
సాక్షి, జనగాం : రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. బస్తా యూరియా కోసం గంటల కొద్ది లైన్లలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం ఆరు గంటల నుంచే క్యూలైన్ల వద్ద చెప్పులతో రైతులు బారులు తీరుతున్నారు. పాలకుర్తి మండలం ఎఫ్‌ఎస్‌సీఎస్ కోపరేట్ బ్యాంకు వద్ద యూరియా బస్తాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. కాళ్లు తిమ్మిర్లు పట్టేలా గంటల పాటు వరుసలో నిలబడి ఉన్నా ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు.
ఒక లారీ లోడ్‌లో 506 యూరియా బస్తాలు వస్తే రోజు వెయ్యి మంది నుoచి 1200 మంది రైతులు బస్తాలకోసం వస్తున్నారు. తమ పరిస్థితిని గుర్తించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని, యూరియా బస్తాల కొరత లేకుండా అన్ని ప్రాంతాలకు రవాణా చేసి అధికారులు ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment