
సాక్షి, వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. సీఎం ఆదేశాలతో పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ క్రమంలోనే జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య హాజరయ్యారు. సభ్యత్వ నమోదును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తనకు అప్పగించిన లక్ష్యం పూర్తిచేసే వరకు గడ్డం తీయనని శపథం చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి గడ్డం పెంచుతున్నానని, తానెప్పూడూ గడ్డం పెంచలేదని అన్నారు. గతంలో కంటే నియోజకవర్గంలో మాకు ఇచ్చిన లక్ష్యం నెరవేరేవరకు ఎట్టి పరిస్థితుల్లో గడ్డం తీయనని శపథం చేశారు. 60 వేల సభ్యత్వాలు 15 రోజుల్లో నమోదు అయ్యేవరకు గడ్డం తీయనని ఎమ్మెల్యే రాజయ్య స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment