మోమిన్‌పేట: ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు స్థలాన్ని తప్పనిసరిగా గుర్తించాలని కలెక్టర్ ఎన్. శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘మన ఊరు- మన ప్రణాళిక’లో గుర్తించిన ప్రాధాన్యతా అవసరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు. తాగునీరు, మురుగు కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి వాటిపై అంచనాల తో నివేదికలు తయారు చేయాల ని ఆయన తెలిపారు.
ప్రతి గ్రామంలో చెత్తను వేసేందుకు డంపింగ్ యార్డు, శ్మశానవాటిక, సృ్మతి వనం ఏర్పాటుకు తప్పనిసరిగా స్థలాలను పరిశీలించాలన్నారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ప్రత్యేకాధికారి రమణారెడ్డిని ఆదేశించారు. గ్రామ స్థాయిలో ఓ కమిటీని ఏర్పాటు చేసి 2 నెలల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఫీల్డ్‌అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, గ్రామ ప్రత్యేకాధికారితో కమిటీ వేసి ప్రతి గ్రామాన్ని పర్యవేక్షించాలని ఏపీఓ అంజిరెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆమ్రపాలి, ఎంపీడీఓ కె.సువిధ, తహసీల్దార్ రవీందర్, వైద్యాధికారి సాయి బాబా, వ్యవసాయాధికారి నీరజ పాల్గొన్నారు.
డంపింగ్ యార్డులకు స్థలాలు గుర్తించండి
Published Tue, Jul 22 2014 11:48 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement