ప్రజలు అభద్రతకు గురికావద్దు: రాజయ్య
హైదరాబాద్ : తెలంగాణలో స్వైన్ ఫ్లూతో ఇప్పటివరకూ అయిదుగురు మృతి చెందినట్లు డిప్యూటీ సీఎం రాజయ్య తెలిపారు. మరో 141మంది స్వైన్ఫ్లూ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆయన సోమవారమిక్కడ చెప్పారు. 347మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో ఐదుగురికి వ్యాధి నిర్థారణ అయినట్లు వెల్లడించారు.
స్వైన్ఫ్లూపై ప్రజలు భయపడాల్సిన పనిలేదని, చికిత్స, మందులు అందుబాటులో ఉన్నాయని రాజయ్య అన్నారు. ఇక వరంగల్లో పోలియో మందు వికటించి చిన్నారి చనిపోయిన సంఘటనపై పూర్తి నివేదిక కోరినట్లు ఆయన తెలిపారు. వైద్యశాఖలో ఔట్ సోర్సింగు నియామకాలపై పత్రికల్లో అవినీతి కథనాలు వస్తున్నాయని... అయితే ఇప్పటివరకూ ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదన్నారు. నిమ్స్ డైరెక్టర్పై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, నిమ్స్ డైరెక్టర్ వివాదం కోర్టులో ఉన్నట్లు రాజయ్య తెలిపారు.