మీ కోపాన్ని చూపించొద్దు..! : తుమ్మల నాగేశ్వరరావు | TRS Candidate Thummala Nageshwar Rao Talks With Activists | Sakshi
Sakshi News home page

మీ కోపాన్ని చూపించొద్దు..! : తుమ్మల నాగేశ్వరరావు

Published Mon, Dec 3 2018 2:11 PM | Last Updated on Mon, Dec 3 2018 2:11 PM

TRS Candidate Thummala Nageshwar Rao Talks With Activists  - Sakshi

వినాయకపురం సమావేశంలో మాట్లాడుతున్న తుమ్మల నాగేశ్వరావు

సాక్షి, అశ్వారావుపేటరూరల్‌: ‘‘నాపై, ఎంపీపై, తాటిపై మీకు కోపమున్నా, దానిని ఇప్పుడు చూపించొద్దు. ఆ కోపతాపాలేవైనా ఉంటే.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూర్చుని మాట్లాడుకుందాం’’ అని, టీఆర్‌ఎస్‌ శ్రేణులను ఆ పార్టీ నేత తుమ్మల నాగేశ్వరరావు కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్నింటా అభివృద్ది చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు దేశంలోని పార్టీలన్నీ ఏకమయ్యాయని, అయినప్పటికీ టీఆర్‌ఎస్‌ గెలుపును అవి అడ్డుకోలేవని అన్నారు. మండలంలోని వినాయకపురం గ్రామంలో ఆదివారం పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘గడిచిన పదేళ్లుగా మీ మొహాలు చూడని వారిని ఈ ఎన్నికల్లో ఓడించండి. మీ కోసం నేను 32 ఏళ్లు త్యాగం చేశా. నా కోసం మీరంతా తాటి వెంకటేశ్వర్లును ఐదువేల నుంచి పదివేల మెజార్టీతో గెలిపించాలి’’ అని కోరారు. ఎవరెన్ని రాజకీయాలు చేసినప్పటికీ పోడు పట్టాలు ఇప్పించే బాధ్యత తనదేనని అన్నారు.

రాష్ట్రంలో కళింగుల జనాభా దాదాపుగా నాలుగులక్షలు ఉందని, అశ్వారావుపేటలోనూ ఉన్నారని అన్నారు. వీరికి సంబంధించిన రిజర్వేషన్‌ సమస్యను పరిష్కారిస్తామని, ఆందోళన అవసరం లేదని హామీ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి, మొట్టమొదటిగా అశ్వారావుపేటలోని వెంకమ్మ చెరువును గోదావరి నీళ్లతో నింపుతామని అన్నారు. దబ్బతోగు, పెదవాగు ప్రాజెక్టులకు నీళ్లు అందిస్తామన్నారు. దురదపాడు ప్రాజెక్టు నిర్మాణం తన బాధ్యతనేనని అన్నారు. అశ్వారావుపేట మీదుగా రావాల్సిన జాతీయ రహదారి రద్దయినట్టుగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నేషనల్‌ హైవే, గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. భద్రాచలం నుంచి దమ్మపేట, అశ్వారావుపేట మీదుగా దేవరపల్లి వరకు నేషనల్‌ హైవే నిర్మాణ బాధ్యత కూడా తనదేనన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీని గెలలిపించాలని కోరారు. ముందుగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నియోజకవర్గానికి ఎంతో చేశానని అన్నారు. తనను మరోసారి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, ఎంపీపీ బరగడ కృష్ణారావు, జడ్పీటీసీ సభ్యుడు మల్లికార్జున్‌రావు పాల్గొన్నారు.  
రైతులకు మంచి రోజులు ..
దమ్మపేట: టీఆర్‌ఎస్‌ పాలనలో రైతులకు మంచి రోజులొచ్చాయని, పంటల సాగు సక్రమంగా సాగిందని తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. మండలంలోని మందలపల్లి సాయికృష్ణ నర్సరీలో ఆదివారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన పార్టీ సమావేశం జరిగింది. తుమ్మల, పొంగులేటి మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టును అడ్డుకునేందుకు యత్నిస్తున్న పార్టీ అభ్యర్థిని ఓడించాలని, టీ ఆర్‌ఎస్‌ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లును గెలిపిం చా లని కోరారు. కూటమికి అధికారమిస్తే.. మన కం టిని మనం పొడుచుకున్నట్టే అవుతుందన్నారు. 
ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పానుగంటి సత్యం, డీసీసీబీ డైరెక్టర్‌ ఆలపాటి రామచంద్రప్రసాద్, పార్టీ నాయకులు తూతా నా గమణి, పైడి వెంకటేశ్వరరావు, దారా యుగంధర్, కోటగిరి పుల్లయ్యబాబు, రావు గంగాధరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, కేవీ సత్యన్నారాయణ, అల్లం వెంకమ్మ, సరోజని, అడపా రాంబాబు, కొయ్యల అచ్యుతరావు, రెడ్డిమళ్ల చిట్టినాయన, దొడ్డా రమేష్, వెంపాటి భరత్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తాలు...

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement