
జనగామ జిల్లా: దేవునూర్ అటవీ భూముల కబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కడియం శ్రీహరి సవాల్ విసిరారు. 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో తాను ఏనాడు అవినీతికి పాల్పడలేదని, ఒకవేళ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య చేసిన ఆరోపణలపై స్టేషన్‌ఘన్‌పూర్‌లో ధ్వజమెత్తారు కడియం శ్రీహరి.
‘ దమ్ముంటే రాజయ్య నా సవాల్‌ను స్వీకరించాలి. దళితబంధులో నువ్వు చేసిన అవినీతిని ప్రజాక్షేత్రంలో నిరూపిస్తా. సవాల్‌లో ఓడితే.. నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా రాజయ. మరోసారి చౌకబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదు. అవినీతి అక్రమాలకు పుట్ట కేసీఆర్ కుటుంబం. బీఆర్‌ఎస్, బీజేపీ విమర్శలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలి’ అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment