వంద, రెండొందలు అడిగితే తప్పేముంది: రాజయ్య | Hundred, wrong Which one should ask: RAJAIAH | Sakshi
Sakshi News home page

వంద, రెండొందలు అడిగితే తప్పేముంది: రాజయ్య

Published Thu, Jan 8 2015 12:26 PM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

వంద, రెండొందలు అడిగితే తప్పేముంది: రాజయ్య

వంద, రెండొందలు అడిగితే తప్పేముంది: రాజయ్య

  • ఆసుపత్రి సిబ్బంది పక్షాన నిలిచిన డిప్యూటీ సీఎం
  • సాక్షి, మంచిర్యాల: స్వతహాగా డాక్టర్ అయిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజ య్య వైద్యుల పక్షపాతి అని చాటుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం మంచిర్యాల ఏరి యా ఆస్పత్రిలో రాత్రి బస చేసిన ఆయన పరోక్షంగా వైద్యులకు మద్దతు తెలిపారు. బుధవారం ఆస్పత్రి నుంచి వెళ్లే ముందు విలేకరులతో మాట్లాడారు.

    ఆస్పత్రిలో సిబ్బంది రూ.100, రూ.200 అడిగితే అది తప్పు కాదని, అలా అడిగినవారిని అవినీతిపరులుగా పరిగణించొద్దని చెప్పుకొచ్చారు. ఎవరైనా వేధిస్తేనే ఆర్డీవో, డీఎంహెచ్‌వో, కలెక్టర్‌కు ఫోన్లో సమాచారమివ్వాలని సూచించారు. నిన్నటి వరకు స్వైన్‌ఫ్లూ బారిన పడి ఐదుగురు మరణించినట్లు చెప్పిన ఆయన స్వైన్‌ఫ్లూ మరణాలు లేవని తాజాగా మాట మార్చారు.

    స్వైన్‌ఫ్లూ బాధిత రోగులకు చికిత్స అందించేందుకు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఓ ఐసోలేటెడ్ వార్డుతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘థర్మోస్కాన్’ను ఏర్పా టు చేసినట్లు వివరించారు. ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే డీఎంహెచ్‌వోల ఆధ్వర్యంలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు ఇచ్చిన వెంటనే అన్ని జిల్లాల నుంచి ఖాళీల జాబితా తెప్పించుకుని ఆస్పత్రుల్లో పోస్టులన్నీ భర్తీ చేస్తామని రాజయ్య స్పష్టం చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement