miyajarj
-
మామిడి మియాజాకిలో అత్యంత పోషక విలువలు
-
బంగ్లాలో ఏం జరిగింది?
హృషికేశ్, నరైన్, మియాజార్జ్, సంచితా శెట్టి ప్రధాన పాత్రల్లో సాయిభరత్ దర్శకత్వంలో రూపొందించిన తమిళ చిత్రం ‘రమ్’. ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్టైన్ మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ‘మంత్రిగారి బంగళా’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రతి సన్నివేశం ఉత్కంఠ కల్గిస్తుంది. సునీల్ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న మియాజార్జ్ ఈ చిత్రంలో కీలక పాత్ర చేశారు. అనిరుధ్ బాణీలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. జనవరిలో పాటలను, ఫిబ్రవరిలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బేబీ త్రిష. -
సూపర్‌స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్
అనిరుద్‌ను స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్‌రాజా సూపర్‌స్టార్ సంగీత దర్శకుడిగా పేర్కొన్నారు. ఆల్ ఇన్ పిక్చర్స్ పతాకంపై టీ.విజయరాఘవేంద్ర నిర్మించిన చిత్రం రమ్. హృషీకేష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో సంచితాశెట్టి, మియాజార్జ్ నాయికలుగా నటించారు. వివేక్, నరేన్, అమ్జాద్‌ఖాన్, అర్జున్ చిదంబరం తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాయి భరత్ దర్శకత్వం, అనిరుద్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. కార్యక్రమంలో అనిరుద్ మాట్లాడుతూ ఇది తన 13వ చిత్రం అని తెలిపారు. 13 సంఖ్యను చాలా మంది హారర్ సంఖ్యగా బావిస్తారన్నారు. అదే విధంగా తాను చిన్నతనంలో మైడియర్ కుట్టిసాత్తాన్ చిత్రం చూశానన్నారు. అప్పట్లో అది హారర్ కథా చిత్రం అని కూడా తెలియదన్నారు. ఆ తరువాత హారర్ చిత్రాన్నే తాను చూడలేదన్నారు. అలాంటి చిత్రాలంటే తనకు భయం అని అన్నారు. అలాంటిది తొలిసారిగా హారర్ ఇతి వృత్తంతో కూడిన రమ్ చిత్రానికి సంగీతాన్ని అందించినట్లు తెలిపారు. దర్శకుడు కథను నెరేట్ చేయగానే ఆసక్తి సినిమాపై కలిగిందన్నారు. చిత్రంలో ఏడు పాటలు ఉన్నాయని తెలిపారు. ప్రేక్షకులు తమపై పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం వమ్ము చేయమని అనిరుద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నిర్మాత జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాత తనను కలిసి రమ్ చిత్ర వ్యాపారం పూర్తయిందని చెప్పారన్నారు. సూపర్‌స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్ ఉంటే చిత్రం వ్యాపారం జరగకుండా ఉంటుందా? నిర్మాత తన వద్దకు వచ్చినా తానీ చిత్ర వ్యాపారాన్ని ఏక్ దమ్గా చేసి ఉండేవాడినని పేర్కొన్నారు. -
ముగ్గురు భామలతో శశికుమార్ రొమాన్స్
వెట్రివేల్ చిత్రంలో నటుడు శశికుమార్ మియాజార్జ్, నిఖిల, వర్ష ముగ్గురు భామలతో యుగళ గీతాలు పాడుకున్నారు. ఇక ఈ చిత్ర వివరాల్లోకెళితే తారై తప్పట్టై చిత్రం తరువాత శశికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వెట్రివేల్. ఇంతకు ముందు 500 చిత్రాలకుపైగా వివిధ ఏరియాలకు పంపిణీ చేసిన ట్రైటెండ్ ఆర్ట్స్ సంస్థ అధినేత ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ప్రభు, తంబిరామయ్య ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా వసంతమణి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన జిల్లా చిత్ర దర్శకుడు నేశన్ శిష్యుడన్నది గమనార్హం. ఎస్ఆర్.కదిర్ చాయాగ్రహణం, డీ.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ వెట్రివేలన్ కుటుంబనేపథ్యంలో సాగే విభిన్న ప్రేమకథా చిత్రం అని తెలిపారు. హాస్యం,యాక్షన్ అంటూ చిత్రం జనరంజకంగా ఉంటుందన్నారు. ఇందులో శశికుమార్ సరసన మియాజార్జ్, నిఖిల, వర్ష ముగ్గురు కథానాయికలు నటించారని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని 18న నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. -
శశికుమార్ మియాజార్జ్ జంటగా వెట్రివేల్
నటుడు శశికుమార్‌తో నటి మియాజార్జ్ జత కడుతున్న వెట్రివేల్ చిత్ర షూటింగ్ మొదలైంది. దర్శకుడు, నిర్మాత, నటుడు శశికుమార్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు రెండేళ్లు అయింది. ఆయన కథానాయకుడిగా నటించిన బ్రహ్మన్ చిత్రం తరువాత మరో చిత్రం విడుదల కాలేదు. ప్రస్తు తం జాతీయ ఉత్తమ దర్శకుడు బాలా దర్శకత్వంలో తారాతప్పట్టై చిత్రాన్ని నిర్మిస్తూ క థా నాయకుడిగా నటిస్తున్నారు. గరగాట కళకు కమర్షియల్ టచ్ ఇచ్చి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శశికుమార్ నాద స్వరం కళాకారుడిగా నటించడం విశేషం. నటి వరలక్ష్మి నాయకిగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాం తర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సంగీత జ్ఞాని ఇళయరాజా బాణీ లు అందిస్తున్నారు. ఇది ఆయన సహస్ర చిత్రం కావడం విశేషం. త్వరలో ఆడియోను, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయడానికి శశికుమార్ సన్నాహాలు చేస్తున్నారు. మరో పక్క నూతన చిత్రంలో నటిస్తున్నారు. దీనికి వెట్రివేల్ అనే టైటిల్ నిర్ణయించారు. అమరకావ్యం చిత్రం ఫేమ్ మియాజార్జ్ నాయకిగా నటిస్తోంది. సీనియర్ నటుడు ప్రభు, తంబిరామయ్య ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు వసంతమణి పరిచయం అవుతున్నాడు.