
రైతులకు యూరియా కోసం పడిగాపులు తప్పడం లేదు. ఆదివారం యూరియా పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్‌తోపాటు పలు గ్రామాలకు చెందిన రైతులు తెల్లవారు జామున 3 గంటలకే చెన్నారావుపేట సొసైటీ ఆవరణకు చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి పోలీసు బందోబస్తు మధ్య యూరియా అందించారు. అమీనాబాద్ సహకార సంఘం వద్దకు కూడా రైతులు అధికంగా తరలివచ్చారు. – చెన్నారావుపేట
Comments
Please login to add a commentAdd a comment