పారిశ్రామిక రంగానికి సర్కారు ప్రోత్సాహం | the government encouraged by the industrial sector | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక రంగానికి సర్కారు ప్రోత్సాహం

Published Fri, Dec 5 2014 2:56 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

the government encouraged by the industrial sector

ఖమ్మం అర్బన్ : పారిశ్రామిక రంగాన్ని టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని డిప్యూటీ ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. నగర శివారు గోపాలపురంలో భారత్ హ్యుండాయ్ షోరూమ్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. రాష్ర్టంలో పరిశ్రమలు స్థాపించేం దుకు ముందుకొచ్చే ఔత్సాహికులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. దేశంలో కార్ల దిగ్గజం హ్యుండాయ్ కార్ల కంపెనీ షోరూమ్‌ను ఖమ్మంలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. విశాలమైన ప్రాంతంలో షోరూమ్‌ను ఏర్పాటు చేసిన మేనేజింగ్ డెరైక్టర్ కేసా శ్రీకాంత్‌ను అభినందించారు.

హ్యుండాయ్ కంపెనీ రీజనల్ సేల్స్ మేనేజర్ తేజా చౌదరి మాట్లాడుతూ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సరికొత్త కార్లను తయారు చేయడం కంపెనీ లక్ష్యమన్నారు. ఆర్‌పీ ఎస్.ఎం.గురుమూర్తి ప్రసాద్ మాట్లాడుతూ వినియోగదారులకు వినూత్న ఉత్పత్తులు అందించడమే హ్యుండాయ్ ధ్యేయమన్నారు. స్పేర్స్ విభాగాన్ని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ ప్రారంభించారు. ఈసందర్భంగా మేనేజింగ్ డెరైక్టర్ కేసా శ్రీకాంత్ మాట్లాడుతూ ఒకేసారి ఎక్కువ వాహనాలు సర్వీస్‌కు వచ్చినప్పుడు జాప్యం లేకుండా 10 నిమిషాల్లో కార్ వాష్, డెంటింగ్, పేయింటింగ్ అయ్యేలా సేవలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, చేవూరి లక్ష్మణ్‌కుమార్, గురుమూర్తి ప్రసాద్, వీర కిషోర్‌రెడ్డి, షోరూమ్ జనరల్ మేనేజర్ శయన్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement