రాష్ట్రంలో 84 మందికి స్వైన్‌ఫ్లూ పాజిటివ్: రాజయ్య
ధర్మసాగర్: తెలంగాణలో 84 మందికి స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా తేలిందని, ఐదు మరణాలు సంభవించాయని డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య చెప్పారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం రాత్రి ఆయన బస చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వైన్‌ఫ్లూను ఆలస్యంగా గుర్తించడం, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి, పరిస్థితి విషమించిన తర్వాత చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు రావడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. స్వైన్‌ఫ్లూ నివారణకు జిల్లా స్థాయి ఆస్పత్రుల్లోనూ మం దులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
మరో 8 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు
సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ప్లూ లక్షణాలతో బాధపడుతూ శనివారం మరో 8 మంది హైదరాబాద్‌లో వివిధ ఆస్పత్రుల్లో చేరారు. మహబూబ్‌నగర్‌కు చెందిన బుచ్చమ్మ(50), యూసుఫ్‌గూడకు చెందిన కృష్ణంరాజు(35), మలక్‌పేట్ వాసి వేణు(28), అదే ప్రాంతానికి చెందిన దుర్గం కిరణ్(30)లు స్వైన్‌ప్లూతో ఉస్మానియాలో చేరారు. ఎన్‌బీటీ నగర్‌కు చెందిన శాన్వీ(3) రెయిన్‌బో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.