Our village - our plan
-
‘మన ప్రణాళిక’ ఆమోదం
- 49 అంశాలకు ప్రాధాన్యం - మరిన్ని అంశాలను చేర్చాలని సూచించిన ప్రజాప్రతినిధులు - ప్రభుత్వానికి నివేదిస్తాం: జెడ్పీచైర్మన్ భాస్కర్ సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు.. మన ప్రణాళిక’కు జిల్లా ప్రణాళిక ఆమోదం తెలిపింది. ఆదివారం జిల్లా జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశం 49 అంశాలకు సంబంధించిన పనులను పొందుపరిచి ఆమోదించింది. వీటిలో తాగునీటికి రూ.1310 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్ల కోసం రూ.850కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా తాగునీరు, ఆరోగ్యం, విద్య తదితర అంశాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సుదీర్ఘంగా సాగింది. ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు గ్రామస్థాయిలో, 18 నుంచి 23 తేదీ వరకు మండలస్థాయిలో, 23 నుంచి 28వ తేదీ వరకు జిల్లా స్థాయిలో జరిగిన ప్రణాళికలను సర్వసభ్య సమావేశంలో ఆమోదిస్తున్నట్లు జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్ స్పష్టంచేశారు. తాజాగా ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ప్రస్తావించిన అంశాలను కూడా చేర్చి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. సమావేశంలో ముందుగా కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత తెలంగాణ అమరవీరుల ఆత్మశాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సభ దృష్టికి సమస్యలు.. సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఆయా నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలను కూడా ప్రణాళికలో చేర్చి పనులు మంజూరు అయ్యేలా చూడాలని కోరారు. సమావేశంలో మొదటగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ... ప్రణాళికలో కాంగ్రెస్‌కు చెందిన ఐదు నియోజకవర్గాల పట్ల వివక్ష చూపించారన్నారు. దీంతో కాసేపు సభలో గందరగోళం నెలకొన్నప్పటికీ వెంటనే అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత మిగతా ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు సాయంత్రం వరకు వారి ప్రాంతాల్లో ఉన్న ప్రధానంగా నెలకొన్న తాగునీరు, మరుగుదొడ్లు, రోడ్లనిర్మాణం, విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ సమస్యల చిట్టాను వినిపించారు. మండలాల్లో జెడ్పీటీసీలకు ప్రత్యేకంగా చాంబర్, టోల్గేట్ వద్ద ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. స్పందించిన ఆయన సభ్యుల హామిని కచ్చితంగా అమలుచేస్తామన్నారు. బంగారు తెలంగాణను నిర్మించుకునేందుకు పార్టీలకతీతంగా సహకరించాలని కోరారు. సమగ్ర సర్వేకు ప్రతిఒక్కరూ సహకరించాలి: కలెక్టర్ రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని కోరారు. ఆ ఒక్కరోజు ఎటువంటి పనులు ఉండకుండా అధికారులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ నెల 19న ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించినట్లు చెప్పారు. సర్వే ఆధారంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం గ్రామాలు, మండలాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, అందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేల గైర్హాజర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మన ప్రణాళిక’ ఆమోదం పొందే కార్యక్రమానికి జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఏపీ జితేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్యతో పాటు టీడీపీ చెందిన నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, కొండగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గైర్హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, గువ్వల బాల్‌రాజ్, మర్రి జనార్దన్‌రెడ్డి, డీకే అరుణ, జి.చిన్నారెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, వైస్ జెడ్పీ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటీసీసభ్యులు, ఎంపీపీలు, జెడ్పీ సీఈవో రవిందర్ ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రణాళికలో ప్రాధాన్యత అంశాలివే.. పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టాలి. గట్టు మండలంలో వెయ్యి మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు హైదరాబాద్ నుంచి అలంపూర్ దాకా పరిశ్రమల కారిడార్. హైదరాబాద్ నుంచి జడ్చర్ల వరకు డబుల్ రైల్వేలైన్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో వైద్యకళాశాలల ఏర్పాటు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీరు ప్రాజెక్టులను పూర్తిచేయాలి. కొత్తూరులో డ్రైపోర్ట్. గద్వాల, నారాయణపేటల యందు టెక్స్టైల్ పార్క్‌ల ఏర్పాటు మహబూబ్‌నగర్ లో ఔటర్‌రింగ్ రోడ్డు ఏర్పాటు. పాలమూరు యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్థాయి పెంపు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 17 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ఏర్పాటు. జిల్లా ఆస్పత్రిని 600 పడకల ఆస్పత్రిగా మార్పు, గద్వాలలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చడం ఆర్డీఎస్ పనులను త్వరతగతిన పూర్తిచేడం తదితర 20 అంశాలకు ప్రణాళికలో చోటుదక్కింది. -
‘మన ఊరు.. మన ప్రణాళిక’తో గ్రామాల అభివృద్ధి
కోయిల్‌కొండ: వచ్చే ఐదేళ్లలో ప్రణాళిక బద్ధంగా గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చేపట్టేందుకే ‘మన ఊరు -మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లాకలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు శుక్రవారం. స్థానిక మండల కార్యాలయంలో నిర్వహించిన మన మండల-మన ప్రణాళిక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి హాజరయ్యూరు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు నెలలకోసారి నిర్వహించే మండల సమావేశంలో వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశుధ్యం, హరితవనం, అభివృద్ధి పనులపై ప్రణాళికలు రూపొందించాలన్నారు. రైతులు పండించే పంటలకు కావలసిన విత్తనాలను వారే అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు అవసరమైతే పాలెం పరిశోధన కేంద్రం నుంచి నిపుణులను పంపి సూచనలు, సలహాలు ఇప్పిస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయూలన్నారు. అగష్టు15లోగా లక్ష్యాన్ని పూర్తి చేసిన సర్పంచులకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో 4.50లక్షల మరుగుదొడ్లకు ప్రతిపాదనలు పంపగా ఇందులో2.25 లక్షలు మంజూరయ్యూయని, అందులో 40వేలు మాత్రమే పూర్తి కావడం జరిగిందన్నారు. నిర్మాణాలు త్వరగతిన పూర్తి చేసేందుకు సర్పంచులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా డంపింగ్ యూర్డుల నిర్మాణానికి నిధులు మంజూైరె నట్లు తెలిపారు. మహిళాసంఘాలు పాడిపరిశ్రమపై ఆసక్తి చూపాలన్నారు. కోయిల్‌సాగర్ నుంచి మండలానికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గొండ్యాల వాగు ద్వారా మండలంలోని ఏడు పెద్ద చెరువులకు నీరు అందించేందుకు సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. సివిల్ ఆసుపత్రికి అత్యాధునిక భవనం స్థానిక సివిల్ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే అత్యాధునిక భవనాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ్ర కలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డితో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్బంగా భవన నిర్మాణంపై స్థానికుల సూచనలు ,సలహాలు స్వీకరించారు. ఆసుపత్రి చుట్టూ మరికొంత స్థలాన్ని సేకరించి రెండస్థుల భవనాన్ని నిర్మిస్తామన్నారు. అనంతరం బీసీ హాస్టల్‌ను సందర్శించి అక్కడ ఉన్న పాత పోలీస్‌స్టేషన్ తొలగించాలని అధికారులను ఆదేశించారు. రూ.43లక్షలతో నిర్మించిన మంచినీటి ట్యాంకును ప్రారంభించారు. నీటి సరఫరాకు పెద్ద వాగులో సంపు ఏర్పాటు చే యూలని గ్రామసర్పంచ్ మంజూల, మాజీ ఎం పీపీ వై.మహేందర్‌గౌడ్ కలెక్టర్‌ను కోరారు. కా ర్యక్రమాల్లో స్పెషల్ ఆఫీసర్ జయచంద్ర, ఎం పీపీ బోయిని స్వప్నరవి, వైఎస్ ఎంపీపీ శారద, ఎంపీడిఓ భాగ్యలక్ష్మీ, తహశీల్దార్ ప్రేమ్‌రాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ డిఈ పుల్లారెడ్డి, ఏఈ సమీర్‌ఉల్లాఖాన్, క్లస్టర్ ఆఫీసర్ డాక్టర్ హరిశ్చంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మన ఊరు - మన ప్రణాళిక
ధర్మసాగర్ : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుతామని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. మన ఊరు - మన ప్రణాళికలో పొందుపరిచిన అంశాల ఆధారంగానే రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రం లోని సుస్మితాగార్డెన్స్లో మంగళవారం ఎంపీ పీ వల్లపురెడ్డి లక్ష్మీ అధ్యక్షతన ‘మన మండలం - మన ప్రణాళిక’ సమావేశాన్ని నిర్వహించా రు. ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం రాజయ్య హాజరై మాట్లాడారు. సీమాంధ్రులను ఎదురించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారుమయంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీ ఎంప్లాయీస్‌తో ముందుకుసాగుతుందని, అయితే విధుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరిస్తే మాత్రం ఎవరినీ ఉపేక్షించేదిలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అం దుతాయన్నారు. అలాగే రైతులకు సంబంధిం చిన అన్ని రుణాలు మాఫీ చేస్తామని పేర్కొన్నారు. కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం అభివృద్ధిలో జరిగిన లోటుపాట్లను సవరించుకుని, తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుకోవాలని ప్రజలకు సూచించారు. అనంతరం దాశరథి కృష్ణామాచార్యుల చిత్రపటానికి డిప్యూటీ సీఎం, కలెక్టర్ పూలమాల నివాళులర్పించారు. డ్వామా పీడీ వెంకటేశ్వ ర్లు, జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ కాలేరే కరంచంద్, సొసైటీ డెరైక్టర్ వీర న్న, మండల ప్రత్యేకాధికారి సురేష్, ఎంపీడీఓ రాజారావు, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, సర్పంచ్ కొలిపాక రజిత పాల్గొన్నారు. -
డంపింగ్ యార్డులకు స్థలాలు గుర్తించండి
మోమిన్‌పేట: ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు స్థలాన్ని తప్పనిసరిగా గుర్తించాలని కలెక్టర్ ఎన్. శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘మన ఊరు- మన ప్రణాళిక’లో గుర్తించిన ప్రాధాన్యతా అవసరాలను ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. తాగునీరు, మురుగు కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి వాటిపై అంచనాల తో నివేదికలు తయారు చేయాల ని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో చెత్తను వేసేందుకు డంపింగ్ యార్డు, శ్మశానవాటిక, సృ్మతి వనం ఏర్పాటుకు తప్పనిసరిగా స్థలాలను పరిశీలించాలన్నారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ప్రత్యేకాధికారి రమణారెడ్డిని ఆదేశించారు. గ్రామ స్థాయిలో ఓ కమిటీని ఏర్పాటు చేసి 2 నెలల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఫీల్డ్అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, గ్రామ ప్రత్యేకాధికారితో కమిటీ వేసి ప్రతి గ్రామాన్ని పర్యవేక్షించాలని ఏపీఓ అంజిరెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆమ్రపాలి, ఎంపీడీఓ కె.సువిధ, తహసీల్దార్ రవీందర్, వైద్యాధికారి సాయి బాబా, వ్యవసాయాధికారి నీరజ పాల్గొన్నారు. -
నేటి నుంచి ఊరూరికి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘మన గ్రామం-మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రణాళికల తయారు, పర్యవేక్షణ, ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులను పరుగులు పెట్టిస్తోంది. గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంపై ఇది వరకే జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాజాగా ఈనెల 13 నుంచి 28వ తేదీ వరకు అధికారులు గ్రామాలలో పర్యటించాలని ప్రభుత్వం శని వారం జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. పర్యటన సందర్భంగా ప్రాధాన్యం కలిగిన అన్ని సమావేశాలలో అధికారులు పాల్గొనాలని సూచించింది. పర్యటన నివేదికలను అధికారులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు అందజేయాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వులో ఆదేశించింది. ఈ కార్యక్రమం అమలు కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి బి.జనార్దన్‌రెడ్డిని జిల్లాకు ప్రత్యేకాధికారిగా నియమించారు. మరోవైపు తాజా ఉత్తర్వులతో అధికారులు పల్లెలకు పరుగులు పెట్టనున్నారు. ముందస్తుగా శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డి.వెంకటేశ్వర్రావు ఆధ్వర్యం లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలతో అధికారులకు పల్లెబాట తప్పనిసరిగా మారింది. ఊరులో సందడి అధికారుల పర్యటనలతో గ్రామాలలో సందడి నెలకొననుంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పల్లెల్లో పర్యటించే అధికారులు ప్రాధాన్యత గల ప్రతి సమావేశంలో పాల్గొనాలి. ప్రాధాన్యాంశాలను నివేదికగా రూపొందించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృ ద్ధిశాఖల ద్వారా ప్రభుత్వానికి సమర్పించాలి. అంతేగాకుండా జిల్లాలోని గ్రామాల అధికారులు, సిబ్బంది గ్రామం యూనిట్‌గా ‘మన గ్రామం మన ప్రణాళిక’ కోసం నివేదికలు సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని 718 గ్రా మ పంచాయతీల పరిధిలో కార్యక్రమం ప్రారంభం కానుంది. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం తదితర రంగాల్లో గ్రామం, మండలం, జిల్లా స్థాయిలో వివరాలు సేకరించాల్సిన ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 28 తర్వాత ఆ నివేదికలను ప్రభుత్వానికి పంపే విధంగా సిద్ధం కావాలని కలెక్టర్ వెంకటేశ్వర్రావు అధికారులకు సూచించారు. విద్య, వ్యవసాయానికి పెద్దపీట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో మొదటగా విద్య, వైద్య, సంక్షేమ, వ్యవసాయరంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కార్యాచరణను రూపొం దించిన అధికారులు గ్రామస్థాయి ప్రణాళికలు ఈనెల 13 నుంచి 18 వరకు, ఈనెల 19 నుంచి 23 వరకు మండల ప్రణాళికలు, ఈ నెల 24 నుంచి 28 వరకు జిల్లా ప్రణా ళికలను సిద్ధం చేస్తారు. ఇది వరకే అన్నిస్థాయిల్లో రిసోర్సు పర్సన్లను నియమించారు. గ్రామస్థాయిలో వివరాలు సేకరించి మండలానికి, మండలంలో పంచాయతీల వారీగా క్రోడీకరించి జిల్లా కేంద్రానికి నివేదికల రూపేణా పంపుతారు. ఆ తర్వాత జిల్లా యూనిట్‌గా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. గ్రామ పంచాయతీ పేరు, కుటుంబాల సంఖ్య, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్యాలయ వివరాలు, ఇతర సంస్థలు, గ్రామ స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ ఆస్తులు, ఖర్చు, సంక్షేమం, అభివృద్ధి, విద్య, అవాస ప్రాధాన్యతలు.. ఇలా ముందుగా రూపొందించిన 14 కేటగిరిలపై వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నం కానున్నారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
తలమడుగు : గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లాలో మొదటిసారిగా మన ఊరు-మన ప్రణాళిక* కార్యక్రమాన్ని శనివారం తలమడుగు మండలంలోని రూయ్యాడి గ్రామంలో ఆయన ప్రారంభించారు. మంత్రిగా మొదటిసారి గ్రామానికి రావడంతో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక హుస్సేన్ హుస్సేన్ ఆలయంలో పూజలు చేసి అనంతరం అక్కడి నుంచి గ్రామంలోని వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. దారిలో పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల కొరత ఉందని, అదనపు తరగతి గదులు నిర్మించాలని, మరుగుదొడ్లు, తాగునీటి కోసం బోరు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు విన్నవించారు. పాఠశాల భవనం పైనుంచి విద్యుత్ వైర్లు వెళ్తున్నాయని తెలుపగా.. విద్యుత్ శాఖ డీఈ, ఏఈలను సమస్య పరిష్కారాని ఆదేశించాలని కలెక్టర్‌కు సూచించారు. ఈ సందర్భంగా గ్రామ సమీపంలోని ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ పునర్నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. గ్రామాల్లో ఏ సమస్యలున్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ, విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందరూ చదువుకోవాలని కోరారు. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనతరం స్థానికంగా మొక్కలు నాటారు. ఎంపీ గెడం నగేశ్, బోథ్, ఖానాపూర్, నిర్మల్ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, రేఖానాయక్, ఐకే రెడ్డి, జెడ్పీ చైర్మన్ శోభారాణి, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఈవో అనితాగ్రేస్, డీఎంహెచ్‌వో బసవేశ్వరి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ రాము, జెడ్పీటీసీ సభ్యులు గంగమ్మ, పద్మ, ఎంపీడీవో సునిత, గ్రామ ప్రత్యేకాధికారి సంజీవ్‌రెడ్డి, గ్రామపెద్దలు, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, ఎంపీటీసీలు లక్ష్మి, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
‘ముంపు’ తికమక
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: చట్టం తన పని తాను చేసుకుపోతోంది...అన్నట్టు పోలవరం ముంపు ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ప్రక్రియ కూడా ఒకటొకటిగా పూర్తవుతూనే ఉంది. కానీ అక్కడి ప్రజల జీవనస్థితిగతులపై మాత్రం స్పష్టత రావడం లేదు. ఆదివాసీ గిరిజనులతో నిండిన ఆ ఏడు మండలాలను పక్క రాష్ట్రానికి బదలాయించే ప్రక్రియకు లోక్‌సభ ఆమోదం కూడా లభించింది. త్వరలోనే రాజ్యసభలో కూడా బిల్లు పాసవుతుంది. మరీ ఆ మండలాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేవలు ఎప్పుడు అందుతాయి..? తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి వరకు సేవలందించాలి? అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఏ ప్రభుత్వం తమకు ప్రభుత్వ పథకాలను అం దిస్తుందో..? ఏ ప్రభుత్వానికి తాము దరఖాస్తు చేసుకోవాలో..? తెలియని గందరగోళంలో ముంపు మం డలాల ప్రజలు ఉన్నారు. తమను ఆంధ్రప్రదేశ్‌లో కలపటం ముంపు ప్రాంతవాసులకు, తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టంలేని స్థితిలో ఏపీ ప్రభుత్వం ఇక్కడ పాలన ఎలా సాగిస్తుందనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ మండలాల ప్రజలకు సంబంధించిన రికార్డులను ఏపీకి తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందా? సచివాలయం నుంచి ఉత్తర్వులు రానిదే జిల్లా యంత్రాంగం సహకరిస్తుందా? వచ్చే నెల అక్కడి ప్రజలకు రేషన్ ఇచ్చేదెవరు? పింఛన్లు పంచేదెవరు? ఫీజుల పథకం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి? సమస్య ఉంటే ఖమ్మం రావాలా? గోదావరి జిల్లా కేంద్రాలకు వెళ్లాలా? ఇలాంటి ప్రశ్నలెన్నో ముంపు వాసులను వేధిస్తున్నాయి. పథకాల సంగతేంటి? ప్రస్తుతానికి ముంపు మండలాల ప్రజలకు మన జిల్లా నుంచే సేవలందుతున్నాయి. పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదించినప్పుడే సాంకేతికంగా ఆ ప్రాంతం అక్కడికి వెళ్లిపోయినట్టు. ఇప్పటి వరకు ముంపు ప్రాంతం గురించి పట్టించుకోని ఆంధ్రప్రదేశ్ సర్కారు.. ఆర్డినెన్స్‌కు లోక్‌సభలో ఆమోదం లభించిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని విలీనం చేసుకునే ప్రయత్నాలను వేగవంతం చేయవచ్చు. మరో 17 రోజుల్లో నెలవారీ రేషన్ ఇవ్వాలి? పింఛన్లు పంచాలి? వచ్చేనెల వీటిని తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందా? ఆంధ్ర ప్రభుత్వమే ఇవ్వాలా? ఒకవేళ ఆ ప్రభుత్వమే ఇవ్వాల్సి వస్తే దానికి సంబంధించిన ప్రక్రియంతా పూర్తవుతుందా? అన్నది అంతుపట్టడం లేదు. ముఖ్యంగా ముంపు ప్రజలకు సంబంధించిన రికార్డుల మార్పు ఎప్పుడు జరుగుతుందనేది ప్రశ్న. తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు అందనిదే ఇక్కడి రికార్డులను ఆ ప్రభుత్వానికి ఇచ్చే విషయంలో జిల్లా యంత్రాంగం సహకరించబోదని నిపుణులంటున్నారు. మరి అలాంటప్పుడు చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లినందున అక్కడి ప్రభుత్వానికి సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలా? కొన్నాళ్ల పాటు ఈ ప్రభుత్వానికే దరఖాస్తు చేసుకోవాలా? అన్నది ముంపు వాసులకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఉన్నత చదువులు చదువుకునేందుకు ఏ ప్రభుత్వం వద్ద దరఖాస్తు చేసుకోవాలన్నది అంతుచిక్కని ప్రశ్న. గృహ నిర్మాణం, ఉపాధి రుణాలు కాదు కదా... కనీసం ఓటరుకార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా అక్కడి ప్రజలు తటపటాయిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ‘మన ఊరు - మన ప్రణాళిక’ సర్వేలు ముంపు మండలాల్లోనూ జరుగుతుండటం గమనార్హం. ఇక ఆ మండలాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగుల పరిస్థితి ఏంటో అంతుపట్టడం లేదు. ఆయా మండలాల్లో పనిచేస్తున్న వారిని తాత్కాలికంగా ఆంధ్రకే పంపుతారని, ఆ తర్వాత తెలంగాణ కేడర్‌కు తీసుకువస్తారని అంటున్నారు. మరోవైపు ఒకసారి అక్కడకు వెళ్లాక మళ్లీ ఈ రాష్ట్ర సర్వీసులోకి ఎలా తీసుకుంటారనే చర్చ ఉద్యోగుల్లో ఆందోళన రేపుతోంది. ముంపు మండలాల పరిస్థితిపై స్పష్టత ఎప్పుడు వస్తుందో అర్థంకాని పరిస్థితి ఉంది. కోరుకున్న చోట పునరావాసమా? మరోవైపు ఆర్డినెన్స్‌లో తమకు ఊరట కలిగించే అంశం ఒకటి ఉందనే ప్రచారం ముంపు మండలాల ప్రజల్లో ఆశలు రేపుతోంది. ముంపు ప్రాంత భూ భాగాన్ని బదలాయిస్తాం కానీ.. కోరుకున్న చోట ముంపు బాధితులకు పునరావాసం కల్పిస్తామని ఆర్డినెన్స్‌లో ఉందని, అలా అయితే తెలంగాణలోనే పునరావాసం కల్పించమని కోరవచ్చని గిరిజనులు భావిస్తున్నారు. ఆర్డినెన్స్‌లో ఒకవేళ అలాగే ఉన్నా తెలంగాణలో భూభాగానికి పరిహారం ఎవరు చెల్లిస్తారు? పోలవరం ముంపు బాధితులకు పునరావాసం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏమేరకు సహకరిస్తుందన్నది కూడా చర్చనీయాంశమే. కచ్చితంగా పక్క రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తే మాత్రం ఏపీ ప్రభుత్వానికి తాము సహకరించేది లేదని ముంపు వాసులు తెగేసి చెబుతున్నారు. అవి రెండూ కలపగలరా? ముంపు ప్రాంతాలు వెళ్లిపోతే జిల్లాలోని మూడు నియోజకవర్గాల స్వరూపం మారిపోనుంది. ముఖ్యంగా భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు వెళితే, మరో నాలుగు మండలాలు అక్కడ మిగులుతాయి. అశ్వారావుపేటలో రెండు మండలాలు, పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలంలో ఆరు గ్రామాలు ఆంధ్రకు బదలాయించబడతాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లోపు మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా? అనే చర్చ జరుగుతోంది. భద్రాచలం పట్టణం, బూర్గంపాడు మండలంలోని 12 గ్రామాలను కలిపి ఒకే మండలం చేయగలుగుతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అవి రెండూ, రెండు నియోజకవర్గాల్లో ఉన్నాయి. రెండింటినీ కలిపితే ఏర్పడే మండలాన్ని ఏదో ఒక నియోజకవర్గంలో కలపాలి. అలా కలపడానికి పునర్విభజన చట్టం అనుమతించదు. ఇలాంటి పరిస్థితుల్లో భద్రాచలం పట్టణాన్నే మండలం చేస్తారా? లేక భద్రాచలం అసెంబ్లీలోని వేరే మండలంలో కలుపుతారా? బూర్గంపాడు కేంద్రంగా 12 గ్రామాలతో కలిపి మండలాన్ని ఏర్పాటు చేస్తారా? అనేది కూడా తేలాల్సి ఉంది. -
గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం
ఆసిఫాబాద్ : గ్రామ స్వరాజ్యంతోనే దేశ స్వరాజ్యమని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మన ఊరు-మన ప్రణాళికపై డివిజన్ స్థాయి శిక్షణ శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రామన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసేందుకు గ్రామ పంచవర్ష ప్రణాళిక తయారీకి నిర్ణయించారని చెప్పారు. గ్రామ పంచాయతీలో అభివృద్ధికి అవసరమైన అంశాలపై ప్రతిపాదనలు సేకరించి ప్రణాళికను ప్రభుత్వానికి పంపిస్తారని తెలిపారు. ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకాధికారితోపా టు సభ్యులతో కమిటీ వేసినట్లు పేర్కొన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసి వాటిని బడ్జెట్లో ప్రవేశపెడతామని అన్నారు. దీని ప్రకారమే బడ్జెట్ కేటాయింపు ఉంటుందన్నారు. 17 శాఖలను గ్రామ పంచాయతీకు బదలాయించి సర్పంచులకు పూర్తి అధికారాలు కట్టబెడతామన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.10లక్షల వరకు వడ్డీ లేని రుణా లు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. అటవీ అడ్డంకులు తొలగిస్తాం.. జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మాణానికి అటవీశాఖ అడ్డంకులు తొలగిస్తామని మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. జిల్లాలో 41 రోడ్లు, 11 సాగునీటి ప్రాజెక్టులకు అటవీశాఖ అనుమతులు లేక పనులు నిలిచిపోయాయని, త్వరలో వాటికి అనుమతులు మంజూరు చేయిస్తామని చెప్పారు. జిల్లాలో అటవీ సంపదను 23 శాతం నుంచి 33 శాతానికి పెంచుతామని, ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో 2 కోట్ల మొక్కలు, గ్రామ పంచాయతీలో 33 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. ప్రత్యేక శిక్షకుడు విశ్రాంత డీఎల్పీవో శంకరయ్య ప్రొజెక్టర్ ద్వారా మన ఊరు-మన ప్రణాళికపై అవగాహన కల్పించారు. కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ జిల్లాలోని 866 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 13 నుంచి 18 వరకు సమావేశాలు నిర్వహించి గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక తయారు చేయాలన్నారు. గ్రామసభ నిర్వహించే స్థలం ఇతర ప్రజాప్రతినిధులతో చర్చించి సర్పంచులే నిర్ణయించాలన్నారు. తెలంగాణ గీతాన్ని ఆలపించి అమరులకు నివాళులర్పించాలని తెలిపారు. సబ్ కలెక్టర్ ప్రశాంత్‌పాటిల్, ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప, జెడ్పీటీసీ సభ్యుడు కొయ్యల హేమాజి, ఎంపీపీ తారాబాయి, డీఎల్పీవో శ్రీనివాస్‌రెడ్డి, తహశీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు పాల్గొన్నారు. బిల్లును ఉపసంహరించుకోవాలి పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ పార్లమెంటులో ఆమోదం పొం దిన బిల్లును ఉపసంహరించుకోవాలని మంత్రి రామన్న అన్నారు. స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు వెంకయ్యనాయుడుతో ఒత్తిడి తెచ్చి బిల్లును ఆమోదింపజేశారని అన్నారు. దీనిపై తెలంగాణలోని బీజేపీ, టీడీపీ నాయకులు అధిష్టానాన్ని ప్రశ్నించాలని అన్నారు. -
గ్రామస్థాయి నుంచే పునర్నిర్మాణం జరగాలి
కామారెడ్డి : తెలంగాణ పునర్నిర్మాణంలో అధికారులు, ప్రజలు ఉత్సాహంతో పనిచేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డి.వెంకటేశ్వరరావు అన్నారు. ఇందు కోసం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేయడానికి కృషి జరగాలన్నారు. గురువారం కామారెడ్డి, బోధన్‌లలో ‘మన గ్రామం - మన ప్రణాళిక’ అనే అంశంపై అధికారులకు అవగాహన శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రా మాల్లో నెలకొన్న ఉమ్మడి సమస్యలు, వాటిని ఎలా పరిష్కరించవచ్చనే విషయంపై గ్రామస్థాయిలో చర్చించి ప్రణాళికలు రూపొందించాలని సూచిం చారు. ప్రతి గ్రామంలో గ్రామ, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాటిని ప్రణాళికలో పొం దుపర్చాలన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం పథకాలు రూపొందించి అమలు చేసేదని, నవతెలంగాణ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యంతో గ్రామ స్థాయి నుంచే పథకాలు రూపొందించి వాటిని అ మలు చేయాల్సి ఉంటుందన్నారు. పాఠశాలలో ఉ పాధ్యాయులు ఎక్కువగా ఉండి, విద్యార్థులు లేని పక్షంలో ఉపాధ్యాయులను రేషనలైజ్ ద్వారా అవసరమున్న చోటుకు పంపించాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఇంటికి నీటి కుళాయి జిల్లాలో దెబ్బతిన్న చిన్ననీటి వనరులను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని, ఇందుకు గ్రామాల్లో చెరువుల వివరాలను సేకరించి వాటిని మరమ్మతులు చే యాల్సి ఉంటుం దన్నారు. గ్రామాలు, పట్టణాల్లో వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలన్నారు. ప్రతి ఇంటికి నీటికుళాయి ఉండేలా చూడాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు నాణ్యతలోపంతో చేపట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రజ ల భాగస్వామ్యంతో పనులు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామంలో 50 వేల మొక్కలు నాటించాలని సూచిం చారు. రైతులు పండించిన పంట చేతికిరాకముందే దళారులు ప్రవేశిస్తున్నారని, అవసరం ఉన్న ప్రతి గ్రామంలో గో దాములు నిర్మించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెంచడానికి వైద్యులు కృషి చేయాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కఠినంగా ఉండాలి ఫీజు రీయింబర్స్‌మెంటు విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. చాలా మంది ఆర్థికంగా ఉన్నవారు ఆదాయ ధ్రువపత్రాలతో ఫీజు రీయింబర్ ్సమెంటు పొందుతున్నారని, గతంలో ఇచ్చిన ఆదాయ పత్రాలను రద్దు చేసి కొత్తగా ఇస్తామన్నారు. తప్పుడు సమాచారంతో సర్టిఫికెట్ పొందితే ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే 1956 తరువాత వచ్చిన వారు నాన్‌లోకల్ అవుతారని, ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. తాత, తండ్రుల చరిత్రను తెలుసుకుని సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. బోగస్ రేషన్‌కార్డులను ఏరివేయాలి జిల్లాలో 5.90 లక్షల కుటుంబాలుంటే ఏడు లక్షల రేషన్ కార్డులున్నాయని, ఇందులో లక్ష కార్డులు అదనంగా ఉన్నం దున, వాటిని అనర్హుల నుంచి వాపస్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. రేషన్ డీలర్ల వద్ద బినామీ కార్డులుంటే వారిని డిస్మిస్ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఐకేపీ పీడీ వెంకటేశం, డ్వామా పీడీ శివలింగయ్య పాల్గొన్నారు. -
ఇక పల్లె ప్రణాళిక
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : వరుస ఎన్నికలు.. రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో ఇన్నాళ్లూ కార్యాలయాలకే పరిమితమైన అధికారగణం ఇక పల్లెబాట పట్టనుంది. గ్రామాల్లో అవసరాలను, ప్రాధామ్యాలను మదింపు చేయనుంది. ప్రజలతో మమేకమై పల్లె సర్వోతముఖాభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు రూపొందించేందుకు సిద్ధమవుతోంది. ‘మన ఊరు-మన ప్రణాళిక’ పేరున సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈనెల 17వ తేదీలోపు గ్రామాల ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించింది. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో జిల్లా కలెక్టర్లు, కీలకశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన కలెక్టర్ ఎన్.శ్రీధర్ సమావేశ వివరాలను ‘సాక్షి’కి వివరించారు. ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకూ గ్రామాలవారీగా పర్యటించి ప్లాన్లు తయారుచేస్తామని చెప్పారు. 22వ తేదీలోపు మండల స్థాయి, 27వ తేదీలోపు జిల్లాస్థాయి ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలని సర్కారు ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తామని, దీనిపై ఆగస్టులో జరిగే శాసనసభ బడ్జెట్ సమావేశంలో చర్చించి నిధులు కేటాయించనున్నట్లు సీఎం స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామాల అవసరాలను ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారయంత్రాంగం చర్చించి ఐదేళ్ల కార్యాచరణ రూపొందించాలని సూచించినట్లు తెలిపారు. గతంలో నిధుల కేటాయింపునకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసేవారమని, ఇకపై ప్రణాళికబద్ధంగా నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీధర్ వివరిం చారు. జిల్లాలో ఆయా సంస్థలకు కేటాయించిన భూముల్లో 10,900 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నట్లు గుర్తించామని, అలాగే మరో 8వేల ఎకరాల భూమి కూడా పరిశ్రమలకు తక్షణ కేటాయింపులకు వీలుగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిపినట్లు శ్రీధర్ స్పష్టం చేశారు.