కోల్‌సిటీ : వైద్యారోగ్యశాఖను ప్రక్షాళన చేసేందుకు ఆస్పత్రిలో రాత్రి బస కార్యక్రమం చేపడుతున్నామని డెప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. గోదావరిఖనిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆదివారం రాత్రి ఆయన బస చేశారు. అంతకుముందు జనగామ అర్బన్‌హెల్త్‌సెంటర్‌ను పరిశీలించారు. ఆయా చోట్ల విలేకరులతో మాట్లాడారు.
సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రభుత్వాస్పత్రులపై నిర్లక్ష్యం వహించడంతో ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే నినాదం వచ్చిందదని విమర్శించారు. ఐదు నెలలు క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించామని, వైద్యారోగ్యానికి రూ.2,280 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలిపారు. ఈ నిధులతో ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించి, ప్రభుత్వ వైద్యసేవలపై భరోసా కల్పిస్తామన్నారు. ఒక్కో ఏరియా ఆస్పత్రికి రూ.కోటి కేటాయించినట్లు వెల్లడించారు.
ఉస్మానియా ఆస్పత్రికి 2010లో రూ.200 కోట్లు కేటాయిస్తే ఇప్పటికీ అతీగతీ లేదని, ఇది సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యమని విమర్శించారు. ఇక నుంచి అర్బన్ హెల్త్‌సెంటర్లలో కుక్కకాటు, పాముకాటుకు మందు అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, రామగుండం నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, మెడికల్ డెరైక్టర్ సాంబశివరావు, డీఅండ్‌హెచ్‌వో అలీం, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
వైద్యారోగ్యశాఖను ప్రక్షాళన చేస్తాం
Published Mon, Dec 29 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM
Advertisement
Advertisement