ముగ్గురు భామలతో శశికుమార్ రొమాన్స్ | Sasikumar To Romance Three Heroines | Sakshi
Sakshi News home page

ముగ్గురు భామలతో శశికుమార్ రొమాన్స్

Published Wed, Mar 16 2016 2:11 AM | Last Updated on Wed, Apr 3 2019 9:02 PM

ముగ్గురు భామలతో శశికుమార్ రొమాన్స్ - Sakshi

ముగ్గురు భామలతో శశికుమార్ రొమాన్స్

 వెట్రివేల్ చిత్రంలో నటుడు శశికుమార్ మియాజార్జ్, నిఖిల, వర్ష ముగ్గురు భామలతో యుగళ గీతాలు పాడుకున్నారు. ఇక ఈ చిత్ర వివరాల్లోకెళితే తారై తప్పట్టై చిత్రం తరువాత శశికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వెట్రివేల్. ఇంతకు ముందు 500 చిత్రాలకుపైగా వివిధ ఏరియాలకు పంపిణీ చేసిన ట్రైటెండ్ ఆర్ట్స్ సంస్థ అధినేత ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ప్రభు, తంబిరామయ్య ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా వసంతమణి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
 
 ఈయన జిల్లా చిత్ర దర్శకుడు నేశన్ శిష్యుడన్నది గమనార్హం. ఎస్‌ఆర్.కదిర్ చాయాగ్రహణం, డీ.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ వెట్రివేలన్ కుటుంబనేపథ్యంలో సాగే విభిన్న ప్రేమకథా చిత్రం అని తెలిపారు. హాస్యం,యాక్షన్ అంటూ చిత్రం జనరంజకంగా ఉంటుందన్నారు. ఇందులో శశికుమార్ సరసన మియాజార్జ్, నిఖిల, వర్ష ముగ్గురు కథానాయికలు నటించారని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని 18న నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement