సూపర్‌స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్ | Rum movie audio released | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్

Published Thu, Nov 3 2016 3:23 AM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

సూపర్‌స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్

సూపర్‌స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్

అనిరుద్‌ను స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్‌రాజా సూపర్‌స్టార్ సంగీత దర్శకుడిగా పేర్కొన్నారు. ఆల్ ఇన్ పిక్చర్స్ పతాకంపై టీ.విజయరాఘవేంద్ర నిర్మించిన చిత్రం రమ్. హృషీకేష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో సంచితాశెట్టి, మియాజార్జ్ నాయికలుగా నటించారు. వివేక్, నరేన్, అమ్జాద్‌ఖాన్, అర్జున్ చిదంబరం తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాయి భరత్ దర్శకత్వం, అనిరుద్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో జరిగింది. కార్యక్రమంలో అనిరుద్ మాట్లాడుతూ ఇది తన 13వ చిత్రం అని తెలిపారు.

13 సంఖ్యను చాలా మంది హారర్ సంఖ్యగా బావిస్తారన్నారు. అదే విధంగా తాను చిన్నతనంలో మైడియర్ కుట్టిసాత్తాన్ చిత్రం చూశానన్నారు. అప్పట్లో అది హారర్ కథా చిత్రం అని కూడా తెలియదన్నారు. ఆ తరువాత హారర్ చిత్రాన్నే తాను చూడలేదన్నారు. అలాంటి చిత్రాలంటే తనకు భయం అని అన్నారు. అలాంటిది తొలిసారిగా హారర్ ఇతి వృత్తంతో కూడిన రమ్ చిత్రానికి సంగీతాన్ని అందించినట్లు తెలిపారు. దర్శకుడు కథను నెరేట్ చేయగానే ఆసక్తి సినిమాపై కలిగిందన్నారు.

చిత్రంలో ఏడు పాటలు ఉన్నాయని తెలిపారు. ప్రేక్షకులు తమపై పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం వమ్ము చేయమని అనిరుద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నిర్మాత జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాత తనను కలిసి రమ్ చిత్ర వ్యాపారం పూర్తయిందని చెప్పారన్నారు. సూపర్‌స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్ ఉంటే చిత్రం వ్యాపారం జరగకుండా ఉంటుందా? నిర్మాత తన వద్దకు వచ్చినా తానీ చిత్ర వ్యాపారాన్ని ఏక్ దమ్‌గా చేసి ఉండేవాడినని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement