Rum
-
కొన్ని వ్యాధులకు మద్యమే మందట.. తాగితే తగ్గుతుందట!
'మద్యం ఆరోగ్యానికి హానికరం' అంటూ యాడ్లలోనూ సినిమాల్లోనూ తెగ కనిపిస్తుంది. అదీగాక మద్యం తాగితే లివర్, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు పాడై ప్రాణాలు కోల్పోతారనివైద్యులు హెచ్చరిస్తుంటారు. అయితే మద్యం తాగితే కొన్ని వ్యాధులు రావట. పైగా ఆ వ్యాధులకు మద్యమే మందట. తాగితే ఆ వ్యాధులు తగ్గుముఖం పడతాయిని సాక్షాత్తు వైద్యులే చెబుతున్నారు. అలా అని ఇష్టారీతిగా తాగేయ్యొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఏ వ్యాధులకు మద్యం మందు? ఎంత మోతాదులో తాగితే బెటర్ అంటే.. ఇటీవల కాలంలో మద్యం తాగేవాళ్ల సంఖ్య రోజు రోజుకి అనూహ్యంగా పెరుగుతుంది. దీనివల్ల దీర్ఘాకాలిక వ్యాధులు బారినపడే ప్రమాదం ఉదన్నా సరే వీకెండ్ అని, వెకేషన్ అని ఏదో ఒక సందర్భం పేరుతో విచ్చల విడిగా తాగేయడం నేటి యువతకు ఓ ఫ్యాషన్ అయిపోయిందని చెప్పొచ్చు. పోనీ తాగిన అందుకు తగ్గ ఫుడ్ జ్రాగత్తలు తీసుకుంటే బావుండు. పడని బ్రాండెడ్ మందు కూడా ట్రై చేసేసి లేనిపోని ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు కొందరూ. ఆరోగ్య నిపుణులు, వైద్యులు మద్యం సేవిస్తే వచ్చే ఆరోగ్య సమస్యల గురించి వివరించినా.. ఐ డోంట్ కేర్ అన్నట్లు తాగేస్తుంటారు మందుబాబులు. పరిస్థితి చేయి దాటాక తాగుడు అలవాటు నుంచి బయటపడేందుకు డీ అడిక్షన్ సెంటర్ల చుట్టూ తెగ ప్రదిక్షణాలు చేసేస్తుంటారు. ఇంత వరకు పరిస్థితి ఎందుకు తెచ్చుకోవడం అని వైద్యులు తరుచుగా ప్రశ్నిస్తుంటారు రోగులన. అసలు ఇలాంటి సమస్య తెచ్చుకోకుండా మందుబాబులు జాగ్రత్తగా ఉండేలా వైద్యులు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇష్టంగా తాగే మందు వల్ల కలిగే ప్రయోజనాల తోపాటు ఏ మోతాదులో తీసుకుంటే హాయిగా ఉండొచ్చో సవివిరంగా చెప్పారు. అవేంటంటే.. ఆ వ్యాధులు తగ్గుతాయట.. బ్రాందీ, రమ్, విస్కీ జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు బారినపడకుండా కాపాడుతుందట. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయట. అలాగే జలుబు కారణంగా వచ్చే శ్లేష్మాన్ని క్లియర్ చేస్తుందట. ఇందులో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ కంటెంట్ క్యాన్సర్ వ్యతిరేకంగా పనిచేస్తుందట. ముఖ్యంగా అండాశయ, మూత్రాశయ క్యాన్సర్లు రాకుండా నియంత్రిస్తుందట. రాగి బారెల్స్‌లో ఉండే బ్రాందీలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. ఇది మంచి యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. పైగా హృదయనాళాల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇలాంటి మంచిఫలితాలను పొందాలంటే ఇక్కడ బ్రాందీ, రమ్ వంటివి రోజుకి 30 నుంచి 60 ఎంఎల్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యక్తిగత ఆరోగ్య చరిత్రను పరిగణలోనికి తీసుకుని, అందుకు అనుగుణంగా నిపుణుల సూచించిన విధంగా మోతాదుకు మించి మద్యం సేవించకుండా ఉంటేనే ఈ సత్ఫలితాల పొందగలరని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ ఏదైన తగు మోతాదులో మితంగా ఉంటే శరీరానికి అవసరమయ్యే మంచి ఔషధ గుణాలను పొందగలమని చెబుతున్నారు నిపుణులు. వార్నింగ్: తాగమని కాదు..! ఇక్కడ మందు తాగండని లేదా తాగడం మంచిదని చెప్పడం ప్రధాన ఉద్దేశ్యం కాదు. తాగే అలవాటు ఉన్నవారు, అస్సలు తాగకుండా ఉండలేని వారు దీని వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటే కనీసం తగు మోతాదులో లేదా ఆరోగ్యకరమైన పద్ధతిలో తీసుకుని సురక్షితంగా ఉంటారని తెలియజేయడమే తప్ప. ఇక్కడ ఎవర్నీ మందు తాగమని ప్రోత్సహించే ఉద్దేశ్యం లేదని చెబుతున్నారు నిపుణులు. కొన్ని హానికరైమన వాటిల్లో కూడా మేలు చేసే గుణాలు ఉంటాయని చెప్పేందుకే అని అన్నారు. ఇవి తెలుసుకుంటే ఆ చెడు అలవాటుని కూడా ఆరోగ్యానికి మంచిదిగా మలుచుకుంటే తాగుడు సమస్య నుంచి బయటపడొచ్చు లేద చెక్ పెట్టగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసమే. దీన్ని అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు, ఆరోగ్య నిపుణుల సలహాలు సూచనల మేరుకు పాటించటం ఉత్తమం. -
మెర్క్యూర్ హోటల్ లో కేక్ మిక్సింగ్ సందడి
-
రా 'రమ్మ'oటే పోతున్నారు!
సాక్షి, న్యూఢిల్లీ : 'ఓల్డ్ మాంక్ రమ్' పేరు వినగానే గ'మ్మత్తు'గా ఒళ్లు పులకరించిపోతుందీ మందుబాబులకు. భారత సైనికాధికారుల నుంచి వీధిలోని సామన్యుడి వరకు తారతమ్యం లేకుండా తెగ తాగిన బ్రాండ్ ఓల్డ్ మాంక్. కొందరు ముద్దుగా 'వృద్ధ సన్యాసి' అని పిలుచుకునేవారు. రా 'రమ్మ'oటూ పిలుస్తే రానా? అని మహాకవి శ్రీశ్రీ తనదైన శైలిలో ఫన్ చేశారు. ఓల్డ్ మాంక్ ప్రేమికులకు, అభిమానులకు ఫేస్బుక్లో ఏకంగా ఓ పేజీ ఉందంటే ఆశ్చర్యం అవసరం లేదు. ఆ పేజీ పేరు 'కామ్రేడ్స్'. అంటే, కౌన్సిల్ ఆఫ్ ఓల్డ్ మాంక్ రమ్ ఆడిక్టెట్ డ్రింకర్స్ అండ్ ఎక్సెట్రిక్స్. గజియాబాద్ ప్రధాన కార్యాలయంగా ప్రముఖ వ్యాపారవేత్త మోహన్ మేకిన్ దాదాపు 60 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈ బ్రాండ్ తన పూర్వవైభవాన్ని కోల్పోతూ క్రమక్రమంగా మార్కెట్లో తన విక్రయ వాటాను కోల్పోతూ వస్తోంది. యూరోమనిటర్ సంస్థ అంచనాల ప్రకారం 2005 నుంచి ఇప్పటి వరకు ఈ బ్రాండ్ మార్కెట్ పది శాతం పడిపోగా, ప్రస్తుతం రమ్ మార్కెట్లో ఐదు శాతానికి పరిమితం అయింది. రమ్ విధేయులు దీనికి దూరమవడం, విదేశీ బ్రాండ్ల కోసం ఎగబ్రాకడం వల్ల ఓల్డ్ మాంక్ అమ్మకాలు పడిపోలేదు. దేశవ్యాప్తంగా రమ్ము తాగేవారి సంఖ్య తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం. దేశంలో ఇతర మద్యాల అమ్మకాలు సరాసరి సగటున ఏటా ఆరు శాతం పెరుగుతుండగా, బీర్లు ఎనిమిది శాతం పెరుగుతుండగా, రమ్ము మార్కెట్ ఏటా 0. 2 శాతం తగ్గుతూ వస్తోంది. 2014లో రమ్ మార్కెట్ 38.70 కోట్ల లీటర్లు ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అంతకుముందు సంవత్సరం అమ్ముడుపోయిన సరకు కన్నా ఇది 1.5 శాతం తక్కువ. అప్పటి నుంచి మార్కెట్లో ప్రతికూల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. 2019 వరకు ఈ ప్రతికూల ట్రెండ్ కొనసాగుతుందని అంచనా వేశాయి. అప్పటి వరకు ఓల్డ్ మాంక్ బ్రాండ్ మార్కెట్లో బతకడం కష్టమని మార్కెట్ వర్గాలు భావించాయి. ఈ లోగా అనారోగ్యంతో బాధ పడుతున్న బ్రాండ్ యజమాని మోహన్ మేకిన్ మరణించడం మరో దెబ్బ. భారత్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మధ్యాదాయ వర్గాలే ఎక్కువగా ఓల్డ్ మాంక్‌ను ప్రేమించేవారు. ఈలోగా మార్కెట్లోకి జానీ వాకర్, బ్లెండర్స్ ప్రైడ్, ఇంపీరియల్ బ్లూ, రాయల్ స్టాగ్ లాంటి ఆకర్షణీయమైన బ్రాండులు రావడం, మధ్యాదాయ వర్గాల ఆదాయం కూడా పెరగడం వల్ల వారు ఈ విస్కీ బ్రాండుల వైపు మొగ్గు చూపారని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది కొంత వరకు మాత్రమే నిజం కావచ్చు. ఎందుకంటే 24 ఏళ్ల క్రితం మార్కెట్లోకి వచ్చిన యునైటెడ్ స్పిరిట్స్ ఆధ్వర్యంలోని మ్యాక్‌డొవెల్ రమ్ ఏటా 5 శాతం వద్ధిని సాధిస్తూ.. రమ్ మార్కెట్లో 40 శాతాన్ని ఆక్రమించుకుంది. ఓల్డ్ మాంక్ కన్నా 20 శాతం తక్కువ ధరకే బ్రాండ్‌ను విక్రయించడం వివిధ క్యాటగిరీల్లో విక్రయించడం వల్ల మ్యాక్‌డొవెల్ విజయం సాధించిందని చెప్పవచ్చు. మధ్యలో ప్రస్తుత బ్రాండ్‌ను వదిలేసి ప్రీమియం బ్రాండ్‌కు వెళ్లడం వల్ల ఓల్డ్మాంక్కు నష్టం జరిగిందనే వారూ ఉన్నారు. ఏదేమైనా భారత ప్రభుత్వ సంస్థ అయినా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వాటాలు ఉండడం వల్ల మళ్లీ కోలుకుంటుందని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. -
17న తెరపైకి రమ్
ఆల్ ఇన్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత టీ.విజయరాఘవేంద్ర నిర్మించిన చిత్రం రమ్. ఈ చిత్రం ఈ నెల 17న తెరపైకి రానుంది. నవ దర్శకుడు ఎం.సాయిభరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హృషికేష్ కథానాయకుడిగా నటించిన ఇందులో నటి సంజనాశెట్టి, మియాజార్జ్ కథానాయికలుగా నటించారు. ప్రధాన పాత్రలో వివేక్, ముఖ్య పాత్రల్లో అంజద్, అర్జున్ టించగా ప్రతినాయకుడిగా నరేన్ నటించారు. ఈ చిత్రానికి యువ సంగీత తరంగం అనిరుద్ సంగీతబాణీలు కట్టడం విశేషం. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రమ్ చిత్ర విడుదల హక్కుల్ని పొందిన శ్రీసాయి సర్క్యూట్ 6000 సంస్థ ఈ నెల 17న విడుదల చేయనుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం నిర్వహంచారు.ఆ సందర్భంగా చిత్ర దర్శకుడు సాయిభరత్ మాట్లాడుతూ రెండు–మూడేళ్లుగా తయారు చేసుకున్న కథతో తెరకెక్కించిన చిత్రం రమ్ అని తెలిపారు. కథను విన్న నటుడు హృషికేష్ చాలా బాగుందని వెంటనే హీరోగా నటించడానికి అంగీకరించారన్నారు. ఆ తరువాత నిర్మాత విజయరాఘవేంద్ర చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారన్నారు. ఆపై నటి సంచితశెట్టి, మియాజార్జ్, వివేక్, నరేన్ ఇలా అందరూ పాత్రలకు తగ్గట్టు కుదిరారని చెప్పారు.రమ్ హారర్ నేపథ్యంలో సాగే చిత్రం అయినా, ఆ తరహా చిత్రాలకు ఢిపరెంట్‌గా యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఒక రాబరీతో మొదలయ్యే ఈ కథ హారర్‌గా ఎలా మారుతుందన్నది ఆసక్తికరంగానూ, థ్రిల్లింగ్‌గానూ సాగుతుందని చెప్పారు. యువత, పెద్దలు అందరూ చూసి ఎంజాయ్ చేసేలా రమ్ ఉంటుందని అన్నారు. రమ్ అన్నది తమిళ పదమేనని, దీనికి నీతి అనే అర్థం అని తెలిపారు. చిత్ర కథానాయకుడు హృషికేశ్ మాట్లాడుతూ అనిరుద్ సంగీతాన్ని అందించడం రమ్ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌గా పేర్కొన్నారు.ఇక వివేక్ లాంటి ప్రముఖ నటుడు కొత్త వాళ్లు చేసిన చిత్రంలో నటించడానికి అంగీకరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఆయన పాత్ర హస్యం దాటి చిత్రం అంతా ట్రావెల్ అవుతుందని తెలిపారు.రమ్ చిత్రాన్ని దర్శకుడు సాయిభరత్ చాలా బాగా హ్యాండిల్ చేశారని అన్నారు. ఈ చిత్రం తనకు చాలా స్పెషల్ అని నటి సంచితాశెట్టి పేర్కొన్నారు. -
బంగ్లాలో ఏం జరిగింది?
హృషికేశ్, నరైన్, మియాజార్జ్, సంచితా శెట్టి ప్రధాన పాత్రల్లో సాయిభరత్ దర్శకత్వంలో రూపొందించిన తమిళ చిత్రం ‘రమ్’. ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్టైన్ మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ‘మంత్రిగారి బంగళా’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రతి సన్నివేశం ఉత్కంఠ కల్గిస్తుంది. సునీల్ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న మియాజార్జ్ ఈ చిత్రంలో కీలక పాత్ర చేశారు. అనిరుధ్ బాణీలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. జనవరిలో పాటలను, ఫిబ్రవరిలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బేబీ త్రిష. -
బాకీ తీర్చేందుకు బంపర్ ఆఫర్!
వందేళ్లు మద్యం సరఫరా! ఈ వార్త తెలిశాక చెక్ రిపబ్లిక్ దేశంలోని మందుబాబులు పండుగ చేసుకొని ఉండాలి. ఎందుకంటే ఆ దేశ మందుబాబులను మస్త్ ఖుషీ చేసే కబురు క్యూబా చెప్పింది. చెక్ రిపబ్లిక్కు క్యూబా దాదాపు రూ. 187 కోట్లు అప్పు పడింది. ఆ బాకీ తీర్చడానికి క్యూబా ఇటీవల ఓ వినూత్నమైన ఆఫర్‌ను చేసింది. దేశీయ రమ్ముకు క్యూబా పెట్టింది పేరు. కాబట్టి అప్పు కింద వందేళ్లు మీ దేశ పౌరులందరికీ సరిపడే రమ్మును సరఫరా చేస్తామని ప్రతిపాదించింది. చెక్ రిపబ్లిక్కు ఇవ్వాల్సిన 276 మిలియన్ డాలర్ల అప్పును తీర్చేందుకు తమ దగ్గర ప్రస్తుతం డబ్బులేదని, కానీ, రమ్ము కావాల్సినంత అందుబాటులో ఉందని క్యూబా రాజధాని హవానాలో ఇటీవల ఆ దేశ ఆర్థికశాఖ ప్రకటించిందని బీబీసీ తెలిపింది. చెక్ రిపబ్లిక్ ఆర్థిక శాఖ కూడా క్యూబా ప్రతిపాదనను ధ్రువీకరించింది. అయితే, మొత్తం రమ్ము రూపంలో కాకుండా కొంతైనా నగదు రూపంలో చెల్లించాలని తాము కోరుతున్నట్టు ఆ దేశం తెలిపింది. ప్రచ్ఛన్నయుద్ధం కాలం నాటి అప్పు ఇది. అప్పట్లో మధ్య, తూర్పు యూర్లో విస్తరించిన కమ్యూనిస్ట్ కూడలి చెకోస్లోవోకియాలో క్యూబా కూడా భాగంగా ఉండేది. ఆ తర్వాత క్యూబా వేరుపడగా.. చెకోస్లోవోకియా కాస్తా చెక్రిపబ్లిక్గా అవతరించింది. ఈ అప్పు తీర్చడానికి అవసరమైతే తమ దేశంలో తయారయ్యే ఔషధాలు కూడా సరఫరాచేస్తామని కూడా క్యూబా ప్రతిపాదించినప్పటికీ, యూరప్ ప్రమాణాలకు తగ్గట్టుగా అవి ఉండవని చెక్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. -
రమ్‌తో నా కోరిక తీరుతుంది!
మంచి కథా పాత్రలతో ప్రేక్షకుల మదిలో పది కాలాలపాటు గుర్తుండిపోవాలని హీరోహీరోయిన్లు కోరుకుంటుడడం సహజమే. యువ నటి సంచితాశెట్టి అలాంటి కోరికనే వ్యక్తం చేస్తున్నారు. జయంరవి కథానాయకుడిగా నటించిన తిల్లాలంగడి చిత్రంలో నటించి తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సంచితాశెట్టి ఆ తరువాత విజయ్సేతుపతికు జంటగా సూదుకవ్వుం చిత్రంతో కథానాయకిగా మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఆ బ్యూటీ నటించిన రమ్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఆల్ ఇన్ పిక్చర్ పతాకంపై నిర్మాత విజయరాఘవేంద్ర నిర్మించిన ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు సాయిభరత్ పరిచయం అవుతున్నారు. వేలై ఇల్లా పట్టాదారి చిత్రంలో ధనుష్‌కు తమ్ముడిగా నటించి మంచి గుర్తింపు పొందిన హరీష్ ఘోష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో మరో హీరోయిన్గా మియాజార్జ్ నటించారు. హస్యనటుడు వివేక్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో నటించిన అనుభవం గురించి నటి సంచితాశెట్టి తెలుపుతూ నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలన్న తన కోరిక ఈ రమ్ చిత్రం ద్వారా తీరుతుందనే నమ్మకం ఉందన్నారు. ఇందులో తాను నటించిన లియా పాత్రకు అంత ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఇది హారర్ థ్రిల్లర్ కథా చిత్రం అరుునా ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని కలిగించేదిగా ఉంటుందన్నారు. ముఖ్యంగా సీనియర్ నటుడు వివేక్ లాంటి వారితో నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు.ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఇక ఈ చిత్ర హీరో హరాశ్ఘోష్ చాలా శ్రమించి ఎంతో అంకిత భావంతో నటించారని కితాబిచ్చారు.తాను ఇప్పటి వరకూ నటించిన చిత్రాల్లో తొమ్మిది మంది ప్రతిభావంతులైన సహాయ దర్శకులు, లఘు చిత్రాల దర్శకులతో నటించడం సంతోషంగా ఉందని అన్నారు.ఈ అమ్మడు నటించిన మరో చిత్రం ఎన్కిట్టమోదాదే కూడా వచ్చే నెల విడుదలకు సిద్ధం అవుతోందన్నది గమనార్హం. -
సూపర్‌స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్
అనిరుద్‌ను స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్‌రాజా సూపర్‌స్టార్ సంగీత దర్శకుడిగా పేర్కొన్నారు. ఆల్ ఇన్ పిక్చర్స్ పతాకంపై టీ.విజయరాఘవేంద్ర నిర్మించిన చిత్రం రమ్. హృషీకేష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో సంచితాశెట్టి, మియాజార్జ్ నాయికలుగా నటించారు. వివేక్, నరేన్, అమ్జాద్‌ఖాన్, అర్జున్ చిదంబరం తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాయి భరత్ దర్శకత్వం, అనిరుద్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. కార్యక్రమంలో అనిరుద్ మాట్లాడుతూ ఇది తన 13వ చిత్రం అని తెలిపారు. 13 సంఖ్యను చాలా మంది హారర్ సంఖ్యగా బావిస్తారన్నారు. అదే విధంగా తాను చిన్నతనంలో మైడియర్ కుట్టిసాత్తాన్ చిత్రం చూశానన్నారు. అప్పట్లో అది హారర్ కథా చిత్రం అని కూడా తెలియదన్నారు. ఆ తరువాత హారర్ చిత్రాన్నే తాను చూడలేదన్నారు. అలాంటి చిత్రాలంటే తనకు భయం అని అన్నారు. అలాంటిది తొలిసారిగా హారర్ ఇతి వృత్తంతో కూడిన రమ్ చిత్రానికి సంగీతాన్ని అందించినట్లు తెలిపారు. దర్శకుడు కథను నెరేట్ చేయగానే ఆసక్తి సినిమాపై కలిగిందన్నారు. చిత్రంలో ఏడు పాటలు ఉన్నాయని తెలిపారు. ప్రేక్షకులు తమపై పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం వమ్ము చేయమని అనిరుద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నిర్మాత జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాత తనను కలిసి రమ్ చిత్ర వ్యాపారం పూర్తయిందని చెప్పారన్నారు. సూపర్‌స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్ ఉంటే చిత్రం వ్యాపారం జరగకుండా ఉంటుందా? నిర్మాత తన వద్దకు వచ్చినా తానీ చిత్ర వ్యాపారాన్ని ఏక్ దమ్గా చేసి ఉండేవాడినని పేర్కొన్నారు. -
ఆహారమ్
సిటీ రెస్టారెంట్లు సరికొత్త థీమ్‌లను ఫుడ్ లవర్స్‌కు టేస్ట్ చూపిస్తున్నాయి. హాట్డ్రింక్స్కు కాంబినేషన్‌గా ఫుడ్ తీసుకోవడం తెలిసిందే అయితే.. ఫుడ్‌లోనే హాట్‌ని మిక్స్ చేయడం కొత్త ట్రెండ్. దీనినే ఇప్పుడు ‘పబ్ మీల్స్’ పేరుతో సర్వ్ చేస్తున్న పలు స్టార్ హోటళ్లు ఫుడ్ కమ్ డ్రింక్ లవర్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. - శిరీష చల్లపల్లి క్రిస్మస్ సమయంలో జరిగే కేక్ మిక్సింగ్ సందడి అందరికీ తెలిసిందే. ఆ మిక్స్‌లో రమ్ వగైరా లిక్కర్ వెరైటీలను కలుపుతారంటే ఇప్పటి వరకు ఆసక్తిగా చర్చించుకునేవాళ్లం. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కేక్స్ నుంచి వాక్ చేసుకుంటూ కర్రీస్, ఫుడ్ వెరైటీల వరకు వచ్చేసింది. ఆల్కహాల్ వెరైటీలలో వైన్‌ని ఎక్కువగా ఫుడ్‌లో టేస్ట్ కోసం జత చేస్తారు. కేవలం దీని కోసమే ప్రత్యేకంగా తక్కువ ధరలో వైన్ రకాలు సైతం అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని చాలా సిటీ రెస్టారెంట్లు బయటకు వెల్లడించవు. పబ్... డబ్ అయితే ఇప్పుడు సిటీలో ప్రకటించి మరీ ఆల్కహాల్ కలిసిన వంటకాలను వడ్డిస్తున్నారు. వెజ్, నాన్‌వెజ్, సలాడ్స్, సూప్స్.. వంటకాలు ఏవైనా ఆ స్పెషల్ రెసిపీలో కొద్దిగా ఆల్కహాల్‌ని జోడించి తయారు చేయడం కొన్ని పబ్బులు, రెస్టారెంట్లలో కొత్త ట్రెండ్. రమ్, విస్కీ, వైట్ వైన్, రెడ్ వైన్, వోడ్కా.. ఇలా రకరకాల ఆల్కహాల్స్ ఈ వంటకాల్లో భాగమై ఫుడ్ అండ్ డ్రింక్ లవర్స్‌కి సరికొత్త టేస్ట్లు రుచి చూపిస్తున్నాయి. వంటకాలకు తగ్గట్టుగానే ఆ రెసిపీల పేర్లు సైతం ఉంటాయట. అలాంటి వాటికి కొన్ని ఉదాహరణలు.. జాకీ చాన్ డాన్సింగ్ వుక్.. వుక్ అంటే చైనీస్‌లో కిచెన్‌లో వాడే గిన్నె అని అర్థం. ఈ రెసిపీలో రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటి ఇది హెల్తీ కలర్‌ఫుల్ సలాడ్. ఇంకోటి ఇది వైట్ వైన్‌తో కలిపి తయారు చేసే వంటకం. ఎల్లో, గ్రీన్, రెడ్ బెల్ పెప్పర్స్, కుకుంబర్, ఓలీవ్స్, బోన్‌లెస్ చికెన్ మాష్, వైట్ వైన్లతో దీన్ని తయారు చేస్తారు. ఈ సలాడ్‌తో వెయిట్ లాస్, బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేసే లాభాలు కూడా ఉన్నాయని చెఫ్‌లు అంటున్నారు. ఈ చికెన్ డిష్‌లో ప్రత్యేకత ఐరిష్ విస్కీ. చికెన్‌కు అన్ని మసాలాలు, పెరుగుతో పాటు కాస్త ఐరిష్ విస్కీని కూడా కలిపి వండే రెసిపీనే ‘బాహుబలి సీక్రెట్ చికెన్ బైట్’. అన్ని చికెన్ ముక్కలు ఒకే రుచి ఒకే కిక్ ఉండటం ఈ డిష్ ప్రత్యేకత. ‘ఒబామా’స్ ఫేవరేట్ చికెన్ బ్రెస్ట్.. ఆరోగ్యానికి మంచిదైన ఆలివ్ ఆయిల్, ఇంగ్లిష్ కూరగాయలైన బ్రోక్యులీ, అవకడో, బెల్ పెప్పర్స్, బేబీకార్న్‌లను గ్రిల్ చేసిన చికెన్ బ్రెస్ట్ పీస్తో జోడించి బార్బిక్యూ సాస్‌తో పాటు స్పెషల్ సీక్రెట్ రెడ్ వైన్ జ్యూస్‌ని కలిపి ఫుడ్ లవర్లకు అందిస్తారు. రెడ్ వైన్ కలపడంతో రెసిపీకి దాని ఫ్లేవర్, కొత్త రంగుతో పాటు ఆరోగ్యానికి ఉపయోగపడే న్యూట్రిషనల్ వాల్యూస్, ముఖంలో తేజస్సు సైతం గ్యారెంటీ అంటున్నారు ‘పబ్ మీల్’ చెఫ్‌లు. ఫుల్ డిమాండ్.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆల్కహాల్ తాగకుండానే ఆహారంతో తీసుకునే అవకాశంతో ఈ తరహా పబ్ మీల్స్‌కి ఈ మధ్య డిమాండ్ ఎక్కువగా పెరుగుతోంది. ఈ మీల్స్‌లో ఆల్కహాల్ ఉండటంతో కేవలం నిర్ణీత వయసు దాటిన వారికి మాత్రమే వీటిని సర్వ్ చేస్తున్నామని ఆదిత్యా పార్క్ హోటల్ మేనేజర్ అమితేష్ కుమార్ తెలిపారు. -
దత్‌కు మద్యం అందుతోంది
సాక్షి, ముంబై: ఇటీవలే పెరోల్ వివాదంతో ఇబ్బందులుపడ్డ బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు మరో సమస్య ఎదురయింది. 1993లో ముంబైలో వరుస పేలుళ్ల కేసులో ఇతడు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బాలీవుడ్ నటుడికి యెరవాడ జైల్లో రాచమర్యాదలు జరుగుతున్నట్టు బీజేపీ ఆరోపించింది. జైలు శిక్షపడిన అనంతరం సంజయ్ దత్‌ను ముంబై నుంచి పుణే యెరవాడ జైలుకు తరలించిన విషయం విదితమే. అందరు ఖైదీల మాదిరిగానే సంజయ్ దత్ ను కూడా జైలు అధికారులు చూడాల్సి ఉంటుంది. అయితే ఆయనకు జైళ్లో ఏకంగా మద్యం (బీర్, రమ్) అందిస్తున్నట్టు ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డే ఆరోపించారు. కొందరు పోలీసులు అధికారులు, సిబ్బంది ఇలాంటి వారికి సహకరిస్తుంటారని చెప్పారు. తావ్డే తాజాగా చేసిన ఈ ఆరోపణలు దుమారం లేపాయి. విధానసభలో ఈ అంశంపై సోమవారం గొడవ జరిగే అవకాశాలున్నాయి. బీజేపీ ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతోంది. జైళ్లల్లో శిక్షను అనుభవిస్తున్న సంపన్న వ్యక్తులకు జైలు సిబ్బంది సహకరిస్తున్నట్టు గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. దత్ వంటివాళ్లతోపాటు శక్తిమిల్లు వద్ద అత్యాచారానికి పాల్పడిన నిందితులకు కూడా రాచమర్యాదలు అందుతున్నాయని తావ్డే ఆరోపించారు. దత్‌కు ఇటీవలే 30 రోజుల పెరోల్ లభించడంపై తీవ్ర వివాదం తలెత్తింది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఇతడికి రెండుసార్లు పెరోల్ వచ్చింది. భార్య మాన్యత దత్ అనారోగ్యం కారణంగా పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు దత్ తెలిపారు. అయితే ఆమె ఓ సినిమా కార్యక్రమంలో కన్పించడంతో ఒక్కసారిగా ఈ విషయంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. పెరోల్‌ను తక్షణం రద్దు చేయాలని కోరుతూ ఆర్పీఐ యెరవాడ జైలు ఎదుట ఆందోళనకు దిగింది. కొన్ని సామాజిక సంఘాలు కూడా ప్రభుత్వ ధోరణిపై మండిపడ్డాయి. వేలాది మంది ఖైదీలు బెయిల్ రాక జైళ్లలో మగ్గిపోతున్నారని, దత్ వంటి నేరగాళ్లకు మాత్రం నెలకోసారి పెరోల్ ఇస్తున్నారంటూ విరుచుకుపడ్డాయి. దీంతో సర్కారు ఇతడికి పెరోల్ రద్దు చేసింది. సంజయ్‌దత్‌కు జైళ్లో ఏకంగా మద్యం అందుతున్నట్టు ఆరోపణలు వస్తుండడంతో మరోసారి ఇతడు వార్తల్లో నిలిచాడు. పాటిల్ సమాధానంపైనే అందరి దృష్టి... అసెంబ్లీలో వినోద్ తావ్డే ఆరోపణలకు హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ఎలాంటి సమధానమిస్తారనే విషయంపై అందరి దృష్టీ కేంద్రీకృరితమయింది. అసెంబ్లీలో సోమవారం ఈ విషయంపై ఆయన ఒక ప్రకటన చేసే అవకాశముంది. దత్‌కు పెరోల్ మంజూరుపైనా ఆర్.ఆర్. పాటిల్ విచారణకు ఆదేశించారు.