కామారెడ్డి : తెలంగాణ పునర్నిర్మాణంలో అధికారులు, ప్రజలు ఉత్సాహంతో పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డి.వెంకటేశ్వరరావు అన్నారు. ఇందు కోసం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేయడానికి కృషి జరగాలన్నారు. గురువారం కామారెడ్డి, బోధన్‌లలో ‘మన గ్రామం - మన ప్రణాళిక’ అనే అంశంపై అధికారులకు అవగాహన శిబిరం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రా మాల్లో నెలకొన్న ఉమ్మడి సమస్యలు, వాటిని ఎలా పరిష్కరించవచ్చనే విషయంపై గ్రామస్థాయిలో చర్చించి ప్రణాళికలు రూపొందించాలని సూచిం చారు. ప్రతి గ్రామంలో గ్రామ, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాటిని ప్రణాళికలో పొం దుపర్చాలన్నారు.
ఇప్పటి వరకు ప్రభుత్వం పథకాలు రూపొందించి అమలు చేసేదని, నవతెలంగాణ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యంతో గ్రామ స్థాయి నుంచే పథకాలు రూపొందించి వాటిని అ మలు చేయాల్సి ఉంటుందన్నారు. పాఠశాలలో ఉ పాధ్యాయులు ఎక్కువగా ఉండి, విద్యార్థులు లేని పక్షంలో ఉపాధ్యాయులను రేషనలైజ్ ద్వారా అవసరమున్న చోటుకు పంపించాల్సి ఉంటుందన్నారు.
ప్రతి ఇంటికి నీటి కుళాయి
జిల్లాలో దెబ్బతిన్న చిన్ననీటి వనరులను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని, ఇందుకు గ్రామాల్లో చెరువుల వివరాలను సేకరించి వాటిని మరమ్మతులు చే యాల్సి ఉంటుం దన్నారు. గ్రామాలు, పట్టణాల్లో వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలన్నారు. ప్రతి ఇంటికి నీటికుళాయి ఉండేలా చూడాల్సి ఉంటుందన్నారు.
ప్రభుత్వ పథకాల ద్వారా చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు నాణ్యతలోపంతో చేపట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రజ ల భాగస్వామ్యంతో పనులు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామంలో 50 వేల మొక్కలు నాటించాలని సూచిం చారు. రైతులు పండించిన పంట చేతికిరాకముందే దళారులు ప్రవేశిస్తున్నారని, అవసరం ఉన్న ప్రతి గ్రామంలో గో దాములు నిర్మించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెంచడానికి వైద్యులు కృషి చేయాలన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కఠినంగా ఉండాలి
ఫీజు రీయింబర్స్‌మెంటు విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. చాలా మంది ఆర్థికంగా ఉన్నవారు ఆదాయ ధ్రువపత్రాలతో ఫీజు రీయింబర్ ్సమెంటు పొందుతున్నారని, గతంలో ఇచ్చిన ఆదాయ పత్రాలను రద్దు చేసి కొత్తగా ఇస్తామన్నారు. తప్పుడు సమాచారంతో సర్టిఫికెట్ పొందితే ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే 1956 తరువాత వచ్చిన వారు నాన్‌లోకల్ అవుతారని, ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. తాత, తండ్రుల చరిత్రను తెలుసుకుని సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు.
బోగస్ రేషన్‌కార్డులను ఏరివేయాలి
జిల్లాలో 5.90 లక్షల కుటుంబాలుంటే ఏడు లక్షల రేషన్ కార్డులున్నాయని, ఇందులో లక్ష కార్డులు అదనంగా ఉన్నం దున, వాటిని అనర్హుల నుంచి వాపస్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. రేషన్ డీలర్ల వద్ద బినామీ కార్డులుంటే వారిని డిస్మిస్ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఐకేపీ పీడీ వెంకటేశం, డ్వామా పీడీ శివలింగయ్య పాల్గొన్నారు.
గ్రామస్థాయి నుంచే పునర్నిర్మాణం జరగాలి
Published Fri, Jul 11 2014 3:05 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
Advertisement
Advertisement