urea
-
రైతన్నల పడిగాపులు
-
యూరియా ఉత్పత్తి ‘గండం’ దాటేనా?
ఫెర్టిలైజర్‌సిటీ (రామగుండం): స్వదేశీతో పాటు విదేశీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్థాపించిన రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో యూరియా ఉత్పత్తికి తరచూ అంతరాయం కలుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సుమారు రూ.6,350 కోట్లు వెచ్చించి కర్మాగారం నిర్మించారు. ఇందుకోసం ఇటలీ, డెన్మార్క్ నుంచి ఆధునిక యంత్ర,సామగ్రి తెప్పించారు. రోజుకి 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఆర్ఎఫ్సీఎల్ నిర్మించారు. 2023 డిసెంబర్ 31 నాటికి 8,19,344.70 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. ఇక్కడి యూరియాకు జాతీయస్థాయిలో మంచి డిమాండ్ ఉంది. కేంద్ర ఎరువులు, రసాయన శాఖ రామగుండంలోని ఈ ప్లాంట్‌ను పర్యవేక్షిస్తుంది. పైప్లైన్లలో లీకేజీలతో ఉత్పత్తికి బ్రేక్ స్టీమ్ ఆధారంగానే ఇక్కడ యూరియా ఉత్పత్తి అవుతోంది. అయితే స్టీమ్ పైప్‌లైన్ లోపాలతో ప్రతీమూడు నెలలకోసారి ప్లాంట్‌లో సమస్యలు తలెత్తుతున్నాయి. సామర్థ్యానికి మించి పైపుల్లో స్టీమ్(ఆవిరి) సరఫరా కావడంతో తరచూ పైపులైన్లలో లీకేజీలు ఏర్పడి, యూరియా ఉత్పత్తి నిలిచిపోతోంది. గతేడాది నవంబర్ 15న ఇలాంటి సమస్య తలెత్తితే.. సుమా రు 15 రోజులపాటు మరమ్మతులు చేసి ప్లాంట్‌ను పునరుద్ధరించారు. ప్లాంట్ ప్రారంభమైన కాసేపటికే మళ్లీ సాంకేతిక సమస్య తలెత్తడంతో మరో మూడురోజుల పాటు మరమ్మతులు చేయాల్సి వచ్చింది. నవంబర్ 25న ఉత్పత్తి పునఃప్రారంభమై యూరియా, అమ్మోనియా ఉత్పత్తి సాఫీగానే సాగింది. కానీ, ఈనెల 9న హీట్ స్టీమ్ పైప్‌లైన్‌లో మళ్లీ సమస్య తలెత్తింది. దీంతో ఉత్పత్తి నిలిచిపోవడంతో ప్లాంట్ షట్‌డౌన్ చేశారు. ఈనెల 24లోగా పనులు పూర్తిచేసి యూరియా ఉత్పత్తి పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. గ్యారంటీ గడువు ముగిసిపోవడంతో గ్యాస్ ఆధారంగా నడిచే రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ లి మిటెడ్ కర్మాగారం నిర్మాణంలో విదేశీ పరిజ్ఞానం వినియోగించిన విషయం తెలిసిందే. ఇటలీ, డెన్మార్క్‌నుంచి తెచ్చిన యంత్ర, సామగ్రి గ్యారంటీ గడువు ముగిసిపోవడంతో మరమ్మతులు, నిర్వహణ భారమంతా కర్మాగారంపైనే పడుతోంది. ప్లాంట్‌పై ఒత్తిడి మన రాష్ట్రంతోపాటు ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్రల్లో యూరియాకు డిమాండ్ పెరగడంతో రామగుండం ప్లాంట్‌లో నిరంతరంగా ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ప్లాంట్‌లో తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఆర్థిక సంవత్సరం చివరి దశకు చేరడం, డిమాండ్‌కు సరిపడా యూరియా ఉత్పిత్తి చేయలేకపోవడంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతోందన్న వాదన వినపడుతోంది. -
యూరియా సరఫరాలో కోత
సాక్షి, హైదరాబాద్: రైతులు పంట పొలాల్లో అవసరానికి మించి యూరియా వాడుతున్నారని, దానివల్ల భూసారం తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల సరఫరాలో కోతలు విధించాలని నిర్ణయించింది. యూరియా వినియోగం వీలైనంత మేరకు తగ్గించేలా చూడాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. యూరియా ఎంత తగ్గిస్తే, అంతే స్థాయిలో ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. యూరియా అధిక వాడకం వల్ల భూసారం తగ్గడమే కాకుండా, పంటలు కూడా విషపూరితమవుతున్నాయి. ఆయా ఆహార పదార్థాలు తింటున్న ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యూరియా సహా ఇతరత్రా అన్ని రకాల ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించాలని కేంద్రం సూచించింది. రసాయన ఎరువుల స్థానంలో సేంద్రీయ ఎరువులు, పురుగు మందులు వాడాలని తెలిపింది. కాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో యూరియా వాడకాలను తగ్గించేలా చూస్తామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. సాగు తగ్గినా పెరిగిన యూరియా వాడకం రైతులు పంట పొలాల్లో యూరియాను కుమ్మరిస్తున్నారు. దీని వినియోగం ఏటా పెరుగుతోందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అవసరమున్నా లేకున్నా కొందరు రైతులు అధిక దిగుబడి వస్తుందనే ఆశతో యూరియాను విరివిగా వాడుతున్నారని అంటున్నారు. రైతులు గత ఏడాది వానాకాలం సీజన్లో 10.34 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను పంట పొలాల్లో వాడారని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 2022–23 వానాకాలం సీజన్లో 9.05 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించగా, 2023–24 వానాకాలం సీజన్లో 1.29 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా వాడటం గమనార్హం. గత ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లోనే అధికంగా యూరియాను వినియోగించారు. వాస్తవానికి గత వానాకాలం సీజన్లో యూరియా వాడకం తగ్గుతుందని భావించారు. కానీ పెరిగింది. దీంతో కేంద్ర కేటాయింపుల కంటే ఎక్కువగా యూరియాను రాష్ట్ర వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అంతకుముందు వానాకాలం సీజన్ కంటే గత ఏడాది వానాకాలం సీజన్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గడం గమనార్హం. 2022– 23 ఏడాది వానాకాలం సీజన్లో 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల పంటలు సాగు కాగా, 2023–24 వానాకాలం సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. అంటే 21 లక్షల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. కానీ యూరియా వాడకం మాత్రం 1.29 లక్షల మెట్రిక్ టన్నులు పెరగడం గమనార్హం. పలుమార్లు వర్షంతోనూ పెరుగుతున్న వాడకం గత ఏడాది రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. కీలకమైన సమయంలో వర్షాలు లేకపోవడంతో పత్తి, ఆరుతడి పంటల సాగు ఆలస్యమైంది. కొన్నిచోట్ల మాత్రం వర్షాలు కురవడంతో రైతులు పత్తి లాంటివి వేశారు. కానీ ఆ తర్వాత వర్షాలు రాకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయాయి. మొక్కలు భూమిలోనే మాడిపోయాయి. తర్వాత వర్షాలు కురిశాక మళ్లీ దున్ని విత్తనాలు చల్లారు. ఇలా పలుమార్లు విత్తనాలు చల్లడం వల్ల యూరియా కూడా రెండు మూడుసార్లు వేయాల్సి వచ్చిందని రైతులు అంటున్నారు. దీంతో రెండు బస్తాలకు బదులు మూడు, నాలుగు బస్తాల వినియోగం జరిగిందని వ్యవసాయశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆ తర్వాత భారీ వర్షాలు కురవడంతో అనేకచోట్ల పంటలు కొట్టుకుపోయాయి. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. పంట చేలల్లో నీరు నిలిచిపోయింది. అటువంటి చోట్ల మళ్లీ విత్తనాలు వేయడం, కొన్నిచోట్ల నీటిని తొలగించడం చేశారు. దీనివల్ల కూడా యూరియాను మరోసారి వినియోగించాల్సి వచ్చింది. పైగా సబ్సిడీ వల్ల యూరియా ధర కూడా తక్కువగా ఉండటంతో రైతులు విరివిగా వినియోగించారని చెబుతున్నారు. ఈ అదనపు వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యమని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
యూరియా గుప్పించారు
సాక్షి, హైదరాబాద్: రైతులు పంట పొలాల్లో యూరియాను గుప్పిస్తున్నారు. ఇలా ఏడాదికేడాదికి యూరియా వినియోగం పెరుగుతోందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. అవసరమున్నా లేకున్నా కొందరు రైతులు యూరియాను విరివిగా వాడుతున్నారని అంటున్నారు. దీనివల్ల భూసారంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఈ ఏడాది వానాకాలంలో 10.34 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు పంట పొలాల్లో వాడారని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించింది. 2021–22 వానాకాలం సీజన్లో 9.50 లక్షల మెట్రిక్ టన్నులు, 2022–23 వానాకాలం సీజన్లో 9.05 లక్షల ఎకరాల్లో యూరియా వినియోగించగా, ఈసారి ఏకంగా 1.29 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా వాడటం గమనార్హం. ఆగస్టు నెలలో 3.42 లక్షల మెట్రిక్ టన్నులు, సెపె్టంబర్ నెలలో 3.44 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించారు. సాగు తగ్గినా పెరిగిన యూరియా వినియోగం... వాస్తవానికి ఈ ఏడాది యూరియా వాడకం తగ్గుతుందని భావించారు. కానీ పెరిగింది. దీంతో కేంద్ర కేటాయింపుల కంటే ఎక్కువగా యూరియాను రాష్ట్ర వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాస్తవంగా గత ఏడాది వానాకాలం సీజన్ కంటే ఈ ఏడాది వానాకాలం సీజన్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. గత ఏడాది వానాకాలం సీజన్లో 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల పంటలు సాగు కాగా, ఈ ఏడాది వానాకాలం సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. అంటే 21 లక్షల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. కానీ యూరియా వాడకం మాత్రం గతేడాది కంటే ఏకంగా 1.29 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా పెరగడం విశేషం. పలుమార్లు విత్తనాలు విత్తడంతో పెరిగిన వినియోగం ఈసారి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. కీలకమైన సమయంలో వర్షాలు లేకపోవడంతో పత్తి, ఆరుతడి పంటల సాగు ఆలస్యమైంది. కొన్నిచోట్ల అక్కడక్కడ వర్షాలు కురవడంతో రైతులు పత్తి వంటి వాటిని వేశారు. కానీ ఆ తర్వాత వర్షాలు రాకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయాయి. దీంతో మొక్కలు భూమిలోనే మాడిపోయాయి. తర్వాత వర్షాలు కురిశాక మళ్లీ దున్ని విత్తనాలు చల్లారు. ఇలా పలుమార్లు విత్తనాలు చల్లడం వల్ల యూరియా కూడా రెండు మూడు సార్లు వేయాల్సి వచ్చింది. దీంతో రెండు బస్తాలు వాడాల్సిన చోట మూడు నాలుగు బస్తాల యూరియా చల్లారని వ్యవసాయ శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆ తర్వాత భారీ వర్షాలు కురవడంతో అనేకచోట్ల పంటలు కొట్టుకుపోయాయి. ఇసుకమేటలు వేశాయి. పంట చేలల్లో నీరు నిలిచిపోయింది. అటువంటి చోట్ల మళ్లీ విత్తనాలు వేయడం, కొన్నిచోట్ల నీటిని తొలగించడం చేశారు. దీనివల్ల కూడా యూరియాను మరోసారి వినియోగించాల్సి వచ్చింది. పైగా సబ్సిడీ వల్ల యూరియా ధర కూడా తక్కువగా ఉండటంతో రైతులు విరివిగా వినియోగించారని చెబుతున్నారు. -
యూరియా కావాలా?.. ఇతర ఎరువులు కొనాల్సిందే.. కంపెనీల దోపిడి..
ఒకటి కొంటే మరొకటి ఉచితమంటూ వస్త్ర,వస్తు తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇది సాధారణంగా జరిగేదే. కానీ ఎరువుల కంపెనీలు మాత్రం ఇది కొంటేనే అదిస్తామంటూ షరతులు పెడుతున్నాయి. యూరియా కావాలంటే పురుగు మందులు, జింక్, కాల్షియం వంటివి కొనాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో డీలర్లు రైతులపై ఇదే పద్ధతిలో ఒత్తిడి తెస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు తమకు అవసరం లేకపోయినా యూరియాతో పాటు ఇతర ఎరువులు కొనాల్సి వస్తోంది. దీనివల్ల సాగు ఖర్చు పెరిగి రైతులు నష్టాలపాలయ్యే పరిస్థితి ఏర్పడుతోందని, ముఖ్యంగా యథేచ్ఛగా ఎరువుల వినియోగంతో ఆహార పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టార్గెట్లతో రూ.కోట్ల అక్రమార్జన యూరియా అందుబాటులో ఉన్నా కృత్రిమ కొరత సృష్టిస్తూ కంపెనీలు ఇతర ఎరువులను రైతులకు అంటగడుతున్నాయి. కంపెనీలు వాటి సేల్స్ మేనేజర్లకు ఇతర ఎరువులను విక్రయించే టార్గెట్లు పెట్టి మరీ యూరియాయేతర ఎరువుల అమ్మకాలు చేయిస్తున్నాయి. టార్గెట్లు పూర్తి చేసిన సేల్స్ మేనేజర్లకు నగదు ప్రోత్సాహకం ఇస్తున్నాయి. దాంతో పాటు హైదరాబాద్‌లో విలాసవంతమైన రిసార్టుల్లో విందులు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. కొన్నిసార్లు విదేశీ పర్యటనలకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో వారంతా ఎరువుల డీలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. రూ.1.10 లక్షల విలువ చేసే 445 బస్తాల యూరియా ఇవ్వాలంటే రూ.4.40 లక్షల విలువ చేసే 400 బస్తాల 20/20/013 రకం కాంప్లెక్స్ ఎరువులు కొనాలనే నిబంధన విధిస్తున్నారు. దీంతో డీలర్లు యూరియా కోసం మార్కెట్లో రైతులకు అంతగా అవసరం లేని కాంప్లెక్స్ ఎరువుల బస్తాలను కూడా కొంటున్నారు. ఇలా కంపెనీలు ఏడాదికి వందల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం చేస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొందరు డీలర్లు ఇందుకు నిరాకరించడంతో ఆయా ప్రాంతాల్లో రైతులు యూరియా సక్రమంగా లభించక ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులను మభ్యపెడుతూ.. యూరియాతో పాటు ఫలానా ఎరువు, పురుగుమందు వాడితే ప్రయోజనం ఉంటుందని కంపెనీలు, డీలర్లు మభ్యపెడుతుండటంతో రైతులు అమాయకంగా వాటిని కొంటున్నారు. వాస్తవానికి యూరియాను ఇతర ఎరువులు, పురుగు మందులకు లింక్ పెట్టి విక్రయించకూడదన్న ఉత్తర్వులు ఉన్నాయి. జిల్లా వ్యవసాయాధికారి ఆదేశం మేరకే యూరియా కేటాయింపులు జరగాలి. కానీ డీలర్లు ఈ విధంగా లింక్ పెడుతూ ఇతర ఎరువులను బలవంతంగా అంటగడుతున్నారని తెలిసినా అధికారులు మిన్నకుంటున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పైగా మండల వ్యవసాయాధికారి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఎరువులను, పురుగుమందులను విక్రయించాలన్న నిబంధన ఉన్నా అది కూడా పట్టించుకోవడం లేదని అంటున్నాయి. మరోవైపు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను కూడా కంపెనీలు వదలడంలేదు. యూరియాలో 20 శాతం ఈ సేవా కేంద్రాలకు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసినా, ఈ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న కొన్ని యూరియా కంపెనీలు 20/20/013 ఎరువుల్ని తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు తగు చర్యలు తీసుకుని డీలర్లు ఒక ఎరువుతో మరొక ఎరువుకు లింకు పెట్టకుండా చూడాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
యూరియా కొరత.. రోడ్డెక్కిన రైతులు
పెన్‌పహాడ్, హాలియా: ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడాన్ని నిరసిస్తూ సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని సూర్యాపేట–గరిడేపల్లి ప్రధాన రహదారిపై శుక్రవారం రైతులు రాస్తారోకో చేశారు. పంటలకు సరైన సమయంలో యూరియా వేయకపోవడంతో వాటి ఎదుగుదల లేక.. దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి.. సరిపడా యూరియాను త్వరితగతిన సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనుముల మండలం కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం ఎదుట శుక్రవారం యూరియా కోసం రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. అందరికీ అందక నిరాశతో వెనుదిరిగారు. -
ఆర్ఎఫ్సీఎల్ షట్‌డౌన్
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ సీఎల్) కర్మాగారంలో మరమ్మతుల కార ణంగా గురువారం రాత్రి నుంచి యూరి యా ఉత్పత్తి నిలిచిపోయింది. హీటర్ సెక్ష న్ పైపులు మరమ్మతులు చేయడానికి వా రంరోజుల దాకా సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. శుక్ర వారం మరమ్మతులు ప్రారంభించారు. వానాకాలం సీజన్ కావడంతో తెలు గురాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో యూరియాకు డిమాండ్ అధికంగా ఉంది. నిత్యం సాంకేతిక సమస్యలు: ఫ్యాక్టరీలో జూన్‌లో కూడా సాంకేతిక సమ స్యలతో 20 రోజులపాటు యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. మరమ్మతుల అనంతరం ప్లాంట్ పునరుద్ధరించినా, రెండు రోజులకే మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. జూన్ చివరివారంలో ఉత్పత్తి ప్రారంభించారు. సాంకేతిక సమ స్యలతో ఆగస్టులో ఉత్పత్తి కొంత తగ్గింది. మళ్లీ సమస్య తలెత్తడంతో కర్మా గారాన్ని తాత్కాలికంగా వారం పాటు షట్‌డౌన్ చేసి మరమ్మతుల అనంతరం ఉత్పత్తి పునరుద్ధరిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. కర్మాగారంలో గడిచిన 4 నెలల్లో 5,01,597.63 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. 2023– 24లో 12.70 లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా ఉత్పత్తి చేయాలనేది టార్గెట్. -
పుడమి తల్లికి తూట్లు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : పుడమి తల్లి నిస్సారంగా మారిపోతోంది. చాలాకాలంగా నత్రజని, భాస్వరం, పొటాషియం తదితర రసాయన ఎరువులకు తోడు పురుగు మందులు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పంటల దిగుబడిని పెంచుకోవడానికి, క్రిమిసంహారానికి మోతాదుకు మించి వాడుతున్న రసా యన ఎరువులు, మందుల కారణంగా సారవంతమైన నేల కాస్తా గుల్ల అవుతోంది. రసాయన ఎరువుల వాడకం పుడమి కాలుష్యంతో పాటు, వాయు, నీటి కాలుష్యానికి కూడా దోహదపడుతోంది. ఒక టన్ను రసా యన ఎరువులను వినియోగిస్తే.. అందులో కేవలం మూడున్నర క్వింటాళ్ల రసాయన ఎరువులను మాత్రమే పంటలు స్వీకరిస్తాయని, మిగిలిందంతా పుడమిలోకి ఇంకిపోవడం, వర్షాలు పడినప్పుడు చెరువులు, నదులు, వాగులు, ఇతర నీటి వనరుల్లోకి వెళ్లిపోవడం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాలతో పోల్చిచూస్తే..మన దేశంలో వీటి విని యోగం తక్కువగా ఉన్నా.. ప్రస్తుతం వాడుతున్న ఈ రసాయన ఎరువుల వల్ల పర్యావరణంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఆర్గానిక్‌తో మేలు.. ♦ దిగుబడి పెంచుకోవడానికి వినియోగించే ఎరువుల్లో ఆర్గానిక్, ఇనార్గానిక్ అనే రెండు రకాలు ఉన్నాయి. ఆర్గానిక్ ఎరువులు ప్రకృతి సిద్ధమైనవి. పంట వ్యర్థాలు, మొక్కలు, జంతువుల వ్యర్థాలు, మునిసిపల్ వ్యర్థాల నుంచి వచ్చే ఎరువులను ఆర్గానిక్ ఎరువులుగా పరిగణిస్తారు. ఆర్గానిక్ ఎరువుల వాడకం వల్ల భూసారం పెరగడంతో పాటు, వాన పాములు, సూక్ష్మజీవుల పునరుత్పత్తికి దోహద పడుతుంది. ఇక రసాయనాలను వినియోగించి తయారు చేసేవే ఇనార్గానిక్ ఎరువులు. పంటల ఎదుగుదలకు నత్రజని ఉపయోగపడుతుంది. ఫాస్ఫేట్ మొక్కలకు ముఖ్యమైన పోషక విలువలను అందిస్తుంది. వీటితో పాటు పొటాషియం భూమిలో నీటి సామర్థ్యాన్ని, భూ సాంద్రతను పెంచుతాయనే వాదన ఉన్నా.. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలోని ఆమ్లాలు చర్మంపైన, శ్వాసపైనా ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. సేంద్రీయ సేద్యం పెరుగుతున్నా దేశంలో సేంద్రీయ సేద్యం పెరుగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించే గణాంకాలు చెబు తున్నా.. రసాయన ఎరువుల వాడకం కూడా విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలి గించే అంశం. మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలు రసాయన ఎరువుల వాడకంలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ ఎరువులు భూమిలో ఉండే సూక్ష్మక్రిములను చంపే యడంతో భూమి తన సారాన్ని కోల్పోతోందని నిపుణులు చెబుతున్నారు. పంటల దిగు బడి కోసం శాస్త్రీయ ఎరువులు వినియోగించకుండా కేవలం రసాయన ఎరువులు, పురుగుమందులు వాడటం వల్ల భూసారం తగ్గి, తదనంతర కాలంలో పంటల దిగుబడులు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దశాబ్ద కాలంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం దాదాపు 50% మేరకు పెరిగినట్లు అగ్రికల్చర్ ఇన్పుట్ సర్వే వెల్లడిస్తోంది. చైనాలో హెక్టార్‌కు 13.06 కిలోలు చైనా ఒక హెక్టార్‌కు 13.06 కిలోల పురుగు మందులు వాడుతుంటే, జపాన్ 11.85 కిలోలు, బ్రెజిల్ 4.57 కిలోలు వినియోగిస్తున్నాయి. లాటిన్ అమెరికా దేశా ల్లోనూ ఇలాంటి మోతాదుల్లోనే వినియోగిస్తున్నారని సమాచారం. మన దేశంలో అత్యధికంగా పంజాబ్‌లో ప్రతి హెక్టార్‌కు 0.74 కిలోలు వినియోగిస్తున్నారు. పంజాబ్, హరియాణాలు పంటల దిగుబడి కోసం అత్యధికంగా రసాయన ఎరువులు వినియోగి స్తున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హరియాణాలో 0.62 కిలోలు, మహారాష్ట్రలో 0.57 కిలోలు, కేరళలో 0.41 కిలోలు, ఉత్తరప్రదేశ్‌లో 0.39 కిలోలు, తమిళనాడులో 0.33 కిలోల రసాయన ఎరువులు వాడుతున్నారు. జాతీయ సగటు 0.29 కిలోలుగా ఉంది. జాతీయ సగటు కంటే తెలుగు రాష్ట్రాల్లో వినియోగం తక్కువగా ఉన్నట్లు ఆ గణాంకాలు పేర్కొంటున్నాయి. యూరియానే అత్యధికం.. ఎరువుల్లో యూరియా వినియోగం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. రైతులు అవసరానికి మించి యూరియా వాడుతున్నారని, ఒక బస్తా యూరియా వేయాల్సిన చోట పంట ఎదుగుదల, దిగుబడి కోసం రెండు మూడు బస్తాలు వినియోగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల కంటే దీని ధర తక్కువగా ఉండడం, కేంద్ర ప్రభుత్వం సైతం యూరియాపై ఎక్కువ సబ్సిడీ ఇవ్వడం వల్ల రైతులు ఎక్కువగా యూరియా వినియోగిస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. యూరియాపై కేంద్రం దాదాపు 75 శాతం మేరకు సబ్సిడీ అందిస్తుంటే.. డీఏపీ లాంటి ఎరువులపై 35 శాతం మాత్రమే ఇస్తోంది. భూసార పరీక్షల ఆధారంగా వాడాల్సి ఉన్నా.. భూసార పరీక్షల నిర్వహణ ద్వారా ఏయే భూములకు ఎలాంటి పోషకాలు కావాలి, అవి ఏయే రసాయన ఎరువుల్లో ఉంటాయో తెలుసుకుని, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు వాడాల్సి ఉన్నా.. రైతులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. తమకు తెలిసిన ఎరువులను యథేచ్ఛగా వాడుతున్నారు. తద్వారా ఒక్కోసారి ఆశించిన స్థాయిలో దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతున్నారు. పత్తి, వరి, గోధుమ, చెరకు పంటలకు ఎక్కువగా పురుగుల మందులు వాడుతున్నారు. పంజాబ్‌లో కేన్సర్, కిడ్నీ సంబంధిత సమస్యలు రసాయన ఎరువుల అధిక వినియోగంతో ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో నష్టాలు పెరుగుతున్నాయి. ప్రత్యక్షంగా చూస్తే.. నత్రజని కాలుష్యం పెరగడం వల్ల ఆహార ఉత్పత్తుల ద్వారా కేన్సర్, కిడ్నీ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. పంజాబ్‌లో ఈ సమస్య తీవ్రస్థాయికి చేరింది. కొంతకాలం ఎరువుల వినియోగం తర్వాత భూమి లోపల ఉండే బ్యాక్టీరియా చచ్చిపోయి, కార్బన్, మినరల్స్ వంటివి పోయి ఈ రసాయనాలే డామినేట్ చేస్తాయి. మొక్కకు సహజ సిద్ధమైన బలం చేకూరకుండా నేరుగా రసాయనాలే ప్రభావితం చేస్తాయి. పంటల వైవిధ్యం కూడా దెబ్బతింటుంది. రెండు, మూడు పంటలు వచ్చే ఉమ్మడి నల్లగొండ పరిధిలోని మిర్యాలగూడ, తదితర ప్రాంతాల్లో వరి పొలాల్లో విపరీతంగా యూరియా ఇతర రసాయనాల వినియోగం కారణంగా నేల మొత్తం రసాయనాలే నిండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమస్యను అధిగమించాలంటే రసాయనేతర ఎరువులైన ఆవు, ఇతర జంతువుల పేడ, గృహాల నుంచి వచ్చే చెత్తతో తయారుచేసిన ఎరువుల వినియోగం పెంచాలి. – డా. దొంతి నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణులు, పాలసీ అనలిస్ట్ రసాయన, సేంద్రీయ కాంబినేషన్ మంచిది రసాయన ఎరువుల అధిక వాడకం వల్ల భూమి తన నిజ స్వరూపం, సారాన్ని కోల్పోతుంది. భూమిలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా చనిపోతాయి. ఎరు వులు వాడితే మొక్కల్లో నీటి నిల్వశాతం కూడా తగ్గు తుంది. వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. మొక్క కు రసాయన ఎరువు, సేంద్రీయ ఎరువులు కాంబినేషన్‌గా అందించాలి. ఉదాహరణకు మొత్తం పది బస్తాల ఎరువులు వినియోగిస్తామను కుంటే.. అందులో ఆరు బస్తాలు రసాయన ఎరువులు, 4 బస్తాల సేంద్రీయ ఎరువులు ఉండేలా చూడాలి. దీనితో సమతుల్యత ఉంటుంది. పురుగుల మందుల వల్ల బీపీ, షుగర్, కిడ్నీ పేషంట్లు పెరుగుతున్నారు. – కె.రాములు ఎండీ, ఆగ్రోస్ లిమిటెడ్ సబ్సిడీలు తగ్గించుకునేందుకే.. కేంద్ర ప్రభుత్వం పీఎం ప్రణామ్లో భాగంగా ఎరువుల వినియోగం తగ్గించడం ద్వారా రైతులకిచ్చే సబ్సిడీలు కూడా తగ్గిస్తోంది. శ్రీలంక తరహాలో సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సహించాలని చూస్తోంది. సేంద్రీయ, రసాయన ఎరువులు కలగలిపి ఉపయోగించడం ద్వారా సేంద్రీయ వ్యవసాయం చేయాలి. కానీ ఒక్క సేంద్రీయ లేదా రసాయన ఎరువుల వాడకంతో పంటలు పండవు. చైనా, అమెరికాతో పోల్చితే భారత్‌లో తక్కువగానే ఎరువులు వాడుతున్నారు నిజమే. అయితే చైనాలో హెక్టార్‌కు 80 క్వింటాళ్లు, అమెరికాలో 60 క్వింటాళ్లు పండిస్తున్నారు. కానీ మన దేశంలో 25 క్వింటాళ్లే దిగుబడి వస్తోంది. 1991లో మనం ఎగుమతులు చేసే దశ నుంచి, ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులు సహా, పాలు, పాల ఆధారిత ఉత్పత్తులు, మాంసం, నూనెలు, పప్పుధాన్యాలు, పంచదార వంటివి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ దిగుమతులకు డంపింగ్ కేంద్రంగా మారింది. భారత్‌లో ఉత్పత్తులను దెబ్బతీసి దిగుమతులపై ఆధారపడేలా చేసే ధనిక దేశాల ప్రయత్నాలకు కేంద్రం లొంగిపోతోందనడానికి ఇదో ఉదాహరణ. – సారంపల్లి మల్లారెడ్డి, రైతుసంఘం నేత, వ్యవసాయ నిపుణులు -
టెక్స్టైల్ పార్క్‌కు సహకరించడం లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు ఎంవోయూకు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు రావడం లేదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని పెద్దలను తాను అనేక సార్లు అభ్యర్థించి రాష్ట్రానికి టెక్స్ టైల్ పార్కును తీసుకొస్తే ఇక్కడి సర్కారు నుంచి స్పందన లేక పోగా ఏ మాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వ్యవసాయానికి మోదీ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని, పెద్ద ఎత్తున ఎరువుల సబ్సిడీ ఇస్తోందన్నారు. పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పనే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. తాజాగా పెంచిన పంటల మద్దతు ధర ఈ ఖరీఫ్ సీజన్‌నుంచే అమల్లోకి వస్తుందని, రైతులకు మేలు చేసేలా కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు. భారత్ బ్రాండ్ పేరుతో యూరియా నానో యూరియాతో పాటు భారత్బ్రాండ్ పేరుతో యూరియా ప్రవేశ పెడుతున్నట్టు, ఇందుకు 8 ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. 2014లో దేశ వ్యవసాయ బడ్జెట్ రూ.21,933 కోట్లు ఉంటే, తొమ్మిదేళ్లలో రూ.లక్షా 25 వేల 33 కోట్లకు పెరిగిందని వివరించారు. కిసాన్‌క్రెడిట్‌కార్డుల ద్వారా రూ.28,590 కోట్ల వ్యవసాయ రుణాల మంజూరు, 23 కోట్ల సాయిల్హెల్త్ కార్డులను రైతులకు అందజేసినట్టు తెలియజేశారు. ఒకప్పుడు రూ.లక్ష కోట్ల విలువైన నూనెల దిగుమతి ఉండేదని, ఇప్పుడు రైతుల నుంచి నూనె గింజల సేకరణ 1,500 శాతం పెరిగిందని తెలిపారు. గుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానం, మాంసం ఉత్పత్తిలో 8వ స్థానం, పప్పుదినుసుల సేకరణలో కూడా కేంద్రం 7300 శాతం వృద్ధి సాధించిందన్నారు. ఎరువుల రాయితీ గత ఏడాదికి ఈ ఏడాదికి పోలిస్తే 500 శాతం పెరిగిందని చెప్పారు. రూ.20 లక్షల కోట్లు రుణ వితరణ లక్ష్యంగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి రూ.20 లక్షల కోట్లు రుణ వితరణ లక్ష్యంగా కార్యాచరణను కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోందని కిషన్‌రెడ్డి వివరించారు. ప్రస్తుతమున్న ఈ–నామ్మార్కెట్లు 1260 బాగా నడుస్తున్నాయని తెలిపారు. ♦ 9 ఏళ్ల పాలనలో తెలంగాణకు చేకూరిన ప్రయోజనాలను గురించి కిషన్‌రెడ్డి వివరించారు. అవేంటంటే... ♦ తెలంగాణలో 39 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్‌యోజన ద్వారా ఏటా రూ.6 వేలు అందజేత ♦ రూ.6,300 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం. ♦ సించాయ్యోజన కింద చిన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి. ♦ దీని కింద తెలంగాణలో 11 ప్రాజెక్టులను గుర్తించి, వాటిని పూర్తి చేసుకోవడం కోసం ఇప్పటి వరకు రూ.1,248 కోట్లు కేటాయింపు. ♦ రూ.23,948 కోట్లతో ఎల్సీడీసీ ద్వారా గొర్రెల పెంపకం, ఇతర వ్యవసాయ కార్యక్రమాలకు రుణాల మంజూరు. ♦ ఆయిల్ పామ్ మిషన్ కింద రూ.214 కోట్లు. ♦ ఒక్క ఎరువుల మీద రూ.27 వేల కోట్ల రూపాయల సబ్సిడీ. ♦ రైతులకు మేలు చేసే ‘వేపపూత’ యూరియాను అందుబాటులోకి తీసుకొచ్చారు ♦ తెలంగాణలో ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం సేకరణకు కేంద్రం ఒకప్పుడు రూ.3,307 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు రూ.26,307 కోట్లు వెచ్చిస్తోంది. -
ఎరువుల ప్రణాళిక ఖరారు...
సాక్షి, హైదరాబాద్: రాబోయే వానాకాలం సీజన్లో 24.60 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎరువుల ప్ర ణాళికను ఖరారు చేసింది. రాష్ట్రం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందని వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం కేటాయించిన ఎరువులు వానాకాలం సీజన్‌కు పూర్తిస్థాయిలో సరిపోతాయని తెలిపాయి. ఎరువుల్లో అత్యధికంగా 9.50 లక్షల మెట్రిక్ ట న్నుల యూరియా కేటాయించారు. 9.40 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను, 2.30 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ, 1.25 లక్షల మెట్రిక్ టన్నుల పొటాష్, లక్ష మెట్రిక్ టన్నుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను కేటాయించినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. కాగా, ఏడాదికేడాదికి యూరియా వాడకం తగ్గుతోందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పచ్చరొట్ట విత్తనాలను సరఫరా చేయడం వల్ల, గతం కంటే ఐదారు వేల మెట్రిక్ టన్నుల యూరియా వాడకం తగ్గుతోందంటున్నారు. మండలాలకు ఎరువుల సరఫరా... వచ్చే నెల మొదటి వారంలో వానాకాలం సీజన్ ప్రారంభం కానుంది. ఒక వర్షం పడితే చాలు రైతులు దుక్కులు దున్నుతారు. దీంతో ముందస్తుగా మొదటి దఫా ఎరువులను మండలాలకు సరఫరా చేసినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. మండలాల్లోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్), ఆగ్రోస్ రైతు సే వా కేంద్రాల ద్వారా ఎరువులను సరఫరా చేశా రు. రైతులకు ఎరువులు నిత్యం అందుబాటు లో ఉండేలా చూడాలని ప్యాక్స్, రైతు సేవా కేంద్రాలను వ్యవసాయశాఖ ఆదేశించింది. ఎరు వుల కొరత రాకుండా, ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ఎరువులను రేక్ పాయింట్ల నుంచి రవాణా చేసేందుకు మార్క్‌ఫెడ్ ఇటీవల ప్రైవేట్ ఏజెన్సీలను ఎంపిక చేసింది. మొత్తం 20 రేక్ పాయింట్ల నుంచి ఎరువులను తీసుకెళ్లేందుకు మూడు ఏజెన్సీలకు అవకాశం ఇచ్చింది. అందులో ఒక ఏజెన్సీకే 18 రేక్ పాయింట్లు వచ్చాయి. మిగిలిన రెండు రేక్ పాయింట్లు మరో రెండు ఏజెన్సీలకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చారు. ఎరువుల రవాణా కోసం రూ. 96 కోట్లు ఖర్చు కానుంది. -
ద్రవరూప డీఏపీ, యూరియా వాడండి
న్యూఢిల్లీ: రైతులు సాగులో ద్రవరూప నానో డీఏపీ, యూరియాను వినియోగించాలని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌షా సూచించారు. ఈ ఉత్పత్తులను విరివిగా ఉపయోగించడం ద్వారా ఎరువుల తయారీలో దేశాన్ని స్వావలంబన భారత్‌గా మార్చాలని రైతులకు పిలుపునిచ్చారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందన్నారు. ఇఫ్కో నానో (ద్రవరూప) డీఏపీ వాణిజ్య విక్రయాలను మంత్రి బుధవారం ఢిల్లీలో ప్రారంభించి, మాట్లాడారు. ఇఫ్కో ద్రవరూప నానో డీఏపీ 500 ఎంఎల్ బాటిల్‌ను రూ.600కు విక్రయించనున్నారు. అదే సంప్రదాయ 50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.1,350గా ఉంది. సాగులో ద్రవరూప ఉత్పత్తులను వినియోగించడం వల్ల నాణ్యతతోపాటు దిగుబడి కూడా పెరుగుతుందని మంత్రి అమిత్‌షా అన్నారు. భూసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. ద్రవరూప డీఏపీతో సాగు ఖర్చులు 6 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గుతాయని చెప్పారు. అలాగే ద్రవరూప ఎరువుల రవాణా, నిల్వ కూడా సులభం. ద్రవరూప ఎరువులు భారత్‌ను స్వావలంబన దిశగా నడిపిస్తాయన్నారు. 2021–22లో 91.36 లక్షల టన్నుల యూరియా, 54.62 లక్షల టన్నుల డీఏపీ, 24.60 లక్షల టన్నుల ఎంవోపీ, 11.70 లక్షల టన్నుల ఎన్పీకే ఎరువులను దిగుమతి చేసుకున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇఫ్కో తయారు చేసిన నానో డీఏపీకి 20 ఏళ్ల కాలానికి పేటెంట్ వచ్చినట్టు మంత్రి అమిత్‌షా తెలిపారు. -
భవిష్యత్ నానో యూరియాదే
సాక్షి, అమరావతి: భవిష్యత్ అంతా నానో యూరియాదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. నానో టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసిన ఈ నానో యూరియా వినియోగంతో పర్యావరణానికి, పంటలకు అత్యంత మేలు జరుగుతుందని తెలిపారు. రవాణా, వాడకం, ధరలతో పాటు పంటల దిగుబడి విషయంలో సంప్రదాయ యూరియాతో పోలిస్తే ఎన్నోరెట్లు అదనపు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. నానో యూరియా వినియోగం, అవగాహనపై మంగళవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గే ఈ యూరియా వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఇఫ్కో డైరెక్టర్ ఎం.జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ నానో యూరియా వాడకాన్ని ప్రోత్సహించాలని కోరారు. 8 శాతం పెరిగిన దిగుబడి ఇఫ్కో ఏపీ మార్కెటింగ్ మేనేజర్ టి.శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ 500 ఎంఎల్ బాటిల్లో ద్రవరూపంలో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాతో సమానమని చెప్పారు. నానో యూరియా వినియోగించిన అనేక పంటల్లో ఎనిమిదిశాతం మేర దిగుబడి పెరిగిందని విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో వెల్లడైందని తెలిపారు. నానో యూరియా వాడకంపై రూపొందించిన కరపత్రాలను మంత్రి కాకాణి విడుదల చేశారు. జాతీయ రహదారుల్లో మిల్లెట్ కేఫ్‌లు జాతీయ రహదారుల వెంబడి మిల్లెట్ కేఫ్‌ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయ్యాలని మంత్రి కాకాణి సూచించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మంగళవారం అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ఉద్యానశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారుల వెంబడి మిల్లెట్ కేఫ్‌ల ఏర్పాటు వల్ల చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు ప్రోత్సాహకంగా ఉంటుందని పేర్కొన్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను ఆయా ప్రాంతాల స్థానిక స్వయం సహాయక సంఘాలతో పాటు యువతకు అప్పగించాలని సూచించారు. డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేయడం ద్వారా యూనివర్సల్ కవరేజ్ సాధించిన మొదటి రాష్ట్రం మనదేనని చెప్పారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఏపీ సీడ్స్ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు పాల్గొన్నారు. -
రబీకి 5 లక్షల లీటర్ల నానో యూరియా నిల్వలు
సాక్షి, అమరావతి: పర్యావరణ హితమైన నానో యూరియా వినియోగం పట్ల రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) నానో టెక్నాలజీ ద్వారా ద్రవరూపంలో ఈ నానో యూరియాను మార్కెట్లోకి తెచ్చింది. 500 మిల్లీలీటర్ల సీసాలో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాకు సమానం. బస్తా యూరియా మార్కెట్లో రూ.266.50 ఉండగా, నానో యూరియా సీసా రూ.240కే అందుబాటులోకి తెచ్చారు. గతేడాది ఖరీఫ్ సీజన్లో ప్రయోగాత్మకంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అమ్మకాలకు శ్రీకారం చుట్టగా, 20 వేల మంది రైతులు 34,128 సీసాల (17 వేల లీటర్ల) యూరియాను కొనుగోలు చేశారు. ఆ తర్వాత రబీలో లక్షమందికి పైగా రైతులు 5,46,012 సీసాలు (2.73 లక్షల లీటర్లు) కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 2 లక్షల లీటర్లు (4 లక్షల సీసాలు) అందుబాటులో ఉంచగా 1.25 లక్షల లీటర్లు (2.50 లక్షల సీసాలు) అమ్ముడయ్యాయి. సకాలంలో వర్షాలు పడడం, పూర్తిస్థాయిలో సాగునీరు అందుబాటులో ఉండడం, తెగుళ్ల ఉద్ధృతి తక్కువగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో యూరియా నిల్వలను డిమాండ్‌కు తగినట్టుగా అందుబాటులో ఉంచడం వంటి కారణాల వల్ల ఆశించిన స్థాయిలో నానో యూరియా అమ్మకాలు జరగలేదని అంచనా వేస్తున్నారు. ఎరువుల వినియోగం ఎక్కువగా ఉండే ప్రస్తుత రబీ సీజన్లో కనీసం 5 లక్షల లీటర్ల (10 లక్షల సీసాల) నానో యూరియాను అందుబాటులో ఉంచారు. డిమాండ్‌ను బట్టి వీటిలో కనీసం 25 శాతానికి తక్కువ కాకుండా ఆర్బీకేల ద్వారా విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నానో యూరియా వినియోగంపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలు, వాల్‌పోస్టర్లతో పాటు పంటల వారీగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ, జింక్, కాపర్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుత రబీ సీజన్లో ట్రయల్‌రన్‌లో ఉన్న ఈ ఉత్పత్తులను ఖరీఫ్–2023 సీజన్ నుంచి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సమృద్ధిగా నానో యూరియా నిల్వలు నానానో యూరియా వినియోగంపై రైతుల్లో చైతన్యం పెరుగుతోంది. గతేడాది ఖరీఫ్‌లో 17 వేల లీటర్ల విక్రయాలు జరగగా, ఈ ఏడాది ఖరీఫ్‌లో ఏకంగా 1.25 లక్షల లీటర్ల విక్రయాలు జరిగాయి. రైతుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత రబీ సీజన్ కోసం 5 లక్షల లీటర్ల నానో యూరియా బాటిల్స్‌ను అందుబాటులో ఉంచాం. ఇంకా అవసరమైతే పెంచేందుకు ఇఫ్కో సిద్ధంగా ఉంది. – టి.శ్రీధర్‌రెడ్డి, స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
నానో యూరియాతో వ్యవసాయ రంగంలో విప్లవం: మంత్రి నిరంజన్‌రెడ్డి
ఏజీవర్సిటీ: వ్యవసాయరంగంలో నానో యూరియా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలోని ఉంచుకుని నానో సాంకేతిక పరిజ్ఞానంతో మొట్టమొదటి సారిగా యారియాను ద్రవరూపంలో తీసుకువచ్చిన ఘనత ఓ భారతీయుడిదని, ఇది దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎరువులు–రసాయనాల వాడకం–నానో యూరియా వినియోగం అవశ్యకతపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన నానో యూరియా గురించి రైతులకు వివరించారు. భారతీయుడైన రమేశ్ రాలియా దీనిని కనుగొన్నారని, 11 వేల మంది రైతుల పొలాల్లో నానో యూరియాను ప్రయోగించి.. ఫలితాలను పరిశీలించాక మార్కెట్ల్లో విడుదల చేశారని చెప్పారు. దీని వల్ల ఎరువుల సంచులను తరలించే పెద్ద ప్రక్రియను సులభతరం చేశారని, దీంతో అటు ప్రభుత్వానికి, ఇటు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. నానో యూరియా వల్ల రవాణా ఖర్చులు తగ్గి, గోదాముల నిల్వ ఇబ్బందులు, విదేశీ దిగుమతుల భారం తప్పుతుందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘనందన్‌రావు, ఇఫ్కో జీఎం డాక్టర్ జగన్మోహన్రెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మెన్ మార గంగారెడ్డి, వ్యవసాయ శాఖ అదనపు కమిషనర్ హన్మంతు, ఆగ్రోస్ ఎండీ రాములు, మార్కెఫెడ్ ఎండీ యాదిరెడ్డి, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు జగదీశ్వర్, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకుడు విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఖరీఫ్ సీజన్: దండిగా యూరియా
ఖరీఫ్ సీజన్‌కు ముందే వ్యవసాయానికి అవసరమైన ఎరువులను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాలో జూన్ నెల్లోనూ జలవనరులు తొణికిసలాడుతున్నాయి. జిల్లాలో ముందస్తుగా ఎడగారు మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో సాగు విస్తీర్ణం చాలా తక్కువ. అయినా ఎరువుల కొరత రైతాంగాన్ని పట్టి పీడించేది. గతంతో పోల్చుకుంటే.. జిల్లాలో గడిచిన మూడేళ్లలో ఖరీఫ్, రబీ సీజన్లలో మూడింతల సాగు విస్తీర్ణం పెరిగింది. ఇందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలను సిద్ధం చేసింది. సాక్షి,నెల్లూరు (సెంట్రల్): జిల్లాలో 2022 ఖరీఫ్ సీజన్ ముందస్తుగానే ప్రారంభమవుతోంది. ఇప్పటికే సాగు విస్తీర్ణం అంచనాకు అనుగుణంగా విత్తనాలు సిద్ధం చేసిన వ్యవసాయశాఖ తాజాగా అవసరమైన మేరకు ఎరువులు కూడా సిద్ధం చేస్తోంది. వ్యవసాయానికి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీజన్‌కు ముందే గత నెల్లోనే పెట్టుబడి సాయంగా వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింద రూ.7,500 జమ చేసింది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగే అవకాశం ఉంది. దీంతో ఎడగారుకు ముందుగానే ఎరువుల నిల్వలు ఉంచాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. 109 సొసైటీల ద్వారా సరఫరా జిల్లాలో 561 ఆర్బీకేల ద్వారా ఎరువులను గ్రామాల్లోనే రైతులకు సరఫరా చేస్తుంటారు. జిల్లాలో 470 ప్రైవేట్ డీలర్స్ కూడా ఎరువుల విక్రయాలు చేస్తున్నారు. తాజాగా జిల్లాలో వ్యవసాయశాఖకు అనుబంధంగా ఉన్న మార్క్‌ఫెడ్ సంస్థ పరిధిలో 109 సొసైటీల ద్వారా కూడా రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా వివిధ రకాల ఎరువులను సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రబీ ముగిసిన తర్వాత ఖరీఫ్ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు ఎరువుల సమస్య రాకుండా నిల్వ చేశారు. జిల్లాలో యూరియా 18 వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 5 వేల మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 1,700 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 13 వేల మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 2 వేల మెట్రిక్ టన్నులు చొప్పున 39,700 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు ఉన్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాగుకు లక్ష మెట్రిక్ టన్నుల వరకు ఎరువులు అవసరం అవుతాయని అంచనా. మరో 32 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల ఈ వారంలో రానున్నాయి. ప్రతి నెలా 20 వేల నుంచి 30 వేల మెట్రిక్ టన్నుల వరకు అవసరానికి అనుగుణంగా జిల్లాకు పంపిణీ చేస్తున్నారు. ఎరువుల కొరత ఎక్కడా లేదు జిల్లాలో ఖరీఫ్‌కు సంబంధించి ఎరువులు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి నెలా కావాల్సినంత ఎరువులు జిల్లాకు వస్తున్నాయి. ఇప్పటికే 39 వేల మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. ఈ నెలకు కావాల్సిన స్టాక్ కన్నా ఎక్కువగానే నిల్వ ఉంది. రైతులు ఎవరూ ఎరువులు లేవనే అసత్య ప్రచారాలు నమ్మవద్దు. రైతులకు ఎక్కడకు వెళ్లినా ఎరువులు పుష్కలంగా ఉన్నాయి. – సుధాకర్‌రాజు, జేడీ వ్యవసాయశాఖ -
ఆర్బీకేల్లోనూ నానో యూరియా
సాక్షి, అమరావతి: పర్యావరణ హితమైన నానో యూరియా వినియోగాన్ని మరింత ప్రోత్సహించాలని ప్రభుత్వం సంకల్పించింది. రానున్న ఖరీఫ్‌లో ఈ యూరియా వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించడంతో పాటు వారికి మరింత అందుబాటులోకి ఉంచేలా ప్రణాళిక సిద్ధం చేసింది. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) నానో టెక్నాలజీ ద్వారా లిక్విడ్ రూపంలో ఈ నానో యూరియాను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 500 మిల్లీ లీటర్ల బాటిల్లో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాకు సమానం. బస్తా యూరియా మార్కెట్లో రూ.266.50 ఉండగా, నానో యూరియా బాటిల్ కేవలం రూ.240కే అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అమ్మకాలకు శ్రీకారం చుట్టగా, 20వేల మంది రైతులు 34,128 బాటిళ్లు (17వేల లీటర్లు) యూరియాను కొనుగోలు చేశారు. ఆ తర్వాత రబీలో సుమారు లక్ష మందికి పైగా 5,46,012 బాటిళ్లు (2.73 లక్షల లీటర్లు) కొనుగోలు చేశారు. కొరత లేకుండా నిల్వలు.. ముందస్తు ఖరీఫ్ కోసం ఏర్పాట్లు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం సీజన్లో రైతులకు ఏ దశలోనూ ఎరువుల కొరత రానీయకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఖరీఫ్‌లో 19.02 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటికే 6.19లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేసింది. సాంప్రదాయ ఎరువుల వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయంగా నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలంటూ సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు 2022–23 సీజన్ కోసం 16లక్షల బాటిళ్ల (8లక్షల లీటర్లు) ఇఫ్కో ఏపీకి కేటాయించింది. వీటిలో కనీసం 10లక్షల బాటిళ్లు (5 లక్షల లీటర్లు) ఖరీఫ్‌లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టింది. వీటిలో కనీసం 25 శాతం ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. నానో యూరియా వినియోగంపై రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాగా నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ, జింక్, కాపర్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ట్రయిల్ రన్లో ఉన్న ఈ ఉత్పత్తులను ఖరీఫ్–2023 సీజన్ నుంచి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కావాల్సినంత నిల్వలు ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏపీలో నానో యూరియా వినియోగం పెరుగుతోంది. రైతుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రానున్న ఖరీఫ్ సీజన్ కోసం 8లక్షల లీటర్ల నానో యూరియా బాటిళ్లను ఏపీకి కేటాయించాం. అవసరమైతే కేటాయింపులు మరింత పెంచేందుకు ఇఫ్కో సిద్ధంగా ఉంది. – శ్రీధర్‌రెడ్డి, స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
జిల్లాలకు 4.20 లక్షల టన్నుల యూరియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో వారంలో వ్యవసాయ సీజన్ మొదలవనున్న నేపథ్యంలో అధికారులు ఎరువుల సరఫరా ప్రారంభించారు. ఈ సీజన్లో 25 లక్షల టన్నుల ఎరువులు అవసర మవగా అందులో 10 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్ప టికే అన్ని జిల్లాలకు కలిపి 4.20 లక్షల టన్నుల యూరియా సరఫరా చేసినట్లు వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు మార్క్‌ఫెడ్ 2.13 లక్షల యూరియా నిల్వలను ఉంచినట్లు అధికారులు తెలిపారు. అలాగే 11,857 టన్నుల డీఏపీ, 41,540 టన్నుల కాంఫ్లెక్స్ ఎరువులు బఫర్ స్టాక్‌లో ఉన్నట్లు మార్క్‌ఫెడ్ వర్గాలు వెల్లడిం చాయి. ఎక్కడా ఎరువుల కొరత రాకుండా సిద్ధం గా ఉండాలని మార్క్‌ఫెడ్‌ను వ్యవసాయశాఖ ఆదేశించింది. వానాకాలం సీజన్లో ఎరువుల సరఫరా, పంపిణీ, పర్యవేక్షణపై వ్యవసాయశాఖ మార్గదర్శకాలు తయారు చేసింది. మార్గదర్శకాలు ఇవీ.. ♦రిటైల్ డీలర్లకు రెండు ట్రక్కుల కంటే ఎక్కువగా ఎరువులను కేటాయించకూడదు. ♦ఏదో ఒక కంపెనీ లేదా బ్రాండ్లకు చెందిన వాటిని ప్రోత్సహించేలా జిల్లా వ్యవసాయా ధికారులు వ్యవహరించకూడదు. ♦అంతర్రాష్ట్ర అనధికారిక ఎరువుల సరఫరాను అడ్డుకోవాలి. సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టాలి. ♦ప్రతి నెలా మొదటి వారంలో ఎరువుల డీలర్ల సమావేశాన్ని జిల్లా వ్యవసాయాధికారి నిర్వహించాలి. ♦ఎరువుల లైసెన్సులను మాన్యువల్ ప్రాతి పదికన జిల్లా వ్యవసాయశాఖ అధికారులు జారీచేయకూడదు. ♦జిల్లాల్లో తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి ఎంఆర్పీ కంటే ఎక్కువ వసూలు చేసే వారిని గుర్తించి చర్యలు చేపట్టాలి. -
రామగుండంలో 3.74 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి
ఫెర్టిలైజర్‌సిటీ(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో 2021–22 సంవత్సరం 3,74,728.32 టన్ను ల యూరియా ఉత్పత్తి అయిందని ఆ కర్మాగారం సీజీఎం విజయ్‌కుమార్ బంగార్ మంగళవారం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించిన ఈ కర్మాగారం వాణిజ్య ఉత్పత్తులు ప్రారంభించి ఏడాది పూర్తయింది. దేశీయంగా ఎరువుల కొరత తీర్చడమే ఆర్ఎఫ్సీఎల్ ఉద్దేశం. ఈ ప్లాంట్‌లో ప్రతిరోజూ 2,200 టన్నుల అమ్మో నియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. కర్మాగారం వాణిజ్య ఉత్పత్తుల్లో తెలంగాణకు 2,11,073.13, ఆంధ్రప్రదేశ్‌కు 1,00,321.11, కర్ణాటకకు 63,334.08 టన్నుల యూరియా సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఎరువుల కొరత తగ్గించేందుకు దేశవ్యాప్తంగా మూతపడిన ఎరువుల కర్మాగారాలను కేంద్రం పునరుద్ధరించిందని, వాటిల్లో ఆర్ఎఫ్సీఎల్ (నాటి ఎఫ్‌సీఐ) కూడా ఒకటని తెలిపారు. -
నెల్లూరులో నానో యూరియా ప్లాంట్!.. రూ.250 కోట్లతో ఏర్పాటుకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. దక్షిణాదిన బెంగళూరులో తొలి ప్లాంట్ నెలకొల్పిన భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) రెండో ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనుంది. నెల్లూరు జిల్లాలో ప్లాంట్‌ను నెలకొల్పడంపై ప్రభుత్వంతో ఇఫ్కో సంప్రదింపులు జరుపుతోంది. ఎందుకింత ఆదరణ....? సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా దవ్ర రూపంలో ఇఫ్కో అభివృద్ధి చేసిన నానో యూరియాకు విశేష ఆదరణ లభిస్తోంది. యూరియా బస్తాతో పోలిస్తే ధర తక్కువగా ఉండడం, మెరుగైన పనితీరు, ద్రవరూప యూరియా బాటిళ్లను సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లే వీలుండటం, రవాణా ఖర్చులు ఆదా కావడం దీనికి ప్రధాన కారణాలు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా నానో యూరియా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రూ.250 కోట్లతో ఏపీలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఇటీవల ఉన్నత స్థాయి సమావేశంలో ఇఫ్కో నిర్ణయించింది. కోటి లీటర్ల సామర్థ్యంతో నెల్లూరు అగ్రి సెజ్‌లో ప్లాంట్ ఏర్పాటు కోసం ఇఫ్కో ఆసక్తి చూపుతోంది. కనీసం 20 ఎకరాల్లో ప్లాంట్ నెలకొల్పేందుకు భూ కేటాయింపుల కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. బస్తా యూరియాతో సమానం.. 45 కిలోల యూరియా బస్తాకు సమానంగా 500 మిల్లీ లీటర్ల ద్రవరూప నానో యూరియాను బాటిళ్లలో ఇఫ్కో మార్కెట్లోకి తీసుకొచ్చింది. బస్తా యూరియా ధర మార్కెట్లో రూ.266.50 ఉండగా నానో యూరియా బాటిల్ రూ.240కే లభిస్తోంది. సంప్రదాయ ఎరువుల్లో ఉండే పోషకాలన్నీ కలిగి ఉండడం, అన్ని పంటలకు అనుకూలమైనది కావడం, 80–90 శాతం యూరియా మొక్కకు అందడం, భూసారంతో పాటు భూగర్భ జలాలపై ఎలాంటి ప్రభావం ఉండదని రుజువు కావడంతో ‘నానో’ పట్ల రైతుల్లో ఆదరణ పెరుగుతోంది. గత ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అమ్మకాలకు శ్రీకారం చుట్టగా సుమారు 20 వేల మంది రైతులు 34,128 బాటిళ్లు (17,064 లీటర్లు) కొనుగోలు చేశారు. వచ్చే ఏడాది డీఏపీ, జింక్, కాపర్ కూడా.. నానో యూరియా విక్రయాలను ప్రోత్సహిస్తూ రిటైల్ మార్కెట్లతో పాటు ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుత రబీ సీజన్ కోసం 5.25 లక్షల బాటిల్స్ (2.65 లక్షల లీటర్లు) అందుబాటులో ఉంచగా రికార్డు స్థాయిలో 4.35 లక్షల బాటిళ్ల (2.17 లక్షల లీటర్లు) విక్రయాలు జరిగాయి. డిమాండ్‌ను బట్టి నిల్వ పెంచేందుకు ఇఫ్కో ఏర్పాట్లు చేస్తోంది. నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ, జింక్, కాపర్ కూడా మార్కెట్లోకి తెచ్చేందుకు ఇఫ్కో ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఈ ఉత్పత్తులతో ట్రయిల్ రన్ నిర్వహించింది. 2023 ఖరీఫ్ సీజన్ నుంచి వీటిని మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కలుపు తగ్గింది.. దిగుబడి పెరిగింది ఖరీఫ్‌లో ఆరు ఎకరాల్లో ఎం–7 వరి రకం సాగు చేశా. 30వ రోజు, 60వ రోజు నానో యూరియాను రెండుసార్లు లీటర్ నీటిలో 4 ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేశాం. కలుపు సమస్య, ఖర్చు తగ్గింది. దిగుబడి సరాసరిన రెండు బస్తాలు అధికంగా వచ్చింది. – అశోక్‌కుమార్, ఎల్లాయపాడు, నెల్లూరు జిల్లా త్వరలో ప్లాంట్‌కు పునాది రాష్ట్రంలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఇఫ్కో అంగీకరించింది. నెల్లూరులో భూములను కేటాయించడంపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. ఒకటి రెండు నెలల్లో ప్లాంట్‌కు పునాదిరాయి వేసే అవకాశాలున్నాయి. ఈ ప్లాంట్ కోసం రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. – వై.మధుసూదనరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ, మార్కెటింగ్ శాఖ -
ఎరుపు కోసం రైతన్నపడిగాపులు
-
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్!
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం రైతులకు పండుగ ముందు తీపికబురు అందించింది. రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా ఎరువులపై రాయితీని కేంద్రం భారీగా పెంచింది. ప్రస్తుతం యూరియాపై అందిస్తున్న రాయితీని రూ.1500 నుంచి రూ.2 వేలకు పెంచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ రైతులకు పాత ధరలకే ఎరువులు అందించేలా చూడాలన్న ఉద్దేశంతో సబ్సిడీని పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో డీఏపీ ఎరువుపై ప్రస్తుతం బస్తాకు ఇస్తున్న రాయితీ ధర రూ.1200 నుంచి రూ.1650కి, ఎన్పీకే ఎరువుపై ఇస్తున్న రాయితీ ధర రూ.900 నుంచి రూ.1015కి, ఎన్ఎస్ పీపై ఇస్తున్న రాయితీ ధరను రూ.315 నుంచి రూ.375కి పెంచింది. ఈ రాయితీ పెంపు నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై రూ.28వేల కోట్ల భారం పడనుంది. దీని వల్ల రైతులపై ఎలాంటి భారం పడదని కేంద్ర మంత్రి వివరించారు.(చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!) -
యాదాద్రి రింగ్‌రోడ్డు.. అందాలు మెండు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక భావంతోపాటు ఆహ్లాద వాతావరణం కలిగేలా వైటీడీఏ ఏర్పాట్లు చేస్తోంది. యాదాద్రి కొండ చుట్టూ ఏర్పాటు చేస్తున్న రింగ్‌రోడ్డుకు ఇరువైపులా పూల మొక్కలు నాటుతోంది. ప్రెసిడెన్షియల్ సూట్‌కు సమీపంలో నిర్మించిన సర్కిల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దింది. 60 మీటర్లతో ఏర్పాటు చేసిన ఈ సర్కిల్లో చెన్నై నుంచి తెచ్చిన ఫీనిక్స్ ఫాం జాతి మొక్కలతోపాటు సీజనల్ పూల మొక్కలను నాటారు. దీంతో ఇప్పుడు ఆ సర్కిల్ రంగుల వలయంలా మారి ఆకట్టుకుంటోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్ యాదాద్రి భువనగిరి యూరియా.. రైతుల బాధ ఇదయా! కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు ఉదయం 3 గంటల నుంచే క్యూలైన్లో నిలబడ్డారు. ఉదయం 10 గంటల వరకు కూడా అధికారులు రాకపోవడంతో వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వచ్చింది వచ్చినట్లుగానే లారీల్లో నుంచి యూరియా ఖాళీ అయిపోయింది. అయితే చాలామంది మొక్కజొన్న రైతులకు యూరియా అందలేదు. ఇప్పటి వరకు 538 టన్నుల యూరి యా పంపిణీ చేశామని, మరో 150 టన్నులు వస్తే ఈ సీజన్‌కు యూరియా సరిపోతుందని వ్యవసాయాధికారి ప్రజాపతి తెలిపారు. యూరి యా కోసం రైతులు ఆందోళన చెందనవసరం లేదన్నారు. –సదాశివనగర్ (ఎల్లారెడ్డి) జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో ధరూరు/దోమలపెంట(అచ్చంపేట): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ప్రాజెక్టుకు 1,00,900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఇన్‌ఫ్లో తగ్గడంతో ఉదయం ప్రాజెక్టు 15క్రస్టు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం 10 క్రస్టు గేట్లను ఎత్తి 67,710 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి, ఎత్తిపోతల పథకాలకు కలిపి మొత్తం 1,00,948 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వైపు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.914 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా, శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేసుల నుంచి 1,45,169 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. రెండు క్రస్టు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 55,692 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 64,487క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. -
తెల్లవారుజాము 3 గంటల నుంచే..
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు ఉదయం 3 గంటల నుంచే క్యూలైన్లో నిలబడ్డారు. ఉదయం 10 గంటల వరకు కూడా అధికారులు రాకపోవడంతో వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వచ్చింది వచ్చినట్లుగానే లారీల్లో నుంచి యూరియా ఖాళీ అయిపోయింది. అయితే చాలామంది మొక్కజొన్న రైతులకు యూరియా అందలేదు. ఇప్పటి వరకు 538 టన్నుల యూరి యా పంపిణీ చేశామని, మరో 150 టన్నులు వస్తే ఈ సీజన్‌కు యూరియా సరిపోతుందని వ్యవసాయాధికారి ప్రజాపతి తెలిపారు. యూరి యా కోసం రైతులు ఆందోళన చెందనవసరం లేదన్నారు. -
దక్షిణ తెలంగాణలో ప్లాంటు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: భూసార పరిరక్షణలో నానో యూరియా కీలకంగా పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ కలోల్‌లోని ఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లాంట్లను శాస్త్రవేత్తలు, అధికారులతో కలిసి సంద ర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దక్షిణ తెలంగాణ నానో యూరియా ప్లాంటు ఏర్పాటుకు అనువైన ప్రాంతమని, ఈ దిశగా ఇఫ్కో యోచించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో నానో యూరియా విస్తృత వాడకానికి సహకారం అందించాలని కోరారు. వ్యవసాయ రంగంలో నానో యూరియా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని, నానో యూరియా వినియోగంతో భూసార పరిరక్షణతో పాటు తక్కువ వినియోగంతో అధిక దిగుబడులు సాధించే వీలుందన్నారు. మంత్రితో పాటు జాతీయ సహకార సంఘాల అధ్యక్షులు, మాజీ ఎంపీ దిలీప్ సంగానియా, ఇఫ్కో కలోల్ యూనిట్ ఉన్నతాధికారి ఇనాందార్, నానో యూరియా సృష్టికర్త, శాస్త్రవేత్త, జీఎం రమేశ్ రాలియా తదితరులున్నారు. విస్తృతంగా వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు రాష్ట్రంలో వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. ఈ దిశగా అధ్యయనం కోసం అత్యధిక పరిశ్రమలు ఉన్న గుజరాత్లో పర్యటించి పరిశ్రమలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. శనివారం గుజరాత్‌లోని సబర్‌కాంఠ జిల్లాలో పరిశ్రమలను బృందం సందర్శించింది. ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉందని, తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలను మరింత మెరుగు పరచాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. సీఎం కె.చంద్రశేఖరరావు సూచనల మేరకు జిల్లాల వారీగా పంట ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
రాష్ట్రానికి నానో యూరియా
సాక్షి, హైదరాబాద్: నానో యూరియా.. ప్రస్తుతం రైతులు వినియోగిస్తున్న ఘన యూరియాకు ప్రత్యామ్నాయం. తక్కువ ఖర్చు, పర్యావరణ హితం, మంచి దిగుబడి దీని ప్రత్యేకత. భారతీయ రైతాంగ స్వీయ ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) ఆవిష్కరించిన ఈ నానో యూరియా అతి త్వరలో రాష్ట్రానికి చేరనుంది. గుజరాత్‌లోని కలోల్ నుంచి రాష్ట్రానికి బయల్దేరే నానో యూరియా ట్రక్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆన్లైన్ పద్ధతిలో జెండా ఊపి ప్రారంభించారు. ఇఫ్కో వైస్ చైర్మన్ దిలీప్ సంఘానీ, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు పాల్గొన్నారు. నానో ప్రత్యేకతలివే ♦నానో టెక్నాలజీతో రూపొందించిన నానో యూరియాతో ప్రభుత్వాలపై సబ్సిడీ, రవాణా భారాలు తగ్గుతాయి. ♦ప్రస్తుతం ఒక బస్తాపై రూ.800 నుంచి రూ.1000 వరకు ప్రభుత్వం రాయితీ భారాన్ని మోస్తోంది. రూ.240కే లభించే 500 ఎంఎల్ లిక్విడ్ నానో యూరియా బాటిల్ ఒక బస్తా యూరియాకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ♦ప్రపంచంలోనే తొలిసారిగా నానో యూరియాకు ఇఫ్కో సంస్థ పేటెంట్ పొందింది. ♦ఏ పంటకైనా పూతకంటే ముందు, విత్తిన 20 రోజుల తర్వాత నానో యూరియాను రెండుసార్లు పిచికారీ చేయాలి. మామూలు యూరియా సమర్థత 30 శాతమైతే దీని సమర్థత 80 శాతమని ఇఫ్కో చెబుతోంది. -
తొలిసారిగా.. అర లీటర్ సీసాలో బస్తా యూరియా
సాక్షి, అమరావతి: సంప్రదాయ యూరియా కన్నా శక్తివంతంగా పనిచేసే నానో యూరియా త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) దీనిని ఇటీవల ఆవిష్కరించింది. ఎరువుల తయారీ రంగంలో ఇదో అద్భుత ఆవిష్కారం. నానో టెక్నాలజీపై కొన్నేళ్లుగా పరిశోధనలు సాగుతుండగా.. ప్రపంచంలోనే తొలిసారిగా నానో యూరియాను ఇఫ్కో నానో బయో టెక్నాలజీ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. ఏమిటీ నానో యూరియా.. తరతరాలుగా మనందరికీ తెలిసిన సంప్రదాయ యూరియా తెల్లటి గుళికల రూపంలో ఉంటుంది. బస్తాలలో వస్తుంది. దీని స్థానంలో ఇప్పుడు ద్రావణం రూపంలో ఉండే యూరియాను తయారు చేశారు. 45 కిలోల యూరియాను కేవలం 500 మిల్లీలీటర్ల సీసాలో పట్టేలా చేశారు. అంటే బస్తా యూరియాలో ఉండే పోషకాలు ఈ చిన్న సీసాలోకి వచ్చాయి. పైగా ఇది మహా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ సీసాలో 40 వేల పీపీఎంల నైట్రోజన్ ఉంటుంది. భావి ఎరువుల మార్కెట్ రంగంలో ఇదో మేలి మలుపు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న వేపపూత యూరియా కన్నా ఇది వ్యవసాయ రంగంలో పెద్ద మార్పు తెస్తుందని భావిస్తున్నారు. సంప్రదాయ యూరియా కన్నా ఇది తక్కువ ధరకు లభించడమే కాకుండా పంటల దిగుబడిని 8 శాతం పెంచుతుంది. 500 మిల్లీలీటర్ల నానో యూరియా బాటిల్ ధర రూ.240 కాగా.. యూరియా బస్తా ధర రూ.268. -
యూరియా కోసం బారులు..
-
యూరియా కోసం బారులు.. లైన్లో మందు సీసాలు
సాక్షి, కామారెడ్డి : దోమకొండ మండల కేంద్రంలోని సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు..ఎరువులు తీసుకునేందుకు పడిగాపులు కాశారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడే ఓపిక లేకపోవడంతో క్యూ లైన్లో తమ గుర్తుగా వస్తువులు ఉంచారు. చెప్పులు, రాళ్లతో పాటు మందు బాటిళ్లను కూడా లైన్లో ఉంచారు. తాగి పడేసిన మందు సీసాలను లైన్లో పెట్టడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (విక్రయాల్లో విచిత్రాలెన్నో..) -
విక్రయాల్లో విచిత్రాలెన్నో..
కర్నూలు(అగ్రికల్చర్): యూరియా అమ్మకాల్లో ప్రయివేటు డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమాలకు ఒడిగట్టారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి సమగ్ర విచారణ చేపట్టాలంటూ కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో ఆయన జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) పుల్లయ్యతో విచారణ చేయిస్తున్నారు. ఇప్పటికే డీఆర్వో క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేశారు. ఈ క్రమంలో డీలర్ల ‘వేషాలు’ వెలుగు చూశాయి. ♦నందికొట్కూరులోని రెండు దుకాణాల్లో ముగ్గురు వ్యక్తులే 188 టన్నుల యూరియా కొనుగోలు చేసినట్లు రికార్డు అయ్యింది. దీనిపై డీఆర్వో విచారణ చేయగా.. ఆ ముగ్గురూ ఆయా షాపుల్లో పనిచేసే గుమాస్తాలేనని తేలింది. బిజినవేములకు చెందిన ఇర్ఫాన్ 84.6 టన్నులు, షేక్ సికిందర్ 49.14 టన్నులు, చెరుకుచెర్లకు చెందిన శివన్న 54.945 టన్నులు కొన్నట్లు డీలర్లు రికార్డు చేశారు. ♦నంద్యాలలోని ఒక ఫర్టిలైజర్ దుకాణంలో బి.గోవిందు అనే వ్యక్తి ఏకంగా 174.555 టన్నుల యూరియా (3,491 బస్తాలు) కొనుగోలు చేసినట్లు రికార్డు అయ్యింది. ఒక మండలానికి సరిపోయే యూరియాను ఒకే వ్యక్తి కొన్నట్లు డీలర్లు మాయ చేశారు. అలాగే అద్దంకి సత్యనారాయణ అనే వ్యక్తి 169.155 టన్నుల యూరియా కొనుగోలు చేసినట్లు చూపారు. ♦ఇలా 23 మంది వేలాది బస్తాల యూరియా కొనుగోలు చేసినట్లు డీలర్లు చూపడం వెలుగులోకి వచ్చింది. యూరియాతో సహా రసాయనిక ఎరువులను పట్టాదారు పాసు పుస్తకాల్లో ఉన్న విస్తీర్ణం మేరకు ఈ–పాస్ మిషన్‌లో రైతు వేలిముద్ర తీసుకుని పంపిణీ చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. కానీ డీలర్లు అడ్డగోలుగా వ్యవహరించారు. 3 షాపుల లైసెన్స్ సస్పెండ్ యూరియా అధిక ధరకు అమ్ముతున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో తేలిన నేపథ్యంలో కల్లూరు మండలం చిన్నటేకూరులోని ధనుంజయ ఫర్టిలైజర్స్, కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని సాయికృప ఏజెన్సీస్, వసుంధర ఆగ్రో ఏజెన్సీస్ లైసెన్స్‌లను సస్పెండ్ చేస్తూ కర్నూలు సబ్ డివిజన్ ఏడీఏ ఆర్.విజయశంకర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
అందుబాటులో అవసరమైన యూరియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతాంగ అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ వానాకాలానికి కావాల్సిన అన్ని రకాల ఎరువులు 22.30 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇందులో 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, దీన్ని దశలవారీగా రాష్ట్రానికి తీసుకువస్తున్నామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ‘యూరియా లాక్ ’శీర్షికన ఆదివారం ’సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మంత్రి స్పందించి ఈ మేరకు వివరణ ఇచ్చారు. జూలై నెల కోటాను కేంద్రం సకాలంలో సరఫరా చేయకపోవడంతో వెంటనే సీఎం కేసీఆర్ కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రితో మాట్లాడారని, తాను కూడా కేంద్రమంత్రిని కలిశానని పేర్కొన్నారు. దీంతో కేంద్రం వెంటనే జూలై కోటా సరఫరా మొదలుపెట్టిందని, ఈ నెలలో 2.05 లక్షల మెట్రిక్ టన్నులకుగాను 1.06 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, మిగిలిన యూరియాను ఈ నెలాఖరుకల్లా ఇస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని వెల్లడించారు. ఈరోజుకు రాష్ట్రవ్యాప్తంగా డీలర్లు, సహకార సంఘాలు, -
యూరియా ‘లాక్’
సాక్షి, హైదరాబాద్: కరోనా... ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి రాష్ట్రంలోని వ్యవసాయ అవసరాలపై కూడా తన ప్రతాపాన్ని చూపుతోంది. ఈ వైరస్ విజృంభిస్తున్న వేళ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనే కాదు స్థానికంగా ఏర్పడిన ‘లాక్డౌన్’పరిస్థితులు అడుగడుగునా రాష్ట్రంలోకి ఎరువుల రాకను అడ్డుకుంటున్నాయి. విదేశాల నుంచి యూరియాను తెచ్చే నౌకల గమ్యస్థానాలైన పోర్టుల నుంచి రాష్ట్రంలో ఉండే ర్యాక్ పాయింట్లు, గోదాముల వరకు అన్నిచోట్లా ఈ మాయదారి వైరస్ తన ప్రభావాన్ని చూపెడుతూనే ఉంది. దీంతో ఈ ఖరీఫ్ సీజన్‌కు యూరియా ముప్పు పొంచి ఉందని, కరోనాకు తోడు తుపానులు కూడా యూరియా దిగుమతులకు అడ్డంకిగా మారాయని వ్యవసాయశాఖ ఓ నివేదికను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్రంలో ఎరువుల వినియోగం గత నెల నుంచే ప్రారంభం కావడం, ఈ నెల నుంచి సెప్టెంబర్ వరకు గరిష్టంగా వినియోగం జరిగే అవకాశం ఉండడంతో ఏం చేయాలో కూడా ఆ శాఖ అధికారులకు పాలుపోవడం లేదు. మొత్తంమీద కరోనా ప్రభావం కారణంగా అవసరానికన్నా 2.5 లక్షల టన్నుల వరకు యూరియా కొరత ఏర్పడిందని, రాష్ట్రంలో ప్రస్తుతం 5.84 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులే అందుబాటులో ఉన్నాయని, అందులోనూ యూరియా కేవలం 1.89 లక్షల మెట్రిక్ టన్నులే ఉందని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. నాలుగు నెలలుగా సరఫరాలో జాప్యం వాస్తవానికి, రాష్ట్రంలో ప్రతి సీజన్‌కు సాగు చేసే పంటల విస్తీర్ణం ఆధారంగా తమకు ఎరువులు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఫర్టిలైజర్స్ శాఖకు ప్రతిపాదనలు పంపుతుంది. ఆ మేరకు ప్రతి సీజన్‌కు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ (డీవోఎఫ్) ఎరువులను కేటాయిస్తుంది. ఈ ఏడాది మొత్తం 1.25 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయనే అంచనాతో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈసారి ఎరువుల కేటాయింపు ప్రతిపాదనలను భారీగానే పంపింది. దీనికి అనుగుణంగానే డీవోఎఫ్ కూడా ఈసారి మన రాష్ట్రానికి 10.50 లక్షల మెట్రిక్ టన్నులు (గత సంవత్సరాలతో పోలిస్తే 2 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా) యూరియాను కేటాయించింది. ఇందులో ఈనెల 31 నాటికి 6.13 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి రావాల్సి ఉండగా, ఇప్పటివరకు ఏప్రిల్, మే, జూన్, జులై మాసాల్లో కేవలం 3.70 లక్షల మెట్రిక్ టన్నులే వచ్చింది. ఇక మిగిలిన ఎరువులు కూడా కలిపి మొత్తం 22.50 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రం కేటాయించగా, అందులో జూలై వరకు రావాల్సిన దాంట్లో ఇప్పటివరకు 5 లక్షల టన్నుల మేర తక్కువ రావడం గమనార్హం. మరో 37 వేల టన్నులు వచ్చే చాన్స్ ఇక వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం రాష్ట్రానికి ఈనెల 31 వరకు మరో 37 వేల టన్నులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఉన్న 8 ర్యాక్ పాయింట్ల నుంచి పలు ఫర్టిలైజర్ కంపెనీలు ఈ మేరకు ఎరువులు ఇస్తాయని ఆ శాఖ అంచనా వేస్తోంది. కానీ కోవిడ్ ప్రభావం కారణంగా అవి కూడా ఏ మేరకు వస్తాయన్నది సందేహాస్పదమే. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత ఏర్పడే అవకాశముందని వ్యవసాయ శాఖ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఈ కొరతను అధిగమించేందుకు గాను గత నెలల్లో తక్కువగా వచ్చిన ఎరువులనయినా రాష్ట్రానికి పంపాలని, రానున్న నెలల్లో కేటాయింపుల కంటే ఎక్కువ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ప్రతిపాదించారు. ఇవీ అడ్డంకులు: ►మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా అక్కడ లేబర్ సమస్య బాగా ఏర్పడింది. దీనికి తోడు ఆంఫా, నిసర్గా తుపానుల కారణంగా ఆ రాష్ట్రంలోని యూరియా ఉత్పత్తి కార్మాగారాల్లో పనులు నిలిచిపోయాయి. ►మే నెలలోనే కృష్ణపట్నం పోర్టులో లేబర్ సమస్య రావడంతో సప్లై నెమ్మదించింది. ఇక, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూన్ 10 నుంచి 16 వరకు అక్కడ లోడింగ్ కార్యకలాపాలు నిలిపివేశారు. జూన్‌లో పారాదీప్ పోర్టుకు రావాల్సిన యూరియా నౌక ఇంకా చేరలేదు. ►ఏప్రిల్, మే నెలల్లో లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా రాష్ట్రంలోని ర్యాక్ పాయింట్లలో కూడా లోడింగ్, అన్లోడింగ్ నిలిచిపోయింది. యూరియా రవాణా ఆగింది. ►సనత్‌నగర్, ఆదిలాబాద్ ర్యాక్ పాయింట్లలో ఏప్రిల్ నెలలో, కరీంనగర్ పాయింట్లో ఏప్రిల్, మే నెలల్లో కరోనా కారణంగా అన్‌లోడింగ్‌కు అవాంతరాలు కలిగాయి. ►ఇక నిజామాబాద్ ర్యాక్పాయింట్లో యూరియా అన్లోడింగ్ నెమ్మదిగా జరుగుతోంది. ఇక్కడ బియ్యం దిగుమతికి ప్రాధాన్యత ఇస్తుండడం, ప్లాంట్లు, పోర్టుల నుంచి యూరియా తెచ్చే ర్యాక్‌లు తక్కువగా లోడ్ అవుతుండడంతో ఇక్కడ కూడా ఆశించిన స్థాయిలో యూరియా దిగుమతి కావడం లేదు. ►రవాణా లారీల్లో ఎక్కువగా మక్కలు వెళుతున్నాయి. దీనికి తోడు రబీలో వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులతో గోదాములు నిండిపోవడంతో యూరియా నిల్వకు సమస్య ఏర్పడుతోంది. ►మన రాష్ట్రానికి యూరియాను ఎక్కువగా సరఫరా చేసే కాకినాడలోని నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్సీఎల్)ను ఈనెల మొదటివారం నుంచి షట్‌డౌన్ చేయడం ఈ ఆలస్యానికి మరింత కారణం అవుతోంది. చెన్నై, మహారాష్ట్రల్లోని యూరియా ప్లాంట్లు కూడా ఏప్రిల్ నుంచి మూతపడి ఉన్నాయి. ►కోవిడ్, తుపానుల కారణంగా చైనా, వియాత్నాం, గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన యూరియా నౌకలు సమయానికి రావడం లేదు. -
యూరియా కోసం పడిగాపులు
రైతులకు యూరియా కోసం పడిగాపులు తప్పడం లేదు. ఆదివారం యూరియా పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్తోపాటు పలు గ్రామాలకు చెందిన రైతులు తెల్లవారు జామున 3 గంటలకే చెన్నారావుపేట సొసైటీ ఆవరణకు చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి పోలీసు బందోబస్తు మధ్య యూరియా అందించారు. అమీనాబాద్ సహకార సంఘం వద్దకు కూడా రైతులు అధికంగా తరలివచ్చారు. – చెన్నారావుపేట -
యూరియా కావాలంటే డీఏపీ కొనాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ఎరువుల సంస్థలో అవినీతి ఏపుగా పెరిగింది. మార్క్‌ఫెడ్‌కు మరక అంటింది. రైతులకు సరిపడా యూరియాను సిద్ధం చేయలేని ఆ సంస్థ, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను అనవసరంగా అంటగడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా కావాలంటే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు కొనాల్సిందేనని అధికారులు ప్రాథమిక సహకార సంఘాల(ప్యాక్స్)పై ఒత్తిడి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తద్వారా యూరియా కొరతను ఎరువుల కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల కొన్ని జిల్లాలకు ఒక కంపెనీ ఏకంగా ఉత్తర్వులే జారీ చేశారని, ఒక జిల్లాకు చెందిన మార్క్‌ఫెడ్ అధికారి సంబంధిత కంపెనీతో ఘర్షణకు దిగారనే విషయాలు కూడా అంతర్గతంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఖరీఫ్‌లో ఎరువుల పంపిణీ వ్యవసాయ లక్ష్యం -19.40 లక్షల మెట్రిక్ టన్నులు ఇందులో యూరియా - 8.50 లక్షల మెట్రిక్ టన్నులు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు - 10.90 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువుల కంపెనీలతో కుమ్మక్కై.. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ వద్ద డీఏపీ 14,900 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 2,800 మెట్రిక్ టన్నులు, యూరియా 10,200 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. యూరియా కంటే ఇతర ఎరువులనే మార్క్‌ఫెడ్ అధికారులు ఎక్కువగా అందుబాటులో ఉంచడం గమనార్హం. యూరియా కొరత ఉన్నందున లింకు పెడితే రైతులు కొంటారని అధికారులకు కంపెనీలు నూరిపోస్తున్నాయి. అలా చేస్తే పర్సంటేజీలు ఇస్తామని ఆశ చూపిస్తున్నాయి. యూరియా కోసం గత్యంతరం లేక ప్యాక్స్‌లు, అక్కడి నుంచి రైతులు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేయక తప్పడంలేదు. ఉన్నతస్థాయి యంత్రాంగం ఈ తతంగాన్ని చూస్తూ ఉండటం గమనార్హం. ఇష్టారాజ్యంగా ధరలు... జూలై, ఆగస్టులోనే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం వాటికి డిమాండ్ లేదు. అయినా రైతులతో కొనిపిస్తున్నారు. మార్క్‌ఫెడ్ ధరల ప్రకారం ప్యాక్స్‌కు ఇచ్చే డీఏపీ బస్తా ధర రూ.1,250 కాగా, డీలర్లకు కంపెనీలు ఇచ్చే ధర రూ. 1,150 నుంచి రూ. 1,190 మాత్రమే. కాంప్లెక్స్ ఎరువులకు మార్క్‌ఫెడ్ ఇచ్చే ధర బస్తా రూ. 980 కాగా, డీలర్లకు ఇచ్చే ధర రూ. 900 నుంచి రూ. 940 మాత్రమే. డీఏపీ బస్తా ధర మార్క్‌ఫెడ్ వద్ద రూ. 50 నుంచి రూ. 100, కాంప్లెక్స్ ఎరువుల ధర రూ.40 నుంచి రూ.80 అధికం. -
ఖరీఫ్ నేర్పిన పాఠం..
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో యూరియా పంపిణీలో ఎదురవుతున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. పక్షం రోజుల్లో ప్రారంభం కానున్న రబీ సీజన్లో ఎరువుల పంపిణీకి ముందుజాగ్రత్త పడుతోంది. గతేడాది రబీ సీజన్లో ఎరువుల కేటాయింపుల కోసం పంపిన ప్రతిపాదనలకు దాదాపు రెట్టింపు నిల్వలు కేటాయించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. సాక్షి, నిజామాబాద్: గత ఏడాది 2018 రబీ సీజన్లో 36,720 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని ప్రతిపాదించగా.. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎదురైన అనుభవాల రీత్యా రబీ సీజన్లో ఏకంగా 71,537 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అంటే గతేడాది కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో కేటాయింపుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గత రబీ సీజన్లో జిల్లాకు ఏ మేరకు యూరియా వచ్చిందనే అంశంపైనా లెక్కలు తీస్తున్నారు. ఎరువులు : 1.21 లక్షల మెట్రిక్ టన్నులు.. రబీ సీజన్లో మొత్తం 1.21 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి పంపించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 71,537 టన్నుల యూరియాతో పాటు, 8,621 మెట్రిక్ టన్నుల డీఏపీ, 7,570 మెట్రిక్ టన్నుల ఎంఓపీ, 958 మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పీ, 33,045 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు కేటాయించాలని కోరుతున్నారు. ముందస్తు నిల్వలు.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సహకార సంఘాలు ఎరువుల విషయంలో అలసత్వం వహించడంతో యూరియా కొరతకు కారణమైంది. సహకార సంఘాలు ముందస్తుగా నిల్వలు చేసుకోకపోవడంతో ఒక్కసారిగా వచ్చిన డిమాండ్‌కు సరిపడా ఎరువులను సరఫరా చేయడం ఇబ్బందిగా మారింది. రెండు బస్తాల యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడాల్సి వచ్చింది. వ్యవసాయ పనులన్నీ మానుకుని రోజంతా క్యూలైన్లో నిలబడితే రెండు బస్తాల యూరియా దొరకడం కష్టంగా మారింది. దీంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం విదితమే. పాసుపుస్తకాలను, చెప్పులను క్యూలో పెట్టి అనేక పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రబీ సీజన్లో ఇలా పరిస్థితులు ఎదురుకాకుండా ముందు జాగ్రత్త పడాలని నిర్ణయించింది. ఇందుకోసం సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలు ముందుగానే అందుబాటులో ఉంచేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఆర్థికంగా బలంగా ఉన్న సహకార సంఘాలు, వరి విస్తీర్ణం అధికంగా ఉండే ప్రాంతాల సహకార సంఘాల్లో ముందస్తుగా నిల్వలు తెప్పించుకుని పెట్టుకోవాలని నిర్ణయించారు. జిల్లాలో ఒక్క ఆర్మూర్ సబ్ డివిజన్ మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల వరి విస్తీర్ణం అధికంగా ఉంటుంది. దీంతో ఈ సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలుంచాలని నిర్ణయించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కూడా ఇలాగే ముందస్తు నిల్వలు తెప్పించి పెట్టుకోవాలని వ్యవసాయశాఖ సహకార సంఘాల పాలకవర్గాలకు ఆదేశాలు జారీ చేసినా.. పలు సంఘాలు పెడచెవిన పెట్టడంతో యూరియా కొరత తీవ్రమైందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. 82 వేల హెక్టార్లలో వరి అంచనా... ఈ రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 82 వేల హెక్టార్లలో వరి పంట సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 13 వేల హెక్టార్లలో ఎర్రజొన్న, ఆరు వేల హెక్టార్లలో మొక్కజొన్న, పది వేల హెక్టార్లలో శనగ, మరో ఆరు వేల హెక్టార్లలో బాజ్రాతో పాటు నువ్వు, కూరగాయలు, పప్పుదినుసు వంటి పంటలు సాగవుతాయి. ఈసాగు విస్తీర్ణానికి అవసమైన ఎరువులను తెప్పించేందుకు ప్రతిపాదనలు తయారు చేసింది. -
యూరియా కష్టాలు.. గంటల కొద్ది పడిగాపులు
సాక్షి, జనగాం : రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. బస్తా యూరియా కోసం గంటల కొద్ది లైన్లలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం ఆరు గంటల నుంచే క్యూలైన్ల వద్ద చెప్పులతో రైతులు బారులు తీరుతున్నారు. పాలకుర్తి మండలం ఎఫ్ఎస్సీఎస్ కోపరేట్ బ్యాంకు వద్ద యూరియా బస్తాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. కాళ్లు తిమ్మిర్లు పట్టేలా గంటల పాటు వరుసలో నిలబడి ఉన్నా ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. ఒక లారీ లోడ్‌లో 506 యూరియా బస్తాలు వస్తే రోజు వెయ్యి మంది నుoచి 1200 మంది రైతులు బస్తాలకోసం వస్తున్నారు. తమ పరిస్థితిని గుర్తించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని, యూరియా బస్తాల కొరత లేకుండా అన్ని ప్రాంతాలకు రవాణా చేసి అధికారులు ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. -
‘యూరియా పంపిణీలో క్షణం వృథా కానివ్వం’
సాక్షి, హైదరాబాద్: రైతులకు యూరియా అందించడంలో క్షణం కూడా వృథా కానివ్వబోమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఎరువులను త్వరితగతిన రాష్ట్రానికి చేర్చేందుకు రోడ్డు, రైల్వే అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. రబీకి కూడా యూరియా నిల్వలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు అన్ని పోర్టుల నుంచి 20,387 మెట్రిక్ టన్నులు, విశాఖ నుంచి 6,800 మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకున్నట్లు చెప్పారు. గురువారం ఏపీ లోని గంగవరం పోర్టులో అధికారులతో సమావేశమైన మంత్రి యూరియా సత్వర రవాణాపై చర్చించారు. తెలంగాణకు యూరియా సరఫరా చేసేందుకు కారి్మకులు, రవాణాదారులు సహకరించాలని, అవసరమైతే మూడు షిఫ్టుల్లో పనిచేయాలని కోరారు. మంత్రి వెంట వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి తదితరులున్నారు. -
తీరనున్న యూరియా కష్టాలు
సాక్షి, జడ్చర్ల టౌన్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రైతులు పడుతున్న యూరియా కష్టాలు ఇక తీరనున్నాయి. తాజాగా బుధవారం జడ్చర్ల రైల్వేస్టేషన్‌కు వ్యాగన్ ద్వారా స్పిక్ కంపెనీకి చెందిన 1,649 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. గురువారం మరో రెండు వ్యాగన్ల ద్వారా 3,800 మెట్రిక్ టన్నుల యూరియా రానుంది. జడ్చర్ల రేక్‌పాయింట్‌కు చేరుకున్న యూరియాను మహబూబ్‌నగర్ డీఏఓ సుచరిత, మార్క్‌ఫెడ్ ప్రతినిధి ప్రణీత్, రేక్‌పాయింట్ అధికారి, జడ్చర్ల ఏఓ రాంభూపాల్ పరిశీలించారు. వచ్చిన ఈ యూరియాను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఆయా జిల్లాలకు పంపిణీ ఇలా యూరియాను మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాలకు 500 మెట్రిక్ టన్నుల చొప్పున సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. గద్వాల, నాగర్‌కర్నూలు జిల్లాలకు 129 మెట్రిక్ టన్నుల చొప్పున యూరియాను పంపించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు కేటాయించిన యూరియాలో జడ్చర్ల మండలానికి 120 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కోరమండల్ యూరియా మొదటి విడతగా 800 మెట్రిక్ టన్నులు, రెండో విడతగా 3,000 మెట్రిక్ టన్నులు రానుందన్నారు. ఉమ్మడి జిల్లాలో కొరత లేదు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో యూరియా కొరత లేదని డీఏఓ సుచరిత స్పష్టం చేశారు. బుధవారం జడ్చర్ల రేక్‌పాయింట్ పరిశీలించిన అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం 1,649 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, గురువారం 3,800 మెట్రిక్ టన్నులు రానుందన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు కావాల్సిన విధంగా యూరియాను సరఫరా చేస్తున్నామన్నారు. వచ్చిన యూరియాలో 50 శాతం మార్క్‌ఫెడ్ ద్వారా సంఘాలకు ఇస్తామని, మిగతాది డీలర్లకు కేటాయిస్తామన్నారు. తద్వారా రైతులు రద్దీ లేకుండా సౌకర్యంగా యూరియా తీసుకువెళ్లగలుగుతారన్నారు. గత జూన్‌లో వర్షాలు కురియకపోవడం వల్ల యూరియా డిమాండ్ లేదన్నారు. జూలై, ఆగస్టులో వర్షాలు కురియడంతో యూరియాకు డిమాండ్ పెరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 1.17 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతున్నాయన్నారు. వీటికోసం 34 వేల మెట్రిక్‌టన్నుల యూరియా అవసరం ఉందని ప్రతిపాదనలు పంపామన్నారు. నెల వారీగా నివేదికలు ఇచ్చామని అందులో బుధవారం సాయంత్రం వరకు 22,649 మెట్రిక్ టన్నులు సరఫరా అయ్యిందన్నారు. జిల్లాలో మండలాల వారీగా ముందుజాగ్రత్తలు తీసుకుని యూరియా నిల్వలు ఉంచటం వల్ల సమస్య తలెత్తకుండా చూశామన్నారు. అవసరమైన ప్రాంతాలకు నిల్వ ఉన్నచోటనుంచి పంపిణీ చేశామని తెలిపారు. -
సేంద్రియ యూరియా!
రెండేళ్లుగా సేంద్రియ యూరియా తయారు చేసి వాడుకుంటూ చక్కని దిగుబడులు సాధిస్తున్న ఆదర్శ యువ రైతు సోదరుల విజయ సూత్రాలే నేటి నేటి సాగుబడిగా మీ ముందు... ఆరుగాలం చెమటోడ్చి వ్యవసాయం చేసే రైతులు స్వతహాగా స్వేచ్ఛా జీవులు. అయితే, విత్తనాలు, ఎరువులకు, పురుగుమందులకు పూర్తిగా మార్కెట్‌పైనే ఆధారపడడంతో సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఉత్సాదకాలన్నిటినీ దుకాణాల్లో కొనుక్కొని వాడుకోవడానికి అలవాటు పడిన రైతులు ఆర్థికంగా నష్టపోవడంతోపాటు తమకున్న స్వేచ్ఛను కోల్పోతున్నారు. యూరియా వంటి రసాయనిక ఎరువు బస్తాల కోసం తెలంగాణ జిల్లాల్లో రైతులు రోజుల తరబడి క్యూలలో నిలబడుతూ నానా బాధలు పడుతున్నారు. అయితే, జగిత్యాల జిల్లాలో కొందరు ప్రకృతి వ్యవసాయదారులు మాత్రం తమ స్వేచ్ఛను నిలబెట్టుకుంటున్నారు. తమ పంటలకు అవసరమైన సేంద్రియ యూరియాను ఇసుక, ఆవు మూత్రంతో తామే తయారు చేసుకుంటూ నిశ్చింతగా పంటలు పండించుకుంటున్నారు. అటువంటి ఓ యువ రైతు సోదరుల విజయగాథ ఈ వారం ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. ♦ దండవేని నరేష్, సురేష్ అన్నదమ్ములు, యువకులు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని అల్లీపూర్ వారి స్వగ్రామం. ఐదేళ్లుగా 8 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు సాగుచేస్తున్నారు. పాలేకర్, చౌహాన్ క్యు, సీవీఆర్ మట్టిసేద్యంపై యూట్యూబ్‌లో వీడియోలు చూసి ప్రకృతి వ్యవసాయం చేపట్టి అభివృద్ధి పథంలో కొనసాగుతున్నారు. ♦ రెండెకరాల్లో 16 రకాల కూరగాయలు, 3 ఎకరాల్లో వరి, మిగతా 3 ఎకరాల్లో చిరుధాన్యాలు, పసుపు తదితర పంటలు పండిస్తున్నారు. రసాయనాలు వాడకుండా తాము పండించిన సేంద్రియ ఉత్పత్తులను జగిత్యాల పట్టణంలో సొంతంగా స్టాల్ ఏర్పాటు చేసుకొని మార్కెట్ ధరపై 10% అధిక ధరకు స్వయంగా అమ్ముకుంటూ మంచి ఆదాయం పొందుతున్నారు. ♦ నరేష్, సురేష్ పంటలకు ఘనజీవామృతం, జీవామృతం, లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా, మట్టి ద్రావణం, చేప అమినోయాసిడ్ ద్రావణం, జీవన ఎరువులు వంటి వాటిని పంటల పోషక అవసరాలకు తగినట్లుగా వాడుతూ ఉంటారు. వీటిని స్వయంగా తామే తయారు చేసుకుంటారు. అయితే, రెండేళ్లుగా ఇసుక, ఆవు మూత్రంతో సేంద్రియ యూరియాను కూడా తయారు చేసుకొని పంటలకు వేసుకుంటున్నారు. వాడకానికి సిద్ధమైన సేంద్రియ ఇసుక యూరియా 30 రోజుల్లో సేంద్రియ యూరియా సిద్ధం సేంద్రియ యూరియాకు కావాల్సిన ముడి పదార్థాలు.. ఇసుక, నాటు ఆవు మూత్రం. యూరియా తయారీకి నాటు ఆవు మూత్రం శ్రేష్టమని, దీనితోపాటు ఏ పశువు మూత్రమైనా వాడుకోవచ్చని నరేష్, సురేష్ చెబుతున్నారు. దగ్గరలో ఉన్న వాగు నుంచి ఇసుకను సేకరించుకోవాలి. అందులో రాళ్లు, రప్పలు లేకుండా జల్లించుకోవాలి. వర్షం, ఎండ పడకుండా కొష్టం/షెడ్లో సేంద్రియ యూరియా తయారు చేసుకోవాలి. ఇందుకు 30 రోజులు పడుతుంది. మొదటి 20 రోజులు ఇసుకలో ఆవు మూత్రం రోజూ కలుపుతూ తడిగా ఉంచాలి. తర్వాత 10 రోజులు ఆ ఇసుకకు గాలి తగలకుండా ప్లాస్టిక్ షీట్లో మూటగట్టి ఉంచాలి. తయారు చేసే విధానం: ఇసుకను ఒక పెద్ద నల్లని ప్లాస్టిక్ కవర్‌పై పోయాలి. 100 కిలోల ఇసుకపై 10–12 లీటర్ల నాటు ఆవు మూత్రాన్ని పోసి, ఇసుక పూర్తిగా తడిసేలా కలగలపాలి. తర్వాత, గాలి చొరబడకుండా కవర్ కట్టేయాలి. 19 రోజుల పాటు రోజూ కవర్‌ను విప్పి, ఇసుక తడి ఆరకుండా ఉండేంత ఆవు మూత్రాన్ని చల్లి.. మళ్లీ కవర్‌ను గట్టిగా తాడుతో కట్టి నీడలో ఉంచాలి. 20 రోజులకు ఇసుక యూరియా పసుపు నుంచి నల్లని రంగులోకి మారుతుంది. ఇక సేంద్రియ యూరియా వాడకానికి సిద్ధమైనట్టే. సేంద్రియ యూరియా తయారీకి మరో పద్ధతి సేంద్రియ యూరియాను మరింత సులభంగా తయారు చేసుకునే పద్ధతి మరొకటి ఉందని రైతు శాస్త్రవేత్త కొక్కు అశోక్‌కుమార్(98661 92761) తెలిపారు. పశువుల చావిడిలో నేలపైన ఇసుక పోసి, అక్కడ పశువులను కట్టేయాలి. అవి పేడ వేస్తాయి, మూత్రం పోస్తాయి కదా. పేడను విడిగా తీసుకొని.. మూత్రంతో తడిసిన ఇసుకను ఏరోజుకారోజు తీసి పక్కన కుప్పగా పోసుకోవాలి. పశువుల మూత్రమే కాదు మనుషుల మూత్రం కూడా సేంద్రియ యూరియా తయారీకి అద్భుతంగా పనిచేస్తుంది. అలా 20 రోజులు చేయాలి. 21వ రోజున ఆ ఇసుకకు గాలి ఆడకుండా ఉండేలా మూటగట్టి 10 రోజుల తర్వాత తీయాలి. అంతే.. సేంద్రియ యూరియా సిద్ధం! రసాయనిక యూరియా పంటపై చల్లితే ఎక్కువ తక్కువగా పంటకు అందుతుందని, అది కూడా 20% మాత్రమేనని, మిగతాది వృథా అవుతుందని కొక్కు అశోక్‌కుమార్ అన్నారు. సేంద్రియ యూరియా పంటపై చల్లినప్పుడు సమానంగా, పుష్కలంగా అందుతుందని తెలిపారు. పర్యావరణ కాలుష్యం, నీటి కాలుష్యం దీని వల్ల ఉండదని, మోతాదు ఎక్కువైనా పంటకు నష్టం ఉండదని, చీడపీడల విజృంభించవని అన్నారు. రైతులందరూ సేంద్రియ యూరియాను తయారు చేసుకొని వాడుకుంటే ఆర్థికంగా, పర్యావరణపరంగా, భూసారం పరంగా ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ఎకరానికి 200 కిలోలు రైతు శాస్త్రవేత్త కొక్కు అశోక్‌కుమార్ గత ఖరీఫ్‌కు ముందే జగిత్యాలలో రైతులకు సేంద్రియ యూరియా తయారీపై శిక్షణ ఇచ్చారు. నరేష్, సురేష్ కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నారు. వాళ్లు వరి సాగుకు సేంద్రియ యూరియా వాడటం ఇది వరుసగా మూడో సీజన్. నాటు వేసిన 20 రోజులకు ఎకరానికి 200 కిలోలు, పొట్ట దశలో మరో 200 కిలోల సేంద్రియ యూరియా చల్లుతున్నారు. 2018 ఖరీఫ్‌లో ఎకరానికి 28 క్వింటాళ్లు, రబీలో 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి పొందారు. రసాయనిక యూరియా కోసం తోటి రైతులు రోజుల తరబడి క్యూలలో నిల్చుంటూ ఉంటే.. ఈ యువ రైతులు మాత్రం.. స్వల్ప ఖర్చుతో ముందే తాము తయారుచేసి పెట్టుకున్న సేంద్రియ యూరియాను సకాలంలో వరి పంటకు అందించడంతోపాటు పొటాషియాన్ని అందించే పొగాకు కషాయం పిచికారీ చేసి నిశ్చింతగా ఉన్నారు. వర్షం పడని చోట దాచుకుంటే 1–2 రెండేళ్ల వరకు నిల్వ ఉంచుకొని వాడొచ్చని నరేష్(96409 63372), సురేష్ తెలిపారు. ప్టాస్టిక్ కవర్‌కు బదులు సిమెంటు తొట్టెలో సైతం సేంద్రియ యూరియాను సులభంగా, పెద్దమొత్తంలో తయారు చేసుకునే వీలుంది. ఎకరానికి విడతకు 100 నుంచి 200 కిలోలు వేసుకోవచ్చు. రసాయనిక యూరియా వేసిన తర్వాత పంటకు చీడపీడల బెడద ఎక్కువ అవుతుందని, సేంద్రియ యూరియా వల్ల ఆ సమస్య రాలేదన్నారు. సేంద్రియ యూరియాపై భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి లోతైన పరిశోధనలు చేసి ఫలితాలను వెల్లడిస్తే రైతులకు మరింత మేలు జరుగుతుంది. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ -
యూరియా ఆగయా!
సాక్షి, నిజామాబాద్: అన్నదాతల ఇక్కట్లు తొలగి పోనున్నాయి. యూరియా కష్టాలు తీరనున్నాయి.. జిల్లాలో కొద్ది రోజులుగా యూరియాకు తీవ్ర కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఎరువు కోసం రైతులు సొసైటీల వద్ద బారులు తీరి నానా తిప్పలు పడ్డారు. అయితే, యూరియా కొరత తీర్చేందుకు అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయి. తాజాగా ఆదివారం జిల్లాకు 2,551 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. రైలు వ్యాగన్లలో వచ్చిన ఎరువు బస్తాలను గ్రామాలకు పంపిస్తున్నారు. యూరియా కొరతను దృష్టిలో ఉంచుకుని అన్ని సొసైటీలకు లారీల్లో సరఫరా చేశారు. జిల్లాలో ని 90 సొసైటీలకు ఇప్పటికే ఎరువు బస్తాలు చేరుకున్నాయి. సోమవారం నుంచి రైతులకు ఎరువు బస్తాలు అందజేయనున్నారు. ఆందోళన వద్దు.. యూరియాకు ఎక్కడా కొరత రాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ అధికారులకు సూచించారు. రైలులో వచ్చిన స్టాక్‌ను సొసైటీలకు తరలించే ప్రక్రియను ఆయన ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ.. యూరియా సరఫరా పూర్తి కాకముందే అవసరం మేరకు ఇండెంట్ పెట్టాలని అధికారులకు సూచించారు. మరో రెండు, మూడు రోజుల్లో మరోసారి జిల్లాకు యూరియా స్టాక్ వస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రెండు రోజుల్లో 3 వేల మెట్రిక్ టన్నుల మేర ఎరువులు జిల్లాకు వస్తాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని డీఏవో వివరించారు. రైతులకు సరిపడా ఎరువును సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రవాణాలో జాప్యం జరగడం వల్ల కొంత సమస్య ఏర్పడిందని చెప్పారు. ఇక మీదట ఆ సమస్య ఉండబోదని, రైతులకు సరిపడా ఎరువులను సొసైటీలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. -
యూరియా కష్టాలు ఎవరి పాపం?
గత నెల రోజులుగా తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పంటలకు డోకా లేదు, ఈ ఫసలు గట్టెక్కుతం అనుకున్న రైతన్నలను ఈ ఖరీఫ్ సీజన్లో ’యూరియా’ కొరత తీవ్రంగా బాధపెడుతోంది. రైతులు ఆధార్ కార్డులు చేతబట్టి, డీ.సీ.ఎం.ఎస్.ల ముందు వారం రోజుల పాటు తిరిగితే తప్ప యూరియా బస్తాలు దొరకడం లేదు. పగలు– రాత్రి అని తేడా లేకుండా వంతుల వారిగా రైతులు క్యూలో నిలబడుతున్నారు. పంట పొలాల్లో ఉండాల్సిన రైతన్నలు తిండితిప్పలు మానేసి యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడి ప్రాణాలు వదులుతున్నారు. అసలు రైతులకు ఇన్ని బాధలు ఎందుకు? ఈ పరిస్థితికి రావటానికి కారణం ఎవరు? ఈ యూరియా కొరత పాపం ఎవరిది? యూరియా మన రాష్ట్రంలో తయారీ కాదు. మహారాష్ట్ర, బిహార్ లాంటి పక్క రాష్ట్రాల మీద ఆదారపడాల్సిందే. సీజన్ ప్రారంభంలోనే అంచనా వేసిన మొత్తం ఎరువులను మన రాష్ట్రానికి తెచ్చి, మార్కుఫెడ్ గోదాములలో నిల్వచేసుంటే రైతులకు ఈ కష్టాలు వచ్చేవి కాదు. వర్షాలు కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతూనే పంటలు పచ్చగా కావాలంటే రైతులు యూరియా మందు వేయాల్సిన పరిస్థితి. అసలే ఇక్కడ మన రైతులు యూరియా దొరకక ఇబ్బందులు పడుతుంటే, మన రాష్ట్రానికి రావాల్సిన యూరియాను నాలుగు రోజులపాటు పక్క రాష్ట్రం కర్ణాటకకు మళ్ళిం చారు. రైతులు వేసే అడుగు మందుల ద్వారా మొక్కజొన్న కర్రలకు, పత్తి చెట్లకు పూర్తి బలం చేకూర్చాలంటే తేమ అధికంగా ఉన్నపుడే యూరియా వేయవలిసి ఉంటుంది. కాలం పోతే (వానలు ఆగిపోతే) పదును లేకపోతే, ఆరుగాలం చేసిన కష్టం మట్టిలో కల్సిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి, ఖరీఫ్ సీజన్ ప్రారంభించడానికి ముందే, ఈ సీజన్లో ఎంత యూరియా అవసరం పడుతుందనే లెక్కలు అంచనా వేసి, దానికనుగుణంగా యూరియా నిల్వ సిద్ధంగా ఉంచుకోవాలి. కానీ, రాష్ట్ర వ్యవసాయ మంత్రి, అధికారులు ఏ ముందస్తు చర్యలూ చేపట్టలేదు. దీంతో కరీంనగర్, రాజన్న సిరిసిల్లలో, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, జగిత్యాల జిల్లాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది. యూరియా బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ ధర రూ. 267. కానీ, యూరియా కొరతను సాకుగా చూపి కొన్ని ప్రాంతాల్లో పెర్టిలైజర్ దుకాణాదారులు ఒక్కొక్క యూరియా బస్తా మీద రూ. 50 పెంచి అమ్ముతున్నారు. మొన్న దుబ్బాక మండల కేంద్రంలో యూరియా కోసం క్యూలో నిలబడి, అలసిపోయి ఎల్లయ్య అనే రైతు గుండెపోటుతో కుప్పకూలాడు. సీఎం సొంత ఇలాకాలో ఎరువుల కొరత ఒక రైతు ప్రాణం తీసింది. వ్యవసాయ మంత్రి రైతుల కష్టాలను హేళన చేస్తూ వెకిలిగా, అసంబద్ధంగా మాట్లాడారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మరో వారం రోజుల్లో పత్తి, మొక్కజొన్న పంటలు పూతకు వస్తున్నాయి. ఇప్పుడు వాటికి సకాలంలో యూరియా అందించకపోతే పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. తరువాత రాబోయే వారం, పది దినాల్లో వరి పొలాలకు యూరియా ఎక్కువ అవసరం. కనీసం ఇప్పటికైనా, ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి, యుద్ధ ప్రాతిపదికన ఎరువులు తెప్పించి, రైతులకు అందుబాటులో ఉంచి, పంటలను కాపాడాలి. వ్యాసకర్త: కొనగాల మహేష్, ఏఐసీసీ సభ్యులు మొబైల్ : 98667 76999 -
మార్క్‌ఫెడ్ అప్పు.. రూ. 1,827 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. కంపెనీల నుంచి యూరియా కొనుగోలు చేసి రైతులకు సరఫరా చేయడం, పంటను మద్దతు ధరకు కొనడానికి ఏర్పాటైన మార్క్‌ఫెడ్ పరిస్థితి ఇప్పుడు అత్యంత అధ్వా నంగా మారింది. అప్పులను చెల్లించకపోతే బ్యాం కుల ఎగవేత జాబితాలోకి వెళ్లే అవకాశముందని తాజాగా మార్క్‌ఫెడ్ సర్కారుకు పంపిన నివేదికలో తెలిపింది. యూరియా కొనుగోలు కష్టంగా మారుతుందని, భవిష్యత్‌లో రైతుల నుంచి పంటలను కొనుగోలు చేయడమూ సాధ్యం కాదని తేల్చిచెప్పింది. దీంతో మార్క్‌ఫెడ్ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. మార్క్‌ఫెడ్‌ను గాడిలో పెట్టడంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సరైన ధరకు వ్యాపారులకు విక్రయించడంలో విఫలమవడం, కమీషన్లకు కక్కుర్తిపడి సంస్థను నష్టాల్లోకి తీసుకెళ్లారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల విక్రయ కమిటీకి తెలప్పకుండానే మొక్కజొన్న ధరను నిర్ణయించి విక్రయించిందన్న ఆరోపణలొచ్చాయి. అప్పులు, నష్టాలు... రైతులు పండించిన మొక్కజొన్న, కంది, మినుములు తదితర పంటలను మార్క్‌ఫెడ్ మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. రైతులకు చెల్లించేందుకు అవసరమైన నిధులను బ్యాంకుల నుంచి అప్పు కింద తీసుకుంటుంది. ఆ తర్వాత తాము కొన్న పంటలను వ్యాపారులకు అమ్ముతుంది. సర్కారుకు పంపిన నివేదిక ప్రకారం.. 2013–14 నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు రూ.4,589 కోట్ల విలువైన పంట ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇందులో నిర్వహణ ఖర్చులు కూడా ఉన్నాయి. ఆ పంట ఉత్పత్తులను వ్యాపారులకు రూ. 3,347 కోట్లకు విక్రయించింది. అంటే నికరంగా రూ.1,241 కోట్లు నష్టాలు మూటగట్టుకుంది. 2017–18లో కందిని వ్యాపారుల కు విక్రయించడం ద్వారా రూ.350 కోట్లు నష్టం వచ్చింది. ఇప్పటివరకు చెల్లించిన సొమ్ము పోను ఇంకా రూ.1,827 కోట్లు బ్యాంకులకు, సంస్థలకు అప్పు చెల్లించాల్సి ఉందని నివేదికలో తెలిపింది. వాయిదాల చెల్లింపులకు నిధులు లేక చేతులెత్తేసింది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ)కి గత నెలలో రూ.401 కోట్లు చెల్లిం చాల్సి ఉండగా, ఇప్పటికీ ఇవ్వలేదు. సకాలంలో ఆయా బ్యాంకులకు అప్పులు చెల్లించకపోతే ఎగవేత జాబితాలోకి వెళ్లే ప్రమాదముందని తెలిపింది. -
ఊరికి యూరియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులందరికీ సరిపోయేంత యూరియాను తక్షణం గ్రామాలకు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. 3,4 రోజుల్లోనే డిమాండ్‌కు తగినంత ఎరువులను సంపూర్ణంగా రైతులకు అందచేయాలన్నారు. వివిధ నౌకాశ్రయాల్లో ఉన్న నిల్వలను రైళ్లు, లారీల ద్వారా వెంటనే తెప్పించాలన్నారు. స్టాకు పాయింట్లలో పెట్టకుండా నేరుగా గ్రామాలకే పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులకు ఎరువులు అందించడంపై శుక్రవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న యూరియా డిమాండ్‌పై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా యూరియా డిమాండ్ ఏర్పడటానికి గల ప్రధాన కారణాలను వ్యవసాయ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. కేంద్రం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా రైతులకు ఎరువులు అందివ్వాలని నిర్ణయించడంతో ప్రైవేటు కంపెనీలు, వ్యాపారులు ఎరువులను పెద్ద మొత్తంలో తెప్పించలేదు. గత నాలుగేళ్లలో ఖరీఫ్ సీజన్లో 6 లక్షల టన్నులకు కాస్త అటుఇటుగా యూరియా అవసరం పడింది. ఈసారి ఆగస్టు చివరికే 6 లక్షల టన్నుల యూరియా రైతులకు చేరింది. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు ఏకకాలంలో యూరియా అవసరం పడటంతోపాటు పంటల విస్తీర్ణం పెరగడం వల్ల డిమాండ్ పెరిగింది. రైతుల డిమాండ్‌కు అనుగుణంగా వ్యవసాయశాఖ ముందుజాగ్రత్తగా వివిధ కంపెనీలకు యూరియా ఆర్డర్ పెట్టింది. ఆ యూరియా షిప్పుల ద్వారా రావడంలో ఆలస్యం జరిగిందని సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. అయితే పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని యూరియాను వెంటనే తెప్పించి గ్రామాలకు సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. 3 వేల లారీల ద్వారా పోర్టుల్లోని యూరియా... ఐడీఎల్, ఇఫ్కో, సీఐఎల్, క్రిబ్కో, ఎన్ఎఫ్ఎల్ కంపెనీల ద్వారా వచ్చిన దాదాపు 1.15 లక్షల టన్నుల యూరియా ప్రస్తుతం విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం, న్యూ మంగుళూరు నౌకాశ్రయాలకు చేరింది. అక్కడి నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చేరాల్సి ఉంది. అయితే సాధారణ పద్ధతుల్లో యూరియా రవాణా జరిగితే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి యూరియాను త్వరగా తెప్పించడానికి ఏర్పాట్లు చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ శివప్రసాద్, చీఫ్ ఫ్లీట్ ట్రాఫిక్ మేనేజర్ నాగ్యాతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. వివిధ పోర్టుల్లోని యూరియా స్టాకును వెంటనే తెలంగాణ జిల్లాలకు తరలించడానికి 25 ప్రత్యేక గూడ్సు రైళ్లను కేటాయించాలని కోరారు. జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, సనత్‌నగర్, ఖమ్మం, కొత్తగూడెం, జడ్చర్ల, తిమ్మాపూర్ తదితర రైల్వే స్టేషన్లకు యూరియా నేరుగా పంపాలని కోరారు. ఇందుకు రైల్వే అధికారులు అంగీకరించారు. ప్రభుత్వం కోరినట్లు శుక్రవారమే గూడ్సు రైళ్లు కేటాయిస్తామని చెప్పారు. గూడ్సు రైళ్లలో వేగంగా స్టాక్ లోడ్ చేసే పనిని పర్యవేక్షించడానికి ఒక్కో పోర్టుకు ఒక్కో వ్యవసాయశాఖాధికారిని పంపాలని సీఎం ఆదేశించారు. రైల్వే స్టేషన్లకు స్టాక్ చేరుకోగానే అక్కడ లారీలను సిద్ధంగా ఉంచాలని, అక్కడ కూడా వ్యవసాయాధికారులను నియమించాలన్నారు. రైల్వే స్టేషన్ల నుంచి మండలాలు, గ్రామాలకు నేరుగా యూరియా పంపాలని, కావాల్సిన లారీలను రైల్వేస్టేషన్ల వద్ద సిద్ధంగా ఉంచాలని రవాణాశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మను ఆదేశించారు. వివిధ పోర్టుల్లో ఉన్న యూరియాను తక్షణమే రాష్ట్రానికి రప్పించడానికి రైళ్లతోపాటు 3 వేల లారీలను వాడాలని సీఎం నిర్ణయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని లారీలను వెంటనే పోర్టులకు పంపాలని చెప్పారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి పేర్ని నానితో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. గంగవరం పోర్టు నుంచి వీలైనన్ని ఎక్కువ లారీల ద్వారా యూరియా పంపించే పనిలో సహకరించాలని కోరారు. ఏపీలో వీలైనన్ని ఎక్కువ లారీలను సేకరించి యూరియాను తెలంగాణకు పంపుతామని నాని హామీ ఇచ్చారు. పోర్టుల నుంచి నేరుగా రైల్వే స్టేషన్ల ద్వారా వచ్చే యూరియాను మళ్లీ స్టాక్ పాయింట్లకు తీసుకువెళ్లకుండా ఏ మండలంలో ఎంత డిమాండ్ ఉందో ముందే నిర్ధారించి నేరుగా పంపాలని, ఈ పనిని పర్యవేక్షించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని సీఎం ఆదేశించారు. 3–4 రోజుల్లోనే లక్ష టన్నులు అందాలి... మొత్తంగా మూడు నాలుగు రోజుల్లోనే దాదాపు లక్ష టన్నుల యూరియా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అందాలని, యూరియా కోసం రైతులు ఎదురుచూసే పరిస్థితి తొలగిపోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వివిధ పోర్టుల్లోని యూరియాను తెలంగాణకు రప్పించే పనిని ప్రగతి భవన్‌లోనే ఉండి పర్యవేక్షించాలని వ్యవసాయ, రవాణాశాఖ మంత్రులు నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, అధికారులకు నిర్దేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రగతి భవన్ నుంచే వారు రైల్వే అధికారులతో, లారీ యాజమానుల సంఘాలతో, వివిధ కంపెనీలతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు కావాల్సిన యూరియా అందే వరకు విశ్రమించవద్దని, రేయింబవళ్లు పర్యవేక్షించి, సమస్యను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, పార్థసారధి, సునీల్‌శర్మ, వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జె.సంతోశ్ కుమార్, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. యూరియా తెప్పించేందుకు పర్యవేక్షణ... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు మేరకు మంత్రులు, అధికారులు ప్రగతి భవన్ నుంచి యూరియాను తెప్పించే పనులను పర్యవేక్షిస్తున్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులను ప్రగతి భవన్‌కు పిలిపించారు. వారి ద్వారా రైల్వే శాఖకు రేక్స్ కోసం ఇండెంట్ పెట్టించారు. తక్షణం వివిధ పోర్టులకు 25 రేక్స్ పంపడానికి రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో రేక్ (గూడ్సు రైలు) ద్వారా 2,600 టన్నులు యూరియా రానుంది. కేవలం రైళ్ల ద్వారానే దాదాపు 60 వేల టన్నుల యూరియా 2–3 రోజుల్లో ఆయా జిల్లాలకు చేరుకోనుంది. అదే సమయంలో దాదాపు 4 వేల లారీల ద్వారా కూడా యూరియా వివిధ మండలాలకు చేరుకోనుంది. మొత్తం యూరియా 3–4 రోజుల్లో గ్రామాలకు చేరుతుందని, రైతులు కాస్త ఓపికగా ఉండాలని మంత్రులు సూచించారు. యూరియా కొరతను ఆసరా చేసుకొని ఎవరైనా ధరను పెంచి విక్రయించే అవకాశం ఉందని, రైతులు మోసపోవద్దని చెప్పారు. రైతులకు కావాల్సిన యూరియా అంతా ఆయా మండలాలకు చేరుకుంటుందని, 3–4 రోజుల్లో సమస్య పూర్తిగా తొలగిపోతుందని మంత్రులు భరోసా ఇచ్చారు. -
యూరియా కోసం వెళ్లి రైతు మృతి!
దుబ్బాక టౌన్: యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడ్డ ఓ రైతు గురువారం ఆకస్మికంగా గుండె పోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ సుభాష్‌గౌడ్, బాధిత రైతు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చుమాయపల్లికి చెందిన రైతు చేర్వాపురం ఎల్లయ్య (69)కు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. దీనికితోడు మరో రెండెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ నాలుగు ఎకరాల్లో వరి, మొక్క జొన్న, పత్తి పంటలు సాగు చేశాడు. పంటలకు అవసరమైన యూరియా ఎరువు కోసం మూడు రోజుల నుంచి ఎల్లయ్య దుబ్బాకకు వస్తున్నా దొరకలేదు. గురువారం వ్యవసాయ సహకార సంఘం వద్దకు యూరియా లారీ వచ్చిం దని తెలవడంతో ఉదయం తన భార్య లచ్చమ్మతో కలసి అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే యూరియా కోసం వందల మంది రైతులు లైన్లో నిలుచున్నారు. దీంతో ఎల్లయ్య లైన్లో నిలబడగా ఆయన భార్య లచ్చమ్మ సైతం మహిళా రైతుల లైన్లో నిలుచుంది. సుమారు గంటసేపు లైన్లో నిలుచున్న ఎల్లయ్య, ఒక్కసారిగా సొమ్ముసిల్లి పడిపోయాడు. దీంతో అక్కడ ఉన్న రైతులు ఎల్లయ్యను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఆసుపత్రిలో ఎల్లయ్యను పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందాడని నిర్ధారించారు. ఎల్లయ్య భార్య లచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు కూతుళ్లు.. మృతిచెందిన రైతు ఎల్లయ్యకు నలుగురు కూతుళ్లు. వీరిలో పెద్ద కూతురు శ్యామల భర్త ఏడేళ్ల క్రితమే మరణించడంతో ఆమె కుటుంబాన్ని కూడా ఎల్లయ్యనే పోషిస్తున్నాడు. రెండో కూతురు నర్సవ్వకు వివాహం అయింది. మూడో కూతురు రేణుక వికలాంగురాలు. చిన్న కూతురు మమతకు నాలుగు నెలల క్రితమే అప్పుచేసి వివాహం చేశాడు. -
రైతన్న ఉసురు తీసిన యూరియా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రైతులను యూరియా కొరత వేధిస్తోంది. గోదాములు, ఎరువుల షాపుల వద్ద అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఇదే పరిస్థితి. పొలాలు, ఇళ్లు వదలి యూరియా పంపిణీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. లైన్లో చెప్పులు పెట్టి మరీ వేచి చూడాల్సిన దుస్థితి. అవసరానికి తగినంత యూరియాను అధికారులు సరఫరా చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యూలో నిలబడి మృతి చెందిన రైతు యూరియా కోసం క్యూలైన్లో నిలబడి రైతు మృతిచెందిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చోటు చేసుకుంది. మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద యూరియా కోసం క్యూలో నిలబడిన రైతు ఎల్లయ్య(69) ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో అతన్నివెంటనే స్థానిక అస్పత్రికి తరలించి చికిత్స అందించిన ఫలితం లేకపోయింది. మృతుడు అచ్చుమాయపల్లి వాసిగా గుర్తించారు. ఎల్లయ్య మృతిపై రైతులు ఆందోళన చేపట్టారు. ఎల్లయ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తూప్రాన్‌లో రైతన్నల ధర్నా మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో యూరియా కొరతపై రైతులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం నుండి యూరియా వస్తుందని పడిగాపులు కాసి రాత్రి వరకు అక్కడే ఉండి ఇంటికి వెళ్లారు. గురువారం ఉదయం ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద బారులు తీరారు. చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం ఎదురు చూశారు. అధికారులు ఎవరు రాకపోవడంతో రైతులు ఆందోళనబాట పట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్దిపైట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో యూరియా కోసం రైతు సేవాసమితి వద్ద బారులు తీశారు. జనగామా జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల పెద్ద ఎత్తున లైన్లో నిలబడ్డారు. యూరియా కోసం పనులు వదిలిపెట్టుకుని క్యూలో నిలబడ్డా ఒక్క బస్తా కూడా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు మృతి చెందడం దురదృష్టకరం రైతు ఎల్లయ్య మృతి పట్ల సిద్ధిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరోత్తంరెడ్డి విచారం వ్యక్తం చేశారు. యూరియా కోసం క్యూలో నిలబడి రైతు మృతి చెందడం దురదృష్టకరం అన్నారు. గురువారం ఆయన బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో యూరియా కోసం రైతులు చెప్పులు క్యూలో పెట్టేవారని ఎగతాళి చేసిన కేసీఆర్‌కు.. రాష్ట్ర రైతుల బాధ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 30 రోజుల ప్రగతి పేరుతో గ్రామాల్లో పన్నులు వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైందని, దీనిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. -
యూరియా కోసం క్యూలైన్లో నిలబడి.. రైతు మృతి
-
ఎరువు.. కరువు.. రైతులకు లేని ఆదరువు
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. సరిపడా ఎరువు అందక పోవడంతో అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగుతున్నారు. యూరియా కోసం బుధవారం ఉదయం నుంచే సొసైటీల వద్ద రైతులు బారులు తీరారు. కామారెడ్డి, బీర్కూరు, మాచారెడ్డి, ఎల్లారెడ్డి, దోమకొండ తదితర మండలాల్లోని సింగిల్ విండోల వద్ద పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. స్టాక్ రాకపోవడంతో పలుచోట్ల ఆందోళన చేశారు. మాచారెడ్డి: యూరియా కోసం మాచారెడ్డిలో రైతన్న రోడ్డెక్కాడు. ఎన్నిసార్లు వచ్చినా స్టాక్ లేదంటూ సింగిల్‌విండో సిబ్బంది చేతులెత్తేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగిల్‌విండో సిబ్బంది వ్యాపారులకు యూరియా దొంగచాటుగా అమ్ముకుని కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఒక వైపు అధికారులు యూరియా కొరత లేదంటూ ప్రకటలు చేస్తుంటే, మరోవైపు సిబ్బంది దొంగచాటుగా యూరియాను అమ్ముకుంటూ రైతులకు ఎగనామం పెడుతన్నారని మండిపడ్డారు. దాదాపు గంట పాటు కామారెడ్డి సిరిసిల్ల రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో రాకపోకలు నిలిచి పోయాయి. 700 టన్నుల పై చిలుకు యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు 560 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. -
జిల్లాల్లో యూరియా ఫైట్
యూరియా కోసం.. ఎరువుల కోసం రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. సరిపడా ఎరువులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. ఫలితంగా కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండల కేంద్రంలో యూరియా కోసం మంగళవారం టోకెన్లు పంపిణీ చేయగా.. బుధవారం తెల్లవారుజాము నుంచే సొసైటీ గోదాం వద్ద రైతులు క్యూ కట్టారు. –భీమ్‌గల్ సాక్షి, హైదరాబాద్: పాత జిల్లాలకు, కొత్త జిల్లాలకు మధ్య యూరియా పోరు నడుస్తోంది. పాత జిల్లాల్లోని మార్క్‌ఫెడ్ స్టాక్ పాయింట్ల నుంచి కొత్త జిల్లాలకు సరఫరా కావాల్సిన యూరియాను అనేక చోట్ల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు. కొన్ని జిల్లాల కలెక్టర్లయితే స్టాక్ వెళ్లనీయకుండా లిఖిత పూర్వక ఆదేశాలు ఇస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు కూడా తమ ప్రాంతానికే దక్కాలని మొండిపట్టు పడుతున్నారు. దీంతో కొత్త జిల్లాలకు సరఫరా నిలిచిపోవడంతో యూరియా కొరత పీడిస్తోంది. దీంతో ఆయా జిల్లాల రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫలితంగా యూరియా నల్లబజారుకు తరలిపోయింది. దీంతో ఒక్కసారిగా యూరియా ధర పెరిగింది. ఇటీవల వర్షాలు కురవడం, వరి నాట్లు బాగా పడటం, యూరియా వినియో గం పెరగడంతో పాత జిల్లాల రైతులు ఆవేదన చెందుతున్నారు. కొందరు మంత్రులు తమ నియోజకవర్గం ఉన్న జిల్లాకే ప్రాధాన్యమిస్తున్నారు. బఫర్‌స్టాక్ పాయింట్లు పాత జిల్లాల్లోనే ఈసారి ఖరీఫ్‌లో 19.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు లక్ష్యంగా వ్యవసాయశాఖ ప్రణాళిక రచించింది. అందులో యూరియానే 8.50 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. గత నెల రాష్ట్రానికి రావాల్సిన 2.21 లక్షల మెట్రిక్ టన్నుల్లో 1.04 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ఇక సెప్టెంబర్‌కు రెండు లక్షల టన్నుల యూరియాను కేటాయించాలని వ్యవసాయశాఖ కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో 60 వేల మెట్రిక్ టన్నుల యూరియానే అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. మార్క్‌ఫెడ్ వద్ద ఎప్పుడూ 2.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్‌గా ఉండాలి. కేం ద్రం నుంచి రాకపోవడం, ఉన్న నిల్వలను రైతుల కు అందజేయడంతో స్టాక్ 20 వేల మెట్రిక్ టన్నులకు పడిపోవడంతో కొరత ఏర్పడింది. మార్క్‌ఫెడ్ బఫర్ స్టాక్ పాయింట్లన్నీ పాత జిల్లాల్లో ఉన్నాయి. కొత్త జిల్లాల కోటాను పాత జిల్లాలే ఇలా వాడుకోవడంతో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లా స్లాక్ పాయింట్ నుంచి కామారెడ్డి జిల్లాకు యూరియా పంపవద్దని అక్కడి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో అక్కడి జిల్లా వ్యవసాయశాఖ అధికారి విఫలం కావడంతో వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా ఆయనకు నోటీసులు జారీ చేశారు. కాగా రాష్ట్రంలో యూరియా కొరత లేదని రాహుల్ బొజ్జా తెలిపారు. నాయకుల తీరుపై మండిపాటు ఆయన వ్యవసాయశాఖ పరిధిలోని ఒక కార్పొరేషన్‌కు చైర్మన్. తన ప్రాంత పరిధిలోని వ్యవసాయ సహకార సొసైటీకి అవసరమున్నా లేకపోయినా అత్యధికంగా యూరియా కేటాయింపు లు చేసుకున్నాడు. తనకు సన్న యూరియానే కావాలని పట్టుబట్టి కేటాయించుకున్నాడు. పక్క జిల్లాకు తనకు సంబంధం లేదని వాదన పెట్టు కున్నాడు. అదే శాఖలో మరో కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ఉన్న నాయకుడి తీరు కూడా అలాగే ఉంది. తన జిల్లాకే ప్రాధాన్యం ఇవ్వాలని, పక్క జిల్లాకు 500 టన్నులు పంపాల్సి ఉన్నా దాన్ని అడ్డుకుంటున్నారని వ్యవసాయశాఖ వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ఆ కార్పొరేషన్ చైర్మన్ వ్యవసాయ కమిషనర్‌ను కలిసి ఈ మేరకు విన్నవించినట్లు తెలిసింది. జిల్లాల మధ్య పోరు, కొందరు నాయకుల తీరు వల్ల కృత్రిమ కొరత తలెత్తిందన్న విమర్శలున్నాయి. దీంతో యూరి యా ధర ఒక్కసారిగా పెరిగింది. -
ఎరువు కోసం ఎదురుచూపులు..
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. ఎరువు కోసం ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే ఎదురైంది. తాజాగా మంగళవారం మరో వెయ్యి మెట్రిక్ టన్నులు మాత్రమే జిల్లాకు వచ్చింది. వీటిని అత్యవసరమున్న సొసైటీలు, కొంతమేరకు ప్రైవేటు డీలర్లకు సర్దుబాటు చేశారు. మోపాల్, ధర్పల్లి, ఇతర సొసైటీల వద్ద యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చున్నారు. అయినప్పటికీ రెండు, మూడు బస్తాల కంటే మించి ఇవ్వలేదు. దీంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ బందోబస్తు నడుమ యూరియాను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి 4.15 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. అందులో కేవలం వరి ఒక్కటే 2.34 లక్షల ఎకరాల్లో సాగైంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 2.08 లక్షల ఎకరాలు మాత్రమే. ఈసారి అంచనాకు మించి సాగుచేశారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు కేవలం 37,700 మెట్రిక్ టన్నులు మాత్రమే జిల్లాకు చేరింది. ఆగస్టు నాటికి 54 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని నివేదిక సమర్పించగా, సుమారు 15 వేల మెట్రిక్ టన్నులు తక్కువగా వచ్చింది. మోపాల్‌లో టోకెన్లు పంపిణీ.. మండలకేంద్రంలోని సొసైటీలో మంగళవారం 450 బస్తాల వరకు యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న కంజర్, సిర్పూర్, మోపాల్, ముల్లంగి, నర్సింగ్‌పల్లి, న్యాల్కల్ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉన్నారు. 450 బస్తాలకు సంబంధించిన బిల్లులు ముగియడంతో ఆ తర్వాత నేడు, రేపు రానున్న యూరియా లోడ్ కోసం టోకెన్లు పంపిణీ చేశారు. చాలామంది రైతులు అసంతృప్తితో వెనుదిరిగారు. రైతుల పడిగాపులు భీమ్‌గల్: మండల కేంద్రంలో మంగళవారం రైతులు యూరియా కోసం రోజంగా పడిగాపులు పడ్డారు. యూరియా లోడు వస్తుందని వదం రావడంతో రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి పట్టణంలోని నందిగల్లీలోని సొసైటీ గోదాం వద్ద బారులు తీరారు. ఇది అంతకంతకూ పెరిగిపోయి రైతులు వందల సంఖ్యలో పోగయ్యారు. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల క్యూలైన్ అంతకంతకూ పెరిగిపోయింది. ఉదయం నుండి సాయంత్రం వరకు చినుకులు కురుస్తున్నా కదలకుండా ఉండిపోయారు. దీంతో పోలీసులు సూచన మేరకు సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు టోకెన్లు పంపిణీ చేశారు. యూరియాను బుధవారం పంపిణీ చేస్తామని తెలిపారు. గోన్గొప్పుల్లో... గోన్‌గొప్పుల్ పరిధిలోని ముచ్కూర్ సొసైటీ ఆధ్వర్యంలో యూరియా లారీ లోడు తరలించారు. దీంతో గ్రామంలోని వందలాది మంది రైతులు యూరియా బస్తాల కోసం తరలివచ్చారు. తమకు యూరియా దక్కుతుందో లేదో అన్న ఆందోళన మాత్రం రైతుల్లో స్పష్టంగా కనిపించింది. యూరియా కొరత తీర్చండి ఆర్మూర్ అర్బన్: రైతులకు యూరియా కొరత తీర్చాలని ఏఐకేఎంఎస్ (రైతుకూలీసంఘం)ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. రైతుకూలీసంఘం నాయకులు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 15 శాతం వరి సాగు పెరగడంతో యూరియా కొరత తీవ్రమైందన్నారు జిల్లా వ్యాప్తంగా 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే ప్రభుత్వం వద్ద కేవలం 35 వేల మెట్రిక్ టన్నుల నిల్వ మాత్రమే ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ముందు చూపులేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. తక్షణమే ప్రభుత్వం జిల్లాకు సరిపడా యూరియా తెప్పించి రైతులకు సర ఫరా చేయాలని డిమాండ్ చేశారు. హాసకొత్తూర్‌లో.. కమ్మర్పల్లి: మండలంలోని హాసకొత్తూర్‌లో రైతులు యూరియా కోసం పాట్లు పడుతున్నారు. చౌట్పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోకి మంగళవారం 450 బస్తాల యూరియా వచ్చింది. హాసకొత్తూర్‌కు 150 బస్తాల యూరియాను కేటాయించారు. వెయ్యి బస్తాల వరకు యూరియా రైతులకు అవసరం కాగా, తక్కువగా రావడంతో గందరగోళం నెలకొంది. ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున విక్రయించారు. రెండు రోజుల్లో యూరియాను సరఫరా చేస్తామని సొసైటీ అధికారులు తెలపడంతో రైతులు శాంతించారు. నాలుగైదు రోజుల నుంచి తిరుగుతున్న.. నేను ఐదెకరాల్లో వరి పంట సాగుచేస్తున్నాను. ఎనిమిది సంచుల యూరియా అవసరం. నాలుగైదు రోజుల నుంచి రోజూ తిరుగుతున్న. యూరియా మాత్రం దొరకడం లేదు. ఎరువు చల్లే సమయం మించిపోతోంది. మొన్న రెండు గంటలు లైన్లో ఉంటే టోకెన్ రాసిచ్చారు. ఇప్పుడు అది తీసుకొస్తే పని చేయదని చెప్పి పంపిస్తున్నారు. ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నాను. –మల్లేష్, రైతు, మోపాల్ -
యూరియా కష్టాలు
సాక్షి, మెమిన్‌పేట: ఖరీఫ్ రైతులకు కష్టాలు తప్పడం లేదు. యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో పంటలకు పైపాటుగా యూరియా వేసేందుకు జిల్లాలోని ఆయా పీఏసీఎస్‌ల వద్ద శనివారం బారులు తీరారు. మోమిన్‌పేట, మేకవనంపల్లి సహకార సంఘాల్లో శనివారం 920 బస్తాల యూరియా అందుబాటులో ఉండగా రైతులు అందుకు రెండింతలు కొనుగోలు చేసేందుకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం కొద్దిపాటి వర్షం కురవడంతో పత్తి పంటకు పైపాటుగా వేసుకునేందుకు రైతులు సిద్ధమయ్యారు. దీంతో శనివారం ఉదయం నుంచే మోమిన్‌పేట పీఏసీఎస్ ఎదుట క్యూ కట్టారు. ఎకరానికి 2 బస్తాల చొప్పున 460 బస్తాలను సిబ్బంది రైతులకు విక్రయించారు. ఇంకా 70 మంది రైతులు వరుసలో నిలబడినా వారికి అందలేదు. మేకవనంపల్లిలో అడిగిన మేరకు సిబ్బంది రైతులకు విక్రయించారు. 45 కిలోల యూరియా బస్తాను రూ.266.50 చొప్పున అమ్మేశారు. ప్రైవేట్ ఫెర్టిలైజర్ దుకాణాల్లో యూరియా అందుబాటులో లేదు. దుకాణాదారులకు ఎక్కువ ధరకు టోకు డీలర్లు విక్రయిస్తుండడంతో వారికి గిట్టుబాటు కాకపోవడంతో తీసుకురావడం లేదు. కేవలం పీఎసీఎస్‌ల ద్వారానే యూరియా విక్రయిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సుమారు 500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఇప్పటివరకు 50 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయ్యింది. దీంతో రైతులు యూరియా కోసం తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. అధికారులు స్పందించి యూరియా కొరత తీర్చాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల అవస్థలు వికారాబాద్ అర్బన్: వర్షాలు కురుస్తుండడంతో రైతులు మొక్కజొన్న, పత్తి పంటలకు యూరియా వేస్తున్నారు. సబ్సిడీ ఎరువు అవసరం మేరకు లభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివారెడ్డిపేట్ పీఏసీఎస్, సీఎంఎస్‌లలో సబ్సిడీ ద్వారా యూరియా విక్రయిస్తున్నారు. వారంరోజులుగా రైతులు ఉదయం 7 గంటలకే యూరియా కోసం వచ్చి కార్యాలయాల ఎదుట బారులు తీరుతున్నారు. గంటల తరబడి వరుసలో నిలబడినా కొంత మందికి లభించడం లేదు. రైతులందరికీ యూరియా అందాలనే ఉద్దేశంతో సిబ్బంది కొంత పరిమితి ఒక్కొక్కరికి రెండు, మూడు బస్తాలను మాత్రమే ఇస్తున్నారు. అధిక ధరలకు విక్రయం పెద్దేముల్: మండల పరిధిలో వ్యాపారులు ఎక్కువ ధరకు యూరియా విక్రయిస్తున్నారు. 45 కిలోల యూరియా బస్తాను రూ.267కు విక్రయించాల్సి ఉండగా రూ.330కి తగ్గకుండ అమ్ముతున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తట్టెపల్లి ప్రాథమిక సంఘానికి ఇప్పటి వరకు 650 టన్నుల యూరియా వచ్చిందని, అయినా రైతలకు సరిపోవడం లేదని సీఈఓ రాజమౌలి తెలిపారు. ఇంకా 500 టన్నుల యూరియా అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రైతులు పత్తి, కంది, మొక్కజొన్న పంటలకు యూరియాను వినియోగిస్తున్నారు. సర్కారు స్పందించి అవసరం మేరకు యూరియాను సరఫరా చేయాలని కోరుతున్నారు. యూరియా కొతర ధారూరు: ధారూరు పీఏసీఎస్ ద్వారా ఇంతవరకు వచ్చిన 8,430 బస్తాల యూరియాను శనివారం వరకు రైతులకు సరఫరా చేశారు. మరో 2 వేల బస్తాల వరకు స్టాక్ వస్తే రైతులకు సరిపోతుందని సీఈఓ నర్సింలు తెలిపారు. ఆర్డర్ ప్రకారం వస్తున్న యూరియాను రైతుల రాకను బట్టి సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం సరఫరా చేయాలని నిబంధన ఉన్నా.. స్టాక్ లేదు. -
యూరియా కొరతకు కారణమదేనా?
యూరియా కొరత ఏర్పడడానికి కారణం డీలర్లు, అధికారులేనా..? అందుకే సరిపడా యూరియా రావడం లేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కేంద్ర ప్రభుత్వం గతంలో అందజేసిన పీవోఎస్ మిషన్లను వాడక పోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని సమాచారం. ఈ మిషన్లు వాడి ఉంటే యూరియా వినియోగం ఏ స్థాయిలో ఉంది.. ఇంకా ఎంత స్టాక్ నిల్వ ఉందనే వివరాలు కేంద్రానికి చేరుతాయని, తద్వారా కేంద్రం ఎప్పటికప్పుడు స్టాక్‌ను కేటాయిస్తుందని తెలిసింది. సాక్షి, నిజామాబాద్: యూరియా కోసం ఎదురుచూస్తున్న రైతులకు మళ్లీ నిరాశే ఎదురైంది. బుధవారం జిల్లాకు నామమాత్రంగా 1740 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. ఆగస్టు నెల నాటికి 16 వేల మెట్రిక్ టన్నుల యూరియా తక్కువగా రావడంతో తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో మార్క్‌ఫెడ్ వద్ద ఉన్న 18,437 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్‌ను సరఫరా చేసి సర్దుబాటు చేశారు. వర్షాలు ఆగస్టు మాసంలో కురవడంతో జిల్లాలో వరినాట్లు ఆలస్యంగా వేశారు. సాధారణం కంటే 15 శాతం వరకు అధికంగా వరి సాగైంది. దీంతో యూరియాకు భారీగా డిమాండ్ ఏర్పడింది. మరోవైపు, యూరియా కొరతకు అధికారులు, వ్యాపారులే కారణమని తెలుస్తోంది. పీవోఎస్ మిషన్లను వాడకపోవడం వల్లే కేంద్రం రాష్ట్రానికి తగినంత యూరియా కేటాయింపులు జరపడం లేదని సమాచారం. పెరిగిన సాగు విస్తీర్ణం.. తగ్గిన సరఫరా జిల్లాలో అన్ని పంటలు కలిపి 4.15 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అందులో కేవలం వరి ఒక్కటే 2.34 లక్షల ఎకరాల్లో సాగైంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 2.08 లక్షల ఎకరాలు మాత్రమే. ఈసారి అదనంగా 30 వేల (15శాతం) ఎకరాల వరకు అదనంగా సాగైంది. వర్షాలు ఆలస్యంగా కురవడంతో ఆగస్ట్ 15 వరకూ వరి నాట్లు వేశారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు కేవలం 38 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే జిల్లాకు చేరింది. ఆగస్టు నాటికి 54 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని నివేదిక పంపించగా, సుమారు 16 వేల మెట్రిక్ టన్నులు తక్కువగా వచ్చింది. సాగు విస్తీర్ణం పెరిగి, వినియోగం పెరగడంతో యూరియా కొరత ఏర్పడింది. దీన్ని గమనించిన అధికార యంత్రాంగం 2014–15 సంవత్సరం నాటి బఫర్ స్టాక్‌ను సర్దుబాటు చేసింది. ప్రస్తుతం ఆ బఫర్ స్టాక్ నిల్వలు కూడా నిండుకున్నాయి. 1740 మెట్రిక్ టన్నులు మాత్రమే.. యూరియా కొరత విపరీతంగా ఉన్నప్పటికీ జిల్లాకు పెద్దగా సరఫరా కావడం లేదు. బుధవారం 1740 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ఈ యూరియా ప్రస్తుతమున్న డిమాండ్‌కు ఏ మాత్రమూ సరిపోదు. సోమ, మంగళవారాల్లో మరో 2 వేల మెట్రిక్ టన్నులు వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. వరి నాట్లు ఆలస్యంగా వేయడంతో ఆగస్టు చివరి వారం, సెప్టెంబర్ నెలలోనే యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో యూరియా కొరత ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాడకపోవడం వల్లే..? యూరియా వినియోగం విపరీతంగా పెరగడంతో కేంద్రం గతంలో పీవోఎస్ మిషన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇన్‌ఫుట్ డీలర్లు, సొసైటీలకు మిషన్లను అందజేసి, వాటిపై శిక్షణ కూడా ఇప్పించింది. యూరియా అవసరమైన రైతులు తప్పనిసరిగా ఆధార్‌కార్డు, వేలిముద్రలు పెట్టి తీసుకెళ్లాలి. తద్వారా యూరియా ఎంత వినియోగమవుతోంది.. ఒక రైతు ఎన్ని బస్తాలు తీసుకెళ్తున్నాడు.. అనే వివరాలు కేంద్రం దృష్టికి వెళ్తాయి. కానీ పీవోఎస్ మిషన్లను వాడక పోవడంతో కేంద్ర వ్యవసాయశాఖ అధికారులకు రాష్ట్రంలో ఎరువుల వినియోగంపై స్పష్టత రావడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్రానికి యూరియా కేటాయింపులు జరపడం లేదని సమాచారం. అందుబాటులో ఉంచాలి.. నాలుగెకరాల్లో వరి సాగు చేశాను. యూరియా దొరు కుతదో.. లేదోనని ఆందోళన చెందుతున్నాం. గడ్డలు కట్టిన యూరియా కాకుండా సన్నంగా ఉండే యూరియాను సరఫరా చేయాలి. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి. – బండమీది మహేష్, రైతు, మోపాల్ రెండ్రోజుల్లో వస్తుంది.. జిల్లాలో యూరియా కొరతను అధిగమించేందుకు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం. బుధవారం 1740 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరింది. సోమ, మంగళవారాల్లో మరో 2 వేల మెట్రిక్ టన్నులు వస్తుంది. రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. – ఎం గోవిందు, జిల్లా వ్యవసాయాధికారి -
కొరతే లేకుంటే.. బందోబస్తు ఎందుకో?
సాక్షి, కామారెడ్డి: యూరియా కొరత లేదని అధికారులు పైకి చెబుతున్నా.. వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. గురువారం గాంధారి సింగిల్‌విండోలో పోలీసు భద్రత మధ్య యూరియా పంపిణీ చేయాల్సి రావడం ఇందుకు నిదర్శనం.. గాంధారి మండలంలో యూరియాకు తీవ్ర కొరత ఉంది. యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎరువు కోసం రైతులు రోజూ ఉదయమే గాంధారిలోని సహకార సంఘం కార్యాలయానికి చేరుకుని వరుస కడుతున్నారు. ఒకటో రెండో లారీల ఎరువు వస్తున్నా.. అది ఏ మూలకూ సరిపోవడం లేదు. మరో లారీ వస్తుందన్న ఆశతో పంపిణీ కౌంటర్ వద్దే నిరీక్షిస్తున్నారు. స్టాక్ అయిపోయిందనగానే నిరాశతో వెనుదిరుగుతున్నారు. మంగళవారం కొంతమంది రైతులకు మాత్రమే యూరియా అందింది. బుధవారం లోడ్ రాలేదు. దీంతో గురువారం ఉదయమే సొసైటీకి వచ్చి రైతులు బారులు తీరారు. రెండు రోజులుగా లోడ్ రాకపోవడంతో గురువారం రైతులు భారీగా సొసైటీ వద్దకు చేరుకున్నారు. ఒక లారీ లోడ్ రావడం, చాలా మంది రైతులు ఉండడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు సొసైటీకి చేరుకున్నారు. పోలీసు పహారా మధ్య సొసైటీ అధికారులు యూరియా పంపిణీ చేశారు. అంచనాలకు మించి సాగు.. గాంధారి మండలంలో 16 వేల ఎకరాల్లో మక్క పంట సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే దాదాపు 24 వేల ఎకరాల్లో మక్క సాగైంది. పంటకు యూరియా వేయాల్సి న సమయంలో కొరత ఏర్పడింది. మండలంలో ఇప్పటి వరకు 3,803 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశారు. అది ఏమాత్రం సరిపో లేదు. దీంతో రైతులు ఎరువు కోసం ఇబ్బందు లు పడుతున్నారు. మరో పది లారీల యూరి యా మండలానికి వస్తుందని మండల వ్యవసాయ అధికారి యాదగిరి ‘సాక్షి’తో తెలిపారు. కావలసినంత యూరియా ఉందని, అయితే ట్రాన్స్‌పోర్టు ఇబ్బందుల వల్లే ఆలస్యం అవుతోందన్నారు. గొడవలు జరగకుండా ఉండేందు కే బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. స్టాక్ లేకపోవడంపై రైతుల ఆగ్రహం సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారని, కొరత లేకుంటే రైతులు పనులు వదులుకుని క్యూలో ఎందుకు ఉండాల్సి వస్తోందని ప్రశ్నిస్తున్నారు. లారీ లోడ్ రాగానే గంటలో ఖాళీ అవుతోందని, చాలా మందికి సరిపడకపోవడంతో వాపస్ వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. పొద్దుగాల అచ్చిన.. మక్క జుట్టు, పీప దశలో ఉంది. వర్షాలు పడుతున్నయి. ఇప్పుడు తప్పకుండా యూరియా వేయాలే. లేదంటే కంకులు చిన్నగ వస్తయి. దిగుబడి పడిపోతది. యూరియా కోసం పొద్దుగాల అచ్చిన. ఒక లారీ అయిపోయింది. ఇంకోటి వస్తదంటున్నరు. అందుకే ఇక్కడనే ఉన్న. – నాన్యా, రైతు, బూర్గుల్ తండా మొన్నటి నుంచి తిరుగుతున్న.. యూరియా కోసం మొన్నటి నుంచి తిరుగుతున్న. మంగళవారం యూరియా దొరకలేదు. తండాకు వట్టి చేతులతోనే పోయిన. బుధవారం యూరియా లారీ రాలేదు. ఇయ్యాల పొద్దుగాల నుంచి లైన్లో ఉంటే ఇప్పుడు కూపన్ దొరికింది. లారీ వద్ద మస్తుమంది ఉన్నరు. మల్ల లైన్ల నిల్సున్న.. – రుక్కి బాయి, రైతు, గుజ్జుల్ తండా -
తగ్గనున్న ఎరువుల ధరలు!
సాక్షి, మెదక్‌జోన్: అన్నదాతలకు కరువులో కాస్త ఊరట లభించినట్లైంది. ఎరువుల ధరలను కంపెనీల యాజమాన్యాలు తగ్గించటంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. యూరియా తప్ప మిగతా కాంప్లెక్స్ ఎరువులను తగ్గిస్తునట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వరుస కరువుకాటకాలతో పంటల సాగు అంతంత మాత్రమే సాగుతుండటంతో ఎరువులకు గిరాకీ తగ్గింది. ఈ తరుణంలోనే ఎరువుల కంపెనీల యజమానులు రసాయన ఎరువుల ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మెదక్ జిల్లాలో రైతాంగానికి రూ.2.47 కోట్ల భారం తగ్గనుంది. ఈ ఏడాది జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు సాధారణ సాగు 83, 373 హెక్టార్లు అంచన వేశారు. దీని కోసం 3,900 మెంట్రిక్ టన్నుల డీఏపీ ఎరువులు అవసరం ఉన్నాయి. ప్రస్తుతం 50 కిలోల బస్తా డీఏపీ ధర రూ.1,400 కాగా బస్తాకు రూ.100 చొప్పున తగ్గించి రూ.1,300 అమ్మాలని నిర్ణయం జరిగింది. దీంతో ఒక్క డీఏపీ ఎరువులపైన రైతులపై రూ.78 లక్షలు భారం తగ్గనుంది. అలాగే 20–20–0–13 కాంప్లెక్స్ ఎరువులు 13 వేల మెట్రిక్ టన్నులు జిల్లా రైతాంగానికి అవసరం ఉండగా ఈ బస్తా ధర పాతది రూ.1,065 ఉండగా దానిని బస్తాకు రూ.65 తగ్గించి రూ.1,000కి విక్రయించనున్నారు. దీంతో రూ.1.47 కోట్లు తగ్గింది. డీఏపీ, కాంప్లెక్స్ రెండింటికీ కలిపి తగ్గిన ఎరువుల ధరలతో జిల్లా రైతాంగానికి రూ.2.47 కోట్ల భారం తగ్గింది. ప్రస్తుతం ఎరువుల గోడౌన్లలో స్టాక్ ఎరువులు ఉన్నప్పటికీ తగ్గిన ధరలకే రైతులకు ఎరువులను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా ప్రస్తుతం పాత ధరలు మాత్రమే ఎంఆర్పీ రూపంలో ఉన్నప్పటికీ కొత్త ధరలకు ఎరువులను రైతులకు అందించాలని పేర్కొంది. తగ్గించిన ధరలతో త్వరలో ఎంఆర్పీ ముద్రణతో త్వరలో మార్కెట్‌కు రానునట్లు ఓ జిల్లా అధికారి పేర్కొన్నారు. అందని ఆదేశాలు ఎరువుల యజమాన్యాలు ధరలను తగ్గించినట్లు ప్రకటించాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభసూచకమని పేర్కొన్నప్పటికీ తగ్గించిన ధరలతోనే రైతులకు ఎరువుల బస్తాలను విక్రయించాలని తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని పలువురు సహకార సంఘాల చైర్మన్లు పేర్కొంటున్నారు. ఎరువుల ధరలు తగ్గినట్లు తాము పేపర్లో చూడటం తప్పా అధికారికంగా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను తగ్గించటం మంచి పరిణామమే అయినప్పటికీ పాత స్టాక్ ఎంత ఉంది అనే లెక్కలను సైతం సరిచూసుకోకుండా ఎరువుల ధరలు తగ్గించి తమకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వక పోవటంతో ఇబ్బందులు తప్పటంలేదని పలువురు సహకార సంఘాల చైర్మన్లు పేర్కొంటున్నా రు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పం దించి తమకు వెంటనే తగ్గిన ధరల పట్టికను తమ కు అధికారికంగా అందించాలని కోరుతున్నారు. సంతోషంగా ఉంది మందు సంచుల ధరలను ప్రభుత్వం తగ్గించటం సంతోషంగా ఉంది. నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. 15 మందు సంచులు అవసరం ఉన్నాయి. రేట్లు తగ్గించటంతో నాకు రూ.1500 తగ్గాయి. కానీ తగ్గించిన ధరలకే మందు సంచులను అమ్మేలా చూడాలి. – రైతు నర్సింలు జంగరాయి -
నితిన్ గడ్కరీ ఆసక్తికర ప్రతిపాదన
ముంబై : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. దేశ వ్యాప్తంగా యూరిన్‌ని నిల్వ చేసుకోగలిగితే యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన పని లేదన్నారు. నాగ్‌పూర్‌లో నిర్వహించిన యువ సృజనాత్మక ఆవిష్కరణల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ ఈ ప్రతిపాదన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మనం దేశ ప్రజల మూత్రాన్ని నిల్వ చేసుకోగలిగితే.. విదేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా చాలా సొమ్ము ఆదా అవుతోంది. మానవ మూత్రం జీవ ఇంధనంగా ఉపయోగపడుతుంది. అందులో సల్ఫేట్, నైట్రోజన్ ఉంటాయ’ని తెలిపారు. అంతేకాక ‘విమానాశ్రయాల్లో మూత్రాన్ని నిల్వ చేయమని గతంలోనే నేను కోరాను. కానీ నా ప్రతిపాదనను ఎవరూ అంగీకరించలేదు. కార్పొరేషన్ కూడా నా మాటలు పట్టించుకోలేదు. సనాతన ఆచారాలను పాటించే వారికి నా అద్భుతమైన ఆలోచనలు నచ్చవ’ని గడ్కరీ పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణల ప్రాధాన్యం గురించి చెబుతూ.. మానవ వ్యర్థాల నుంచి జీవ ఇంధనాలను ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్పడానికి దీన్నో ఉదాహరణగా చెప్పారు గడ్కరీ. ఇదే సమావేశంలో మరో ఉదాహరణ కూడా చెప్పారు. మనిషి వెంట్రుకల నుంచి అమినో యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయని.. దాన్ని కూడా ఎరువుగా ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు. ఫలితంగా పంట రాబడి మరో 25 శాతం పెరుగుతుందన్నారు. అమినో యాసిడ్స్‌ను మనం విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని, 180 కంటైనర్ల జీవ ఎరువులను(బయో ఫెర్టిలైజర్స్) దుబాయ్ నుంచి కొనుగోలు చేస్తున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు. -
యూరియా.. లేదయా..!
సాక్షి,యాదాద్రి : యూరియా కొరతతో జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. పది రోజులుగా కురుస్తున్న చెదురుమదురు వర్షాలకు పంటలకు యూరియా పెట్టేందుకు రైతులు ఎరువుల దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. అయితే కంపెనీల నుంచి సరఫరా తగ్గడంతో కొరత ప్రారంభమైంది. ఆడపాదడపా వస్తున్నప్పటికీ ఏమూలకు సరిపోవడం లేదు. దీంతో రైతులు పొరుగున గల జనగామ, సిద్దిపేట, మేడ్చల్ జిల్లాలకు వెళ్తున్నారు. యూరియా వాడకం ఎక్కువ ఖరీఫ్ ప్రారంభంలో కురిసిన తొలకరి వానలకు రైతులు పత్తి, వరి విత్తనాలు నాటారు. ఆ తర్వాత కరువు పరిస్థితులు కనిపించడంతో రైతులు ముందస్తుగా ఎరువులను కొనుగోలు చేయలేదు. అయితే పది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఎరువులు పెట్టడానికి రైతులందరూ ఒక్కసారిగా దుకాణాలకు వెళ్తున్నారు. దుకాణాల్లో అధిక నిల్వలు లేకపోవడం, కంపెనీల నుంచి దిగుమతి తగ్గిపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. అందులో కాంప్లెక్స్ ధరలు అధికంగా ఉండడంతో యూరియా వాడకంపై ఎక్కువ దృష్టి సారించారు. ఒక్క బస్తాకు బదులుగా రెండు బస్తాల యూరియాను వినియోగిస్తున్నారు. దీంతో యూరియా కొరత అధికమైంది. అడ్డొచ్చిన సెలవులు యూరియా ఇతర కాంప్లెక్స్ ఎరువులు మిర్యాలగూడెం, హైదరాబాద్ నుంచి రైల్వే రాక్ల ద్వారా ఉమ్మడి జిల్లాలకు సరఫరా అవుతాయి. మిర్యాలగూడెం స్టాక్ పాయింట్‌కు రైల్ వ్యాగన్లలో వచ్చిన యూరియాను దుకాణాలకు చేరవేసేందుకు రెండో శనివారం, ఆదివారం కావడంతో లోడిం గ్లు కాలేదు. సోమవారం, మంగళవారాల్లో లోడింగ్ అయినప్పటికీ అతి తక్కువ లారీల్లో ఎక్కించారు. ట్రాన్స్పోర్ట్ నుంచి దుకాణాల్లోకి చేరడానికి సమస్య ఎదురైంది. బుధవారం స్వాతం త్య్ర దినోత్సవ సెలవు కావడంతో, యూరియా లోడింగ్ కాలేదు. కేంద్రంనుంచి అందే సబ్సిడీ ఇలా.. కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం యూరియా అమ్మకం మీదనే సబ్సిడీ విధానం(డీబీటీ) ప్రవేశపెట్టింది. ప్రతి ఎరువుల దుకాణానికి పీలోఎస్ మిషన్ ద్వారా అమ్మకం చేస్తోంది. విక్రయించిన యూరియాకు కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది. 50 కిలోల యూరియా బస్తాకు రైతు రూ.295 చెల్లిస్తుండగా, కేంద్రం అందించే సబ్సిడీ రూ.923.74. 45కిలోల యూరియా బస్తాకు రూ.266.53 రైతు ధర కాగా, కేంద్రం రూ.850 వరకు సబ్సిడీ చెల్లిస్తుంది. అందని సబ్సిడీతో ఇబ్బందులు డీలర్లు, వివిధ వర్గాల ద్వారా తెలుస్తున్న సమచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రాకపోవడంతో కంపెనీలు యూరియా తయారీని నిలిపివేశాయి. ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసిన యూరియాను తమ కంపెనీల బస్తాల్లో ప్యాక్ చేసి సరఫరా చేస్తున్నారు.ఈ యూరియా కూడా డీలర్‌కు సరఫరా ఇవ్వకుండా ట్రాన్స్పోర్ట్ చార్జి పేరుతో వసూలు చేస్తున్నాయి. మిర్యాలగూడెం, హైదరాబాద్ ల్యాబ్లనుంచి అదనంగా కిరాయి బస్తాకు రూ.20 నుంచి రూ.30వరకు వసూలు చేస్తుండడంతో డీలర్‌కు చేరే సరికే అది ఎమ్మార్పీ ధర కంటే మించి అవుతుంది. జిల్లాలో కోరమాండల్, నాగార్జున, ఉజ్వల, ఇప్కో, క్రిబ్కో, స్పీక్ యూరియా కంపెనీలు ఉమ్మడి జిల్లాలో సరఫరా చేస్తున్నాయి. ఇవే కాకుండా ఇతర కంపెనీలు కూడా యూరి యా సరఫరా చేస్తున్నాయి. 50వేల టన్నులు అవసరం ప్రస్తుతం జిల్లాలో సాగైన పంటల అవసరాల కోసం సుమారు 50వేల టన్నుల యూరియా కావాలి.అంటే సుమారుగా 20వ్యాగన్ల యూరియా జిల్లాకు రావాల్సి ఉంది. కానీ ఒక్క వ్యాగన్ మాత్ర మే జిల్లాకు రావడంతో ఉమ్మడి జిల్లా అవసరం మొత్తానికి సరఫరా చేయలేకపోతున్నారు.దీంతో తీవ్రమైన కొర త ఏర్పడుతుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలోనే పంటలకు యూరియా అధికంగా అవసరం ఉంటుంది. ఈసమయంలోనే యూరి యా సరిపోను లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆందోళనలో రైతులు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఓ వైపు ఆనందం వ్యక్తమవుతుండగా మరో వై పు ఆందోళన నెలకొంది. అదునుకు యూరి యా పెడితే చేను ఏపుగా పెరిగేదని, అధికా రులు వెంటనే స్పందించి సరిపడా ఎరువులు తెప్పించాలని రైతులు కోరుతున్నారు. -
యూరియా.. ఇదేందయా?
సాక్షి, హైదరాబాద్: వ్యాపారులు మోసం చేస్తే ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది.. కానీ సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థే రైతులను మాయ చేస్తే..? ఎవరికి చెప్పుకోవాలి? రైతుల పక్షాన నిలవాల్సిన మార్క్‌ఫెడ్ పక్కా వ్యాపార సంస్థగా మారింది. ఒకవైపు వర్షాల్లేక రైతులు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు గడ్డ కట్టిన యూరియాను సరఫరా చేసి మరో బండ మోపుతోంది! మూడు నాలుగేళ్ల కిందట కంపెనీల నుంచి కొనుగోలు చేసిన యూరియా గడ్డ కట్టడంతోపాటు దానిలో ఉన్న శక్తి కూడా తగ్గిపోయింది. దీంతో ఉపయోగం లేదని తెలిసినా మార్క్‌ఫెడ్ అధికారులు ఒత్తిడి చేసి మరీ రైతులకు అంటగడుతున్నారు. ఈ యూరియా తమ కొద్దంటూ అన్నదాతలు గగ్గోలు పెడుతున్నా వినే నాథుడే కరువయ్యాడు. ఈ యూరియా కొన్నా అది పనిచేయక రెండుసార్లు చల్లాల్సి వస్తోంది. దీంతో ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. గడ్డ కట్టిన యూరియాను కంపెనీలకు వెనక్కి ఇచ్చి కొత్తగా తీసుకోకుండా రైతులకు మార్క్‌ఫెడ్ అన్యాయం చేస్తోం దన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిల్వల వెనుక భారీ స్కాం? ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 66.36 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఖరీఫ్ పంటల కోసం రాష్ట్రానికి దాదాపు 8 లక్షల టన్నుల యూరియా అవసరం. అందులో 2 లక్షల టన్నుల యూరియాను మార్క్‌ఫెడ్ బఫర్స్టాకుగా సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ పాత నిల్వలను బయటకు పంపిస్తూ మళ్లీ అంతే మోతాదులో కొత్త సరుకును బఫర్ స్టాకుగా ఉంచాలి. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ వద్ద 1.27 లక్షల టన్నుల యూరియా ఉండగా, అందులో 30,394 టన్నుల యూరియా గడ్డ కట్టినదే కావడం గమనార్హం. కొన్నాళ్లుగా బఫర్ స్టాకును కదిలించకుండా చాలావరకు కొత్త సరుకును రైల్వే రేక్ పాయింట్ల నుంచి నేరుగా ఎరువుల డీలర్లకు పంపిస్తున్నారు. దీంతో మార్క్‌ఫెడ్ వద్ద మూడు నాలుగేళ్లుగా 2 లక్షల టన్నులకుపైగా యూరియా గడ్డ కట్టుకుపోయింది. రేక్ పాయింట్ల నుంచే యూరియాను మార్కెట్‌కు పంపిస్తున్నారు. దీంతో లోడింగ్, అన్లోడింగ్, నిర్వహణ వంటి ఖర్చులన్నీ మిగులుతున్నాయి. ఆయా ఖర్చులన్నీ కాగి తాల్లో కనిపిస్తున్నాయే కానీ ఎక్కడా వాస్తవ ఖర్చులేదు. మార్క్‌ఫెడ్ అధికారులు కోట్ల రూపాయలు కాజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాల నుంచి పైస్థాయి వరకు ఇదే పరిస్థితి. యూరియా నిల్వల నిర్వహణలో భారీ కుంభకోణం దాగి ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. కక్కుర్తి వల్లే బఫర్ స్టాక్ యూరియా నిల్వలు కాస్తా గడ్డకట్టుకు పోయాయి. తక్కువ ధర అంటూ... రెండు మూడేళ్ల క్రితం బఫర్ స్టాక్‌కు అదనపు నిల్వలు తీసుకున్నామని, కానీ కాలం కలిసి రాకపోవడంతో నిల్వలు పేరుకుపోయాయని మార్క్‌ఫెడ్ అధికారు లు చెబుతున్నారు. పాతవి వదిలించుకోకపోవ డం, కొత్త సరుకు నిల్వ చేయకపోవడం వల్లే వ్యవహారం గందరగోళంగా మారింది. బఫర్‌స్టాక్‌ను అధికంగా ఉంచడంలోనూ మాయ జరిగిందన్న విమర్శలున్నాయి. మిగిలిన గడ్డకట్టిన యూరియాను తక్కువ ధర అంటూ అంటగడుతున్నారు. యూరియా నాణ్యమైనదే అయితే తక్కువ ధరకు ఎందుకు అంటగడుతున్నారు? పాత దానికి కొత్త దానికి తేడా లేకపోతే ధర తగ్గించాల్సిన అవసరమేంటన్న దానికి సమా ధానం లేదు. 45 కిలోల యూరియా ధర రూ.252 కాగా గడ్డ కట్టిన 50 కిలోల బస్తా యూరియా ధర రూ.264 ఉంది. గడ్డ కట్టింది కాబట్టే తక్కువకు ఇస్తున్నామని అధికారులు అంటున్నా, యూరియా ఆరు నెలలు దాటితే నాణ్యత తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గడ్డ కట్టిన యూరియా పనిచేయడం లేదని అటు రైతులు, ఎరువుల డీలర్లు మార్క్‌ఫెడ్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ తీసుకోవాల్సిందేనంటూ మార్క్‌ఫెడ్ వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. కొందరు డీలర్లు అయితే కమీషన్లు ముట్టజెప్పుకొని కొత్త యూరియాను దక్కించుకుంటున్నారు. లేకుంటే వారికి గడ్డ కట్టిన యూరియానే ఇస్తున్నారు. -
రాష్ట్రంలో యూరియా సంక్షోభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. రాష్ట్రానికి యూరియా సరఫరా చేసే ప్రముఖ ఎరువుల కంపెనీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో దాదాపు 6 లక్షల టన్నుల కొరత ఏర్పడింది. ఎరువుల కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో మార్క్‌ఫెడ్ అధికారులు సమావేశమై చర్చిస్తున్నారు. ఇందుకు సంబంధించి మార్క్‌ఫెడ్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమవుతోంది. యూరియా సంక్షోభం ఉందని తెలిస్తే రైతులు కంగారు పడతారని భావించిన అధికారులు అంతా బాగుందనే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. మార్క్‌ఫెడ్ వద్ద బఫర్‌స్టాక్ 2 లక్షల టన్నుల వరకు సిద్ధంగా ఉండాలి. కానీ ఈ నెల మూడో తేదీ నాటికి నీమ్ కోటెడ్ యూరియా 91,367 టన్నులే ఉండటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎందుకీ పరిస్థితి?: రాష్ట్రానికి యూరియాను సరఫరా చేసే కంపెనీల్లో నాగార్జున ఫెర్టిలైజర్స్ ప్రధానమైంది. దేశవ్యాప్తంగా యూరియా తయారీ కంపెనీలు ఎదుర్కొంటున్నట్టే ఈ సంస్థ కూడా తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ సంస్థ నుంచి 15 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుంది. ఇందులో 6 లక్షల టన్నులు రాష్ట్రానికి సరఫరా అవుతుంది. ఇప్పుడు ఆ యూరియా నిల్వలు నిలిచిపోయే ప్రమాదం నెలకొంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ అత్యంత కీలక దశలో ఉంది. తెలంగాణలో 1.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. అందుకోసం రాష్ట్రానికి 8 లక్షల టన్నుల యూరియా అవసరం. నాగార్జునలో ఉత్పత్తి నిలిచి పోవడంతో రాష్ట్రంలో 6 లక్షల టన్నుల యూరియా కొరత ఏర్పడనుంది. పరిస్థితిని పసిగట్టిన అధికారులు కోరమాండల్, ఇఫ్కో, క్రిబ్కో, జువారీ, స్పిక్ గ్రూపు సంస్థల ప్రతినిధులతో మంతనాలు జరుపుతున్నారు. యూరియా కొరతను నివారించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా లేవు. ఈ పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. దేశంలో 32 యూరియా తయారీ కంపెనీలు ఉంటే వాటిల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.70 వేల కోట్ల వరకు సబ్సిడీ బకాయిలు ఉన్నాయి. -
యూరియా స్కాంలో 100 కోట్ల జరిమానా!
న్యూఢిల్లీ: 23 ఏళ్లనాటి రూ.133 కోట్ల యూరియా కుంభకోణంలో తీస్ హజారీ ప్రత్యేక సీబీఐ కోర్టు దోషులకు భారీ జరిమానాతోపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. ఇద్దరు టర్కీ దేశస్తులకు ఆరేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బంధువు, మాజీ కేంద్ర మంత్రి తనయుడు సహా ఈ కేసుతో సంబంధమున్న భారతీయులకు భారీ జరిమానా విధించింది. టర్కీ దేశస్తులు టుంకే అలంకుస్, సిహాన్ కరాంచీ (వీరిద్దరూ కర్సాన్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు)లతోపాటు ఆ కంపెనీ భారతీయ ప్రతినిధి ఎం సాంబశివరావు, నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్) మాజీ సీఎండీ రామకృష్ణన్, ఎన్ఎఫ్ఎల్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిల్బాగ్ సింగ్ కన్వర్, మల్లేశం గౌడ్, మాజీ కేంద్ర మంత్రి రామ్‌లఖన్ సింగ్ యాదవ్ కుమారుడు ప్రకాశ్ చంద్ర, మాజీ ప్రధాని పీవీ బంధువు సంజీవ రావు ఈ కేసులో దోషులుగా ఉన్నారు. రామకృష్ణ, కన్వర్‌లకు మూడేళ్ల జైలు, రూ.6లక్షల జరిమానా, సాంబశివరావుకు మూడేళ్ల జైలు, రూ.5కోట్ల జరిమానా, మల్లేశం గౌడ్‌కు మూడేళ్ల జైలు, రూ.5కోట్ల జరిమానా, సంజీవరావ్, యాదవ్‌లకు కోటి రూపాయల జరిమానా మూడేళ్ల జైలు శిక్ష విధించారు. కుంభకోణం కేసేంటి? ఈ కేసులో పేర్కొన్న వారంతా నేరపూరిత కుట్రతో ఎన్‌ఎఫ్‌ఎల్‌ను రూ.133 కోట్ల మేర మోసం చేశారంటూ 1996, మే 19న సీబీఐ కేసు నమోదు చేసింది. ‘టర్కీ దేశస్తుడైన అలంకుస్ ఎన్ఎఫ్ఎల్కు యూరియా సరఫరా చేసేందుకు కర్సాన్ లిమిటెడ్ కంపెనీ తరపున ఒప్పందం చేసుకున్నాడు. మెట్రిక్ టన్నుకు 190 డాలర్ల చొప్పున 2లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకోసం ముందుగానే 100% చెల్లించాలని ఒప్పందంలో ఉంది. దీని విలువ దాదాపుగా రూ.133 కోట్లు. నవంబర్ 2, 1995న అలంకుస్కు 3.8లక్షల డాలర్లు బీమా అడ్వాన్స్‌గా చెల్లించారు. మిగిలిన 3.76 కోట్ల డాలర్లను కర్సాన్ కంపెనీ అకౌంట్లోకి 1995లో జమచేశారు. అయితే ఈ కంపెనీ ఎన్ఎఫ్ఎల్కు యూరియాను పంపలేదు. కుంభకోణం నేపథ్యం.. 1995,సెప్టెంబర్: యూరియా సరఫరాకు అంతర్జాతీయ టెండర్ల ఆహ్వానం 1996 మార్చి: టర్కీ కంపెనీ కార్సాన్కు రూ.133 కోట్ల చెల్లింపు 1996 మే: యూరియా సరఫరా చేయకపోవడంపై సీబీఐ విచారణకు ఆదేశం 1996 ఆగస్టు: కంభకోణంలో వెలుగులోకి పీవీ కొడుకు ప్రభాకర్ రావు పేరు 1998 నవంబర్: ప్రభాకర్ రావు అరెస్టు -
రెండేళ్ల గరిష్ట స్థాయికి సహజ వాయువు ధర?
న్యూఢిల్లీ: దేశీయ సహజ వాయువు ధరను పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే వారమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ అదే జరిగితే రెండేళ్లలో ఇదే గరిష్ట పెంపు కానుంది. దీని వల్ల సీఎన్జీ, విద్యుత్, యూరియా తదితరాల ధరలు పెరుగుతాయి. స్వదేశంలో ఉత్పత్తి అయ్యే మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ) సహజ వాయువు ధర ఏప్రిల్ 1 నుంచి ప్రస్తుతమున్న 2.89 డాలర్ల(సుమారు రూ.189) నుంచి 3.06 డాలర్ల(రూ.199)కు పెరిగే అవకాశాలున్నాయి. -
ఇకపై 45 కేజీల యూరియా బస్తాలు
న్యూఢిల్లీ: యూరియా వినియోగం తగ్గించేందుకు, ఎరువుల వినియోగంలో సమతూకం పాటించే లక్ష్యంతో ఇకపై యూరియా బస్తాల్ని 50 కేజీలు కాకుండా 45 కేజీల్లో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 45 కేజీల బస్తాల అమ్మకం మార్చి 1, 2018 నుంచే అమల్లోకి వచ్చిందని, అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న 50 కేజీల బస్తాల్ని వచ్చే రెండు నెలలు అమ్ముకునేందుకు అనుమతిస్తామని ఎరువుల శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. హెక్టారు పొలానికి బస్తాల లెక్కన యూరియాను రైతులు వాడుతున్నారని, వినియోగం తగ్గించమని చెప్పినా వినడం లేదని.. అందువల్లే 45 కేజీల బస్తాల్ని విక్రయిస్తున్నామని ఆయన చెప్పారు. పన్నులు జతచేయకుండా 45 కేజీల యూరియా బస్తాను రూ. 242కు విక్రయిస్తారని నోటిఫికేషన్లో ప్రభుత్వం వెల్లడించింది. టన్ను యూరియాకు ప్రభుత్వం నిర్ణయించి న రూ. 5360 ధరకు అనుగుణంగా బస్తా రేటును నిర్ణయిస్తున్నారు. కాగా 25 కేజీలకు మించకుండా బస్తాల్ని విక్రయించేందుకు డీలర్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే ప్యాకింగ్ కోసం 2 కేజీల యూరియాకు రూ. 1.50, 5 కేజీలకు రూ.2.25, 10 కేజీలకు రూ. 3.50, 25 కేజీలకు రూ. 5లు డీలర్లు వసూలు చేసుకోవచ్చు. -
టాటా కెమికల్స్ యూరియా వ్యాపార విక్రయం పూర్తి
న్యూఢిల్లీ: టాటా కెమికల్స్ కంపెనీ తన యూరియా, కస్టమైజ్డ్ ఫెర్టిలైజర్స్ వ్యాపార విక్రయాన్ని పూర్తి చేసింది. టాటా కెమికల్స్ ఈ వ్యాపారాన్ని నార్వేకు చెందిన యారా ఇంటర్నేషనల్ ఎఎస్ఏ అనుబంధ కంపెనీ యారా ఫెర్టిలైజర్స్ ఇండియాకు రూ. 2,682కోట్లకు విక్రయించింది. ఈ డీల్‌లో ఉత్తరప్రదేశ్‌లోని బబ్రల ప్లాంట్ మొత్తాన్ని ఆస్తులు, అప్పులతో సహా యారా ఫెర్టిలైజర్స్‌కు టాటా కెమికల్స్ అమ్మేసింది. నియంత్రణలు అధికంగా ఉన్న యూరియా రంగంలో ఇది తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కావడం విశేషం. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ షరతులు, సూచనల ప్రకారమే ఈ వాటా విక్రయం పూర్తయినట్లు టాటా కెమికల్స్ స్టాక్ ఎక్సే్చంజ్‌లకు నివేదించింది. కాగా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఎరువుల మార్కెట్ అయిన భారత్‌లో ప్రవేశించడం ఉత్సాహాన్నిస్తోందని యారా ఇంటర్నేషనల్ సీఈఓ, ప్రెసిడెంట్ స్వీన్ టొరె హొల్‌సెథర్ వ్యాఖ్యానించారు. -
లీటర్ యూరిన్.. రూ. 1
సాక్షి, న్యూఢిల్లీ : మూత్రానికి విలువ పెరుగుతోంది.. ఒక లీటర్ యూరిన్‌కు రూపాయి విలువను ప్రభుత్వం నిర్ణయించింది. ఇదేంటి అనుకుంటున్నారా? నిజం. దేశంలో ఎరువుల కోరత తగ్గించే క్రమంలో కేంద్రం ప్రభుత్వం ఎవరూ ఊహించని ఇటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లోని తాలుకా, తహసీల్ కార్యాలయాల్లో యూరిన్ బ్యాంక్‌లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. యూరిన్ బ్యాంక్‌ల్లో సేకరించిన యూరిన్‌తో యూరియాను తయారు చేయవచ్చని.. ఆయన తెలిపారు. ఇలా చేయడం వల్ల యూరియాను దిగుమతి చేసుకునే అవసరం లేకుండా అతి తక్కువ ధరకే నాణ్యమైన యూరియాను మన రైతులకు అందించవచ్చని ఆయన తెలిపారు. యూరిన్‌లో నైట్రోజన్ శాతం అధికంగా ఉంటుందని ఆయన తెలిపారు. అయితే దృరదృష్టవశాత్తు దీనిని మనం ఉపయోగించుకోవడం లేదన్నారు. దేశంలో వ్యర్థాన్ని సంపదగా మార్చే ఇటువంటి ఆలోచనను అందరూ అంగీరిస్తారని ఆయన చెప్పారు. పైలెట్ ప్రాజెక్ట్ యూరిన్ నుంచి యూరియా రూపొందించే కార్యక్రం మొదటగా మహరాష్ట్రలోని నాగ్‌పూర్ దగ్గరున్నధాఫ్‌వడ ప్రాంతంఓ ఏర్పటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులు, ప్రజలు, స్థానికులు ఎవరైనా.. 10 లీటర్ల యూరిన్‌ను బ్యాంక్‌కు అందిస్తే.. లీటర్‌కు రూపాయి చొప్పున 10 రూపాయలు కూడా వారికి అందిస్తామని ఆయన తెలిపారు. -
జీఎస్టీతో ఎరువు మరింత బరువు
-
ఎరువు మరింత బరువు!
యూరియాకు జీఎస్టీ దెబ్బ ► టన్నుకు రూ.300–400 వరకు పెరగనున్న ధర ► 50 కిలోల డీఏపీపై రూ.100–125 వరకు పెరిగే అవకాశం ► ఎరువులపై 12 శాతం జీఎస్టీని నిర్ణయించిన కౌన్సిల్ ► రాష్ట్రంలో వచ్చే సీజన్లో 13.5 లక్షల బస్తాల యూరియా, 2.5 లక్షల బస్తాల డీఏపీ వినియోగం సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను విధానం కోసం తీసుకువస్తున్న ‘వస్తుసేవల పన్ను (జీఎస్టీ)’తో రైతులపై మాత్రం భారం పడనుంది. ఎరువులపై ప్రస్తుతం 4 నుంచి 8 శాతం మధ్య పన్నులు ఉండగా.. జీఎస్టీలో ఎరువులపై 12 శాతం పన్ను విధించేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో ఎరువులు, సూక్ష్మ పోషకాల విక్రయ ధరలు అనివార్యంగా పెరగనున్నాయి. దీనివల్ల సాగు వ్యయం పెరుగుతుందని, ఎరువుల వినియోగంలో సమతుల్యత దెబ్బతింటుందని ఎరువుల కంపెనీలు వాదిస్తున్నాయి. రూ.100 వరకు పెరగనున్న యూరియా జీఎస్టీలో 12 శాతం పన్ను విధించడంతో.. దేశంలోనే అత్యధికంగా వినియోగమయ్యే యూరియా ధర టన్నుకు ఏకంగా రూ.300 నుంచి రూ.400 వరకు పెరిగే అవకాశముంది. డై అమ్మోనియం ఫాస్పేట్ (డీఏపీ) వంటి ఎరువుల ధరలు కొన్ని రాష్ట్రాల్లో టన్నుకు రూ.3 వేల వరకు పెరగనున్నాయి. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎరువులు, సూక్ష్మ పోషకాలపై ఎటువంటి పన్నులూ లేవు. తెలంగాణ వంటి పలు రాష్ట్రాల్లో నామమాత్రపు పన్నులు న్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎరువుల ధరలు ఎక్కువగా పెరిగే అవకాశముంది. ఇక రోడ్డు రవాణాపై 5 శాతం జీఎస్టీ విధించడం వల్ల కూడా ఎరువుల చిల్లర ధరలపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం ఎరువుల రవాణాపై ఎటువంటి సర్వీసుట్యాక్స్ లేకపోవడం గమనార్హం. వందల కోట్ల భారం.. జీఎస్టీ విధింపుతో ఏయే రకం ఎరువు ధర ఎంతమేర పెరగనుందనే లెక్కలు వేస్తున్నారు. అంతేగాకుండా పెరిగిన ధరలను ప్రభుత్వం భరిస్తుందా లేక రైతులపైనే భారం వేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఈ మొత్తాన్నీ ప్రభుత్వమే భరిస్తే మాత్రం ఖజానాపై వందల కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా. అయితే యూరియా ధరలను ప్రభుత్వమే నియంత్రిస్తోంది. ప్రస్తుతం టన్ను యూరియా ధర రూ.5,630గా ఉంది. ఇది మినహా మిగతా ఎరువులపై ప్రభుత్వ నియంత్రణ లేదు. ఆయా కంపెనీలే ఉత్పత్తి వ్యయం ఆధారంగా ధరలు నిర్ణయించుకుంటాయి. కాగా రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్ కోసం 8 లక్షల టన్నులు, యాసంగి కోసం 5.5 లక్షల టన్నుల యూరియా సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దీంతో పన్ను కారణంగా ధరలు పెరిగితే.. భారం ఎవరిపై పడుతుందనేది ప్రాధాన్యంగా మారింది. డీఏపీ కూడా భారమే.. 50కిలోల డీఏపీ బస్తా చిల్లర ధర రూ.100–125 వరకు పెరిగే అవకాశ ముం ది. ప్రస్తుతం డీఏపీ బస్తా రూ.వెయ్యి వరకు ఉండగా.. జీఎస్టీ అమల్లోకి వచ్చాక పన్ను తో కలిపి రూ.1,125 అవుతుందని మార్కె ట్వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ప్రభు త్వం అత్యధిక సబ్సిడీ ఇస్తున్న యూరియా కు డీఏపీ సహా మిగతా ఎరువులకు మధ్య ధరలో తేడా బాగా పెరిగే అవకాశ ముంది. దీంతో రైతులు యూరియానే ఎక్కువగా వినియోగించడంపై దృష్టి పెడతారని ఎరువుల కంపెనీలు అంటున్నాయి. దానివల్ల సూక్ష్మ పోషకాలు అందక పంటల దిగుబడులు తగ్గిపోతాయని పేర్కొం టున్నాయి. కాగా రాష్ట్రంలో వచ్చే వ్యవసాయ సీజన్‌కు 2.5 లక్షల బస్తాల డీఏపీని సరఫరా చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. -
యూరియా కుంభకోణంపై విచారణ
అనంతపురం అగ్రికల్చర్ : గత ఏడాది జూలైలో వెలుగుచూసిన యూరియా కుంభకోణంపై వ్యవసాయ కమిషనరేట్ జేడీఏ శ్రీధర్ గురువారం జిల్లా కేంద్రంలోని ఆ శాఖ కార్యాలయంలో విచారణ చేపట్టారు. క్రిబ్కో కంపెనీ నుంచి వచ్చిన 1,300 మెట్రిక్ టన్నుల నీమ్ కోటెడ్ యూరియాను నిబంధనలకు విరుద్ధంగా భాస్కర్ ఫర్టిలైజర్స్‌కు చెందిన మిక్సింగ్ ప్లాంట్‌కు మళ్లించారు. ఈ విషయాన్ని అప్పట్లో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ అంశంపై కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేశారు. అలాగే కమిషనరేట్‌కు చెందిన అడిషనల్ డైరెక్టర్ వినయ్‌చంద్ నేతృత్వంలో మరో బృందం రెండు రోజుల పాటు విచారణ చేపట్టి.. కమిషనర్‌కు నివేదిక అందజేసింది. ప్రాథమిక విచారణ తర్వాత వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ - పీపీ) కె.మల్లికార్జున, అనంతపురం డివిజన్ ఏడీఏ ఎం.రవికుమార్‌ను బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశారు. వీరు హైకోర్టును ఆశ్రయించడంతో ఇటీవల సస్పెన్షన్‌ను రద్దు చేసి.. పోస్టింగ్ ఇచ్చారు. మల్లికార్జున మడకశిర ఏడీఏగా, రవికుమార్ హిందూపురం ఏడీఏగా బాధ్యతలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా... ఈ ఇద్దరు అధికారుల పాత్రపై పూర్తిస్థాయి విచారణకు కమిషనరేట్ జేడీఏ శ్రీధర్‌ను నియమించిన నేపథ్యంలో ఆయన విచారణ మొదలు పెట్టారు. ప్రెజెంటింగ్ అధికారిగా నియమితులైన రైతు శిక్షణ కేంద్రం డీడీఏ డి.జయచంద్ర సమక్షంలో ఏడీఏలు మల్లికార్జున, రవికుమార్‌ను వేర్వేరుగా విచారణ చేశారు. వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. మరికొన్ని డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో తమ పాత్ర ఏమీ లేదని ఆ ఇద్దరూ విచారణాధికారి ముందు చెప్పినట్లు సమాచారం. ఎరువులు దారి మళ్లినట్లు తెలియగానే తనిఖీలతో పాటు ప్రాథమిక విచారణ చేశామని మల్లికార్జున చెప్పగా... రేకు ఆఫీసర్ అనే విషయం తనకు తెలియదని, అధికారం తనకుందని ఎప్పుడూ ఎవరూ చెప్పలేదని రవికుమార్ తెలిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా విచారణాధికారి శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్ని టన్నుల యూరియా దారిమళ్లింది, ఎవరు దారి మళ్లించారు, ఎవరు లబ్ధిపొందారనే విషయంపై ప్రస్తుతం విచారణ చేయడం లేదన్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఏ) నిబంధనల ప్రకారం సస్పెండైన ఇద్దరు అధికారుల విధులు, బాధ్యతలు, వారు స్పందించిన తీరు, ఇందులో వారి ప్రమేయం గురించి వివరాలు రాబట్టామన్నారు. వారం రోజుల్లో కమిషనర్‌కు నివేదిక అందజేస్తామని తెలిపారు. -
యూరియా స్కామ్ నిందితునిపై కేసు
సాంబశివరావును అరెస్ట్ చేసిన సీసీఎస్ అధికారులు 1996లో నాంపల్లిలో భూమిని స్వాధీనం చేసుకున్న సీబీఐ ఇదే భూమి అభివృద్ధి పేరుతో బెంగళూరు కంపెనీతో డీల్ రూ.1.89 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు ఆరోపణలు హైదరాబాద్: 1996 నాటి యూరియా స్కామ్ కేసులో నిందితుడు ఎం.సాంబశివరావు మరో భారీ మోసానికి పాల్ప డ్డాడు. అప్పట్లో సీబీఐ స్వాధీనం చేసుకున్న భూమిని అభి వృద్ధి చేయడానికి బెంగళూరు కంపెనీతో ఒప్పందం కుదు ర్చుకుని.. వారి నుంచి రూ.1.89 కోట్లు తీసుకుని మోసం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) అధికారులు సాంబశివరావును అరెస్టు చేసిన ట్లు డీసీపీ అవినాష్ మహంతి గురువారం వెల్లడించారు. 1996 నాటి యూరియా స్కామ్‌లో అరెస్ట్.. గుంటూరు జిల్లా ఎమినేనివారిపాలెంకు చెందిన సాంబశివరావు బీఎస్సీ(అగ్రికల్చర్) పూర్తి చేశాడు. 1995లో కర్సాన్ లిమిటెడ్ అనే టర్కిష్ కంపెనీకి భారత ఏజెంట్‌గా నియమితులయ్యాడు. అదే ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం యూరియా సరఫరా కోసం గ్లోబల్ టెండర్లు ఆహ్వానించింది. వీటిలో పాల్గొన్న కర్సాన్ లిమిటెడ్ సంస్థ.. నేషనల్ ఫెర్టిలైజ ర్స్ లిమిటెడ్(ఎన్ఎఫ్సీ) ద్వారా సరఫరా బాధ్యతల్ని పొందిం ది. దీని నిమిత్తం 1996 మార్చిలో కేంద్రం ఎన్ఎఫ్సీ ద్వారా కర్సాన్ సంస్థకు రూ.133 కోట్లు చెల్లించింది. నగదు తీసుకు న్న ఆ సంస్థ యూరియా సరఫరా చేయకుండా చేతులెత్తేసిం ది. దీనిపై అదే ఏడాది మేలో సీబీఐ పలువురిని అరెస్టు చేసిం ది. ఈ కేసులో 1996 సెప్టెంబర్‌లో సీబీఐ అధికారులు యూరియా స్కామ్‌లో మూడో నిందితుడిగా ఉన్న సాంబశివ రావు సహా 9 మందిని అరెస్టు చేశారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు సైతం అరెస్టు అయ్యారు. భారీగా ముడుపులు చేతులు మారినట్లు నిర్ధారించిన సీబీఐ ఈ వ్యవహారంలో కొందరు దళారులతో పాటు కర్సాన్ సంస్థకు భారత ఏజెంట్‌గా ఉన్న సాంబశివరావు సైతం ఇందులో కీలకపాత్ర పోషించారని, ప్రతిఫలంగా భారీ మొత్తం అందుకున్నారని అభియోగాలు మోపింది. నగరంలోని నాంపల్లిలో సాంబశివరావుకు చెందిన రెండు ఎకరాల నాలుగు గుంటల భూమిని సీబీఐ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం యూరియా స్కామ్ కేసును ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అవతారం.. ఈ కేసులో బెయిల్‌పై వచ్చిన సాంబశివరావు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారారు. బేగంపేటలో సాయిశ్రీ ప్రాజెక్ట్స్ సంస్థ ను నిర్వహిస్తున్నారు. 2013లో సాంబశివరావు బెంగళూరుకు చెందిన వి ఆప్టిమైజ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ ప్రశాంత్ శ్రీశైలంను సంప్రదించారు. మరికొందరితో కలసి సీబీఐ స్వాధీనం చేసుకున్న భూమిని అభివృద్ధి చేయడానికి ‘వి ఆప్టిమైజ్’తో ఒప్పందం చేసుకున్నారు. సదరు ఆస్తి సీబీఐ అధీనంలో ఉన్న విషయం దాచిపెట్టి భూమిని అభివృద్ధి చేసేందుకు అప్పగించినందుకు తమకు లాభాల్లో 30 శాతం వాటా ఇవ్వాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ఈ మొత్తంలో అడ్వాన్స్‌గా రూ.1.89 కోట్లు ‘వి ఆప్టిమైజ్’ నుంచి సాంబశివరావు తీసుకున్నాడు. జరిగిన మోసం గుర్తించిన బెంగళూరు సంస్థ 2014లో సీసీఎస్‌ను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన వైట్ కాలర్ అఫెన్సెస్ టీమ్–1 అధికారులు సాంబశివరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. -
బహిరంగ మార్కెట్లోకి యూరియా
* కరువు కారణంగా భారీగా పేరుకుపోయిన నిల్వ * 1.75 లక్షల టన్నులు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వ్యవసాయశాఖ సాక్షి, హైదరాబాద్: యూరియా కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూలు.. రాత్రీపగలూ పడిగాపులు కాచే రైతన్నలు.. కొన్నిచోట్ల పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసుల లాఠీచార్జీలు.. మరి ఇప్పుడు యూరియా కొనే దిక్కే లేకుండా పోయింది. కరువు పరిస్థితుల కారణంగా మూడేళ్లుగా యూరియా మిగిలిపోతోంది. నిల్వ ఉంచడంతో గడ్డ కడుతోంది. ఇంకా అలాగే ఉంచితే పనికిరాకుండా పోయే పరిస్థితి నెలకొంది. మరోవైపు జిల్లాల్లోని గోదాముల్లో నిల్వ ఉంచిన యూరియా నిర్వహణ ఆర్థిక భారంగా పరిణమించింది. దీంతో తొలిసారిగా యూరియా స్టాక్‌ను బహిరంగంగా అమ్మకానికి పెట్టాలని వ్యవసాయశాఖ నిర్ణయించి.. ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మిక్చర్ ప్లాంట్లు, ఇతర పరిశ్రమలకు, వ్యాపారులకు సాధారణ ధరకే విక్రయిస్తామని పేర్కొంది. 1.75 లక్షల టన్నుల బేరం రాష్ట్రాన్ని 2014-15 నుంచి కరువు పీడిస్తోంది. దీంతో రైతులు పంటలు వేయకపోవడం, వేసినా మధ్యలోనే ఎండిపోవడంతో యూరియా వినియోగం బాగా తగ్గింది. మార్క్‌ఫెడ్ నిర్వహిస్తోన్న గోదాముల్లో 2014 నుంచి ఇప్పటివరకు 2.77 లక్షల టన్నుల యూరియా పేరుకుపోయింది. 2014-15కి సంబంధించిన యూరియా 10,769 టన్నులు, 2015-16కు చెందిన 1.63 లక్షల టన్నులు, 2016-17కు చెందిన 1.02 లక్షల టన్నుల యూరియా నిల్వ ఉంది. అందులో ఈ ఏడాది యూరియాను మినహాయించి.. గత రెండేళ్ల స్టాక్‌ను విక్రయించాలని నిర్ణయించారు. -
యూరియాతో బెట్ట నుంచి విముక్తి
దేవనకొండ : ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా వాడుపట్టిన పంటలపై యూరియా ద్రావణం పిచికారి చేస్తే బెట్ట నుంచి తాత్కాలికంగా రక్షించుకోవచ్చని ఇక్రిషాట్ శాస్త్రవేత్త ప్రభాకర్పటాక్ తెలిపారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని కూకటికొండ, వెలమకూరు గ్రామాల్లో పర్యటించారు. లీటర్ నీటికి 10 గ్రా. యూరియా, 2గ్రా. జింక్‌సల్ఫేట్, గ్రాము బోరాన్‌ను కలిపిన ద్రావణాన్ని వాడుపట్టిన వేరుశెనగ పైరుపై పిచికారి చేయడం వల్ల బెట్ట నుంచి పంట కొన్ని రోజులు తట్టుకుంటుందన్నారు. అదష్టవశాత్తు వర్షాలు కురిస్తే పంటలు తిరుగుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. ఆయన వెంట ఇక్రిషాట్ ఎస్ఓ ఆదినారాయణ, నల్లచెలిమల ప్రాజెక్టు ఆఫీసర్ మధుసూదన్ తదితరులున్నారు. -
యూరియాకు వేపపూత
♦ పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట ♦ ఏటా రూ. 3 వేల కోట్ల యూరియా సబ్సిడీ పక్కదారి ♦ పాల కల్తీ మొదలుకుని పారిశ్రామిక అవసరాలకు ♦ ఇకపై వ్యవసాయంలో వేప పూత యూరియా ♦ ఏటా రూ. 6,500 కోట్ల మేర ఆదా అయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: ‘గతంలో మాదిరిగా యూరియా అక్రమంగా రసాయన కర్మాగారాలకు దారి మళ్లకుండా వేప పూత వేస్తున్నాం.. ఇన్నాళ్లూ యూరియాను లూటీ చేసిన కెమికల్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు నాపై ఆగ్రహంతో.. ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కుట్ర చేస్తున్నారు.’.. ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో.. దేశంలో వేప పూత యూరియా వినియోగం చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లూ రైతులకు సబ్సిడీపై సరఫరా చేస్తున్న యూరియాను పాల కల్తీ మొదలుకుని.. పారిశ్రామిక అవసరాల వరకు పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో భూ సారాన్ని కాపాడుతూ దిగుబడులు పెంచే లక్ష్యంతో.. వ్యవసాయ అవసరాలకు వేప పూత ఉన్న యూరియా (ఎన్‌సీయూ) సరఫరాను గత ఏడాది నవంబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. తద్వారా అక్రమ వ్యాపారాలకు యూరియాను ముడి సరుకుగా వినియోగిస్తున్న అక్రమార్కులకు కళ్లెం వేయొచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో ఏటా 22 మిలియన్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుండగా.. మరో 8 నుంచి 9 మిలియన్ టన్నుల యూరియా విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. ప్రస్తుతం మెట్రిక్ టన్ను యూరియా ధర రూ. 5,360 కాగా.. సగం ధరకే యూరియాను సబ్సిడీపై రైతులకు సరఫరా చేస్తోంది. యూరియాను ముడి సరుకుగా వినియోగించుకుని 55 రకాలైన ఇతరత్రా రసాయన ఉత్పత్తులను తయారు చేసే వీలుంది. దీనిని ఆసరాగా చేసుకుని.. పారిశ్రామిక అవసరాలకు యూరియా తయారీ కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేయాల్సిన రసాయన కంపెనీలు సబ్సిడీ యూరియాను పక్కదారి పట్టిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఏటా సుమారు 50 లక్షల టన్నుల యూరియా పక్కదారి పడుతుండగా.. రూ. 3 వేల కోట్ల సబ్సి డీ సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది. వేప పూత యూరియాతో అడ్డుకట్ట సబ్సిడీ యూరియా సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వేపపూత యూరియా (ఎన్‌సీయూ) వినియోగాన్ని తెరమీదకు తెస్తూ.. గత ఏడాది నూతన యూరి యా విధానాన్ని ప్రకటించింది. దేశంలో 26 ఎరువుల కంపెనీలు ఎన్సీయూను తయారు చేస్తుండగా.. ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యంలో 100 శాతం వేప పూత యూరియా తయారీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతం లో కేవలం 35 శాతం ఎన్‌సీయూ తయారీకి అనుమతి వుండగా ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యంలో కనీ సం 75 శాతం ఎన్‌సీయూ తయారీని తప్పనిసరి చేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియాకు కూడా వేప పూతను తప్పనిసరి చేసింది. వ్యవసాయ అవసరాలకు 2015 నవంబర్ నుంచి వేపపూత యూరి యాను నూటికి నూరు శాతం తప్పనిసరి చేసింది. సాధారణ యూరియా ఎంఆర్పీ ధరపై అదనంగా ఐదు శాతం ధరలకు అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో రైతులకు సగటున ఒక్కో బస్తాపై పది రూపాయల అదనపు భారం పడనుంది. ఎన్‌సీయూ వినియోగం ద్వారా సాధారణ యూరియా 10 నుంచి 15 శాతం మేర తగ్గినట్లు కేంద్ర వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. వేప పూత యూరియా ద్వారా రైతులకు రాబడి పెరగడంతోపాటు, రూ. 6,500 కోట్ల మేర సబ్సిడీ భారం తగ్గుతుందని కేంద్రం లెక్కలు వేస్తోంది. తద్వారా విదేశీ మారక ద్రవ్యం కూడా ఆదా కానుంది. పెరుగుతున్న ఎన్‌సీయూ ఉత్పత్తి వేప పూత యూరియా ఉత్పత్తి విధానాన్ని ప్రవేశ పెట్టిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఏటా తన ఉత్పత్తిని పెంచుతూ వస్తోంది. యూరియా గుళికలకు ఎంత మోతాదులో వేప నూనెతో పూత వేయాలో ఈ సంస్థ ప్రమాణాలను రూపొందించింది. -
యూరియా నీళ్లు తాగి ఐదు నెమళ్లు మృతి
పరకాల (వరంగల్) : పంట పొలంలో యూరియా కలిసిన నీళ్లు తాగి ఐదు నెమళ్లు మృతిచెందాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లా పరకాల మండలం అలియాబాద్ గ్రామ శివారులో సోమవారం వెలుగుచూసింది. పంట పొలాల వద్దకు వెళ్లిన రైతులు ఇది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు రసాయనాలు కలిసిన నీళ్లు తాగడం వల్లే చనిపోయి ఉంటాయిని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. -
‘పాల’కూట విషం
పసిపిల్లలకు పాలు దివ్య ఔషధం అంటారు.. చిన్నారులు ఇష్టంగా తాగే పాలను అమృతంతో సమానంగా భావిస్తారు. అలాంటి వాటిని అక్రమార్కులు ‘పాల’కూట విషంగా మార్చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో పా‘పాల’ భైరవులు పెరిగిపోతున్నారు. రసాయనాలు, నూనె, పాల పౌడర్, యూరియాతో కృత్రిమపాలను సృష్టిస్తూ విషతుల్యంగా మార్చేస్తున్నారు. నిర్భయంగా వాటిని ప్రజలకు అంటగడుతూ ఆస్పత్రుల ‘పాలు’ చేస్తున్నారు. తమస్వార్థ ప్రయోజనాలకోసం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పాలలో నురగ, చిక్కదనం పెరిగేందుకు యూరియా నీళ్లను కలుపుతున్నట్లు బయటపడడం కలకలం సృష్టిస్తోంది. - ఘట్కేసర్ టౌన్/ ఘట్కేసర్ గతంలో పాడి సంపద విస్తారంగా ఉండేది. ఇంటిల్లిపాది పెరుగు, పాలను తీసుకునేవారు. అకాల వర్షాలు, కరువు కాటకాలు రావడంతో పశువులను సాకలేక కబేళాలకు తరలిస్తున్నారు. డిమాండ్‌కు తగిన పాలు లభించకపోవడం అక్రమార్కులకు కలిసివచ్చింది. కల్తీపాల దం దాకు తెరలేపారు. గుట్టుగా తమ వ్యాపారం సాగించడానికి ఊరికి దూరంగా ఉన్న భవనాలు, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు, వ్యవసాయ బావులను ఎంచుకుంటున్నారు. ఆటోల్లో తరలింపు.. ఇలా తయారు చేసిన పాలను స్థానికంగా విక్రయిస్తే అనుమానిస్తారని గుట్టుచప్పుడుగా ఆటోల్లో నగరానికి తరలిస్తారు. పెద్దపెద్ద హోటళ్లు, బేకరీలు, మిఠాయి షాపులకు విక్రయిస్తుంటారు. అసలు పాలు లీటర్‌కు రూ. 50 నుంచి రూ.70 ఉండగా వీటిని రూ.40కే విక్రయిస్తుంటారు. ఇలా ఆవులు, గేదెలు లేకుండానే పాలను సృష్టిస్తూ తక్కువ పెట్టుబడితో, ఎక్కువ లాభాలు గడిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలు... వీటిని తాగినవారు తీవ్రమైన జీర్ణకోశవ్యాధుల బారినపడుతున్నారు. కడుపునొప్పి, డయేరియా వ్యాధులతో బాధపడుతున్నారు. ఇలాంటి పాలు తాగిన చిన్నారుల మెదడుపై దుష్ర్పభావం పడుతుంది. బాల్యంలోనే స్థూలకాయం, మందబుద్ధి ఏర్పడతాయి. యూరియా ఆనవాళ్లున్న పాలను తాగినవారికి కంటిచూపు దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భిణుల్లో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. ఊపిరితిత్తులు, పేగులు, కిడ్నీ, క్యాన్సర్, కాలేయ సమస్యలు వస్తాయి. కరువైన నిఘా.. అడపాదడపా అధికారులు కల్తీ పాల తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి కేసులు బనాయించినా బెయిల్ తెచ్చుకొని యథేచ్ఛగా తిరిగి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. చట్టాల్లోని లొసుగులను ఆసరా చేసుకొని ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. మండలంలోని అంకుశాపూర్, ఏదులబాద్ గ్రామాల్లో రెండు సార్లు కల్తీపాల తయారీ కేంద్రాల గుట్టురట్టయింది. ఆ రెం డు సంఘటనల్లో నిందితుడు ఒకడే కావడం గమనార్హం. తయారీ ఇలా... 10 లీటర్ల పాలు తయారు చేయడానికి కిలో పాల పౌడర్, లీటరు నూనె, 40 శాతం యూరియా, 10శాతం సర్ఫ్ వాడతారు. అందులో అవసరమైన నీళ్లను పోస్తారు. ఆ తర్వాత వాటిని కర్ర సాయంతో బాగా కలుపుతారు. అవసరమైతే మిక్సీని వాడతారు. బాగా కలిసిన తర్వాత వాటికి స్వచ్ఛమైన కొన్ని పాలు కలుపుతారు. పాలలో వెన్న శాతాన్ని సరిచూస్తారు. దానిని బట్టి నూనె కలపాల్సిన పరిమాణాన్ని పెంచుతూ, తగ్గిస్తూ ఉంటారు. తెల్లదనం నురగ, పొంగు రావడానికి యూరియా, సర్ఫ్ కలుపుతారు. సాధారణ పాలు, కల్తీపాలకు ఏ మాత్రం తేడా కనిపించకుండా చూస్తారు. ఇలా సొమ్ము చేసుకుంటూ.. కిలో పాల పౌడరుకు రూ.150, నూనె ప్యాకెటుకు రూ.80, యూరియాకు రూ.12, సర్ఫ్‌కు రూ.4 ఖర్చు చేస్తారు. 10 లీటర్లపాల తయారీకి దాదాపు రూ.250 ఖర్చవుతుంది. లీటరు పాలను రూ.45 నుంచి రూ.50 వరకు విక్రయిస్తారు. 10 లీటర్ల పాలు విక్రయిస్తే రూ.450 నుంచి రూ.500 వరకు వస్తాయి. ఖర్చులు పోను 10లీటర్లకు రూ.200 నుంచి రూ.250 వరకు సంపాదిస్తారు. ఇలా రోజుకు 400 నుంచి 500 లీటర్ల పాలను సరఫరా చేస్తారు. ఈ చొప్పున రోజుకు రూ.8వేల నుంచి రూ.10వేల వరకు అక్రమార్జన చేస్తున్నారు. కల్తీ పాలతో తీవ్ర అనారోగ్యం .. కల్తీ పాలతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై సత్వర ప్రభావం కనిపిస్తుంది. జీర్ణసంబంధ వ్యాధులు, కాలేయం, హెపటైటిస్ బీ వంటి వ్యాధుల సోకే అవకాశం ఉంది. ఇతర అవయవాలు దెబ్బతీనే ప్రమాదం ఉంది. పాలను తీసుకునే ముందు ఎక్కడి నుంచి తెస్తున్నారనేది గమనించాలి. -డాక్టర్ సతీష్, ప్రాథమిక వైద్య కేంద్రం, ఘట్కేసర్ -
అన్నదాతపై ‘అనుబంధ’ దాడి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో యూరియాకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీన్ని ఆసరా చేసుకొని కొన్ని యూరియా కంపెనీలు రైతును దగా చేస్తున్నాయి. తమ కంపెనీ యూరియా కావాలంటే తప్పనిసరిగా అనుబంధ ఉత్పత్తులను రైతులకు విక్రయించాల్సిందేనని డీలర్లకు హుకుం జారీచేస్తున్నాయి. పెద్దఎత్తున లాభాలు ఉండటంతో డీలర్లు కూడా యూరియా కంపెనీల అనుబంధ ఉత్పత్తులను రైతులకు అంటగడుతున్నారు. వాటిని తీసుకోని రైతులను యూరియా ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఇలా వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నా వ్యవసాయశాఖ మాత్రం చోద్యం చూస్తోంది. జిల్లాల్లో రైతులకు సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయాధికారులు కంపెనీల నుంచి ముడుపులు పుచ్చుకొని రైతులకు హానిచేస్తున్నారన్న విమర్శలున్నాయి. యూరియాకు మూడింతల లాభం... కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ కోసం రాష్ట్రానికి 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. ఆ ప్రకారం కంపెనీలు అమ్మకాలు చేయాలి. దేశవ్యాప్తంగా పేరున్న అనేక కంపెనీలు యూరియాతోపాటు సూక్ష్మపోషక విలువలు కలిగిన అనుబంధ ఎరువుల ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నాయి. వాటిల్లో అనేక ఎరువులకు అనుమతి కూడా లేదని సమాచారం. రాష్ట్రంలో ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు సరిసమాన విలువైన 2 లక్షల టన్నుల అనుబంధ ఉత్పత్తులను డీలర్ల ద్వారా విక్రయిస్తున్నట్లు వ్యవసాయశాఖ అంచనా. కొన్ని కంపెనీలు యూరియా ద్వారా కంటే అనుబంధ ఉత్పత్తుల ద్వారానే పెద్దఎత్తున ఆర్జిస్తున్నాయని, ఇది మూడింతలకుపైగా ఉంటుందని వ్యవసాయ అధికారి ఒకరు చెప్పారు. అదనపు ధరకు యూరియా... రాష్ట్రంలో యూరియా బస్తా ధర రూ. 284 ఉండాలి. కానీ రూ. 350-380 వరకు రైతులకు అంటగడుతున్నారు. డీలర్ల వద్దకు చేర్చకుండానే యూరియా కంపెనీలు రేక్ పాయింట్ వద్దే ఎంఆర్పీకి అమ్ముతున్నారు. దీంతో రవాణా ధర వేసుకొని డీలర్లు రైతులకు అధిక ధరకు అమ్ముతున్నారు. ఇది రైతుపై అదనపు భారంగా పడుతోంది. ఏమాత్రం అవసరం లేకపోయినా... యూరియా కంపెనీలు ప్రధానంగా కాల్షియం, మెగ్నీషియం, సల్ఫేట్, జింక్ తదితర సూక్ష్మ పోషకాలతో కూడిన ఎరువుల ఉత్పత్తులను అదనంగా చేస్తున్నాయి. ఇవన్నీ కూడా అత్యధిక ధర ఉన్నవే. శాస్త్రవేత్తలు మాత్రం వీటి అవసరమే ఉండదంటున్నారు. వీటి ద్వారా పంటలకు కలిగే ప్రయోజనం కేవలం 10 నుంచి 15 శాతమే అని చెబుతున్నారు. కానీ వాటి ధర మాత్రం యూరియాకు అనేక రెట్లు ఉంటోంది. యూరియా ధరలు పెరగడానికి అనుబంధ ఉత్పత్తులు ప్రధాన కారణమని అంటున్నారు. పైగా అనుబంధ ఎరువులను నిబంధనలకు విరుద్ధంగా ప్యాక్ చేస్తున్నారు. ప్యాక్‌పై తెలుగు, ఇంగ్లిషుల్లో సమాచారాన్ని ముద్రించాల్సి ఉన్నా రైతులకు అర్థంకాకుండా కేవలం ఆంగ్లంలోనే ముద్రిస్తున్నారు. -
ఎరువుల దుకాణం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
చిట్యాల (నల్లగొండ) : తనకు అవసరమైన యూరియా స్టాక్ లేదని చెప్పినందుకు ఆగ్రహించిన ఓ రైతు ఫెర్టిలైజర్ దుకాణం ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన జడల మల్లేశం స్థానిక రఘురామా ఫెర్టిలైజర్స్ వద్దకు వెళ్లాడు. ఒక బస్తా యూరియా కావాలని దుకాణం యజమానిని అడగగా అతడు స్టాక్ లేదని బదులిచ్చాడు. కాగా స్టాకున్నా లేదని చెబుతున్నాడంటూ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగబోయాడు. అక్కడే ఉన్న రైతులు అతనిని వారించి, అక్కడి నుంచి పంపేశారు. ఈ విషయమై దుకాణ యజమాని మాట్లాడుతూ...తనను యూరియా బస్తా అప్పుగా ఇవ్వాలని అడగ్గా, తాను నిరాకరించటంతో పురుగుల మందు తాగేస్తానని బెదిరించాడని చెప్పాడు. -
యూరియా కోసం పోలీస్ స్టేషన్ ముట్టడి
ఆదిలాబాద్(నార్నూర్): యూరియా కోసం రైతులు బారులు తీరారు. సరఫరా సరిగా లేకపోవడంతో ఆదిలాబాద్ జిలా నార్నూర్ మండల కేంద్రంలో ఆదివారం రైతులు ఆందోళనకు దిగారు. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో రైతులు ఆగ్రహించి అధికారుల తీరుకు నిరసనగా పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. మండలంలో పత్తి, సోయా పంటలను రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. ఈ పంటకు ప్రస్తుతం సీజన్లో యూరియా అవసరం ఎక్కువగా ఉంది. అయితే అందుకు సరిపడా సరఫరా చేసేందుకు వ్యవసాయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
యూరియా.. ఏ‘దయా’..!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో యూరియా కొరత తీవ్రమైంది. రవాణాల్లో జాప్యం ఒకవైపు.. వ్యాపారుల కృత్రిమ కొరత మరోవైపు.. వెరసి యూరియా నిల్వలు అందుబాటులో లేక రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రైవేటు ఏజెన్సీల వద్ద, ఎరువులు పంపిణీ చేస్తున్న సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రెండు బస్తాల యూరియా కోసం పనులన్నీ మానుకుని రోజంతా వరుసలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లోనూ ఇలాంటి దుస్థితే నెలకొంది. వచ్చిన అరకొర ఎరువులు ఏమాత్రం సరిపోకపోవడంతో అన్నదాతలు ఏకంగా రోడ్డెక్కాల్సి వస్తోంది. అధిక ధరకు విక్రయాలు.. జిల్లా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 6.40 లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటివరకు సుమారు 4.79 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగుచేశారు. ప్రధానంగా పత్తి, సోయా, వరి పంటలు ఎక్కువగా సాగు చేశారు. అత్యధికంగా పత్తి 3.10 లక్షల హెక్టార్లలో సాైగైంది. పత్తి సాగు చేస్తున్న రైతులు ప్రతి 20 రోజులకోసారి యూరియా వేస్తుంటారు. వారం రోజులుగా అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తుండటంతో యూరియా వేసేందుకు రైతులు ఉపక్రమించారు. దీంతో యూరియాకు డిమాండ్ పెరిగింది. ఈ మేరకు సహకార సంఘాల వద్ద యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులు తమ వద్ద ఉన్న యూరియా నిల్వలను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రైతుల అవసరాలను ఆసరగా చేసుకుని ఒక్కో బస్తాపై అదనంగా రూ.100 వరకు పెంచి అమ్ముతున్నారని విమర్శలున్నాయి. ఇదేమని ప్రశ్నించిన రైతులకు అసలు స్టాకే అందుబాటులో లేదని సమాధానమిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో అన్నదాతలు అధిక ధరలు చెల్లించక తప్పడం లేదు. సరఫరాలో జాప్యం.. ఈ ఖరీఫ్ సీజన్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాకు 1.26 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో జూలై నెలాఖరు నాటికి 54,989 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. కానీ.. కేవలం 45 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. అంటే యూరియా డిమాండ్, సరఫరాలో సుమారు పది వేల మెట్రిక్ టన్నులు తేడా ఉండటంతో కొరత తీవ్రమవుతోంది. జిల్లాలో ఆదిలాబాద్‌తోపాటు, మంచిర్యాలలో రైల్వేరేక్ పాయింట్లు ఉన్నాయి. కాకినాడ, కృష్ణపట్నం ప్రాంతాల నుంచి వచ్చే ఎరువులు ఈ రేక్‌పాయింట్ల వద్ద దిగుమతి చేసి, ఇక్కడి నుంచి మండలాలకు రవాణా చేస్తారు. గత నెలలో పుష్కరాల సందర్భంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడిపింది. ఈ క్రమంలో జిల్లాకు రావాల్సిన రేల్వే రేక్‌ల కేటాయింపుల్లో జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం సరఫరాపై పడుతోందే తప్ప, ఎక్కడా యూరియా కొరత లేదని పేర్కొంటున్నారు. నిల్వల కేటాయింపుల్లో చేతివాటం..? యూరియా నిల్వల కేటాయింపుల్లోనూ అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రైతుల నుంచి డిమాండ్ ఎక్కువగా బ్రాండ్ యూరియాను ప్రైవేటు డీలర్లకు కేటాయించి, డిమాండ్ అంతగా లేని బ్రాండ్ల యూరియాను సరకార సంఘాలకు కట్టబెడుతున్నారనే ఆరోపణలున్నాయి. అయితే.. ఏ బ్రాండ్ యూరియా అయినా పనితీరు ఒకేలా ఉంటుందని అధికారులు పేర్కొనడం గమనార్హం. జిల్లాలో వరి నాట్లు పూర్తిస్థాయిలో వేసుకోని ఈ పరిస్థితుల్లోనే కొరత ఈ స్థాయిలో ఉంటే, వరి నాట్లు వేసుకున్న పక్షంలో ఇబ్బందులు మరింత తీవ్రమవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. బఫర్ నిల్వల నుంచి సరఫరా చేస్తున్నాం.. యూరియాకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో ఇబ్బందులు వస్తున్నాయి. ఏడు వేల మెట్రిక్ టన్నుల బఫర్ నిల్వలున్నాయి. వాటి నుంచి ఎరువులు సరఫరా చేస్తున్నాము. రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్‌కు కొంత సమయం పడుతోంది. ఎక్కడా యూరియా కొరత లేదు. ఇంకా అవసరాల కోసం యూరి యా నిల్వలు వస్తున్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - రమేష్, ఇన్చార్జి, జేడీఏ సరిపడా యూరియా ఉండాలి.. రైతులకు సరిపడే యూరియాను ప్రభుత్వం అందుబాటులో ఉంచాలి. మార్కెట్లో యూరియా లభించడం లేదు. మా మండలంలో యూరియా దొరకకపోవడంతో ఇచ్చోడకు వెళ్లి ప్రైవేట్ వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి తీసుకొస్తున్నం. సరైన సమయంలో యూరియా లేకపోతే పంట దిగుబడి తగ్గుతుంది. అధికారులు స్పందించి యూరియా సరఫరా చేయాలి. - తొడసం రాజేశ్వర్, ఉప్పర్ పల్లి -
నాలుగేళ్ల వరకు యూరియా ధరలు పెరగవు
కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ ఆర్మూర్: రానున్న నాలుగేళ్ల వరకు యూరియా ధర పెరగకుండా చూస్తామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం తెలిపారు. యూరియా ఉత్పత్తిని సైతం పెంచుతున్నామన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడ్‌లో పుష్కర స్నానం చేశారు. అక్కడి నుంచి రెంజల్ మండలంలోని కందకుర్తికి వెళ్తూ ఆర్మూర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంలో భాగంగా మేకిన్ ఇండియా నినాదంతో స్థానిక పరిశ్రమ రంగంలో ఉత్పత్తిని పెంచుతున్నామన్నారు. ఫిరాయింపు చట్టాన్ని అమలు చేయాలి.. పార్టీలను ఫిరాయిస్తున్న ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ టీఆర్ఎస్లో చేరే ముందు రాజీనామా పత్రాన్ని స్పీకర్ కార్యాలయానికి పంపించానని అన్నారని గుర్తు చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకుంటే స్పీకర్ కార్యాలయానికి అతని రాజీనామా ఇప్పటి వరకు అందలేదని స్పష్టమైందన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ స్పష్టమైన సమాధానం చెప్పాలన్నారు. -
‘ఇ-కర్షక్’తో ఎరువుల కష్టాలకు చెక్!
ఖరీఫ్ సీజన్లో మీ ఊరికి రావాల్సిన యూరియా దారి మళ్లిందా? వ్యవసాయాధికారులకు తెలిసి కూడా మిన్నకుండి పోయారా? మీకు దక్కాల్సిన ఎరువుల్ని నోరున్నోళ్లు తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా? అవసరం లేదు, ఇకపై ఆ పరిస్థితి రాదంటున్నారు ఆంధ్రప్రదేశ్ సహకార శాఖ కమిషనర్, డెరైక్టర్ ఎంవీ శేషగిరి బాబు. ‘ఈ-కర్షక్’తో ఎరువుల కష్టాలకు చెక్ పెట్టొచ్చంటున్నారాయన. అంతేకాదు.. ఏ పొలంలో భూసారం ఎంత? ఎంత ఎరువేశారు? వంటి వివరాలూ తెలుసుకోవచ్చని.. ఇటు ప్రభుత్వానికి, అటు రైతులకూ ఈ- కర్షక్ ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు. కేంద్ర బడ్జెట్ లెక్కల ప్రకారం ఎరువుల కంపెనీలకు ప్రభుత్వం ప్రతి ఏటా చెల్లిస్తున్న సబ్సిడీ మొత్తం సుమారు రూ. 45 వేల కోట్లు. అందులో మన రాష్ట్ర వాటా దాదాపు రూ. పది వేల కోట్లు. అంత పెద్ద మొత్తంలో సబ్సిడీ చెల్లించి ఎరువుల్ని కొంటున్నా ఎరువుల కోసం ప్రతి ఊళ్లో క్యూలే, కొట్లాటలే. మరేమిటీ దీనికి పరిష్కారం? ఈ ఆలోచనల్లోంచి పుట్టిందే ‘ఎలక్ట్రానిక్-కర్షక్’(ఈ-కర్షక్) విధానం. రైతుల కష్టాలు, కడగండ్లు, లాఠీచార్జీలతో చలించిన శేషగిరిబాబు మానస పుత్రికే ఈ పద్ధతి. ఇదీ ఈ-కర్షక్’ పని తీరు... ఊళ్లల్లో ఉండే ఎరువుల షాపులకు మామూలుగా పరిధంటూ ఉండదు. ఎవరైనా రావొచ్చు, ఎంతైనా కొనుక్కోవచ్చు. ఫలితంగా అయిన వాళ్లకు ఆకుల్లో కానివాళ్లకు మూకుళ్లలో... ఈ గడ్డు పరిస్థితిని నివారించి అందరికీ ఎరువుల్ని అందుబాటులోకి తేవాలంటే ఆ షాపులకు నికర పరిధి ఉండాలి. దుకాణం సైజును బట్టి గ్రామాలను, రైతుల సంఖ్యను కేటాయిస్తారు. ఈ వివరాలన్నింటినీ కంప్యూటర్లో నమోదు చేసి ఆయా డీలర్లు, వ్యవసాయ విస్తరణాధికారుల మొబైల్ ఫోన్లతో అనుసంధానం చేస్తారు. ఆ షాపు పరిధిని అనుసరించి ఎరువుల్ని సరఫరా చేస్తారు. ఇది జరిగిన వెంటనే ఆ వివరాలన్నీ ఎరువుల వ్యవహారాలను చూసే విభాగం అధికారుల వద్దకు చేరతాయి. వ్యవసాయాధికారులిచ్చే సంకేతం ఆధారంగా ఏయే డీలర్ వద్ద ఎంతెంత సరుకు ఉందో గుర్తించవచ్చు. రిటైల్ డీలర్లు, మండల, జిల్లా స్థాయి వ్యవసాయాధికారుల మొబైల్ ఫోన్లతో రైతుల వివరాలున్న కంప్యూటర్ సర్వర్లను అనుసంధానం చేసినందున ఎరువులతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఎప్పటికప్పుడు సమాచారం చేరుతుంది. ఎరువుల వివరాలన్నీ ఒకే చోట.. రైతు వివరాలు నమోదు చేసేటప్పుడే కిసాన్ కార్డు లేదా ఆధార్ కార్డును కంప్యూటర్‌తో అనుసంధానం చేస్తారు. రైతుకున్న భూమి, నేల స్వరూపం, ఏయే రకం ఎరువులు ఎంతెంత అవసరం, తీసుకున్నారా లేదా? వంటి వివరాలన్నీ తనకు కేటాయించిన షాపుతో పాటు వ్యవసాయాధికారుల వద్ద నమోదై ఉంటాయి. రైతులు దీన్ని బట్టి ఎరువులు కొనుక్కోవచ్చు. మామూలు పరిస్థితుల్లో ప్రతి ఎకరాకు నాలుగున్నర బస్తాల ఎరువు అవసరమవుతుందని ఒక లెక్క. ఒకవేళ ఎవరైనా తనకున్న పొలానికి మించి ఎరువు కొనుక్కుంటే ఇట్టే పసిగట్టేయవచ్చు. ఎందుకు కొనుక్కున్నారో, ఎక్కడ వాడారో తెలుసుకోవచ్చు. ఏదైనా చేలో మోతాదుకు మించి వాడితే దాన్ని కనిపెట్టి రైతుకు అవగాహన కల్పించవచ్చు. తనకు కేటాయించిన దుకాణానికి బదులుగా మరెక్కడైనా రైతు ఎరువు కొనుక్కొని ఉంటే ఆ తర్వాత సరఫరా చేసే సరుకులో సర్దుబాటు చేయవచ్చు. సర్వర్ నుంచి ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ వెళుతుంది. అవసరమైన చోటుకు పంపడం, అవసరం లేని చోటుకు ఆపడం చేయవచ్చు. రైతులకేమిటీ ప్రయోజనం?. ఏయే డీలర్ వద్ద ఎంతెంత ఎరువు నిల్వలున్నాయో వ్యవసాయ శాఖకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. డీలర్లు ఎరువుల కోసం ఎదురుచూడకుండా వారికిచ్చిన పరిధి మేరకు సరుకు దానంతటదే వస్తుంది. తనకున్న పొలానికి అనుగుణంగా డీలర్ వద్ద సరుకుంటుంది గనుక రైతులు హడావుడి పడాల్సిన అవసరం లేదు. కచ్చితంగా దొరుకుతుందన్న భరోసా ఉన్నప్పుడు సమస్యలు ఎదురుకావు. అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్‌తో రూ. వందల కోట్ల సబ్సిడీ దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు. భూసారం నష్టపోకుండా చూడొచ్చు. భూమి, రైతు, డీలర్లు, షాపులు, ఎరువుల కంపెనీలు, గ్రామాలతో పాటు భూసారం వివరాలన్నీ కూడా ఈ-కర్షక్ వ్యవస్థలో తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. కౌల్దార్లకూ ఎరువులివ్వొచ్చు.. రుణ అర్హత పత్రాలు కలిగిన కౌలుదారులకు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, రైతు మిత్ర గ్రూపుల్లో ఉండే వారి వివరాలను కూడా కంప్యూటర్లో నమోదు చేయవచ్చని శేషగిరిబాబు చెప్పారు. వారి వివరాలు, కౌలుకు తీసుకున్న భూమి ఆధారంగా ఆయా గ్రామాల్లో డీలర్లకు అనుసంధానం చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చని అభిప్రాయపడ్డారు. ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను, చట్టవిరుద్ధంగా దాయడాన్ని నివారించవచ్చు. నాబార్డ్ సాయంతో కేవలం రూ. పది లక్షలతో ‘ఈ-కర్షక్’ వ్యవస్థను రూపొందించినట్టు వివరించారు. పశ్చిమ గోదావరి నుంచి ప్రస్థానం... పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని 18 ఎరువుల దుకాణాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి సత్ఫలితాలను సాధించారు. ఇప్పుడు ఈ-కర్షక్ వ్యవస్థను అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. - ఆకుల అమరయ్య, ‘సాక్షి’ ప్రతినిధి ఎంవీ శేషగిరిబాబు -
అదే హైరానా!
గజ్వేల్: యూరియా కోసం జిల్లాలో ఇప్పటినుంచే హైరానా నెలకొన్నది.. ప్రతి ఏటా భారీ క్యూలైన్లు.. చెప్పుల దారులు.. తిండితిప్పలు మాని పిల్లాపాపలతో కలిసి నిరీక్షణ.. ఒక్క బస్తా కోసం రోడ్డెక్కి లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితి. ఇవీ ప్రతి ఖరీఫ్‌లో యూరియా కోసం రైతన్న పడుతున్న పాట్లు.. విత్తనాల వేయడం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న దృష్ట్యా ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందేమోనన్న భయంతో ముందస్తుగా యూరియాను కొనుగోలు చేస్తున్నారు.. గజ్వేల్‌లో వ్యాపారి ఓ అడుగు ముందు కేసి యూరియా బస్తా ధర అదనంగా రూ.30 వసూలు చేయడంతో వెలుగులోకి వచ్చింది. జిల్లాలో ఈసారి ఖరీఫ్‌లో 1.80లక్షల టన్నుల యూరియా, కాంప్లెక్స్, డీఏపీ ఎరువులు అవసరం. ఇందులో భాగంగానే యూరియా 87వేల టన్నుల అవసరమని భావిస్తుండగా ఇప్పటివరకు 31వేల టన్నుల యూరియా విడుదలైంది. మూడేళ్లుగా వ్యవసాయ శాఖ ప్రణాళికలోపం కారణంగా యూరియా కొరత ఏర్పడి ఒకటిరెండు సంచులకోసం రైతులు పోలీస్స్టేషన్ల వద్ద తిండి తిప్పలు మాని ఉదయ నుంచి రాత్రివరకు పడిగాపులు కాయాల్సి వచ్చింది. అయినా దొరక్క నిత్యం రోడ్డెక్కాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సకాలంలో యూరియా వేయలేక భారీగా పంట నష్టానికి గురయ్యారు. ప్రస్తుతం గతం తాలూకు చేదు అనుభవాలు రైతులను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వారంతా ముందస్తు కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. గజ్వేల్ పట్టణంలో నిత్యం యూరియాతోపాటు కాంప్లెక్స్ ఎరువుల వందలాది క్వింటాళ్ల విక్రయాలు సాగుతున్నాయి. ఇక్కడికి స్థానిక రైతులే కాకుండా దౌల్తాబాద్, తొగుట, చేగుంట, వరంగల్ జిల్లా చేర్యాల, నల్గొండ జిల్లా రాజపేట మండలాలకు చెందిన రైతులు ఇక్కడ ఎరువుల కొనుగోలు చేస్తున్నారు. రైతు ఫిర్యాదుతో వెలుగులోకి.. గజ్వేల్‌లో యూరియా బ్లాక్ మార్కెట్ అప్పుడే మొదలైంది. మంగళవారం ఓ రైతు ఫిర్యాదుతో ఇది వెలుగులోకి వచ్చింది. గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లికి చెందిన రైతు నరేందర్‌రెడ్డికి పట్టణంలోని వెంకటరమణ ట్రేడర్స్‌కు చెందిన యజామాని యూరియా రూ.298కి విక్రయించాల్సిందిపోయి అదనంగా రూ.32 ఇస్తేనే యూరియా ఇస్తానని, అంతేకాకుండా 15 కాంప్లెక్స్ 20-20 ఎరువు కొనుగోలు చేస్తే 30 యూరియా బస్తాలు ఇస్తానని లింకు పెట్టాడు. దీంతో బాధిత రైతు ఫిర్యాదు చేయడంతో స్థానిక వ్యవసాయాధికారి ప్రవీణ్ దీనిపై విచారణ చేపట్టి సదరు దుకాణంలో అమ్మకాలను నిలిపివేయడమే కాకుండా నోటీసులు జారీ చేశారు. బ్లాక్‌మార్కెట్‌ను సహించం.. యూరియా ఎంత అవసరముంటే అంత స్టాకు తెప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు పాల్పడితే మాత్రం సహించేది లేదు. కఠిన చర్యలు తప్పవు. -హుక్యానాయక్, జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్. -
యూరియా.. బ్లాక్..!
యూరియా లేదు.. జిల్లాలో చాలా వరకు ఎరువుల దుకాణాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న మాట. ఖరీఫ్ మిగిల్చిన అప్పుల నుంచి బయట పడేందుకు ఎంతో ఆశగా రబీలోకి అడుగుపెట్టిన రైతన్నకు ఇప్పుడు యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియాకు కొదవలేదని ఓ వైపు అధికారులు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వ్యాపారులు యూరియా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించి అందినకాడికి దండుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో బస్తా యూరియా ధర ప్రస్తుతం రూ.370 పలుకుతుంది. ఇంత జరుగుతున్నా వ్యవసాయ శాఖ అధికారులు నోరు మొదపకపోవడం గమనార్హం. హాలియా : జిల్లాలో రబీలో రైతులు లక్ష హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. అందులో నాగార్జునసాగర్ ఎడమ కాల్వతో పాటు, బోరు బావుల కింద ఇప్పటి వరకు 85 వేల హెక్టార్లలో వరి సాగు చేయగా మరో 15 వేల హెక్టార్లలో ఆరుతడి పంటలు వేశారు. ఈ నెలాఖరు నాటికి వరి మరో 30 నుంచి 50 వేల హెక్టార్లలో సాగు చేసే అవకాశం ఉంది. అందుకు గాను జిల్లాకు 9నుంచి 10 లక్షల బస్తాల యూరియా అవసరం. అదే విధంగా జిల్లాలో లక్ష ఎకరాల్లో పండ్ల తోటలున్నాయి. వాటికి 20 వేల టన్నుల యూరియా అంటే 4 లక్షల బస్తాల యూరియా అవసరం. ఇదే అదునుగా భావించిన హోల్‌సేల్ డీలర్లు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్తా యూరియా రూ. 282 ఉండగా ప్రస్తుతం రూ.370కు విక్రయిస్తున్నారు. రూ. 295 ఎమ్మార్పీ ఉన్న నీమ్ యూరియా రూ.385 కు అమ్ముతున్నారు. ఫర్టిలైజర్ దుకాణ వ్యాపారులు రైతులను నిలువుదోపిడీ చేస్తున్న సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోల్‌సేల్ డీలర్లదే హవా..! జిల్లాలో ఆరుగురు హోల్‌సెల్ డీలర్లు ఉన్నారు. యూరియా అమ్మకంలో జిల్లాలో వీరిదే హవా. కంపెనీ నుంచి రైల్ ర్యాక్ రాగానే వ్యవసాయశాఖ అధికారులు హోల్సెల్స్ డీలర్ల ద్వారా రిటైల్డ్ డీలర్‌కు యూరియా విక్రయించాల్సి ఉంది. కానీ హోల్‌సేల్ డీలర్లు కంపెనీ సేల్స్ ఆఫీసర్‌ను, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను మేనేజ్ చేసి రిటైల్డ్ డీలర్లకు విక్రయిస్తున్నట్లు చూపించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బస్తాకు రూ.10 నుంచి రూ.20 పైన లాభం చూసుకొని మధ్య దళారులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. వారు తమ లాభం తాము చూసుకొని రిటైల్డ్ వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. రిటైల్డ్ వ్యాపారులు ర్యాక్ పాయింట్ నుంచి తమ దుకాణానికి రవాణా, హమాలీ ఖర్చు, లాభం చూసుకొని యూరియా విక్రయిస్తుండటంతో బస్తా యూరియా రూ.370 పలుకుతుంది. సహకార సంఘాల ద్వారా విక్రయించాలని రైతుల డిమాండ్ బహిరంగ మార్కెట్లో యూరియా ధరకు రెక్కలు రావడంతో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు సహకార సంఘాల ద్వారా విక్రయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఫర్టిలైజర్ల ద్వారా విక్రయిస్తే వ్యాపారులు హోల్‌సెల్ ట్రేడర్లు, మద్యదళారీ, ఎగుమతి, దిగుమతి, హమాలీ, ట్రాన్స్పోర్ట్ ఇతరత్ర లాభం చూసుకొని విక్రయిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అదే సహకార సంఘాల ద్వారా విక్రయిస్తే ఎమ్మార్పీ రేట్‌కు విక్రయించవచ్చని, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారు - అలుగుల రమణారెడ్డి, రైతు, కొత్తపల్లి హాలియాలో యూరియాను వ్యాపారులు అధిక ధరకు విక్రయిస్తున్నారు. నాగార్జున యూరియా బస్తాకు రూ. 350 పైమాలే. బిల్లులో మాత్రం ఎమ్మార్పీ రేట్ రాస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే మా వద్ద యూరియా లేదంటూ వ్యాపారులు సమాధానం ఇస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎమ్మార్పీ ధరలకు యూరియా అమ్మేవిధంగా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా సహకార సంఘాల ద్వారా యూరియా విక్రయిస్తే రైతులకు ప్రయోజనంగా ఉంటుంది. -
ప్రతి రైతుకు యూరియా అందించాలి
వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున కొరిటెపాడు (గుంటూరు): జిల్లాలో యూ రియా కొరతను అరికట్టి ప్రతి రైతుకు అందేలా చూడాలని వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ వి.శ్రీధర్‌ను కోరారు. పలు సొసైటీల అధ్యక్షులు, రైతులతో కలిసి శుక్రవారం ఆయన జేడీని కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరతలేదని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ వారికి చెందిన సొసైటీలకు మాత్రమే యూరియాను అందిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పార్టీలకు అతీతంగా అన్ని సొసైటీలకు సరఫరా చేసి రైతులకు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. జేడీఏ శ్రీధర్ మాట్లాడుతూ అన్ని సొసైటీలకు యూరియాను సరఫరా చేస్తామని చెప్పారు. యూరియాను అధిక ధరలకు అమ్మే సొసైటీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
యూరియా.. ఎమ్మార్పీకి ఇస్తే ఒట్టు
నంద్యాల: మహో ప్రభో యూరియా లభించడం లేదు.. వ్యాపారులు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు చర్యలు తీసుకోండి అంటూ.. రైతులు గగ్గోలు పెడుతున్నా అధికారులు చలించడం లేదు. నంద్యాల పరిధిలో యూరియా డీలర్లు, వ్యాపారులు యథేచ్ఛగా బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె, నంద్యాల పట్టణంలో దాదాపు 20కి పైగా ఎరువుల దుకాణాల్లో యూరియాను విక్రయిస్తున్నారు. రబీలో వరిసాగును చేయరాదని ప్రభుత్వం స్పష్టంగా ఉత్తర్వులు జారిచేసింది. దీంతో రైతులు కూడా ఆవాలు, కొర్ర, మినుము, రాగి, మొక్కజొన్న తదతర పంటలను సాగు చేస్తున్నారు. నంద్యాల ఏడీఏ పరిధిలోని నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది, గడివేముల, పాణ్యం, బనగానపల్లె మండలాల్లో దాదాపు లక్షకు పైగా ఎకరాల్లో ఆరుతడి పంటలను సాగుచేస్తున్నారు. అత్యవసరంగా ఒక్కొక్క ఎకరాకు కనీసం 3,4 బస్తాల యూరియాను అత్యవసరంగా సరఫరా చేస్తేతప్ప రబీ సీజన్‌ను గట్టెక్కలేమని రైతులు పేర్కొంటున్నారు. కేటాయింపు ఎంత.. అమ్మేది ఎంత ఏ సొసైటీకి ఎంత యూరియా కేటాయించింది వ్యవసాయాధికారులు ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యారు. ఈ విషయం బయటికి పొక్కితే సంబంధిత గ్రామాలకు చెందిన రైతులు సొసైటీ దగ్గరికి వెళ్లి నిలదీసే అవకాశం ఉంటుందని భావిస్తూ నంద్యాల ప్రాంతంలోని అధికార పార్టీకి చెందిన సొసైటీ సభ్యులు అధికారుల నోరును నొక్కినట్లు తెలుస్తుంది. గతంలో అక్రమార్కులపై నమోదు అయిన కేసుల పట్ల అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో అక్రమార్కులకు ఎలాంటి భయం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు మాత్రం ఆరు దుకాణాల్లో యూరియ అక్రమ వ్యాపారంపై తీవ్రస్థాయిలో స్పందించి శాశ్వతంగా వాటిని రద్దుచేయాలని సిఫారసు చేసినా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడంతో అనుమానాలకు దారితీస్తోంది. తూతూ మంత్రంగా దాడులు: యూరియా 50 కేజీల బస్తాను రూ.284కు విక్రయించాలని కంపెనీలు నిర్ణయించాయి. ఈ ధరకు ఏ ఒక్క వ్యాపారి విక్రయించడం లేదు. అధికారులు కూడా దుకాణాలకు యూరియాను కేటాయించలేదు. కేవలం సహకార సంఘాలకు మాత్రమే కేటాయించారు. రెండు, మూడు సహకార సంఘాలు మినహాయిస్తే మిగిలిన సహకార సంఘాలు తమకు కేటాయించిన 40 టన్నుల యూరియాను నంద్యాల పట్టణంలోని ఎరువుల దుకాణాల యజమానులకు రూ.40 నుంచి రూ.50ల మధ్యన అధిక ధరలను తీసుకొని విక్రయించారు. దీనిపై వ్యాపారి మరో రూ.50లు అదనంగా చేర్చడంతో మొత్తం రూ.100కు పైగా అధిక ధర చేరుకుంది. రెండు రోజుల క్రితం రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి మాణిక్యాలరావుకు స్థానిక బీజేపీ నాయకుడు తూము శివారెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదు కూడా చేశారు. అధిక దరలకు యూరియాను విక్రయిస్తున్నారని గతంలో జేడీఏకు ఫిర్యాదు చేసినా స్థానిక అధికారుల్లో స్పందన లేదు. మంగళవారం తహశీల్దార్ శివరామిరెడ్డి, ఏడీఏ సుధాకర్, ఏఓ చెన్నయ్య ఆధ్వర్యంలో దాడులను నిర్వహించారు. అయితే విక్రయాలు జరిగే దుకాణాలు కాకుండా లేని దుకాణాలను తనిఖీ చేసినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని స్థానిక ఏడీఏ సుధాకర్‌ను ప్రశ్నించగా యూరియా అక్రమ అధిక ధరలను నివారించడానికి దాడులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.