యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక భావంతోపాటు ఆహ్లాద వాతావరణం కలిగేలా వైటీడీఏ ఏర్పాట్లు చేస్తోంది. యాదాద్రి కొండ చుట్టూ ఏర్పాటు చేస్తున్న రింగ్‌రోడ్డుకు ఇరువైపులా పూల మొక్కలు నాటుతోంది. ప్రెసిడెన్షియల్ సూట్‌కు సమీపంలో నిర్మించిన సర్కిల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దింది. 60 మీటర్లతో ఏర్పాటు చేసిన ఈ సర్కిల్‌లో చెన్నై నుంచి తెచ్చిన ఫీనిక్స్ ఫాం జాతి మొక్కలతోపాటు సీజనల్ పూల మొక్కలను నాటారు. దీంతో ఇప్పుడు ఆ సర్కిల్ రంగుల వలయంలా మారి ఆకట్టుకుంటోంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్ యాదాద్రి భువనగిరి
యూరియా.. రైతుల బాధ ఇదయా!
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు ఉదయం 3 గంటల నుంచే క్యూలైన్‌లో నిలబడ్డారు. ఉదయం 10 గంటల వరకు కూడా అధికారులు రాకపోవడంతో వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వచ్చింది వచ్చినట్లుగానే లారీల్లో నుంచి యూరియా ఖాళీ అయిపోయింది. అయితే చాలామంది మొక్కజొన్న రైతులకు యూరియా అందలేదు. ఇప్పటి వరకు 538 టన్నుల యూరి యా పంపిణీ చేశామని, మరో 150 టన్నులు వస్తే ఈ సీజన్‌కు యూరియా సరిపోతుందని వ్యవసాయాధికారి ప్రజాపతి తెలిపారు. యూరి యా కోసం రైతులు ఆందోళన చెందనవసరం లేదన్నారు.
–సదాశివనగర్ (ఎల్లారెడ్డి)
జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో
ధరూరు/దోమలపెంట(అచ్చంపేట): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ప్రాజెక్టుకు 1,00,900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఇన్‌ఫ్లో తగ్గడంతో ఉదయం ప్రాజెక్టు 15క్రస్టు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం 10 క్రస్టు గేట్లను ఎత్తి 67,710 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి, ఎత్తిపోతల పథకాలకు కలిపి మొత్తం 1,00,948 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వైపు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.914 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా, శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేసుల నుంచి 1,45,169 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. రెండు క్రస్టు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 55,692 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 64,487క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment