THATIKONDA RAJAIAH
-
‘సవాల్లో ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటావా’
జనగామ జిల్లా: దేవునూర్ అటవీ భూముల కబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కడియం శ్రీహరి సవాల్ విసిరారు. 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో తాను ఏనాడు అవినీతికి పాల్పడలేదని, ఒకవేళ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య చేసిన ఆరోపణలపై స్టేషన్‌ఘన్‌పూర్‌లో ధ్వజమెత్తారు కడియం శ్రీహరి.‘ దమ్ముంటే రాజయ్య నా సవాల్‌ను స్వీకరించాలి. దళితబంధులో నువ్వు చేసిన అవినీతిని ప్రజాక్షేత్రంలో నిరూపిస్తా. సవాల్లో ఓడితే.. నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా రాజయ. మరోసారి చౌకబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదు. అవినీతి అక్రమాలకు పుట్ట కేసీఆర్ కుటుంబం. బీఆర్ఎస్, బీజేపీ విమర్శలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలి’ అని కడియం శ్రీహరి పేర్కొన్నారు. -
డీజే రాజయ్య
-
మళ్లీ బీఆర్ఎస్లోకి తాటికొండ రాజయ్య.. కడియంకు చెక్ పెట్టేందుకు!
లోక్‌సభ ఎన్నికల ముంగిట తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల వేళ రాజకీయ వలస పక్షులు పార్టీలు మారుతున్నాయి. సీట్ల కోసం, అధికారం కోసం నేతలు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు దూకేస్తున్నారు. కండువాలు మార్చేందుకు కాఫీ తాగినంత టైం కూడా తీసుకోవడం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి జంపింగ్ జపాంగుల పర్వం జోరందుకుంది తాజాగా వరంగల్‌కు బీఆర్ఎస్కు చెందిన ఓ కీలక నేత పార్టీని వీడితే మరో ముఖ్య నేత మరోసారి చేరేందుకు సిద్దమయ్యారు. అసెంబ్లీ టికెట్ దక్కపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీకి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే రాజయ్యతో హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ నేతలు టచ్‌లోకి వెళ్లారు. శనివారం సాయంత్రం రాజయ్య నేరుగా కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఒకవేళ కడియం శ్రీహరి వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే.. ఆయన మీద పోటీగా రాజయ్యను బరిలోకి దింపేందుకు బీఆర్ఎస్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే పార్టీలో చేరికపై తన కార్యకర్తలతో చర్చించి చెబుతానని రాజయ్య చెప్పినట్లు సమాచారం. చదవండి: కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా వాళ్లను మళ్లీ పార్టీలో చేర్చుకోం: కేటీఆర్ కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్‌లో చేరలేదు. మరోవైపు ఆయన రాజీనామాను కూడా కేసీఆర్ ఆమోదించలేదు. మరోవైపు అనూహ్యంగా వరంగల్ ఎంపీ స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించారు. తండ్రితో కలిసి ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ తాజా నేపథ్యంలో తిరిగి రాజయ్య పేరు తెరపైకి వచ్చింది. తన ప్రత్యర్ధి ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరనుండటంతో మళ్లీ సొంతగూటికి వచ్చేందుకు రాజయ్య సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాడికొండ రాజయ్యను ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. -
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తాటికొండ రాజయ్య
-
బీఆర్ఎస్కు తాటికొండ రాజయ్య గుడ్‌బై
సాక్షి, వరంగల్: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిన గులాబీ పార్టీకి.. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గుడ్‌బై చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య శనివారం రాజీనామా చేశారు. అయితే వరంగల్ పార్లమెంట్ సీటు ఆశించిన రాజయ్యకు.. పార్టీ అధిష్టానం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్యకు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ నిరాకరించింది. రాజయ్యకు ఎంపీ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చి.. మాజీ ఎమ్మెల్యే కడియం శ్రీహారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫాం అందించింది. ఈ ఎన్నికల్లో కడియం శ్రీహరి విజయం కూడా సాధించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. అయితే ముందుగా మాటిచ్చిన పార్లమెంట్ స్థానంపై బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఎలాంటి భరోసా రాకపోవడంతో రాజయ్య అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వచ్చే రోజుల్లో కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూసింది. కానీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్కు ఊహించని షాక్ ఇవ్వడంతో కేవలం ప్రతిపక్షానికి పరిమితమైంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అయినా అత్యధిక సీట్లు గెలుచుకోవాలని యత్నిస్తోంది. ఇందుకు తగ్గట్లే అధికార కాంగ్రెస్విపై విమర్శలు గుప్పిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య పార్టీని వీడటం.. ఆ పార్టీకి షాక్‌గానే చెప్పవచ్చు. చదవండి: కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసు.. ఆశావహుల్లో టెన్షన్! -
స్టేషన్ ఘన్‌పూర్‌లో ఏపార్టీ గెలిస్తే ఆ పార్టీకే అధికారం
-
ద్రోహుల చేతిలోకి కాంగ్రెస్.. ఎమ్మెల్యే టికెట్‌కు రూ.5 కోట్లు: మంత్రి హరీష్
సాక్షి, జనగాం: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్రోహుల చేతిలోకి వెళ్ళిందని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. అవినీతిపరుల పార్టీగా మారిందని విమర్శించారు. సొంత నియోజకవర్గాల్లో గెలవలేని కాంగ్రెస్ నేతలు తమపై పోటీ చేస్తారట అని ఎద్దేవా చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మంత్రులు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరితో సయోధ్య కుదిర్చారు. ఇద్దరితో కలిసి సమావేశానికి హాజరైన హరీష్ రావు.. ఓటుకు నోటు కేసులో పట్ట పగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు. రూ. 50 కోట్లు పెట్టి టీపీసీసీ పదవిని కొనుక్కున్నాడని ఆ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డే అంటున్నాడని మండిపడ్డారు. ఐదు కోట్లు, పదేకరాల భూమికి ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాంగ్రెస్‌కు సగం సీట్లలో అభ్యర్థులు లేరని అన్నారు హరీష్ రావు. పక్క పార్టీల వైపు చూసే పరిస్థితి ఆ పార్టీలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మోసానికి మారుపేరని, మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి మహిళలను ఏడిపిస్తుందని విమర్శించారు. కడియం శ్రీహరి, రాజయ్య నాయకత్వంలో భారీ మెజారిటీతో బిఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. తెలంగాణలో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్, బీఆర్ఎస్ సెంచరీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: telangana: శాసనసభకు అయిదు కంటే ఎక్కువసార్లు ఎన్నికైంది వీరే.. -
కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవుల వల..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను, ఓ కార్పొరేషన్‌కు వైస్ చైర్మన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యకు కీలక పదవులు లభించాయి. వీరితో పాటు ఇటీవల పారీ్టలో చేరిన ఉప్పల వెంకటేశ్ గుప్తా, నందికంటి శ్రీధర్‌కు కూడా అధికారిక పదవులు దక్కాయి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆరీ్టసీ) చైర్మన్‌గా, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య రైతుబంధు సమితి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇక ఉప్పల వెంకటేశ్ గుప్తా (కల్వకుర్తి)ను మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా, నందికంటి శ్రీధర్ (మల్కాజిగిరి)ను ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. రాజీ ఫార్ములాలో భాగంగానే..! బీఆర్ఎస్ టికెట్లు దక్కని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యకు రాజీ ఫార్ములాలో భాగంగా ఈ పదవులు దక్కాయి. జనగామలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్ ఘనపూర్‌లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మల్కాజిగిరి కాంగ్రెస్ టికెట్ ఆశించిన నందికంటి శ్రీధర్ నాలుగు రోజుల క్రితమే బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు టికెట్ ఇచ్చినా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో..ఆ పార్టీకి చెందిన నందికంటి శ్రీధర్‌ను బీఆర్ఎస్లోకి ఆహ్వానించి తాజాగా ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. మరోవైపు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా బీఆర్ఎస్ను వీడిన నేపథ్యంలో అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా ఉప్పల వెంకటేశ్‌కు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ పదవి అప్పగించారు. చదవండి: సిక్కిం వరదల్లో నిజామాబాద్ ఆర్మీ జవాన్ మృతి -
బీ ఫాం నాదే: రాజయ్య సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జనగామ జిల్లా: కేటీఆర్ చొరవతో.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ విభేదాలు ఓ కొలిక్కి వచ్చాయనుకుంటున్న సమయంలోనే ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బాంబు పేల్చారు. బీ ఫాం తనదేనని ప్రకటించుకున్న ఆయన.. ఒకవేళ సీటు కేటాయించని పక్షంలో పోటీ చేసే విషయం కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసిపోయారనుకునేలోపే ఎమ్మెల్యే రాజయ్య బాంబు పేల్చడం గమనార్హం. లింగాలగణపురం మండలం వడ్డీచర్లలో డా.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తాటికొండ రాజయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డప్పుకొట్టి దరువేశారు. డప్పు, డోలు కొట్టి కార్యకర్తలను ఉత్సాహాపరిచారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేటీఆర్ విదేశాలకు వెళ్లే ముందు కలిశానని, అప్పుడు టికెట్ నీకే అని చెప్పారని ప్రస్తావించారు. కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడు కేటీఆర్ లేకపోవడంతో మళ్లీ రెండు రోజుల క్రితం సమావేశమైనట్లు చెప్పారు. తనకు ఎమ్మెల్సీ గానీ, ఎంపీగా కానీ అవకాశం ఉందని చెప్పినట్లు పేర్కొన్నారు. అప్పటివరకు స్టేట్ కార్పొరేషన్ నామినేటెడ్ పదవి తీసుకొమ్మని చెప్పారని ప్రస్తావించారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఫోటోలు దిగినట్లు తెలిపారు. ఆ ఫోటోకు ఊహాగానాలతో మీడియాలో వచ్చిన కథనాలతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొందన్నారు ఎమ్మెల్యే రాజయ్య. కడియంతో ఎలాంటి చర్చలు.. సంప్రదింపులు జరగలేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బీ ఫాం తప్పకుండా తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక వేల టికెట్ రాకపోతే బరిలో నిలిచేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. సర్వే రిపోర్ట్లు తెచ్చుకొని చేర్పులు మార్పులు ఉంటాయని చెప్పినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ బీఫామ్‌లు ఇవ్వలేదన్న రాజయ్య.. కొన్ని నియోజక వర్గాలలో డిస్టబెన్స్ జరుగున్నాయని తెలిపారు. ‘2014లో ఎంపీ అభ్యర్థిగా కడియం, ఎమ్మెల్యేగా నేను అధిష్టానం నిర్ణయం ప్రకారం కలిసి పని చేశాం. ఇప్పుడు కూడా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేస్తా. జనవరి 17 వరకు ఎమ్మెల్యేగా ఉంటా. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలి. కార్యకర్తలు ఆందోళన చెందకుండా పని చేయండి. వరంగల్‌లో దామోదర రాజనర్సింహతో కలిసి ఓ సమావేశంలో పాల్గొన్నప్పుడు రాజయ్య కాంగ్రెస్‌లోకి వెల్తున్నారని కథనాలు రాశారు. ఊహాగానాలతో మీడియాలో కథనాలు రాయడాన్ని ఖండిస్తున్నాను’ అని రాజయ్య పేర్కొన్నారు. -
ఆరు నూరైనా ప్రజాక్షేత్రంలోనే ఉంటా..
జనగాం: టికెట్ రాదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. జమిలి ఎన్నికలు వస్తే అభ్యర్థుల మార్పు తప్పనిసరిగా ఉంటుందని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి నుంచి వీరారెడ్డి తండాకు బీటీ రోడ్డు, గబ్బెటలో సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అశ్వరావుపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 22 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత వస్తుందని, జమిలి ఎన్నికలు జరిగే అవకాశముందని మంత్రి కేటీఆర్ చెప్పినట్లు పేర్కొన్నారు. ‘అటుది ఇటు అయితది.. ఎటైనా అయితది.. ఆరు నూరైనా ప్రజాక్షేత్రంలోనే ఉంటా.. నాకు మంచి రోజులు వస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు.. నాయకులు, కార్యకర్తలు సంయమనంతో ఉండాలి.. అంతా మంచే జరుగుతుంది’ అని అన్నారు. సర్పంచ్ సురేందర్‌రెడ్డి, జెడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు బొల్లం అజయ్, బీఆర్ఎస్ నాయకులు కుమార్‌గౌడ్, వారాల రమేష్, ఎంపీటీసీలు సుల్తాన్ దెవేందర్‌రెడ్డి, శాగ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, సర్పంచ్ వివాదంలో కొత్తమలుపు
-
వేధింపుల ఎపిసోడ్.. సర్పంచ్ నవ్యకు నోటీసులు
సాక్షి, వరంగల్: స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య- జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య నెలకొన్న వేధింపుల ఎపిసోడ్ కొత్తమలుపు తిరిగింది. సర్పంచ్ నవ్య ఆరోపణలను జాతీయ, రాష్ట్ర మహిళా కమీషన్ లు సుమోటోగా స్వీకరించి.. విచారణ నివేదిక అందించాలని పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు తాజాగా నవ్యకు రెండు నోటీసులు జారీ చేశారు. ఈనెల 21న రాతపూర్వకంగా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన సాక్ష్యాధారాలను రెండు రోజుల్లో సమర్పించాలని సర్పంచ్ నవ్యను నోటీసుల్లో కోరారు ధర్మసాగర్ ఇన్స్పెక్టర్. అలాగే.. కాజీపేట ఏసీపీ కార్యాలయం నుంచి కూడా మరో నోటీసు నవ్యకు వెళ్లింది. మూడు రోజుల్లోగా సాక్ష్యాలతో తమను సంప్రదించాలని, విచారణకు సహకరించాలని ఏసీపీ కార్యాలయం కోరింది. ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్ నవ్య తన భర్త, ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్‌పై పీస్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని నవ్య ఫిర్యాదు టైంలోనే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే నవ్య చేసిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సమాచారం. కాకపోతే విచారణ చేపట్టి.. తదుపరి చర్యలుచేపట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే.. నవ్య మాత్రం ఆ ఫిర్యాదుపై ఫోన్ లిఫ్ట్ చేయకుండా సైలెంట్‌గా ఉండిపోయారని తెలుస్తోంది. వేధింపులపై మూడు నెలల క్రితం క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే రాజయ్య గ్రామ అభివృద్ధికి 25 లక్షలు ఇస్తానని చెప్పి నయాపైస ఇవ్వకపోగా తనకు ఇచ్చినట్లు ప్రచారం చేస్తూ బాండ్ పేపర్ పై అప్పుగా 20 లక్షలు తీసుకున్నట్టు సంతకం పెట్టమని ఎమ్మెల్యేతో పాటు తన భర్త, ఎంపీపీ, ఎమ్మెల్యే పీఏ వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్తపై ఆరోపణలు చేసిన నవ్య భర్తతో కలిసే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నలుగురిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఎమ్మెల్యే రాజయ్య డాన్స్
-
నేను సీఎం కేసీఆర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా..
నేను సీఎం కేసీఆర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా.. ఆత్మీయ సమావేశాలకు నియోజకవర్గాలకు ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్‌చార్‌్జలుగా నియమించారు.. నల్గొండకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఇన్చార్జ్ బాధ్యతలు ఇవ్వడం వల్లే పిలవడం లేదు. నియోజకవర్గానికి చెందిన రాష్ట్రస్థాయి, ఇతర పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను ఒక్కో సమావేశానికి అతిథులుగా పిలుస్తున్నాము. 4వ తేదీ స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగే క్లస్టర్–1 ఆత్మీయ సమావేశానికి కడియం శ్రీహరిని ఆహ్వానిస్తున్నాం. – డాక్టర్ టి.రాజయ్య, ఎమ్మెల్యే స్టేషన్‌ఘన్‌పూర్ సీఎం ఆదేశాలను స్థానిక నాయకత్వం ఖాతరుచేయడంలేదు. ఎన్నికల్లో నాకు సహాయం చేయమని ఎమ్మెల్యే రాజయ్య అనడంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి సొంత డబ్బు పెట్టి పని చేశాను. పల్లా్ల రాజేశ్వర్‌రెడ్డి కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా మీరు ఒక్కరే నా ఎన్నికలకు పని చేశారని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద సభలు, సమావేశాలు ఉన్నప్పుడు సహాయం తీసుకుని ప్రభుత్వ కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలకు నన్ను ఆహ్వానించడం లేదు. ఇప్పటికైనా ఆత్మీయ సమావేశాలకు సమాచారం ఇవ్వాలి. – కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ సాక్షిప్రతినిధి, వరంగల్: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్యల మధ్య మాటల మంటలు చల్లారడం లేదు. మాజీ ఉప ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. దాదాపు మూడేళ్ల క్రితం మొదలైన ఆధిపత్య పోరు రోజురోజుకూ రాజుకుంటోంది. హైకమాండ్ పలుమార్లు కలుగజేసుకుని ఇద్దరు నేతలతో సంప్రదింపులు జరిపినా తాత్కాలికమే అయ్యింది. ఇటీవల స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో షోడషపల్లిలో కేటీఆర్ సభ తర్వాత అంతా సద్దుమణిగిందని అందరూ భావించారు. అయితే ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ముఖ్యమంత్రి ఆదేశాలను స్థానిక నాయకత్వం ఖాతరుచేయడంలేదు.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం ఆత్మీయ సమావేశాలకు నాకు సమాచారం ఇవ్వడం లేదు’ అంటూ పరోక్షంగా ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించిన వ్యాఖ్యలు మళ్లీ వివాదాలకు తెర లేపాయి. మూడేళ్లుగా ‘స్టేషన్’లో ఆధిపత్యపోరు.. ఒకే పార్టీలో స్టేషన్‌ఘన్‌పూర్‌లో రెండు గ్రూపుల ప్రతినిధులవుతున్న కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలు మొదటి నుంచి ప్రత్యర్థులే. కడియం శ్రీహరి టీడీపీ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్‌లో మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ హయంలో మంత్రిగా సైతం పని చేశారు. అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజయ్య తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో రాజయ్య, శ్రీహరి ప్రత్యర్థులుగా పోటీ చేయగా రాజయ్య విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో ఉన్న శ్రీహరి ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. ఇద్ద రు ఒకే పార్టీలో కొనసాగుతున్నా.. దాదాపు మూడేళ్లుగా ఆధిపత్యపోరు నడుస్తోంది. 2014 ఎన్నికల తర్వాత తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎం కావడం.. ఆరు నెలల తర్వాత పలు ఆరోపణల నేపథ్యంలో రాజయ్య డిప్యూటీ సీఎం పదవిని పొగొట్టుకోగా, సీఎం కేసీఆర్ కడియం శ్రీహరికి కట్టబెట్టడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. అధిష్టానమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఈ నియామకంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల తర్వాత కేటీఆర్ జోక్యం చేసుకుని రాజయ్య, శ్రీహరిల మధ్య రాజీ కుదిర్చారు. అది కూడా కొద్ది రోజులే కాగా.. మూడేళ్లుగా ఈ ఇద్దరు నేతల గ్రూపుల పోరు యధాతధంగా సాగుతోంది. హైకమాండ్ సీరియస్.. త్వరలోనే నిర్ణయం కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యల వివాదంపై బీఆర్ఎస్ అధిష్టానం సైతం సీరియస్‌గానే ఆలోచిస్తున్నదన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. ఉప ముఖ్యమంత్రులుగా పని చేసిన ఇద్దరు నేతల మధ్య నెలకొన్న వివాదం మొత్తం పార్టీ ఇమేజ్‌పైన ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్‌లో అక్కడక్కడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మధ్యన ఉన్న చిన్న చిన్న విభేదాలను ‘స్టేషన్‌ఘన్‌పూర్’ పాలిటిక్స్ ప్రభావితం చేసే అవకాశం కూడా లేకపోలేదన్న ఇంటిలిజెన్స్ సూచనలను హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అధిష్టానానికి తలనొప్పిగా మారిన స్టేషన్‌ఘన్‌పూర్ రాజకీయాలను కట్టడి చేసేందుకు త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ఇంటలిజెన్స్ రిపోర్టుతో పాటు ఐదుగురు సీనియర్ ప్రజాప్రతినిధులతో ఓ కమిటీ వేసి నివేదిక తెప్పించే యోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లు సమాచారం. -
లైంగిక ఆరోపణలు.. కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్యే రాజయ్య..
-
లైంగిక ఆరోపణలు.. కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్యే రాజయ్య..
సాక్షి, ఉమ్మడి వరంగల్:జనగామ జిల్లా స్టేషన్ ఘపపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కంటతడి పెట్టారు. తన బాధను చెప్పుకుంటూ బోరున విలపించారు. కరుణాపురంలో జరిగిన ఫాదర్ కొలంబో జన్మదిన వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. తనపై కొందరు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయంగా ఎదుర్కొలేకే తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు. 63 ఏళ్ల వయసున్న తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. దమ్ముంటే ఫేస్ టూ ఫేస్ రాజకీయాలు చేయాలని.. తాడోపేడో తెలుసుకుందామని ఎమ్మెల్యే సవాలు విసిరారు. అయితే ఏ సర్వే చూసిన తాను ముందు వరుసలో ఉన్నానని, తనను నిజాయితీగా ఎదుర్కోలేక కొందరు శవ రాజకీయాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. ఎవరరెన్ని ఇబ్బందులు పెట్టిన ఫాదర్ కొలంబో ఆశిస్సులతో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని స్పష్టం చేశారు. ఎంతో ఆత్మీయంగా తాను మమత అనురాగాలు పంచిపెడుతూ మహిళల గౌరవాన్ని పెంచే విధంగా మగవారితో సమానంగా రాణించాలని ప్రోత్సహిస్తున్నానని, వాటిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలతోపాటు స్వపక్ష నాయకులు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తన ఆత్మస్థైర్యాన్ని కొల్లగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఎవరు ఏం చేసినా భయపడే ప్రసక్తి లేదన్నారు. తాను మత కన్నెల చేతుల్లో, వారి ఒళ్లో పెరిగినవాణ్ణి అని, ఆడవాళ్ళను గౌరవించే వ్యక్తినని తెలిపారు. చివరి ఊపిరి ఉన్నంతవరకు ఘనపూర్ నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నాకు దేవుళ్ళని చెప్పారు. ప్రజల మధ్యనే ఉంటా ప్రజల మధ్యనే చస్తానని కొలంబో విగ్రహం సాక్షిగా రాజయ్య ప్రతినభూనారు. చదవండి: పెళ్లిలో రెచ్చిపోతున్న హిజ్రాలు.. డబ్బులు ఇవ్వకుంటే అసభ్యకర ప్రదర్శనలు -
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్ పార్టీలో పెను ప్రకంటపనలు మొదలయ్యాయి. మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. రాజయ్యపై జానకీపురం మహిళ సర్పంచ్ నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని.. లైంగికంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని నవ్య ఆరోపణలు చేస్తున్నారు. రాజయ్య మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. సమయం చూసి అవన్నీ భయటపెడతానని అన్నారు. తన వెనక ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇటువంటి వేధింపులు ఎదుర్కొంటూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘నీ మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని అన్నారు. పక్కన నిలబడితే ఎక్కడెక్కడో చేయి వేస్తారు. హగ్ చేసుకోవడానికి వస్తారు. బిడ్డలాంటి దాన్ని అని చెప్పినా మారరా. మీకు సహకరించకుంటే నా బతుకు నాశనం చేస్తారా. రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకుంటారా. దయచేసి ఇప్పటికైనా ఈ అరాచకాలు మానండి. ఇలాంటి వారితో పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తెలిపారు. మరోవైపు తనపై చేస్తున ఆరోపణలపై ఎమ్మెల్యే రాజయ్య స్పందించారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని, గతంలో జరిగినట్లు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇంటి దొంగలే శిఖండి పాత్ర పోషించి తనను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ను కలిసి అన్ని విషయాలు వివరిస్తానని తెలిపారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. -
అనాథ ఆడపిల్లలం.. ఆదుకోండి ..‘దళితబంధు’ ఇస్తే చెల్లి పెళ్లి చేస్తా!
స్టేషన్‌ఘన్‌పూర్: ‘నిరుపేద కుటుంబానికి చెందిన అనాథలం.. ‘దళిత బంధు పథకం మంజూరు చేసి ఆదుకుంటే చెల్లి వివాహం చేస్తాను’.. అంటూ లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామానికి చెందిన తిప్పారపు అనూష అనే యువతి ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కాళ్లు మొక్కి వేడుకుంది. సోమవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. తిప్పారపు అనూష, అశ్విని అక్కా చెల్లెళ్లు. పదేళ్ల క్రితం తల్లిదండ్రులు పరశురాములు, పుష్ప అనారోగ్యంతో మృతి చెందాక.. నానమ్మ వద్దే ఉంటున్నారు. పదో తరగతి వరకు చదివిన అనూష కూలి పనిచేస్తూ నానమ్మకు తోడుగా ఉండేది. మూడేళ్ల క్రితం అనూషకు జనగామకు చెందిన కార్తీక్‌తో వివాహమైంది. ఆరునెలల తర్వాత విభేదాలతో వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి అనూష నానమ్మ వద్దే ఉంటోంది. డిగ్రీ ఫస్టియర్ వరకు చదివిన అశ్విని ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువు ఆపేసింది. ‘కూలి పనులు చేస్తే వచ్చే డబ్బులతో కుటుంబం గడుస్తోంది.. చెల్లికి వివాహం చేయాలి.. ప్రభుత్వం అందిస్తున్న దళితబంధు పథకం మంజూరు చేసి ఆదుకోవాలి’.. అంటూ అనూష.. ఘన్‌పూర్‌లో ఒక కార్యక్రమానికి వచ్చి వెళ్తున్న ఎమ్మెల్యే కాళ్లపై పడి వేడుకుంది. -
మాజీ డిప్యూటీ సీఎంల మధ్య పోరు.. గులాబీ బాస్ ఆరా.. అక్కడ ఏం జరుగుతోంది?
అక్కడ సీఎంగా చంద్రబాబు, ఇక్కడ కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలో 361మంది నక్సలైట్లను పొట్టనబెట్టుకున్నారు. ఒక్క స్టేషన్ఘనపూర్ నియోజకవర్గంలోనే ఇంతమంది చనిపోయారు. గతంలో కాంగ్రెస్‌పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధిష్టానం పిలుపుమేరకు కడియం వేసిన శిలాఫలకాలకు నేనే స్వయంగా పిండాలు పెట్టా. కేవలం పదవుల కోసం ఇక్కడికి వస్తున్నారు.. ఓటమి చెందగానే కనిపించకుండా పోతారు. స్టేషన్ఘనపూర్ నా అడ్డా .. ఇక్కడ ఎవరినీ అడుగుపెట్టనివ్వబోను. – చిన్నపెండ్యాలలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఒకేపార్టీలో పనిచేస్తున్న వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు చేసేముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. క్రమశిక్షణ కూడిన పార్టీలో పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నా.. స్టేషన్ ఘన్పూర్ నా గడ్డ అని చెప్పుకుంటున్న నువ్వు, నేను కలిసి నియోజకవర్గంలో ఓ సర్వే నిర్వహిద్దాం. ప్రజల తీర్పునకు కట్టుబడి ఉంటావా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పని చేస్తున్నా.. భవిష్యత్‌లో కూడా సీఎం ఆదేశాల మేరకు పని పనిచేస్తా.. ఎన్కౌంటర్లను ఎప్పుడూ ప్రోత్సహించలేదు. – స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సాక్షిప్రతినిధి, వరంగల్: మాజీ ఉప ముఖ్యమంత్రుల మధ్య మాటల పోరు ముదిరి పాకాన పడింది. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిలు ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకోవడం గులాబీ గూటిలో కలకలం రేపుతోంది. నర్మగర్భంగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే ఇద్దరు నేతలు.. ఇప్పుడో అడుగు ముందుకేశారు. సోమవారం చిల్పూరులో ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్సీ శ్రీహరి మంగళవారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఒకరిపై ఒకరు వాగ్భానాలు వదలడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోటాపోటీగా ఆరోపణలు, ప్రత్యారోపణలు.. స్టేషన్‌ఘన్‌పూర్‌లో రెండు గ్రూపులుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాజయ్య, శ్రీహరిలు.. ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడం, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇదే సమయంలో సుమారు ఆరు నెలల కిందట మళ్లీ ఎమ్మెల్సీగా నియమితులైన కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్‌లో కార్యకలాపాలను విస్తృతం చేశారు. ఇదే సమయంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టికెట్ రాబోతుందన్న శ్రీహరి ప్రచారం కూడా చేసుకుంటున్నారని ఎమ్మెల్యే రాజయ్య తప్పుబట్టారు. తాజాగా సోమవారం జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాలలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజయ్య... చంద్రబాబు ముఖ్యమంత్రిగా, కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఎన్కౌంటర్లలో స్టేషన్‌ఘన్‌పూర్ దళిత బిడ్డలు ఎక్కువగా చనిపోయారని వ్యాఖ్యానించడం కొత్త వివాదానికి తెర తీసింది. స్టేషన్‌ఘన్‌పూర్ తన అడ్డా అని .. ఇక్కడ ఎవరినీ అడుగుపెట్టనివ్వబోను అని కామెంట్ చేయడంపై మంగళవారం మీడియా సమావేశంలో స్పందించిన కడియం శ్రీహరి.. ‘ప్రజల మద్దతు కోల్పోతున్న నువ్వు నాపై తీవ్ర ఆరోపణలు చేస్తావా’అని ప్రశ్నించారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎవరి అడ్డా కాదన్నారు. చదవండి: అక్కడ ‘కారు’ గెలుపు డౌటే!.. కారణం అదేనా? రాజయ్యకు ఏదైనా సమస్య ఉంటే అధిష్టానంతో చెప్పుకోవాలని అన్నారు. దీనిపై మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన రాజయ్య తాను ప్రభుత్వాల తీరుపై మాట్లాడే క్రమంలో టీడీపీ, చంద్రబాబు హయాంలో ఎన్కౌంటర్లు జరిగాయన్నారు. ‘అవును ముమ్మాటికీ స్టేషన్‌ఘన్‌పూర్ అడ్డా.. నా గడ్డా... ఇక్కడే చదువుకున్నా.. ఇక్కడే వైద్యం చేశా.. నేను చస్తే కూడా నా సమాధి ఇక్కడే’ అంటూ వ్యాఖ్యానించారు. తారస్థాయికి చేరిన విభేదాలు ఎమ్మెల్సీ శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్యల మధ్య రాజకీయ వైరం తారస్థాయికి చేరింది. ఒకే పా ర్టీలో ఉన్న ఇద్దరి మధ్య కొంతకాలంగా ఆధిప త్య పోరు కొసాగుతోంది. ఎమ్మెల్యేగా తాడికొండ రాజయ్య వ్యవహరిస్తుండగా... ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కడియం శ్రీహరి కూడా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంనే ఎంచుకున్నారు. 2019 సెప్టెంబర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన యాత్ర అప్పటి నుంచి ఉప్పు.. నిప్పులా ఉన్న వారిద్దరి మధ్య విభేదాలు ఇటీవల పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి. ‘స్టేషన్ ఘన్పూర్’ వార్’పై అధిష్టానం ఆరా.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ శ్రీహరిల మధ్య జరిగిన వార్‌పై పార్టీ అధిష్టానం మంగళవారం ఆరా తీసినట్లు తెలిసింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌కు చెందిన నలుగురు ముఖ్య నేతలు, ఓ మంత్రిని తాజా వివాదంపై హైదరాబాద్‌నుంచి ఓ కీలక నేత వివరాలు అడిగినట్లు తెలిసింది. పార్టీకి తలనొప్పిగా మారిన ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా ఇంటెలిజెన్స్ వర్గాలకు ఆదేశాలు అందినట్లు సమాచారం. -
కడియం శ్రీహరి నా మీద చేసిన అభియోగాలను తీవ్రంగా ఖండిస్తున్నా: ఎమ్మెల్యే రాజయ్య
-
స్టేషన్ ఘన్పూర్ పక్కా నా అడ్డానే: రాజయ్య
సాక్షి, వరంగల్: తెలంగాణ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి తనపై చేసిన అభియోగాలపై తీవ్రంగా స్పందించారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. మంగళవారం సాయంత్రం వరంగల్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. ఈ వ్యవహారంపై స్పందించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పక్కా నా అడ్డానే. కడియం శ్రీహరి నా మీద చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా. 14 ఏళ్లుగా మంత్రిగా పని చేసిన కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌పూర్‌కు ఏం చేశారు?. కడియం తీరు గురువింద సామెతలా ఉంది. దొంగే దొంగ అన్నట్లుగా ఉంది. కడియం శ్రీహరికి దళిత దొర అనే పేరుంది. అవినీతితో ఆస్తులు సంపాదించింది ఆయనే. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైఎస్సార్ నాకు రాజకీయ గురువు. అలాగే.. కేసీఆర్ తనకు దేవుడని, ఆయన ఆశీస్సులతో కాళోజీ హెల్త్ యూనివర్సిదొటీ తేవడంతో పాటు గ్రాస్ రూట్లో ఉన్న వైద్యవిధానాన్ని.. క్షేత్రస్థాయిలో చూశా గనుక ప్రక్షాళన చేయాలని ఆనాడు ప్రయత్నించానని రాజయ్య చెప్పుకొచ్చారు. కాకిలా కలకలం కాకుండా.. కోకిలలా కొంతకాలం ఉండి ప్రజామెప్పు పొందానని అన్నారు. రాజకీయ ఆరోపణలు.. విమర్శలు, మీడియాలో వచ్చిన అసత్య కథనాలతో తెలంగాణ అభాసుపాలు కావొద్దన్న ఉద్దేశంతో.. కేసీఆర్ వీరవిధేయుడిగా ఆయన మాట మీద ఆనాడు పదవి నుంచి తప్పుకున్నానని చెప్పుకొచ్చారు రాజయ్య. ఇదిలా ఉంటే.. కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య సంచలన ఆరోపణలు చేయగా, కౌంటర్‌గా ఇవాళ కడియం మాట్లాడుతూ.. స్టేషన్ ఘనపూర్ నీ జాగిరి కాదు అంటూ రాజయ్యపై మండిపడ్డారు. ఇదీ చదవండి: ‘ఒళ్లు దగ్గర పెట్టుకో..’ తాటికొండ రాజయ్యపై కడియం శ్రీహరి ఫైర్ -
కడియం శ్రీహరిపై ఘాటు విమర్శలు చేసిన ఎమ్మెల్యే రాజయ్య
-
‘ఒళ్లు దగ్గర పెట్టుకో..’ తాటికొండ రాజయ్యపై కడియం శ్రీహరి ఫైర్
సాక్షి, జనగామ: స్టేషన్ ఘనపూర్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. రాజయ్య మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. స్టేషన్ ఘనపూర్ గడ్డ నీ అడ్డా జాగిరి కాదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో చిల్లర పనులు చిలిపి చేష్టలు పనికిరావన్నారు. ‘తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకునే రాజయ్య, దేశంలో బర్తరఫ్ అయిన డిప్యూటీ సీఎం ఘనత ఆయనదే. రాజయ్య తప్పు చేస్తూ తెలివి లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన అవినీతిపై ఆధారాలు బయటపెడితే గ్రామాల్లో తిరగలేడు. నేను మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. పార్టీ నిర్ణయానికి కట్టుబడి అన్ని మూసుకొని ఉంటున్నాను. మోసం చేసే అలవాటు, వెన్నుపోటు పొడిచే ఉద్దేశం నాకు లేదు. కేసీఆర్ నాయకత్వంలో వారి ఆదేశం మేరకు స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను. రాజయ్యకు సూటిగా సవాల్ చేస్తున్నాను. స్టేషన్ ఘనపూర్ నీ అడ్డ అయితే పార్టీ ప్రస్తావన లేకుండా స్వచ్ఛంద సంస్థతో సర్వే చేపిద్దాం. ప్రజలు రాజయ్యను కోరుకుంటున్నారా.. శ్రీహరిని కోరుకుంటున్నారా? సర్వే రిపోర్ట్ తేల్చుతుంది. సర్వే రిపోర్టుకు కట్టుబడి ఉంటావా? నా సవాల్‌కు స్పందించు. డొంక తిరుగుడు సమాధానంతో తప్పించుకునే పరిస్థితి వద్దు. నా సవాల్‌కు సిద్ధం కాకపోతే ఎక్కడైనా నా ప్రస్తావన తీసుకురావద్దని వార్నింగ్ ఇస్తున్నా’ అని తీవ్ర విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. రాజయ్య వ్యవహారంపై ఉమ్మడి జిల్లా మంత్రులు, హనుమకొండ జనగామ జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందన్నారు. పార్టీ అధిష్టానం అన్ని గమనిస్తోందని.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: కు.ని. ఆపరేషన్లు వికటించి మరో ఇద్దరు మృతి.. హైవేపై భారీ బందోబస్తు -
360 మందిని ఎన్కౌంటర్ చేయించాడు.. కడియంపై కస్సుమన్న రాజయ్య
చిల్పూరు: కడియం శ్రీహరి టీడీపీ హయాం నుంచి అతనికి గిట్టని వారిని ఎన్కౌంటర్లు చేయించాడని, ఒక్క నియోజకవర్గంలోనే 360 మంది అమాయకులను చంపించాడని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన ఆరోపణలు చేశారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలో కొత్త పింఛన్‌దారులకు సోమవారం ఆయన కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు రాజకీయ గురువు వైఎస్సార్ అయితే ప్రస్తుత సీఎం కేసీఆర్ దేవుడని, నియోజకవర్గానికి తాను పూజారినని, ఆ దేవుడిచ్చే వరాలతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. ఎప్పటికీ స్టేషన్‌ఘన్‌పూర్ తన అడ్డా అని.. ఎవరినీ కాలు పెట్టనీయనని శపథం చేశారు. -
కేటీఆర్ కోసం మోకాళ్లపై ఆలయ మెట్లెక్కిన రాజయ్య
చిల్పూరు: కాలికి గాయమైన మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదివారం మోకాళ్లపై నడుస్తూ చిల్పూరు ఆలయ మెట్లు ఎక్కారు. ఆయన వెంట జెడ్పీ, ఆలయ చైర్మన్లు సంపత్‌రెడ్డి, శ్రీధర్‌రావు, ఎంపీపీ సరిత బాలరాజు, పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్‌నాయక్, పోలేపల్లి రంజిత్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ చిర్ర నాగరాజు తదితరులున్నార. -
రోడ్డుపై ఎమ్మెల్యే రాజయ్య వైద్యం
రఘునాథపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడికి సత్వర వైద్య సేవలు అందించి మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి పంపించారు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య. జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన సత్తు మహేందర్ ఆదివారం తన ద్విచక్ర వాహనంపై మేకలగట్టులో దుర్గామాత ఉత్సవాల సందర్భంగా బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి పయనమయ్యాడు. ఖిలాషాపూర్ సమీపంలోకి రాగానే కుక్క రోడ్డుకు అడ్డురావడంతో మహేందర్ సడన్ బ్రేకు వేయగా బైకు అదుపుతప్పి కిందపడి గాయాలయ్యాయి. అదే సమయంలో దుర్గామాత ఉత్సవాలకు వెళ్లి కారులో వస్తున్న ఎమ్మెల్యే దీనిని గమనించి, కారు నిలిపారు. వెంట నే మహేందర్ వద్దకు వెళ్లి వైద్యుడైన రాజయ్య తన వెంట ఉన్న స్టెతస్కోప్‌తో పరీక్షించారు. అప్పటికే మహేందర్ స్పృహ కోల్పోవడంతో...108 వాహనం చేరుకోవడానికి ఆలస్యమవుతుందని గ్రహించి వెంటనే పోలీస్ వాహనంలో జనగామ ఆస్పత్రికి తరలించారు. జనగామ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి మహేందర్‌కు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా సూచించారు. -
Dalit Bandhu: ఎమ్మెల్యే తమ్ముడికి దళితబంధు
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్: పేద దళితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళితబంధు పథకంలో లబ్ధిదారుడిగా జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సోదరుడు, స్టేషన్‌ఘన్‌పూర్ సర్పంచ్ తాటికొండ సురేశ్ కుమార్ ఉండటంతో స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈయనతో పాటుగా ఘన్పూర్ ఎంపీపీ భర్త, కొందరు ప్రజాప్రతినిధులున్నారు. మండలంలో పేదవారిని కాదని, ఆర్థికంగా ఉన్న వారికి, ఎమ్మెల్యే అనుచరులనే ఎంపిక చేశారని కాంగ్రెస్, బీజేపీ తదితర ప్రతిపక్షపార్టీల నాయకులు, యువకులు సోమవారం సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. కాగా, ఎమ్మెల్యేపై వస్తున్న విమర్శలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చదవండి: (Hyderabad: రోడ్లపై వాహనాలను వదిలేస్తున్నారా.. అయితే ఇక కష్టమే..) -
సీఎం ఆదేశం: గడ్డం తీయనని ఎమ్మెల్యే శపథం
సాక్షి, వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. సీఎం ఆదేశాలతో పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ క్రమంలోనే జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య హాజరయ్యారు. సభ్యత్వ నమోదును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తనకు అప్పగించిన లక్ష్యం పూర్తిచేసే వరకు గడ్డం తీయనని శపథం చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి గడ్డం పెంచుతున్నానని, తానెప్పూడూ గడ్డం పెంచలేదని అన్నారు. గతంలో కంటే నియోజకవర్గంలో మాకు ఇచ్చిన లక్ష్యం నెరవేరేవరకు ఎట్టి పరిస్థితుల్లో గడ్డం తీయనని శపథం చేశారు. 60 వేల సభ్యత్వాలు 15 రోజుల్లో నమోదు అయ్యేవరకు గడ్డం తీయనని ఎమ్మెల్యే రాజయ్య స్పష్టం చేశారు. -
మీ కోపాన్ని చూపించొద్దు..! : తుమ్మల నాగేశ్వరరావు
సాక్షి, అశ్వారావుపేటరూరల్: ‘‘నాపై, ఎంపీపై, తాటిపై మీకు కోపమున్నా, దానిని ఇప్పుడు చూపించొద్దు. ఆ కోపతాపాలేవైనా ఉంటే.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూర్చుని మాట్లాడుకుందాం’’ అని, టీఆర్ఎస్ శ్రేణులను ఆ పార్టీ నేత తుమ్మల నాగేశ్వరరావు కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్నింటా అభివృద్ది చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ను ఓడించేందుకు దేశంలోని పార్టీలన్నీ ఏకమయ్యాయని, అయినప్పటికీ టీఆర్ఎస్ గెలుపును అవి అడ్డుకోలేవని అన్నారు. మండలంలోని వినాయకపురం గ్రామంలో ఆదివారం పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘గడిచిన పదేళ్లుగా మీ మొహాలు చూడని వారిని ఈ ఎన్నికల్లో ఓడించండి. మీ కోసం నేను 32 ఏళ్లు త్యాగం చేశా. నా కోసం మీరంతా తాటి వెంకటేశ్వర్లును ఐదువేల నుంచి పదివేల మెజార్టీతో గెలిపించాలి’’ అని కోరారు. ఎవరెన్ని రాజకీయాలు చేసినప్పటికీ పోడు పట్టాలు ఇప్పించే బాధ్యత తనదేనని అన్నారు. రాష్ట్రంలో కళింగుల జనాభా దాదాపుగా నాలుగులక్షలు ఉందని, అశ్వారావుపేటలోనూ ఉన్నారని అన్నారు. వీరికి సంబంధించిన రిజర్వేషన్ సమస్యను పరిష్కారిస్తామని, ఆందోళన అవసరం లేదని హామీ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి, మొట్టమొదటిగా అశ్వారావుపేటలోని వెంకమ్మ చెరువును గోదావరి నీళ్లతో నింపుతామని అన్నారు. దబ్బతోగు, పెదవాగు ప్రాజెక్టులకు నీళ్లు అందిస్తామన్నారు. దురదపాడు ప్రాజెక్టు నిర్మాణం తన బాధ్యతనేనని అన్నారు. అశ్వారావుపేట మీదుగా రావాల్సిన జాతీయ రహదారి రద్దయినట్టుగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నేషనల్ హైవే, గ్రీన్ ఫీల్డ్ హైవేకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. భద్రాచలం నుంచి దమ్మపేట, అశ్వారావుపేట మీదుగా దేవరపల్లి వరకు నేషనల్ హైవే నిర్మాణ బాధ్యత కూడా తనదేనన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. టీఆర్ఎస్ పార్టీని గెలలిపించాలని కోరారు. ముందుగా, టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నియోజకవర్గానికి ఎంతో చేశానని అన్నారు. తనను మరోసారి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, ఎంపీపీ బరగడ కృష్ణారావు, జడ్పీటీసీ సభ్యుడు మల్లికార్జున్‌రావు పాల్గొన్నారు. రైతులకు మంచి రోజులు .. దమ్మపేట: టీఆర్ఎస్ పాలనలో రైతులకు మంచి రోజులొచ్చాయని, పంటల సాగు సక్రమంగా సాగిందని తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. మండలంలోని మందలపల్లి సాయికృష్ణ నర్సరీలో ఆదివారం టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన పార్టీ సమావేశం జరిగింది. తుమ్మల, పొంగులేటి మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టును అడ్డుకునేందుకు యత్నిస్తున్న పార్టీ అభ్యర్థిని ఓడించాలని, టీ ఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లును గెలిపిం చా లని కోరారు. కూటమికి అధికారమిస్తే.. మన కం టిని మనం పొడుచుకున్నట్టే అవుతుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పానుగంటి సత్యం, డీసీసీబీ డైరెక్టర్ ఆలపాటి రామచంద్రప్రసాద్, పార్టీ నాయకులు తూతా నా గమణి, పైడి వెంకటేశ్వరరావు, దారా యుగంధర్, కోటగిరి పుల్లయ్యబాబు, రావు గంగాధరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, కేవీ సత్యన్నారాయణ, అల్లం వెంకమ్మ, సరోజని, అడపా రాంబాబు, కొయ్యల అచ్యుతరావు, రెడ్డిమళ్ల చిట్టినాయన, దొడ్డా రమేష్, వెంపాటి భరత్ పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
కేటీఆర్ సమక్షంలోనే రాజయ్యకు పంచ్
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్: తన కుమార్తెకు టిక్కెట్ రాలేదన్న అసంతృప్తితో ఉన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎట్టకేలకు మౌనం వీడారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో తాటికొండ రాజయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టిక్కెట్ తన కుమార్తె కావ్యకు ఇవ్వకపోవడంతో కొంతకాలంగా అంటిముట్టనట్టు వ్యవహరించిన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంగళవారం ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ పాల్గొన్న ఈ సభలో కడియం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసమ్మతి లేదు, సమ్మతి లేదంటూనే రాజయ్యకు చురకలు అంటించారు. ‘నేను నియోజకవర్గానికి రాకపోవడంతో అలిగానని బహుశా మీరంతా అనుకుంటున్నారేమో. నేను నిజంగా చెబుతున్నా రాజయ్య అప్పుడప్పుడు నా పట్ల తప్పుగా ప్రవర్తించినా నేను ఎన్నడూ అలా ప్రవర్తించలేదు. రాజయ్య నా తమ్ముడు. టీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకుడు. రాజయ్యను తప్పకుండా మనమందరం గెలిపించుకోవాలి. భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాల’ని కడియం శ్రీహరి అన్నారు. -
ఆమె అదృశ్యం..!
ఆమె, అతను పగులబడి నవ్వుతూ.. ‘ఏవ్వా.. ఏవ్వా.. నాకు పోస్టు ఎప్పుడిస్తవ్ ఏవ్వా. ఏవ్వా.. ఏవ్వా.. ఎప్పుడు చేతుల పెడుతవ్ ఏవ్వా. ఏవ్వా.. ఏవ్వా..’ అంటూ సరసపు సంభాషణతో సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్పింగ్ ఇటీవల హల్చల్ చేసిన విషయం తెలిసిందే. స్వర పోలికను బట్టి ఆ మహిళ వరంగల్ అర్బన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందినట్లు తెలిసింది. అయితే.. ఆడియో క్లిప్పింగ్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఆమె అదృశ్యమైంది. సాక్షి ప్రతినిధి, వరంగల్: స్టేషన్ ఘన్పూర్ తాజా మాజీ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య గొంతును పోలిన వ్యక్తితో ఫోన్లో సరదాగా మాట్లాడిన మహిళ కనిపించకుండా పోయింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ‘సాక్షి’ సదరు మహిళ తల్లిదండ్రుల వద్ద ఆరా తీయగా.. ఆమె ఎక్కడికి వెళ్లిందో తమకు తెలియదని వెల్లడించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు నేతల భవితవ్యం ఈ ఆడియో క్లిప్పింగ్‌పై ఆధారపడి ఉన్న నేపథ్యంలో మహిళ అదృశ్యం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏం జరిగింది..? ఓ మహిళ భర్తతో విభేదించి ఒంటరిగా ఉంటోంది. నిరుపేద కుటుంబానికి చెందిన సదరు మహిళను ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఆర్థిక వెసులుబాటు కోసం కళ్యాణలక్ష్మి పథకం కింద ఆర్థిక సహకారం కోరవచ్చని.. టీఆర్ఎస్ స్థానిక దిగువ శ్రేణి నేతలను పట్టుకుంటే నకిలీ సర్టిఫికెట్లతో డబ్బు ఇప్పిస్తారని ఎవరో ఆమెకు సలహా ఇచ్చినట్లుతెలుస్తోంది. దీంతో ఆమె స్థానిక నాయకులను ఆశ్రయించింది. ఈ క్రమంలో ఆ మహిళ ఆమాయకత్వాన్ని, ఆర్థికలేమిని ఆసరా చేసుకున్న స్థానిక నాయకులు ఆమె జీవితంతో ఆడుకున్నట్లు ప్రాథమికంగా తెలిసింది. ఆ తర్వాత వారి నుంచి ఎగువ శ్రేణి నాయకుడికి చేరువైనట్లు స్థానికులు చెబుతున్నారు. చురుకుగా ఉండే ఆమెకు మండల స్థాయిలో ఒక పోస్టు ఇస్తామని చెప్పి, ఆ మేరకు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఇంకొంత చనువు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యాన్ని స్థానికంగా ఉన్న నాయకులు ఆమెతో సెల్ఫోన్లో సంభాషణ చేశారు (బయటకు వచ్చిన ఆడియో క్లిప్పింగ్‌లో వారి పేర్లు ఉన్నాయి). చైనా తయారీ సెల్ ఫోన్ ఉపయోగిస్తున్న సదరు మహిళ ఆండ్రాయిడ్ ఫోన్లో వాయిస్ రికార్డు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సోమదేవరపల్లి నుంచే లీకైందా..? 5.43 నిమిషాల నిడివితో ఉన్న ఈ ఆడియోలో స్త్రీ, పురుషులిద్దరూ పగులబడి నవ్వుతూ సంభాషణ సాగిస్తారు. ఫోన్లో సహజంగానే ఈ సంభాషణ రికార్డు అయింది. ఆడియో క్లిప్పింగ్‌లోని పురుష గొంతు మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ తాజామాజీ ఎమ్మెల్యే రాజయ్య స్వరంను పోలి ఉండడంతో.. రాజకీయంగా తనను అణగదొక్కటానికి తన గొంతును మిమిక్రీ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని అతను స్టేషన్ ఘన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా, మహిళతో పరిచయం ఉన్న సోమదేవరపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దాదాపు 8 నెలల కిందట çఆమె ఫోన్‌ను తీసుకున్నాడు. ఆడియో స్టోర్ నుంచి వాయిస్ రికార్డ్ క్లిప్పింగ్‌ను ఆమెకు తెలియకుండా తన ఫోన్లోకి పంపుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక అక్కడి నుంచి వాయిస్ రికార్డు ముందుగా ఎక్కడికి వెళ్లిందనే వివరాలు తెలియరాలేదు. నైతికతపై దాడి నేపథ్యంలో.. రాజయ్యకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించిన నాటి నుంచి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నిరసనలు వ్యక్తమవువుతున్నాయి. తొలుత రాజా రపు ప్రతాప్‌తో మొదలైన అసమ్మతి.. క్రమంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అనుచరుల చేతిలోకి వెళ్లిపోయింది. కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌తో కొంత కాలంగా ఇక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆడియో క్లిప్పింగ్ బయటికి వచ్చింది. అదే రోజు సదరు మహిళ హుటాహుటిన హన్మకొండకు వెళ్లినట్లు, అప్పటి నుంచే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు స్థానికులు చెబుతున్నారు. కడియం శ్రీహరినే పోటీలో ఉండాలని కోరుతూ ఇటీవల టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున వరంగల్ సర్క్యూట్ హౌస్ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. దీని మీద అధినాయకత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. చివరి అస్త్రంగా ప్రత్యర్థి నైతికత మీద దెబ్బ తీయడానికి, అవసరమైనప్పుడు ము ఖ్యమంత్రి ముందుకు తీసుకుపోవటానికి కడి యం శ్రీహరి అనుచరులు ఆమెను తీసుకుపోయి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు మహిళపై ఒత్తిడి తెచ్చి ఒక వేళ ఆడియో క్లిప్పింగ్‌లో ఉన్న పురుష గొంతు తమ నేతది కాకు న్నా.. ఆయనదే అని చెప్పిస్తారేమోననే ఉద్దేశంతో రాజయ్య అనుచరులు తీసుకెళ్లి ఉండవచ్చనే మరో ప్రచారం సైతం జరుగుతోంది. దీనిపై జిల్లా పోలీ సు యంత్రాంగం స్పందించి.. ఎక్కడున్నా ఆమె ను కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఢీ.. రాజయ్య వర్సెస్ ప్రతాప్
టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ రాజయ్యకు, అదే పార్టీకి చెందిన అసమ్మతి నేత రాజారపు ప్రతాప్ ఏ పార్టీలో ఉన్నా ప్రత్యర్థులుగానే ఉంటున్నారు. వీరిద్దరు కాంగ్రెస్‌లో ఉన్నన్ని రోజులు టికెట్ కోసం కుస్తీ పట్టేవారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ రాజయ్య దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మూడేళ్లకు టీఆర్ఎస్లో చేరారు. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి రాజయ్య, కాంగ్రెస్ నుంచి ప్రతాప్, టీడీపీ నుంచి కడియం పోటీ చేయగా రాజయ్య గెలుపొందారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణల్లో ప్రతాప్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉంటూనే రాజయ్యతో పోటీపడుతున్నారు. సాక్షి, జనగామ: వారిద్దరు నాడు.. నేడు కొనసాగింది ఒక జెండా కిందనే. నాడు కాంగ్రెస్‌లో ఉంటే.. నేడు కొనసాగుతుంది టీఆర్ఎస్లో. ఇద్దరూ ఒకే పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ఎప్పుడూ భిన్నధృవాలుగానే విడిపోతున్నారు. ప్రత్యర్థులుగానే కలబడుతున్నారు. సవాల్‌కు ప్రతిసవాల్ విసురుకుంటున్నారు. వారే స్టేషన్ ఘన్పూర్ టీఆర్ఎస్ నేతలు తాటికొండ రాజయ్య, రాజారపు ప్రతాప్. వీరి రాజకీయ కేంద్రమైన స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రోజురోజుకు వర్గపోరు ముదురుతోంది. టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పలువురు నాయకులు పార్టీలో ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వర్గీయులు ఒక వర్గంగా విడిపోగా మరో అసమ్మతి నేత రా జారపు ప్రతాప్ వర్గీయులు మరో వర్గంగా విడిపోయారు. అయితే కడియం వర్గీయులు అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తుండగా ప్రతాప్ మాత్రం తానే బరిలోకి దిగుతానని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఘన్‌పూర్‌లోని వర్గపోరు టీఆర్ఎస్ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బహిరంగ విమర్శలతో రాజకీయ వేడి.. ఒకే పార్టీలో కొనసాగుతున్న రాజయ్య, ప్రతాప్ బహిరంగ విమర్శలకు దిగుతుండడంతో నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నెల 6న కేసీఆర్ శాసన సభను రద్దు చేసి అదే రోజు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్గా ఉన్న తాటికొండ రాజయ్యకు పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. అయితే టికెట్ ఆశించి భంగపడిన ప్రతాప్ తాను రెబెల్‌గా పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు. ఇటు పార్టీ అభ్యర్థి రాజయ్య ఎన్నికల ప్రచారం చేపట్టి ప్రజలతో మమేకం అవుతుండగా అటు ప్రతాప్ సైతం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ నెల 14న జనగామ జిల్లా కేంద్రం నుంచి స్టేషన్ ఘన్పూర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో రఘునాథపల్లి వద్ద డీజే సౌండ్స్‌కు అనుమతి లేదని పోలీసులు ర్యాలీని నిలిపివేశారు. దీంతో ప్రతాప్ పోలీసుల చర్యను నిరసిస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. అలాగే రాజయ్యకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారని ప్రతాప్ అనుచరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తిని అరెస్టు చేసేందుకు పోలీసులు రాగా తన అనుచరుడి కోసం ప్రతాప్ ధర్నాకు దిగారు. అంతేగాక బహిరంగంగా రాజయ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. తాను కేసీఆర్ బొమ్మతోనే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని శుక్రవారం జఫర్‌గఢ్‌లో జరిగిన ప్రచారంలో ప్రతా ప్ ప్రకటించారు. ఇద్దరి మధ్య వైరం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. నియోజకవర్గంలో నెలకొన్న గ్రూ పు తగాదాలతో పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు. -
భోజ్యానాయక్ త్యాగం మరువలేనిది
రఘునాథపల్లి: తెలంగాణా అమరవీరుడు లునావత్ భోజ్యానాయక్ త్యాగం మరువలేనిదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం మండలంలోని అశ్వరావుపల్లి శివారు వీరారెడ్డి తండాలో భోజ్యానాయక్ ఆరో వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరై భోజ్యానాయక్ సమాది వద్ద పార్టీ నాయకులతో కలిసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నామాల బుచ్చయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. గండ్ర తీరుతోనే భోజ్యా నాయక్ ఆత్మహత్య.. హన్మకొండ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని రహదారిపై ఒంటిపై పెట్రోల్ పోసుకొని భోజ్యానాయక్ నిప్పంటించుకున్నాడని ఎమ్మెల్యే గుర్తు చేశారు. 92 శాతం గాయాలతో ఎంజీఎం అస్పత్రిలో చికిత్స పొందుతున్న భోజ్యానాయక్‌ను తాను కలిసినప్పుడు ‘రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో రాజయ్య గెలిస్తే తెలంగాణ వస్తదా ..? రాదే రాదు’ అని గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన వ్యాఖ్యల వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అమరవీరుని తల్లిదండ్రులు మంక్తి, నామాల కడుపు కోత తీర్చలేనిదన్నారు. భోజ్యానాయక్ నగర్ పేరిట వీరారెడ్డి తండాలో డబుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తానని ఈ సందర్భంగా హామి ఇచ్చారు. వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి తెలంగాణ కోసం అమరుడైన భోజ్యానాయక్ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఒప్పించాలని ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ గాంధీనాయక్ కోరారు. అమరుడు భోజ్యానాయక్ తల్లిదండ్రులు మంక్తి, నామాలకు గాంధీనాయక్ పాదాభివందనం చేశారు. వర్ధంతి సభలో ఎంపీపీ దాసరి అనిత, జెడ్పీటీసీ బానోతు శారద, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోకల శివకుమార్, ఎంపీటీసీ దొనికల రమాదేవి, సర్పంచ్ విజయలక్ష్మి, నాయకులు గుడి వంశీధర్‌రెడ్డి, మారుజోడు రాంబాబు, చెంచు రమేష్, గొరిగ రవి, మడ్లపల్లి సునిత, మాలోతు నర్సింహ్మా, కుర్ర కమలాకర్, నీల ఆగయ్య, రాజేందర్‌నాయక్, అంజనేయులు, వెంకటేష్‌యాదవ్, గైని రాంచందర్ పాల్గొన్నారు. -
కడియం.. డిప్యూటీ సీఎం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లా రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. వరంగల్ లోక్‌సభ సభ్యుడు కడియం శ్రీహరి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఈ స్థానంలో ఉన్న తాటికొండ రాజయ్యను బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. వెంటనే శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కడియంకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తూ, విద్యాశాఖ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత మన జిల్లాకు రాజకీయంగా, పరిపాలనా పరంగా ప్రాధాన్యం పెరిగింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. వైద్య, ఆరోగ్య శాఖలో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రాజయ్యను మంత్రివర్గం నుంచి సీఎం తప్పించారు. ఈ పరిణామం శ్రీహరికి అనుకూలించింది. పరిపాలనా పరంగా అనుభవం, దళిత సామాజిక వర్గం కావడంతో శ్రీహరిని ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. కడియం శ్రీహరి 1994 డిసెంబరు నుంచి 2004 అక్టోబరు వరకు మంత్రిగా పని చేశారు. రాష్ట్ర మంత్రులుగా పని చేస్తూ గతంలో పలువురు లోక్‌సభకు ఎన్నియ్యారు. లోక్‌సభ సభ్యుడు నేరుగా రాష్ట్ర మంత్రి కావడం అరుదైన విషయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి. శ్రీహరి లోక్‌సభకు రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్నారు. టీఆర్ఎస్లో అయోమయం డిప్యూటీ సీఎం మార్పు అంశంపై టీఆర్ఎస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. టి.రాజయ్యను ఈ పదవి నుంచి తప్పించడం.. వెంటనే కడియం శ్రీహరిని ఈ పదవిలో నియమించడం గులాబీ పార్టీ జిల్లా ముఖ్యనేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. మంత్రుల మార్పు ముఖ్యమంత్రి అభీష్టం మేరకు జరిగే ప్రక్రియే అయినా.. ఇంత వేగంగా చేయడంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ ఆవిర్భావంలో, తర్వాత కీలక సమయాల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించిన కడియం శ్రీహరి.. ఎన్నికల ముందు పార్టీలోకి రావడం ఇప్పుడు ఏకంగా ఉప ముఖ్యమంత్రి కావడం అంతా అయోమయంగా ఉందని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. శ్రీహరికి పదవి విషయం టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, కార్యకర్తలకు మింగుడుపడడం లేదు. నేడు సన్మానం : తక్కెళ్లపల్లి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సోమవారం జిల్లాకు రానున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి జిల్లాకు వస్తున్న శ్రీహరిని ఆ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానిస్తున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు తెలిపారు. శ్రీహరి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జనగామ, మధ్యాహ్నం ఒంటి గంటకు స్టేషన్‌ఘన్‌పూర్, 2 గంటలకు మడికొండ, 3 గంటలకు కాజీపేట జంక్షన్, సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్‌కు ర్యాలీగా చేరుకుంటారని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు హన్మకొండ ఏకశిలాపార్కులో ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు భారీగా తరలిరావాలని కోరారు. -
ప్రజలు అభద్రతకు గురికావద్దు: రాజయ్య
హైదరాబాద్ : తెలంగాణలో స్వైన్ ఫ్లూతో ఇప్పటివరకూ అయిదుగురు మృతి చెందినట్లు డిప్యూటీ సీఎం రాజయ్య తెలిపారు. మరో 141మంది స్వైన్‌ఫ్లూ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆయన సోమవారమిక్కడ చెప్పారు. 347మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో ఐదుగురికి వ్యాధి నిర్థారణ అయినట్లు వెల్లడించారు. స్వైన్‌ఫ్లూపై ప్రజలు భయపడాల్సిన పనిలేదని, చికిత్స, మందులు అందుబాటులో ఉన్నాయని రాజయ్య అన్నారు. ఇక వరంగల్‌లో పోలియో మందు వికటించి చిన్నారి చనిపోయిన సంఘటనపై పూర్తి నివేదిక కోరినట్లు ఆయన తెలిపారు. వైద్యశాఖలో ఔట్ సోర్సింగు నియామకాలపై పత్రికల్లో అవినీతి కథనాలు వస్తున్నాయని... అయితే ఇప్పటివరకూ ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదన్నారు. నిమ్స్ డైరెక్టర్‌పై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, నిమ్స్ డైరెక్టర్ వివాదం కోర్టులో ఉన్నట్లు రాజయ్య తెలిపారు. -
వంద, రెండొందలు అడిగితే తప్పేముంది: రాజయ్య
ఆసుపత్రి సిబ్బంది పక్షాన నిలిచిన డిప్యూటీ సీఎం సాక్షి, మంచిర్యాల: స్వతహాగా డాక్టర్ అయిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజ య్య వైద్యుల పక్షపాతి అని చాటుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం మంచిర్యాల ఏరి యా ఆస్పత్రిలో రాత్రి బస చేసిన ఆయన పరోక్షంగా వైద్యులకు మద్దతు తెలిపారు. బుధవారం ఆస్పత్రి నుంచి వెళ్లే ముందు విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రిలో సిబ్బంది రూ.100, రూ.200 అడిగితే అది తప్పు కాదని, అలా అడిగినవారిని అవినీతిపరులుగా పరిగణించొద్దని చెప్పుకొచ్చారు. ఎవరైనా వేధిస్తేనే ఆర్డీవో, డీఎంహెచ్‌వో, కలెక్టర్‌కు ఫోన్లో సమాచారమివ్వాలని సూచించారు. నిన్నటి వరకు స్వైన్‌ఫ్లూ బారిన పడి ఐదుగురు మరణించినట్లు చెప్పిన ఆయన స్వైన్‌ఫ్లూ మరణాలు లేవని తాజాగా మాట మార్చారు. స్వైన్‌ఫ్లూ బాధిత రోగులకు చికిత్స అందించేందుకు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఓ ఐసోలేటెడ్ వార్డుతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘థర్మోస్కాన్’ను ఏర్పా టు చేసినట్లు వివరించారు. ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే డీఎంహెచ్‌వోల ఆధ్వర్యంలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు ఇచ్చిన వెంటనే అన్ని జిల్లాల నుంచి ఖాళీల జాబితా తెప్పించుకుని ఆస్పత్రుల్లో పోస్టులన్నీ భర్తీ చేస్తామని రాజయ్య స్పష్టం చేశారు. -
రాష్ట్రంలో 84 మందికి స్వైన్‌ఫ్లూ పాజిటివ్: రాజయ్య
ధర్మసాగర్: తెలంగాణలో 84 మందికి స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా తేలిందని, ఐదు మరణాలు సంభవించాయని డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య చెప్పారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం రాత్రి ఆయన బస చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వైన్‌ఫ్లూను ఆలస్యంగా గుర్తించడం, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి, పరిస్థితి విషమించిన తర్వాత చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు రావడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. స్వైన్‌ఫ్లూ నివారణకు జిల్లా స్థాయి ఆస్పత్రుల్లోనూ మం దులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మరో 8 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ప్లూ లక్షణాలతో బాధపడుతూ శనివారం మరో 8 మంది హైదరాబాద్‌లో వివిధ ఆస్పత్రుల్లో చేరారు. మహబూబ్‌నగర్‌కు చెందిన బుచ్చమ్మ(50), యూసుఫ్‌గూడకు చెందిన కృష్ణంరాజు(35), మలక్‌పేట్ వాసి వేణు(28), అదే ప్రాంతానికి చెందిన దుర్గం కిరణ్(30)లు స్వైన్‌ప్లూతో ఉస్మానియాలో చేరారు. ఎన్బీటీ నగర్‌కు చెందిన శాన్వీ(3) రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
మార్చికల్లా రూ. 2,282 కోట్ల ఖర్చు
70 శాతం వైద్య పరికరాల కొనుగోలుకే.. ఫిబ్రవరి నుంచి పెంటావాలెంట్ వ్యాక్సిన్ డిప్యూటీ సీఎం టి. రాజయ్య గోదావరిఖని: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సామాన్య ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఇందులో భాగంగానే వచ్చే మార్చి నాటికల్లా వైద్యానికి కేటాయించిన రూ. 2,282 కోట్లను ఖర్చు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య తెలిపారు. ఆదివారం రాత్రి కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బస చేసిన ఆయన సోమవారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ పరిధిలోని ఆస్పత్రులకు రూ.552 కోట్లు ఖర్చు చేస్తున్నామని, మొత్తం బడ్జెట్లో 70 శాతం ఆయా ఆస్పత్రులో వైద్య పరికరాల కొనుగోలు కోసమే వినియోగించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత లేదని, దీర్ఘకాలిక వ్యాధులకు గతంలో ఇచ్చిన విధంగా కాకుండా 10-15 రోజులకు మందులను అందజేస్తున్నామన్నారు. కుక్కకాటు, పాముకాటుకు మందులు అందుబాటులో ఉన్నాయని, వచ్చే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఐదు రకాల జబ్బులకు ఉపయోగపడే పెంటావాలెంట్ అనే వ్యాక్సిన్‌ను ప్రారంభించనున్నామని ప్రకటించారు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరతను త్వరలోనే టీపీఎస్స్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 25 శాతంగా ఉన్న వైద్యసేవలను 60 శాతానికి పెంపుదల చేసేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు ప్రజలు సహకారం అందించాలని కోరారు. డిప్యూటీ సీఎం వెంట రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఉన్నారు. -
వైద్యారోగ్యశాఖను ప్రక్షాళన చేస్తాం
కోల్‌సిటీ : వైద్యారోగ్యశాఖను ప్రక్షాళన చేసేందుకు ఆస్పత్రిలో రాత్రి బస కార్యక్రమం చేపడుతున్నామని డెప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. గోదావరిఖనిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆదివారం రాత్రి ఆయన బస చేశారు. అంతకుముందు జనగామ అర్బన్‌హెల్త్‌సెంటర్‌ను పరిశీలించారు. ఆయా చోట్ల విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రభుత్వాస్పత్రులపై నిర్లక్ష్యం వహించడంతో ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే నినాదం వచ్చిందదని విమర్శించారు. ఐదు నెలలు క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించామని, వైద్యారోగ్యానికి రూ.2,280 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలిపారు. ఈ నిధులతో ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించి, ప్రభుత్వ వైద్యసేవలపై భరోసా కల్పిస్తామన్నారు. ఒక్కో ఏరియా ఆస్పత్రికి రూ.కోటి కేటాయించినట్లు వెల్లడించారు. ఉస్మానియా ఆస్పత్రికి 2010లో రూ.200 కోట్లు కేటాయిస్తే ఇప్పటికీ అతీగతీ లేదని, ఇది సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యమని విమర్శించారు. ఇక నుంచి అర్బన్ హెల్త్సెంటర్లలో కుక్కకాటు, పాముకాటుకు మందు అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, రామగుండం నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, మెడికల్ డెరైక్టర్ సాంబశివరావు, డీఅండ్‌హెచ్‌వో అలీం, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ
* తెలంగాణలో 54 కేసులు నమోదు.. 8 మంది మృతి * జిల్లాలకు మందుల సరఫరా * స్వైన్‌ఫ్లూపై కేంద్రానికి నివేదిక * చీటింగ్ చేస్తే సీజే: రాజయ్య సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. గడచిన కొద్ది నెలలుగా 54 కేసులు నమోదయ్యాయి. సకాలంలో గుర్తించని కారణంగా ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. వీరిలో నలుగురు గత రెండు రోజుల్లోనే మృతిచెందడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్వైన్‌ఫ్లూ కేసులు భారీగా నమోదు అవుతుండటంతో వైద్య ఆరోగ్య యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎన్ని కేసులు నమోదయ్యాయో చెప్పడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. గుండె, లివర్, కిడ్నీ వంటి వ్యాధులు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి త్వరగా వైరస్ సోకే ప్రమాదముందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు చనిపోయిన వారిలో ముగ్గురికి గుండె, షుగర్ వంటి వ్యాధులు ఉన్నాయని... వారికే స్వైన్‌ఫ్లూ సోకిందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చలికాలం కావడంతో వైరస్ సులువుగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని... రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి సోకే ప్రమాదం ఉందని అంటున్నారు. అందుబాటులో ‘వసాల్టిమీవిర్’ ఔషధం.. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్ర, ఏరియా ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ మందులను అందుబాటులో ఉంచారు. అవసరాన్ని బట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కూడా పంపాలని వైద్యాధికారులు ఆదేశాలు జారీచేశారు. స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా ఉన్నట్లు గుర్తిస్తే ‘వసాల్టిమీవిర్’ ఔషధం వాడాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డెరైక్టర్ పి.సాంబశివరావు ‘సాక్షి’కి చెప్పారు. ఈ ఔషధం పెద్దలకు మాత్రల రూపంలో, పిల్లలకు చుక్కల రూపంలో అందుబాటులో ఉందన్నారు. స్వైన్‌ఫ్లూ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారిస్తే ఈ ఔషధాన్ని వారం రోజులు వాడాల్సి ఉంటుందన్నారు. తలనొప్పి, ఒంటినొప్పులు, జలుబు, దగ్గు, జ్వరం ఉంటే అనుమానించి సమీపంలో ఉన్న ఆసుపత్రులకు వెళ్లి చూపించుకోవాలని ఆయన సూచించారు. ప్రధానంగా బలవర్థకమైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెంచుకోవాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ప్రజలు ఏమాత్రం భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని... మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్వైన్‌ఫ్లూపై కేంద్రానికి నివేదిక.. స్వైన్‌ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి గురువారం నివేదిక సమర్పించింది. కొన్ని నెలలుగా రాష్ట్రంలో 54 కేసులు నమోదు అయ్యాయని, జిల్లాలకు అవసరమైన మందులను సరఫరా చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరునూ ప్రస్తావించారు. చీటింగ్ చేస్తే సీజే.. డెంగీ, స్వైన్‌ఫ్లూ, ఎబోలా వ్యాధుల పేరుతో రోగులను చీటింగ్ చేసే ఆస్పత్రులను సీజ్ చేయిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య హెచ్చరించారు. ప్రమాదకరమైన వైరస్ సోకిన రోగి ఐసోలేషన్ వార్డులో ఉండకుండా బయట తిరగడంతో వైరస్ వ్యాప్తి చెందుతుందని, అటువంటి రోగులను గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన పర్యవేక్షణ బృందాల జాడే లేదని‘ సాక్షి’ ప్రచురించిన కథనానికి మంత్రి రాజయ్య స్పందించారు. వ్యాధుల పేరుతో రోగులను చీటింగ్ చేస్తూ చికిత్సల పేరుతో రోగుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్న ఆస్పత్రులపై విజిలెన్స్ దాడులు చేయించి వాటిని సీజ్ చేయిస్తామన్నారు. గాంధీ జనరల్ ఆసుపత్రిలోని స్వైన్‌ఫ్లూ వార్డును గురువారం ఆయన సందర్శించారు. డీఎంఈ పుట్టా శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ధైర్యవాన్, ఇతర వైద్య అధికారులతో స్వైన్‌ఫ్లూపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని ఫీవర్ ఆసుపత్రిలో అధునాతనమైన ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. -
ప్రభుత్వాస్పత్రుల ప్రక్షాళన
భద్రాచలం : వ్యాధుల బారిన పడినవారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించటమే లక్ష్యంగా ప్రభుత్వాస్పత్రులను ప్రక్షాళన చేస్తామని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం రాత్రి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో బస చేసేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ ప్రాంతంలో ‘నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానాకు’ అనే దుస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వాల శాపం, వారు చేసిన పాపం వల్ల ప్రభుత్వాసుపత్రులు నిర్వీర్యం అయ్యాయని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగం అభివృద్ధికి బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఏరియా ఆస్పత్రికి రూ.కోటి చొప్పున మంజూరు చేశామన్నారు. వైద్య సేవల వికేంద్రీకరణ దిశగా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకే తాను ఏరియా ఆస్పత్రిలో రాత్రి బస చేస్తున్నానని తెలిపారు. ఐదు నెలలుగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆస్పత్రుల్లో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నానని చెప్పారు. రిఫరల్ విధానానికి స్వస్తి పలకాలని, 30 శాతం ఉన్న ఆస్పత్రుల సేవలను 50 నుంచి 60 శాతం వరకు పెంచాలనే ఉద్దేశంతో ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. వైద్యులు రోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించారు. ప్రతి పీహెచ్సీ వైద్యుడికి ప్రత్యేక వాహనం కేటాయిస్తామని, ఇందుకోసం నెలకు రూ. 25 వేలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. పీహెచ్‌సీల స్థాయి పెంపు... రాష్ట్రంలో అవసరమైన చోట్ల పీహెచ్‌సీల స్థాయిని పెంచేందుకు తగిన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. 31 పీహెచ్‌సీల్లో మౌలిక వసతుల కల్పనకు కోసమని ఒక్కో కేంద్రానికి రూ.40 లక్షలు విడుదల చేస్తున్నామని, రూ.30 కోట్లతో పలు పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేస్తున్నామని చెప్పారు. వైద్యులకు కూడా ప్రొటోకాల్ ఉండేలా ఉత్తర్వులు ఇస్తామన్నారు. అయితే విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండే వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రాచలం ఆసుపత్రిలో ప్లేట్లెట్ కౌంట్ యంత్రం... మలేరియా, డెంగీ జ్వరాల నివారణకు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ప్లేట్లెట్ కౌంట్ యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి రాజయ్య తెలిపారు. ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి రూ.18.30 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి రూ.10 కోట్లు కేటాయించామన్నారు. మలేరియా, డెంగీ జ్వరాలు ఎక్కువగా నమోదయ్యే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రోగుల నాడిపట్టిన రాజయ్య.. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పలువురు రోగులను మంత్రి రాజయ్య నాడిపట్టి పరీక్షించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు. వైద్యశాఖపై సమీక్ష :- పర్యటనలో భాగంగా రాత్రి పది గంటల తరువాత వైద్య శాఖపై ఏరియా ఆసుపత్రిలోనే సమీక్షించారు. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో పలు విషయాలపై చర్చించారు. ఆయన వెంట ఐటీడీఏ పీవో దివ్య, భద్రాచలం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ భానుప్రకాష్, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్య, ఆసుపత్రుల జిల్లా సమన్వయ అధికారిణి ఆనందవాణి, సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి, క్లస్టర్ అధికారిణి కోమల తదితరులు ఉన్నారు. మంత్రి రాత్రి బస నేపథ్యంలో కొత్తగూడెం డీఎస్పీ సురేందర్ నేతృత్వంలో భద్రాచలం, పాల్వంచ సీఐలు ఆంజనేయలు, షుకూర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
పారిశ్రామిక రంగానికి సర్కారు ప్రోత్సాహం
ఖమ్మం అర్బన్ : పారిశ్రామిక రంగాన్ని టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని డిప్యూటీ ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. నగర శివారు గోపాలపురంలో భారత్ హ్యుండాయ్ షోరూమ్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. రాష్ర్టంలో పరిశ్రమలు స్థాపించేం దుకు ముందుకొచ్చే ఔత్సాహికులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. దేశంలో కార్ల దిగ్గజం హ్యుండాయ్ కార్ల కంపెనీ షోరూమ్‌ను ఖమ్మంలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. విశాలమైన ప్రాంతంలో షోరూమ్‌ను ఏర్పాటు చేసిన మేనేజింగ్ డెరైక్టర్ కేసా శ్రీకాంత్‌ను అభినందించారు. హ్యుండాయ్ కంపెనీ రీజనల్ సేల్స్ మేనేజర్ తేజా చౌదరి మాట్లాడుతూ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సరికొత్త కార్లను తయారు చేయడం కంపెనీ లక్ష్యమన్నారు. ఆర్పీ ఎస్.ఎం.గురుమూర్తి ప్రసాద్ మాట్లాడుతూ వినియోగదారులకు వినూత్న ఉత్పత్తులు అందించడమే హ్యుండాయ్ ధ్యేయమన్నారు. స్పేర్స్ విభాగాన్ని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ ప్రారంభించారు. ఈసందర్భంగా మేనేజింగ్ డెరైక్టర్ కేసా శ్రీకాంత్ మాట్లాడుతూ ఒకేసారి ఎక్కువ వాహనాలు సర్వీస్‌కు వచ్చినప్పుడు జాప్యం లేకుండా 10 నిమిషాల్లో కార్ వాష్, డెంటింగ్, పేయింటింగ్ అయ్యేలా సేవలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, చేవూరి లక్ష్మణ్‌కుమార్, గురుమూర్తి ప్రసాద్, వీర కిషోర్‌రెడ్డి, షోరూమ్ జనరల్ మేనేజర్ శయన్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్య సాధనతో ముందుకు సాగాలి
వరంగల్ స్పోర్ట్స్ : క్రీడారంగంలో లక్ష్య సాధనతో ముందుకు సాగాలని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య విద్యార్థులకు సూచించారు. హన్మకొండ జేఎన్ఎస్లో మూడు రోజులపాటు జరిగే 60వ ఎస్జీఎఫ్ఐ జిల్లాస్థాయి క్రీడోత్సవాలను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి.. 11 జోన్ల క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించడం ద్వారా పల్లెల్లో చదువుకుంటున్న విద్యార్థులు క్రీడాకారులుగా ఎదిగే అవకాశం ఉందన్నారు. గ్రామీణ క్రీడలను ప్రభుత్వం మన ఊరు, మన ప్రణాళిక ద్వారా ప్రోత్సహించేందుకు నిధులు కేటాయించనుందన్నారు. ప్రణాళికాబద్ధంగా క్రీడారంగాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు. తాను కూడా విద్యార్థి దశలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఆడానని, బ్యాడ్మింటన్‌లో జాతీయస్థాయిలో ఆడానని గుర్తు చేశారు. జిల్లాలోని క్రీడాకారులకు అన్ని రకాల వసతులు సమకూర్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. డీఈఓ విజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని క్రీడాకారులను ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని అన్నారు. పీఈటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణగౌడ్ మాట్లాడుతూ మార్చ్ఫాస్ట్ చేసే విద్యార్థులకు కనీసం బూట్లు, క్రీడా దుస్తులు లేవని అన్నారు. వచ్చే ఏడాదిలోపు ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని అందించినా.. లేకున్నా తాను జిల్లాలోని 11 జోన్లకు ఒక్కో జోన్‌కు రూ.10వేల చొప్పున అందిస్తానని అన్నారు. అనంతరం పెద్ది వెంకటనారాయణగౌడ్‌ను డిప్యూటీ సీఎం శాలువాతో సత్కరించారు. కాగా, పరకాల జోన్ చిన్నారులు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జిల్లాలోని వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట, ములుగు, మహబూబాబాద్, జనగామ, చేర్యాల, తొర్రూరు, వరంగల్ సిటీ, హన్మకొండ సిటీ, హన్మకొండ రూరల్ జోన్ల నుంచి అండర్-14,17 విభాగాల్లో ఆడేందుకు హాజరైన క్రీడాకారులతో జేఎన్ఎస్ కళకళలాడింది. కార్యక్రమంలో డీఎస్డీఓ శివకుమార్, జిల్లా పీఈటీల సంఘం మాజీ సెక్రటరీ కత్తి కుమారస్వామి, జిల్లా ఎస్జీఎఫ్ఐ సెక్రటరీ సురేందర్, పీఈటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అనంతపురం ప్రవీణ్‌కుమార్, వరికోటి వాసుదేవరావ్, వెంకటేశ్వర్లు, శంకర్‌నాయక్, కుమార్, శ్రీధర్ పాల్గొన్నారు. -
‘స్వచ్ఛ భారత్’ను నిర్మించాలి
అందరూ ఐకమత్యంతో కృషి చేయూలి డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య హన్మకొండ అర్బన్ : జిల్లాలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతిని ధులు, అధికారులు ఐకమత్యంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పరిశుభ్రత అమల్లో అందరూ భాగస్వాములైతే మనకు వచ్చే జబ్బుల్లో 60 శాతం వరకు అరికట్టవచ్చన్నారు. పేదరికం, నిరక్షరాస్యత వల్లే ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలను చైతన్యవంతుల్ని చేసి పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. జనాభాలో ప్రపంచంలో కెల్లా అతి పెద్ద దేశంగా ఉన్న చైనాను పరిశుభ్రత విషయంలో మనం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కలెక్టర్ గంగాధర కిషన్ మాట్లాడుతూ జిల్లా అధికారులు రెండు వార్డుల చొప్పున దత్తత తీసుకుని... నెలలో ఒక వారంపాటు వాటి పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. దేశ ప్రజలు అపరిశుభ్రత వల్ల రోగాల బారిన పడుతున్నారని, వైద్యం కోసం ఏడాదికి రూ.2.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని గంగదేవిపల్లిని ఆదర్శంగా తీసుకుని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న స్వచ్ఛ బారత్ నిర్మాణానికి అందరం కృషిచేయాలన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ బార్లు, ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం అధికంగా ఉంటోందని, ఈ విషయంలో యజమానులతో మాట్లాడి వాటి నిర్మూలనకు కృషి చేయూలని అధికారులను కోరారు. కార్యక్రమంలో జేసీ పౌసుమిబసు, నగర పాలక సంస్థ కమిషనర్ పాండాదాస్, ఏజేసీ కృష్ణారెడ్డి, డీఆర్వో సురేంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కార్యక్రమానికి హాజరైన వారితో ఉపముఖ్యమంత్రి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయిం చారు. కార్యక్రమంలో ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్, ఆరోగ్యమిత్ర సంస్థలు రూపొం దించిన ‘ప్రపంచ శాంతి-గాంధీ మార్గం’ కరపత్రాన్ని ఆవిష్కరించారు. -
డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అంతరంగం
- ఎన్నో కష్టాలకు ఎదురీది విజయ తీరాన్ని చేరిన డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అంతరంగం మాది నిరుపేద కుటుంబం. మా ఆర్థిక పరిస్థితులు బాగాలేక నాలుగో తరగతి తర్వాత మా నాన్న నన్ను బడికి కాకుండా పశువులుకాసే పనికి పంపాడు. ఇంద్రసేనారెడ్డి అనే సార్ మా నాన్న వద్దకు వచ్చి ‘నీ కొడుకు బాగా చదివి డాక్టరో, ఇంజనీరో అవుతాడని అనుకుంటే.. నువ్వేమో పశువులను కాయిస్తున్నావా’ అని అన్నారు. నా చదువు మళ్లీ మొదలైంది. నేను మ్యాథ్స బాగా చేస్తాను. ఇంజనీర్ అవుదామనుకున్నా. మా బంధువు ఒకరు ‘నువ్వు బాగా చదువుతావు.. డాక్టర్ అవ్వు అన్నాడు’. దాంతో బైపీసీ గ్రూపులోకి మారాను. ఆ తర్వాత ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఉద్యోగం వచ్చినా.. సొంత ప్రాక్టీస్‌పైనే దృష్టిపెట్టిన. రాజకీయూలపై మొదట్లో ఆసక్తి లేకపోరుునా 1997లో సోనియాగాంధీ ‘డు కమ్ ఇన్ టూ పాలిటిక్స్’ అని ఆహ్వానించడంతో కాంగ్రెస్‌లో చేరాను. 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచా. 2012లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. టీఆర్ఎస్లో చేరిన. కేసీఆర్ అభిమానంగా చూసుకున్నారు. ఇటీవల ఎన్నికలు ముగిసిన వెంటనే కేసీఆర్ గారు అందరిముందు ‘వైద్య ఆరోగ్య శాఖ మా రాజయ్య చూస్తడు’ అన్నరు. అప్పుడే నాకు మంత్రి పదవి ఖరారైందని తెలిసింది. జూన్ ఒకటిన మరోసారి గుర్తు చేద్దామని వెళ్లా... ‘నిన్ను డిప్యూటీ సీఎంను చేస్తున్నాను. రేపటి దాకా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. మీ ఆవిడకు కూడా తెలియవద్దు’ అన్నారు. ఆ క్షణం నా సంతోషానికి అవధుల్లేవు. మాది స్టేషన్‌ఘన్‌పూర్. నాన్న వెంకటయ్య, అమ్మ లక్ష్మి. నాకు ఒక తమ్ముడు, నలుగురు చెల్లెళ్లు. నిరుపేద కుటుంబం. నాన్న పాలేరు. మా సొంతూరు తాటికొండ(స్టేషన్‌ఘన్‌పూర్ మండలం). ఇంటిపేరు మారపాక. మా పూర్వీకులు స్టేషన్‌ఘన్‌పూర్‌కు వచ్చి స్థిరపడ్డారు. తాటికొండ ఊరు నుంచి వచ్చినందున అక్కడ మా ఇంటిపేరు తాటికొండగా మారింది. నేను మా అమ్మమ్మ వాళ్లింట్లో(రాజవరం) పుట్టాను. మా అమ్మమ్మ వేములవాడ రాజన్న భక్తురాలు(శివసత్తి). ఆమె నాకు రాజన్న అని పేరు పెట్టింది. ఇప్పటికీ వేములవాడకు వెళ్తుంటా. ఉప ముఖ్యమంత్రి అయ్యాకా వెళ్లొచ్చా. ఎంబీబీఎస్‌లో ఉన్నప్పుడే ఫాతిమామేరీతో పెళ్లయింది. ఆమెను భారతి అని పిలుస్తా. మా పెళ్లప్పుడు ఆమె పదో తరగతి. ఆ తర్వాత కష్టపడి లైబ్రరీ సైన్స్‌లో పీజీ పూర్తి చేసింది. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో సీనియర్ లైబ్రేరియన్‌గా పనిచేస్తోంది. నా జీవిత పయనంలో ఆమె పాత్ర ఎక్కువ. నా ఈ ఎదుగుదలకు ఆమే కారణం. నేనిప్పటికీ బట్టలు కూడా కొనుక్కోను. అన్నీ ఆవిడే చూస్తుంది. పిల్లల చదువు.. ఇంటి వ్యవహారం అన్నీ ఆమెకే తెలుసు. ఇద్దరు కుమారులు క్రాంతిరాజ్, విరాజ్... కోడళ్లు సింధు, శీతల్ వైద్యులే. నాన్నే నా కొడుకులా... నిజానికి మా నాన్నకు నేను కొడుకుగా కంటే తండ్రిగానే వ్యవహరించాను. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు మా పెద్ద చెల్లెలి పెళ్లి చేశాం. ఎండాకాలమంతా కూలిపని చేస్తే రూ.200 వచ్చాయి. దాంతో మా పెద్ద చెల్లి పెళ్లి చేశాం. నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు రెండో చెల్లి పెళ్లి అయింది. ఈ పెళ్లి కోసం నా పెళ్లి కుదిరింది. నా పెళ్లి ఖర్చులకని మా మామ ఐదు వేల రూపాయలు ఇచ్చారు. వాటితో రెండో చెల్లి పెళ్లి చేశాను. ఆ తర్వాత నా ప్రాక్టీస్ మీద మిగిలిన ఇద్దరు చెల్లెళ్ల పెళ్లి చేశా. పాలేరుగా ఉన్న నాన్నకు సొంత భూమి కొనిచ్చి యజమానిని చేసిన. 2008 ఎన్నికలప్పుడు నేను నామినేషన్ వేసి రెండు రోజులకే మా నాన్న చనిపోయాడు. నా ఎన్నిక విషయంలో గెలుపోటములపై రందితోనే అలా జరిగిందేమో. నాన్న మరణం నా జీవితంలో ఎక్కువ బాధాకరమైన సందర్భం. నా జీవితంలో మరిచిపోలేని వ్యక్తి.. ఫాదర్ కొలంబో. నాకు మార్గదర్శకుడు. చదువుకునేందుకు నాకు సహాయం చేశారు. క్రమశిక్షణ ఆయన నుంచే నేర్చుకున్నా. 2009లో నేను ఎమ్మెల్యే అయ్యాక మరణించారు. అయన అంతిమ సంస్కారాలు చేసే రోజునే.. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణించే హెలికాప్టర్ మిస్సయిందనే సమాచారం వచ్చింది. నా రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి. నేను ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలల 17 రోజులకే వైఎస్ మరణించారు. అది బాగా బాధ కలిగించింది. సార్ మాటలు నమ్మకాన్ని పెంచారుు నాలుగో తరగతి వరకు ఊళ్లోనే చదివా. చిన్నప్పుడు నాతోటి వాళ్లు బడికి పోతుంటే నేను పశువులు మేపేందుకు వెళ్లేవాడిని. ఒక్క పశువు కాస్తే ఒక్క రూపాయి ఇచ్చేవారు. 31 పశువులను కాసేవాడిని. 13 నెలలు పశువులు కాశాను. నేను పశువులు కాస్తున్నా నా దృష్టంతా బడిమీదనే. మా పాఠశాలలో ఇంద్రసేనారెడ్డి అనే మా సార్ ఉండె. ఆ సార్ మా నాన్న దగ్గరికొచ్చి ‘అరె వెంకటి నీ కొడుకు బాగా చదివి డాక్టరో, ఇంజనీరో అవుతాడని అనుకుంటే.. నువ్వేమో పశువులను కాయిస్తున్నావా’ అని అన్నారు. ఆ మాటలను అక్కడే ఉన్న నేను విన్నాను. ఆ మాటలు నా మీద నాకు నమ్మకం పెంచాయి. అట్లా నా చదువు మళ్లీ మొదలైంది. నేను మ్యాథ్‌మెటిక్స్ బాగా చేస్తాను. టెన్త్‌లో నాది కాంపోజిట్ మాథ్స్. కనుక ఇంజనీర్ అవుదామనుకున్నా. ఇంటర్మీడియట్ ఎంపీసీలో జాయిన్ అయ్యా. మా కజిన్ బాలస్వామి అప్పటికే ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఓసారి ఆయన నా దగ్గరికొచ్చి ‘మన తాటికొండ వారిలో నేను ఇంజనీర్‌ను అవుతున్నాను.. నువ్వు బాగా చదువుతావు డాక్టర్ అవ్వు అన్నాడు’. అంతే.. ఆ మాటతో బైపీసీ గ్రూపులోకి మారాను. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు బాలసముద్రం హాస్టల్లో ఉండేవాడిని. కేఎంసీలో 1981లో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. మొదటి పిల్లల నర్సింగ్ హోం... ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టిన. కొత్తలో ఖాళీ లేకుండా పనిచేశాను. 1984లో ట్రైబల్ మెడికల్ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో పోస్టింగ్. జీతం రూ.3200. అప్పుడే ఎంఎస్(ఈఎన్టీ)లో సీటు వచ్చింది. అప్పటికి నేను ప్రాక్టీస్‌లో ఉన్నాను. పీజీ చేస్తే బాగుంటుందని ఈఎన్టీలో జాయిన్ అయ్యా. దాంట్లో నాకు సంతృప్తి కలగలేదు. తొమ్మిది నెలల తర్వాత పిల్లల డాక్టర్ కావాలని డీసీహెచ్ చేశాను. 1987లో ఏపీపీఎస్సీ ద్వారా ఖమ్మం జిల్లా వైరాలో అసిస్టెంట్ సివిల్ సర్జన్ ఉద్యోగం వచ్చింది. అప్పటికే ప్రాక్టీసుతో రూ.10 వేల వరకు వస్తోంది. ఉద్యోగంతో వచ్చేది సగమే. దీంతో ప్రైవేట్ ప్రాక్టీస్‌కే మొగ్గు చూపాను. జిల్లాలో పిల్లల వైద్యానికి సంబంధించిన ఒక్క నర్సింగ్‌హోమ్ కూడా లేదు. దీన్ని గమనించి క్రాంతి చిల్డ్రన్స్ అండ్ జనరల్ హాస్పిటల్‌ను ప్రారంభించా. వరంగల్ జిల్లాలో ఇదే మొదటి పిల్లల నర్సింగ్ హోం. ఒక దళిత డాక్టర్ నర్సింగ్ హోం పెట్టడం కూడా అదే తొలిసారి. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా పేషెంట్లు వచ్చేవారు. మొదటి నుంచీ ప్రజల్లోనే.. విద్యార్థిగా ఉన్నప్పుడు విప్లవ భావాలను ఇష్టపడేవాడిని. పీడీఎస్‌యూలో పనిచేశా. 1984-88లో జూనియర్ డాక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశా. నా ప్రాక్టీస్ బాగా నడుస్తున్న రోజుల్లోనే ప్రతి ఆదివారం, బుధవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో వైద్యం అందించేవాడిని. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఉచిత వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టాను. వైద్యం, మందులు అన్ని నేనే సమకూర్చుకునేవాడిని. ఈదురుమూడిలో ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైంది. తెలంగాణలో ఒక ఎస్సీ మాదిగ డాక్టర్‌గా నా జాతి హక్కుల కోసం ముందు నిలబడ్డాను. నా కులాన్ని నేను గొప్పగా చెప్పుకున్నా. ఆత్మగౌరవం కోసం పోరాడాను. అప్పుడు డొక్కా మాణిక్యవరప్రసాద్, ఆర్.విల్సన్ నేను కలిసి పనిచేశాం. జిల్లాలోనే ప్రభుత్వ అనుమతితో అంబేద్కర్ విగ్రహం నేను మొదట పెట్టించా. హాస్పిటల్ పెట్టే క్రమంలో సమస్య వస్తే ప్రణయభాస్కర్ సహకరించారు. చిన్నప్పుడే జై తెలంగాణ నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం అంటే ఏమిటో అప్పుడు తెలియదు. అందరి లాగే మేమూ జై తెలంగాణ అంటూ రోడ్లమీద పడ్డాం. లాఠీదెబ్బలు తిన్నా. ఓసారి విజయవాడ నుంచి వచ్చే ప్యాసింజర్ రైలును అడ్డుకునేందుకు రైలు పట్టాలకున్న బోల్ట్లను తొలగించాం. పోలీసులు తరిమారు. రెండు మూడు కిలోమీటర్లు ఉరికి ఓ పశువుల కొట్టంలో దాసుకున్నం. చీకటి అయ్యాక ఇంటికి వెళ్లిపోయాను. రాజకీయాలు... 1994 ఎన్నికల ముందు దాస్యం ప్రణయ్‌భాస్కర్‌ను తీసుకుని దగ్గుబాటి వెంకటేశ్వర్రావు నా దగ్గరికి వచ్చి రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఆ తర్వాత బీజేపీ నేత బండారు దత్తాత్రేయ కూడా ఆహ్వానించారు. రాజకీయాలంటే నాకు ఇష్టం లేదని చెప్పాను. దండోరా ఉద్యమం తర్వాత నా దృక్పథంలో మార్పు వచ్చింది. 1997లో వైఎస్ రాజశేఖరరెడ్డి.. సోనియాగాంధీ వద్దకు తీసుకెళ్లారు. అప్పుడామె ‘డు కమ్ ఇన్ టు పాలిటిక్స్’ అని ఆహ్వానించారు. అప్పుడు కాంగ్రెస్‌లో చేరాను. 1999లో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయా. 2004లో అవకాశం రాలేదు. 2008 ఉప ఎన్నికల్లోనూ గెలవలేదు. 2009లో నాలుగు పార్టీలు మహాకూటమిగా ఉన్నా అడ్డంకులను అధిగమించి 11,600 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాను. టీఆర్ఎస్ ప్రస్థానం... నేను ఎమ్మెల్యే అయిన కొన్ని నెలలకు, 2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అదే రోజు కొందరు వైద్య మిత్రులు కలిసి ఎంజీఎంకు ప్రొజెక్టురు డొనేట్ చేసే కార్యక్రమం ఉండె. నేను గెస్ట్‌గా వెళ్లా. నా మిత్రులు జై తెలంగాణ నినాదాలు చేశారు. నన్నూ అనమన్నారు. అన్నాను. యూనివర్సిటీలో విద్యార్థులు మిగిలిన ప్రజాప్రతినిధులపైకి చెప్పులు వేసి వ్యతిరేకత తెలిపినా నన్ను మాత్రం పూలదండలతో ఆహ్వానించారు. కేసీఆర్ నిమ్స్‌లో ఉన్నప్పుడు నేరుగా వెళ్లి వచ్చా. తెలంగాణ కోసం నాలుగుసార్లు రాజీనామా చేశాను. 2012లో కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా. మలిదశ ఉద్యమంలో అధికార పార్టీని వీడిన తొలి దళిత ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన. తర్వాత కేసీఆర్‌గారు నన్ను టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. నాపై నమ్మకంతో 87 నియోజకవర్గాల్లో తిప్పారు. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్ల బిజీ షెడ్యూల్ వల్ల కొన్ని కార్యక్రమాలకు నేనే వెళ్లేవాడిని. నాకు ఇది బాగా కలిసివచ్చింది. కేసీఆర్‌గారు ఎన్నికలు ముగిసిన వెంటనే అందరిముందు ‘వైద్య ఆరోగ్య శాఖ మా రాజయ్య చూస్తడు’ అన్నరు. అప్పుడే నాకు మంత్రి పదవి ఖరారైందని తెలిసింది. జూన్ ఒకటిన మరోసారి గుర్తు చేద్దామని వెళ్లా ‘నిన్ను డిప్యూటీ సీఎంను చేస్తున్నాను. రేపటి దాకా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. మీ ఆవిడకు కూడా తెలియవద్దు’ అన్నారు. ఆ క్షణం నా సంతోషానికి అవధుల్లేవు. జీవితంలో ఎక్కువ ఉత్కంఠ అనుభవించిన రోజు అదే. తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ మార్గదర్శకత్వంలో పనిచేసుకుంటూ పోతున్నా. నాకు ఉన్నతమైన స్థానం కల్పించిన కేసీఆర్‌కు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటా.. తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తా. అందరూ బాగుండాలని కోరుకుంటా. ‘నీ వలెనే నీ పొరుగువారిని ప్రేమించు’ అనే ఏసుక్రీస్తు సూక్తి నాకు ఎప్పడూ స్ఫూర్తిగా ఉంటుంది. -
పాడిపరిశ్రమ అభివృద్ధికి కృషి
{పతీ రైతు ఓ గేదెను పెంచుకోవాలి డిప్యూటీ సీఎం డాక్టర్ టి.రాజయ్య రెండేళ్లలో నియోజకవర్గంలోని రిజర్వాయర్లు పూర్తి : ఎంపీ కడియం స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్: పాడిపరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. పాల ఉత్పత్తిదారుల సంఘం, స్టేషన్‌ఘన్‌పూర్ పాల శీతలీకరణ కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మండలకేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న స్థలంలో పాడిపంటపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం హాజరయ్యారు. కార్యక్రమంలో మొదట స్థానిక పాలశీతలీకరణ కేంద్రంలో విజయపాలు, పాల పదార్థాల విక్రయ కేంద్రాన్ని ఆయనతోపాటు ఎంపీ కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు చింతకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సదస్సులో రాజయ్య మాట్లాడారు. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో 3,95,634 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుండగా 60శాతం మాత్రమే స్థానికంగా వినియోగిస్తున్నారన్నారు. మిగిలిన 40 శాతం మార్కెట్‌కు, పాల ఉత్పత్తులను తయారు చేసేందుకు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు రైతులు కృషి చేయాలన్నారు. రైతులు వ్యవసాయంతో పాటు చేపల పెంపకం, పౌల్ట్రీఫాంలపై ఆసక్తి చూపాలని, ప్రతీ రైతు ఒక గేదెను పెంచాలని సూచించారు. స్థానిక పాలశీతలీకరణ కేంద్రాన్ని ఐదువేల లీటర్ల సామర్థ్యంతో తిరిగి నిర్మించేందుకు కృషి చేస్తాన ని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వ భూమి కేటాయించేందుకు కృషిచేస్తానన్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా కార్యక్రమానికి రావడం ఆలస్యమైందని, రైతుల క్షమించాలని కోరారు. రైతుల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం : కడియం రైతు సంక్షే మమే ధ్యేయంగా కేసీఆర్ కృషి చేస్తున్నారని వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి అన్నారు. రైతు రుణమాఫీకి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. నియోజక వర్గంలోని కొన్ని రిజర్వాయర్ల పనులు, కాల్వల పనులు నిర్మాణ దశలోనే ఉన్నాయని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చి రెండేళ్లలో కాల్వల నిర్మాణం పూర్తి చేసి లక్షా నలభైవేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం పాల ఉత్పత్తిదారుల సంఘం, పాల శీతలీకరణ కేంద్రం ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం రాజయ్య, ఎంపీ శ్రీహరిలను శాలువా, జ్ఞాపికలు, పుష్పగుచ్చాలతో సన్మానించారు. సమావేశంలో ఎంపీ కడియం మాట్లాడుతూ ఉండగానే డిప్యూటీ సీఎం తనకు వేరే పని ఉందంటూ మధ్యలోనే వెళ్లిపోయారు. సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం రాజయ్య పశుప్రదర్శనలో ఉంచిన గేదెలు, ఆవులు, లేగదూడలను పరిశీలించారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ జేడీ శంకర్‌రెడ్డి, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు రామారావు, టీఆర్ఎస్మండల పార్టీ అధ్యక్షుడు సీహెచ్.నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ భూక్య స్వామినాయక్, ఎంపీపీ వంగాల జగన్మోహన్రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ గట్టు రమేష్, ఎంపీటీసీ సభ్యులు డాక్టర్ జైహింద్‌రాజ్, గోనెల ఉపేందర్, శివునిపల్లి సర్పంచ్ సమ్మక్క, టీఆర్ఎస్ నాయకులు సింగపురం జగన్, చట్ల కుమార్‌గౌడ్, తోట సత్యం, పెసరు సారయ్య, పార్శి కమల్‌కుమార్‌తో పాటు పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యత అందరిది..
సర్వేకు అన్ని వర్గాలు సహకరించాలి : డిప్యూటీ సీఎం రాజయ్య సీకేఎం కళాశాలలో జయశంకర్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ హాజరైన స్పీకర్, ఎంపీ, ఎమ్మెల్యేలు పోచమ్మమైదాన్ : ఎన్నో ఏళ్ల పోరాటాల అనంతరం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యత అన్నివర్గాలపై ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఈ మేరకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. వరంగల్‌లోని సీకేఎం కళాశాల మైదానంలో ప్రొఫెసర్ జయశంకర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స మావేశంలో రాజయ్య ముఖ్యఅతిథిగా మా ట్లాడుతూ సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపడుతోందని, దీన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని, అప్పట్లో వరంగల్‌లోని లక్ష్మీ థియేటర్ వద్ద జరిగిన కాల్పుల్లో తన తొడకు బుల్లెట్ దిగిందని గుర్తు చేశారు. అలాగే, 1977-1978 సంవత్సరంలో సీకేఎం కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం పూర్తిచేయ గా, తర్వాత ఎంబీబీఎస్‌లో సీటు రావడంతో కేఎంసీలో చేరానని వివరించారు. కళాశాలల్లో అధ్యాపకులు పెట్టిన భిక్షతోనే తాను ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్నానని రాజయ్య అన్నారు. కాగా, ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న పార్ట్‌టైం ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జయశంకర్ రాకతోనే కళాశాలకు వైభవం వరంగల్ సీకేఎం కళాశాలే తన జీవితాన్ని తీర్చిదిద్దిందని అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. 1975 సంవత్సరంలో జయశంకర్ సార్ ఈ కళాశాలలో అధ్యాపకుడిగా చేరకముందే చదివేందుకు ఎవరూ ఆసక్తి చూపే వారు కాదని, ఆయన వచ్చాక కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరి గిందన్నారు. ఈ విషయంలో జయశంకర్ కూడా తన జీవితంలో సీకేఎం కళాశాలో పని చేసిన సమయమే సంతృప్తినిచ్చిందని చెప్పేవారని గుర్తు చేశారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడిన జయశంకర్ సార్ రాష్ట్రం ఏర్పడ్డాక లేకపోవడం దురదృష్టకరమన్నారు. మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ మాట్లాడుతూ ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వం టేక్ఓవర్ చేసేలా మేనేజ్మెంట్లు సహకరించాలని కోరారు. ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ మా ట్లాడుతూ విద్య, సాధన, శోధన సీకేఎం కళాశాలలో ఉన్నందునే ఇక్కడ చదివిన వారు ఉన్నత స్థాయికి చేరారని పేర్కొన్నారు. మానకొండురు ఎమ్మెల్యే రాసమయి బాలకిషన్ మాట్లాడుతూ ఏ పదవిని ఆశించకుండా తెలంగాణ కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. జయశంకర్ సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు పాటలు పాడి విద్యార్థులను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పూల రవీందర్, తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి, ఆకారపు చెన్నవిశ్వేశ్వర్రావు, చందా విజయ్‌కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఉపేంద్రశాస్త్రి, శర్మ, ధర్మారెడ్డి, వెంకట్‌రెడ్డి, సాంబయ్య, వీరాచారి, సొల్లేటి విజయ్‌కుమార్, చక్రపాణి, శోభాకుమారి, స్వర్ణలత పాల్గొన్నారు. పలువురి విరాళం సీకేఎం కళాశాలలో జయశంకర్ విగ్రహ ఏర్పాటుకు పలువురు ఆర్థిక సాయం అందజేశారు. కళాశాల పూర్వ విద్యార్థులు రూ.లక్ష, ప్రొఫెసర్ ఎస్వీఎన్.శర్మ రూ 10వేల చెక్‌ను స్పీకర్ చేతుల మీదుగా ప్రిన్సిపాల్‌కు ఇచ్చారు. అలాగే, కళాశాలలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లంక రాజ్‌గోపాల్, నాగబెల్లి ప్రశాంత్, సాయి, నాగరాజు తదితరులు ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. కాగా, కొందరి ప్రసంగాలు సుదీర్ఘంగా సాగడంైతోఎంపీ సీతారాంనాయక్ ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విద్యార్థుల్లో ఆలోచనా విధానాన్ని పెంపొందించాలి
చర్చిల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య హన్మకొండ చౌరస్తా : ఆరు దశాబ్దాల పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోంది.. అందులో భాగంగానే రూ.50వేల కోట్లు కేటాయించిందని ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. హన్మకొండ లోని మిషన్ ఆస్పత్రి ఆదివారం పునఃప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజయ్య మాట్లాడుతూ సామాజిక తెలంగాణకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలోని చర్చిల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. మిషన్ ఆస్పత్రికి పూర్వ వైభవం తీసుకురావడానికి పాటుపడతాన ని అన్నారు. ఆస్పత్రి భూముల ఆక్రమణ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున తీర్పును ఇరు వర్గాలు శిరసావహించాలని సూచించారు. వివాదంలో ఉన్న భూమి ఎవరికి వచ్చినా వైద్య సేవలందించేందుకు సహకరించాలని కోరా రు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ పేదలకు సేవలందించే ఆస్పత్రి భూమిని కబ్జాచేసిన వారిని జైలుకు పంపించాలన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని, ఆయనకు అందరం సహకరిస్తే త్వరలోనే బంగా రు తెలంగాణ సాకారమవుతుందని చెప్పారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారిని కేసీఆర్ వదలరని, అందుకు గురుకుల్ ట్రస్టు నిర్మాణాల కూల్చివేతే నిదర్శనమని పేర్కొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ ఆస్పత్రి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. అంత కు ముందు సీబీసీ చర్చిలో ప్రత్యేక ప్రార్థలను చేశారు. కార్యక్రమంలో త్రినగర క్రైస్తవ సహవాసం అధ్యక్షుడు కురియన్, టీసీఎఫ్ అధికార ప్రతినిధి డాక్టర్ పల్లెపాడు దామోదర్, సీబీసీ చర్చి పాస్టర్ నిరంజన్‌బాబు, ఇమ్మానియల్, సుధాకర్, జాన్సన్, యాకోబ్, టి.పాల్, జోసఫ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం రాజయ్యను క్రైస్తవ సంఘాల బాధ్యులు సన్మానించారు. రోగుల భాగోగులు తెలుసుకున్న రాజయ్య సాయంత్రం ఆస్పత్రిలోని వార్డులను సందర్శించిన డిప్యూటీ సీఎం రాజయ్య రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, ఇతర సమస్యలపై అడిగి తెలుసుకున్నా రు. సిబ్బంది అటెండెన్స్ రిజిష్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా అప్పుడే పుట్టిన శిశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ ఆస్పత్రిని రెండు వందల పడకలకు విస్తరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. డిప్యూటీ సీఎం వెంట వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరక్టర్ డాక్టర్ సాంబశివరావు, వైద్యులు ఉన్నారు. సమగ్ర సర్వేతోనే అర్హులకు ప్రయోజనం : డిప్యూటీ సీఎం చిల్పూరుగుట్ట(స్టేషన్‌ఘన్‌పూర్) : సమగ్ర కుటుంబ సర్వే ద్వారానే అర్హులకు ప్రభుత్వ పరంగా ప్రయోజనం చేకూరుతుందని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని చిల్పూరు ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 19న నిర్వహించే సమగ్ర సర్వేపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అధికారులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలను కోరారు. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల్లో మొత్తం 84 లక్షల కుటంబాలున్నాయని, వీరికోసం గత పాలకులు 1996లో మల్టీపర్పస్ హౌస్‌హోల్డ్ సర్వే, 2002లో బీపీఎల్ సర్వే, 2005లో సోషల్ఎకనామిక్, 2011, 2013లోనూ సర్వేలు నిర్వహించి 55లక్షల ఇండ్లు, 71లక్షల మందికి పింఛన్లు, కోటి 10లక్షల మందికి రేషన్ కార్డులిచ్చారని అన్నారు. ఆయా ప్రభుత్వాల్లో అనర్హులు లాభపడగా పేదలు పేదలుగానే మిగిలిపోయారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏగ్రామంలోకి వెళ్లినా ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు అడుగుతుండడంతో సీఎం కేసీఆర్ సమగ్ర కుటంబ సర్వే కార్యక్రమానికి స్వీకారం చుట్టారని వివరించారు. సర్వే రోజు తానుకూడా నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పారు. మంత్రి పదవితోపాటు ఉపముఖ్య మంత్రి పదవి ఇచ్చినందున 10 జిల్లాల్లో తిరగడం వలన నియోజకవర్గ ప్రజలను కలుసుకోవడంలో జాప్యం జరుగుతోందని, ఇక నుంచి వారంలో ఒక రోజు జిల్లా కేంద్రంలోనూ, మరొక రోజు నియోజకవర్గం లోని ఏదోఒక మండలంలో పర్యటించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటానని పేర్కొన్నారు. -
సంబురాల ‘కోట’
ఖిలావరంగల్‌లో అంబరాన్నంటిన స్వాతంత్య్ర వేడుకలు ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించిన ప్రభుత్వ శకటాల ప్రదర్శన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు ఖిలా వరంగల్, హన్మకొండ అర్బన్ : స్వాతంత్య్ర వేడుకలతో చారిత్రక ప్రాంతమైక ఖిలావరంగల్ కోట పులకించింది. గతంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, కళాకారులు, విద్యార్థులు, ప్రభుత్వ సిబ్బంది ఎక్కువగా ఉండేవారు. కానీ.. జిల్లా చరిత్రలో మొదటిసారిగా ఖిలావరంగల్ కోటలో శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో సామాన్యులు అధిక సంఖ్యలో హాజరుకావడంతో పండుగ వాతావరణం నెలకొంది. మధ్య కోటలోని ఖుష్‌మహల్ సమీపంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు ఘనంగా నివాళులర్పించారు. మామునూరు డీఎస్పీ, పరేడ్ కమాండెంట్ సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో 53 మంది పోలీసులు చేపట్టిన గౌరవ వందనాన్ని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అందుకున్నారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు, ఉత్తమ అధికారులు, సేవా సంస్థ ప్రతినిధులకు ఆయన ప్రశంసాపత్రాలు అందజేశారు. కోట కళకళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజల రాకపోకలతో కోట ప్రాంగణం కళకళాడింది. ఉదయం 10.05 నుంచి 11 గంటల వరకు ప్రభుత్వ శకటాల ప్రదర్శన కొనసాగింది. ఐటీడీఏ శకటం ముందు ఏర్పాటు చేసిన బంజారా నృతం, గ్రామీణాభివృద్ధి శాఖ శకటం ముందు ఏర్పా టు చేసిన బోనాల పండుగ నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. డీఆర్డీఏ సిబ్బంది వంద మీటర్ల త్రివర్ణపతాకంతో చేసిన పరేడ్ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతకు ముందు హైదరాబాద్ పోలీసులకు ఇటీవల అందుబాటులోకి తెచ్చిన వాహనాలతో ప్రత్యేక పరేడ్ చేయించారు. ఐదు ద్విచక్ర వాహనాలు, రెండు ఇన్నోవా వాహనాలతో జరిగిన పరేడ్‌ను ప్రజలు ఆసక్తిగా తిలకిం చారు. అయితే వేడుకల ప్రాంగణంలో మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ శకటానికి ప్రథమ బహుమతి ఉత్సవాల్లో వివిధ ప్రభుత్వ శాఖలు తమతమ కార్యక్రమాలను తెలియజేస్తూ శకటాలను ప్రదర్శించాయి. వ్యవసాయ శాఖ, వైద్యారోగ్యం, డ్వామా, పర్యాటక, సర్వశిక్షాభియాన్, 108, ఆర్డబ్ల్యూఎస్, మైనర్ ఇరిగేషన్, బిందుసేద్యం, పశుసంవర్థక, డీఆర్డీఏ, అటవీ శాఖలు ప్రదర్శించిన శకటాలు అందరినీ ఆకట్టుకున్నారుు. వీటిలో వ్యవసాయశాఖకు ప్రథమ, ఏపీఎంఐపీకి ద్వితీయ, సర్వశిక్షాభియాన్‌కు తృతీయ బహుమతులు దక్కాయి. కట్టిపడేసిన సాంస్కృతిక ప్రదర్శనలు స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిద పాఠశాలల చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. మొత్తం 900మంది విద్యార్థులు ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ముందుగా ధర్మసాగర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థులు జయ జయహే తెలంగాణ గేయూనికి బృంద నృత్యం చేశారు. అనంతరం హన్మకొండ సెయింట్‌పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, వరంగల్ రిషి హైస్కూల్ విద్యార్థులు నిర్వహించిన తీజ్ సంప్రదాయ నృత్యం ఉత్సాహపరిచింది. మల్లికాంబ మనోవికాస కేంద్రం విద్యార్థుల ప్రదర్శన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మడికొండ సాంఘిక సంక్షేమ గురుకులం, వాగ్ధేవి హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శనలో భాగస్వాములయ్యూరు. వల్లంపట్ల నాగేశ్వరరావు అధ్వర్యంలో వివిధ భాషలకు చెందిన దేశభక్తిగీతాలను విద్యార్థులు ఆలపించారు. ముగ్ధుం వ్యాఖ్యానం ప్రత్యేకంగా నిలిచింది. అనంతరం న్యాయనిర్ణేతలు విజేతలను ఎంపిక చేశారు. మల్లికాంబ విద్యార్థులు ప్రథమ, ఫాతిమా ప్రభుత్వ సహాయక పాఠశాల విద్యార్థులు ద్వితీయ, ధర్మసాగర్ కస్తూర్బా విద్యార్థులు తృతీయ స్థానాల్లో నిలిచారు. మడి కొండ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు నాలుగో స్థానంలో నిలవగా... వీరికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అన్ని పాఠశాలల విద్యార్థులకు కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. వేడుకలకు పటిష్ట బందోబస్తు స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో ఖిలావరంగల్ కోటను పోలీసుల స్వాధీనంలోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు ఆదేశాల మేరకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నగర డీఎస్పీ రాజమహేంద్ర నాయక్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వేడుకల బందోబస్తులో ముగ్గురు ఓఎస్డీలు, నలుగురు డీఎస్పీలు, 15మంది సీఐలు. 20మంది ఎస్సైలతోపాటు 500 మంది కానిస్టేబుళ్లు బం దోబస్తులో పాల్గొన్నారు. వేడుకల్లో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కొండా సురేఖ, వినయ్‌బాస్కర్, అరూరి రమేష్, కలెక్టర్ జి.కిషన్, వరంగల్ రూరల్, అర్బన్ ఎస్పీలు లేళ్ల కాళి దాసు, వెంకటేశ్వర్రావు, జిల్లా రెవెన్యూ అధికారి సురేంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు. -
సమగ్రాభివృద్ధికేసర్వే
పథకాల్లో అవినీతిని నివారిస్తాం ఎన్నికల మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తాం తెలంగాణలో ఓరుగల్లుకు విశిష్ట స్థానం జిల్లా అభివృద్ధే ధ్యేయం ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ‘కోట’లో కనులపండువగా స్వాతంత్య్ర దినోత్సవం సాక్షి, హన్మకొండ: సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకే ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. ప్రభుత్వం వద్ద సరైన సమాచారం లేకపోవడం వల్ల సంక్షేమ పథకాలు దుర్వినియోగమవుతున్నాయని.. రేషన్‌కార్డులు, గృహ నిర్మాణం, పెన్షన్ల వంటి పథకాల్లో అవినీతి చోటుచేసుకుంటోందన్నారు. దీన్ని నివారించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆరోజు ప్రజలందరూ ఇళ్లలో ఉండి సరైన సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఖిలావరంగల్‌లో శుక్రవారం నిర్వహించిన 68వ స్వాతంత్య్ర వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి రాజయ్య పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్ర ఉత్సవాలకు హాజరైన ప్రజలు, ప్రముఖులను, అధికారులు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతాపరుద్రుడు, రాణిరుద్రమ వంటి కాకతీయ చక్రవర్తులు పాలించిన నేలపై స్వాతంత్య్ర దినోత్సవం జరపడం.. అందులో తాను జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నందుకు గర్వపడుతున్నానన్నారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని రాజయ్య పేర్కొన్నారు. మన జిల్లాకు చెందిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని, 12 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండటం.. రాష్ట్ర గీతాన్ని జిల్లాకు చెందిన అంద్శైరచించడం మనకు గర్వకారణమని అన్నారు. హామీలు అమలు చేస్తాం.. రాష్ట్ర ప్రభుత్వ చేపట్టబోతున్న కార్యక్రమాలు, జిల్లా అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను డిప్యూటీ సీఎం తన ప్రసంగంలో పేర్కొన్నారు. భూమిలేని దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేస్తున్నామని, అందులో భాగంగా నేడు పది నియోజకవర్గాల్లో పది గ్రామపంచాయతీల్లో భూ పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఎన్నికల మెనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయడంలో భాగంగా రాష్ట్ర మంత్రి వర్గం 43 నూతన పథకాలు ప్రకటించిందని గుర్తు చేశారు. ఓరుగల్లుకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉందని, అందువల్లే ఉపముఖ్యమం త్రి, స్పీకర్ వంటి కీలక పదవులు జిల్లాకు లభించాయన్నారు. ఈ పదవులు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృద్ధే ధ్యేయం పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, లెదర్‌పార్క్, కాజీపేటలో వ్యాగన్ వర్క్‌షాప్ వంటి కీలక ప్రాజెక్టులు త్వరలో ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. రాబోయే 20 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 183 మురికివాడల్లో రూ.26.45 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా రూ.75 కోట్లతో మోగాటూరిజం సర్క్యుట్, రూ 1.1 కోట్లతో ఎంజీఎం ఆస్పత్రి పునరుద్ధరణ, దానితో పాటు రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. అదేవిధంగా 13వ ఆర్థిక ప్రణాళిక సంఘం ద్వారా రూ.6 కోట్ల వ్యయతో మల్యాల, తాటికొండ, పైడిపల్లి, సిద్ధాపూర్, ఇప్పగూడ, కొండపర్తి, ఓబుల్ కేశవాపూర్, కురవిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించనున్నట్లు చెప్పారు. వరంగల్‌లో హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. జిల్లాలో ‘మనగ్రామం-మనప్రణాళిక’ కింద రూ.1450 కోట్లు, మన మండలం-మన ప్రణాళిక కింద రూ.2600 కోట్లు, మన జిల్లా -మన ప్రణాళిక కింద రూ.200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. మున్సిపాలిటీల అభివృద్ధికి రూ 32.47 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రక్షిత మంచినీరు అందించేందుకు రూ.204 కోట్లతో 16 ప్రాజెక్టులు చేపట్టగా ఇప్పటికే 2 ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. జాతీయ రహదారుల విభాగం ద్వారా రూ.442 కోట్లతో వివిధ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. విద్యుత్ లోటును అధిగమించడంలో భాగంగా భూపాలపల్లిలో మరో 500 మెగావాట్ల విద్యుత్‌ప్లాంట్ నిర్మాణం చేయబోతున్నట్లు చెప్పారు. పదోతరగతి ఫలితాల్లో 94.54 శాతం ఉత్తీర్ణత సాధించి తెలంగాణలో మొదటిస్థానంలో నిలిచిన విద్యాశాఖకు డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం కావాలని పిలుపునిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. -
మన ఊరు - మన ప్రణాళిక
ధర్మసాగర్ : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుతామని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. మన ఊరు - మన ప్రణాళికలో పొందుపరిచిన అంశాల ఆధారంగానే రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రం లోని సుస్మితాగార్డెన్స్లో మంగళవారం ఎంపీ పీ వల్లపురెడ్డి లక్ష్మీ అధ్యక్షతన ‘మన మండలం - మన ప్రణాళిక’ సమావేశాన్ని నిర్వహించా రు. ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం రాజయ్య హాజరై మాట్లాడారు. సీమాంధ్రులను ఎదురించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారుమయంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీ ఎంప్లాయీస్‌తో ముందుకుసాగుతుందని, అయితే విధుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరిస్తే మాత్రం ఎవరినీ ఉపేక్షించేదిలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అం దుతాయన్నారు. అలాగే రైతులకు సంబంధిం చిన అన్ని రుణాలు మాఫీ చేస్తామని పేర్కొన్నారు. కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం అభివృద్ధిలో జరిగిన లోటుపాట్లను సవరించుకుని, తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుకోవాలని ప్రజలకు సూచించారు. అనంతరం దాశరథి కృష్ణామాచార్యుల చిత్రపటానికి డిప్యూటీ సీఎం, కలెక్టర్ పూలమాల నివాళులర్పించారు. డ్వామా పీడీ వెంకటేశ్వ ర్లు, జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ కాలేరే కరంచంద్, సొసైటీ డెరైక్టర్ వీర న్న, మండల ప్రత్యేకాధికారి సురేష్, ఎంపీడీఓ రాజారావు, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, సర్పంచ్ కొలిపాక రజిత పాల్గొన్నారు. -
అధికార పార్టీ నేతల్లో అప్పుడే విభేదాలు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : టీఆర్ఎస్ సర్కారు ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే ఆ పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య అంతరం పెరుగుతోంది. జిల్లాలోని ముఖ్యమైన అధికారుల పోస్టింగ్‌ల విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య అప్పుడే ఆధిపత్య పోరు మొదలైంది. వరంగల్ రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీఓ) పోస్టింగ్ విషయంలో ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పోటాపోటీగా వ్యవహరించారు. చివరకు వినయ్‌భాస్కర్ అనుకున్నది సాధించారు. డిప్యూటీ సీఎం రాజయ్య ప్రతిపాదిం చిన వారు ఆర్డీవోగా రాకుండా చేయగలిగారు. ఈ పరిణామం రాజయ్యకు, వినయ్‌భాస్కర్‌కు మధ్య అంతరం పెంచినట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు... మన ప్రణాళిక’ విజయవంతంగా జరుగుతోందనే అం శంపై సోమవారం డిప్యూటీ సీఎం విలేకరుల సమావేశం నిర్వహించారు. దీనికి పార్టీ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మ, వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్, ఇతర నేతలు హాజరయ్యారు. పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌తోపాటు పలు వురు ఎమ్మెల్యేలు దూరంగా ఉండడంపై టీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. ఆర్డీవో పోస్టింగ్ వ్యవహారం నుంచీ కీలక నేతలు ఇద్దరి మధ్య దూరం పెరిగిందని గులాబీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ఐదు ఆర్డీవో పోస్టులున్నాయి. వీటిలో వరంగల్ ఆర్డీవో పోస్టు కీలకమైనది. జిల్లా కేంద్రంలో ఉండడమే కాకుండా ప్రజాప్రతినిధుల ప్రొటోకాల్.. ఇతర అన్ని అంశాలు వరంగల్ ఆర్డీవో పరిధిలో ఉంటాయి. వరంగల్ నగరం, నగర సమీపంలోని రెవెన్యూ వ్యవహారాల్లో ఆర్డీవో పాత్ర కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో వరంగల్ ఆర్డీవో పోస్టుకు అధికారుల్లోనూ పోటీ ఉంటుంది. జిల్లాలోని కీలకమైన ప్రజాప్రతినిధులు సైతం ఈ పోస్టులో తమకు సహకరించే వారు ఉండేలా చూసుకుంటారు. ఇటీవల వరంగల్ ఆర్డీవో ఓజే.మధును ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ స్థానంలో తమకు అనుకూలంగా ఉండే అధికారిని నియమించుకునేందుకు ఉప ముఖ్యమంత్రి ప్రయత్నించారు. గతంలో స్టేషన్‌ఘన్‌పూర్ తహసీల్దారుగా పనిచేసిన ఓ అధికారిని వరంగల్ ఆర్డీవోగా నియమించేందుకు సచివాలయం స్థాయిలో దృష్టి పెట్టారు. రెవెన్యూ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మరో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో ఈ విషయంపై నేరుగా సంప్రదించినట్లు తెలిసింది. రాజయ్య ప్రయత్నాలను పసిగట్టిన వినయ్‌భాస్కర్ రంగంలోకి దిగారు. జిల్లా కేంద్రంలోని నియోజకవర్గానికి ప్రాతి నిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా ఆర్డీవో పోస్టింగ్ విషయంలో వినయ్ మరో ప్రతిపాదన ఇచ్చారు. జిల్లాతో ఎలాంటి సంబంధం లేని అధికారిని ఎవరిని నియమించినా ఫర్వాలేదు గానీ... ప్రొటోకాల్ పరంగా కీలక స్థానంలో ఉన్న వారి సిఫారసు మేరకు పోస్టింగ్ ఇస్తే తమకు ఇబ్బంది ఉంటుందని రెవెన్యూ మంత్రికి చెప్పుకున్నారు. ఈ విషయం తెలిసి ఉప ముఖ్యమంత్రి రాజయ్య మళ్లీ తాను ప్రతిపాదించిన అధికారి కోసం ప్రయత్నించారు. ఆయన సూచించిన అధికారి పోస్టింగ్ ఫైల్ కూడా సిద్ధమైంది. ఉత్తర్వులు వెలువడుతాయనే తరుణంలో వినయ్‌భాస్కర్ మళ్లీ రెవెన్యూ మంత్రిని సంప్రదించారు. టీఆర్ఎస్లో తన సేవలు, నేపథ్యం, నగరం కేంద్రంలో ఎమ్మెల్యేగా ఇబ్బందులను వివరించారు. చివరికి వినయభాస్కర్ మాటే నెగ్గింది. నిజామాబాద్ జిల్లాలో పని చేస్తున్న డి.వెంకటమాధవరావును ప్రభుత్వం వరంగల్ ఆర్డీవోగా నియమించింది. వెంకటమాధవరావుతో పెద్దగా పరిచయం లేకున్నా... ఉప ముఖ్యమంత్రి ప్రతిపాదించిన అధికారి వస్తే తమకు ఆశించిన మేరకు సహకారం ఉండదనే ఉద్దేశంతోనే వినయభాస్కర్ దీనికి అంగీకరించినట్లు తెలిసింది. కాగా, గతంలో జరిగిన ఒక ఎన్నికల్లో వెంకటమాధవరావు వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన విధులు నిర్వహించారు. -
యువతకు ప్రాధాన్యం కల్పించాలి
* డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య * ముగిసిన పాలకమండలి సమావేశం * రెండో రోజు పలు పథకాల అమలుపై చర్చ ఏటూరునాగారం : సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలో అమలవుతున్న పథకాల్లో ఎక్కువగా యువతకు ప్రధాన్యం కల్పించాలని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య సూచిం చారు. ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయంలో 56వ పాలక మండలి సమావేశం ఆదివారం ముగిసింది. రెండో రోజు ఆర్థిక, ఉద్యానవనం, వ్యవసాయం, ఎకనామికల్ సపోర్ట్ స్కీం, మాడాపై ఉదయం 11.30 నుంచి 1.30 గంటల వరకు చర్చిం చారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, చందూలాల్, శంకర్‌నాయక్, కలెక్టర్ కిషన్, ఐటీడీఏ పీఓ సుధాకర్‌రావుతోపాటు పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాడిఫైడ్ ఏరియూ డెవలప్మెంట్ అప్రోచ్ (మాడా) కింద ఉన్న 15 మండలాల్లో 68 గ్రామాల గిరిజన నిరుద్యోగుల అభ్యున్నతికి గత ఏడాది రూ.1.70 కోట్లు మంజూర య్యాయి... ఈ పథకం కింద 298 పథకాలు ఉన్నాయి... 2011-12 నుంచి ఇప్పటివరకు ఏ ఒక్కరికీ లబ్ధిచేకూరకపోవడం దౌర్భగ్యమని సభ్యులు ముక్తకంఠంతో అన్నారు. మహబూబాబాద్‌లో మాడా కార్యాలయ భవనం ఏర్పాటు చేసి ఆర్డీఓ స్థాయి అధికారిని నియమించి పథకాలను పర్యవేక్షించాలని సభ్యులు తీర్మానించారు. ‘మాడా’ ఏపీఓ సీతారామయ్య మాడా ద్వారా వచ్చిన పథకాలను వివరించే క్రమంలో.... అసలు ఈ పథకాలు అమలై ఎన్ని రోజులు అవుతుంది... కార్యాలయంలో మాడా కింద దరఖాస్తు చేసుకున్న యూనిట్లు ఎన్ని ఉన్నాయని సభ్యులు ప్రశ్నించడంతో వెంకటేశ్వర్లు నీళ్లు మింగారు. మహబూబాబాద్‌లో ఇందిరానగర్ సమీపంలో ఎకర ంన్నర స్థలం మాడా భవనానికి కేటాయించారని, కమిషనర్ వద్ద భవన నిధుల ఫైల్ ఆగినట్లు సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ఎకనామికల్ సపోర్ట్ స్కీం.... ఎకనామికల్ సపోర్ట్ స్కీంలో 2013 డిసెంబర్ వరకు రూ. 6.60 కోట్లు మంజూరయ్యాయని, ఇందులో 959 యూనిట్లకు ఆన్లైన్ దరఖాస్తులు అందాయని సభ్యులకు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అవినాష్ తెలిపారు. 2011-12 ఆర్థిక సంవత్సరం నిధులు రూ. 3.40 కోట్లు నిల్వ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. దీనిపై సీతారాంనాయక్ మాట్లాడుతూ గిరిజనుల నుంచి 3,100 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో కేవలం 959 మందికి మాత్రమే ఇచ్చి... మిగతా వారిని కార్యాలయం చుట్టూ ఎందుకు తిప్పుకుంటున్నారని ప్రశ్నించారు. కలెక్టర్ స్పందించి ఈ ఏడాది మే 20 వరకు అన్ని నిధులను క్లోజ్ చేసి ప్రభుత్వానికి అప్పగించామని, నూతన బడ్జెట్ వస్తే అందులో ఈ దరఖాస్తులకు రుణాల యూనిట్లు మంజూరు చేస్తామన్నారు. ఉద్యానశాఖ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సాగుతున్న పథకాల్లో పారదర్శకత లేకపోవడంతో గిరిజనులకు ఫలాలు అందడం లేదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యానవన శాఖ ద్వారా నాటిన మొక్కలు బతికున్నాయా లేదా అని సభ్యులు ప్రశ్నించారు. ఇందుకు ప్రాజెక్ట్ హార్టికల్చర్ అధికారి సుధాకర్... గురుకులం, ఆశ్రమ పాఠశాలల్లో రెండు వేల మొక్కలను నాటామని, ఈజీఎస్ కింద ప్రభుత్వ భూముల్లో మామిడి మొక్కలను దళిత, గిరిజన రైతులకు అందజేసినట్లు వెల్లడించారు. మొక్కలు అన్ని విధాలుగా బాగున్నాయని చెప్పడంతో దొంతి మాధవరెడ్డి ఒక్కసారి పరిశీలిద్దామని అనడంతో... పీహెచ్ఓ‘ కాదు సార్.... 50 శాతం మొక్కలు ఉన్నాయి’ అని సమాధానం ఇచ్చారు. దీంతో ఇదేమిటని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం, ఆర్థికశాఖ... ఈ ఏడాది సీజన్ మొదలైనా... సబ్సిడీపై విత్తనాలను ఎందుకు సరఫరా చేయలేదని అసిస్టెండ్ డెరైక్టర్ వెంకటేశ్వర్లను సభ్యులు ప్రశ్నించారు. బడ్జెట్ లేక విత్తనాలు సరఫరా చేయలేకపోయూమని ఆయన తెలిపారు. 2007-14 సంవత్సరంలో జరిగిన ఆదాయ, ఖర్చుల వివరాలను సభ్యుల ముందు అధికారులు ప్రవేశపెట్టారు.