ధర్మసాగర్ : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుతామని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. మన ఊరు - మన ప్రణాళికలో పొందుపరిచిన అంశాల ఆధారంగానే రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రం లోని సుస్మితాగార్డెన్స్‌లో మంగళవారం ఎంపీ పీ వల్లపురెడ్డి లక్ష్మీ అధ్యక్షతన ‘మన మండలం - మన ప్రణాళిక’ సమావేశాన్ని నిర్వహించా రు. ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం రాజయ్య హాజరై మాట్లాడారు.
సీమాంధ్రులను ఎదురించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారుమయంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీ ఎంప్లాయీస్‌తో ముందుకుసాగుతుందని, అయితే విధుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరిస్తే మాత్రం ఎవరినీ ఉపేక్షించేదిలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అం దుతాయన్నారు. అలాగే రైతులకు సంబంధిం చిన అన్ని రుణాలు మాఫీ చేస్తామని పేర్కొన్నారు.
కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం అభివృద్ధిలో జరిగిన లోటుపాట్లను సవరించుకుని, తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుకోవాలని ప్రజలకు సూచించారు. అనంతరం దాశరథి కృష్ణామాచార్యుల చిత్రపటానికి డిప్యూటీ సీఎం, కలెక్టర్ పూలమాల నివాళులర్పించారు. డ్వామా పీడీ వెంకటేశ్వ ర్లు, జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ కాలేరే కరంచంద్, సొసైటీ డెరైక్టర్ వీర న్న, మండల ప్రత్యేకాధికారి సురేష్, ఎంపీడీఓ రాజారావు, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, సర్పంచ్ కొలిపాక రజిత పాల్గొన్నారు.
మన ఊరు - మన ప్రణాళిక
Published Wed, Jul 23 2014 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM
Advertisement