
సాక్షి, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తికి చెందిన ఫణికర మల్లయ్య తన కుమార్తె వివాహానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలసి వివాహ పత్రిక అందజేశారు. ఈ మల్లయ్య ఎవరో గుర్తుందా?.. 2008లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు రాయపర్తి పర్యటనకు వచ్చినప్పుడు మల్లయ్యను ‘ఏం గావాలె మల్లయ్యా’ అని పలకరించాడు. ‘నాకేమీ వద్దు.. మా తెలంగాణ మాకియ్యుర్రి... తెలంగాణ వస్తేనే మా బతుకులు బాగుపడతై’ అంటూ బదులిచ్చాడు.