godavri khani
-
వైద్యారోగ్యశాఖను ప్రక్షాళన చేస్తాం
కోల్‌సిటీ : వైద్యారోగ్యశాఖను ప్రక్షాళన చేసేందుకు ఆస్పత్రిలో రాత్రి బస కార్యక్రమం చేపడుతున్నామని డెప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. గోదావరిఖనిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆదివారం రాత్రి ఆయన బస చేశారు. అంతకుముందు జనగామ అర్బన్‌హెల్త్‌సెంటర్‌ను పరిశీలించారు. ఆయా చోట్ల విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రభుత్వాస్పత్రులపై నిర్లక్ష్యం వహించడంతో ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే నినాదం వచ్చిందదని విమర్శించారు. ఐదు నెలలు క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించామని, వైద్యారోగ్యానికి రూ.2,280 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలిపారు. ఈ నిధులతో ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించి, ప్రభుత్వ వైద్యసేవలపై భరోసా కల్పిస్తామన్నారు. ఒక్కో ఏరియా ఆస్పత్రికి రూ.కోటి కేటాయించినట్లు వెల్లడించారు. ఉస్మానియా ఆస్పత్రికి 2010లో రూ.200 కోట్లు కేటాయిస్తే ఇప్పటికీ అతీగతీ లేదని, ఇది సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యమని విమర్శించారు. ఇక నుంచి అర్బన్ హెల్త్సెంటర్లలో కుక్కకాటు, పాముకాటుకు మందు అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, రామగుండం నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, మెడికల్ డెరైక్టర్ సాంబశివరావు, డీఅండ్‌హెచ్‌వో అలీం, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
తెలంగాణ వెలుగురేఖ
గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీ మరిన్ని వెలుగులు విరజిమ్మనుంది. త్వరలోనే ప్లాంట్ విస్తరణ జరగనుంది. ప్రస్తుతం ఇక్కడ ఏడు యూని ట్ల ద్వారా 2,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. విస్తరణలో భాగంగా 800 మెగావాట్ల సామర్థ్యం గల ఐదు యూనిట్లు నెలకొల్పి మరో 4,000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. దశలవారీగా విస్తరణ పూర్తయితే ఎన్టీపీసీ సామర్థ్యం 6,600 మెగావాట్లకు చేరుకుంటుంది. ఎన్టీపీసీ ప్లాంట్ విస్తరణ విషయమై మంగళవారం ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ అరూప్‌రాయ్ చౌదరితోపాటు ఉన్నతాధికారులు ఎన్ఎన్.మిశ్రా, ఏకే.ఝా, ఆర్.వెంకటేశ్వరన్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును హైదరాబాద్‌లోని సెక్రటేరియట్లో కలి శారు. తెలంగాణలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టిన కేసీఆర్ పిలుపు మేరకు వారు ఆయనతో సమావేశమయ్యారు. ఇప్పటికే ఎన్టీపీసీ ప్లాంట్ విస్తరణకు ప్రణాళికలు ఉండటంతో కొత్త యూనిట్ల ఏర్పాటుపై సుముఖత వ్యక్తం చేశారు. రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్‌కు సమీపంలోనే కొత్త యూనిట్లు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎండీ అరూప్‌రాయ్ చౌదరి సీఎం కేసీఆర్‌కు తెలిపారు. ఈ యూనిట్లకు అవసరమైన భూమిని ప్రభుత్వమే ఇస్తుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఒకవేళ స్థల సేకరణలో ఇబ్బందులుంటే సిం గరేణి సంస్థ నుంచి భూమిని సేకరించి ఇస్తామన్నారు. పర్యావరణ అనుమతులు వచ్చేందుకు కూడా సహకరిస్తామన్నారు. దీంతోపాటు ఈ ప్లాంట్ నుంచి వెలువడే బూడిదను సింగరేణి సంస్థ తవ్వుతున్న భూగర్భ గనులలో ఇసుకకు బదులు ఉపయోగిస్తామని సీఎం వారికి తెలిపారు. మూడు సంవత్సరాల మూడు నెల ల్లో (39 నెలలు) మొదటి 800 మెగావాట్ల యూనిట్ ను నెలకొల్పి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఎన్టీపీసీ సీఎండీ కేసీఆర్‌కు స్పష్టం చేశారు. రామగుండం బీ-థర్మల్ కేంద్రాన్ని మూసివేసి దాని స్థానంలో 660 మెగావాట్ల ప్లాంట్, బీపీఎల్ ప్లాంట్ స్థానంలో మరో రెండు యూనిట్లను తెలంగాణ జెన్కో ఏర్పాటు చేసే అవకాశం ఉండటంతో రామగుండం ప్రాంతం విద్యు త్ హబ్‌గా మారనుంది. దీంతో ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు అందుబాటులో రానున్నాయి. ఎన్టీపీసీ విస్తరణకు మార్గం సుగమం కావడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఓసీపీల విధ్వంసం ఆగాలి
గోదావరిఖని, న్యూస్‌లైన్ : సింగరేణిలో మానవ జీవితాలను కొల్లగొడుతున్న ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల విధ్వంసం ఆగాల్సిందేనని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. గోదావరిఖనిలోని పోచమ్మ మైదానం(యు.రాములు ప్రాంగణం) లో ఆదివారం రాత్రి భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇప్టూ) 8వ రాష్ట్ర మహాసభల సందర్భంగా బహిరంగ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ అధిక బొగ్గు ఉత్పత్తి పేరుతో పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ప్రజల జీవన విధానాన్ని బొందల గడ్డలలో కప్పిపడేస్తున్న పరిస్థితి పూర్తిగా మారాలన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేలా భూగర్భ గనుల తవ్వకాన్ని పెంచాలని సూచించారు. ఇప్పటి వ రకు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు చెందిన పది మంది కాంట్రాక్టర్లకే ఓసీపీలలో మట్టిని తొలగించే పనులు అప్పగించారని, ఇక నుంచి ఇలాంటి దోపిడీ విధానం పూర్తిగా మా రాలన్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల అవసరం లేకుండా చేయాలని, సంస్థకు అవసరమైన పనిముట్లు, వస్తువులు సరఫరా చేసేం దుకు అనుబంధ పరిశ్రమలు అధికంగా రావాలన్నారు. గోదావరిఖని నుంచి కాగజ్‌నగర్ వర కు కోల్‌కారిడార్ నిర్మించాలని, ఒక్కో ప్రాం తంలో ఒక్కో సెక్టార్‌ను అభివృద్ధి పరిచి, కాలు ష్య రహిత పారిశ్రామికీకరణ చేపట్టాలన్నారు. సింగరేణి యాంత్రీకరణ వల్ల కార్మికుల్లో దాగి ఉన్న సృ జనాత్మకత తగ్గిపోతోందని, వారి ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో ఎలా ఉండాలనే దానిపై కార్మికులు ఆలోచన చేయాలని, ప్రభుత్వం అడిగినప్పుడు ఏం కావాలో తెలపడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. సింగరేణిలో వెలుగులు నిండాలని జేఏసీ కోరుకుంటోందని తెలిపారు. కార్మిక సంక్షేమాన్ని మరిచిన సింగరేణి : సంధ్య సింగరేణిలో కార్మిక సంక్షేమాన్ని యాజమాన్యం మరిచిపోయిందని, వైద్య శాలలు, విద్యాసంస్థ లు మూసివేసి సింగరేణిని బొందల గడ్డగా మా ర్చి కార్మికుల జీవన విధానంపై గొడ్డలివేటు వేసిందని పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య ఆ రోపించారు. ఇన్నాళ్లుగా బొగ్గుబాయి అంటూ వేదికలపై ప్రసంగాలు చేసి నేడు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గని కార్మికుల సంక్షేమాన్ని బా ధ్యతగా తీసుకోవాలని కోరారు. కార్మికుల స మస్యలు పరిష్కరించని పక్షంలో ఉద్యమం త ప్పదని హెచ్చరించారు. పారిశ్రామిక అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో సమానంగా జరగాలని, ఖ మ్మం జిల్లా బయ్యారంలోనే స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పా టు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముం దు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శి ఎస్కే ముక్తార్‌పాషా, జె.సీతారామయ్య, బి.సంపత్‌కుమార్, ఐ.కృష్ణ, కె.విశ్వనాథ్, చాంద్‌పాషా, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
కేడీ నం.1
ఐఏఎస్ అధికారి అంటే పెద్ద ఉద్యోగం... ఎవరితోనైనా పనులు చిటికెలో చేయించుకోవచ్చనుకున్నాడో ఏమో చిన్న వయసులోనే ఓ యువకుడు అతిపెద్ద మోసానికి పాల్పడ్డాడు. ట్రెయినీ ఐఏఎస్ అధికారినని, తమిళనాడులో విధులు అప్పగించారని చెప్పుకుంటూ నకిలీ పత్రాలు సృష్టించుకుని పోలీసులనే బురిడీ కొట్టించి చివరకు కటకటాలపాలయ్యాడు. మోసం చేయడమే వృత్తిగా స్వీకరించి రాజభోగాలు అనుభవించిన ఆ వ్యక్తి పేరు యాంసాని రాజేశ్. గోదావరిఖని, న్యూస్‌లైన్ : రాజేశ్‌ది గోదావరిఖని మారుతీనగర్‌లో నివాసం. పేద కుటుంబం కావడంతో 8వ తరగతి చదువుతున్న సమయంలోనే మెడికల్ షాప్‌లో పనిచేశాడు. డిగ్రీ వరకు గోదావరిఖనిలో చదివి.. తర్వాత సీఏ చేసేందుకు విజయవాడ వెళ్లాడు. సీఏ కోర్సులో భాగంగా హైదరాబాద్‌లో ఆర్టికల్‌షిప్ చేస్తూ ఓ ఇనిస్టిట్యూట్‌లో ఐఏఎస్ శిక్షణ తీసుకున్నాడు. 2012లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్ఈ) ప్రిలిమ్స్ పరీక్ష రాశాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక్కడి నుంచి రాజేశ్ మోసపు పనులు చేసేందుకు మెదడుకు పనిపెట్టాడు. ఐఏఎస్ అంటే సమాజంలో గుర్తింపు లభిస్తుందని, అనుకున్న పనులు చకాచకా జరిగిపోతాయని భావించాడు. 2012లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో తనకు ఆల్ ఇండియా స్థాయిలో 45వ ర్యాంకు వచ్చిందని, ఐఏఎస్‌గా ఎంపికయ్యాయని, డెహ్రడూన్‌లో శిక్షణ పొందుతున్నానని గోదావరిఖనిలో సన్నిహితులకు చెప్పాడు. తన భాష, వేషం పూర్తిగా మార్చివేశాడు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి గోదావరిఖని నుంచి హైదరాబాద్‌కు, ఢిల్లీకి పలుమార్లు వెళ్లి వచ్చేవాడు. ఢిల్లీ అడ్రస్‌తో ఓ సిమ్‌కార్డు కూడా తీసుకుని... ఐఏఎస్ శిక్షణలో తనకు ఇచ్చారని నమ్మించాడు. తమిళనాడు ప్రభుత్వం క్యాడర్లో తొమ్మిదిమంది ట్రెయినీ ఐఏఎస్‌లకు విధులు అప్పగించగా... అందులో తానొక్కడినంటూ నకిలీపత్రాలు సృష్టించాడు. నమ్మి.. సన్మానాలు.. సాయం రాజేశ్ పోలీసులను సైతం బురిడీ కొట్టించాడు. రాజేశ్ తండ్రి కృష్ణమూర్తి పెద్దపల్లిలోని ఓ పాఠశాల హాస్టల్లో వంటలు వండేవాడు. అతి పేదరికంలో నుంచి వచ్చిన రాజేశ్‌కు ఉన్నత చదువుల కోసం ఓ ఏఎస్సై రూ.50 వేల వరకు ఆర్థికసాయం అందించాడు. తాను ట్రెయినీ ఐఏఎస్ అని చెప్పుకోవడంతో నమ్మిన పోలీసులు రామగుండంలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరకు వాహనాన్ని సమకూర్చారు. పలు సంస్థలు సన్మానించి, ఆర్థిక ంగా సాయమందించాయి. వీఆర్వో ఉద్యోగం ఇప్పిస్తానని కొలిపాక సురేశ్ వద్ద రూ.10 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. ఈ విధానం బాగుందని భావించిన రాజేశ్ దానినే కొనసాగించాడు. తీగలాగితే.. రాజేశ్ వ్యవహారశైలిపై డీఎస్పీ జగదీశ్వర్‌రెడ్డికి అనుమానం వచ్చింది. దీంతో ప్రొబేషనరీ డీఎస్పీ చక్రవర్తి ద్వారా పూర్తిస్థాయిలో విచారణ జరిపించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులకు ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో శిక్షణ ఇస్తుండగా... రాజేశ్ డెహ్రడూన్ అని చెప్పడంతో అనుమానం బలపడగా.. తీగలాగితే డొంకంతా కదిలింది. 2012లో యూపీఎస్ఈ ప్రిలిమినరీ పరీక్షలో రాజేశ్ క్వాలిఫై కాలేదని నిర్ధారణ చేసుకున్నారు. ఢిల్లీలో ఉన్న రాజేశ్‌ను గోదావరిఖనికి పిలిపించి శనివారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో రాజేశ్ అరెస్ట్ చూపించి తర్వాత వన్‌టౌన్ సీఐ శ్రీధర్‌తో కలిసి డీఎస్పీ జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడారు. ఐఏఎస్‌గా ఎంపికయ్యానని నకిలీపత్రాలు సృష్టించి ప్రజలను మోసగించినందుకు రాజేశ్‌పై 420, 468 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రాజేశ్ బ్యాంకు ఖాతాలో రూ.4 లక్షలు ఉన్నాయని, అవి ఎక్కడి నుంచి వచ్చాయనే విషయమై ఆరా తీస్తామని చెప్పారు. మోసం చేశా: రాజేశ్ సమాజంలో ఉన్నతంగా జీవించవచ్చని భావించి ఐఏఎస్‌గా ఎంపికయ్యానని నకిలీపత్రాలతో మోసం చేశా. మోసం చేస్తున్నానని అనుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించా. అరుుతే తల్లిదండ్రులను చూసి దానిని విరమించుకున్నా. ఐఏఎస్‌గా వచ్చిన ఆదరణను చూసి దానినే కొనసాగించా. -
‘ఖని’ ధర్మాసుపత్రిలో.. రాబందులు!
కోల్‌సిటీ, న్యూస్‌లైన్ : ఆత్మీయులను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో మృతుల కుటుంబసభ్యులు, బంధువులు.. తమవారు తిరిగిరాని లోకాలకు వెళ్లారనే ఆవేదన.. ఇలాంటి సమయంలో ఎవరైనా ‘అయ్యో పాపం..’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ గోదావరిఖని ప్రభుత్వాసుత్రి మార్చురీ సిబ్బంది మాత్రం శవాలపై కాసులు ఏరుకునేందుకు సిద్ధపడుతారు. ఇప్పుడైతేనే అడిగినంత ఇస్తారని తమ కక్కుర్తిని బయటపెడతారు. లేదంటే పోస్టుమార్టం చేయం అని బెదిరిస్తారు. ఇది ఆసుపత్రిలో నిత్యం జరుగుతున్న తంతు. శవాలకు పోస్టుమార్టం చేసేందుకు సిబ్బంది డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఇటీవల కాలంలో మరింత పీక్కుతింటున్నారు. రూ.4వేలు డిమాండ్.. ఈ నెల 26వ తేదీన గోదావరినదిలో మునిగి పట్టణానికి చెందిన జక్కుల సతీష్(19), జక్కుల రాజశేఖర్(20) అనే ఇద్దరు యువకులు చనిపోయారు. వీరి మృతదేహాలను గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం కోసం తీసుకొచ్చారు. పోస్టుమార్టం పూర్తిచేసిన సిబ్బంది మృతుల కుటుంబసభ్యులను రూ.4వేలు డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా ఓ వైద్యురాలు, ఆమె భర్తపై మృతుల బంధువుల దాడి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. గతంలో పోస్టుమార్టం వసూళ్ల డబ్బు పంపిణీలో, పోస్టుమార్టం విధుల నిర్వహణలో సిబ్బంది మధ్య పొంతన కుదరక తన్నుకున్న సంఘటనలున్నాయి. వైద్య సిబ్బందికి కొందరు పోలీసులు అండదండలు ఉండడంతో మృతుల బంధువులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఊరుకుంటున్నారు. పోస్టుమార్టం కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యశ్రీరావు విచారణ చేపట్టారు. డీసీహెచ్ఎస్కు నివేదిక పంపించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తనకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.