Flu
-
పెరుగుతోన్న చలి తీవ్రత.. రోగాల బారిన పడకుండా ఉండాలంటే..
చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చల్లటి గాలులు కూడా వణికిస్తున్నాయి. అయితే చలిగాలులు అనేక రకాల వ్యాధులను కూడా మోసుకొస్తున్నాయి. ఈ సీజన్లో ప్రజల్లో వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలిగాలులు శరీరంలోకి వెళ్లడంతో వైరస్లు మరింత వృద్ధి చెందే ప్రమాదం ఉందని అంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చలితీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు కూడా పేర్కొంటున్నారు.సమస్యలు.. ఫ్లూ, సైనసైటిస్, ఊపిరితిత్తుల్లో వైరల్ ఇన్ఫెక్షన్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి(సీవోపీడీ), ఆస్తమా వంటి సమస్యలు తలెత్తుతాయి. హైపోథెర్మియా, చర్మం లోపలి కణజాలం గడ్డ కట్టి గాయాలు కావటం, పెర్నియో, ఇమ్మర్షన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.లక్షణాలు.. దగ్గు, జలుబు, గొంతునొప్పి, తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఆయాసం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. జాగ్రత్తలు.. చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో మాస్కులు ధరించాలి. దీంతో వైరస్ సోకదు. వేరేవారికి సోకకుండా ఉంటుంది. ఎవరైనా వాతావరణాన్ని అంచనా వేసుకుని బయటకు రావాలి. మరీ చలితీవ్రత అధికంగా ఉంటే బయటకు రాకుండా ఉంటే మంచిది. ము ఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడేవారు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇన్హేలర్లను వాడుతుండాలి.ఎవరికి ఇబ్బంది.. చలి తీవ్రత నేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, మహిళలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులు వేడివేడిగా సరైన ఆహారం తీసుకోవాలి. పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలను ధరించాలి. చలిగాలులు ఉన్నప్పుడు చిన్నారులను బయట తిప్పకూడదు. ఎక్కువరోజులు జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి రక్తం రావటం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చలిగాలుల్లో ఆరు బయట పనిచేసే కార్మికులు, వీధుల్లో గడిపే నిరాశ్రయులు జాగ్రత్తగా ఉండాలి.చదవండి: ఈ డివైజ్‌తో మొటిమలలు, మచ్చలు ఇట్టే మాయం..!కారణాలు.. ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల వైరస్‌కు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీంతో శరీరంలో వైరస్ కణాలు వేగంగా వృద్ధి చెందుతాయి. ఈ వాతావరణంలో ఒకరి నుంచి మరొకరికి వేగంగా ఫ్లూ వ్యాప్తి చెందుతుంది.వ్యాధి నిరోధకశక్తి పెంచుకోవాలి.. చలికాలంలో వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది. దీంతో పౌష్టికాహారం తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన ఉసిరి, నిమ్మకాయల రసం తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం మరింత మంచిది. విపరీతమైన చలికి జాగ్రత్తలు తీసుకోకపోతే, అవయవాల్లో గాయాలై మరణాలు సంభవించవచ్చు. – డాక్టర్ ఎం.రాజీవ్, పల్మనాలజిస్ట్, టీజీఎంఎస్ సభ్యుడు -
నాన్‌స్టిక్ పాన్‌తో పెరుగుతున్న టెఫ్లాన్ ఫ్లూ కేసులు!
నాన్‌స్టిక్ వంట సామానులు వాడొద్దని ఎన్నేళ్లుగానో నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని విన్నాం. కానీ ఇటీవల ఈ నాన్‌స్టిక్ కుక్వేర్ల వాడకం వల్ల యూఎస్‌లో సరికొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. వాటిని అధికంగా వేడిచేయడం వల్లే ఈ వ్యాధి వస్తున్నట్లు పరిశోధనలో తేలింది. అసలేంటి వ్యాధి? అందుకు నాన్‌స్టిక్ పాన్ ఎలా కారణం..?.నాన్‌స్టిక్ పాన్లు అధికంగా వేడి చేయడం వల్లే పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్ వంటి ఫ్లూ మాదిరి వ్యాధులు వస్తున్నాయని సుమారు మూడు వేలకు పైగా నివేదికలు చెబుతున్నాయి. అందుకు నాన్‌స్టిక్ కుక్వేర్ల్లో ఉపయోగించే రసాయన పూత కారణమని గత 20 ఏళ్లుగా లాభప్రేక్ష లేని సంస్థ యూఎస్ పాయిజన్ సెంటర్స్ చెబుతున్నాయి. ఈ వంట సామానుల్లో వాడే కెమికల్స్ కారణంగా పాలిమర్ ఫ్యూమ ఫీవర్‌కి సంబంధించిన కేనులు 267కి పైగా నమోదయ్యాయి. టెఫ్లాన్లోని ప్రధాన పదార్థం. పాలిటెట్రాఫ్లోరోఎథిలిన్(పీటీఎఫ్ఈ). అందువల్లే దీన్ని వందల ఏళ్లుగా నిపుణులు ప్రమాదకరమైన కెమికల్స్‌తో కూడిన పాన్లని చెబుతున్నారు. అన్ని నాన్‌స్టిక్ వంటసామాను సెట్లు పీఎఫ్ఏఎస్(పర్ పాలీఫ్లోరోఅల్కైల్ పదార్ధాలు) కెమికల్ ఉంటుందని అన్నారు. మనం ఈ నాన్‌స్టిక్ పాత్రను దాదాపు 500 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా వేడి చేసినప్పుడూ..దానిపై ఉండే ఈ రసాయన పూత విరిగిపోయిన లేదా డ్యామేజ్ అయినప్పుడూ ఈ "టెఫ్లాన్ ఫ్లూ"కి దోహదపడే పొగలను విడుదలవడం జరుగుతుంది. అందువల్ల దీనిలో వండే పదార్థాలు మనకు అనారోగ్యాలను కలుగుజేస్తాయని తెలిపారు. అందువల్ల టెఫ్లాన్ పూతతో కూడిన పాన్లు అధిక్ష ఉష్ణోగ్రత వద్ద వేడి చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు జర్మనీలో జరిపిన అధ్యయనంలో పరిశోధకులు ఖాళీ నాన్‌స్టిక్ ప్యాన్లను అరగంట పాటు వేడి చేయడం ద్వారా పీఎఫ్ఏఎస్ ఉద్గారాలు విడుదలవ్వుతున్నట్లు గుర్తించారు. దాదాపు 698 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతకు చేరుకున్నప్పుడూ పాన్ అత్యధిక ఉద్గారాలను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణ ఉష్ణోగ్రత వద్ద మానవ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల నిపుణులు నాన్ స్టిక్ కుక్వేర్ని ఎప్పుడూ ముందుగా వేడి చేయకూడదని నొక్కిచెబుతున్నారు. తక్కువ మంట మీద వండితే ఎలాంటి సమస్య ఉండదు గానీ, వేడి చేసిన నాన్‌స్టిక్ పాన్‌లో కర్రిని అలా ఉంచేయడం వల్ల కూడా పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్ వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతేగాదు టెఫ్లాన్‌తో పూసిన పాన్‌పై ఒక్క స్క్రాచ్ తొమ్మిది వేల కణాలను ఉత్పత్తి చేస్తుందని, ఇది మానవ శరీరంలో మూత్రపిండాలు, వృషణాలకు సంబంధించిన కేన్సర్ ప్రమాదాలకు కారణమవుతుందని హెచ్చరించారు. అలాగే వంట చేసేటప్పుడూ తప్పనిసరిగా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు లేదా ఓపెన్ విండోలను కూడా ఉపయోగించాలని సూచించారు పరిశోధకులు. (చదవండి: వాల్నట్స్ తింటున్నారా..?ఐతే అలాంటివాళ్లు మాత్రం..!) -
కొన్ని వ్యాధులకు మద్యమే మందట.. తాగితే తగ్గుతుందట!
'మద్యం ఆరోగ్యానికి హానికరం' అంటూ యాడ్లలోనూ సినిమాల్లోనూ తెగ కనిపిస్తుంది. అదీగాక మద్యం తాగితే లివర్, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు పాడై ప్రాణాలు కోల్పోతారనివైద్యులు హెచ్చరిస్తుంటారు. అయితే మద్యం తాగితే కొన్ని వ్యాధులు రావట. పైగా ఆ వ్యాధులకు మద్యమే మందట. తాగితే ఆ వ్యాధులు తగ్గుముఖం పడతాయిని సాక్షాత్తు వైద్యులే చెబుతున్నారు. అలా అని ఇష్టారీతిగా తాగేయ్యొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఏ వ్యాధులకు మద్యం మందు? ఎంత మోతాదులో తాగితే బెటర్ అంటే.. ఇటీవల కాలంలో మద్యం తాగేవాళ్ల సంఖ్య రోజు రోజుకి అనూహ్యంగా పెరుగుతుంది. దీనివల్ల దీర్ఘాకాలిక వ్యాధులు బారినపడే ప్రమాదం ఉదన్నా సరే వీకెండ్ అని, వెకేషన్ అని ఏదో ఒక సందర్భం పేరుతో విచ్చల విడిగా తాగేయడం నేటి యువతకు ఓ ఫ్యాషన్ అయిపోయిందని చెప్పొచ్చు. పోనీ తాగిన అందుకు తగ్గ ఫుడ్ జ్రాగత్తలు తీసుకుంటే బావుండు. పడని బ్రాండెడ్ మందు కూడా ట్రై చేసేసి లేనిపోని ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు కొందరూ. ఆరోగ్య నిపుణులు, వైద్యులు మద్యం సేవిస్తే వచ్చే ఆరోగ్య సమస్యల గురించి వివరించినా.. ఐ డోంట్ కేర్ అన్నట్లు తాగేస్తుంటారు మందుబాబులు. పరిస్థితి చేయి దాటాక తాగుడు అలవాటు నుంచి బయటపడేందుకు డీ అడిక్షన్ సెంటర్ల చుట్టూ తెగ ప్రదిక్షణాలు చేసేస్తుంటారు. ఇంత వరకు పరిస్థితి ఎందుకు తెచ్చుకోవడం అని వైద్యులు తరుచుగా ప్రశ్నిస్తుంటారు రోగులన. అసలు ఇలాంటి సమస్య తెచ్చుకోకుండా మందుబాబులు జాగ్రత్తగా ఉండేలా వైద్యులు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇష్టంగా తాగే మందు వల్ల కలిగే ప్రయోజనాల తోపాటు ఏ మోతాదులో తీసుకుంటే హాయిగా ఉండొచ్చో సవివిరంగా చెప్పారు. అవేంటంటే.. ఆ వ్యాధులు తగ్గుతాయట.. బ్రాందీ, రమ్, విస్కీ జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు బారినపడకుండా కాపాడుతుందట. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయట. అలాగే జలుబు కారణంగా వచ్చే శ్లేష్మాన్ని క్లియర్ చేస్తుందట. ఇందులో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ కంటెంట్ క్యాన్సర్ వ్యతిరేకంగా పనిచేస్తుందట. ముఖ్యంగా అండాశయ, మూత్రాశయ క్యాన్సర్లు రాకుండా నియంత్రిస్తుందట. రాగి బారెల్స్‌లో ఉండే బ్రాందీలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. ఇది మంచి యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. పైగా హృదయనాళాల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇలాంటి మంచిఫలితాలను పొందాలంటే ఇక్కడ బ్రాందీ, రమ్ వంటివి రోజుకి 30 నుంచి 60 ఎంఎల్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యక్తిగత ఆరోగ్య చరిత్రను పరిగణలోనికి తీసుకుని, అందుకు అనుగుణంగా నిపుణుల సూచించిన విధంగా మోతాదుకు మించి మద్యం సేవించకుండా ఉంటేనే ఈ సత్ఫలితాల పొందగలరని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ ఏదైన తగు మోతాదులో మితంగా ఉంటే శరీరానికి అవసరమయ్యే మంచి ఔషధ గుణాలను పొందగలమని చెబుతున్నారు నిపుణులు. వార్నింగ్: తాగమని కాదు..! ఇక్కడ మందు తాగండని లేదా తాగడం మంచిదని చెప్పడం ప్రధాన ఉద్దేశ్యం కాదు. తాగే అలవాటు ఉన్నవారు, అస్సలు తాగకుండా ఉండలేని వారు దీని వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటే కనీసం తగు మోతాదులో లేదా ఆరోగ్యకరమైన పద్ధతిలో తీసుకుని సురక్షితంగా ఉంటారని తెలియజేయడమే తప్ప. ఇక్కడ ఎవర్నీ మందు తాగమని ప్రోత్సహించే ఉద్దేశ్యం లేదని చెబుతున్నారు నిపుణులు. కొన్ని హానికరైమన వాటిల్లో కూడా మేలు చేసే గుణాలు ఉంటాయని చెప్పేందుకే అని అన్నారు. ఇవి తెలుసుకుంటే ఆ చెడు అలవాటుని కూడా ఆరోగ్యానికి మంచిదిగా మలుచుకుంటే తాగుడు సమస్య నుంచి బయటపడొచ్చు లేద చెక్ పెట్టగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసమే. దీన్ని అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు, ఆరోగ్య నిపుణుల సలహాలు సూచనల మేరుకు పాటించటం ఉత్తమం. -
అమెరికాలో ఫ్లూతో 15 వేలమంది మృతి!
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో గల సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, ఈ సీజన్లో ఇప్పటివరకు అమెరికాలో సుమారు రెండు లక్షల 50 వేల మంది ఫ్లూ కారణంగా ఆసుపత్రి పాలయ్యారు 15 వేల మరణాలు సంభవించాయి. ఫిబ్రవరిలో ఇన్ఫ్లుయెంజా బారినపడిన చిన్నారుల మరణాలు నమోదయ్యాయి. ఈ సీజన్లో మొత్తం 74 మంది చిన్నారులు ఇన్‌ఫ్లుయెంజాతో ఆసుపత్రిలో చేరారు. గడిచిన వారంలో 11 వేలకు పైగా భాధితులు ఆసుపత్రిలో చేరినట్లు పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇన్ఫ్లుఎంజా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఆరు నెలలలోపు చిన్నారులకు వార్షిక ఫ్లూ వ్యాక్సిన్ వేయించాలని అధికారులు తెలిపారు. -
ఫ్లూ జ్వరంలా ఉందని తేలిగ్గా తీసుకుంది..కట్ చేస్తే అంతలోనే..
కొన్ని జబ్బుల తీరు వైద్యులు చెప్పిన లక్షణాలేవి కనిపించకుండానే సైలంట్‌గా దాడి చేస్తాయి. అందువల్లే ప్రజలు కూడా తేలిగ్గా తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎంతలా అలాంటి వాటిని కట్టడి చేసి ప్రజల్లో ఆ వ్యాధులపై అవగాహన కల్పిద్దామన్నా పరిస్థితుల దృష్ట్యా లేదా జీవనశైలి కారణంగానో ఆ వ్యాధుల లక్షణాలు కూడా ఆశ్చర్య కలిగించే రీతిలో వస్తున్నాయి. అలాంటి షాకింగ్ లక్షణాలే ఇక్కడొక మహిళలో కనిపించడంతో లైట్ తీసుకుంది. అదే ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చి ఆస్పత్రి పాలు చేసింది. అసలేం జరిగిందంటే..ఈ షాకింగ్ ఘటన యూఎస్ఏలో చోటు చేసుకుంది. జెన్నా టాన్నర్ అనే 48 ఏళ్ల మహిళ గతేడాది మహమ్మారి సమయంలో కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొంది. నిజం చెప్పాలంటే ఆమె ఇంటిల్లపాది ఆ మహమ్మారి బారిన పడి బయటపడ్డారు. అయితే ఆమెకు ఒక రోజు ఫ్లూ వంటి లక్షణాలతో కూడిన జ్వరం వచ్చింది. శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇది సేమ్ కరోనా మాదిరి సమస్యే అనుకుంది ఆమె. బహుశా ఫ్లూ లాంటి జ్వరం కాబోలు అనుకుని లైట్ తీసుకుంది. భర్తకు కూడా చెప్పకూడదనుకుంది. ఎందుకంటే? ఆస్పత్రిలో చేరిపోమంటారన్న భయం తోపాటుపైగా రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందన్న ఉద్దేశ్యంతో టాన్నర్ చెప్పకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. అది కాస్త తీవ్రమై సడెన్‌గా ఓ రోజు ఇంట్లోనే స్ప్రుహతప్పి పడిపోయింది. కట్ చేస్తే.. ఆమె రెండు రోజుల వరకు ఆస్పత్రిలోనే కోమాలో ఉంది. రెండో రోజు సాయంత్రం మెలుకువ వచ్చి అంతా తెలుస్తున్నా.. ఏది తన కండిషన్లో లేనట్లు, గుండెపై ఏనుగులాంటి పెద్ద బరువు ఏదో ఉన్నట్లు తోచింది ఆమెకు. కనీసం బెడ్ మీద నుంచి కదలాలనుకున్న కొంచెం కుడా కదలలేకపోతోంది. కనీసం చేతిని కూడా కదపడం కష్టంగా ఉంది. ఏం జరిగిందో కూడా ఆమెకు అర్థం కాలేదు. ఆ తర్వాత కాసేపటికి తనవాళ్లు వచ్చి తనకు గుండె పోటు వచ్చిందని చెప్పేంత వరకు కూడా ఆమెకు ఏం తెలియదు. అయితే తనకు వచ్చింది గుండెపోటా..? అని నిర్ఘాంతపోయింది. నాకలాంటి సంకేతాలేం కనిపించలేదు కదా! అని ఆలోచిస్తూ షాక్‌లోనే ఉండిపోయింది. ఆ తర్వాత వైద్యులు ఆమెకు బైపాస్ సర్జరీ చేసి స్టంట్ వేశారు. అస్సలు గుండెపోటు వచ్చినప్పుడు ఇలా గాలి పీల్చుకోవడం వంటి రెస్పిరేషన్ సమస్యలు కూడా వస్తాయ? అని ఆమెకు ఆశ్చర్యం కలిగింది. అందుకే ఆమె తనలా ఎవరూ వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదన్న ఉద్దేశంతో తన ఉదంతాన్ని అందరికీ చెప్పి గుండెపోలు వంటి వ్యాధులపై అవగాహన కల్పించే యత్నం చేస్తోంది టాన్నర్. కాగా,అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. మహిళలకు గుండెపోటులో యూఎస్ తొలి స్థానంలో ఉంది. నిజానికి గుండెపోటు అనంగానే ఛాతీ నొప్పిలా వస్తుందని అందరికీ తెలుసు. కానీ మహిళ్లల్లో ఇలా కాకుండా వేర్వేరు లక్షణాలతో కూడా సంకేతాలిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. స్త్రీలల్లో ముఖ్యంగా ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, వికారం, వెన్ను, భుజం, దవడ నొప్పి వంటి ఇతర లక్షణాల రూపంలో కూడా సంకేతమిస్తుందని అన్నారు. ఏదీ ఏమైనా 45 ఏళ్లు దాటాక ఏ వ్యక్తి అయినా చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే నిర్లక్ష్యం చేయకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు వైద్యులు. (చదవండి: ఆ మహిళ కడుపునొప్పే షాకివ్వగా..బయటపడ్డ మరో ట్విస్ట్ చూసి కంగుతిన్న వైద్యులు) -
ఫ్లూ జ్వరం ఎందుకొస్తుంది? రాకుండా ముందుగానే నివారించొచ్చా?
గత కొద్దికాలంగా జ్వరాలు, దగ్గు, జలుబుతో పాటు శ్వాస సరిగా అందకపోవడం వంటి ఫ్లూ లక్షణాలతో చాలామంది హాస్పిటళ్లకు పరుగులెత్తుతున్నారు. జ్వరం తగ్గాక కూడా పొడి దగ్గు, కొందరిలో కఫంతో కూడిన దగ్గు ఒక పట్టాన తగ్గకపోవడంతో ఆందోళన పడుతున్నారు. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. బాధితుల నుంచీ ఇవే కంప్లెయింట్స్తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని చాలా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ ఫ్లూ జ్వరాలు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఇవి ఎందుకిలా వస్తున్నాయి, లక్షణాలేమిటి, ముందస్తు నివారణకూ లేదా ఇప్పటికే వచ్చి ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. ఫ్లూలాంటి జ్వరాలు... లక్షణాలూ, జాగ్రత్తలుఇటీవల వస్తున్న ఫ్లూలాంటి జ్వరాలన్నింటికీ ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ప్రధాన కారణమని వైద్య నిపుణుల భావన. రెండుమూడేళ్ల కిందట వచ్చిన కరోనా వైరస్ తాలూకు తీవ్రత బాగా తగ్గిపోయి, పెద్దగా ప్రమాదకరం కాని కోవిడ్ కూడా ఈ జ్వరాల కారణాల్లో ఒకటి కావచ్చునని కూడా వైద్యవర్గాలు భావిస్తున్నాయి. రాబోయేది చలికాలం కావడంతో ఇవే జ్వరాలు... దాదాపు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి వరకు కొనసాగవచ్చని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. లక్షణాలు : దాదాపు ఫ్లూ జ్వరాల్లో కనిపించే అన్ని లక్షణాలూ ఈ సీజనల్ ఫీవర్స్‌లో కనిపిస్తున్నాయి. ఉదాహరణకు... ∙జ్వరం ∙తలనొప్పి ∙ఒళ్లునొప్పులు ∙గొంతునొప్పి ∙గొంతు కాస్త బొంగురుగా మారడం ∙కొన్నిసార్లు (తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు) శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. ఈ లక్షణాలు ఐదు నుంచి దాదాపు గరిష్ఠంగా పదిరోజులు ఉంటాయి. నిర్ధారణ పరీక్షలు / చికిత్స ముక్కు, గొంతు స్వాబ్‌తో కరోనా లేదా ఇతర ఇన్ఫ్లుయెంజా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని నిర్ధారణ చేయవచ్చు. తీవ్రత తక్కువగా ఉన్నవాళ్లకి (జ్వరం, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు లక్షణాలు గలవారికి) ఇంటివద్దనే లక్షణాలకు తగినట్లుగా పారాసిటమాల్, ఓఆర్ఎస్, దగ్గు సిరప్‌లతో చికిత్స అందించవచ్చు. తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి అంటే... విపరీతమైన దగ్గు, ఆయాసం, ఆక్సిజన్ తగ్గిపోవడం వంటి లక్షణాలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్నవారిని హాస్పిటల్లో చేర్చి చికిత్స అందించాలి. నివారణ / జాగ్రత్తలు: దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. చేతి రుమాలు లేనప్పుడు తమ ఫుల్ స్లీవ్స్లోకి తుమ్మడం మంచిది. దీని వల్ల వైరస్ లేదా వ్యాధిని సంక్రమింపజేసే సూక్ష్మజీవులు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించవు. కరోనా సమయంలోలా వీలైతే జ్వరం, దగ్గు తగ్గేవరకు మాస్క్ ధరించడం మేలు. ∙దగ్గు లేదా తుమ్మినపుడు చేతులను అడ్డుపెట్టుకున్నవారు, తర్వాత చేతుల్ని 20 సెకన్ల పాటు సబ్బుతో కడుక్కోవాలి లేదా శానిటైజర్ వాడాలి. దగ్గు/తుమ్ము సమయంలో ఒకరు వాడిన రుమాలును వేరొకరు ఉపయోగించకూడదు. దాన్ని తప్పనిసరిగా డిస్పోజ్ చేయాలి. జలుబు లేదా ఫ్లూ లక్షణాలున్న వ్యక్తులనుంచి దూరంగా ఉండాలి ∙బాధితుల పక్కబట్టలను, పాత్రలను విడిగా ఉంచాల్సినంత అవసరం లేదుగానీ... వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఒకరి బట్టలు, పాత్రలను మరొకరు వాడకపోవడమే మంచిది. బాధితుల్ని మిగతావారి నుంచి కాస్త విడిగా (ఐసోలేషన్) ఉంచటం మేలు. ∙ఇన్ఫ్లుయెంజాకు, కోవిడ్‌కు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. వ్యాధి తీవ్రత తగ్గించడానికీ, హాస్పిటల్లో చేరికల నివారణకు వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ఈ జ్వరాలు చాలావరకు పెద్దగా ప్రమాదకరం కావు. అరుదుగా ఎవరిలోనైనా పరిస్థితి మరీ తీవ్రంగా మారితే... తక్షణం బాధితుల్ని ఆసుపత్రికి తరలించాలి. వీళ్లలో తీవ్రత ఎక్కువ... ఇప్పటికే ఆస్తమా, దీర్ఘకాలిక లంగ్స్ సమస్యలు, బ్రాంకైటిస్, దీర్ఘకాలిక గుండెజబ్బులతో బాధపడేవారు, హార్ట్ ఫెయిల్యూర్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ బాధితులు, దీర్ఘకాలిక కిడ్నీ/లివర్ వ్యాధులున్నవారు, కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజ్‌లతో బాధపడుతూ స్టెరాయిడ్ చికిత్స తీసుకుంటున్నవారూ, లుకేమియా, సికిల్ సెల్ ఎనీమియా ఉన్నవారు, వయోవృద్ధులూ వారితోపాటు ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు... వీళ్లందరి లోనూ లక్షణాల్లో తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నిద్రలేమి, పల్స్ ఆక్సిమీటర్‌తో పరీక్షించినప్పుడు ఆక్సిజన్ శాచ్యురేషన్స్ తగ్గడం, ఆక్సిజన్ మోతాదుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఒక్కోసారి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడి బాధితుల్ని ఆసుపత్రులకు తీసుకురావాల్సిన అవసరమూ ఏర్పడుతుంది. డాక్టర్ వి రాజమనోహర్ ఆచార్యులు, సీనియర్ కన్సల్టెంట్, పల్మనాలజిస్ట్ (చదవండి: నివారించలేని వింత వ్యాధి! తనను తాను గాయపరుచుకునేలా ప్రేరేపించే వ్యాధి!) -
ఓ వైపు కరోనా.. మరోవైపు ఇన్‌ఫ్లూయెంజా.. మాస్కులు ధరించకపోతే అంతే..!
న్యూఢిల్లీ: హెచ్3ఎన్2 వైరస్ కారణంగా దేశంలో ఇన్‌ఫ్లూయెంజా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో వైద్య నిపుణులు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఏటా ఫ్లూ వ్యాక్సిన్లు తీసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. అలా అయితే ఫ్లూ బారినపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు. దేశంలో మార్చి 9 వరకు హెచ్3ఎన్2 సహా మొత్తం 3,038 ఇన్‌ఫ్లూయెంజా ఉపరకాల కేసులు నమోదయ్యాయి. ఇందులో జనవరిలో 1,245, ఫిబ్రవరిలో 1,307, మార్చిలో 9 రోజుల్లోనే 486 కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇన్‌ఫ్లూయెంజా బారినపడకుండా కనీస జాగ్రత్తలు పాటించాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్‌లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలంటున్నారు. బస్సులు, రైళ్లు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్లు, జనం గుంపులుగా ఉన్న చోట్ల కచ్చితంగా మాస్కు పెట్టుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ ఇన్‌ఫ్లూయెంజా ఎక్కువగా తుంపర్ల ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అందుకే ముక్కు, నోటిని చేతులతో ఎక్కువగా తాకకుండా చూసుకుంటే వైరస్ లోనికి ప్రవేశించే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెబతున్నారు. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో కోవిడ్-19తో పాటు స్వైన్ ఫ్లూ(హెచ్1ఎన్1), హెచ్3ఎన్2, సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా- బీ వైరస్ల కాంబినేషన్లు వెలుగుచూస్తున్నాయి. హెచ్3ఎన్2, హెచ్3ఎన్1 ఇన్‌ఫ్లూయెంజా- ఏ రకాల కిందకు వస్తాయి. వీటినే ఫ్లూగా పిలుస్తారు. లక్షణాలు ఇలా.. ఇన్‌ఫ్లూయెంజా బారినపడేవారిలో జ్వరం ఎక్కువరోజులు ఉండటం, దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఒకవేళ ఆరోగ్యం బాగా క్షీణిస్తే శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. మరోవైపు దేశంలో కోవిడ్ కేసుల్లో కూడా చాలా రోజుల తర్వాత పెరుగుదల కన్పిస్తోంది. ఆదివారం కొత్తగా 524 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో, జనసమూహాల్లో తిరిగేవారు మాస్కులు ధరించండ చాలా ఉత్తమం అని, లేకపోతే వైరస్ల బారినపడే ముప్పు ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదవండి: ప్రియాంక గాంధీ పెయింటింగ్‌కు రూ.2 కోట్లా? కాంగ్రెస్ అవినీతిలో రోజుకో కొత్త మోడల్ -
H3N2: సీజనల్ ఇన్‌ఫ్లూయెంజాపై కేంద్రం కీలక ప్రకటన..
న్యూఢిల్లీ: హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా కారణంగా కర్ణాటక, హర్యానాలో ఒక్కొక్కరు మరణించిన తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ఇండిగ్రేటెడ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్(ఐడీఎస్పీ) ద్వారా సీజనల్ ఫ్లూ పరిస్థితిని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపింది. వాస్తవ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఇన్‌ఫ్లూయెంజా కారణంగా ఎంతమంది అనారోగ్యం బారినపడుతున్నారు, ఎంత మంది మరణిస్తున్నారో కూడా ట్రాకింగ్ చేస్తున్నట్లు కేంద్రం చెప్పింది. ఈ ఫ్లూ వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న పిల్లలు, వృద్ధులు ఎక్కువ ప్రభావితం అవుతున్నట్లు తెలిపింది. హెచ్3ఎన్2 కారణంగా కర్ణాటక, హర్యానాలో ఒక్కొక్కరు మరణించినట్లు అధికారికంగా ధ్రువీకరించింది. అయితే ఈ ఫ్లూ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం భరోసా ఇచ్చింది. మార్చి చివరి నాటికి కేసుల్లో తగ్గుదల నమోదవుతుందని భావిస్తున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 90 హెచ్3ఎన్2 కేసులు వెలుగుచూశాయి. 8 హెచ్1ఎన్1 కేసులు నమోదయ్యాయి. గొత కొద్దినెలలుగా ఈ కేసుల్లో పెరుగుదల కన్పిస్తోంది. 'హాంగ్ కాంగ్ ఫ్లూ'గా పేరున్న ఈ హెచ్3ఎన్2 వైరస్ వల్ల ఇతర ఫ్లూలతో పోల్చితే ఆస్పత్రిలో చేరాల్సిన ముప్పు అధికంగా ఉంటుంది. చదవండి: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా? నిజమేనా? ఇదిగో డాక్టర్ల క్లారిటీ..! -
దడ పుట్టిస్తున్న కొత్త వైరస్..కోవిడ్-19, H3N2 మధ్య తేడాలివే..
న్యూఢిల్లీ: జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇవి కోవిడ్ లక్షణాలు కావడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అయితే వైద్య నిపుణులు మాత్రం ఇది కరోనా కాదు. హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా ఫ్లూ అని చెబుతున్నారు. మరి రెండింటి లక్షణాలు ఒకేలా ఉన్నప్పుడు మీకు సోకింది కోవిడా? లేక ఇన్‌ఫ్లూయెంజానా? అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా ఒక వైరస్ ఉపరకం. దీని వల్ల ఫ్లూ బారినపడి ఆస్పత్రితో చేరాల్సిన అవసరం ఇతర స్ట్రెయిన్లతో పోల్చితే అధికంగా ఉంటుంది. ఈ ఇన్‌ఫ్లూయెంజా సోకినవారిలో జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, సైనస్, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలు, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. అయితే ఈ ఫ్లూ బారినపడినవారిలో దగ్గు మాత్రం త్వరగా పోదు. దగ్గు పూర్తిగా తగ్గాలంటే రెండు నుంచి మూడు వారాల వరకు పడుతుంది. అలాగే ఈ ఫ్లూ లక్షణాలు ఒకటి నుంచి నాలుగు రోజుల్లోనే తెలిసిపోతాయి. హెచ్3ఎన్2 బారినపడివారిలో లక్షణాలు కన్పించకపోతే ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఇన్‌ఫ్లూయెంజా బారినపడితే శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా తక్కువగానే ఉంటాయి. ఆక్సిజన్ అందిచాల్సిన అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఐసీఎంఆర్ వివరాల ప్రకారం హెచ్3ఎన్2 సోకి ఆస్పత్రిలో చేరినవారిలో 92 శాతం మందికి జ్వరం, 86 శాతం మందికి దగ్గు, 27 శాతం మందికి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కన్పించాయి. చాలా అరుదుగా ఆక్సిజన్ అందించాల్సిన అవసరం వచ్చింది. కోవిడ్-19 ఇలా.. మరోవైపు కోవిడ్-19 సోకివారిలో కూడా దాదాపు ఇవే లక్షణాలు ఉంటాయి. ఈ వైరస్ సోకిన వారిలో లక్షణాలు ఒక్కోసారి బయటపడవు. ఒకటి నుంచి 14 రోజుల వరకు ఇవి ఉండొచ్చు. అయితే లక్షణాలు కన్పించకపోయినా.. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అలాగే కోవిడ్ సోకిన వారిలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆక్సిజన్ అందించాల్సిన అవసరం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే మీకు సోకింది కోవిడా, ఫ్లూనా అని కచ్చితంగా నిర్ధరించుకోవాలంటే కరోనా టెస్టు తప్పకుండా చేయించుకోవాల్సిందేని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా బారిన వారికి చికిత్సలో యాంటీబయాటిక్స్ ఉపయోగించవద్దని ఐసీఎంఆర్ సూచించింది. కరోనా, ఫ్లూ చికిత్సకు ఉపయోగించే మందులు పూర్తిగా వేరని కూడా స్పష్టం చేసింది. చదవండి: అడెనోవైరస్ కలకలం.. పిల్లలకు మాస్కులు తప్పనిసరి చేసిన సర్కార్.. లక్షణాలివే..! -
అడెనోవైరస్ కలకలం.. పిల్లలకు మాస్కులు తప్పనిసరి చేసిన సర్కార్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అడెనోవైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. పిల్లలందరూ కచ్చితంగా మాస్కు ధరించాలని సీఎం మమతా బెనర్జీ సూచించారు. చిన్నారులు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. బెంగాల్లో అడెనోవైరస్ బారినపడి ఇప్పటివరకు 19 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరిలో 13 మంది చిన్నారులకు దీర్ఘకాలిక రోగాలున్నాయని మమత చెప్పారు. పిల్లలలో దగ్గు, జలుబు లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, ఒకవేళ జ్వరం ఉంటే తక్షణమే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం వివరాల ప్రకారం అడెనోవైరస్ ఫ్లూ లాంటిదే. ఇది సోకిన చిన్నారులు సాధారణ జ్వరం నుంచి తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల శ్వాసకోశ వ్యవస్థపై ఈవైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. అడెనోవైరస్ అన్ని వయస్కుల పిల్లలకు సోకుతుంది. అయితే ఎక్కువగా నవజాత శిశువులు, 10 ఏళ్లుపైబడిన పిల్లలు దీని బారినపడుతున్నారు. అడెనోవైరస్ లక్షణాలు ► జ్వరం ► జలుబు ► దగ్గు ► గొంతులో నొప్పి ► కళ్లు గులాబీ రంగులోకి మారడం ► న్యుమోనియా ► శ్వాసనాళాల వాపు ► జీర్ణాశయంలో ఇన్ఫెక్షన్ రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న, శ్వాససంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు అడెనోవైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం బెంగాల్ రాష్ట్రంలోని అనేక ఆస్పత్రులు చిన్నారులతో నిండిపోయాయి. దీంతో అన్ని జిల్లాల వైద్య అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అవసరమైన సదుపాయాలు, వైద్య పరికరాలు సమాకూర్చాలని ఆదేశించింది. చదవండి: వాళ్లు గుంపుల్లో తిరగొద్దు.. కర్ణాటక ఆరోగ్య మంత్రి హెచ్చరిక.. -
టమాటో ఫ్లూపై కేంద్రం అలర్ట్.. రాష్ట్రాలకు కీలక సూచనలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో టమాటో ఫ్లూ వ్యాధి నాలుగు రాష్ట్రాలకు వ్యాపించింది. ఇప్పటివరకు కేరళ, తమిళనాడు, హర్యానా, ఒడిశాలో ఈ కేసులు వెలుగుచూశాయి. 100మందికిపైగా చిన్నారులు ఈ వ్యాధి బారినపడి ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. వ్యాధిని నియంత్రించేందుకు రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. ► హ్యాండ్, ఫుట్, మౌత్ డీసీజ్(హెచ్ఎఫ్ఎండీ) వ్యాధినే టమాటో ఫ్లూ అంటారు. ఇది 10 ఏళ్లలోపు చిన్నారులకు ఎక్కువగా వ్యాపిస్తుంది. పెద్దలకు కూడా వ్యాపించే అవకాశముంది. ► టమాటో ఫ్లూ వ్యాధి గురించి చిన్నారులకు అవగాహన కల్పించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. దాని వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా వివరించాలని పేర్కొంది. ► టమాటో ఫ్లూ లక్షణాలు ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లలాగే ఉంటాయి. ఈ వ్యాధి సోకిన చిన్నారుల్లో జ్వరం, అలసట, ఒంటి నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. ► టమాటో ఫ్లూకు కోవిడ్, మంకీపాక్స్, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులతో ఎలాంటి సంబంధం లేదు. ► అపరిశుభ్ర ఉపరితలాన్ని తాకడం, పండ్లు, వస్తువులను శుభ్రం చేయకుండా నేరుగా నోట్లో పెట్టుకోవడం వంటి కారణాలతో ఈ వ్యాధి సోకవచ్చు. ► టమాటో ఫ్లూ సోకిన, లక్షణాలు కన్పించిన చిన్నారులను ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలి. ► జ్వరం, దద్దుర్లు ఉన్న చిన్నారులు ఇతరులను తాకడం, కౌగిలించుకోవడం చేయవద్దని తల్లిదండ్రులు చెప్పాలి ► నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న పిల్లలకు దాన్ని మాన్పించాలి. ► ఎప్పుడూ వేడి నీటితోనే పిల్లలకు స్నానం చేయించాలి. పోషక పదార్థాలున్న ఆహారాన్నే ఇవ్వాలి. ► పిల్లలకు విశ్రాంతి, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. చదవండి: దారుణం.. చావు ఇంట్లో నవ్వులు.. ఫ్యామిలీ ఫోటోపై ట్రోలింగ్.. -
Tomato Flu: చిన్నారుల్లో అంతుచిక్కని ‘టమాటో ఫ్లూ’ కలకలం
మరో అంతుచిక్కని వ్యాధి కలకలం మొదలైంది. కేరళలో వెలుగు చూసిన టమాటో ఫ్లూ గురించి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగతిన వ్యాపిస్తున్న ఈ ఇన్ఫెక్షన్.. ఇప్పటిదాకా సుమారు 80 మంది చిన్నారులకు పైనే సోకింది. కోల్లాం ప్రాంతం ప్రధానంగా ఈ వ్యాధి విస్తరిస్తుండడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు అంతా. మరోవైపు ఈ ఇన్ఫెక్షన్ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. టమాటో ఫ్లూ అంటే.. ఇది అరుదైన డిసీజ్. ఇంతకు ముందు ఏయే దేశాల్లో, ప్రాంతాల్లో సోకిందనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఏ కారణం చేత వ్యాపిస్తుంది అనేదానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. కానీ, ఈ ఫ్తూ వల్ల ఒంటిపై ఎరుపు రంగు దద్దుర్లు వస్తాయి. డీహైడ్రేషన్‌తో పాటు చికాకుగా అనిపిస్తుంటుంది. ఆ బొబ్బలు టమాటో ఆకారంలో ఉండడంతోనే.. ఈ వ్యాధికి టమాటో ఫ్లూ అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఐదేళ్లలోపు చిన్నారుల మీదే ఈ ఫీవర్ ప్రభావం కనిపిస్తోంది. లక్షణాలు.. టమాటో ఆకారంలో బొబ్బలు రావడం ఈ వ్యాధి ప్రాథమిక లక్షణం. దీంతో పాటు చికున్‌గున్యా తరహాలోనే అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్ల వాపులు, అలసట కనిపిస్తాయి. కేరళలోని కోల్లాంతో పాటు దక్షిణ ప్రాంతాలైన అర్యన్‌కావు, అంచల్, నెడువతుర్ ప్రాంతాల్లోనూ కేసులు నమోదు అవుతున్నాయి. సరిహద్దులో నిఘా.. ఈ మిస్టరీ వ్యాధి కలకలంతో.. సరిహద్దు రాష్ట్రం తమిళనాడు అప్రమత్తం అయ్యింది. ఇరు రాష్ట్రాల ప్రయాణాలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. వేగంగా ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తిస్తుండడంతో జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర నష్టం తప్పదని వైద్యాధికారులు చెప్తున్నారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కొయంబత్తూరు(తమిళనాడు) ప్రవేశించే దారుల గుండా పరీక్షలు మొదలుపెట్టారు. అలాగే వలయార్లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు.. ప్రయాణికులను ప్రత్యేకించి పిల్లలను పరీక్షిస్తున్నారు. అదే సమయంలో అంగన్వాడీల్లో 24 సభ్యులతో కూడిన బృందం సైతం పరీక్షలు నిర్వహిస్తోంది. టమాటో ఫ్లూ పై పరిశోధనల అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ సోకిన పిల్లలకు.. ఇతర పిల్లలను దూరంగా ఉంచాలని, డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తపడాలని, అలాగే వైద్య పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. చదవండి: 19 ఏళ్ల తర్వాత.. చనిపోయిన వ్యక్తి.. మళ్లీ ప్రాణాలతో.. -
అల్లం పాలు తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..?
Benefits of drinking ginger milk: ఒక కప్పు పాలలో టీ స్పూను అల్లం తురుము వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. తరువాత చిటికెడు మిరియాలపొడి, చిటికెడు దాల్చినచెక్క పొడి, కొద్దిగా బెల్లం తురుము కలపాలి. గోరువెచ్చగా ఉండగానే ఈ పాలను తాగాలి. అల్లం పాలను రోజూ తాగడం వల్ల జలుబు, ఫ్లూ, అజీర్ణ వంటి సమస్యలు తగ్గుతాయి. అల్లం పాలలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరానికి అందుతాయి. ముఖ్యంగా చలి కాలంలో ఈ పాలను తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది చదవండి: ఎయిర్ హోస్టెస్‌ల అర్థనగ్న నిరసనలు.. కారణం అదేనట..! -
ఆలోచింపజేస్తున్న... ఆ హెచ్చరిక!
కరోనా పేరిట మందుల కంపెనీలతో తమకు జరుగుతున్న అన్యాయాల గురించి అనేక దేశాలు రకరకాల అనుభవాలను వెల్లడిస్తున్నాయి. జబ్బు స్వభావంతో, దాని లక్షణాలతో నిమిత్తం లేకుండా అమెరికాలో నేడు ‘ఫ్లూ’ పేరిట, కోవిడ్–19 పేరిట మూకుమ్మడిగా ప్రజలకు వ్యాక్సిన్లు వేస్తున్నారని అఖిల అమెరికా మెడికల్ బోర్డు ఇటీవల హెచ్చరించింది. కోవిడ్ నైతిక విలువలకు విరుద్ధంగా ఇంజక్షన్లను విచ్చలవిడిగా ప్రయోగించేవారిని అంతర్జాతీయ వైద్య నిపుణులు నిలదీశారు. ‘ముందుగా ప్రజలకు భారీ ఎత్తున టీకాలు వేద్దాం. ఆ తర్వాతనే టీకాలపై రీసెర్చ్ మొదలుపెడదాం’ అనే వైఖరిని తప్పుబట్టారు. ప్రజలకు నిజాలు చెప్పే అమెరికన్ డాక్టర్ల మెడికల్ లైసెన్స్‌లను రద్దు చేస్తామని బడా ప్రైవేట్ మందుల కంపెనీల తరఫున బెదిరింపులు రావడం ప్రమాదకర పరిణామమని డాక్టర్ పాల్ క్రీగ్ రాబర్ట్స్ చేసిన హెచ్చరిక అందరికీ కనువిప్పు కావాలి. ప్రపంచంలో దఫదఫాలుగా ఇప్పటిదాకా దేశాల్ని చుట్టుముట్టిన వైరస్‌లన్నీ మనం భావిస్తున్నట్టుగా అంత త్వరగా అంతరించిపోలేదు. అలాగే కరోనా వైరస్ కూడా తొందరగా వదిలించుకోగలిగింది కాదని, ఎన్ని లాక్డౌన్లు ప్రకటించుకున్నా అది తొలగిపోయేది కాదనీ రుజువయింది. అందుకనే మా ప్రజలు నిరం తరం లాక్డౌన్లకు నిరసనగా వేలాదిగా వీధులలో ఊరేగింపులు తీయ వలసి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలపై అణచివేత చర్యల వల్ల లాభం లేదనేది రుజువైంది. ఇతర దేశాల అనుభవం కూడా ఇదే. – న్యూజిలాండ్ ప్రభుత్వ ప్రకటన, వెల్లింగ్టన్ (04–10–2021) ఇప్పుడు న్యూజిలాండే కాదు, కరోనా వైరస్ పేరిట జరుగుతున్న రకరకాల సవాలక్ష మందుల కంపెనీల మోసాల మూలంగా తమకు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కూడా రకరకాల అనుభవాలను వెల్లడిస్తున్నాయి. కరోనా వైరస్ పేరిట భారీ ఎత్తున ప్రజారోగ్యంపై సాగుతున్న దోపిడీ గురించి, సాక్షాత్తు టీకాల వ్యాపారం వల్ల ప్రజలకు జరుగుతున్న కష్ట నష్టాలను అధికార స్థాయిలో ఏకరువు పెడుతూ అఖిల–అమెరికా మెడికల్ బోర్డు ప్రపంచ ప్రజలకు ఒక హెచ్చరికను (సెప్టెంబర్ 9న) విడుదల చేసింది. ఈ బోర్డు అఖిల అమెరికా కుటుంబ వైద్యసంస్థ, అమెరికా ఇంటర్నల్ మెడిసిన్ బోర్డు, అమెరికా శిశువైద్యాధికారుల బోర్డుల సంయుక్త సంస్థ. జబ్బు స్వభావంతో, దాని లక్షణాలతో నిమిత్తం లేకుండా అమె రికాలో నేడు ‘ఫ్లూ’ పేరిట, కోవిడ్–19 పేరిట మూకుమ్మడిగా ప్రజ లకు వ్యాక్సిన్లు వేస్తున్నారని అఖిల అమెరికా మెడికల్ బోర్డు హెచ్చ రించింది. ఈ వ్యాక్సిన్ల వ్యాపారాన్ని 80కి మించి ప్రైవేట్ గుత్త కంపెనీలు సాగిస్తున్నాయి. ఇదే సందర్భంలో అమెరికాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రాష్ట్రస్థాయి మెడికల్ బోర్డుల సంయుక్త ఫెడరేషన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఫ్లూ, కరోనా టీకాలకు సంబం ధించి కంపెనీల తరపున సమాచారాన్ని ప్రచారంలో పెడుతున్నారని ప్రొఫెషనల్స్‌ను హెచ్చరించింది. ఇలాంటి ప్రచారం వృత్తిరీత్యా వైద్యులు, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వైద్య సేవకుల నైతిక విలు వలకు, ధర్మానికే విరుద్ధమని రాష్ట్రస్థాయి మెడికల్ బోర్డుల సమాఖ్య హెచ్చరించవలసి వచ్చింది. ఈ హెచ్చరికను అభిల భారత మెడికల్ బోర్డు సమర్పించింది. కోవిడ్ నైతిక విలువలకు విరుద్ధంగా ఇంజక్షన్లను విచ్చలవిడిగా ప్రయోగించేవారిని అంతర్జాతీయ వైద్య నిపుణులు నిలదీశారు. ‘ముందుగా ప్రజలకు భారీయెత్తున టీకాలు వేద్దాం. ఆ తర్వాతనే టీకాలపై రీసెర్చ్ మొదలుపెడదాం’ అనే వైఖరిని తప్పుబట్టారు. అంతేకాదు ఇంతవరకూ శాస్త్రీయ నిరూపణలేని టీకాలను విచ్చల విడిగా ‘ఫ్లూ’ పేరిట కరోనా (కోవిడ్) ఇంజక్షన్ల పేరిట అమ్మడంగానీ, వాటిని కోట్లాది ప్రజలకు ఇవ్వచూపడంగానీ న్యూరెంబర్గ్ నిబంధన లను (న్యూరెంబర్గ్ కోడ్) ఉల్లంఘించడమేనని కూడా అఖిల అమెరికా మెడికల్ బోర్డ్‌ల సంయుక్త ఫెడరేషన్ (సెప్టెంబర్ 9)న ప్రకటించింది. ఈ విషయంలో ప్రజలకు నిజాలు చెప్పే అమెరికన్ డాక్టర్ల మెడికల్ లైసెన్స్‌లను రద్దుచేస్తామని కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటానికి దిగిన బడా ప్రైవేట్ మందుల కంపెనీల తరపున బెదిరింపులు వెలు వడ్డాయి. ఇది అత్యంత ప్రమాదకర పరిణామమంటూ కోవిడ్ టీకాల సామర్థ్య వైఫల్యాన్ని ఎండగడుతూ డాక్టర్ పాల్ క్రీగ్ రాబర్ట్స్ (7–9–2021) రాసిన ప్రత్యేక సమాచారాన్ని సుప్రసిద్ధ ‘లా యాని మేటెడ్ జర్నల్’ ప్రచురించింది. అంతేగాదు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండానే ఫ్లోరిడా అంతటా కరోనా పేరిట వైద్య వ్యాపార కేంద్రాలను ఆ రాష్ట్ర గవర్నర్ రాన్ డిశాంటిస్ ఎలా తెరిచారో వెల్లడించాల్సి వచ్చింది. అదే తంతు భారతదేశంలో కూడా ప్రారంభమై కొనసాగుతోం దని భారత బార్ అసోసియేషన్ వెల్లడించాల్సి వచ్చింది. మన దేశంలో ‘ఫ్లూ’ను పోలిన కరోనా వైరస్‌ను అదుపు చేయడానికి దేశీయ ‘హైడ్రోక్లోరోక్విన్’, ఐవర్‌మెక్టిన్‌లను వాడకుండా పక్కన పెట్టేశారు. దీంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ భారతదేశంలో లక్షలమంది మరణానికి కారకురాలని మన ఇండియన్ బార్ అసోసియేషన్ అభిశంసించింది. పై రెండు దేశీయ ‘ఫ్లూ’ సంబంధిత వ్యాధుల నివారణకు తోడ్పడగల ‘హైడ్రో క్లోరోక్విన్’, ‘ఐవర్‌మెక్టిన్’లను వాడడం వల్ల ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాలలో కోవిడ్ కేసులు దాదాపు 94 – 98 శాతం తగ్గిపోయాయని బార్ అసోసియేషన్ ఉదాహరించింది. ఈ దేశీయ ప్రయోగం సత్ఫలితాలను యావత్తు దేశ ప్రజలకూ చేరకుండా చేసే బాధ్యతను న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, ఏఎంఎ, బైడెన్, స్కూమర్, పెలోసీ వగైరా కుట్రదారులు తలెత్తుకున్నారని బార్ అసోసియేషన్ పేర్కొంది. ఈ కుట్రను డాక్టర్ పాల్‌క్రీగ్ రాబర్ట్స్ మరిం తగా వివరించారు. అమెరికా మాజీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్లకు ప్రధాన వైద్య సలహాదారుగా పనిచేస్తూ వస్తున్న డాక్టర్ ఫాసీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వాళ్ళను అనుసరించి అనుకూల వార్తలు వండే పత్రికలూ, వాటిని భుజాన వేసుకుతిరిగే రాజకీయవేత్తలూ, కోవిడ్ పేరుతో భారీ సంఖ్యలో బడా ప్రైవేట్ ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ల ద్వారా లాభాలు గుంజుకోవడానికి అల్లిన పెద్ద కుట్రగా డాక్టర్ పాల్ క్రీగ్ రాబర్ట్స్ ప్రపంచానికి వెల్లడించారు (‘లా ఏనిమేషన్ వరల్డ్’ 31.08.2021). ఫ్లూ సంబంధిత కోవిడ్ లాంటి వైరస్ల నివారణకు తక్షణోపాయంగా విధిగా ప్రయోగించాల్సిన హైడ్రోక్లోరోక్విన్, ఐవర్‌మెక్టిన్‌లను అడ్డుకొని. వాడకంలోకి రాకుండా పనిగట్టుకొని నిషేధించడం ద్వారా లక్షలాది ప్రజల మరణానికి కారకులయ్యారని డాక్టర్ రాబర్ట్స్ సాధికారికంగా తన విశ్లేషణలో ఆరోపించారు! పైగా తక్షణ ప్రాణరక్షణ æమందుల్ని నిషేధించిన డాక్టర్లను శిక్షించకుండా, ప్రాణాల్ని కాపాడటానికి తోడ్పడే మందుల్ని ఉపయోగించే వైద్యుల్ని శిక్షించ బూనడం దుర్మార్గమనీ,ఈ విషయంలో పశ్చిమ రాజ్యాల ప్రవర్తన అత్యంత ప్రజాస్వామ్య వ్యతిరేకమూ, పారదర్శకతకు విరుద్ధమని డాక్టర్ రాబర్ట్స్ తన విశ్లేషణలో వివరించారు. ఈ విషాదకర పరిణామాల్ని చూస్తుంటే షేక్స్పియర్ రాసిన ‘టెంపెస్ట్’ నాటకంలోని ‘నరకలోకం ఖాళీ అయింది. ఇక దెయ్యాలన్నీ ఇక్కడనే తిష్ఠ వేస్తా’యన్న సూక్తి గుర్తుకొస్తుంది. రకరకాల రూపాలతో వ్యాపిస్తున్న ఆ కోవిడ్ వైరస్‌కు పరిష్కారం ఏమిటి? అంటే గడచిన ప్రపంచ చరిత్రను కల్లోలపరిచిన 300 వైరస్ల నిరోధానికి 15–16 శతాబ్దాల నుంచి ఈ క్షణం దాకా జరుగుతోన్న ప్రయత్నాలలో భాగంగానే, కరోనా వైరస్‌కు కూడా అంతిమ పరిష్కారం లభిస్తుందని తీర్మానించుకొనక తప్పదు. సాంకేతిక పరిజ్ఞానం, దాని ఫలితాలు మానవాళికి అందుబాటులోకి రావడానికి ఇప్పుడు సాధ్యమవుతున్నంత వేగంగా గతంలో అంతిమ ఇంజెక్షన్లు సాధ్యం కాకపోయి ఉండవచ్చు. కానీ నేటి సాంకేతిక దశలో కూడా పరిష్కారంలో ఇది ఆఖరి మాట అని నిర్ధారించడం అంత సులభం కాకపోవచ్చు. ఈలోగా ప్రజలకు ఏర్పడే తాత్కాలిక కష్టాల్ని సాకుగా తీసుకుని దాన్ని ప్రజల పౌరహక్కుల్ని అణచడానికి ఒక సదవకాశంగా భావించే పాలకులు ఉంటారు. బహుశా అందుకనే, అమెరికా రాజ్యాంగ పితామహులలో ఒకరూ, ప్రజల హక్కుల పత్రానికి జనకుడైన జేమ్స్ మాడిసన్ చేసిన హెచ్చరిక అన్ని దేశాలకూ, ప్రజలకూ పాఠంగా నిలిచిపోతుంది. ఏదో ఒక పరిణామం పేరిట ప్రజా స్వేచ్ఛా స్వాతంత్య్రాలపై పాలకులు ఎక్కుపెట్టజూసే తొలి ప్రయోగానికే ప్రజలు అప్రమత్తులై పోవాలని మాడిసన్ చెప్పారు. ఇది చరిత్రాత్మక చిరకాల హెచ్చరిక! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఆశలు రేపుతున్న నాసల్ వ్యాక్సిన్
వాషింగ్టన్: కరోనాను ఎదుర్కొనేందుకు రూపొందిస్తున్న నాసల్ వ్యాక్సిన్(ముక్కు ద్వారా అందించే టీకా) ఆశాజనక ఫలితాలనిస్తోంది. క్లీనికల్ ప్రయోగాల్లో భాగంగా ఎలకలకు, ఫెర్రెట్లకు(ముంగీస వంటి ఒక జంతువు) సింగిల్డోస్లో ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. టీకాతో ఎలకల్లో కరోనా నుంచి సంపూర్ణమైన రక్షణ కనిపించింది. ఫెర్రెట్లలో కరోనా వైరస్ వ్యాప్తిని టీకా సమర్ధవంతంగా అడ్డుకుంది. ఈ ప్రయోగ ఫలితాలు జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురితమయ్యాయి. ఫ్లూ వ్యాధికి ఇచ్చే నాసల్ టీకాను ఇచ్చినట్లే నాసల్ స్ప్రే ద్వారా ఈ టీకాను జంతువులకు ఇచ్చారు. ‘‘ప్రస్తుతం కరోనాకు వ్యతిరేకంగా వాడుతున్న టీకాలు విజయవంతమైనవే, కానీ ప్రపంచ జనాభాలో మెజార్టీ ప్రజలు ఇంకా టీకా పొందలేదు. ఈ దశలో సులభంగా వాడే వీలున్న సమర్ధవంతమైన టీకా అవసరం ఎంతో ఉంది.’’ అని జార్జియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పౌల్ మెక్‌క్రే అభిప్రాయపడ్డారు. నాసల్ టీకా మానవులపై సత్ఫ్రభావాలనిస్తే, కరోనాను విజయవంతంగా అడ్డుకోవచ్చన్నారు. ఈ టీకాను ఒక్క డోసు ఇస్తే చాలని, సాధారణ రిఫ్రిజిరేటర్లలో మూడు నెలల పాటు భద్రపరచవచ్చని పరిశోధకలు చెప్పారు. ముక్కు ద్వారా ఇవ్వడం వల్ల సూదిమందంటే భయమున్న వారు కూడా సులభంగా దీన్ని అంగీకరిస్తారన్నారు. ఫ్లూ వైరస్‌తో ప్రయోగాలు నాసల్ వ్యాక్సిన్ కోసం పరిశోధకులు పారాఇన్‌ఫ్లుయెంజా వైరస్5(పీఐవీ5)ను ఉపయోగించారు. దీన్ని జంతువులపై ప్రయోగించగా ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించినట్లు పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ బయో పేర్కొన్నారు. పీఐవీ 5 వైరస్ సైతం కరోనా వైరస్ లాగానే స్పైక్ ప్రోటీన్ ఉపయోగించుకొని మానవకణాల్లోకి చేరుతుంది. నాసల్ వ్యాక్సిన్ ముక్కుద్వారా ప్రవేశించగానే వాయునాళాల్లోని శ్లేష్మ పొరలో వైరస్ కణాలను లక్ష్యంగా చేసుకొంటాయి. ముక్కులోకి ఇచ్చిన టీకా స్థానికంగా ఇమ్యూన్ రెస్పాన్స్‌ను ప్రేరేపిస్తుంది, దీంతో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించడమే కాకుండా వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందనివ్వదన్నారు. -
వందేళ్లుగా వణికిస్తున్నాయి.. నిలబడుతూనే ఉన్నాం
కొవిడ్-19 మహమ్మారితో మానవాళి సహజీవనం ఏడాదిన్నర పూర్తి చేసుకుంది. వైరస్ తీరు తెన్నులు గందరగోళంగా ఉండడంతో సరైన మందు కనిపెట్టడం పరిశోధకులకు కష్టంగా మారుతోంది. అయితే శాస్త్ర విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ప్రమాదకరమైన అంటువ్యాధుల్ని, మహమ్మారుల్ని ఎదుర్కొన్నాం. తట్టుకుని నిలబడగలిగాం. స్పానిష్ ఫ్లూ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్‌గా స్పానిష్ ఫ్లూ చెప్తుంటారు. 19వ శతాబ్దం ప్రారంభంలో విజృంభించిన ఈ వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా యాభై కోట్ల మందికి సోకినట్లు ఒక అంచనా. అదే విధంగా కోట్ల సంఖ్యలో మనుషులు స్పానిష్ ఫ్లూకి బలయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మనిషి అపరిశుభ్రమైన అలవాట్ల నుంచి పుట్టిన ఈ వైరస్.. చాలా వేగంగా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. భారత సైనికుల ద్వారా 1918లో బాంబే(ఇప్పుడు ముంబై) నుంచి తొలి కేసు మొదలై.. రైల్వే ప్రయాణాల వల్ల మన దేశంలో వేగంగా విస్తరించింది(బాంబే ఫీవర్‌గా పిలిచారు). బ్రిటిష్ ప్రభుత్వ నిర్లక్క్ష్యంతో కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. చివరికి.. విమర్శలతో మెరుగైన మందులు తీసుకొచ్చి వైద్యం అందించడం మొదలుపెట్టాక పరిస్థితి రెండేళ్లకు అదుపులోకి వచ్చింది. కలరా కలరా మహమ్మారి తొలిసారి 1817లో విజృంభించింది. రష్యాలో మొదలైన ఈ మహమ్మారి శరవేగంగా ప్రపంచమంతటా విస్తరించింది. దాదాపు 150 ఏళ్ల వ్యవధిలో ఏడుసార్లు కలరా మహమ్మారి మానవాళిపై పంజా విసిరింది. 1961 టైంలో ఇండోనేషియా నుంచి ఎల్ టొర్ స్ట్రెయిన్ మొదలై.. మూడేళ్ల తర్వాత మన దేశం మీద తీవ్ర ప్రభావం చూపెట్టింది. గంగా పరివాహక ప్రాంతంలో అపరిశుభ్రత, కలకత్తా(కొల్కట్టా) వాతావరణం ఈ కలరా విజృంభణకు దారితీసింది. మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. దీని కట్టడికి ఏడాదిపైనే సమయం పట్టింది. ఇక కలరా నివారణకు వ్యాక్సిన్‌ను 1885లోనే తయారు చేసినా.. ఈ మహమ్మారి విజృంభణ ఆగకపోవడం విశేషం. కలరా కారణంగా 1817-1923 మధ్య కాలంలో దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. ఇప్పటికీ కలరా ఉనికి ఉన్నప్పటికీ.. వైద్య రంగం అభివృద్ధితో తారా స్థాయిలో అది వ్యాపించడం లేదు. స్మాల్ఫాక్స్ అంటువ్యాధి మశూచి. ఈజిప్ట్‌ల కాలం నుంచే ఉందని భావిస్తున్న ఈ వ్యాధిని..1520లో అధికారికంగా గుర్తించారు. 1980లో నిర్మూలించబడిన వ్యాధుల జాబితాలో ప్రపంచ ఆరోగసంస్థ చేర్చింది. ఇక మన దేశంలో 1974 జనవరి నుంచి మే మధ్య ఐదు నెలలపాటు స్మాల్ఫాక్స్తో 15,000 మంది చనిపోయారు. తట్టుకోగలిగిన వాళ్లలో చాలా మంది చూపు పొగొట్టుకున్నారు. కకావికలం చేసిన ఈ అంటువ్యాధి.. చివరికి డబ్ల్యూహెచ్‌వో చొరవతో అదుపులోకి తేగలిగారు. 1977లో మన దేశంలో మశూచిని అదుపులోకి తేగలిగారు. అయితే మశూచికి 1796లోనే వ్యాక్సిన్(ఎడ్వర్డ్ జెన్నర్ కనిపెట్టాడు) తయారుచేసినప్పటికీ.. పూర్తిగా నిర్మూలించడానికి రెండు వందల సంవత్సరాలకు పైనే పట్టడం విశేషం. సూరత్ ప్లేగు భయంకరమైన అంటువ్యాధి. బ్యాక్టీరియా ద్వారా ఎలుకలు వాహకంగా ఈ అంటువ్యాధి వ్యాపిస్తుంది. 1994లో గుజరాత్ సూరత్‌లో ప్లేగు కేసులు మొదలయ్యాయి. తెరిచి ఉన్న నాలలు, చెత్త కుప్పలు, చచ్చిన ఎలుకల ద్వారా ఇది మొదలైంది. దీంతో లక్షల మంది పట్టణం వదిలి వెళ్లిపోయారు. ఇది వ్యాధి మరింత వ్యాపించడానికి కారణమైంది. ఆగష్టు నుంచి అక్టోబర్ మధ్యే దీని విజృంభణ కొనసాగింది. అయితే ఇది ఎక్కువగా విస్తరించకపోవడంతో 52 మంది మాత్రమే చనిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇది ఇతర దేశాలకు వ్యాపించినట్లు కూడా ఎక్కడా ఆధారాలు లేవు. పైగా దీని వ్యాప్తి విషయంలో నెలకొన్న గందరగోళం నడుమే.. ఈ వ్యాధి కనుమరుగుకావడం విశేషం. డెంగ్యూ, చికున్‌గున్యా 1635లో వెస్టిండీస్‌లో మొదటిసారిగా డెంగ్యూను అంటువ్యాధిగా గుర్తించారు. చికున్‌గున్యా కేసుల్ని 1952లో టాంజానియాలో గుర్తించారు. ఇక 2006లో ఒకేసారి డెంగ్యూ, చికున్‌గున్యా వ్యాధులు రాష్ష్ర్టాలను అతలాకుతలం చేశాయి. దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధులు.. ఢిల్లీతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్(ఉమ్మడి) ఎక్కువ ప్రభావం చూపెట్టాయి. 2006లో భారత్‌లో అధికారికంగా డెబ్భై వేలకుపైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా, 50 మరణాలు సంభవించాయి. దేశంలో పదకొండు లక్షల చికున్‌గున్యా కేసులు నమోదుకాగా.. ప్రభుత్వం మాత్రం మరణాల లెక్క సున్నా అని చెప్పడం విమర్శలకు దారితీసింది. ఎన్సెఫలిటిస్(మెదడువాపు) జపనీస్ ఎలిటిస్(జేఈ) 1871లో జపాన్‌లో మొదటి కేసును గుర్తించారు. ఎక్యుట్ ఎస్పెఫలిటిస్ సిండ్రోమ్(ఎఈఎస్) కేసును 1955లో మద్రాస్ రీజియన్‌లో గుర్తించారు. 1978 నుంచి పాతిక వేలమంది పిల్లల ప్రాణాల్ని బలిగొన్న వ్యాధి ఇది. 2017లో గోరఖ్‌పూర్(యూపీ) నుంచి వీటి విజృంభణ ఎక్కువైంది. దోమల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ సోకి.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది.ఆ ఏడాదిలో మొత్తం 4,759 ఎఈఎస్ కేసులు నమోదు కాగా, 595 మరణాలునమోదు అయ్యాయి. జేఈ కేసుల సంఖ్య 677 కాగా, 81 మరణాలు సంభవించాయి. చికిత్స ద్వారానే ఈ వ్యాధిని అదుపు చేయడం విశేషం. నిఫా వైరస్ జునోటిక్(జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది) వైరస్. మనుషులతో పాటు పందులపైనా ఈ వైరస్ ప్రభావం ఉంటుంది. నిఫా వైరస్ గబ్బిలాల(ఫ్రూట్ బ్యాట్స్) ద్వారా వ్యాప్తి చెందుతుంది. 1998లో మలేషియాలో నిఫామొదటి కేసును గుర్తించారు. అక్కడి సుంగై నిఫా అనే ఊరి పేరు మీదుగా దీనికి ఆ పేరు పెట్టారు. 2018 మే నెలలో కేరళలో నిఫా కేసులు మొదలయ్యాయి. రెండు నెలల వ్యవధిలో 18 మంది చనిపోగా.. కేవలం నెలలోనే పరిస్థితిని పూర్తిగా అదుపు చేసుకోగలిగింది కేరళ. దీనికి వ్యాక్సిన్ లేదు. అప్రమత్తంగా ఉండడమే మార్గం. సార్స్ సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. కరోనా వైరస్ రకాల్లో ఒకటి సార్స్. 21వ శతాబ్దంలో వేగంగా వ్యాపించే జబ్బుగా గుర్తింపు దక్కించుకుంది. 2002లో చైనా ఫొషన్ నుంచి మొదలైంది. తుంపర్ల ద్వారా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 2003లో సార్స్(సార్స్ కోవ్) మన దేశంలో మొదటి కేసు నమోదు అయ్యింది. మొత్తం మూడుకేసులు నమోదుకాగా.. అంతా కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 30 దేశాల్లో దాదాపు ఎనిమిది వేల మంది సార్స్ బారినపడగా.. 774 మంది మృతిచెందారు. దీని కొత్త స్ట్రెయినే ఇప్పడు కరోనా వైరస్(సార్స్ కోవ్ 2)గా విజృంభిస్తోంది. -
వందేళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్..!
సాక్షి, హైదరాబాద్: బ్రిటన్ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. ఆ దేశం నుంచి విమానాల రాకపోకలపై దేశాలు నిషేధం విధిస్తున్నాయి. బ్రిటన్ సరిహద్దులను పొరుగు దేశాలు మూసేశాయి. కోవిడ్ వైరస్ కొత్త రకం (స్ట్రెయిన్) బ్రిటన్‌లో విస్తరిస్తుండటమే ఇందుకు కారణం. అదే బ్రిటన్‌లో వందేళ్ల కిందట కోరలు చాచిన ‘స్పానిష్ ఫ్లూ’ ఈ సందర్భంగా చరిత్రకారులు, శాస్త్రవేత్తలు గుర్తుచేసుకుంటున్నారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మందిని పొట్టన పెట్టుకున్న ఈ వైరస్ మహమ్మారిగా రూపాంతరం చెందింది కూడా బ్రిటన్‌లోనే అని చెబుతున్నారు. ఇదీ కారణం.. మొదటి ప్రపంచ యుద్ధం దాదాపు ముగిసిన కాలమది. యూరప్ నుంచి సైనికులు వారివారి దేశాలకు పయనమవుతున్నారు. లండన్‌కు 190 మైళ్ల దూరంలో ఉన్న పోర్ట్ సిటీ ప్లై మౌత్ నుంచి సైనిక నౌకలు బయల్దేరాయి. 1918 సెప్టెంబర్‌లో అమెరికాలోని బోస్టన్‌కు, ఫ్రాన్స్‌లోని బ్రెస్ట్కు, పశ్చిమ ఆఫ్రికాలోని ఫ్రీటౌన్‌కు మూడు నౌకలు వెళ్లాయి. ఇక్కడి నుంచి వెళ్లిన సైనికులు ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యం పాలై మృత్యువాత పడ్డారు. ఆ తరువాత ఇతర దేశాలకూ పాకింది. (చదవండి: కరోనా–2 కలకలం) అమెరికాలో పుట్టి.. స్పెయిన్‌లో తీవ్రమై.. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక.. 1918 మార్చిలో అమెరికాలోని కాన్సస్‌లో స్పానిష్ ఫ్లూ తొలి కేసు నమోదైంది. అక్కడి నుంచి సైన్యం యూరప్ వెళ్లగా.. అక్కడా ఈ లక్షణాలు ఎక్కువగా వెలుగు చూశాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను స్పెయిన్ వెల్లడించటంతో ఫ్లూ లక్షణాలకు ‘స్పానిష్ ఫ్లూ’ అని పేరు పెట్టారు. యుద్ధం ముగిసిన తర్వాత యూరప్ నుంచి సైనికులు వారి వారి దేశాలకు స్పానిష్ ఫ్లూను తీసుకెళ్లారు. ఆ తర్వాత అది పూర్తి పరివర్తనతో విజృంభించింది. దాన్నే సెకండ్ వేవ్‌గా అప్పట్లో పేర్కొన్నారు. 1918 మార్చిలో తొలికేసు నమోదైన అమెరికాలో 189 మందే చనిపోయారు. కానీ.. యూరప్ నుంచి తిరిగి వచ్చిన సైనికులతో సెప్టెంబర్‌లో ప్రబలిన సెకండ్ వేవ్ మారణహోమాన్ని సృష్టించింది. ఒక్క అక్టోబర్‌లోనే అమెరికాలో 1.95 లక్షల మంది చనిపోయినట్లు నమోదైంది. (చదవండి: ‘బ్రిటన్’ జర్నీపై ప్రత్యేక నిఘా) 4 నెలల తర్వాత అసలు రూపం యూరప్ నుంచి సైనికులతో జూన్‌లో ముంబైకి తొలి నౌక వచ్చింది. వారితోనే స్పానిష్ ఫ్లూ మన దేశంలో అడుగుపెట్టింది. ముంబైలో అదే ఏడాది సెప్టెంబర్ చివరి వారంలో ఒక్కసారిగా వ్యాధి ప్రబలింది. బ్రిటన్ నుంచి బోస్టన్ వెళ్లిన సైనికుల్లో కనిపించిన లక్షణాలే మన దేశంలోనూ కనిపించాయి. అంటే.. బ్రిటన్‌లో రూపాంతరం చెందిన వైరస్ మన దేశంలోకీ వచ్చిందన్నమాట. ఆ తర్వాత అక్టోబర్ మధ్యలో చెన్నైలో విజృంభించింది. నవంబర్‌లో కోల్‌కతాను అతలాకుతలం చేసింది. నెల రోజుల వ్యవధిలోనే దేశమంతా ప్రబలగా.. ఏకంగా కోటిన్నర మంది మృత్యువాత పడ్డారు. కోవిడ్ అలా కాదు.. స్పానిష్ ఫ్లూ తరహాలోనే ప్రబలినా.. కోవిడ్ మాత్రం తొలి వేవ్‌లోనే విజృంభించింది. రెండో వేవ్‌తో పెద్ద ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్‌లో ప్రబలుతున్న కొత్త రకం కరోనా మనపై ఎంత ప్రభావం చూపుతుందన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. (చదవండి: కరోనా–2 కలకలం) -
స్పానిష్ ఫ్లూ నుంచి కరోనా దాకా..
న్యూఢిల్లీ: 106 సంవత్సరాల వృద్ధుడి అపూర్వమైన విజయగాథ ఇది. 1918లో నాలుగేళ్ల వయసులో స్పానిష్ ఫ్లూ బారినపడి కోలుకొని, మళ్లీ 102 ఏళ్ల తర్వాత 106 ఏళ్ల వయసులో కరోనా మహమ్మారిని జయించాడు. ఢిల్లీకి చెందిన ఈ వ్యక్తి కరోనా నుంచి పూర్తిగా కోలుకొని, నెల రోజుల క్రితం రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తన భార్య, కుమారుడు, కుటుంబంలోని మరో వ్యక్తి కంటే ఆయనే ముందుగా కోలుకున్నాడు. ఢిల్లీలో ఇలా రెండు మహమ్మారులను జయించిన వ్యక్తి బహుశా ఈయనొక్కడే కావొచ్చని అధికారులు తెలిపారు. వృద్ధుడి కుటుంబ సభ్యులు కూడా కరోనా నుంచి కోలుకున్నారని చెప్పారు. 102 సంవత్సరాల క్రితం స్పానిష్ ఫ్లూప్రపంచాన్ని వణికించింది. అప్పటి జనాభాలో మూడింట రెండొంతుల మంది ఈ వైరస్ బారినపడ్డారు. -
నాడు ఫ్లూ, నేడు కరోనాను జయించింది..
సాక్షి, న్యూఢిల్లీ : 1918లో స్పానిష్ ఫ్లూ నుంచి బతికి బయట పడ్డ 104 ఏళ్ల ఇటలీ వద్ధ మహిళ కరోనా వైరస్ బారిన పడి కూడా కోలుకోవడం ఓ అద్భుతమైతే ఇప్పటి వరకు కరోనా బారిన పడి బతికి బయటపడిన వృద్ధుల్లోకెల్లా వృద్ధురాలిగా రికార్డు నెలకొల్పారు. దేశంలో లాక్డౌన్ ప్రకటించిన ఎనిమదవ రోజు, అంటే మార్చి 17వ తేదీన కరోనా వైరస్ బారిన పడిన అడ జనుస్సో బయెల్లాలోని తన నర్సింగ్ హోంలోనే చేరారు. ('కరోనా’ను కరకరా నమిలేస్తాం) ఎడతెరపి లేకుండా వాంతులవడం, ఊపిరి ఆడకపోవడంతోపాటు జ్వరం కూడా రావడంతో ఆమెను నర్సింగ్ హోంలో చేరారు. ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ వచ్చింది. అప్పటికే కొంతమంది కరోనా రోగులు ఆ నర్సింగ్ హోంలో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకినప్పటికీ జనుస్సో పడకకు అంకితం కాకుండా ఆమె లేచి తన వీల్‌ఛైర్ వరకు నడిచి అందులో కూర్చునేదని ఆమెకు చికిత్స చేసిన డాక్టర్ కార్ల ఫర్నా మార్చేస్ తెలిపారు. ఆమె ఈ వయస్సులో కూడా కోలుకోవడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, కరోనా బారిన పడిన ఇతర రోగులు కూడా కోలుకుంటారనే కొత్త స్పూర్తిని ఇచ్చిందని డాక్టర్ వ్యాఖ్యానించారు. (కరోనా: బ్రిటన్ రాణి వీడియో సందేశం) ఇటలీలో కరోనా మతుల సంఖ్య తగ్గుతూ వస్తోందని, గతంలో ఓ రోజున 681 మంది మరణించగా, ఇప్పుడు ఆ సంఖ్య 427కు చేరుకుందని, మృతుల సంఖ్య 21 శాతం తగ్గిందని ‘ఐఎస్ఎస్ హెల్త్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ సిల్వియో బ్రుసఫెర్రో తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరలో లాక్‌డౌన్‌ను సడలించవచ్చని ఇటలీ అధికారులు తెలిపారు. (లాక్‌డౌన్‌తో రోజుకు 2.25 లక్షల కోట్ల నష్టం) -
వైరసవత్తరమైన సినిమాలు
గతాన్ని విశ్లేషించుకోవడానికి, ప్రస్తుతాన్ని అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తుని ఎదుర్కోవడానికి కీలకమైన వాటిలో సినిమా కచ్చితంగా ఒకటి. సినిమా సమాజానికి అద్దమే కదా! బయటి ప్రపంచంలోని కష్టాలను తప్పించుకోవడానికి సినిమాని ఎస్కేప్ గా వాడతాం. సినిమా ఫ్యాంటీసిలోకి వెళ్లిపోయి మనకున్న అనవసరమైన తలనొప్పులను తాత్కాలికంగా మర్చిపోతాం. ప్రస్తుతం మనందరి ముందు ఉన్న సమస్య ఒక్కటే... కోవిడ్ – 19 (కరోనా వైరస్). ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడతాం అన్నదే అందరి మదిలో ఉన్న ఆలోచన. గతంలోనూ ఇలాంటి వైరస్లు ప్రపంచం మీదకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయి. బీభత్సాన్ని సృష్టించాయి. వాటిని తట్టుకొని నిలబడ్డ సందర్భాలున్నాయి. అయితే అలాంటి సంఘటనల ఆధారంగా కొన్ని కాల్పనిక సినిమాలు వచ్చాయి. వైరస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సినిమాల గురించి తెలుసుకోవడం మంచి అవకాశం ఇది. సినిమాలోని ప్రాతలను కష్టపెట్టిన ఆ వైరస్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు ప్రేక్షకులను మెప్పించి, ‘వైరసవత్తరం’ అనిపించుకున్నాయి. ఆ చిత్రాల విశేషాలు. వైరస్ (2019) 2018లో కేరళపై నిఫా వైరస్ దాడి చేసింది. ఎన్నో ప్రాణాలు కోల్పోయాం. అయితే ఆ వైరస్‌ని అధిగమించాం. ఆ సంఘటనల ఆధారంగా మలయాళ దర్శకుడు ఆషిక్ అబూ ‘వైరస్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. మలయాళ క్రేజీ స్టార్స్ చాలా మంది ఈ సినిమాలో నటించారు. మన దేశంలో తెరకెక్కిన బెస్ట్ మెడికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా గురించి చెప్పుకోవచ్చు. (ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో చూడొచ్చు.) కంటేజిన్ (2011) కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందినప్పటినుంచి 2011లో వచ్చిన ‘కంటేజిన్’ సినిమా ప్రస్తావన వస్తూనే ఉంది. కారణం.. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను ఆ సినిమాలో ముందే చూపించడమే. స్టీవెన్ సోడన్ బెర్గ్ తెరకెక్కించిన ఆ సినిమాలో కేట్ విన్స్ లెట్, మాట్ డెమన్ ముఖ్య పాత్రల్లో నటించారు. గాల్లో ప్రయాణించే వైరస్ ప్రపంచవ్యాప్తంగా సోకితే ఏం జరిగింది? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. మందు కనుగొన్నారా? వంటి అంశాలను చూపిం చారు. (అమెజాన్ ప్రైమ్‌లో చుడొచ్చు.) అవుట్ బ్రేక్ (1995) ఎబోలా వైరస్ అమెరికాను ఎటాక్ చేస్తే, దాన్ని ఎదుర్కోవడానికి శాస్త్రవేత్తలు, సామాన్య ప్రజలు ఎం చేశారు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘అవుట్ బ్రేక్’. రిచర్డ్ ప్రెస్టన్ రచించిన ‘ది హాట్ జోన్’ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు పెటెర్ సెన్ తెరకెక్కించారు. (చూడాలనుకుంటే యూట్యూబ్‌లో రెంట్ చేసుకోవచ్చు.) ఫ్లూ (2013) 36 గంటల్లో మనుషుల ప్రాణాల్ని తీసుకునే భయంకరమైన వైరస్ ఒకటి సౌత్ కొరియాలో పుడితే, దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? అనే కథతో తెరకెక్కిన కొరియన్ చిత్రం ’ఫ్లూ’. కిమ్ సంగ్ సూ తెరకెక్కించారు. 12 మంకీస్ (1995) 12 మంకీస్ అనే గ్యాంగ్ భయంకరమైన వైరస్‌ని తయారు చేసి ప్రపంచం మీద వదులుతుంది. దాంతో ప్రపంచం దాదాపు అంతమవుతుంది. బతికి బయటపడ్డవాళ్లు భూ కింది భాగంలో జీవిస్తుంటారు. ఈ వైరస్ ఎలా తయారయింది? దీనికి పరిష్కారం ఎలా కనుక్కోవాలి? అని టైమ్ ట్రావెల్లో హీరో ప్రయాణం చేయడమే చిత్రకథ. బ్రాడ్ పిట్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని టెర్రీ గిల్లియం తెరకెక్కించారు. (నెట్ ఫ్లిక్స్‌లో చుడొచ్చు.) వైరస్ బ్యాక్‌డ్రాప్ కథాంశాలతోనే ‘28 డేస్ లేటర్’ (2002), ‘కారియర్స్’ (2009), ‘బ్లైండ్ నెస్’ (2008), 93 డేస్ (2016) వంటి మరికొన్ని సినిమాలు కూడా రూపొందాయి. ఈ సినిమాలన్నీ వేరు వేరు భాషల్లో రూపొందినవి కావొచ్చు. కానీ కథలన్నీ ఇంచుమించు ఒక్కటే. అవన్నీ చెబుతున్నది కూడా ఒక్కటే. సమస్య ఎప్పుడైనా, ఎలా అయినా రావొచ్చు. ధైర్యంగా నిలబడితేనే పరిష్కారం లభిస్తుంది. విపత్కర వైరస్లు వస్తే దాని పరిస్థితిని, ప్రభావాన్ని అవగాహన చేసుకోవడానికే ఈ సినిమాలన్నీ చూడండి, అనవసరమైన భయాన్ని, భ్రమను కలిగించుకోవడానికి కాదు. సినిమాలో విలన్ ఎంత బలవంతుడైతే కథ అంత రసవత్తరంగా ఉంటుంది. అతన్ని ఎదిరించి గెలిస్తే కథ మరింత రసవత్తరంగా తయారవుతుంది. ప్రస్తుతం మనందరి ముందు ఉన్న విలన్ కరోనా. ఈ వైరస్ ని ధైర్యంగా ఎదుర్కొని మనందరమూ హీరోలవుదాం. దాన్ని ఎదుర్కోడానికి ఎదురెళ్లనవసరం లేదు. ఇంట్లో ఉండే జయించవచ్చు. ఇంట్లో ఉండండి. బయటికొచ్చి ఇబ్బందుల్లో పడకండి. – గౌతమ్ మల్లాది -
అన్ని ఫ్లూ వైరస్‌లకు ఒకే మందు!
వాషింగ్టన్: అన్ని రకాల ఫ్లూ వైరస్‌లను నిరోధించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు కొత్త యాంటీ బయాటిక్‌ను కనుగొన్నారు. దాని పేరు 1జీ01. 2017లో ఫ్లూ జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ఒక రోగి శరీరంలో దీనిని గుర్తించారు. ఎలుకలపై పరిశోధనలు నిర్వహించగా ఈ యాంటీ బయాటిక్ మనుషుల్లో సోకే ఫ్లూ వైరస్లు సహా 12 రకాల వైరస్‌లను నిరోధించింది. మొదట ఎలుకలకు ఫ్లూ వైరస్లు ఎక్కించి 3 రోజుల తర్వాత యాంటీ బయాటిక్ ఇవ్వగా అది సమర్థంగా పని చేసింది. తాజా పరిశోధనల దృష్ట్యా భవిష్యత్తులో అన్ని రకాల ఫ్లూ వైరస్‌లకు ఒకే మందు తయారు చేస్తామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. -
అసలు జలుబుకు మందు ఉందా!?
న్యూఢిల్లీ : ‘జలుబుకు మందు వాడితే వారం రోజుల్లో తగ్గుతుంది. మందు వాడకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుంది’ అనే కామెంట్ వినే ఉంటాం. జలుబు దానంతట అది తగ్గాల్సిందేగానీ దానికి మందు లేదనే అర్థంలోనే ఈ కామెంట్ చేయడం కద్దూ! బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే జబ్బులకు మందులు ఉన్నాయని, జలుబు వైరస్ల ద్వారా వస్తుంది కనుక మందులేదని వాదించే వారు ఉన్నారు. వారి వాదనలో నిజమెంత? వాతావరణంలో ఉండే దాదాపు రెండు వందల రకాల వైరస్‌ల్లో ఏదో దాని వల్ల జలుబు, దాంతోపాటు దగ్గు వస్తుంది. ఇది ఒకరికి సంవత్సరానికి మూడుసార్లు పట్టి పీడిస్తుంది. శీతాకాలం, వర్షాకాలంలో జలుబు ఎక్కువగా రావడానికి కారణం ఆ సమయాల్లో వైరస్లు క్రియా శీలకంగా ఉంటాయి. ఎవరైనా ఒక్కసారి ముక్కు చీది నపుడు కొన్ని లక్షల వైరస్ కణాలు బయటకు వస్తాయి. వాటిని శాస్త్ర విజ్ఞానపరంగా ‘వైరియాన్స్’ అంటారు. వీటిలో దేనివల్ల నైనా ఇతరులకు జలుబు రావచ్చు. ఒకరు ముక్కు ద్వారా ఊపరి తిత్తుల్లోకి గాలి పీల్చుకున్నప్పుడు దాదాపు పదివేల వైరస్ కణాలు లోపలికి వెళతాయి. అవి తిరిగి బయటకు వచ్చేటప్పుడు గొంతు, ముక్కులోని ‘ఎపిథెలియల్ సెల్స్’కు కొన్ని వందల వైరస్ కణాలు అతుక్కుపోతాయి. అక్కడ వాటి పరాన్న సైకిల్ మొదలవుతుంది. దాని వల్ల జలుబు, దగ్గు వస్తుంది. చిన్నగా ప్రారంభమయ్యే జలుబు మూడు రోజుల్లోనే ముదురుతుంది. ఒక్క రోజులోనే కొన్ని లక్షల వైరస్ ఎన్ఫెక్ట్ అయిన ప్రాంతాన్ని ఆక్రమిస్తాయి. విక్స్, ఇతర జలుబు మందుల వల్ల 50 శాతమే జలుబును నివారించవచ్చని, మొదటి రోజు తీసుకునే జాగ్రత్తల వల్లనే దీన్ని త్వరగా నయం చేసుకోవచ్చని లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్శిటీలో వైరాలజిస్ట్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ జాన్ ఆక్స్‌వర్డ్, కార్డిఫ్ యూనివర్శిటీలోని ‘కామన్ కోల్డ్ సెంటర్ డైరెక్టర్’గా పనిచేస్తున్న ప్రొఫెసర్ రాన్ ఎకిల్స్, లండన్ ఇంపీరియల్ కాలేజీలో ఎక్స్పర్మెంట్ మెడిసిన్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పీటర్ ఓపెన్‌షా తెలియజేశారు. జలుబు సోకగానే చేతులు, ముక్కు, నోరు ఎప్పటికప్పుడు సబ్బుతో కడుక్కోవాలి. తుమ్ములు వచ్చినప్పుడు శుభ్రంగా ఉతికిన గుడ్డలను మార్చి మార్చి వాడాలి. కళ్లు నలుపుకో కూడదు. అలా చేస్తే కళ్లకు వైరస్ సోకుతుంది. రోజుకు వేడి నీళ్లలో తేనె, నిమ్మ రసం కలుపుకొని మూడు సార్లు తాగాలి. గొంతు మంట నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. చికెన్ సూప్ రెండు సార్లు తీసుకుంటే అది బాగా పని చేస్తుంది. ఐబ్రూఫిన్ లాంటి మందులు కూడా ఉపశమనం ఇస్తాయి. జలుబు వచ్చినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఊపిరితిత్తులకు బ్యాక్టీరియా సోకి, నిమోనియా వచ్చే ప్రమాదం ఉంటుందని ఆ ముగ్గురు వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరికి జలుబు ఎక్కువగా రావడానికి, కొందరికి రాకపోవడానికి కారణం వారి రక్తంలో ఉండే తెల్లరక్త కణాల సంఖ్యపై ఆధార పడి ఉంటుందని, తెల్ల రక్తకణాలు వైరస్‌లను శక్తివంతంగా ఎదుర్కొంటాయని వారు చెప్పారు. -
ఫ్లూకి విరుగుడు!
మొన్నటివరకూ ఫ్లూ అంటే.. ఒక మందుబిళ్లతో తగ్గిపోయే సమస్య! నిన్నటికి వచ్చేసరికి.. కొన్ని పరీక్షలు, ఒకట్రెండు ఇంజెక్షన్లు కూడా తోడైతేగానీ.. ఉపశమనం ఉండేది కాదు.. మరి నేడు... స్వైన్ ఫ్లూ లేదా హెచ్ఐఎన్1 కావచ్చు... ఫ్లూ పేరు చెబితే చాలు.. మనిషి హడలెత్తిపోయే పరిస్థితి! ఈ నేపథ్యంలో వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ శుభవార్త మోసుకొచ్చారు. ఒకట్రెండు కాదు.. ఏకంగా పన్నెండు రకాల ఫ్లూ వైరస్‌లను దీటుగా ఎదుర్కోగల మందును తయారు చేశారు! ప్రాణాంతక వ్యాధులెన్నింటికో మందులు కనుక్కున్న మానవమేధ... జలుబు విషయానికి వచ్చేసరికి మాత్రం ఇప్పటికీ ఏ పరిష్కారమూ కనుక్కోలేకపోయింది. లక్షణాలను అదుపులో ఉంచడం, నొప్పి తగ్గేందుకు మాత్రలు వేసుకోవడం మాత్రమే మనం చేయగలం. శరీరంలో జలుబుకు కారణమైన వైరస్ కొంతకాలం తరువాత తనంతట తానే ప్రభావం చూపడం మానేస్తే నయమైనట్టు లెక్క. అయితే కాలంతో పాటు జలుబు కారక వైరస్ల తీరూ మారిపోవడంతో సమస్య కాస్తా జటిలమవుతోంది. పక్షులకు మాత్రమే సోకే వైరస్ మనిషికి సోకి బర్డ్‌ఫ్లూ, పందుల వైరస్‌తో స్వైన్‌ఫ్లూ... కొద్దిపాటి మార్పులున్న ఇతర వైరస్‌లతో రకరకాల ఫ్లూ జ్వరాలు మనిషిని చుట్టుముడుతున్నాయి. అందుకే వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల తాజా పరిశోధన అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. రోగనిరోధక ప్రొటీన్‌తో చెక్! మన శరీర రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ ప్రొటీన్ ‘1జీ01’వైరస్‌కు యాంటీబాడీగా పనిచేస్తుందని వాషింగ్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రొటీన్‌ను అందించినప్పుడు ఫ్లూ కారక వైరస్లు శరీరం మొత్తం వ్యాపించడం ఆగిపోవడమే కాకుండా.. తమ నకళ్లను తయారు చేసుకోలేకపోయాయి కూడా. ఎలుకలపై జరిగిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో వేర్వేరు ఫ్లూ వైరస్‌లను నిరోధించగలిగే సార్వత్రిక వ్యాక్సిన్ తయారీకి మార్గం సుగమమైందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా సంక్లిష్టమైన ఫ్లూ కేసులకు సమర్థమైన చికిత్స అందించేందుకూ వీలవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ అలీ ఎల్బెడీ తెలిపారు. ఇంజెక్షన్ లేదా.. ముక్కుల్లోకి పిచికారీ చేసుకోగల మందు రూపంలో ఈ ప్రొటీన్‌ను ఉపయోగించవచ్చునని చెప్పారు. హెచ్1ఎన్1, హెచ్3ఎన్2లతో పాటు ఇన్‌ఫ్లూయెంజా బి రకం వైరస్‌లను నిరోధించగల టీకా లేదంటే.. ఆయా సీజన్లలో ఎక్కువ ప్రభావం చూపే నాలుగు రకాల వైరస్‌లను అడ్డుకునే క్వాడ్రివేలంట్ వ్యాక్సిన్‌ను తయారు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచవచ్చునని వివరించారు. క్వాడ్రివేలంట్ వ్యాక్సిన్‌లో ఏటా మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ‘1జీ01’ప్రొటీన్‌తో కూడిన వ్యాక్సిన్ మాత్రం 12 రకాల వైరస్‌ను ఎదుర్కోగలదని వివరించారు. 2017లో ఫ్లూతో బాధపడుతున్న ఓ రోగి రక్తం నుంచి తాము ఈ ప్రొటీన్‌ను వేరు చేశామని, ఇన్‌ఫ్లూయెంజా వైరస్ల ఉపరితలంపై ఉండే ప్రొటీన్‌ను ఇది సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు గుర్తించడంతో దీనిపై తమ ఆసక్తి పెరిగిందని చెప్పారు. శాస్త్రవేత్తలకూ అంతుచిక్కలేదు.. మామూలుగా ఏ యాంటీబాడీ అయినా.. ఏదో ఒకరకం వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోగలదు. కానీ 1జీ01 పన్నెండు రకాల వైరస్‌లను ఎలా ఎదుర్కొంటోందో శాస్త్రవేత్తలకూ అంతు చిక్కడం లేదు. వైరస్ సోకిన మూడు రోజులకు ప్రొటీన్‌ను అందించినప్పటికీ అది సమర్థంగా పనిచేసింది. ప్రస్తుతం ఫ్లూ కోసం వాడే టామీ ఫ్లూ మాత్రను లక్షణాలు కనిపించిన 24 గంటల్లోపు అందించాల్సి ఉంటుంది. వైరస్ ఉపరితలంపై కనిపించే మరో ప్రొటీన్ న్యూరామినిడేస్పై దాడి చేయడం ద్వారా 1జీ01 వైరస్ నకళ్లను రూపొందించకుండా నిరోధిస్తుందని భావిస్తున్నట్లు డాక్టర్ అలీ తెలిపారు. సార్వత్రిక వ్యాక్సిన్ తయారీ కీలకమైన సమయంలో 1జీ01ను గుర్తించామని, వైరస్ ఎక్కడ దాడి చేస్తుందో తెలుసు కాబట్టి సమర్థంగా వాడుకునేందుకు అవకాశాలు ఎక్కువని వివరించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కేవలం 36 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా వైరస్!
సాక్షి, న్యూఢిల్లీ : సరిగ్గా వందేళ్ల క్రితం అంటే, 1919లో ‘స్పానిష్ ఫ్లూ’ మూడొంతుల ప్రపంచాన్ని చుట్టుముట్టడంతో దాదాపు ఐదు కోట్ల మంది మరణించారు. అలాంటి వైరస్ ఇప్పుడు ప్రపంచానికి సోకితే కనీసం ఎనిమది కోట్ల మంది ప్రజలు మరణిస్తారు. ఒకప్పుడు మెల్లగా విస్తరించిన ఈ ఫ్లూ, ఓ దేశానికి చెందిన ప్రజలు, మరో దేశానికి నిరంతరంగా ప్రయాణిస్తున్న నేటి వేగవంతమైన యుగంలో కేవలం 36 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలదు. అదే గనుక జరిగితే అపార జన నష్టంతోపాటు దేశ దేశాల జాతీయ భద్రత అస్తవ్యస్తం అవుతుంది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ నాయకత్వంలోని ‘గ్లోబల్ ప్రిపేర్డ్నెస్ మానిటరింగ్ బోర్డ్’ సభ్యుల బందం ఈ హెచ్చరికలను చేసింది. ఈ మేరకు ‘ఏ వరల్డ్ ఎట్ రిస్క్’ శీర్షికతో రూపొందించిన ఓ నివేదికను బుధవారం అమెరికాలో విడుదల చేసింది. ‘ఎబోలా’ లాంటి వైరస్లు వేగంగా సోకుతున్న నేటి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఫ్లూలు ప్రపంచానికి సోకే ప్రమాదం ఉందని, అలాంటి వైరస్‌లను ఇప్పటి నుంచి అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ డైరెక్టర్ –జనరల్, నార్వే మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ గో ఆర్లెం బ్రుండట్లాండ్ నాయకత్వంలోని జీపీఎంబీ బృందం హెచ్చరికలను జారీ చేస్తోంది. ఏ వైరస్ ఏ ప్రాంతాన్నీ, ఏ దేశాన్ని సోకే అవకాశం ఉందో కూడా ప్రపంచ పటంపై మార్కు చేసి చూపించింది. 1918లో స్పానిష్ ఫ్లూ అమెరికాలో విస్తరించినప్పుడు చికిత్స కేంద్రాల్లో పనిచేస్తున్న రెడ్‌క్రాస్ కార్యకర్తలు అంటే నిఫా వైరస్ ఏ దేశాన్ని చుట్టు ముడుతుందో, కలరా ఏ దేశాన్ని చికెన్ గున్యా, డెంగ్యూలాంటి వైరస్లు ఏయే దేశాలు చుట్టుముడుతాయో మ్యాప్‌లో సూచించింది. వాటికి సంబంధించి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు ఏమిటో కూడా సూచించింది. ఇంతకుముందు విడుదలు చేసిన తమ నివేదికను దేశాధినేతలు సరిగ్గా పట్టించుకోక పోవడం వల్ల, తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా అరకొరగానే అమలు చేసినందువల్లనే ఈ రోజు మళ్లీ ఒక నివేదికను విడుదల చేయాల్సి వచ్చిందని బోర్డు వివరించింది. ఎబోలా, జికా, నిపా వైరస్‌లతోపాటు వెస్ట్ నైల్ వైరస్, డెంగ్యూ, ప్లేగ్, హ్యూమన్ మంకీపాక్స్‌ల గురించి హెచ్చరికలు చేసింది. -
స్వైన్‌విహారం..
- ఐదేళ్ల తరువాత జిల్లాలో మరోసారి - రావులపాలేనికి చెందిన ఇద్దరి బాలికలకు వ్యాధి నిర్ధారణ - కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు - అప్రమత్తమైన యంత్రాంగం సాక్షి ప్రతినిధి, కాకినాడ/రావులపాలెం : సుమారు ఐదేళ్ల క్రితం జిల్లాను వణికించిన స్వైన్‌ఫ్లూ మరోసారి బయటపడింది. రావులపాలెంలో ఇద్దరు బాలికలకు ఈ వ్యాధి సోకినట్టు నిర్ధారణకావడం జిల్లావాసులను హడలెత్తిస్తోంది. తొలిసారిగా 2012లో స్వైన్‌ఫ్లూ కేసులు జిల్లాలో నమోదు కావడంలో అప్పట్లో పెద్ద సంచలనమైంది. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చినబోడ్డువెంకటాయపాలెం, పెదబొడ్డు వెంకటాయపాలెం పరిసర ప్రాంతాల్లో అప్పట్లో ఆరు స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మత్స్యకారులు అధికంగా నివసించే ఆ గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో స్వైన్‌ఫ్లూ రావడానికి కారణమైందని అప్పట్లో వైద్యులు నిర్ధారించారు. తాజాగా రావులపాలెంలో రెండు స్వైన్ ఫ్లూ కేసులు వెలుగు చూడడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జర్వం, జలుబు లక్షణాలతో రాజమహేంద్రవరం, కాకినాడ ఆస్పత్రుల్లో చికిత్స పొందున్న రావులపాలేనికి చెందిన ఇద్దరు బాలికలకు స్వైన్‌ఫ్లూ సోకినట్టు నిర్ధారించడంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రావులపాలెంలో ఇటీవల నిమోనియా వ్యాధితో సత్తి నళిని(47) మృతి చెందింది. ఆమెకు దీప్తి, శ్రీజ ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ జ్వరం, జలుబుతో బాధపడుతుండగా నాలుగు రోజుల క్రితం రాజమహేంద్రవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆ ఇద్దరిలో శ్రీజకు హెచ్1ఎన్1 పాజిటివ్ ఉండటంతో స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకినట్టు నిర్ధారణకు వచ్చి అందుకు అనుగుణంగా చికిత్స చేస్తున్నారు. మెడిసిన్ చదువుతున్న దీప్తికి సాధారణ జ్వరమే అని నిర్ధారణ కావడంతో ఆ కుటుంబం కాస్త ఊరట చెందింది. అంతలోనే వారి సమీప బంధువైన నాలుగేళ్ల కర్రి హర్షిత అనారోగ్యానికి గురవ్వడంతో ఆందోళనలో పడ్డారు. స్వైన్‌ఫ్లూ భయం వెంటాడుతుండగా ఆ బాలికకు కాకినాడ మెయిన్‌రోడ్డులోని ఒక ప్రైవేటుæ ఆస్పత్రిలో చేర్పించగా స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఆ విషయం బయటకు రావడంతో వారి బంధువుల్లో ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కె. చంద్రయ్య, ఊబలంక పీహెచ్సీ వైద్యులు ఎం.శైలజారాణి, జి.దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులతో మాట్లాడి పిల్లల ఆరోగ్య పరిస్థితులు ఆరా తీశారు. శ్రీజ తండ్రి వెంకటరెడ్డి, సోదరి దీప్తితో బాలికల అనారోగ్య లక్షణాలు తెలుసుకున్నారు. పశ్చిమగోదావరి నుంచి తూర్పుకు.. వీరిద్దరి కంటే ముందు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన కొండేటి బాలాజీ స్వైన్‌ఫ్లూతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని డీఎంఅండ్హెచ్ఎం చంద్రయ్య ఊబలంకలో ధ్రువీకరించారు. శ్రీజ తండ్రి వెంకటరెడ్డి వ్యాపార రీత్యా పాలుకొల్లు, నరసాపురం ప్రాంతాలకు వెళ్లి రావడం, నరసాపురానికి చెందిన బాలాజీ స్వైన్‌ఫ్లూతో రాజమహేంద్రవరం రావడం ఆ క్రమంలోనే అక్కడి నుంచి స్వైన్‌ఫ్లూ మన జిల్లాకు వచ్చి ఉంటుందనే అనుమానాన్ని డీఎంహెచ్ఓ వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే శీతాకాలంలో కనిపించే స్వైన్‌ఫ్లూ వేసవిలో నమోదు కావడం వైద్యాధికారులకు అంతుబట్టడం లేదు. కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు స్వైన్ ప్లూ వ్యాధిగ్రస్తుల కోసం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఒక వార్డును ఏర్పాటు చేశాం. ఈఎన్‌డీ ఆప్తమాలజీ వార్డు పైఅంతస్తులో పది బెడ్లతో ఈ వార్డును అందుబాటులో ఉంచాం. వైద్య సేవలందించేందుకు మూడు షిప్ట్‌ల్లో వైద్య సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉంచాం. హెడ్ నర్స్ ఆధ్వర్యంలో స్టాఫ్‌నర్స్, ఎఫ్ఎన్వోలతో సిబ్బందిని సమాయత్తం చేశాం. వెంటిలేటర్‌ను ఏర్పాటు చేశాం. మరో ప్రత్యేక వార్డును సిద్ధం చేస్తున్నాం. - డాక్టర్ రాఘవేంద్రరావు, సూపరింటెండెంట్, కాకినాడ జీజీహెచ్ వ్యాధి లక్షణాలు స్వైన్ ప్లూ హెచ్1ఎన్1 ఇన్ప్లూఎంజ వైరస్ కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. సాధారణ జలుబుగా ప్రారంభమై ఆరు రోజులుగా జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, దగ్గు, తలనొప్పి, వాంతులు, విరేచనాలతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే స్వైన్‌ప్లూగా గుర్తిస్తారు.