'మద్యం ఆరోగ్యానికి హానికరం' అంటూ యాడ్‌లలోనూ సినిమాల్లోనూ తెగ కనిపిస్తుంది. అదీగాక మద్యం తాగితే లివర్, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు పాడై ప్రాణాలు కోల్పోతారనివైద్యులు హెచ్చరిస్తుంటారు. అయితే మద్యం తాగితే కొన్ని వ్యాధులు రావట. పైగా ఆ వ్యాధులకు మద్యమే మందట. తాగితే ఆ వ్యాధులు తగ్గుముఖం పడతాయిని సాక్షాత్తు వైద్యులే చెబుతున్నారు. అలా అని ఇష్టారీతిగా తాగేయ్యొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఏ వ్యాధులకు మద్యం మందు? ఎంత మోతాదులో తాగితే బెటర్ అంటే..
ఇటీవల కాలంలో మద్యం తాగేవాళ్ల సంఖ్య రోజు రోజుకి అనూహ్యంగా పెరుగుతుంది. దీనివల్ల దీర్ఘాకాలిక వ్యాధులు బారినపడే ప్రమాదం ఉదన్నా సరే వీకెండ్ అని, వెకేషన్ అని ఏదో ఒక సందర్భం పేరుతో విచ్చల విడిగా తాగేయడం నేటి యువతకు ఓ ఫ్యాషన్ అయిపోయిందని చెప్పొచ్చు. పోనీ తాగిన అందుకు తగ్గ ఫుడ్ జ్రాగత్తలు తీసుకుంటే బావుండు. పడని బ్రాండెడ్ మందు కూడా ట్రై చేసేసి లేనిపోని ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు కొందరూ.
ఆరోగ్య నిపుణులు, వైద్యులు మద్యం సేవిస్తే వచ్చే ఆరోగ్య సమస్యల గురించి వివరించినా.. ఐ డోంట్ కేర్ అన్నట్లు తాగేస్తుంటారు మందుబాబులు. పరిస్థితి చేయి దాటాక తాగుడు అలవాటు నుంచి బయటపడేందుకు డీ అడిక్షన్ సెంటర్‌ల చుట్టూ తెగ ప్రదిక్షణాలు చేసేస్తుంటారు. ఇంత వరకు పరిస్థితి ఎందుకు తెచ్చుకోవడం అని వైద్యులు తరుచుగా ప్రశ్నిస్తుంటారు రోగులన. అసలు ఇలాంటి సమస్య తెచ్చుకోకుండా మందుబాబులు జాగ్రత్తగా ఉండేలా వైద్యులు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇష్టంగా తాగే మందు వల్ల కలిగే ప్రయోజనాల తోపాటు ఏ మోతాదులో తీసుకుంటే హాయిగా ఉండొచ్చో సవివిరంగా చెప్పారు. అవేంటంటే..
ఆ వ్యాధులు తగ్గుతాయట..
- బ్రాందీ, రమ్, విస్కీ జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు బారినపడకుండా కాపాడుతుందట. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయట. అలాగే జలుబు కారణంగా వచ్చే శ్లేష్మాన్ని క్లియర్ చేస్తుందట.
- ఇందులో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ కంటెంట్ క్యాన్సర్ వ్యతిరేకంగా పనిచేస్తుందట. ముఖ్యంగా అండాశయ, మూత్రాశయ క్యాన్సర్‌లు రాకుండా నియంత్రిస్తుందట.
- రాగి బారెల్స్‌లో ఉండే బ్రాందీలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. ఇది మంచి యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తుంది.
- అలాగే కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. పైగా హృదయనాళాల ఆరోగ్యానికి సహాయపడుతుంది.
ఇలాంటి మంచిఫలితాలను పొందాలంటే ఇక్కడ బ్రాందీ, రమ్ వంటివి రోజుకి 30 నుంచి 60 ఎంఎల్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యక్తిగత ఆరోగ్య చరిత్రను పరిగణలోనికి తీసుకుని, అందుకు అనుగుణంగా నిపుణుల సూచించిన విధంగా మోతాదుకు మించి మద్యం సేవించకుండా ఉంటేనే ఈ సత్ఫలితాల పొందగలరని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ ఏదైన తగు మోతాదులో మితంగా ఉంటే శరీరానికి అవసరమయ్యే మంచి ఔషధ గుణాలను పొందగలమని చెబుతున్నారు నిపుణులు.
వార్నింగ్: తాగమని కాదు..!
ఇక్కడ మందు తాగండని లేదా తాగడం మంచిదని చెప్పడం ప్రధాన ఉద్దేశ్యం కాదు. తాగే అలవాటు ఉన్నవారు, అస్సలు తాగకుండా ఉండలేని వారు దీని వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటే కనీసం తగు మోతాదులో లేదా ఆరోగ్యకరమైన పద్ధతిలో తీసుకుని సురక్షితంగా ఉంటారని తెలియజేయడమే తప్ప. ఇక్కడ ఎవర్నీ మందు తాగమని ప్రోత్సహించే ఉద్దేశ్యం లేదని చెబుతున్నారు నిపుణులు. కొన్ని హానికరైమన వాటిల్లో కూడా మేలు చేసే గుణాలు ఉంటాయని చెప్పేందుకే అని అన్నారు. ఇవి తెలుసుకుంటే ఆ చెడు అలవాటుని కూడా ఆరోగ్యానికి మంచిదిగా మలుచుకుంటే తాగుడు సమస్య నుంచి బయటపడొచ్చు లేద చెక్ పెట్టగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసమే. దీన్ని అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు, ఆరోగ్య నిపుణుల సలహాలు సూచనల మేరుకు పాటించటం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment