస్యను స్వయంగా పరిశీలించిన సీఎం అధికారంలోకి వచ్చిన వెంటనే గజ్వేల్‌కు రింగ్ రోడ్డు నిర్మించి ట్రాఫిక్ సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేయగానే రింగ్ రోడ్డుకు రూ.90కోట్లు మంజూరు చేశారు. పట్టణంలోని 133/33కేవీ సబ్స్టేషన్నుంచి జాలిగామ, బయ్యారం చౌరస్తా, క్యాసారం, ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్టాండ్, శ్రీగిరిపల్లి, హషీమ్ కళాశాల, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ పాలిటెక్నిక్ మీదుగా తిరిగి సబ్‌స్టేషన్ వరకు రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతారు. నాలుగు లేన్లుగా.. సోమవారం గజ్వేల్‌కు వచ్చిన ఆర్అండ్బీ ఈఎన్సీ రవీందర్రావు రింగ్‌రోడ్డుపై స్పష్టత ఇచ్చారు. మొదట గజ్వేల్ చుట్టూ 19కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మించాలనుకున్నారు. ఇందుకోసం 140 ఎకరాలను సేకరించారు. ముందుగా 100మీటర్ల వెడల్పుతో నిర్మించాలనుకున్న ఈ రోడ్డును 150 మీటర్లకు పెంచి నాలుగు లేన్లుగా నిర్మించాలని నిర్ణయించారు. దీంతో అంచనా వ్యయం రూ.200 కోట్లకు పెరగనుంది. రింగ్ రోడ్డు కోసం 140 ఎకరాలు సేకరించగా నాలుగు లేన్లుగా మారిస్తే అదనంగా మరో 70 ఎకరాలు అవసరం. అదేవిధంగా పొడవు సైతం 24 కిలోమీటర్లకు పెరుగుతుంది. పట్టణంలోని పిడిచెడ్, ధర్మారెడ్డిపల్లి, జాలిగామ, సంగాపూర్ రేడియల్ రోడ్లను రింగ్ రోడ్డుతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. రూ. 1663కోట్లతో ఆర్అండ్బీ పనులు జిల్లాలో రూ. 1663 కోట్లతో ఆర్అండ్బీ రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు రవీందర్రావు తెలిపారు. సోమవారం గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2400 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లు ఉండగా అందులో 1641కిలో మీటర్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో రూ. 433 కోట్లతో పనులు సాగుతున్నాయన్నారు. ఇక్కడ 110 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్లను డబుల్ లేన్ చేస్తామని, ఈ పనులు జూన్‌లోగా పూర్తవుతాయన్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రహదారి 6లేన్ల పనులు మోడల్‌గా చేపట్టేందుకు శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. వంద మీటర్ల పొడవునా నమూనాగా చేపట్టిన పనులు సీఎం ఆమోదం పొందిన తరువాత పూర్తి స్థాయిలో చేపడతామన్నారు. -
'వరంగల్‌లో టెక్స్టైల్ పార్క్, రింగ్‌రోడ్డు'
వరంగల్: త్వరలో వరంగల్‌లో టెక్స్టైల్ పార్క్, రింగ్‌రోడ్డు నిర్మాణం చేపడతామని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. మంగళవారం వరంగల్ జిల్లా అభివృద్ధిపై ఆయన సమీక్ష నిర్వహించారు. 15 శాతం ఆర్థికాభివృద్ధితో తెలంగాణ దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ బడ్జెట్లో వరంగల్‌కు ఏటా 300 కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంజీఎంలో శిథిలావస్థలో ఉన్న భవనాలు తొలగించి కొత్త భవనాలను నిర్మించాలని కేసీఆర్ పేర్కొన్నారు. -
ఏందయా నీ తీరు!
మంత్రి అచ్చెన్న మాటతో సెలవుపై ఆర్డీవో రింగ్ రోడ్డు వ్యవహారంలో కొత్త మలుపు టీడీపీ నేతల మేలు కోసమే ఈ పరిణామం శ్రీకాకుళం టౌన్: శ్రీకాకుళం పట్టణం చుట్టూ నిర్మించ తలపెట్టిన రింగ్ రోడ్డు వ్యవహారం ఆర్డీవో దయానిధి మెడకు చుట్టుకుంది. ఐదు కిలోమీటర్ల చుట్టు కొలతతో నిర్మించనున్న రింగ్‌రోడ్డు పరిధిలో ఖరీదైన భూములున్నాయి. రూ.కోట్లు విలువ చేసే భూములను రింగ్ రోడ్డుకు ఇచ్చేందుకు రైతులు ముందుకురావడం లేదు. ఇప్పటికే పెద్దపాడు, కునుకుపేట రైతులు సర్వే అధికార్లను అడ్డుకున్నారు. కలెక్టర్ పి.లక్ష్మీనృసింహాన్ని కలసినపుడు ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరకు అధికార టీడీపీ నేతల భూములను రింగ్ రోడ్డు నుంచి తప్పించి అలైన్మెంట్ మార్చాలని కొందరు నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ప్రాంతానికి చెందిన ‘దేశం’ నేత, మంత్రి అచ్చెన్నకు సన్నిహితుని భూములు రోడ్డు అలైన్‌మెంటు నుంచి తప్పించడంతోపాటు రోడ్డు పక్కనే ఆ భూమి ఉన్నట్టు మార్చాలని సూచించడంతో రెవెన్యూ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. దీంతో ఉన్నతాధికార్లను, రైతులకు ఒప్పించే బాధ్యతలను ఆర్డీవో దయానిధికి అప్పగించినట్టు తెలుస్తోంది. ఆయన కూడా అదే ప్రాంతానికి చెందిన వారు కావడంతో రైతులతో నేరుగా మంచి సంబంధాలున్నాయని, ఒప్పించలేక పోతే సెలవుపై వెళ్లాలని ఆ పార్టీ నాయకులు అతనిపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా టీడీపీ నాయకులు అందుకుఅంగీకరించలేదని సమాచారం. గతంలో డీలర్ల నియామకంలో కోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టి అనుకూలమైన వారికి పగ్గాలు ఇమ్మని ఒత్తిడి చేశారు. తాజాగా రింగ్ రోడ్డు వ్యవహారంలో ఆయన కొరకరాని కొయ్యగా తయారై.. చెప్పినట్టు చేయడం లేదని మంత్రి అచ్చెన్నాయుడితో అదేపనిగా చెప్పడంతో సెలవుపై వెళ్లమని సూచించినట్టు వదంతులు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఆర్డీవో దయానిధి జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి 28 వరకు సెలవుపై వెళ్లనున్నారు.ఇది కేవలం వ్యక్తి గత సెలవుగానే ఆయన చెప్పుకొచ్చారు. కాగా నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా ఆర్డీవో సెలవుపై వెళ్లడాన్ని ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నారు. -
అమరావతి చుట్టూ 185 కిలోమీటర్ల రింగ్‌రోడ్డు
అమరావతి చుట్టూ 185 కిలోమీటర్ల రింగ్ రోడ్డు వేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతోపాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 800 కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా మార్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. కర్నూలు మీదుగా అనంతపురం, అమరావతిని కలుపుతూ ఎన్‌హెచ్ 44- ఎన్‌హెచ్ 65తో అనుసంధానించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కర్నూలు, కడప, అనంతపురాలను కలుపుతూ ఎన్‌హెచ్ 40, ఎన్‌హెచ్ 60లను అనుసంధానించనున్నారు. ప్రస్తుతం నాలుగు లేన్లుగా ఉన్న రహదారులను 6, 8 లేన్ల జాతీయ రహదారులుగా మారుస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను పూర్తిచేస్తే పనులు వెంటనే ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది. -
రింగ్ పక్కన చెత్త!
శివారు గ్రామాల ముక్కుపుటాలదిరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్‌రోడ్డును హరితహారంగా మలుస్తామని ప్రకటించిన కొన్నాళ్లకే.. ఈ రోడ్డు నిర్మాణానికి తవ్విన గోతులను ‘డంపింగ్ యార్డు’లుగా మార్చాలని నిర్ణయించింది. మట్టి, కంకర తవ్వకాలతో పెద్ద గోతులతో ఏర్పడిన గోతులను పూడ్చేందుకు సర్కారు ఈ ఆలోచన చేసింది. ఈ క్రమంలోనే ఔటర్‌కు ఇరువైపులా లీజు ముగిసిన క్వారీలను గ్రేటర్ చెత్తతో నింపేసేలా ప్రణాళిక తయారు చేసింది. - జవహర్‌నగర్‌పై భారాన్ని తగ్గించే ఆలోచన - ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన యంత్రాంగం - ఆందోళనలో పరిసర గ్రామాల ప్రజలు - హైదరాబాద్‌లో రోజుకు సగటున 3,800 టన్నుల చెత్త సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఇటీవల రింగ్‌రోడ్డుపై చక్కర్లు కొట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. చుట్టుపక్కల హరితహారం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే, తాజాగా ఔటర్ రహదారి నిర్మాణానికి తరలించిన మట్టితో ఏర్పడిన గుంతలను చెత్త డంపింగ్‌కు ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో పరిసర గ్రామాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో సగటున రోజుకు 3,800 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. దీంట్లో 90శాతం జవహర్‌నగర్‌లోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ చెత్తను వివిధ రకాలుగా వినియోగించుకుంటున్నారు. అయినప్పటికీ, భూగర్భజలాలు కలుషితం కావడం, రోగాల బారిన పడుతుండడంతో ఇక్కడి నుంచి డంపింగ్ యార్డును షిఫ్ట్ చేయాలని స్థానికులు ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో జవహర్‌నగర్‌పై ఒత్తిడి తగ్గించేందుకు ఔటర్ గోతులను వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యావరణ సమతుల్యత, కాలుష్య సమస్యను అధిగమించేందుకు సరికొత్త టెకా్నాలజీని ఉపయోగిస్తామని, చెత్తను వేర్వేరుగా విభజించడం ద్వారా దుర్వాసనకు తావివ్వకుండా మట్టి పొరలతో నింపేస్తామని యంత్రాంగం చెబుతోంది. జవహ ర్నగర్లోనూ ఈ విధానం అమలు చేస్తున్నా కంపు కొడుతోందని, ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉత్పన్నమవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్, గాజులరామారంలో లీజు పరిమితి ముగియడంతో 22 క్వారీలను రద్దు చేశారు. సర్వే నం.307, 308, 329/1, 79, 342లలో 148.26 ఎకరాల విస్తీర్ణంలోని 20 క్వారీల నుంచి మట్టి, కంకరను తీశారు. ఏడు మీటర్ల లోతుతో 34 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు జరిపిన ఈ ప్రాంతాన్ని డంపింగ్‌యార్డుకు ఉపయోగించుకున్నారు. నిజాంపేట్ సర్వే నం.332లో 14.97 ఎకరాల్లో ఉన్న రెండు క్వారీలు కూడా దాదాపు 10 మీటర్ల లోతులో ఉన్నాయి. దాదాపు 6.67 క్యూబిక్ మీటర్ల మేర ఖనిజ వనరులను ఇక్కడ నుంచి తరలించారు. - శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలోని 16 క్వారీల లెసైన్స్‌ను రద్దు చేశారు. స్థానికుల అభ్యంతరం మేరకు లీజును నిలిపివేశారు. దాదాపు 74.13 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ గుంతల నుంచి 20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి/ కంకరను తీశారు. మరో 20శాతం మేర తొలిగించారు. వీటిని కూడా డంపింగ్ యార్డు ప్రతిపాదనల్లో చేర్చారు. - తుక్కుగూడ -పెద్దఅంబర్‌పేట్ జంక్షన్ వరకు ఔటర్ నిర్మాణ పనులు దక్కించుకున్న ‘గాయిత్రీ’ కాంట్రాక్టు సంస్థ ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలను జరిపింది. సర్వేనం. 300/1లో ఈ మట్టిని తొలగించిన సదరు సంస్థ.. దీన్ని ఔటర్ నిర్మాణంలో వినియోగించింది. పెద్ద గొయ్యిగా ఏర్పడిన క్వారీని గార్బెజ్ డంపింగ్ కోసం వాడుకోవాలని నిర్ణయించారు. -
సీఎం ఆదేశాలతోనైనా ‘రింగ్’ పూర్తయ్యేనా?
మేడ్చల్ : మేడ్చల్ పరిధిలో కొన్నేళ్లుగా అసంపూర్తిగా ఉన్న అవుటర్ రింగ్‌రోడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతోనైనా పూర్తి అయ్యేనా అని స్థానికులు ఎదురు చూస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, పటాన్చెరువు, మేడ్చల్ మండలం మీదుగా శామీర్‌పేట వరకు హుడా రెండో ఫేజ్‌లో రింగు రోడ్డు నిర్మాణాన్ని నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి 2012 డిసెంబర్లో అట్టహాసంగా ప్రారంభించారు. మొదటి దశలో శంషాబాద్ నుంచి పటాన్చెరు వరకు నిర్మించిన రోడ్డుకు శామీర్‌పేట వరకు రెండో దశలో రింగు రోడ్డును నిర్మించారు. మేడ్చల్ మీదుగా వెళ్లే రోడ్డు అలైన్మెంట్లో రాజకీయాలు చేసి రూట్ మ్యాప్ మార్చారని భూములు కోల్పోయిన బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు మండలంలోని కండ్లకోయ వద్ద రోడ్డు నిర్మాణంపై స్టే విధించింది. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా రింగు రోడ్డుకు 44 జాతీయ రహదారిని, మేడ్చల్ గండి మైసమ్మను రోడ్డులకు అనుసంధానం చేసి ప్రారంభించింది. కండ్లకోయ వద్ద జాతీయ రహదారిపైనే జంక్షన్ ఏర్పాటు చేసిన అధికారులు అక్కడి నుంచి పటాన్చెరు వైపు వెళ్లాలంటే జాతీయ రహదారిపై మేడ్చల్ చెక్‌పోస్టు వరకు నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఎడమ వైపు తిరిగి మేడ్చల్ గండిమైసమ్మ ఆర్అండ్బీ రోడ్డులో రెండు కిలో మీటర్లు వెళ్లి సుతారిగూడ వద్ద ఉన్న రింగు రోడ్డు పైకి ఎక్కాలి. పటాన్చెరు నుంచి శామీర్‌పేట వెళ్లాలన్నా.. ఇదే రూట్లో వెళ్లాలి. దీంతో వాహన చోదకులకు ప్రయాణం నరకయాతనంగా మారింది. ఇదిలా ఉండగా.. ఈనెల 21న అవుటర్ రింగు రోడ్డు చుట్టూ సీఎం కేసీఆర్ పర్యటించారు. రింగురోడ్డు చుట్టూ మొక్కలు పెంచి అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెబుతూ.. అసంపూర్తిగా ఉన్న అవుటర్ రింగు రోడ్డును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో మూడేళ్లుగా అసంపూర్తిగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు సీఎం ఆదేశాలతోనైనా పూర్తి అవుతుందో వేచి చూడాలి. -
ముంబైలో భూగర్భ రింగ్‌రోడ్డు నిర్మాణం
ముంబై: ప్రతిపాదిత అహ్మదాబాద్-ముంబై జాతీయ రహదారికి కలిసేటట్లు నగరంలో భూగర్భ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం తెలిపారు. దీన్ని రూ.90 వేల కోట్ల అంచనావ్యయంతో నిర్మించనున్నట్లు వివరించారు. అలాగే సూరత్-ముంబై ఎలివేటెడ్ రోడ్డు ప్రతిపాదన కూడా ఉందన్నారు. దీనిపై ఇప్పటికే తగిన కార్యాచరణ చేపట్టామని, అయితే ఇప్పటివరకు ఎటివంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే అదేసమయంలో అహ్మదాబాద్-ముంబై హైవేకు టన్నెల్ రింగ్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించామన్నారు. కాగా, తాను హాలెండ్ పర్యటనలో ఉన్నప్పుడు టన్నెల్ రోడ్ ఆలోచన వచ్చిందని వివరించారు. టన్నెల్ రోడ్డు ఒక సెక్షన్ మహీమ్ క్రీక్ వద్ద ప్రారంభమై బాంద్రా-వర్లి సీలింక్, నారిమన్ పాయింట్లను కలుపుతూ వెళుతుందన్నారు. అలాగే మరో సెక్షన్ పనులు సెవ్రే వద్ద ప్రారంభమై సముద్రం కింద నుంచి జేఎన్పీటీ, ముంబై పోర్టులను కలుపుతుందని వివరించారు. -
కొసరుకు కొండంత
మంథని : మంథని గాంధీచౌక్ నుంచి సామాజిక వైద్యశాల, రావులచెరువుకట్ట, మందాట, పెంజెరుకట్ట మీదుగా గాంధీచౌక్ వరకు రింగ్‌రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రెండేళ్ల క్రితం రూ.4.09 కోట్లు కేటాయించింది. ఈ రహదారిలో పురాతణమైన కట్టడాలు ఉండటంతో నిర్మాణదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్ పలుమార్లు చర్చలు జరిపి 32 నుంచి 30 ఫీట్లకు, ఆ తర్వాత 28 ఫీట్లకు తగ్గించి విస్తరణకు శ్రీకారం చుట్టారు. పరిహారం పంపిణీలో ఆలస్యం జరగడంతో పనులు కొద్దినెలలు ఆగిపోయాయి. తిరిగి పనులు ప్రారంభమైనప్పటికీ కాంట్రాక్టర్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా నాణ్యతను విస్మరిస్తున్నాడు. 28 ఫీట్లు విస్తరించి అభివృద్ధి పనులు చేయాల్సి ఉండగా ఓ చోట 26 ఫీట్లు, మరో చోట మరో విధంగా విస్తరించి మురికి కాలువల నిర్మాణం చేపడుతున్నాడు. నిర్మాణాలు కోల్పోతున్న వారికి సుమారు రూ.2 కోట్ల చెల్లింపులు జరిగాయి. కనీసం ఒక్క ఫీటు సెట్‌బ్యాక్‌తో మురికి కాలువలు చేపట్టాల్సి ఉండగా, ఇంటి గోడల్లోనే నిర్మాణం చేస్తున్నారు. కాలువ పనులు సైతం ఇష్టారీతిలో చేస్తున్నారు. ఒక్కోచోట కనీసం పేరుకుపోయిన చెత్తను బయటకు తీసేందుకు ఉపయోగించే చిన్నపాటి పార కూడా పట్టనంత వెడల్పులో నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. నిర్మాణాల తొలగింపు విషయంలో నిబంధనలను విస్మరించడంతో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విస్తరణ పనులను మొదట్లో లేకపోతే చివరి నుంచి ప్రారంభించాల్సి ఉండగా ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఈ విషయంపై పంచాయతీరాజ్ ఎస్ఈ, డీఈలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిస్థితి మారడం లేదని పలువురు వాపోతున్నారు. ఆరు ఇంచుల పిల్లర్‌కు రూ.2లక్షలా? రోడ్డు విస్తరణ, అభివృద్ధి విషయంలో అధికారులు అక్రమాలకు పాల్పడతున్నారు. ఆరు ఇంచుల పిల్లర్ పోయిన వారికి రూ.2లక్షలు ఇచ్చి పెద్ద మొత్తంలో నష్టపోతున్న వారికి రూ.వేలల్లో పరిహారం మంజూరీ చేశారు. ఈ విషయంపై పలుమార్లు పంచాయతీరాజ్ ఎస్ఈకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. - గుడి అశోక్ 70 ఫీట్లు పోతున్నా రూ.2.45 లక్షలే.. ఏడు దర్వాజలు, ఒక షెట్టరు, ఇల్లు, కమాన్ దర్వాజతో కలిసి 70 ఫీట్ల వరకు రోడ్డు వెడల్పులో నష్టపోతానం. మాకు కేవలం రూ.2.45 లక్షల పరిహారం మంజూరు చేసిండ్రు. ఆ చెక్కును ఇంకా మా చేతికి ఇయ్యలేదు. మేం ఇంట్లో లేనప్పుడు మాకు సమాచారం ఇయ్యకుండా ఇల్లు కూల్చుతామని బెదిరిస్తుండ్రు. నష్టపరిహారం ఇయ్యకుండా ఇల్లు కూల్చితే మా గతేం కావాలె? - పాపిట్ల నందు సంబంధం లేనివారి పేరిట చెక్కు ఐదు ఫీట్ల వెడల్పుతో 12 ఫీట్ల పొడవుతో ఖాళీ స్థలం, రెండు బాత్రూంలు రోడ్డు విస్తరణలో కోల్పోతున్నం. మాకు కేవలం రూ.29 వేలు నష్టపరిహారం మంజూరు చేసిండ్రు. అది కూడా మా పేరిట కాకుండా సంబంధం లేని మరో వ్యక్తి పేరిట చెక్కు జారీ చేసిండ్రు. ఆర్డీఓకు ఫిర్యాదు చేసి మూడు నెలలైనా ఏ ఒక్క అధికారి వచ్చి విచారణ చేయలేదు. - వడ్లకొండ రవి అక్రమాలకు ఆస్కారం లేదు అంతర్గత రహదారి విస్తరణ, అభివృద్ధి పనుల్లో అక్రమాలకు ఆస్కారం లేదు. ఈ వ్యవహారంలో ఎవరైనా డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటాం. కొత్తగా నిర్మించిన కొన్ని భవనాల విషయంలో ఒకటి రెండు ఇంచుల తేడా ఉంటే మానవతాదృక్పదంతో వదిలివేశాం. - చంద్రశేఖర్, డీఈఈ, పీఆర్, మంథని -
నగరంలో రింగ్ రోడ్డు
న్యూఢిల్లీ: నగరవాసులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నగరంలో త్వరలో ఓ రింగ్ రోడ్డును నిర్మించనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రాజ్యసభ సమావేశం ముగిసిన అనంతరం పార్లమెంట్ నుంచి బయటికొచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. 4,700 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నామన్నారు. ‘నగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. ఈ సమస్య పరిష్కారం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా రూ. 4,700 కోట్లతో రింగ్‌రోడ్డును నిర్మిస్తాం. ఇది పూర్తిగా సిమెంట్ కాంక్రీట్‌తో నిర్మితమవుతుంది. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించాం. ఈ నెల 11వ తేదీతో దీని గడువు ముగుస్తుంది’ అని అన్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేస్తారన్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ సరిహద్దులుగా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నామన్నారు. ఈ ప్రాజెక్టులో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాలుపంచుకుంటాయన్నారు. -
రింగ్‌రోడ్డు సంగతేంది
వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి పలు సమస్యలపై అధికారుల నిలదీత వాడివేడిగా ‘కుడా’ సమీక్ష సమావేశం సాక్షి, హన్మకొండ : రింగురోడ్డు అలైన్మెంట్ లో మార్పులు చేయాలని సూచించినా... ఎందుకు సకాలంలో స్పందించడం లేదంటూ కార్పొరేషన్ అధికారులపై ప్రజాప్రతినిధులు ప్రశ్నల వర్షం ప్రశ్నించారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగే పనుల్లో ఐఏఎస్ అధికారి ముద్ర స్పష్టంగా కనిపించాలన్నారు. తొలి సమావేశం కావడంతో కేవలం సూచనలకే పరిమితమవుతున్నామని, ఇవి మలి సమావేశం కల్లా అమలు కావాలన్నారు. కాకతీయ నగరాభివృద్ధి సంస్థ, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పనితీరుపై హన్మకొండలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం జరిగింది. ఉదయం 11 నుంచి మధ్యామ్నాం 2:30 గంటల వరకు జరిగిన సమావేశానికి ఎంపీ కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేష్‌తో పాటు కలెక్టర్ గంగాధర కిషన్, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సువర్ణా పండదాస్ ఇతర అధికారులు హాజరయ్యారు. వరంగల్ నగరం చుట్టూ నిర్మించనున్న రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్పుపై సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. గతంలో రూపొందించిన మార్గంలో మార్పులు చేయాలని సూచించి నా... ఇంతవరకు ఆ పని ఎందుకు చేయలేదం టూ ఎంపీ కడియం శ్రీహరి అధికారులను నిల దీ ్డశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అలైన్‌మెంట్‌ను అంగీకరిస్తే జరిగే నష్టానికి ఎవరు బాధ్యులని, కీలకమైన అంశాల్లో నిర్లక్ష్యంగా ఉండడం మానుకోవాలని అధికారులకు సూచించారు. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా, ప్రభుత్వంపై భారం పడకుండా రింగురోడ్డు మార్గంలో వెంటనే మార్పులు చేపట్టాలన్నారు. మున్సిపల్ కమిషనర్‌గా శాలినిమిశ్రా పని చేసిన కాలంలో నగరం ఎంతో అభివృద్ధి చెందిందంటూ ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటారని గుర్తు చేశారు. అదేవిధంగా సువర్ణపండాదాస్ హయూంలో వరంగల్ న గరంలో అనేక మంచి కార్యక్రమాలు చేపట్టారనే పేరు వచ్చేలా పని చేయాలన్నారు. మంచినీటిపై దృష్టి పెట్టాలి నగర ప్రజల మంచినీటి అవసరాలకు 2.5 టీ ఎంసీల నీరు అవసరం... భద్రకాళి, వడ్డేపల్లి, ధర్మసాగర్ చెరువుల ద్వారా ప్రస్తుతం 1.7 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉం ది... దీంతో ఏడాదిలో వంద రోజుల పాటు నీ టికి కొరత ఏర్పడుతుందని..దీన్ని నివారిం చేందుకు ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. నగరంలో చెత్త ఎక్కడిక్కడే పేరుకుపోతున్నదని, పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్నారు. మొదటి సమావేశం కాబట్టి అధికారులను ఏమనడం లేదని.. రా బోయే సమావేశం నాటికి ఈ సమస్యలను పరి ష్కరించాలని సూచించారు. ఈ క్రమంలో కలెక్టర్ జి.కిషన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలు తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకోవాలనిఅడిషనల్ కమిషనర్ శంకర్‌కు సూచించారు. పారిశుద్ధ్యం , పచ్చదనంపై బా ధ్యతలను డివిజన్ అధికారులకు అప్పగించామన్నారు. వేయిస్తంభాల గుడి అభివృద్ధిలో భా గంగా ఆలయం చుట్టూ వంద మీటర్ల వరకు భూమిని సేకరించే పనిని వేగవంతం చేయాల ని ‘కుడా’ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇది కూడా మేమే చెప్పాలా... బాలసముద్రంలోని ఏకశిల పార్కులో ప్రొఫెసర్ జయశంకర్‌సార్ విగ్రహం చీకట్లో ఉంది... కనీసం ఇక్కడ లైటు ఏర్పాటు చేయాలన్న ధ్యాస కూడా కార్పొరేషన్ సిబ్బందికి లేదు... పబ్లిక్‌గార్డెన్ కళావిహీనంగా మారింది... పచ్చదనం తగ్గిపోయింది... బల్లలు పాడయ్యాయి. టౌన్‌హాల్ పరిస్థితీ అలానే ఉంది... మ్యూజికల్ గార్డెన్ అసలు ఉందా, లేదా అనే పరిస్థితి ఉంది... ఇలాంటి చిన్నచిన్న విషయాలు సైతం తాుమే చెప్పాలా.. అధికారులకు తెలియవా అంటూ వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ప్రశ్నల వర్షం కురిపించారు. కేయూ జంక్షన్‌ను జయశంకర్ జంక్షన్‌గా అభివృద్ధి చేయాలని, ఇప్పటికైనా కమిషనర్ నగరంలో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవాలని వారు పలు సూచనలు చేశారు. అధ్వానస్థితిలో విలీన గ్రామాలు వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లో విలీనమైన 42 గ్రామాల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఈ గ్రామాల్లో పాలన పూర్తిగా స్తంభించిందన్నారు. ఇక్కడ రోడ్లు, మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్నా... అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అంతకుముందు కడియం శ్రీహరి మాట్లాడుతూ అదాలత్ సెంటర్ నుంచి నాయుడు పెట్రోల్ంపు వరకు నిర్మించిన రోడ్డు నాసిరకంగా ఉందన్నారు. దీనికి సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. నగర పరిధిలో అన్ని రోడ్లు పాడయ్యాయని, దీనిపై అధికారులు దృష్టి సారించాలన్నారు. -
ఇన్నర్ పనులకు బ్రేకులు
అడుగడుగునా అవాంతరాలు 75 శాతం పూర్తయిన ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణం నిదానంగా సాగుతున్న పనులు ఇప్పటికే మూడేళ్లు ఆలస్యం సాక్షి, విజయవాడ : నగరంలో వీజీటీఎం ఉడా చేపట్టిన ఇన్నర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్ట్‌కు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా వాహన రాకపోకలను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఉడా ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసింది. అయితే తరచూ కలుగుతున్న ఆటంకాలను ఉడా పట్టించుకోకపోవడం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. వెరసి ప్రాజెక్ట్ నత్తనడకన సాగుతోంది. వాస్తవానికి 2012కల్లా పూర్తికావాల్సిన ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 75 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. కనీసం ఇప్పుడు మళ్లీ మొదలుపెడితే కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల కాలవ్యవధిలో ప్రాజెక్ట్ పూర్తవుతుంది. కాకపోతే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రాజెక్ట్ పనులను నాలుగు ఫేజ్‌లుగా విభజించి ఏకకాలంలో మొదలుపెట్టారు. 1, 4 ఫేజ్ పనులు ఇప్పటికే పూర్తికాగా, రెండో ఫేజ్ పనులు 85 శాతం పూర్తయ్యాయి. ఇక గుణదల వద్ద ఫ్లైవోవర్ గడ్డర్స్ కూలిన నేపథ్యంలో మూడో ఫేజ్ పనులు 11 నెలలుగా నిలిచిపోయాయి. నాలుగు ఫేజ్‌లుగా పని విభజన.. అటు నగరాభివృద్ధి, ఇటు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే క్రమంలో ఉడా 2009లో ఇన్నర్ రింగ్‌రోడ్డు పనులకు శ్రీకారం చుట్టింది. మిల్క్‌ప్రాజెక్ట్ ఫ్లైవోవర్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకు 9.84 కిలోమీటర్ల మేర ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించి, ఆ మేరకు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసి ప్రభుత్వ అనుమతితో పని ప్రారంభించారు. త్వరగా పూర్తవ్వాలనే ఉద్దేశంతో పనులను నాలుగు ఫేజ్‌లుగా విభజించి ఏకకాలంలో మొదలు పెట్టారు. ఇన్నర్ రింగ్‌రోడ్డులో భాగంగా 9.84 కి.మీ. రోడ్డు నిర్మాణం, గుణదల, రామవరప్పాడు ప్రాంతాల్లో రెండు ఫ్లైవోవర్ల నిర్మాణానికి మొత్తం రూ. 74.24 కోట్లతో ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం 1, 4 ఫేజ్‌ల్లో కేటాయించిన పనులన్నీ పూర్తయ్యాయి. ఈ ఫేజ్‌ల్లో ఎక్కువగా రోడ్డ నిర్మాణ పనులు మాత్రమే ఉండడంతో వంద శాతం పూర్తయ్యాయి. 2, 3 ఫేజ్‌ల్లో రోడ్ల నిర్మాణాలతోపాటు రెండు ఫ్లైవోవర్లు ఉండడంతో కొంత నత్తనడకన సాగాయి. రెండో ఫేజ్‌లో పనులు 85 శాతం పూర్తయ్యాయి. రోడ్డు ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. పనులు ప్రస్తుతం జరుగుతూనే ఉన్నాయి. నాలుగేళ్లలో పూర్తికావాల్సి ఉన్నా.. వాస్తవానికి 2009లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ 2012 నాటికి పూర్తికావాల్సి ఉంది. ఈ మేరకు ఉడా అధికారులు ప్రాజెక్ట్‌కు కాలవ్యవధిని నిర్ణయిస్తూ ఒప్పందం కూడా చేసుకున్నారు. అయినా 2012 నాటికి 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. పనులు వేగవంతం చేయాలని ఉడా అధికారులు కాంట్రాక్టర్‌కు పదేపదే సూచించడం మినహా సీరియస్‌గా దృష్టి సారించిన దాఖలాలు లేవు. దీంతో నిర్ణీత గడువు దాటి దాదాపు రెండేళ్లు కావస్తోంది. మొత్తం మీద ప్రాజెక్ 2015 చివరి నాటికి పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల కోసం.. తాజాగా మూడో ఫేజ్ పనులు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే మొదలవుతాయి. దీనికోసం ఉడా అధికారులతో పాటు కాంట్రాక్టర్ కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. గత డిసెంబర్లో గుణదల సమీపాన నిర్మాణంలో ఉన్న ఫ్లైవోవర్ నాలుగు గడ్డర్లు అకస్మాత్తుగా కూలిపోయాయి. రూ. 23.12 కోట్ల నిర్మాణ వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. తొలి విడతగా రూ.13 కోట్లు కాంట్రాక్టర్‌కు ఉడా చెల్లించింది. గడ్డర్లు కూలిన ఘటనపై చెన్నై ఐఐటీ బృందంతో, ఇర్మా సంస్థతో దర్యాపు చేయించారు. ఆ తర్వాత రాష్ట్ర మున్సిపల్ శాఖ హైపవర్ కమిటీతో ఒక విచారణ, జిల్లా విజిలెన్స్ అధికారులతో మరో విచారణ నిర్వహించారు. అన్ని నివేదికలు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై మున్సిపల్ శాఖ దృష్టి సారించి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చాకే మూడో ఫేజ్ పనులు మొదలుపెడతారు. కాగా ప్రభుత్వం మరో వారంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
మోడల్ మున్సిపాలిటీగా గజ్వేల్
గజ్వేల్: గజ్వేల్ మున్సిపాలిటీ(నగర పంచాయతీ)ని రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దడానికి సంబంధిత అధికారులు కసరత్తును ప్రారంభించారు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పట్టణాన్ని దేశంలోనే ‘బంగారు తునక’గా మారుస్తానని హామీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే కార్యాచరణ సిద్ధమవుతోంది. తొలి దశ అభివృద్ధికి రూ.266 కోట్లతో ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు అందజేశారు. ఇందులో మౌలిక వసతులతోపాటు రింగ్ రోడ్డు ప్రతిపాదనలున్నాయి. వీటితో గోదావరి సుజల స్రవంతి పథకం నీటిని రంగారెడ్డి జిల్లా షామీర్పేట మండలం ఘనపూర్ వద్ద ట్యాప్ చేసి ఇక్కడికి తీసుకురావడానికి రూ.70.58 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కొద్ది రోజుల్లోనే ఈ ప్రతిపాదన సీఎం ఆమోదం పొందనుంది. ఈ పథకం అమలైతే గజ్వేల్ నగర పంచాయతీ వాసులకు 24 గంటలూ నీళ్లు వచ్చే అవకాశముంది. అంతేకాకుండా నగర పంచాయతీని క్లీన్ టౌన్‌గా తీర్చిదిద్దడానికి చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటుకూ కసరత్తు జరుగుతోంది. సేకరించిన చెత్తను కంపోస్టుగా మార్చడానికి కూడా ఓ సంస్థ ముందుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా రైతు బజార్‌ను నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వీటన్నింటీతోపాటు గజ్వేల్‌ను పచ్చదనంతో నింపేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ అంశాలపై చర్చించడానికి నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో సమావేశమయ్యారు. కొద్ది రోజుల్లో అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ అమలుకానుందని సీఎం వెల్లడించినట్టు తెలుస్తోంది. -
తిరుమలలో ఆక్టోపస్ కమాండోల మాక్ డ్రిల్
-
తిరుమలలో ఆక్టోపస్ కమాండోల మాక్ డ్రిల్
సాక్షి, తిరుమల: యాక్షన్ టీంగా పరిగణించే ఆక్టోపస్ కమాండోలు గురువారం తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. తీవ్రవాది ప్రయాణించే వాహనాన్ని మరో వాహనంతో ఛేజ్ చేయడం.. చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకునే విధానాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు. గురువారం ఉద యం తిరుమలలో బాలాజీనగర్ రింగ్‌రోడ్డులో నిర్వహించిన మాక్ డ్రిల్ సాగిందిలా.. మధ్యాహ్నం 12 గంటలకు హఠాత్తుగా ఓ కారు రింగ్‌రోడ్డుపైకి దూసుకుపోయింది. వెనుకే మరో కారు మెరుపు వేగంతో దూసుకొచ్చింది. వాహనం నుంచే కమాం డో సిబ్బంది తుపాకులు చేతపట్టి ముందు వెళ్లే వాహనంపై గురిపెట్టారు. చాకచక్యంగా ముందుకారును అడ్డగించారు. సెకన్ల వ్యవధిలోనే కమాం డోలు తుపాకులు, పిస్తోళ్లు చేతపట్టుకుని వాహనం దిగారు. అంతకుముందే ఆ రహదారి, ముళ్లపొదలు, చెట్ల మధ్యలో బృందాలుగా కాపుకాచిన ఆక్టోపస్ కమాండోలు హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చి ఆయుధాలతో అడ్డగించారు. వాహనం వద్దకు వెళ్లి తీవ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీవారి ఆలయ భద్రత కోసం తిరుమలలో ఏర్పాటు చేసిన ఆక్టోపస్ యూనిట్ కమాండో దళాలకు ప్రతినెలా ఏదో ఒక అంశంపై మాక్ డ్రిల్ చేస్తూ ఉగ్రవాదులు, నేరస్తులు, నిందితులను పట్టుకునే విషయంలో ఇలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. -
నర్సీపట్నం చుట్టూ రింగు రోడ్డు
పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం టౌన్: నర్సీపట్నం చుట్టూ రింగ్ రోడ్డును నిర్మించనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడుతూ రింగురోడ్డు ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా విభాగం కింద 912 పంచాయతీల్లో 17 వేల 634 బోర్లు, 2,567 మంచినీటి పథకాలున్నాయన్నారు. వీటిలో పనిచేస్తున్నవి ఎన్ని, పని చేయనివి ఎన్ని తదితర వివరాలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. వారిచ్చే నివేదిక ఆధారంగా పని చేయని వాటిని వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు. జిల్లాలో విద్యకు ప్రాధాన్యం ఇచ్చేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. జిల్లాలో 247 ఉన్నత, 304 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయన్నారు. వీటిలో తాగునీరు, ఫ్లోరింగ్, మరుగుదొడ్ల సౌకర్యాలకు చర్యలు చేపట్టామన్నారు. పీఎంజీఎస్‌వై పథకం ద్వారా గిరిజన గ్రామాల్లో తారురోడ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ.201 కోట్లతో చేపట్టాల్సిన 62 పనులు అప్పటి గిరిజన సంక్షేమశాఖ మంత్రి బాలరాజు నిర్వాకంతో నిరుపయోగమైనట్టు తెలిపారు. వారం రోజుల్లో పాడేరులో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఉపాధి పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో రూ.1500 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇన్నీ నిధులు ఖర్చు చేసినా శాశ్వత పనులు కానరాలేదన్నారు. ఇకపై కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు శాశ్వత పనులకు ప్రాధాన్యమిస్తామన్నారు. ఈ పనుల్లో రూ.3 కోట్ల 72 లక్షల అవినీతి జరిగిందని అధికారులు చెబుతున్నా వాస్తవం కాదన్నారు. జరిగిన పనుల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు. అవినీతి రుజువైతే సోషల్ అడిట్ అధికారులు కూడా తప్పు చేసినట్టవుతుందన్నారు. వాస్తవంగా ఉపాధి పనులకు వెళ్లే వారి సంఖ్య కంటే తప్పుడు మస్తర్లు వేస్తున్నారన్నారు. అమలాపురం పంచాయతీలో జీడిపిక్కల కర్మాగారానికి వెళ్లే మహిళలు పేరున మస్తర్లు వేశారన్నారు. వెంటనే ఆ వీఆర్పీని విధుల నుంచి తొలగించాలని పీడీని ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఉపాధిలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఆదర్శ రైతుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు తెలిపారు. ప్రస్తుత మార్కెట్ కమిటీ, దేవాలయాల కమిటీలను రద్దు చేసి కొత్తవాటిని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. సమర్థులను వాటిలో నియమించనున్నట్టు తెలిపారు. -
గజ్వేల్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
- నివేదికలతో రావాలంటూ అన్ని శాఖల అధికారులకు కేసీఆర్ ఆదేశం - కసరత్తులో అధికారుల బిజీబిజీ - 4న సంగారెడ్డిలో సమీక్షా సమావేశం గజ్వేల్, న్యూస్‌లైన్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్న కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్ అభివృద్ధిపై సీరియస్‌గా దృష్టి సారించారు. జూన్ 2న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే... 4న సంగారెడ్డిలో గజ్వేల్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష చేయనున్నట్లు తె లుస్తోంది. శాఖల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి నివేదికలతో రావాలని ఇప్పటికే కేసీఆర్ ఆదేశించిన తరుణంలో ఆయా శాఖల అధికారులు కసరత్తులో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులు రెండ్రోజులుగా నివేదికలను రూపొందించే పనిలో మునిగిపోయారు. గజ్వేల్ పట్టణం చుట్టూ చేపట్టాల్సిన రింగ్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించే పని వేగంగా సాగుతున్న సంగతి తెల్సిందే. ఇక ఇరిగేషన్ శాఖ అధికారులు నియోజకవర్గంలోని జలాశయాల సామర్థ్యం పెంపు, చెరువులు, కుంటల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక రూపొందిస్తున్నారు. నియోజకవర్గంలో కొత్తగా వేయాలనుకున్న రోడ్లు, భవనాలు, గ్రామీణ ప్రాంతాల్లో కల్పించాల్సిన మౌళిక వసతులపై పంచాయతీరాజ్ శాఖ నివేదికలు రూపొందిస్తోంది.మిగితా శాఖలు కూడా నివేదికల రూపకల్పనలో బీజీబీజీగా ఉన్నాయి. -
గజ్వేల్‌కు మహర్దశ!
నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ నుంచి ఇండేన్ గ్యాస్ కార్యాలయం, ఇందిరాపార్క్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు గత కొంత కాలంగా విపరీతమైన ట్రాఫిక్ సమస్య నెలకొనడంతో స్థానికులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి సంత జరిగే బుధవారం నాడు ప్రధాన రహదారిపై అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి నెలకొని ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ మార్గం గుండానే భారీ వాహనాలు వెళ్లాల్సి రావడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 9న నామినేషన్ వేయడానికి, 18న మెతుకుసీమ గర్జన పేరిట నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు వచ్చిన సందర్భంలోనూ ట్రాఫిక్ సమస్యను కేసీఆర్ స్వయంగా అనుభవించారు. ఆయన వాహన శ్రేణిని బయటకు తీసుకురావడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఈ క్రమంలోనే కేసీఆర్ మెతుకు సీమగర్జన సభలో ట్రాఫిక్ సమస్యను ప్రధానంగా ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గజ్వేల్‌లో రింగ్ రోడ్డు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆర్అండ్బీ అధికారులకు పనులను పురమాయించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్, సిద్దిపేట ఈఈ బాల్‌నర్సయ్య, గజ్వేల్ శాఖ డిప్యూటీ ఈఈ బాల్‌నర్సయ్య తదితరులు సోమవారం పట్టణంలో సర్వే చేపట్టారు. అధికారుల కథనం ప్రకారం పట్టణంలోని 133/33కేవీ సబ్స్టేషన్నుంచి జాలిగామ, బయ్యారం చౌరస్తా, క్యాసారం, ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్టాండ్, శ్రీగిరిపల్లి, హషీమ్కళశాల, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ పాలిటెక్నిక్ కళాశాల మీదుగా తిరిగి సబ్‌స్టేషన్ వరకు రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. రింగ్ రోడ్డు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. రింగ్‌రోడ్డు నిర్మాణానికి ఆర్అండ్బీ అధికారులు స్థల పరిశీలన జరిపారు. ఈ క్రమంలో నగరపంచాయతీ పరిధిలోని క్యాసారంలో టీఆర్ఎస్ ముఖ్య నేతలు సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ముఖ్యనేతలు డాక్టర్ యాదవరెడ్డి, గాడిపల్లి భాస్కర్ టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, జిల్లా నాయకులు ఆకుల దేవేందర్ తదితరులతో సమావేశమై అభిప్రాయ సేకరణ చేపట్టారు. మొత్తానికి గజ్వేల్‌లో రింగ్‌రోడ్డు నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఔటర్ రింగ్‌రోడ్డు పై రెండు కార్లు ఢీ
-
దశ మారుస్తాం
60 టీఎంసీల సామర్థ్యం గల రెండు ప్రాజెక్టులు సాధిస్తాం నగరంలో అండర్డ్రెయినేజీ, రింగ్‌రోడ్డు నిర్మిస్తాం ఉక్కు పరిశ్రమ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి జయశంకర్ పేరుపెడతాం : టీఆర్ఎస్ నేత కేసీఆర్ హామీ వరంగల్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ అభివృద్ధి చెందాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆకాంక్ష వ్యక్తం చేశారు. నలభైయేండ్ల క్రితం వరంగల్ ఎట్లుందో ఇప్పుడూ అట్లనే ఉంది.. ఇక్కడ బలమైన నాయకుడు రాలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. నగరశివారు మడికొండలో గురువారం రాత్రి జరిగిన ‘ఓరుగల్లు గర్జన’ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పూర్తి భరోసా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వస్తే జిల్లాలో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. వరంగల్ జిల్లాలో గొలుసుకట్టు చెరువులతో వాటర్‌షెడ్‌ను కాకతీయులు గొప్పగా నిర్మించారని, 11శతాబ్దంలోనే ప్రపంచానికి వాటర్షెడ్లు నేర్పిన జిల్లాలో మంచినీళ్ళకు ఇబ్బంది పడుతున్నారని, ఈ కరువు పరిస్థితి మారాలన్నారు. హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. అజంజాహి మిల్లు వలసవాదుల పాలనలో నాశనమైదని, ఆ మిల్లు స్థానంలో తమిళనాడు తిరువూరు తరహాలో టెక్స్టైల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారు. కాజీపేట రైల్వే జంక్షన్, మామునూరు ఎయిర్‌పోర్టు ఉన్నందున టెక్స్టైల్ హబ్‌గా అభివృద్ధి చెంది వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉందన్నారు. జిల్లాలో పత్తి ఎక్కువ పండుతుందని, మూడు నాలుగు జిల్లాలకు కలిపి కాటన్ మార్కెట్ విస్తరించి ఇక్కడే కొనుగోలు చేసేవిధంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ‘పొన్నాల లక్ష్మయ్య పొంకనాలు మాట్లాడుతున్నాడు.. నగరానికి అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ ఎందుకు తేలేకపోయాడో చెప్పాలి’ అని నిలదీశాడు. కమీషన్లు వసూలు చేసుకునేందుకే టైమ్ సరిపోలేదా? అంటూ విమర్శించారు. దాస్యం వినయభాస్కర్, కొండా సురేఖలను గెలిపిస్తే మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఇక్కడ అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి తానే శంకుస్థాపన చేస్తానని, రింగ్‌రోడ్డును తానే పర్యవేక్షించి నిర్మాణం చేయిస్తామని చెప్పారు. వరంగల్ ప్రగతిబాట పట్టాలి..ఎవడు అడ్డమొస్తడో చూస్తానంటూ సవాల్ చేశారు. చంద్రబాబు హయంలో దేవాదులకు శంకుస్థాపన చేసిండ్రు... తర్వాత ఆరేండ్లు పొన్నాల లక్ష్మయ్య భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఈ ప్రాజెక్టు ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు నీ చేతుల తెలంగాణ పెడితే జిల్లాకు నీళ్లొస్తయా? అని నిలదీశారు. ‘పొన్నాల ఒక్కనాడైనా ఉద్యమంలో ఉన్నడా? యాకూబ్‌రెడ్డిని పశువులెక్క చితక్కొట్టించిండు. ఇంటిచుట్టూ ముళ్ళకంచెలు పెట్టుకున్నడు’ అని మండిపడ్డారు. ఉద్యమాన్ని చేసినట్లు జిల్లాలో నీళ్ళు తెచ్చి పారిస్తం.. పక్కనే గోదావరిలో కావాల్సినన్ని నీళ్ళున్నయి. 60 టీఎంసీల సామర్థ్యంతో రెండు ప్రాజెక్టులు కడుతమని హామీ ఇచ్చారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. జూరాల-పాకాల ప్రాజెక్టును జబర్దస్తీగా సాధించుకుంటామని, 400 కిలో మీటర్లు లిఫ్ట్లేకుండా నీళ్లు వస్తాయని, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలో చెరువులు, కుంటలు నీళ్లతో నింపొచ్చన్నారు. కేంద్రంతో కొట్లాడి ఖమ్మం, వరంగల్ సరిహద్దులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, రైల్వే వ్యాగన్ పరిశ్రమ, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని, కాజీపేటను డివిజన్‌గా తీర్చిదిద్దుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇక్కడ కాకతీయుల వారసత్వ సంపద ఉందని, రామప్ప, పాకాల, లక్నవరం ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా చేసి ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాగా పేరుపెడ్తామని ఆయన చెప్పారు. జయశంకర్ తనకు ఉద్యమగురువని, బతికున్నంత కాలం ఆయన తన గుండెల్లో ఉంటారని కేసీఆర్ అన్నారు. -
పగుళ్లు జాస్తి...నాణ్యత నాస్తి
పటాన్చెరు రూరల్, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రింగురోడ్డు పనుల్లో నాణ్యతాలోపాలు బయటపడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడడం...కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేయడంతో రింగ్‌రోడ్డుపై చాలా చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. పటాన్చెరు మండలంలో 8 గ్రామాల్లో విస్తరించి ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణమంటే వాహనదారులు హడలిపోతున్నారు. పనుల్లో నాణ్యత లోపించడంతో పోచారం వద్ద నక్కవాగుపై నిర్మించిన వంతెనకు అప్పుడే పగుళ్లు వచ్చాయి. సర్వీసు రోడ్డుపై నిర్మించిన వాకింగ్ ట్రాక్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉంది. సర్వీసు రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలేదు. ముత్తంగి గ్రామం వద్ద సర్వీసు రోడ్డు నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ వైపు తిరిగేందుకు సరైన రోడ్డు నిర్మాణం చేయకుండా వదిలేయడంతో భారీ వాహనాలు ముత్తంగి గ్రామం నుంచి రోడ్డు క్రాసింగ్ చేస్తున్నాయి. దీంతో అక్కడ ప్రతి రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. రింగు రోడ్డుపై నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్‌కు వెళ్లేందుకు నిర్మించిన వంతెనపై నుంచే సర్వీసు రోడ్డు వాహనాలను కూడా అనుమతిస్తే ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలను నివారించవచ్చు. కానీ అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోవడం లే దు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రింగురోడ్డు సర్వీసు రోడ్డును పూర్తిగా నిర్మించి, రోడ్డు క్రాసింగ్లను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటివరకు టోల్ వసూళ్లను నిలిపివేయాలని వారు కోరుతున్నారు. -
రింగు రోడ్డులో రూ. 184 కోట్ల స్కాం
మరో భారీ కుంభకోణం వెలుగుచూసింది. రింగురోడ్డు నిర్మాణంలో ఏకంగా రూ. 184 కోట్ల అవినీతి బయటపడింది. ఢిల్లీలోని షీలాదీక్షిత్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2010లో కామన్వెల్త్ క్రీడలకు ముందు రింగ్ రోడ్ బైపాస్ నిర్మాణంలో ఈ అవినీతి జరిగిందని, దీనిపై ఏసీబీ విచారణ జరిపించాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కోరింది. దీంతో ఏసీబీ ముందుగానే ఓ ఎఫ్ఐఆర్ దాఖలుచేసి విచారణ మొదలుపెట్టింది. ఇందులో మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ పాత్రను కూడా శోధించనున్నారు. సాలింగఢ్ కోట నుంచి వెలోడ్రమ్ రోడ్డు వరకు నిర్మించిన రింగురోడ్డులో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నట్లు ప్రధానమంత్రి నియమించిన షుంగ్లు కమిటీ తేల్చిచెప్పింది. ఈ ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా చేసి ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీని మొత్తం విలువ రూ. 407 కోట్లు. ఈ ప్రాజెక్టులో సామగ్రితో పాటు కూలీల ఖర్చును కూడా కాంట్రాక్టర్లు ఎక్కువ చేసి చూపించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 184 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై ఏసీబీ విచారణతో నిగ్గుతేల్చాలని కేజ్రీవాల్ సర్కారు కోరింది. -
బైపాస్...టైం పాస్
వనపర్తిలో బైపాస్ రహదారి నిర్మాణానికి అధికార యంత్రాంగం చేస్తున్న కసరత్తు అడుగు ముందుకు..రెండడుగులు వెనక్కు చందలా మారుతోంది. భూమి కొనుగోలుకు అప్పట్లో రూ. 50లక్షలు కేటాయించి పదెకరాలు సేకరించాలనుకున్నారు. రూ.1.50 లక్షలు వెచ్చించి సర్వే చేయడంతో పట్టణవాసుల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. ఇంతలో భూమిరేట్లకు రెక్కలు మొలవడంతో అధికారులకు సేకరణ అంశం క్లిష్టంగా మారింది. నేతలూ దీనిపై పెదవి విప్పకపోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా ఏడేళ్లుగా ఆ దిశగా ఒక్క అడుగూ పడలేదు. ఇప్పుడు సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అంశం మళ్లీ తెరమీదకొచ్చింది. నేతల నోటికి తాళం ఎందుకు...? రోజూ రోజుకు పెరిగిపోతున్న టాఫిక్ సమస్య నియంత్రిచేందుకు గతంలో వనపర్తిలో రింగ్ రోడ్డు ఏర్పాటును ప్రతిపాదించారు. గతంలోనే ఇక్కడ బైపాస్ రహదారి నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు మంజూరైన నిధులు సహితం రెండున్నరేళ్లపాటు నాన్చినాన్చి తిరిగి పంపించేశారు. ప్రగల్భాలు పలికిన మన నేతలు సైతం నోటికి తాళం వేసుకొని ఉండటంతో బైపాస్ రహదారి లక్ష్యం నీరుగారుతూ టైంపాస్‌గా మారింది. అటు రోడ్ల విస్తరణ జరగాక, ఇటు బైపాస్ రహదారి అమలుకు నోచుకోకపోవడంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. అప్పటి గ్రామీణాభివద్థి శాఖ మంత్రి చిన్నారెడ్డి సూచన మేరకు 2008 మేలో ఇక్కడి అధికారులు బైపాస్ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి అప్పటి రోడ్డు భవనల శాఖ మంత్రి జీవన్‌రెడ్డికి, ఆ శాఖ ఇంజనీర్‌కు ప్రతిపాదనలు పంపించారు. రూ. 37 కోట్లు అవసరం ఆవుతాయని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. పట్టణ శివారు ప్రాంతంతోని చిట్యాల రోడ్డు, గోపాల్పేట్, పానగల్, పెబ్బేర్ రహదారులను కలుపుతూ ప్రతిపాదనలు రూపొందించారు. సుమారు 8 కిలో మీటర్ల పోడవున దీనిని అమలు చేయాలన్నుకున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకరావడంలో అప్పటి మంత్రి విఫలమైయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రావుల చంద్రశేఖర్‌రెడ్డి సహితం ఈ ఊసే ఎత్తకపోవడంతో రింగ్ రోడ్డు ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. గతంలో బైపాస్ రహదారి నిర్మాణం చేయడానికి హాడవిడి చేసిన నేతలు ఇప్పుడు బైపాస్ గురించి మాట్లాడటంగానీ, అలాంటి ప్రయత్నాలు నేతలెవ్వరూ చేయడం లేదనేది బహిరంగా రహస్యమే. స్థల సేకరణ జగని కారణంగా బైపాస్ రహదారికి మంజూరైన రూ.80 లక్షలు రెండేళ్ల పాటు మురిగి వెనక్కి వెళ్ళిపోయాయంటే మన నేతల అలసత్వం ఏ పాటిదో అర్ధం అవుతుంది. 2005లో అప్పటి సీఎం దివగంత వైఎస్సార్ నగరబాటలో భాగంగా వనపర్తి పట్టణంలో రహదారుల అభివద్థి ఏర్పాటుకు రూ. 2.5కోట్ల నిధులు కూడా మంజూరు చేశారు. పెబ్బేర్, కొత్తకోట, రహదారుల విస్తరణ రూ. 1.70 కోట్లతో పనులు చేపట్టారు. మిగిలిన రూ. 80 లక్షలతో బైపాస్ రహదారిని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించనున్నారు. నిర్మాణం ఇలా చేయాలన్నుకున్నారు... వనపర్తిలోని చిట్యాల చింతల హనుమాన్ దేవాలయం రాజనగరం, నాగవరం, క్రాస్ రోడ్డు వరకు సుమారు 1.6 కిలో మీటర్ల పోడవు 20-30 ఫీట్ల వెడల్పుగా బైపాస్ రహదారిని ఏర్పాటు చేయాలని భావించారు. -
మైసూరు సమీపంలో మదపుటేనుగులు
= సకాలంలో స్పందించిన అధికారులు = అటవీ ప్రాంతంలోకి తరిమివేత = సంఘటనపై అసహనం వ్యక్తం చేసిన సీఎం మైసూరు, న్యూస్‌లైన్ : నగర శివారు ప్రాంతంలోకి అడవి ఏనుగులు ప్రవేశించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రెండేళ్ల క్రితం అటవీ ప్రాంతంలో నుంచి నగరంలోకి ప్రవేశించిన ఓ ఏనుగు దారుణంగా ఓ వ్యక్తిని హతమార్చిన వైనాన్ని రాచనగరి వాసులు ఇంకా మరవలేదు. సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకు మైసూరు శివారులోని తడూరు వద్ద ఉన్న ప్రైవేట్ చిత్ర వర్ణ రిసార్ట్ వెనుక ఎనిమిది అడవి ఏనుగులు విడిది చేశాయి. వాటిని గమనించిన స్థానికులు ఉరుకులు పరుగులతో గ్రామంలోకి చేరుకున్నారు. అనంతరం ఆ ఏనుగులు రింగ్ రోడ్డు వైపు వెళ్లాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సకాలంలో అప్రమత్తమయ్యారు. మైసూరుకు అత్యంత సమీపంలో చేరుకున్న ఏనుగులను గుర్తించి, వాటిని అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు నానాకష్టాలు పడ్డారు. ఏసీఎఫ్ బసవరాజు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది, స్థానికులు విశేషంగా శ్రమించారు. కాగా, మైసూరుకు అత్యంత సమీపంలో అడవి ఏనుగుల గుంపు రావడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలోని టీ నరసిపురలో ఉన్న తలకాడులో పంచలింగ దర్శనం వేడుకలను ప్రారంభించిన ఆయనకు ఏనుగుల సంచారంపై అధికారులు తెలియజేశారు. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేస్తూ జనవాసాల్లోకి వన్యప్రాణులు ప్రవేశించి ప్రజల ప్రాణాలు తీస్తున్నా అధికారుల మొద్ద నిద్ర వీడడం లేదంటూ మండిపడ్డారు. విషయంపై వెంటనే అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి మరింత సమాచారాన్ని రాబట్టుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. -
డీఎస్ సమాధానం చెప్పాలి
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : నిజామాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు, బైపాస్‌రోడ్ల పనుల్లో భారీ అక్రమాలు జరిగాయని తెలంగాణ రాజకీయ జేఏసీ నాయకులు ఆరోపించారు. వీటి వెనుక మాజీ పీసీసీ అధ్యక్షులు, ఎమ్యెల్సీ డి.శ్రీనివాస్ హస్తం ఉందన్నారు. జేఏసీ నాయకులు గోపాల్ శర్మ, గైని గంగారాం, వి ప్రభాకర్,భాస్కర్, దాదన్నగారి విఠల్‌రావు తదితరులు ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అండర్‌డ్రైనేజీ, రింగురోడ్ల పనులను పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ పనులు జరగక ముందే అప్పటి సీమాంధ్ర కలెక్టర్లతో డీఎస్ కుమ్మక్కై కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించారన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అసంపూర్తిగా నిలిచిపోయినందున నగరంలో రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయన్నారు. డ్రైనేజీకి సంబంధించి ప్రతి వార్డులో మ్యాన్‌హోల్‌లు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. ఇళ్ల నుంచి కనీసం మ్యాన్‌హోల్‌కు పైప్‌లైన్ కనెక్షన్ ఇవ్వలేక పోయారని తెలిపారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ. 50 కోట్లు మంజూరైనా ఇంత వరకు 50 శాతం కూడా పనులు ప్రారంభించలేదన్నారు. బైపాస్ రోడ్డులో భూములు కోల్పోయిన రైతులకు రూ. 29 కోట్లు నష్టపరిహారం అందించాల్సి ఉండగా రూ. 4 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. డీఎస్ కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం చేస్తూ అతని అనుచరులైన కొందరు అధికార పార్టీ నేతలు కాంట్రాక్టర్లు, అధికారుల నుంచి కమీషన్లు తీసుకుంటున్నారని విమర్శించారు. ఔటర్ రింగ్‌రోడ్డు, అండర్‌డ్రైనేజి, బైపాస్‌రోడ్డులలో అక్రమాలపై న్యాయవిచారణకు జేఏసీ పోరాటం చేస్తుందన్నారు. 2010 ఉపఎన్నిక ల సందర్భంగా డీఎస్ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డితో సుమారు రూ. 95 కోట్ల వ్యయంతో అండర్ డ్రేనేజి పనులను ప్రారంభింపచేయించారని, నిజామాబాద్ నగరాన్ని స్వర్గం చేస్తానని చెప్పి ఇప్పుడు ప్రజలకు నరాకాన్ని చూపిస్తున్నారన్నారు. అండర్ డ్రైనేజీ పనులను ఎల్అండ్టీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని సీమాంధ్రకు చెందిన సబ్‌కాంట్రక్టర్‌కు పనులు అప్పగించారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో 100 తప్పులతో చార్జిషీట్ తయారు చేసీ ప్రజలముందు డీఎస్‌ను దోషిగా నిలబెడతామన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీడీపీలు ప్రత్యర్థి పార్టీలుగా ప్రచారం చేసుకుని, తర్వాత కలిసి పని చేస్తున్నాయన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి జిల్లా అభివృద్ధిని 30 సంవత్సరాలు వెనక్కి నెట్టాయన్నారు. -
రింగ్‌రోడ్డుకు బాలారిష్టాలు
గద్వాల, న్యూస్‌లైన్: సరిగ్గా రెండేళ్ల క్రితం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేసిన గద్వాల రింగ్‌రోడ్డు పనులు నేటికీ టెండర్ల దశ దాటడం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఉద్దేశించిన రింగ్‌రోడ్డు పనులు ఎప్పటికి ప్రారంభమవుతాయో, ఎన్నేళ్లకు పూర్తవుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. జిల్లాలోనే అతిపెద్ద పట్టణంగా అవతరించిన గద్వాల ప్రాజెక్టులకు కేంద్రంగా మారింది. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రింగ్‌రోడ్డును ప్రతిపాదించారు. రాజీవ్ యువకిరణాలు కార్యక్రమాన్ని మూడు ప్రాంతాల్లో ఒక్కొక్క చోట సీఎం ప్రారంభించారు. అందులో భాగంగా 2011 ఆగస్టు 27న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి యువకిరణాలు కార్యక్రమాన్ని గద్వాలలో ప్రారంభించేందుకు వచ్చి రింగ్‌రోడ్డుకు శంకుస్థాపన చేశారు. మంగళవారంతో శంకుస్థాపన జరిగిన రెండేళ్లు పూర్తయింది. రూ.40కోట్ల అంచనావ్యయంతో.. గద్వాల చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.40 కోట్ల అంచనా వ్యయం తో 2011లో ప్రభుత్వం మంజూరు ఇ చ్చింది. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి జమ్మిచేడు వద్ద నుంచి అయిజ రోడ్డు ద్వారా రాయిచూర్ రోడ్డు వరకు నిర్మాణం చేపట్టాలని మొదట ప్రతిపాదించారు. పట్టణం చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ను తెరపైకి తెచ్చారు. దీంతో పనులను రెండు దశలుగా విభజించారు. మొద టి దశ జమ్మిచేడు నుంచి వయా అయి జ రోడ్డు ద్వారా రాయిచూర్ రోడ్డు వర కు, రెండో దశలో రాయిచూరు రోడ్డు నుంచి డ్యాం రోడ్డు, నదిఅగ్రహారం రోడ్డు, వెంకంపేట రోడ్డుల ద్వారా జమ్మిచేడు రోడ్డును కలిపేలా నిర్మించాలని నిర్ణయించారు. మొదటి దశ పనులకు సంబంధించి ఆర్అండ్బీ అధికారులు అంచనాలు రూపొందించారు. రూ.23.12కోట్ల వ్యయంతో తయారుచేసిన నివేదికను సాంకేతిక అనుమతి కోసం ఈఎన్సీకి పంపారు. సాంకేతిక అనుమతి రాగానే టెండర్లు పిలిచే అవకాశం ఉంది. టెండర్ల ప్రక్రియ పూర్తికావడం, కాంట్రాక్టర్లకు వర్క్ఆర్డర్ ఇవ్వడం వంటి దశలను పూర్తి చేసుకోవడం ఎప్పుడో, రోడ్డు నిర్మాణ పనులు ఇంకెన్నాళ్లకు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి. ఈ విషయమై ఆర్అండ్బీ గద్వాల డీఈఈ నాగార్జున్రావును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, సాంకేతిక అనుమతి రాగానే రింగ్‌రోడ్డు పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. -
సమైక్యతతోనే రాష్ట్ర ప్రగతి
అనకాపల్లి అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్ని రంగాల్లో ప్రగతి అభివృద్ధి సాధ్యమవుతుందని వర్తక సంఘం గౌరవ కార్యదర్శి కొణతాల లక్ష్మీనారాయణరావు (పెదబాబు) అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా అనకాపల్లి వర్తక సంఘం అనుబంధ సంస్థలు, ఎన్టీఆర్ మా ర్కెట్‌యార్డుకు చెందిన వర్తకులు, కొలగార్లు సోమవారం భారీ ర్యాలీ, నెహ్రూచౌక్ వద్ద మానవహారం నిర్వహించారు. మార్కెట్‌యార్డు నుంచి రింగ్‌రోడ్డు, మెయిన్‌రోడ్డు మీదుగా వర్తక సంఘం అనుబంధ సంస్థలైన ఏఎంఏఎల్ కళాశాల, ఏఎమ్‌ఏఏ హైస్కూల్, ఘోషాస్పత్రి, ఏఎమ్ఏ ఎలిమెంటరీ పాఠశాల, ఆస్క్ కళాశాలల నుంచి అధ్యాపక, ఉపాధ్యాయ బృందం, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, మార్కెట్‌యార్డు వర్తకులు, కార్మికులు, కళాసీలు, కొలగార్లు భారీ సంఖ్య లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూచౌక్ వద్ద మానవహారంగా ఏర్పడిన వర్తకులు, విద్యార్థులనుద్దేశించి పెదబాబు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వందలాది పరిశ్రమల వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల యువత ఉపాధి అవకాశాలు పొందుతున్నారని చెప్పారు. ఈ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తక్షణం తమ పదవులకు రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని ఆయన డిమాండ్ చేశారు. ర్యాలీలో గాంధీ, నెహ్రూ, పొట్టి శ్రీరాములు, ఛత్రపతి శివాజీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భారతమాత, తాండ్ర పాపారాయుడు తదితర స్వాతంత్య్ర సమరయోథులు, దేశభక్తుల వేషధారులు విశేషంగా ఆకట్టుకున్నారు.