nikhila
-
అప్పుడు హీరో చెల్లెలు.. ఇప్పుడు యంగ్ హీరోయిన్.. ఎవరంటే? (ఫొటోలు)
-
Nikhila Vengala: బ్యూటీ కాంటెస్ట్‌లో ‘నువ్వు ఫిట్ కావు’ అన్నారు..
‘సాయం చేయాలన్న ఆలోచన ఉండగానే సరిపోదు ఆ ఆలోచనను ఆచరణలో కూడా పెట్టాలి’ అంటారు వెంగళ నిఖిల. హైదరాబాద్ వాసి అయిన నిఖిల కిందటేడాది మిసెస్ హైదరాబాద్, మిసెస్ తెలంగాణ, మిసెస్ ఇండియా టైటిల్స్‌ను గెలుచుకుంది. బ్యూటీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయడమే కాదు బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొనేవారిని ట్రైన్ చేస్తుంది. ఫార్మసిస్ట్‌గా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వర్క్ చేస్తుంది. ఒక బిడ్డకు తల్లిగా, కుటుంబ బాధ్యతలూ నిర్వర్తిస్తుంది. ‘సమయమే కాదు దానిని సద్వినియోగం చేసుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది’ అని చెబుతున్న నిఖిల జర్నీ నేటి మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తుంది. ‘‘యాక్టర్స్, మోడల్స్ కే కాదు ఇటీవల జరిగిన మిస్టర్ ఇండియా కాంటెస్ట్‌కు మెంటార్‌గా ఉన్నాను. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే ఫైనల్స్‌కి 51 మంది ఎంపికయ్యారు. వారిని ట్రైన్, గ్రూమ్ చేయడానికి టీమ్‌లో నేనొక మెంబర్‌గా పనిచేశాను. యాసిడ్ బాధితులకు మద్దతుగా నిలిచే లక్ష్మీ ఫౌండేషన్ గురించి అవగాహన కలిగించడానికి చేసిన కాంటెస్ట్ అది. కంటెస్టెంట్స్ అందరినీ పక్కన పెడితే టీమ్‌లో ఉండి ఆ ఫౌండేషన్‌కు సపోర్ట్ చేయాలనే ఆలోచనతో అందరికన్నా ఎక్కువ నిధులు సమకూర్చగలిగాను. దీనికి మిసెస్ గోల్డెన్ ఆఫ్ హార్ట్ సౌత్ ఇండియా క్రౌన్ వచ్చింది. ► కష్టమైనా .. సులువే.. ఎమ్‌ఫార్మసీ చేశాను. నా రీసెర్చ్ వర్క్‌పై చాలా ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి. డయాబెటిస్, ఒబేసిటీ పైన ఎక్కువ వర్క్ చేశాను. కార్పొరేట్ హాస్పిటల్స్‌కి, క్యాన్సర్ హాస్పిటల్‌కి మెడికల్ రైటర్‌గా ఉన్నాను. వృత్తినీ, కుటుంబాన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూనే నా కలలనూ నెరవేర్చుకుంటున్నాను. బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొనడం నాకో ప్యాషన్. అందరిలాగే మా అమ్మానాన్నలు కూడా ‘ఏం చేయాలనుకున్నా పెళ్లి తర్వాత నీ ఇష్టం’ అన్నారు. దీంతో పెళ్లివైపే మొగ్గు చూపాను. బాబు పుట్టాక, ఇంటిపనులతో క్షణం తీరిక లేకుండా ఉండేది. కానీ కొన్ని రోజుల్లోనే నా గురించి నేను ఆలోచించుకోవడం మొదలుపెట్టాను. మావారి సపోర్ట్‌తో ఇలాంటి కాంటెస్ట్‌లో పాల్గొనడం మొదలుపెట్టాను. ► టైమ్ ప్రకారం ప్లానింగ్.. నా పెళ్లికి ముందు యోగా, జిమ్ చేసేదాన్ని. క్లాసికల్ డ్యాన్సర్‌ని కూడా. ప్రెగ్నెన్సీ తర్వాత అన్ని యాక్టివిటీస్‌కి దూరమయ్యాను. రెండేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి నన్ను నేను మార్చుకోవాలి అనే ప్రయత్నంలో చాలా ఒత్తిడికి లోనయ్యాను. టైమ్‌కి తినాలి, టైమ్ ప్రకారం వ్యాయామాలు, టైమ్‌కి నిద్ర.. అన్నీ ప్లాన్ చేసుకోవాలి. వీటితోపాటు ఇంటినీ, బాబునూ చూసుకోవాలి, అలాగే ఆఫీస్ వర్క్ కూడా చూసుకోవాలి. వీటన్నింటికీ నన్ను నేను సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టాను. కష్టమనిపించినా ప్రతి రోజూ ప్రయత్నించడమే. ఒక్కరోజు కూడా నా రొటీన్ వర్క్‌ని బ్రేక్ చేయకూడదు అనుకున్నాను. మా బాబుకు ఏడాదిన్నర వయసు ఉన్నప్పటి నుంచీ మిస్ కాకుండా చూసుకోవచ్చు అనే ఆలోచనతో వాడినీ బ్యూటీ కాంటెస్ట్ దగ్గరకు తీసుకెళుతుంటాను . నా ప్యాషన్‌ని, డ్రీమ్‌ను నెరవేర్చుకోవడానికి కృషి చేస్తూనే ఉంటాను. ► నువ్వు ఫిట్ కావు అన్నారు... బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనడానికి ముందు నేను అమ్మను. బ్యూటీ ఇండస్ట్రీలో ఉండాలంటే అందంగా కనిపించాలి. బాహ్య సౌందర్యమే కాదు, అంతఃసౌందర్యం కూడా బాగుండాలి. నిజానికి అప్పుడు నేనంత సిద్ధంగా లేను. బరువు, ఫేస్ గ్లో .. సమస్యలు ఉన్నాయి. దాంతో‘నువ్వు ఈ బ్యూటీ కాంటెస్ట్‌కు ఫిట్ కావు’ అన్నారు నన్ను చాలా మంది. కానీ, నేను అవేమీ పట్టించుకోలేదు. నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. నా జర్నీని నేను మళ్లీ మొదలుపెట్టాలి అని నన్ను నేను పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నాను. ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా ఫిట్‌గా మార్చుకున్నాను. ఈ విషయంలో మావారు తప్ప ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదు. నేనూ అవేమీ పట్టించుకోలేదు. ‘మానసికంగా నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను’ అనే ఆలోచనతో టైటిల్స్ సాధించాను. దీంతో నా చుట్టూ ఉన్న అందరిలోనూ ఒక మంచి గుర్తింపు లభించింది. అదే నన్ను మంచి పొజిషన్‌కి తీసుకువచ్చింది. ► యాసిడ్ దాడి బాధితులకు.. కొన్నేళ్ల క్రితం రాష్ట్రంలో ఇద్దరు అమ్మాయిలపై యాసిడ్ దాడి జరిగింది. ఆ కాలేజీకి, మా కాలేజీ దగ్గర. ఆ ఇన్సిడెంట్ నేను చూశాను. చాలా బాధనిపించింది. ఇప్పుడు యాసిడ్ దాడి బాధితులకు సాయం చేసే అవకాశం వచ్చింది. వదులుకోవద్దు అనుకున్నాను. ఏదీ నేను ఆశించలేదు. ఒక మంచి పని కోసం కృషి చేస్తున్నాం. ఎంత వచ్చినా అవసరమైన వారికి చేరుతుంది అనే ఆలోచనతోనే పనిచేశాను. ► అవగాహన కలిగిస్తూ... చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ల కోసం ఒక బ్యూటీ కాంటెస్ట్ ఏర్పాటు చేశాం. అప్పుడు మంచి స్పందన వచ్చింది. చిన్నారుల ఆపరేషన్లకు ఆ డబ్బును డొనేట్ చేశాం. ఇప్పుడు కూడా ఇలాగే ఈ బ్యూటీ కాంటెస్ట్‌ను ఏర్పాటు చేశాం. ఎవరినీ ఒత్తిడి చేయం. మా బంధుమిత్రులకు, తెలిసినవారికి మా ఆలోచనను తెలియజేశాం. ఈ కాంటెస్ట్ ద్వారా చర్మదానం పట్ల ఒక అవగాహన కల్పించాం. మంచి గుర్తింపు లభించింది. ఇక ముందు కూడా లక్ష్మీ ఫౌండేషన్‌కి జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి కాంటెస్ట్‌లు చేయాలని, వాటిలో పాల్గొని యాసిడ్ దాడి బాధితులకు ఆసరాగా ఉండాలనుకుంటున్నాను’’ అని చెప్పారు నిఖిల వెంగళ. – నిర్మలారెడ్డి -
నిఖిల గోవతి పరిశోధనను సేవబాట పట్టించింది
డిగ్రీలు చేసి, ఉద్యోగాలు చూసుకొని స్థిరపడిపోవడం గురించి ఆలోచిస్తుంటారు చాలా మంది. తమ చదువు పేదలకు ఉపయోగపడితే ఎంతో మేలు అని ఆశిస్తుంటారు కొంతమంది. అలాంటి కోవకి చెందుతుంది కర్పూరం గోవతి నిఖిల. సికింద్రాబాద్ సీతాఫల్మండిలో ఉండే నిఖిల గుర్గావ్ మేదాంత ది మెడిసిటీ హాస్పిటల్లో డిస్ఫేజియా స్పెషలిస్ట్‌గా పరిశోధనలు చేస్తోంది. గోవతి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు 5వేల మంది పేదవారికి కంటి, గుండె, క్యాన్సర్ చికిత్సలలో సహాయసహకారాలు అందించింది. ఈ యేడాది యంగెస్ట్ రీసెర్చర్ ఇన్ డిస్ఫేజియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, భారత్ గౌరవరత్న శ్రీ సమ్మాన్ కౌన్సిల్ అవార్డులు పొందింది. ఈ సందర్భంగా మాట్లాడినప్పుడు ఎన్నో విషయాలను ఇలా పంచుకుంది. ‘‘తెలియని తపన నన్ను ఓ కొత్త మార్గంవైపు నడిపించింది. పరిశోధనల వైపుగా అడుగులు వేయించింది. ఈ మూడేళ్లలో 5 వేల మందికి సాయం చేసేలా మార్చింది. బీఎస్సీ ఆడియాలజీ పూర్తయ్యాక ఎమ్మెస్సీలో చేరాను. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ పూర్తవగానే మేదాంత హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది తమ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో చేరమని. కాలేజీలో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ నుంచి వచ్చిన అవకాశమని తెలిసి చాలా ఆనందించాను. పరిశోధనలో.. అనేక ఆరోగ్య సమస్యలలో ముఖ్యంగా నిమోనియా, గుండెకు సంబంధించిన చికిత్సలు జరిగినప్పుడు కొన్నాళ్ల వరకు ఆహారాన్ని మింగడంలో కలిగే ఇబ్బందుల కారణంగా మరణాల రేటు పెరుగుతోందని మా పరిశోధనలో తేలింది. న్యూరో పేషంట్స్లో 80 శాతం డిస్ఫేజియా సమస్య ఉంటుంది. ఆహారాన్ని మింగే పద్ధతిలో తేడా ఉంటే ఆ ఆహారం నేరుగా లంగ్స్‌లోకి చేరి, ప్రమాదం కలుగుతుంది. అందుకని ఈ పేషెం ట్స్‌కు, వీళ్లను చూసుకునేవారికి ఏ విధంగా ఆహారాన్ని తీసుకోవాలనే విషయాల మీద గైడెన్స్ ఇస్తుంటాను. ఈ వైపుగా మన దగ్గర ఇంకా ఆలోచన పెరగలేదు. అమెరికాలో ఈ విషయాలపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీంతో ఈ విభాగంలో నాకు ఆసక్తి కలిగింది. లోతుగా పరిశోధనలు చేయడం మొదలు పెట్టాను. నాకు అడ్వైజ్ చేసే డాక్టర్లు, ప్రొఫెసర్ల సలహాలు మరెన్నో విషయాలను పరిచయం చేసింది. ఢిల్లీ సమీపంలోని హాస్పిటల్ కావడంతో వచ్చే పేషెంట్స్ సంఖ్య కూడా ఎక్కువే. ప్రతి ఒక్క పేషెంట్ నుంచి వారి ఆరోగ్యసమస్యల ద్వారా తెలుసుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. అలా నా పరిశోధనకు సంబంధించి 31 ఆర్టికల్స్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. జైపూర్, రాజస్థాన్, యూపీ నుంచి వచ్చే స్టూడెంట్స్‌కు సెషన్స్ కండక్ట్ చేస్తుంటాను. కరోనా నుంచి.. అవసరమైన వారికి సాధ్యమైనంత వరకు నా స్నేహబృందంతో సాయం అందిస్తూ వచ్చాను. అప్పటి నుంచి కంటి, గుండె చికిత్సలు, నిమోనియా, పార్కిన్సన్స్, నీ రీప్లేస్మెంట్, న్యూరో డిజార్డర్స్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి డాక్టర్లతో మాట్లాడి ఫీజు తగ్గింపులో సాయం చేస్తుండేదాన్ని. కోవిడ్ పేషెంట్స్పైన రీసెర్చ్ చేసినప్పుడు మరణాలు పెరగడానికి అందరికీ ఒకే విధమైన చికిత్స అందించడం సరికాదని తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరూ భిన్నంగా చికిత్స చేయాలనే అంశాల మీద చేసిన రీసెర్చ్ పేపర్స్‌కి మంచి ప్రశంసలు అందాయి. ఈ సమయంలోనే ఫౌండేషన్‌గా సేవలను ఒక గ్రూప్కిందకు తీసుకురావాలనిపించింది. అందుకు, మా ప్రొఫెసర్లు, కుటుంబసభ్యుల సపోర్ట్ ఉంది. అభ్యర్థన మేరకు ప్రభుత్వ, కార్పోరేట్ హాస్పిటల్స్‌లోని డాక్టర్స్ నెట్వర్క్ నుంచి పరిచయాలు ఉన్నాయి. వారిని అభ్యర్థించి పేదవాళ్లలో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు సూచించడం, వారి చేత హెల్త్ క్యాంపులు నిర్వహించడం చేస్తుంటాను. ఏయే సమయాల్లో క్యాంపులను నిర్వహించాలో ముందే ప్లానింగ్ ఉంటుంది కాబట్టి, దానిని అనుసరించి డాక్టర్లను అభ్యర్థిస్తుంటాను. మా నాన్న హరిరాజ్ కుమార్ రేషన్ షాప్ నిర్వహిస్తుంటారు. అక్కడకు వచ్చేవాళ్లలో దాదాపు పేదవాళ్లే ఉంటారు. వాళ్లకు అవసరమయ్యేలా క్యాంపులు నిర్వహించాను. నోటి మాట ద్వారా సాయం చేస్తూ వెళ్లడమే. దీని కోసం నేనేమీ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. ఎవరి నుంచీ సాయం తీసుకోవడం లేదు. నాకున్న నెట్వర్క్ ద్వారా నోటి మాట ద్వారా సాయం చేయడం ప్రస్తుతం చేస్తున్న పని. మెడిసిన్స్ అవసరం ఉన్న పేషెంట్స్‌కు జెనెరిక్ మెడిసిన్ ద్వారా సర్వీస్ చేయడం, నర్సుల సాయం తీసుకోవడం వంటివీ జరుగుతుంటాయి. నా టీమ్‌లో అందరూ స్వచ్ఛందంగా సేవ చేసేవారే. ఇంటి వద్ద ఉన్నప్పుడే కాదు గుర్గావ్లో ఉన్నా ఫోన్ కాల్ ద్వారా అవసరమైన వారికి అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తుంటాను’’ అని వివరించింది నిఖిల. ఒప్పించి.. మెప్పించాను.. అమ్మనాన్నలు ఇంజనీరింగ్ చేసి త్వరగా స్థిరపడిపోతే చాలు అనుకునేవారు. కానీ, అనుకోకుండా మెyì కల్ వైపుగా వచ్చాను. ఎమ్మెస్సీ తర్వాత గుర్గావ్లో ఇంటర్వ్యూ ఉందనే విషయం కూడా ఇంట్లో చెప్పలేదు, వద్దంటారు అనే ఆలోచనతో. అమ్మమ్మతో కలిసి ఢిల్లీ టూర్ వెళతాను అని ఒప్పించి వెళ్లాను. అక్కడ మెదంతాలో సీట్ వచ్చాక అప్పుడు విషయాన్ని చెప్పాను. నాకున్న ఆసక్తిని చూసి అమ్మనాన్నలు సరే అన్నారు. కూతురు అంత దూరంలో ఎలా ఉంటుందో అనే బెంగ వాళ్లను ఒప్పుకోనివ్వదని ఆ పని చేశాను. ఇప్పుడు నేను చేస్తున్న రీసెర్చ్‌కి, సర్వీస్‌కు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నాకు ఇంత మంచి గుర్తింపు రావడం గర్వంగా భావిస్తుంటారు. – డా.కర్పూరం గోవతి నిఖిల -
రేపు ‘మెడిసిన్ ఫ్రమ్ ద స్కై’ ప్రారంభం
వికారాబాద్: దేశంలోనే తొలిసారి డ్రోన్ల ద్వారా మందులు, టీకాలు సరఫరా చేసే కార్యక్రమానికి వికారాబాద్ వేదిక కానుంది. దేశంలోనే తొలిసారి చేపడుతున్న ‘మెడిసిన్ ఫ్రమ్ ద స్కై’కార్యక్రమాన్ని శనివారం కేంద్ర మంత్రి జోతిరాదిత్య, రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు ప్రారంభించనున్నారు. గురువారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ట్రయల్ రన్‌ను డ్రోన్ల తయారీ కంపెనీ ప్రతినిధులతో కలసి కలెక్టర్ నిఖిల పరిశీలించారు. నూతన కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీపాడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రవాణా వ్యవస్థ సరిగ్గాలేని ప్రాంతాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుందన్నారు. భవిష్యత్తులో టీకాలు, యాంటీవీనమ్ వంటి మందులు సకాలంలో ఆస్పత్రులకు చేరవేసేలా డ్రోన్లు ఎంతగానో సహాయపడతాయని స్పష్టం చేశారు. డ్రోన్ల ద్వారా అవయవాలను కూడా చేరవేసే అవకాశం ఉందని తెలిపారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతులు తదితర విషయాలు పర్యవేక్షిస్తున్నామన్నారు. ట్రయల్ రన్లో టీకాలు ఆకాశ మార్గాన వెళ్లే సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉండాలో అంతే ఉంటుందా? ఏమైనా మార్పులు జరుగుతున్నాయా? అనే విషయాలను గమనిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రయ్య, మోతీలాల్, అదనపు ఎస్పీ రషీద్, ఆర్డీఓ వెంకట ఉపేందర్‌రెడ్డి, డీఎంహెచ్ఓ తుకారామ్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జేసీ
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): సదాశివపేట మండల పరిధిలోని నందికంది గ్రామంలో జాతీయ క్షయ నివారణ కార్యక్రమంలో భాగంగా సోమవారం మొబైల్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ నిఖిలారెడ్డి ముఖ్య అతిధిగా హాజరై మొబైల్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు క్షయ వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నివారణకు అవసరమైన మందులను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తుందన్నారు. వారానికి మించి దగ్గు, జ్వరం ఉంటే వెంటనే తెమడ పరీక్షలు చేయించుకోవాలన్నారు. మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండాలన్నారు. గ్రామంలోని ప్రజలకు మొబైల్ వాహనంలోనే వైద్య పరీక్షలను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి రాజేశ్వరి, సర్పంచ్ అమృతదేవి, ఎంపీటీసీ సభ్యురాలు జయశ్రీ శ్రీనివాస్ తదితరులున్నారు. -
ముగ్గురు భామలతో శశికుమార్ రొమాన్స్
వెట్రివేల్ చిత్రంలో నటుడు శశికుమార్ మియాజార్జ్, నిఖిల, వర్ష ముగ్గురు భామలతో యుగళ గీతాలు పాడుకున్నారు. ఇక ఈ చిత్ర వివరాల్లోకెళితే తారై తప్పట్టై చిత్రం తరువాత శశికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వెట్రివేల్. ఇంతకు ముందు 500 చిత్రాలకుపైగా వివిధ ఏరియాలకు పంపిణీ చేసిన ట్రైటెండ్ ఆర్ట్స్ సంస్థ అధినేత ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ప్రభు, తంబిరామయ్య ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా వసంతమణి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన జిల్లా చిత్ర దర్శకుడు నేశన్ శిష్యుడన్నది గమనార్హం. ఎస్ఆర్.కదిర్ చాయాగ్రహణం, డీ.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ వెట్రివేలన్ కుటుంబనేపథ్యంలో సాగే విభిన్న ప్రేమకథా చిత్రం అని తెలిపారు. హాస్యం,యాక్షన్ అంటూ చిత్రం జనరంజకంగా ఉంటుందన్నారు. ఇందులో శశికుమార్ సరసన మియాజార్జ్, నిఖిల, వర్ష ముగ్గురు కథానాయికలు నటించారని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని 18న నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.